చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/పేదరాసి పెద్దమ్మ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Chandamama 1948 01.pdf

అబ్బాయిలూ, అమ్మాయిలూ !

మీరు పేదరాసి పెద్దమ్మను గురించి ఎన్నో కథలు వినిఉంటారు. రాజకొడు కులూ, రాజు కూతుళ్ళూ ఉండే కథల్లో సామాన్యంగా పేదరాసి పెద్దవుతప్పకుండా ఉంటుంది.-ఈ మనిషి ఎటువంటిదో మీ రెప్పడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఆలోచించినకొద్దీ ఈవిడ వింత ప్రకృతి మీకే చక్కగా బోధపడుతుంది.

పేదరాసిపెద్దమ్మ కథలో అడుగుపెట్టినీ క్షణంనుంచి కథ రక్తికి వస్తుంది. రాజ కొడుకు గాని, కట్టలుకొట్టేవాడి కొడుకు కాని, కథానాయకు డెవరైనాగానీ పేద రాసిపెద్దమ్మ ఇంటిలో అడుగుపెట్టాడా, వాడి కష్టాలన్నీ గట్టెక్కాయున్న మారే ! కథా నాయకుడు ఎటువంటి చిణ్కుల్లోనైనా ఉండనివ్వండి, వాడికి రాజుగారు వంటి పరీక్షలైనా పెట్టనివ్వండి, పేదరాస్ పెద్దమ్మ వాడికి ఆండగా ఉండి, వాడికి అపాయం రాకుండా సంరక్షిప్తుంది. పేదరాసి పెద్దమ్మకు తెలియనివిషయం లేదు. సప్త సముద్రాల అవతల ఒక భీకరా రణ్యంలో ఏడు మర్రిచెట్లలో మధ్య దాని చిటారు కొమ్మన ఒక పంజరంలో చిలక

కంఠంలో ఒకరాక్షసుడిప్రాణం ఉంటుంది. దాని చుట్టూ బ్రహ్మరాక్షసులూ ఇనప కంది రీగలూ, కోడెతాచులూ కాపుంటాయి. ఆ చిలకను మన కథానాయకుడు పట్టుకు - - రావాలంటేు ఎట్లావెళ్లాలో, ఏంచేయాలో పేదరాసి పెద్దమ్లను అడిగితే చెఱుతుంది. పేదరాసిపెద్దమ్మ ఎక్కడికైనా పోగ లదు. రాజుగారి అంతఃపురంల్లో, ఏడంతస్తుల మేడలో, పైఅంతస్తున, విచ్చు కత్తుల వాళ్ల పహరాలో రక్షించబడే రాజు కూతురును కథానాయకుడు చూడాలి, ఎట్లా ? పేదరాసి పెద్దమ్మ కథానాయకుబ్జ తనవెంట తీసుకుపోతుంది. 'విడు మూ చెల్లెలికొడుకు,' అని పేదరాసి పెద్దమ్మ చెబితే చాలు, కోటలో అడ్లేవారుండరు. పేదరాసిపెద్దమ్మ ప్రయాణీకులకూ, దూరదేశంవారికి తిండి పెట్టి జీవించె సామాన్యురాలు. కానీ ఆమెకు యో వీరి ఎక్కువాలేదు. ఆమె నేరుగా రాజ్ల గారితో మాట్లాడుతుంది, రాణాగారితో మాట్లాడ్లుంది. ఆమె నెవరూ అనుమానించరు, అవమా నించరు.ఆమె సర్వస్వతంత్రురాలు, అందుకే మనకు పేదరా సిపెద్దమ్లను చూస్తే సంతోషం.
Chandamama 1948 01.pdf
Chandamama 1948 01.pdf

పేదరాసి పెద్దమ్మ ప్రతివిషయంలోనూ జోక్యంకలిగించుకుంటుంది. ఎవరికీ ఆప కారం చెయ్యదు. అందరి మంచి ఆమెకే అందరికన్నా బాగా తెలుసు. కథానాయ కుణ్ణి చంపించటం తనకు క్షేమమనీ, తన కూతుర్ని వాడు చేసుకోవటం అపకారమనీ రాజుగారుపారపడవచ్చు. కాని నిజం పేదరాసి పెద్దమ్మము తెలుసు. ఆవిడ తాత్తాలికంగా రాజుగారిని మోసంచేసినా ఆ మోసంవల్ల రాజు గారికెంతో ఉపకారమే జరుగుతుంది. ఎంతోమందికి ఎన్నో రకాల ఉపకారం చేసుంది. కాని పేదరాసిపెద్దమ్మ స్వార్థం కోరదు. ఆమెకు డబ్బు అవసరంలేదు. అందరూ కులాసాగా ఉండటమే ఆమెకు కావలసింది. ఆమెకు ప్రతిబంధకాలు లేవ భర్తలేడు, పిల్లలు లేరు, పెద్ద డబ్బులేదు, భవంతులులేవు. ఆమెఏమో, ఆమె హెూట లేమో! అది నాలుగు కాలాలపాటు సాగుతూ పం లేు, తనదగ్గిరికి వచ్చినవారికి ఇంత ఉపకారం చెయ్యటంకంటె పేదరాసి పెద్దమ్మకు కావలసింది లేదు.

తనమూలంగా ఇంకొకడికి రాజ్యం వచ్చినా, చక్కని చుక్క అయిన రాజు కూతురు భార్యగా దొరికినా పేదర్గాని పెద్దమ్మ తనకు దొరికినంతగా సంతోషి స్తుంది. తనకేమీ పేచీలు లేకపోయినా ఇతరుల పేచీలు సరిదిద్దుతుంది. తాను సామాన్యప్రజలో జత అయిన మనిషే అయినా అన్నితరగతులవాళ్లకూ ఆశ్రయ మిస్తుంది. తనధర్మాన గొప్పవాళ్లయినాక వారి దారిన వారిని పోనిస్తుందేగాని వారి వెంటపడి తానొక ఘరానా మనిషి కావ టానికి ప్రయత్నించదు.

డబ్బు విష యా ల లో కూడా ఆమె ఎప్పడూ పెచీలు పెట్టదు. ఏవేళకు వచ్చినా అన్నార్తులకింత తిండిపడేస్తుంది. కొందరు మాసాల తరబడి తన ఇంటనే ఉంటారు. కొందరు వరహాలిస్తారు. కొందరు ఏమీ ఇవ్వరు. అందర్నీ పేదరాసి పెద్దమ్మ సమంగానే చూస్తుంది. ఎవరు తనఇంటికి అతిధిగా వచ్చినా వారిపని పూర్తిఅయే వరకు వాళ్లను పావనదు. ఆమెదగ్గిరికిచేరి అసంతృప్తి పోందే మనిషి అంటూఉండడు.

Chandamama 1948 01.pdf
అటువంటి అద్భుతమైనవ్యక్తి పేదరాశి పెద్దమ్మ.