చిరస్మరణీయులు, మొదటి భాగం/పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌

వికీసోర్స్ నుండి

49

16. పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌

(- 1859)

ఆధు8నిక ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక బలగాలున్న బ్రిటిష్‌ పాలకులను ఎదుర్కోవటం మృత్యువును వాటేసుకోవడమేనని స్వదేశీ యోధులకు స్పష్టంగా తెలిసినా, తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి పరాయి పాలకులను తరిమికొట్టేందుకు నడుంకట్టీన యోధులలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ (Pathan Turrebaz Khan) ఒకరు.

పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదారాబాద్‌ నివాసి పఠాన్‌ రుస్తుం ఖాన్‌ కుమారుడు.బ్రిటిష్‌ సైన్యంలో సైన్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పరాక్రమాలకు పెట్టింటిెంది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి చెందిన నాయకుడు.

ఉత్తర హిందూస్థానంలో ఆరంభమైన తిరుగుబాటు పవనాలు తిన్నగా దక్షిణ హిందూస్థానాన్ని కూడాతాకాయి. ఆంగ్లేయులకు హితుడుగా మారిన నైజాం నవాబు వారి అభిష్టం మేరకు నడుచుకుంటున్నా, బ్రిటిష్‌ పాలకుల నుండి మాతృగడ్డను విముక్తి చేయ మని యవతీ యువకులను, భారతీయ సైనికులను, స్వదేశీ పాలకులను ధార్మికపెద్దలను ప్రోత్సహిస్తున్నవాతావరణం. ఆ వాతావరణంలో బానిసత్వం నుండి విముక్తికై పోరాడమని హైదారాబాద్‌కు చెందిన మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌కు ఉద్బోధించారు.ఆ ప్రేరణతో ఆంగ్లేయుల మీద పోరాటానికి నడుం కట్టిన తుర్రేబాజ్‌ ఖాన్‌ మౌల్వీ

చిరస్మ రణీయులు 50

అల్లావుద్ధీన్‌ సహకారంతో చరిత్రాత్మక మక్కా మసీదు నుండి బయలుదేరి, బ్రిటిష్‌ ఆధిపత్యానికి చిహ్నమైన హైదారాబాద్‌ రెసిడెన్సీ మీద సుమారు ఐదు వందల మంది సాహసికులతో 1857జూ లై 17న సాహసోపేతమైన దాడి చేశారు.

ఆ దాడిలో వీరోచితంగా పోరాడిన పలువురు సహచరులను కోల్పోయిన ఖాన్‌, బ్రిటిష్‌-నిజాం బలగాలకు 1857 జూలై 22న పట్టుబడ్డారు. ఆయనకు ప్రభుత్వం ద్వీపాంతరవాస శిక్ష విధించి, యావదాస్తిని పాలకులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్‌ పాలకులు విధించిన ఆ శిక్ష అమలు జరిగేలోగా తనకు కాపలాగా పెట్టిన సెంట్రీలలో కూడామాతృభూమి పట్ల గౌరవాభిమానాలను ప్రోదిచేసిన పరాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ 1859 జనవరి 18న జైలు నుండి తప్పించుకున్నారు. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రభుత్వం తుర్రేబాజ్‌ ఖాన్‌ను సజీవంగా గానీ నిర్జీవంగా గానీ పట్టితెచ్చిన వారికి 5వేల రూపాయల నగదు నజరానాను జనవరి 19న ప్రకటించింది.

ఆ ప్రకటనతో అప్రమత్తులైన తుర్రేబాజ్‌ ఖాన్‌ రహస్యంగా ప్రజలలో తిరుగుతూ, బ్రిటిష్‌ సేనలపై తిరిగి దాడులకు ప్రయ త్నాలు చేయ సాగారు. ఖైదు నుండి తప్పంచుకున్న ఖాన్‌ను ఎలాగైనా పట్టుకుని అంతం చేయాలన్న పట్టుదలతో బ్రిటిషు సైన్యాలు, నిజాం సేనలు నిఘాను తీవ్రతరం చేశాయి. చివరకు నిజాం నవాబు ప్రకటించిన నజరానాకు ఆశపడిన కుర్‌బాన్‌ అలీ అను నమ్మకద్రోహి తుర్రేబాజ్‌ ఖాన్‌ ఆచూకిని బహిర్గతం చేశాడు. ఆ సమాచారంతో 1859 జనవరి 24న, మెదక్‌ జిల్లాలోని తూఫ్రాన్‌ అను గ్రామం మీద నిజాం, బ్రిటిష్‌ సైన్యాలు విరుచుకుపడ్డాయి.

ఆధునిక ఆయుధాలతో చీమలదండు వలె వచ్చిపడు తున్న నిజాం, ఆంగ్ల సైనికులను తూఫ్రాన్‌లో తలదాచుకుంటున్న తుర్రేబాజ్‌ ఖాన్‌ ఒంటరిగా ఎదుర్కొన్నారు. ఆ పోరాటంలో శత్రువు తుపాకి గుండ్లకు తుర్రేబాజ్‌ ఖాన్‌ ఎరయ్యారు. ఆ తరువాత ఆ యోషుని మృతదహాన్నిబ్రిటిషు సైన్యాలు హెదారాబాదుకు తరలించాయి. ఆయన బౌతిక కాయానికి అంత్యక్రియలు ఏవీ జరపకుండాబలమైన ఇనుప సంకెళ్ళతో కట్టేసి ప్రస్తుతం సుల్తాన్‌ బజారు పోలీసు స్టేషన్‌ ఉన్న చోట బహిరంగంగా వేలాడదీశారు.

ప్రజలలో తిరుగుబాటు ఆలోచనలు ఏమాత్రం పొడచూపకుండా భయోత్పాతం కలించేందుకు అత్యంత కర్కశ చర్య లకు పాల్పడిన పాలకులు చర్రిత హీనులుగా ఈనాటికి ప్రజల శాపనార్థాలను పొందుతుండగా, మహాయోధుడు తుర్రేబాజ్‌ ఖాన్‌ మాత్రం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రపుటలలో గౌరవప్రదమైన స్థానం పొంది చిరస్మరణీయులయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌