చింతామణి మాసపత్రిక/సంపుటము 2/ఆగష్టు 1892/ఆనందబాయి జ్యోషి
Appearance
ఆనందబాయి జ్యోషి అనునామె బొంబాయి రాజధానిలో చేరిన పునాపట్టణములో 1865 సం|| మ్యార్చి 31 వ తేదీని జనన మొందెను. ఆమె తండ్రిగారి పేరు గణపతిరావు అమృతేశ్వరుడు. తల్లిపేరు గంగాబాయి జ్యోషి. ఈమెకు చిన్నతనమందు యమునా జ్యోషియని పేరుపెట్టిరి. అన 1874 సం|| మ్యార్చి 3 వ తేదీని అనగా తొమ్మిది సంవత్సరములు ప్రాయమునందు గోపాలరావు వినాయక జ్యోషి అను నాయనను వివాహము చేసికొని ఆనందబాయి జ్యోషి అను పేరును పెట్టుకొనెను. ఆ 1883 సం|| ఏప్రిల్ 7వ తేదీని కలకత్తానగరమునందుండి అమెరికా దేశమునకు నావికాయాత్ర జేసెను.