చిన్ని పూవే వాడెనా తన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


చిన్ని పూవే వాడెనా తన

కన్నె వలపుల వేడెనా తన

చిన్నె లన్నియు వన్నె లన్నియు

మన్నులో కోల్పోయెనా ?


కాంతు నెరుగని కన్నె గాదా

సిగ్గు వీడని మొగ్గ గాదా

మొన్న మొన్ననె ముద్దు వల్లిని

మొనలు దీరెనుగా!