Jump to content

గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/రావిపాడు

వికీసోర్స్ నుండి

66

రావిపాడు

కయిఫియ్యతు మవుజె రావిఫాడు సంతు హవెలి సర్కారు

మృతు౯జాంన్నగరు తాలూకె చిల్కలూరిపాడు యిలాకె

రాజామానూరి వెంకట కృష్ణారావు.

యీగ్రామాన్కు పూర్వం నుంచ్చి రావిపాడు ఆనె వాడికె వుంన్నది——

గజపతి శింహ్వసనస్థుడెయ్ని గణపతి మహారాజు రాజ్యము చెశెటప్పుడు విరిదగ్గర ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు బ్రాంహ్మణులకు గ్రామ కరణికపు మిరాశిలు యిచ్చే యడల శాలివాహనం ౧౦౬౭ (1145 A.D.) శకమంద్దు యీ గ్రామాన్కు వెలనాడు కమ్మరాజువారు అనేటి భారద్వాజ గోత్రులకు యెకభోగంగ్గా గ్రామ కరిణీకపు మిరాశి నిన౯ యించినారు. గన్కు తదారభ్య యెతద్వంజులయినవారు అనుభవిస్తూ వుంన్నారు.

వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 A. D.) వర్కు జరిగిన తర్వాతను తురర్కాంణ్య ప్రబలమాయె గనుక దేశమును దేశపాండ్యా మజుంద్దారు మొదలయ్ని బారాముతసద్ది హెదాలు యెప౯రచి మల్కి విభురాం సుల్తానబ్దుల్లా మొదలయ్ని పాదుషాహీలు సర్కారు సముతు బంద్దిలు యెప౯రచేటప్పుడు కొండ్డవీటికి మృతు౯జాంన్నగరు అని పెరుబెట్టి శిమా మూలం పద్నాల్గు సముతుగా యెప౯రిచేటప్పుడు యీగ్రామము అలాహిదాగా కొండ్డవిటి హవెలి నలభై నాలుగు గ్రామాదులలో చెచిన్ ఖిల్లా జాగిరు కింద్ద దాఖలుచెశినారు గన్కు ఆ ప్రకారంగ్గా బహుదినములు ఖిల్లాకువచ్చిన జాగీరుదాల౯ పరంగ్గా అమలుజరిగినది.

స్న ౧౧౨౨ ఫసలీలో (1712 AD) కొండ్డవీటిశీమ వంట్లు చెశి జామీదాల౯కు పంచ్చిపెట్టె యడల యీ గ్రామం సర్కారు మజుంద్దారులయ్ని మానూరి వెంక్కన్న పంత్తులు గారి వంట్టులొచెరి చిల్కలూరిపాడు తాలూకాలొ దాఖలు అయ్నిది గన్కు వెంకంన్న పంత్తులు అప్పాజి పంత్తులుగారి ప్రభుత్వములు జరిగిన తర్వాతను వెంక్కట రాయనింగారు ప్రభుత్వము చెశేటప్పుడు నిజాముల్ ముల్క్ బాహద్దురు వారి పెద్ద కామారుడయ్ని నాసర జంగ్గు బహద్దరును సుబావారు యీ సర్కారు ఫరాంను వారికి యిచ్చిరి గన్కు స్న ౧౧౬౨ (1757 AD) ఫసలీ వర్కు అధికారం చెస్తూవున్న తదనంతరం నాసరజంగ్గు బహుదరిగారి తరుణమంద్దు విరితమ్ములయ్ని నిజామల్లిఖాను బహదురువారు ప్రభుత్వము వహించ్చి రజాబేఖానుడు అనే సరదారుంణ్ని కొండ్డవీటి ఖిల్లాకు ఖిల్లే దారి మొకర్రరు చేసి కనుబెకొండ్డవీడు ౧ఫిరంగ్గింపురము ౧అమీనుబాదా౧ రేపూడి ౧ వున్నవ ౧ వంక్కాయలపాడు అన్నపర్రు ౧ వగయిరా పది పదినెనిమిది గ్రామాదులు ముగ్గురు జమీదాల౯ తాలూకా నుంచ్చి విడతిశి జిల్లా జాగిరుకింద్ద దాఖలుచేశి రజా బెఖానుని గారికి శలవుయ్చిరి గన్కు అతను వచ్చి ఖిల్లాలో ప్రవెశించ్చి జాగీరు గ్రామాదులు అనుభవిస్తున్నంత్తల్లో ఆ ఫనలీలో నిజామల్లిఖాను బహద్దురుగారి తమ్ములయ్ని బిసాల జంగ్గు బహదరు వారు ఆదౌని సుబా ప్రవేశించ్చి, యీసర్కారు రాజా బిరజానాధుగారికి అమిలీ యిచ్చి మారుఫత్తుల్లాఖానుని గారిని కొండ్డవిటఖిల్లాకు ఖిల్లెదారి నిన౯యించ్చి పంప్పించ్చినారు గన్కు విరుంన్నూ విరితరుణమంద్దు అరబ్బిసాహెబు మీరుసాహెబు నవాబు సాహెబు మొదలయ్ని వారు ఖిల్లె దారిలో వుండ్డి స్న ౧౧౮౮ (1798 A.D.) ఫసలీవర్కు ఆనుభవించి వుంన్నారు. స్న ౧౦౮౯ (1779 A D ) ఫసలీలో ఖిల్లాఖాలిచేశి జాగీరు మోఖూబు చెశి గ్రామాదులు యెయె జమిందాల౯ పరంచెశిరి గన్కు యీ గ్రామము రాజామానూరి వెంక్కట కృష్ణారావు గారి తాలూకాలో దాఖలు అయినంద్ను వెంక్కట కృష్ణారాయనింగారు ప్రభుత్వంచెశ్ని మీదట వారి కొమారులయ్ని రాజానరసన్నారావుగారు ప్రభుత్వము వహించ్చి స్న ౧౧౯ఽ (1787 A D ) ఫసలీ వర్కు ప్రభుత్వము చేస్తూ వుండ్డగా మహరాజశ్రీ కుంఫిణివారు గుంట్టూరు సర్కారు ప్రభుత్వానకు వచ్చి స్న ౧౧౯౮ (1788 A D) ఫసలీలగాయతు మూడు సంవ్వత్సరములు తాలూకాఫక్తు అమీని చేశిసకల ధర్మము జర్గించినవారయి తిరిగి జమీదాల౯ పరంచేశిరి, గన్కు నరసన్నారావు స్న ౧౨౧౮ (1808 AD ) ఫసలీ వర్కు ప్రభుత్వమునచెశ్ని తరవాతను వెరక్కటకృష్ణునింగారు ప్రభుత్వమున వహించ్చి స్న ౧౨౨౨ (1812 A D) ఫసలీ వరకు అధికారముచేస్తూ వుంన్నారు.

మూడు A రిమాకు గ్రామగుడికట్టు కుచ్చళ్ళు ౫౫ కి మిన్నహాలు ౧ ( 2 గ్రామకంఠాలు ఒకి 6 d 2..... u 6 6 వనం తోటలు 0 చెరువులు 2 కి ౦ 6 2. 6. E 6 2 కసుపాగ్రామకంఠము గొగులమూడి మాధిగెపల్లె మాలపల్లె కి కమ్మరాజు అయ్యవారప్ప వనం తోటలు కి ఆయ్యప్ప వనంతోటలు వ గాదిరాజు శివప్ప వనము తోట ధూపాటి రత్నము కరణాలు వనంతోట వ౧ కి గోగులమూడి వనం తోట వంకి గ్రామచెరువు గొగులమూడి చెరువు 8.7 లావు రంగ్గప్ప చెరువు చెలువ్వ పాపంన్న కొమ్మరాజు అయ్యప్ప చెరువు 68 C C e (?) P 0 1000 డొంక్కలు O

BO 0 C 0 . 6 0 6 6 వాగులు ౨ కి C C 6 6 6 3 చెరువుమాన్యం 04 - • నంద్దిపాటి డొంక్కవంకి గొట్టిపాటి డొంక్కవంకి ddl 6 ౬ E గ్కాతతిమ్మా 3 2 మాగన్ శిర శు 3 ఆదివారము . o ౬ వంగ్గిపురం డొంక్క వణకి పుసులూరి డొంక్క వంకి గోగులమూడి నుంచ్చీ నంద్దిపాడు పొయ్యె డొంక్క నర్రాబలభద్రయ్య మాదిగెవాండ్లు ౦ 6 మల్లయ్య పాలెపురం డొంక్కవం కీ గ్రామ కైఫీయత్తులు గ్కాతతిమ్మా ౪౮ శ్రీమదద్పంక్కి శింగ్గాచార్యులు అయ్యవాల గారికి ఖండ్రికె ధూపాటి రత్నమాచాలు౯ అవ్వారి సర్వదేవుడు పానకాలు అవ్వారి అచ్చంభొట్లు యీ నరసంభొట్లు గూడ లక్ష్మీనరసు మానూం లక్ష్మక్కగారికి అధరాపుర్పు శేషాచార్లుగారికి నబినవీసు నరసింగ్గరావు కొమ్మరాజు అయ్యవారప్ప యీ అయ్యప్ప గ్రామచెరువు మాన్యం గొగులమూడి చరువు యినాము లావు రంగప్ప చెరువు యినాము చెలువ్వ పాపన్న చెరువు కిరాజామానూరి వెంకట కృష్ణరాయునింగారి సావరం ౫ గ్కా తతింమ్మా 3 ౨ 6 - ది ౬ డిశంబరు ఆన ౧౮౧౨ సంవత్సరము ఆంగ్గిరస నామ సంవత్సర