చిరస్మరణీయులు, మొదటి భాగం/మౌల్వీ అహ్మదుల్లాషా ఫైజాబాది

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf

47


15. మౌల్వీ అహ్మదుల్లాషా ఫైజాబాది

(1787-1858)

బ్రిటీషర్ల పై కత్తిగట్టి వారి సైనిక బలగాలను పలుమార్లు మట్టికరిపించి ఆంగ్లేయ శిబిరాలలో దడ పుట్టించిన యోధుడుగా ఖ్యాతిగాంచి, ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అగ్రస్థానం పొందిన అసమాన పోరాట వీరుడు మౌల్వీ అహ్మదాుల్లా ఖాన్‌.

మౌల్వీ అహ్మదాుల్లా ఖాన్‌ తండ్రి ముహమ్మద్‌ అలీ ఖాన్‌. ప్రస్తుతం చెన్నయ్‌గా పిలువబడుతున్నచెన్నపట్నంలో 1787-88లో జన్మించారు. మౌల్వీ అసలు పేరు సయ్యద్‌ అహ్మద్‌ అలీ ఖాన్‌. చిన్నతనంలోనే ఆయన ధార్మిక, లౌకిక విద్యలో సాధించిన విద్వత్తు ఫలితంగా 'మౌల్వీ'గా ప్రసిద్ధిగాంచారు. స్వదేశీ భాషలలోనే కాకుండా ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని కూడా సంతరించుకున్న ఆయన పలు యుద్ధవిద్యలలో ఆరితేరారు.

ఒకసారి నైజాం నవాబు ఆహ్వానం మేరకు హైదరాబాదుకు విచ్చేసిన సందర్భంగా మౌల్వీ అహమ్మదుల్లా ప్రతిభను గమనించిన బ్రిటిష్‌ సైనికాధికారులు ఆయనను ఇంగ్లాండుకు ఆహ్వానించారు. ఆ ఇంగ్లాండు పర్యటన తరువాత ఆయన మక్కా-మదీనా, ఇరాక్‌, ఇరాన్‌, తదితర ప్రాంతాలను కూడా పర్యటించి స్వదేశం చేరుకున్నారు. స్వదేశం వచ్చిన మౌల్వీ అహ్మదాుల్లా ఖాన్‌ సూఫీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఖాద్రి సంప్రదాయానికి చెందిన సయ్యద్‌ ఫుర్‌ఖాన్‌ అలీ షా (Syed Furqan Ali Sha) శిష్యులయ్యారు. గురువాజ్ఞ

చిరస్మ రణీయులు 48

మేరకు గ్వాలియర్‌ ప్రాంతంలో సూఫీ భక్తి తత్వాన్ని ప్రచారం చేస్తూ బానిసత్వానికి వ్యతిరేకంగా, స్వదేశీయుల మీదావిదేశీ శక్తుల పెత్తనాన్నినిరసిస్తూ, దాన్ని అంతం చేసేందుకు ధర్మ యుద్ధానికి సిద్దం కావాల్సిందిగా ప్రజలను ప్రేరపిస్తూ ప్రసంగాలు చేస్తుండ టంతో, ఆయన మీద ఆంగ్లేయాధికారులు రాజద్రోహం నేరం మోపి నిర్బంధించారు.

ఆ సమయంలో 1857 నాటి సమరం ఆరంభమయ్యింది. ఆ సమరంలో భాగంగా మౌల్వీ అహ్మదుల్లా బ్రిటిష్‌ బలగాలతో తలపడటం ఆరంభించి పలు పోరాటాలలో అజేయులుగా నిలచి ఆంగ్లేయ సైన్యాలను మట్టికరిపించారు. ఆంగ్లేయులతో తలపడు తున్న ప్రతి స్వదేశీ యోధునికి ఆయన సహాయ సహకారాలు అందించారు. సర్దార్‌ హిక్మతుల్లా, అవధ్‌ రాణి బేగం హజరత్‌ మహల్‌, రోహిల్‌ ఖండ్‌ అధినేత ఖాన్‌ బహుదూర్‌ ఖాన్‌, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షాలు ఆంగ్లేయుల మీద సాగించిన పోరాటాలలో మౌల్వీ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ కారణంగా ఆ యోధుడి శిరస్సును తెచ్చిచ్చిన వారికి 50,000 రూపాయల భారీ నజరానాను ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రకటించింది.

ఐక్య పోరాల ద్వారా మాత్రమే బలమైన శత్రువును తరిమి వేయగలమని విశ్వసించిన మౌల్వీ స్వదేశీ పాలకులను ఏకం చేసే ప్రయ త్నాలలో భాగంగా షాజహాన్‌పూర్‌ జిల్లాలోని పోవెన్‌ (POWAIN) రాజు జగన్నాథ సింహాతో చర్చలు జరిపేందుకు వెళ్ళారు. అ సందర్భంగా 'రాజా ప్రక్కనే ఉన్న అతడి సోదరుడు మౌల్వీ పై గురిచూసి కాల్పులు జరిపాడు. ఆ దుర్మార్గుని హస్తాలలో మౌల్వీ హతుడైపోయాడు. ఆ పిరికిపందలు..మౌల్వీ శిరస్సు ఖండించి, దాని పై గుడ్డ కప్పుకొని చేరువనే 13 మైళ్ళ దూరాన ఉన్న బ్రిటిషు ఠాణా షాజహన్‌పూరుకు తీసుకువెళ్ళారు...రక్తం ఓడుతున్నఆ పవిత్ర శిరాన్నిఆ నీచులు ఆంగ్లేయుల ముందు కానుకగా ఉంచి వారి పాదాల చెంత మోకరిల్లారు..నీచమైన దేశ ద్రోహానికి తలపడిన ఆ పోవెన్‌ పశువుకు 50 వేల రూపాయల పారితోషికం లభించింది!' ఆ విధంగా మౌల్వీ 1858 జూన్‌ 15న అమరులయ్యారు.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో మహా యోధుడిగా, అద్వతీయ దేశభక్తుడిగా ఆంగ్లేయ సైన్యాధికారుల చేత కూడా ప్రశంసలు పొందిన మౌల్వీ అహమ్మదుల్లా షా పైజాబాది మరణ వారను ఖచ్చితంగా థృ వపర్చుకున్నాక ఉత్తర భారతదశంలో బలిష్టమైన శత్రువును అంతం చేశామని బ్రిటిష్‌ సైన్యాధికారులు ఆనందపడ్డారు . చివరివరకు ఆంగ్లేయ సైనికులను సంహరిస్తూ ముందుకు సాగిన మౌల్వీ అహమ్మదుల్లా షా ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అసమాన యోధులుగా ఖ్యాతి గడించి చరిత్రలో తనదైన ప్రత్యేక ముద్రతో చిరస్మరణీయులయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌