చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/గతిలేని భర్తకు మతిలేని భార్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Chandamama 1948 01.pdf
పూర్వం ఒక ఊళ్లో ఒక ఆలూమగడూ ఉండేవాళ్ళు. ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశపుట్టి భార్య దగ్గిరికి వచ్చి "సామగ్రి తెస్తాను, గారెలు చేసిపెట్టు" అన్నాడు. పెండ్లాం సరేనన్నది. మొగుడు బజారుకెళ్ళి కావలసిన సామగ్రి తెచ్చి యిచ్చి పొలం మీదికెళ్ళాడు.

పెండ్లానికేమో గారెలు చేయడం అసలు తెలియదు. గారెలు "ఎట్లాగండి చేసేదీ?" అని వాళ్ళ ప్రక్క యింటిలో వున్న బ్రాహ్మణ విధవరాలిని అడిగింది. ఆమె "ఒక శేరు వుద్దిపప్పు నీళ్లలో నానబొయ్యి... " అని యింకేమో చెప్పబోయింది. "ఓస్! నాకూ తెలిసిందిలే" అని పై మాట వినకుండ యింటికి వచ్చి నీళ్ళలో పప్పును నానబోసింది. అవతల ఏం చేయాలనో తెలియలేదు. మళ్లీ పక్కయింటామె దగ్గిరికి పోయి అడిగింది. ఆమె "ఆ పప్పును వడబోసి..." అని యింకేమో చెప్పబోయింది.

ఈ మాటు కూడా పై మాటలు వినిపించుకోకుండా "ఓస్! ఇక తెలిసిందిలే" అని యింటికి పోయి పప్పు వడబోసింది. కాని తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు.

మళ్ళీ పక్క యింతి ఆమెను పోయి అడిగింది. ఈ సారి ఆమెకి కోపం వచ్చింది. "ఏమి దీనికంత గీర్వాణం?" చెప్పేదంటా పూర్తిగావిని తెలుసుకోదు. 'ఓస్ ! నాకు తెలిసిందిలే' అని వెళ్ళీ పోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ వుంటుంది. ఈ మాటు దీని పని పట్టిస్తాను!" అని మనసుకో అనుకొని "అమ్మా ఆ పప్పులో రెండు శేర్లు వుప్పు, నాలుగు శేర్లు నీళ్ళు పోసి పొయ్యిమీదపెట్టి దించు. గారె లవుతుంది" అన్నది. ఇంటికి వచ్చి ఆ వెఱ్ఱి బాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది.

ఇంతలో పొలంనుంచి గారెలు తిందాంగదా అని గంపెడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు.


ఆండాలు, మదరాసు-నిర్మల కుమారి, కర్నూలు.
క్రొవ్విడి సీతారామారావు, విశాఖపట్నం

Chandamama 1948 01.pdf

అతన్ని కూర్చోమని ఒక దొన్నె ముందరపెట్టి 'దీన్ని పట్తుకోండి; గారెలు పోస్తాను ' అంది. "ఒసే, ఇదేమిటి?" అని సంగతంగా తెలుసుకొని విధవరాలు చేసిన మోసం కనుక్కున్నాడు.

మర్నాడు "ఈ మాటు అయినా ఆమెకు కోపం రాకుండా అంటా అడిగి తెలుసుకొని, సరిగా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి" అని చెప్పి మళ్లీ, కావలసిన సామగ్ర తెచ్చియిచ్చి పొలానికెళ్లాడు.

పెండ్లాము పక్కయింటి విధవరాలి దగ్గరికి మళ్ళీ పోయింది. ఆమెతో తన

సంగతంతా చెప్పింది. విధవరాలికి కోపం పోయి 'అయ్యో పాపం' అని నొచ్చుకొని "ఇప్పుదు నేను గారెలు కాల్చబోతున్నాను. అంతా సరిగ్గా నేను చెసినట్లు చెయ్యి" అని చెప్పింది.

తర్వాత ఆమె తల కొరిగించుకుని స్నానం చేసి మడికట్తుకొని పిండి రుబ్బి గారెలు వండింది.

పెండ్లాము అదంతా చూసుకొని ఇంటికివ్ అచ్చింది. మినుప్పప్పు నీటిలో నానబోసింది. ఒక మంగలాణ్ణి దొడ్లోకి రమ్మని నున్నగా తన గొరిగించుకొంది. స్నానం చేసి పక్కింటామె

Chandamama 1948 01.pdf

చందమామ

దొడ్లో ఆరవేసుకున్న మడిచీరకట్టుకొని పిండి రుబ్బుతున్నది.

మరి కాస్సేపటికి మొగుడు పొలం నుంచి యింటికి వచ్చి ముసుకు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూచి పక్కింటి విధవరాలనుకొని "ఏమే? అయ్యో పాపం! పక్కింటామెచేత పని చేయిస్తున్నావా?" అని ఇంటివేపు చూసి అడిగాడు. "అదేమిటండీ, అలాగంటారు! బామ్మగారిని కష్టపెట్టి పనిచేయించుకోటానికి నేనేం వెఱ్ఱి దాన్నా?" అంటూ ముసుగు తీసేసి భర్తవేపు తిరిగింది.

భార్య అవతారం చూడగానే భర్త

Chandamama 1948 01.pdf
Chandamama 1948 01.pdf

"ఒసే నీకు యిదేం పోగాలమే? నేను బ్రతికుందగానే బుర్ర గొరిగించుకు కూర్చున్నావు?" అంటూ గొల్లుమన్నాడు.

భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. "చాల్లెండి. ఎంత చేసినా యింతే మీరు. బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటిరి. సరే గదానని ఆవిడగారు చెసినట్లే నేనూ చేశాను. ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు?" అంటూ ఆ వెఱ్ఱిబాగుల భార్య కళ్లనీళ్లెట్టుకుంటి.

పాపమా బ్రాహ్మడు మళ్లీ గారెలు చెయ్యమని అడిగిన పాపాన పోలేదు.


చందమామ