చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/జోల పాటలు
స్వరూపం
చిక్కు డాకు విూద చిలుకవాలింది
చిలుకెక్కి ఓరాజు చిక్కివున్నాడు
అరిటాకు విూద హంస వాలింది
హంసెక్కి ఓరాజు అమిరి వున్నాడు
కొబ్బరాకు మీద గోర వాలింది
గోరెక్కి ఓ రాజు కోరి వున్నాడు
మావిుడా కు విూద మంచువాలింది
మంచెక్కి ఓరాజు పొంచియున్నాడు
గుమ్మడాకు మీద గువ్వ వాలింది
గువ్వెక్క ఓ రాజు గూడొగ్గి నాడు
చిక్కుడా కువిూద చిలక ఆబ్బాయి
చిలకెక్కి అమ్మాయి చిక్కివున్నాది
ఆరిటాకు విూదనే హంస ఆబ్బాయి
హంసెక్కి అమ్మాయి ఆమిరివున్నాది
కొబ్బరాకు మీద గోర అబ్బాయి
గోరెక్కి అమ్మాయి కోరివున్నాది
మామిడాకువిూద మంచు అబ్బాయి
వుంచెక్కి అమ్మాయి పొంచివున్నాది
గుమ్మడాకు మీద గువ్వ అబ్బాయి
గువ్వెక్కి అమ్మాయి గూడొగ్గినాది
- సంపాదన: దీవి భానుమతీదేవి