Jump to content

ఘటికాచలమాహాత్మ్యము/పీఠిక

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

1. రామకృష్ణుని స్వవిషయము : |

తెనాలి రామకృష్ణుడు తనను గూర్చియు తన కుటుంబమును గూర్చియు కొంత సమాచారమును తన కృతుల యవతారికలలో తెలిపి యున్నాడు. మొట్టమొద టికృతియైన ఉద్భటారాధ్య చరిత్రమునను(1-24). రెండవది యైన పాండురంగ మాహాత్మ్య మునందును (1-17, 22, 23, 24) ఆ సమాచారవివరము లున్నవి. వాటినిబట్టి మనకు తెలియవచ్చు. విశేషము లివ్వ:


ఉద్భటా రాధ్య చరిత్రను వ్రాసినప్పటి రామకృష్ణుని పేరు రామ లింగము. కౌండిన్యసగోత్రము వాడు. పాలగుమ్మి ఏలేశ్వర పదపయోజద్వ యీధ్యాన ధారణ సముదాత్త చిత్తుడు. యజుర్వేద వేది. రామేశ్వర స్వామి రమణీయకరుణావి శేష పోషిత విలసిత సమగ్ర సహజసాహిత్య మాధురీ సంయుతాత్ముడు. లక్కమాంబకును రామధీమణికిని పుత్రుడు. పాండురంగ మాహాత్మ్యమునను ఈ చెప్పబడిన వివరములే చెప్పబడియున్నవి. తల్లి పేరు మాత్రము లక్ష్మమ అని ప్రకృతిరూపముననున్నది. మరియు శ్రీగురుమూర్తి పేరు భట్టరు చిక్కాచార్యు లనియున్నది. ఉద్భటా రాధ్య చరిత్ర గద్యమున గల “కుమార భారతి" బిరుదము పాండురంగమహాత్మ్య మున "శారద రూపము”గా మార్పు చెందియున్నది

2. అతని దేశకాలములు :

రామకృష్ణునకు గుంటూరు జిల్లాలోని తెనాలితో సంబంధమున్నది. అది ఆయనకు ఇంటి పేరుకూడ అయినది. మరియు తననుగురించి తెనాలి అగ్రహార నిర్ణేత యని చెప్పుకొనెను. 1 ఈయన్నింటినిబట్టి రామకృష్ణుడు తెనాలివాడనియే అనుకొన వలయును. రామకృష్ణునితండ్రి తెనాలిలోని రామలిం గేశ్వరస్వామిభ క్తుడై ఉత్సవ విగ్రహమును చేయించియుండుటను బట్టియు వారిది తెనాలి. యనియే చెప్ప వలయును అంతకు పూర్వము వారు గార్ల పొడులో నున్నను 2 మ రెచ్చటనున్నను రామకృష్ణుడుమాత్రము తెనాలి వాడు. 1. పాండురంగమాహాత్మ్య ము 1-28. 2. ఆంధ్రక వితరంగిణి సంపుటము 8. పుట 31. రామకృష్ణుడు జీవించియన్న కాలము నొక్క విధముగా సాహిత్య చరిత్రకారు లoగీక రించుట లేదు. అందువలన శ్రీకృష్ణ దేవరాయల వారి యాస్థానమున కవులలో నీతడొకడై యుండుటయు వివాదాస్పద మైనది. శ్రీ చాగంటి శేషయ్యగారి నిర్ణయము ప్రకారము 1[1] రామకృష్ణుని జనన కాలము " కీ.శ 1495-1500 సంవత్సరముల నడుమ. ఉద్భటారాధ్యచరిత్ర రచన క్రీ.శ 1525 - 1580 సంవత్సరములనడమ , పాండురంగ మాహా త్మ్యము 1550 ప్రాంత రచన. ఘటి కాచలమాహాత్మ్య రచన 1580 ప్రాంతము. 1566 -1570 సంపశ్సరముల మధ్య ఆయన పరమపదించి యుండ వలయును. మరియు రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయల యాస్థానములోని అష్ట దిగ్గజకవులలో నొకడు. 2. ఆంధ్రకవితరంగిణి సం. 7. పుట 144. </ref> డాక్టరు నేలటూరి వేంకటరమణయ్యగారి పరిశోధనము ననుసరించి3ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు.. వాజ్మయ వ్యాసమంజరి పుట 115.</ref> ఉద్బటా రాధ్యచరిత్ర రచనము 1520 ప్రాంతము. పాండురంగ మాహాత్మ్యము కృష్ణ రాయల వారి రాజ్యకాలము తుదనో తరు వాత అచిరకాల ముసనో విరచితమైయుండవలయును. 4 అనగా 1525 - 1540 సంవత్సరముల ప్రాంతము. 5[2]


శ్రీ వీరేశ లింగము పంతులుగారి వద్ద నుండి కవిచరిత్ర కారులును , వాజ్మయ చరిత్ర కారులును , పరిశోధక పండితులును ఎక్కువమంది కొద్ది పాటి కుడి యెడమల మీద ఈ పైన చూపబడిన కాలనిర్లయ మే నిర్లయ ముగా భావించు చున్నారు. *[3] రామకృష్ణు) ను పదునారవ శతాబ్దము కవి శ్రీష్ణ దేవరాయల వారి యాస్థానము నందలి యష్టదిగ్గజములలో నొకడు అయినచో వయస్సుచేత కొంత చిన్న వాడై యుండవచ్చును. 3. రామలింగ రామకృష్ణు లభిన్నులు :

ఉద్భటారాధ్య చరిత్రము వ్రాసిన రామలింగమును, పాండురంగ మాహాత్మ్యమును వ్రాసిన రామకృష్ణుడును పేర్లను బట్టియు, గురువులను బట్టియు, బిరుదములను బట్టి యు, గ్రంథ తాత్పర్యములను బట్టియు ఖిన్ను లని యొక వాదమున్నది. తల్లి దండ్రులను బట్టియు, కులగోత్రములను బట్టియు, మరియు తెనాలి వంశము వారైన కవుల సాథ్యములనుబట్టియు వారిరువురును ఒకరే యగుదురని దానికి ప్రతి వాద మున్నది. మరియు నీ ప్రతివాదమున రామకృష్ణుడు మొదట శైవుడై రామ లింగమను పేర ఉద్భటారాధ్య చరిత్రమును రచించి, ఆ పిమ్మట వైష్ణవుడై రామకృష్ణుడను పేరు పెట్టుకొని పాండురంగ మాహాత్మ్య ఘటికాచలమాహాత్మ్యము లను రచించెననియు, అందువలన నే గురువుల పేర్ల లో భేదము కనిపించు చున్న దనియు, చిన్న తనమున కుమార భారతి యైనవాడు పెరిగి పెద్ద వాడు కాగా శారదాకృతి యైనాడ నియు. అందువలన రామలింగ రామకృష్ణు లొక్కరే యనియు సిద్ధాంతము రూపొందింపబడినది.


తెనాలి రామలింగమని మరియొక తెనుగుకవి “ ధీరజనమనో (విరా జిత) రంజనము" అను కృతిని రచించిన వాడు గలడు. ఆయన విశ్వ, బాహ్మ్మణుడు. తెనాలి రామకృష్ణునకు గల రామలింగమను వేరునకును , ఆ విశ్వబాహ్మణకవి పేరునకును ఆ పేరుకు మించి మరెట్టి సంబంధమును లేదు. బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, గారును 1[4] , చాగంటి శేషయ్య గారును 2[5] మొదలయిన పండిత పరిశోధకు లింతకుమునుపే రామలింగ రామ కృష్ణుల ఏకత్వమును నిర్ణయించి పెట్టి పోయినారు. ఇప్పు డావిషయమున క్రొత్తగా చెప్పదగిన దేమియు కానరాదు.

4. రామకృష్ణుని కృతులు - ముందువెనుకలు :


రామకృష్ణుని కృతులు మూడు లభించుచున్నవి. మొదటశైవుడుగా నున్నపుడు ఉద్భటారాధ్య చరితమును రచించినాడనుటలో తగాదా లేదు. వైష్ణవుడై రచించిన పాండురంగ మాహాత్మ్య, ఘటికాచలమాహాత్మ్యము లలో ఏది ముందై యుండునన్న ప్పుడే అభిప్రాయ భేదములు . పుట్టట మొద లయినది ఈ మూడుకృతుల లోను ఘటికాచలమాహాత్మ్యమున కొక విశిష్టత యున్నది. అవి ఆ గ్రంథముజాతకమ నుబట్టి వచ్చినది మిగికిన రెండు గ్రంథములను రామ(లింగ) కృష్ణుడే స్వయముగా దేచమంత్రికిని 1[6] వేదాద్రి మంత్రికిని 2[7] అంకితము చేసి నాడు. ఈ ఘటి కాచలమాహాత్మ్యము నెవరికిని ఆయన ఇయ్యలేదు. కొందరభిప్రాయ పడుచున్నట్లు పాండుగంగమాహాత్మ్యమును రామకృష్ణుడు తన చరమదశలో రచించినచో [8]3 తానంతకుమునుపు రచించిన ఘటికాచలమాహాత్మ్యము నట్లేయుంచి కొత్తగా పాండురంగ మాహాత్మ్యమునువ్రాసి వేదాద్రి కంకితము చేసి నాడని చెప్పవలయును. అతనికే ఈ వైష్ణ వగ్రంథ మేల ఇచ్చియుండ లేదు? ఆయన కాకపోయిన ఆమాత్రము కృతి పుచ్చుకొను వాడే నాడు రామకృష్ణునకు లభింప లేదా? దానినిన రాంకితము చేయుటకు రామకృష్ణున కిష్టము లేదా అన్నచో రెండు గ్రంథములను నరాంకితములు చేయనేచేసెను గదా! అట్లు గాక ఘటికాచల మాహాత్మ్యము రామకృష్ణుని తొలి కృతి అనియు దానియం దాయనకే అంత ఆవసరములేక మూల పార వేసి నాడన్నచో అదియు నంతగా పొసగదు. అట్లగుచో రామకృష్ణుడు మొదట వైష్ణవుడుగా ఉండి ఘటికా చలమాహాత్మ్యము వ్రాసి, శైవుడై ఉద్భటారాధ్య చరిత్రమును వ్రాసి , తిరిగి వైష్ణవుడై పాండు రంగమాహాత్మ్య మును రచించినాడని చెప్పవలసివచ్చును. ఇది వట్టి అసం దర్శము. ఇక మిగిలినది - పాండురంగమాహాత్మ్యమును రచించి వేదాద్రి కంకితము గావించి, చరమదశలో ఘటి కాచలమాహాత్మ్యమును రచించి దాని నెవరికిని కృతి యియ్యకుండగనే రామకృష్ణుడు పరమపదించియుండు ననుట దీనికిట్లు శంకను చూపవచ్చును. గ్రంథరచనా భ్యాసము పెరుగు కొలది ప్రతి భావ్యుత్పత్తు లలో ప్రౌఢిమ, సాంద్రత గోచరింపవలయునుగదా? అన్ని విధములను ఉద్భటారాధ్య చరిత్రమున కంటె పాండురంగ మాహాత్మ్యము పై చేయిగానున్నది - అట్లే మటి కాచలమాహాత్మ్యము పాండు రంగమాహాత్మ్యమును మించి యుండవలయును కాని లేదు. మరి దాని సంగతి యేమియని నిజమే. ఘటికాచలమాహాత్మ్య ము పాండురంగ మాహాత్మ్యమునకు తీసికట్టే. వయసుముదిరి రెండవ బాల్యము పై కొన్నప్పుడు ప్రతి భావ్యుత్పత్తులు రెండును మందగించును ఆ మందగించిన కాలమున తిరుగుటకలవాటుపడినకాలు కుదుటబడి యొకచో నిలువనట్లు ఏదో వ్రాయుట కలవాటువడిన బుద్ధి ఆ పనిచేయ కుండ నుండలేక చేయును. అట్లు చేయుటవలన నైనకావ్యమును భరించుట అంత సుఖమైనపని కాదు. రామకృష్ణు డాస్థితిలో ఘటికాచలమాహాత్మ్యమును వ్రాసివదలి పరమపదించినాడు. ఇంకొక వాదమునుగూడ చూపవచ్చును. రామకృష్ణుడు ఈ ఘటికాచలమాహాత్మ్యమును రచించి ఏదైవమునకో అంకితముగావించినాడు. ఆయన చనిపోయినతరువాత ఆయన మనుమడు ఆకృత్యాదిని తొలగించి ఖండోజీకి అమ్ముకొనియుండవచ్చును[9] - అని కావచ్చును. అట్లమ్ముకొనువాడు వీలున్నచో మిగిలినవాని నెందుకు విక్రయించినాడు కాడు? అందువలన అది పొసగదు. పాండురంగమాహాత్మ్యమున కిది తరువాతి దని యూహించినపు డిది రామకృష్ణుని కృతులలో చివరిదియే యగును[10]. ఘటికాచలమాహాత్మ్యమే రామకృష్ణుని కృతులలో కడపటిది[11].

మరొక్కవిషయము గూడ నిచట చెప్పవలసియున్నది. రామకృష్ణుడు పాండురంగమహాత్మ్యము కాక పాండురంగవిజయ మను మరొకగ్రంథమును రచించినట్లును అనుకొనుటకలదు. తమ చిన్నతనమున తమ తాతగారు పాండురంగవిజయములోనివని చెప్పుచు చాలపద్యములు చదివి వినిపించెడివారనియు, ఆ వినుకలి వలన తమకు వచ్చిన పద్యములలో ప్రస్తుత మొకటిమాత్రమే అసంపూర్ణముగా జ్ఞాపకమువచ్చుచున్నదనియు పూజ్యులు శ్రీ బి. రామరాజుగారు చెప్పుచున్నారు. ఆ పద్య మిది -

“మారామాజనకాంబుజాంబుజజరామారామ భూభృద్విరా
మారామార్త్య సరి త్కరిద్గణ విరామారామపోత్రిప్రియా
.....................................................
మారామాభయశస్కవిఠ్ఠలపురీక్ష్మాలోకరక్షామణీ!”

శ్రీ చాగంటి శేషయ్యగారు పాండురంగమాహాత్మమునే పాండురంగవిజయ మందురనియు, కొంద ఱీరెండుగ్రంథములును వేఱనిచెప్పు వాదము విశ్వాసార్హము కాదనియు చెప్పుచున్నారు[12]. "దశావతారపద్యములు - సటీకములు" అను పేర నొక కాగితపువ్రాతప్రతి మద్రాసులోని ప్రభుత్వప్రాచ్యపుస్తక భాండాగారమున కలదు[13]. ఆ కాగితపుప్రతికి మూలమైన తాళపత్రప్రతి విశాఖపట్నముజిల్లా వీరవల్లి తాలూకా పాతనపూడి అగ్రహారవాస్తవ్యులయిన కోటి రామమూర్తిశాస్త్రులుగారిది. ఆ పద్యములకు టీక వ్రాసిన పండితుడు చివర తన “గద్య" వ్రాసికొనినాడు.

"ఇతి శ్రీవత్సగోత్రపవిత్ర శ్రీమదాపస్తంబసూత్ర శ్రీమద్రఘునాథభట్టరాచార్యకృపాపాత్ర శ్రీమత్కోదండ రామాచార్యవర్యపుత్ర దుర్వాదిగర్వలతాలవిత్ర శ్రీమద్భాష్యాదిగ్రంథప్రబంధాధ్యయనాధ్యాపనవిచిత కృష్ణమాచార్యగోత్రవిరచితాఖండపండితమండలదుర్విజేయతాత్పర్యపర్యాయపిచండిల పాండురంగవిజయప్రబంధమధ్యనిధేయ హృద్యతమదశావతారపద్యమాలికా టీకానిగూఢార్థ చంద్రికా శరద్రాకాసమాప్తా"— ఈగద్య పాండురంగవిజయప్రబంధ మున్నదనుటకు సాక్ష్యమేగాని అది తెనాలి రామకృష్ణుడు రచించినదే అనుటకు కాదు. క్యాటలాగులో దానినిగూర్చి ఆంధ్రాంగ్లములలో వ్రాయువారు మాత్రము "తెనాలి రామలింగకవికృత పాండురంగవిజయమందలి దశావతార పద్యములు" "These stanzas form part of the Pandurangavijaya composed by Tenali Ramalingakavi" అని స్పష్టముగా వ్రాసిరి[14]. ఈ ఈ వ్రాతలో నింకొకవిశేషము కనిపించుచున్నది. రామకృష్ణుడు రామలింగడుగా నున్నప్పుడే పాండురంగవిజయమును రచించినాడా? తెలుగులో పాండురంగవిజయము ఆంగ్లములో పాండురాంగవిజయమనబడినదేమి? ఈ పాండురాంగ-పాండురంగవిషయము తరువాత రామకృష్ణుని వైష్ణవమునుగూర్చి వ్రాయుచోట మరికొంత వ్రాయబడును. — ఈ దశావతారపద్యములు పాండురంగమాహాత్మ్యమున లేవు గనుక , టీక వ్రాసినయతడు ఈ పద్యములు పాండురంగవిజయమధ్యమున నున్న వనుచున్నాడుగనుక, పాండురంగమాహాత్మ్యమునే పాండురంగ విజయమనుట కుదురదు- అవి రెండు వేఱు వేఱు గ్రంథములగు టయే నిజము. పాండురంగవిజయకర్తృత్వము తెనాలి రామ(లింగ)కృష్ణునిదని ప్రాచీనులసాక్ష్యముండుట చేతను, అందలి పద్యములు నోటికి వచ్చినవారు పాతికముప్పది సంవత్సరముల క్రితమ వరకు ఈ తెణంగాణమున నున్నట్లు చూచి యెరిగిన సాహిత్యోపాసకులు వచించుట చేతను, ఇంకను దేశము నలుమూలలనుగల తాళపత్రగ్రంథముల సేకరణము జరుగ లేదు గనుకను, తెనాలి రామకృష్ణుడు పాండురంగవిజయప్రబంధమును రచించియుండుననుట కేవల మనృతము గాజాలదనియు, ముఖ్యముగా తెలంగాణము నందలి తాళపత్రగ్రంథసేకరణము సంపూర్ణముగా జరిగినప్పు డది లభింపవచ్చు ననియు విశ్వాసముతోనుండుటయే మంచిది. అంతవరకు పాండురంగవిజయ ప్రబంధములోనివి రెండుపద్యములు మనకున్నవనియే తృప్తి చెందవలయును. అసంపూర్ణముగా నున్న పద్య మింతకుముం దుదాహరింపబడినది. రెండవది సంపూర్ణముగా నున్నది. ఈ క్రింద నీయబడుచున్నది.[15]

సీ.

ప్రౌఢ దీర్ఘ సమాసపదములగూర్చి శ్రీ
        నాథుండు కూలార్చె నైషధంబు
దానితల్లిగ నల్లసాని పెద్దన చెప్పె
        ముది మదిదప్పి యాముక్తమాల్య
దూహించి తెలియరాకుండ సూరపరాజు
        భ్రమఁ గళాపూర్ణోదయము రచించె
నతిశ్లేష శబ్దవాగాడంబరంబొప్పఁ
        బస ఘటించెను మూర్తి వసుచరిత్ర
నిట్టికవులకు నేను వాకట్టుకొఱకు
చెప్పినాఁడ మదీయ వైచిత్రి మెఱయ
పాండురంగవిజయమును పటిమదనర
విష్ణువర్దిష్ణుఁ డగు రామకృష్ణకవిని.

పాండురంగవిజయము లోనిదని మనము దీనిని గ్రహించుచున్నాము గాని దీని వలన చాల చిక్కులున్నవి. అందువల్లనే బ్రహ్మశ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు “రామకృష్ణకవి తన పాండురంగవిజయప్రబంధములోని కవిత్వపటుత్వమును గూర్చి చెప్పికొనినపద్యము" అని చెప్పుచునే "ఈ పద్యము శైలినిబట్టియు తెనాలి రామకృష్ణకవికి తరువాతివాడగు సూరనను పేర్కొనుటంబట్టియు నంత విశ్వసనీయముగ తోపదు" అని జ్ఞాపిక వ్రాసిపెట్టిరి. కాని ఈ పద్యమునందలి 'దానితల్లిగ' అన్నప్రయోగము రామకృష్ణునిదే కావలయు ననిపించుచున్నది. ఈ అర్థముననే ఘటికాచలమాహాత్మ్యమున "నిండుజాబిల్లి తల్లియై నిగ్గుదేరు మోము" (2-184) అని ప్రయోగించియున్నాడు. పాండురంగమాహాత్మ్యమునను "శైవాలవల్లికిం దల్లియై చెలువారు నూగారును" (3-179) అని ప్రయోగించినాడు. పుస్తకము లభింపలేదుగనుక చిక్కులున్న వనుకొనుచున్నాము. అది బయటపడినప్పుడు చిక్కు లెట్లో సవరింపబడును. మిగిలినకృతులతోపాటు ఈ పాండురంగవిజయప్రబంధరచనాకాలమును నిర్ణయింపబడును. అందుకు కాలము కలసిరావలయును.

మరికొన్నికృతులు రామకృష్ణుడు రచించినట్లుగా వినుకలియేగాని కనుకలి లేదు, అవి యివ్వి : (1) లింగపురాణము, (2) ఆదిపురాణము, (3) కందర్పకేతువిలాసము (4) హరలీలావిలాసము. ఈ చివరి రెండుగ్రంథములలోని వని కొన్నిపద్యములను రామప్రెగడ జగ్గన తాను సమకూర్చిన యుదాహరణగ్రంథములో ఉటంకించినాడు.[16]

ఉద్భటారాధ్యచరిత్రము, పాండురంగమాహాత్మ్యము, ఘటికాచలమాహాత్మ్యము మాత్రమే క్రమముగా రామకృష్ణుని ప్రస్తుత మున్న కృతులు.

5. రామకృష్ణుడు హాస్యగాడు కాడు :

తాను రచించినగ్రంథాలనుబట్టి అయినదానికంటె, తనకు సంబంధించిన సంబంధింపజేయబడిన, హాస్యప్రసంగకథావిశేషములచేత రామకృష్ణు డెక్కువగా నీ దేశమున ప్రసిద్ధుడు. హాస్యచతురుడుగా నయిదువందలసంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ ప్రజానీకమునకు సన్నిహితుడై ప్రవర్తించుచున్న రామకృష్ణుడు తానురచించిన గ్రంధములలో నెక్కడకూడ ఆ వాసనకలవాడుగానే కనిపించడు. నిత్యజీవితమున అలవోకతనమున కలవాటుపడిన ఈయన, కావ్యజీవితములో జాగృతుడు. మరియు గంభీరుడు. ఇందు కపవాదముగా, కవిస్వభావము కావ్యమున ప్రతిబింబించు ననుసిద్ధాంతమున కనుకూలముగా కొందరు వాని కృతులనుండి ఒకటి రెండుపద్యములను, సన్నివేశములనుండి ఎత్తి చూపుదురు. అవి హాస్యా పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/10 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/11 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/12 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/13 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/14 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/15 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/16 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/17 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/18 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/19 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/20 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/21 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/22 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/23 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/24 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/25 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/26 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/27 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/28 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/29 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/30 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/31 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/32 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/33 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/34 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/35 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/36 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/37 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/38 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/39 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/40 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/41 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/42 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/43 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/44 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/45 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/46 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/47 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/48 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/49 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/50 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/51 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/52 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/53 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/54 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/55 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/56 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/57 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/58

ర్యాత్మకుడు పాండురంగమహాత్మ్యమున సామిమలకు ప్రయాణముగట్టిన అగస్త్యమహర్షి మార్గ మధ్యమున మాల్యవంతాదికమును తన భార్యకు చూపి వర్ణించి చెప్పుట\ వంటిదే ఇచట ఘటికాచలమాహాత్మ్యములో వసిష్టుడు కాంచీనగరమును అరుంధతికి వర్ణించి చూపుట. నిగమశర్మవంటి వాడే హరిశర్మ. మరియు నుద్భటారాధ్య చరిత్రములోని మదాలసు డచ్చముగా నిగమశర్మను మించిన వాడు.


మిగిలిన పోలికలుకొన్ని ఝడి తిస్పూర్తికలవి " పద్యరచనాదికము.-3" “ఛందోవి శేషములు_4" .అని అనుబంధమున చూపబడినవి సూక్ష్మముగా విచారించుచో మరికొన్ని తోచగలవు.


IV

21. వైష్ణవము పుట్టుపూర్వోత్తరములు :


విష్ణువునకు సంబంధించినది వైష్ణవము విష్ణువును పరదైవముగా భావించి భక్తి భావముతో నారాధించువిధము వైష్ణవము. అది హిందూమతమున నొక అవాంతరశాఖ.


విష్ణుశబ్దము నామవాచకముగాగూడ వేద వాజ్మయమున నుపయోగింప బడినది. ఋగ్వేదము , విష్ణువు ప్రస్తుతి యున్నది. 1[17] విష్ణు వుయొక్క అవతార కథలకుకూడ బీజములందున్నవి. కాని ఆ కాలమున విష్ణువుసర్వాధికుడుకాడు ఇంద్రుని ముఖ్యమిత్రులలో నొకడు.


శతపథ బ్రాహ్మణమున 2[18] విష్ణువు యజ్ఞముగా ప్రస్తావింపబడినాడు. యజ్ఞ ముఖమున నే దేవతలు పృధ్వాదులను వశీకరించుకొనిరి. యజ్లరక్షకుడుగా గూడ చెప్ప బడి నాడు. ప్రజాపతికంటే ముందే నామరూపములచేత స్థిరపరుపబడిన దైవము విష్ణువు ఈ దైవతముయొక్క ప్రాదుర్భావము విషయము మాత్రము చెప్పబడలేదు. యజ్ల సంబంధమే ఎక్కువ చెప్పబడి యున్నది. యజ్ఞముయొక్క పూర్వార్థము అగ్ని, ఉత్తరార్థము విష్ణువు ఆనియు దేవతలయందున్నతుడనియు కూడ ఆ బ్రాహ్మణము నందున్నది. విష్ణు నామముతరువాత నారాయణ, భగనామములు వైదిక వాజ్మయమున విష్ణుపరములుగా కలవు 1[19] మరియు క్రమముగా వాసు దేవ-కృష్ణ శబ్దములును తత్పరములుగా వ్యాప్తికి వచ్చినది. ఆ వ్యాప్తినిబట్టియే వేదోపనిషత్పురా కేతిహాసముల మీదుగా సర్వాంగ సుందరమైన వైష్ణవము రూపు గట్టుకొన్నది.


క్రీస్తు పూర్వము నాల్గవ శతాబ్దమునాటికే వాసుదేవ - బలదేవులు పూజింపబడు చున్నటొక బౌద్ధుని వాక్య మున్నది.2 వాసు దేవుని విషయము పాణినికి తెలియును. కీస్తుపూర్వము వాసు దేవసంకర్షణ పూజా విధానమున్నట్లును ఆధారములున్నవి. ఆ కాలమునం దాపూజ చేయువారు భాగ వతు లవబడుచు) డెడి వారు. వారిది భాగవతమతము. ఆ వాసు దేవుడు వృషి వాసు దేవుడు. వానిని కేంద్రముగా చేసి చుట్టుకొన్న మతమునకు ఏకాంతిక ధర్మ మనియు పేరు. శ్రీమహావిష్ణువు నారదునకుప దేశించిన ధర్మమది. భగవద్ 2[20] లో అర్జునునకుపదేశించినదియు నీధర్మమే. పశువిశసనము లేని యజ్ఞ ధర్మమిది. ఈ ఏకాంతిక ధర్మమున వాసు దేవనామము ప్రముఖమైనది. పరమ సాత్విక మతమగుటను ఈ మఠము వారు సాత్వతు లనబడిరి. సత్వ ప్రాధాన్యము కల వారు వారు, అనన్యమైన భక్తి భావమున కేకాంత భావమని పేరు. పాంచరా త్రాగమసిద్ధాంతము ప్రసిద్ధికి వచ్చినపిదప ఏకాంతి. ధర్మము పొంచరాత ధర్మమైనది. ఈ విధముగా భాగవత-సాత్వత-ఏ కాంతి : -పాంచరాత నామముల బ్రశస్తమైన వైష్ణవము ఉత్తర దేశమునుండి దక్షిణ దేశమును ప్రవేశించినది3[21] . కాని దక్షిణ దేశముననే వైష్ణవము పుట్టినదనిపించిన మహానుభావులయిన వైష్ణప భక్తులు ఆళ్వారులు, వారు వైష్ణవవాజ్మయమును ద్రవిడ భాషను సృష్టించిరి వారివలన వైష్ణవముభక్తి మతముగా స్థిరపడినది. కాని శ్రీమచ్ఛంకరభగవత్పాదాచార్యుల వారి అద్వైత సిద్ధాంతదిప్తికి క్రమముగా భాగవతభక్తిమతము వెనుక బట్టినది 4 [22]అద్వైతమతము నెదుర్కొని అలు వెనుకబట్టిన విష్ణుభక్తిని పునఃసంస్థాపించుటకే శ్రీమద్రామానుజు లవతరించిరి. 33. అ)దువల్లనే ఆళ్వార్లు చేయనిపనులు శ్రీభాష్యరచనాదికమును శ్రీమ ద్రామానుజులు చేయవలసివచ్చినది.


శ్రీమద్రామానుజుల అనుయాయిజనము దక్షిణ భారత దేశముననే ఎక్కువ ఈజనము వడగల - తెంగల అని రెండువర్గములగానున్నది. శ్రీమద్వేదాంత దేశికుల వారివల్లను , శ్రీమాన్ పిళ్ళై లోకాచార్యుల వారివల్లను వైష్ణవులలో నీతెగలేర్పడినవి.[23]1 ఇవి ఏర్పడినప్పటినుండియే వైష్ణవమున మతప్రచారము - అన్యులను తమమతములోనికి చేర్చుకొనుట ఇత్యాదులు మొదలైనవి రామకృష్ణున కొక వందసంవత్సరముల ముందునుండి వైష్ణవ మట్లయి యున్నది,

22. రామకృష్ణుని మధ్య వైష్ణవము :


మధ్యవచ్చిన రామకృష్ణుని వైష్ణవమునుగూర్చి చెప్పుట కధికారము గల శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు "ఘటికాచలమాహాత్మ్యమున వైష్ణనము కొంత ముదిరిన సూచనలున్నవి శ్రీవైష్ణవులమతము” కాని గ్రంధమును కొంత యున్నదనియు "పాండురంగమాహాత్మ్యములోనిది ఇంకను శిథిలమైన వైష్ణవము"2[24] - అని చెప్పియున్నారు. గ్రంథ రచనాక్రమమునుబట్టి శ్రీమాన్ శర్మగారి యర్థమును మనమిట్లు గ్రహింపవచ్చును.


రామకృష్ణుడు వైష్ణవముపుచ్చుకొని పేరు మార్చుకొన్నాడేగాని పూర్తిగా మనసు మార్చుకొన లేదు. ఆజన్మసిద్ధమైన శైవము నాతడుపూర్తిగా త్యజింప లేదు. అందువలననే ఆయన తాత్త్వికతయు అద్వైతమును సంపూర్ణముగా తొలగించుకొన్న విశిష్టాద్వైతము కాలేక పోయినది. ఈ విధముగా నున్న రామకృష్ణుని శిధిల వైష్ణ వబుద్ధి పాండురంగమహాత్మ్య రచనా కాలము నాడున్న దానికంటె ఘటికాచల మాహాత్మ్యమును రచించునాటికి మరికొంత శైథిల్యమును తగ్గించుకొని బిరుసెక్కి కొంత ముదురుపాకమున పడినది - అని ఈ అనంతకృష్ణ శర్మగారి యభిప్రాయము నిజము కావచ్చుననిపించు చున్నది. అపుడే రామలింగడు మతముతో పాటు పేరుమార్చుకొని రామ కృష్ణుడుగా నవతరించినాడన్న వాస్తవము మరియు సోపపత్తికమగును. పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/62 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/63 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/64 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/65 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/66 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/67 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/68 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/69 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/70 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/71 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/72 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/73 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/74 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/75 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/76 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/77 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/78 పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/79  వడగల వారిది మర్కటకిశోర న్యాయము ననుసరింపగా తెంగల వారి దృష్టి మార్జాల! కోర న్యాయము వైపుపోయినది. కర్మ జ్ఞానభక్తి యోగములను పాటింప లేని వారికి అంతకంటే సులభోపాయము ప్రవత్తి అని వడగల వారనగా అది కాదు- లేని వాడు, కల వాడు అన్నది లేదు. సర్వులకును ప్రప త్తియే శరణ్యమని తెంగల - వారందురు. మరియు ప్రపత్తి యే మొదట చేయదగిన దనియు నందురు. 1[25] శ్రీ మద్రామానుజుల మతమే కొంత బ్రాహ్మణమతము. ఆకొంత నింకను పెంచి పెద్ద చేసినది వడగల తెంగల వారట్లొప్పుకొనరు. సర్వవిధములను సర్వులు సమానులన్నది వారి మతము. ఈ విధముగా నిరువు రకును పదు నెనిమిది ప్రధాన భేదము లున్నట్లు తెలియుచున్నది,

రామకృష్ణు డీరెండింటిలో నేశాఖయం దభిమానము కలవాడు? ఈ విషయమున ఇది యని చెప్ప లేము. అనుమానముమీద తెలిసికొనుట కైనను అవ కాశములు మృగ్యములుగా నున్నవి. (1) తిరువారాధనములో తెంగల శాఖవారు గంట వాయింపనంత మాత్రమున పుండరీకుడు బడిఘంట మొరయ జేసినట్లు (2_22) రామకృష్ణుడు వ్రాసినందున వడగల తెగ వాడు కానక్కర లేదు. స్మార్తుల దేవతార్చనమునను గంట వాయింపుడున్నది. ఆ పూర్వస్మృతితో పాండురంగ మాహాత్మ్యమున ఆయన అట్లు వ్రాసియుండ వచ్చును ఎట్లును శిధిల వైష్ణవ మేకదా అతనిది? మరియును కొంత వైష్ణవము ముదిరినపిమ్మట వాసిన ఘటికాచలమాహాత్మ్య మున గంట వాయింపసలు లేకుండనే చేసినాడు. మరియిక్కడ ఏ తెగ వాడుగా చెప్పవలయును? (2) ఖండోజికి ఈ ఘటికాచలమాహాత్మ్యమును తీసికొనిపోయి ఇచ్చిన రామ కృష్ణునిమనుమడు' వెదు రాకువంటి తిరుమణి నుదుట ధరించినటు చెప్పబడి యున్న దానినిబట్టి (అవతారిక . 12) రామకృష్ణుడు వడగలయనుట పై దానంత సులభముగా త్రోసి వేయదగినది కాదు. ఆ “రామకృష్ణునిమనుమడు” సరిగా రామకృష్ణుని కూతురు కొడుకో, కొడుకుకొడుకో కాదు. రామకృష్ణునకు నూరునూట యేబది సంవత్సరముల తరువాత ఆవంశము లోని వాడవని చెప్పుకొన్న వాడు. వాడు పెట్టుకొన్న బొట్టును పట్టుకొని వానితాతముత్తాతల మత భావములను నిశ్చయించుట కుదురదు. అమాంతము మతములను మార్చుకొన్న వంశములో పురుషాంతరములమీద మరెవ్వరును మార లేదని అనుకొనుట యెట్లు ? అది కారణముగా ఆ మనుమని వెదురాకువంటి తిరుమణి రామకృష్ణుని వడగల శాఖకు చెందుటకు ఋజువు కాదు. ఇంతకును రామకృష్ణుడు వడగల తెగ వాడు కానక్కర లేదని చెప్పుట యైనది. తెంగల తెగ వాడని చెప్పుట కాలేదు, ఆమాట చెప్పినను అదియు కానక్కర లేదని చెప్పవచ్చును. శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు చెప్పినట్లు గా 1[26] “అసలుబుడమే భద్రము లేనిరామకృష్ణుని యా వైష్ణవములో, అది వడగల సంప్రదాయమా, తెంగల సంప్రదాయమా అను ప్రశ్న వట్టి వినోదము మాత్రమే"

26. రామకృష్ణుడు సురారామగజము :


తెనాలి రామకృష్ణుడు చాలజాగ్రత్తగా శ్రద్ధాసక్తులకలిమిని సమీక్షించవలసిన ప్రౌఢకవి శేఖరుడు. అతని గురించి ఎవరేమి చెప్పినను ఒక్క పాండురంగ మాహాత్మ్యమును పట్టుకొనియే చెప్పుదురు. మిగిలిన వానికృతు లందుబాటులో లేక పోవుటయు నందుకొక కారణము కావచ్చును. ఆంధ్రభాషాకవులలో ప్రతిభావ్యుత్పత్తులచేత నేగాక మత తాత్త్విక భావముల చేతను రామకృష్ణుడు విలక్షణమైన వాడు. ఆయన మూడుకృతులను కూలంకషముగా అధ్యయనము చేసినగాని ఆయన లోతుపాతులు తెలియవు. వైష్ణవగ్రంథములు రెండును ఇప్పుడందుబాటులో నున్నవి. శైవగ్రంథముగూడ ఇట్లే రావలయును. మూడు కృతులమీద రామకృష్ణుని అధ్యయనము చేయుటకు వలయు భూమికగా కూడ వనికి రావలయునని ఈ యుపోద్ఘాంతము వ్రాయ బడినది. -

రామకృష్ణుని జన్మతోడిది శైవమనియు అతనియెడ వైష్ణవముశిధిల మైనది యనియు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు,[27] శ్రీమాన్ రాళ్ళ పల్లి అనంతకృష్ణశర్మగారు[28] చెప్పిన వాక్యార్థములను రామకృష్ణునికృతులను ముందు పెట్టుకొని ఋజువు చూచుకొనుటకు మొదలు పెట్టినచో ఇంతకు పూర్వము మన కపరిచితములయిన రామకృష్ణుని బుద్ధి భూముల నిమ్నోన్నతముల మంచి చెడ్డ లవగతములగును. అతడు క్రొత్తగా కనిపిం చును. అతని అసలుమూర్తి ఇంతవరకు మనకు తెలిసినది కాదనిపించును. రామకృష్ణుని కావ్యతత్త్వవిచారము చాల దొడ్డది. మరియు నీఘటికాచల మాహాత్మ్య ము బహురసాలు కార భావనానార్థ విభాసురంబు (3-68) అని చెప్పినాడు. మరి ఆ ఈ కొలతలతో ఆతని కృతులు కొలువబడినప్పు డెట్లుండునో చూడవలసియున్నది. శైవ వైష్ణవముల వలన రామకృష్ణునకును. ఆంధ్ర భాషా వాజ్మయములకును జరిగిన మేలుకీడులను పరిశీలించినప్పుడాయన స్థితిగతులిప్పుడున్నట్లుండవు. అతనికృతులు మనకీ విధముగా నర్థ మగుకొలది అతని మన స్సామత భావముల తాకిడినలన నెట్టి ప్రవృత్తికల దైనదియు బోధ పడును. ఈ యుపోద్ఘాతము దదభిముఖముగా నుండుట లషింపబడినది. రామకృష్ణునికృతులమీద పరిశోధనలు చేసిన వారుక లరు ఆంధ్రవిశ్వ విద్యాలమున శ్రీ వేదాంతం గోపాలకృష్ణ మాచార్యులు, శ్రీ ఎక్కిరాల రామకృష్ణ మాచార్యులు, మద్రాసు విశ్వవిద్యాలయమున శ్రీ చిన్నికృష్ణయ్య థీసిస్సులు వ్రాసిరి అమూల్యములును . అపూర్వములును అయిన విశేష విషయములు కొన్ని యైనను ఆథీసిస్సులలో ఉండియుండును. అ )అముద్రి తములు. అందువలన నేను వాటిని చూడ లేదు పై ముగ్గురలో రామకృష్ణుని గూర్చి ఎక్కువ కృషి చేసిన శ్రీఎక్కి రాల రామకృష్ణ మాచార్యులు, శ్రీ చిన్ని కృష్ణ య్య వంటి వారు కొన్ని కొత్త విషయములను చెప్పగల్గ దురు.

నాకు తెలిసిన , నాకు తోచిన కొద్ది పాటి విషయములను ఫలితాంగ ములను పరిగణించుట పెట్టుకొనకుండ వట్టి విషయములుగా నే ఈ యుపో (తమున ప్రతిపాదించినాను. ప్రాచీన కావ్య ప్రబంధ సంపాదకత్వము వహించిన వారు అవి మరియు నర్థ మగుటకు వలయు విషయములను వివరిం చుట, ఆయాకృతుల సాహిత్యపు విలువలను కీర్తించుటకంటెను, అది వారి ప్రథమక ర్తవ్య మను ధర్మమును దృష్టియందుంచుకొని నా నేర్చిన థీయ పోత్గాతమును రచించితిని రామకృష్ణుని కృతుల యర్థముతో సుగత మొనరిం చుట కీనా ప్రయత్నము దోహద మేపాటి చేసినను దీని సాగుదల సార్ధకమై నట్లే లెక్క - ఇందలి గుణ దోషముల సంగతి యెరిగిన వా రెరుగుదురు - సర్వారంభా హి దో క్షణ ధూ' మే నాగ్ని రి వావృతాః [29]|

ఇతిశివమ్

ప్ల వంగ మహాశివరాత్రి 28, ఫి బ్రవరి, 1988 కేతవరపు రామకోటిశాస్త్రి.

  1. 1. ఆంధ్ర కవితరంగిణి సం. 8 పుటలు 8-10-25.
  2. 5. వాజ్మయ వ్యాసమంజరి పుట 149.
  3. * ఈ విషయమున ఎవ రెవ రేమి చెప్పినదియు. ఆ చెప్పబడిన దాని సత్యాసత్య వివరణమును, సిద్ధాంతవిషయప్రతిపాదనమును శ్రీ నేలటూరి వేంకటరమణయ్య గారి వ్యాసములయందు సుష్ఠుగా నున్నది. చూ, వాజ్మయ వ్యాసమంజరి.పుటలు 941-58.
  4. 1. ఉద్భటారాధ్యచరిత్ర పిఠిక ,
  5. 2. ఆంధ్రకవితరంగిణి సంపుటము 8, పుట 8.
  6. 1. ఉద్భటారాధ్య చరిత్రము.
  7. 2 పాండురంగ మాహాత్మ్యము
  8. 3 పాండురంగ మాహాత్మ్యము - శ్రీ బులుసు వేంక టరమణ య్యగారి పిఠిక. పుట 13.
  9. ఆంధ్రకవితరంగిణి, సం. 8. పుట. 11.
  10. పాండురంగమాహాత్మ్యము. శ్రీరాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారి ఉపోద్ఘాతము. పుట 28.
  11. వాఙ్మయవ్యాసమంజరి. పుట 116.
  12. ఆంధ్రకవితరంగిణి. సంపుటము 8. పుట 12. మరియు వీరేశలింగముగారి ఆంధ్రకవుల చరిత్రము. రెండవ భాగము. పుట 175.
  13. A Triennial Catalogue of Manuscripts Volume III Part III. Telugu. R. No. 542.
  14. ఈ పద్యములు ఎలకూచి బాలసరస్వతి మహోపాధ్యాయుడు రచించినవని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో వ్రాసినారు. పుట. 13.
  15. చాటుపద్యరత్నాకరము. పుట. 47.
  16. ఆంధ్రకవితరంగిణి సంపుటము 8. పుటలు. 27, 28.
  17. 1. సర్వసిద్ధాంత సౌరభము. (అనుభవానంద స్వాముల వారు) సంపుటము 7 పుట 34-36.
  18. 2. (R. M.) Religion and Mythology of the Brahmanas (Dr. G. V. Devasthali) pages 8.9.26. 167.
  19. 1. సర్వసిద్ధాంత సౌరభము. సంపుటము 7. పుటలు 37.52.
  20. 2. V. S. Vaisnavism Saivism (Sri R. G. Bhandarkar) Page 3.
  21. 3. సర్వసిద్దాంత సౌరభము. సంపుటము 7. పుట 110.
  22. 4. Vaisnavism went on till about the end of the eighth century. when the doctrine of spiritual monism and world-illusion was promulgated and disseminated by Sankaracharya and his followers. This was considered as destructive of the Bhakti, or love, which vaisnavism enjoined V. S. Page 100,
  23. 1. తెలుగు విజ్ఞాన సర్వస్వము సంపుటము 8. పుట 584. -
  24. 2. పాండు (సాహిత్య అకాడమి) ఉపోద్ఘాతము. పుటలు. 18, 17.
  25. 1.V. S. P. 56.
  26. 1. పాండు. (సా) ఉపోద్ఘాతము పుట. 18.
  27. 2. తెలుగు విజ్ఞాన సర్వస్వము. పుట. 1002.
  28. 3. పాండు (సా) ఉపోద్ఘాతము. పుట. 17.
  29. 1. శ్రీమద్భగవద్గీత , 18-48.