చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/బ్రహ్మదేవుడి పాట్లు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Chandamama 1948 01.pdf
పుట:Chandamama 1948 01.pdf/127
Chandamama 1948 01.pdf
Chandamama 1948 01.pdf
Chandamama 1948 01.pdf
Chandamama 1948 01.pdf

చిక్కు డాకు విూద చిలుకవాలింది
చిలుకెక్కి ఓరాజు చిక్కివున్నాడు
అరిటాకు విూద హంస వాలింది
హంసెక్కి ఓరాజు అమిరి వున్నాడు
కొబ్బరాకు మీద గోర వాలింది
గోరెక్కి ఓ రాజు కోరి వున్నాడు
మావిుడా కు విూద మంచువాలింది
మంచెక్కి ఓరాజు పొంచియున్నాడు
గుమ్మడాకు మీద గువ్వ వాలింది
గువ్వెక్క ఓ రాజు గూడొగ్గి నాడు
చిక్కుడా కువిూద చిలక ఆబ్బాయి
చిలకెక్కి అమ్మాయి చిక్కివున్నాది
ఆరిటాకు విూదనే హంస ఆబ్బాయి
హంసెక్కి అమ్మాయి ఆమిరివున్నాది
కొబ్బరాకు మీద గోర అబ్బాయి
గోరెక్కి అమ్మాయి కోరివున్నాది
మామిడాకువిూద మంచు అబ్బాయి
వుంచెక్కి అమ్మాయి పొంచివున్నాది
గుమ్మడాకు మీద గువ్వ అబ్బాయి
గువ్వెక్కి అమ్మాయి గూడొగ్గినాది


సంపాదన: దీవి భానుమతీదేవి

Chandamama 1948 01.pdf