గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/యనమదల

వికీసోర్స్ నుండి

57

యనమదల

కయిఫియ్యతు మౌజే యనమదల సంత్తు గుంటూరు తాలూకె

రెపల్లె యీలాకే రాజా మాణిక్యారావు భాపనారాయణరావు

సరుదేశముఖి మన్నెవారు సర్కారు ముతు జాంన్నగరు

పూర్వం శాలివాహన శక వరుషంబ్బులు ౧౦౫౯ (1134 AD) శకం మొదలు కొని గజపతి శింహ్వసనస్తుడయ్ని గజపతి మహారాజు తక్తు బిఠాయించ్చి రాజ్యం చెశెటప్పుడు వీరిదగ్గర మహా ప్రధానులయ్ని గొపరాజు రామంన్న గారు ౧౦౬౭ (1145 AD) శకమంద్దు బ్రాహ్మణులకు గ్రామకరిణికపు మిరాశీలు యిచ్చినప్పుడు యీగ్రామాన్కు గొల్లపూడివారు సంప్రతి ౧ పచ్చి మిరియంవారు సంప్రతి ౧ సల్కవారి సంప్రతి ౧

తదనంత్తర అనుముకొండ్డ శింహ్వాసనారూఢులయ్ని కాకతీయ్య వంశజులైన ప్రోలరాజు ప్రతాపవంత్తుడై ఆంధ్రదేశం ప్రభుత్వంచేశిన మీదట యితని కొడుకు మాధవ భూపతి రాజ్యంచెశ్ని తరువాతను యితని కొమారుడయ్ని గణపతి రాజ్యంచెస్తూ వుండ్డి ధాన్యవాటి పురాధీశుడై నషువంట్టి కోటకెతరాజుకు పుత్రుడయ్ని రుద్రరాజు కొమారుడయ్ని బేతరాజుకు తన కొమా త్తె౯ అయ్ని గణపాంబ్బికను యిచ్చి వివాహం చెళెగన్కు ఆ బేతరాజు కొన్ని దినములు ప్రభుత్వం చెశీ స్వగ్గ౯ లోకప్రాప్తుడు అయ్నిన తర్వాతను అతని భార్య అయ్ని గణపాంబ్బిక ప్రౌఢగనుక రాజ్యభారం వహించ్చి ప్రభుత్వంచెస్తూ చెశ్ని ధర్మములు. “స్వస్తి చతుస్సముద్రముద్రిత నిఖిల వసుంధరా పరిపాలిత శ్రీమత్రినయన పల్లవ ప్రసారా సాదిత కృష్ణవేణ్యానది దక్షిణ షట్సహస్త్రావనీ వల్లభ భయులోభరుల౯ చోడచాళుక్య సామంత్త మదానెక పమృంగేంద్ర విభవ (వా) మరేంద్ర శ్రీమదమరేశ్వర దేవదివ్య శ్రీపాద పద్మా రాధక పరబల సాధక శ్రీ ధాన్యకటక పురహ (వ) రాధీశ్వర ప్రతాఫలంకేశ్వర కలిగడ (యొ) గడలేమి చెడువరరివకై గండ్ల గండ్డ రగండ్ల గండ్డభేరుండ్డ జగమెచ్చు గండ్డ నగ్నిమార్తాండ్డ నామాది సమస్త ప్రశస్త సహతం శ్రీమన్మహా మండలేశ్వరకోట గణపమ దేవంమ్మగారు" పృధివి సాంబ్రాజ్యము చేయుచునుండ్డి శాలివాహన శకవరుషంబ్బులు ౧౧౭౦ (1248 AD) అగునెడి సౌమ్య సంవత్సరమునాడు అమరేశ్వర శ్రీ మహదేవర విమానము? నంద్దు పెట్టిన... పైడికోట ఆంద్దగణపపురపువాడు అనంగ్గాను కట్టించ్ని యిండ్లు పండ్రెండు వీరికి బెట్టిన వృత్తులు వరంచెను యడ్మకుడియంద్దు నుంగాను బెట్టిన వెలిప్రొలము ఖ ౨౪ పుట్లు వీరికైన మంద్దలను గొల్లకుంట్ట వెనుకబెట్టిన మరుతులు ౬ వాడ్డూరివారి చెరువు వెన్కు బెట్టిన మరుతులు ౬ తమకు ధర్మపుగాను... సాన్నబడ్డత సెప్పిన యిండ్లు బ్రాంహ్మలకు బెట్టిన వెలిపొలము తక్కెళ్లపాటి బెట్టిన చేను ఖ ౧౨ పండ్రెండు యిప్రకారం ధర్మములు జరిగించ్చి తదనంత్తరం యీ యనమదలకు వెంచ్చెశి బెతరాజునకు పుణ్యముగాను బెతెశ్వరదేవర ప్రతిష్ఠచెశి ఆ దేవరకు ఆంగ్గరంగ్గ భోగాధ౯మై

ఆ చంద్రాక్క౯ముగాను పూరు. అందులసానివార్కి బెట్టిన వృత్తులు వాచెకకు మాచకు ఖ ౨ మోకరి మాచ్చకకు ఖ ౧ న ౧౦ పాత్రశెతకు ఖ ౨ న ౧౦ పాత్రసూరుకు ఖ౨ న ౧౦ తగరం మశీకు ఖ ౧ న × బండ్డ సూరకు ఖ ౧ న ౫ ఖండ్డ లక్కిమకు ఖ ౧ న ౫ వాండ్ల మాచమకు ఖ ౧ న ౫ బొల్లమకు ఖ ౧ న ౫ జట్టలదెనకు ఖ ౧ న ౫ మల్లకవితకు ఖ ౧ లంజెనాగకు ఖ ౧ రెకమకు ఖ ౧ న ౫ న హవాళి నోమనకు ఖ ౧ న ౫ మద్దెలదామకు ఖ ౨ పేరుమాదిరె నాగకు ఖ గాన ౫ వెరశి ఖ ౨౩ న ౧౦ తూములు శాసనశ్లోకాలు చెప్పిన నరశింహ్వభొట్లు వుపాధ్యాయులకు బెట్టిన మరుతు ౧ వెలిపొలము ఖ యీ ప్రకారంగా బెతెశ్వరస్వామివారి అచక పరిచారిక మొదలయ్ని వినియోగములు చేశి వారికి వృత్తులు నిన్న౯యించ్చి మరింన్ని యీ స్తలమందే తమతండ్రి గణపద్దెవ మహారాజునకు నభివృద్ధి గాను గణపెశ్వర దేవర ప్రతిష్ఠచెశి ఆ దేవర అంగ్గరంగ్గ భోగానకు చంద్రాక్క౯ముగా నిచ్చిన వూరు చింతపల్లి ఆ వూరును గణపెశ్వర స్వామివారి గుడి సానివారికి బెట్టిన వృత్తులు మద్దెల కెతుకు ఖ ౨ న ౧౦ కవులు వీరమకు ఖ౦ న ౧౫ మోకరి మాదెక్కకు ఖ ౧ న ౧౫ గంగ్గమకు ఖ ౧౫ న రుద్రమ్మకు ఖ ౧ న ౧౫ యల్లవ్వకు ఖ ౧ న ౧౫ పాత్రిదెవప్పకు ఖ ౧ న ౧౫ పాండ్రనాచమకు ఖ ౧ న ౧౫ పాత్ర ఆదెమ్మకు ఖ ౧ పాకలమ్మకు ఖ ౧ భాగవతులవాల౯కు ఖ ౧ దుగ్గ౯ంగారి మల్లప్పకు ఖ ౧ పెద్ద మాచకు ఖ ౧ సహవాశి కోటయ భత్తునికి ఖ ౧ న ౧౦ తూములు యీ ప్రకారంగ్గా గణపెశ్వర స్వామివారి అచ్చ౯క పరిచారిక వెశ్యాధి జనంబ్బులకు వృత్తులు సమప్పి౯ంచ్చి తదనంత్తరం యీ స్థలమందు విష్ణు స్థలం కట్టించ్చి శ్రీ వేణుగోపాలస్వామివారిని ప్రతిష్ఠచెశి యీ స్వామివారి అంగ్గరంగ్గ భోగాధ౯మై ఆచ్చ౯క పరిచారికాది పరిజనంబ్బులకు కొంత్త మాగాని పొలముంన్ను ఖ ౮ యెన్మిది పుట్లభూమి యవనాళములు పండ్డె పొలముంన్ను సమప్పి౯ంచినది.

యీ ప్రకారంగ్గా పయిన వ్రాశ్ని స్వామి వాల్ల౯కు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవములు జరుగగలందుల్కు వెళ్ని ధర్మంబ్బులు శాసన స్తంభంబ్బులమీద లిఖింప్పజెశి కొన్ని దినములు ప్రభుత్వం చెశెను తదనంతరం శ్రీమన్మహామండలేశ్వర కోటదెవరాజు ప్రభుత్వం చేస్తూ బెతెశ్వరమహదెవరకు ఆచంద్రాక౯ అఖండ వత్తి౯ దీపములకు గంగ్గుల ప్రోలెబోయుడు మారిఫత్తున ౨౫ గోవులను వుంచ్చి నిత్యం మానెడు నెయ్యి యిచ్చే లాగ్ను నిన౯యించ్చినాడు. శాలివాహనం ౧౧౮౨ (1260 AD) శకం వర్కు నారపరాజు అతని తంమ్ములు, శెమ్మిరాయుడు మొదలయ్ని వారు బెతెశ్వర స్వామివారికి అఖండ వతి౯ దీపానకు గొర్రెకదువు పఖటి యనవెడ్లు ౨౧ మారెబోయెడు వడ్లబోయెడు మారిఫత్తున వుంచ్చి నిత్యంమూడు తవ్వలనెయ్యి చొప్పున పుత్రాను పౌత్రీకము యిచ్చెటట్టుగా నిన౯యించ్చి యెత ధర్మంబ్బులు శాసనస్తంభంబ్బులమీద లిఖింప చేసినారు.

సదరహి పయ్ని వ్రాశ్ని దెవస్థళాలకు తత్పూర్వం స్వస్తి శ్రీ శుభశకవరుషంబ్బులు ౧౧౬౩ (1241 AD) అగునేటి శార్వారి సంవత్సరాన స్వస్తి సమస్త ప్రశస్తంబైన శ్రీమతు ముత్త సానింగారి కాటమరెడ్డింన్ని వారి చెల్లెలు రెన్నసాని కొడుకు యర్రం గొమ్మ నాయుడుంన్ను వారి మరిది సూరపనాయుడుంన్ను శ్రీమన్మహామండ్డలేశ్వర కోటబేత రాజులకు ధర్మార్థముగాను రుద్రేశ్వర శ్రీమహదేవరను ప్రతిష్టచెత నైవేద్యానకు బెట్టినది నీరు నెలమరుతు ౧ వెలిచేను ఖ౹౩ రాఏవాగునతోట పదితూములు గణపమదేవులు యిచ్చినది నీరు నెలమరుతూ ౧ వెలిచేను ఖ౹౧ న ౧౦ తూములు శా ౧౨౪౦ (1318 AD) శకం వర్కు కుమార కాకతీయ రుద్ర దెవ మహారాయులువారి ప్రభుత్వం జరిగిన తర్వాతను రెడ్లు పరుసవేదివల్ల బలవంత్తులయి గిరిదుగ౯స్తల దుగ౯ములు నిర్మాణం చేసుకొని ఆరుగురు రెడ్లు నూరు సంవత్సరములు ప్రభుత్వముచెశిరి గన్కు అంద్దులో మొదటి వాడయ్ని ప్రొలయ వేమారెడ్డి ప్రభుత్వంచెశెటప్పుడు ములుగు వీరంన్న అయ్యవార్లు గారనే ఆరాధ్యులు వీరశైవాచారవ్రతసంపన్ను లయి వున్నంద్ను వీరు దక్షిణదేశం సంచారం వెళ్ళివుండి వొకానొక స్థలమంద్దు ప్రవీణులైన శిల్పులు వుండి వుండగా బహుసుంద్దరమయ్ని వీరభద్రవిగ్రహం నవమాస? పూరితంగ్గా మలిపించ్చి తమనివాస స్థళమయ్ని గ్రామంలో ప్రతిష్టచెశెటి కొరకు వఖబండిమీద(?) వుంచ్చుకొని తొలించ్చుకొని యీ యనమదల గ్రామానికు వచ్చినంత్తల్లో యిక్కడ నుంచి బండ్డిన కట్టిన యనప్పోతుముందు సాగివెళ్ళక బండ్డి అటకాయించెగన్కు అనెకె ప్రయత్నములు చెయ్యగా బండిసాగక పాయను గన్కు వీరంన్న అయ్యవార్లు గారు ఆదినం యీస్థళ మందు నిలిచి లింగార్చన జరుపుకొని ఆరాత్రి నిద్రించ్చగా శ్రీ వీరభద్రస్వామి వారు అయ్యవాల౯ గారి స్వప్న లబ్దముగా వచ్చి మాకు యీ స్థళమంద్దు నివశించ్చవలెనని అభిలాషవున్నది గస్కు బండి కదలకుండ్డ అట్కయించ్చినారు. నీవు యితరచింత్తమాని యీస్థళమంద్దె ఆలయం కట్టించ్చి నన్ను ప్రతిష్ట చెయ్యమని శల్వు యిచ్చినంత్తలో అయ్యవాలు౯ గారు చెప్పినది యెమంట్టే నెనురిక్త దశచాత వుండి బహుదేశం సంచారం చేస్తూ వున్నాను. అన్యస్థలమందు ద్రవ్యానుకూలం చెశి యెప్రకారంగా నెను ఆలయనిమా౯ణం చెయించనెర్తును అని దీనత్వంగా పలికే వర్కు మాయొక్క ప్రభావంపల్ల నుంచిన్నీ యీ స్థళమందు భూగతమైయున్న ద్రవ్యం నీకు దృష్టాం త్తంకాగలదని ఆనతిచ్చినారు. మరునాడరుణోదయాన తత్పూర్వమందె అయ్యవాలు౯ గారు స్నాన సంధ్యాధ్యనుష్టాన మతానుసరణ శివపూజ విధులు యధోక్త ప్రకారంగ్గా జరుపుకొని వీరభగ్రస్వామి విగ్రహమున్న ప్రదేశాన్కు వచ్చె వర్కు బండ్డికట్టిన రెండు యనుప్పోతులు రెండూన్నూ ఆ ప్రదేశమంద్దున్న మడుగులోపడి కారాడుతూవున్న సమయంలో భగవదాజ్ఞవల్ల రెండు గొలుసుల(చెరవము) వెర్వములు యనప్పోతుల కొమ్ములకు తగులుకొని వచ్చే గన్కు వీరంన్న అయ్యవాల౯ గారు గ్రామస్తులు పిలవసంపించ్చి యీ చరపములు (చెరవములు) రెండ్డుంన్నూ తీయించ్చి భద్రము చేసి ప్రోలయ వేమారెడ్డిగార్కి యెరుకచేసేవర్కు కొండ్డవీటి నుంచ్చి తక్షణమంద్దే యీస్థశాన్కు వచ్చినవారయి యీ స్వామివారియొక్క ప్రభావం విని బహు సంతోషించ్చితాను శైవాచార సంపన్నుడుగన్కు దృష్టమైన ధనం వ్యయం చెయించ్చి బండ్డి యెస్థలమందు నిలిచినదో ఆ స్థలమందు దెవాలయం కట్టించి భద్రకాళి సమేతంగా శ్రీ వీరభద్రస్వామివారిని వీరంన్న అయ్వవాల౯గారి చాతను ప్రతిష్ఠచెయించ్చి యీ స్వామివారిని పూజించ్చ డాన్కు వెలనాటి బ్రాంహ్మణులను నియమించ్చి ములుగు వీరంన్న అయ్యవాల౯గారికి యీ స్తళానకు స్థానాచార్యత్వంగ్గా నిన౯యించ్చి మరింన్ని యీ గ్రామమంద్దు పూర్వం కోటగణపమ దేవి ప్రతిష్ఠచెశ్ని శ్రీబెతెశ్వర గణపేశ్వరస్వామివాల౯కు సకలోత్సవములు జరిగించ్చెటట్టు పూర్వమర్యాడలు జరిగించ్చినవారై మరింన్నీ యీస్థళమందు క్రమేణ నూటయెన్మి దిశివాలయములు నిర్మాణంచెయించ్చి నూటయెన్మిది శక్తిస్థళములు కూడా ప్రతిష్ఠ చెయించ్చి సకలోత్స వములు జరిగిస్తూ ప్రభుత్వముచేస్తూ వుండ్డగా శ్రీ వీరభద్రస్వామివారు అనేకములయ్ని ప్రభావములు మహిమలు ఆగపరుస్తూ వుందురుగన్కు వకభక్తురాలైన శిల్పిస్త్రీ నవరరత్న స్థాపిత

మైన కీలులేసి (?) అంద్దె తనభర్త చాతచేయించ్చుకొని యీస్థశాన్కు వచ్చి శ్రీ వీరభద్రస్వామి వారి పాదం దగ్గర వుంచ్చి యిరువయి యెడు దినములు తనయొక్క భక్తి తాత్పర్యము తోటి ప్రాధ౯నచెస్తు శై వాగవములు విస్తరించ్చి జరిగిస్తూ నిరాహారియైవుంట్టూ వుండెగన్కు శిల్పికాంతయొక్క భక్తి తాత్పర్యములకు ఆనందించి శ్రీ వీరభద్రస్వామివారు సాక్షాత్కరించ్చి నవరత్న స్థాపితమయ్ని ఆంద్దె తన యొక్క పాదమున తొడగినారు. యీ యొక్క అంద్దె స్వామివారి పాదముంద్దు ప్రకాశిస్తూ వుండ్డగా దక్షిణ దేశమునుంచ్చీ వక శివభక్తుడు వీరభద్ర స్వామివారి యొక్క మహాత్యంవిని యనమదల గ్రామములోనికి వచ్చి స్వామివారి యొక్క ఆలయం ద్వారం యదుట నిలుచుండ్డి ఆడది తొడిగించ్ని అంద్దె స్వామివారి కాలియందుండ నిచ్చెనా అని ప్రతిజ్ఞలు పలికి తనయొక్క భక్తి రసంచెతను స్వామివారిని ప్రార్థనచెసి అందె విడువమన్నాడు గనుక భంగున పాదము దప్పళించి ఆ జంగం యొక్క కక్షపాలలో పడెటట్టుగా చేసినారు. యిటువంటి ప్రభావములు బహుశా జరిగినవి అని చెప్పినారు —

శా ౧౩౪౦ (1418 AD) శకం వర్కు రెడ్ల ప్రభుత్వం జర్గినతర్వాత గజపతివారు ప్రభుత్వాన్కు వచ్చి శా ౧౪౩౬ (1514 AD) శకంవర్కు ప్రభుత్వంచేస్తూ వుండ్డగా నరపతి సింహాసనస్థుడయ్ని శ్రీమద్రాజాధిరాజపరమేశ్వరులయి కృష్ణదేవమహారాయులు పూర్వద్విగ్విజయాత్రకు విచ్చేసి గిరిదుగ౯ స్తలదుగ౯ములు సాధించ్చి శా ౧౪౩౭ (1515 AD) శకమంద్దు ప్రతాపరుద్ర గజపతి కొమారుడయ్ని వీరభద్ర గజపతిని పట్టుకొని కొండ్డవీటి దుగ౯ంపుచ్చుకొని సింహ్వాచలపర్యంతం దేశములు సాధించ్చి జయస్థంభములు సంస్థా పించ్చి నిజరాజధానికి వెళ్లి వృథివీసామ్రాజ్యము చెయుచుండ్డగాను స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు ౧౪౫౩ (1531 AD) అగునెటి నంద్దన సంవత్సర భాద్రపద శు ౧౦ సోమవారంనాడు రాయను అయ్యవారు కొండ్డవీటి శింహ్వాసనము పాలెంచెగాన ఆయన సెవకుడు చినబొమ్మనాయుడు శ్రీ వీరేశ్వరునికి ప్రాకారముఖమంట్టపములు సమపి౯ంచెను—

శ్లో: శాకాబ్దేత్రి శరాబ్ది సోమన హితశ్రీ నందనా ఖ్యే
సమేగ్రామే యన్మడతీ ప్రశిద్ధ మకరోత్ కీతి౯
ప్రతాపోదయా శ్రీ మంన్మల్లయ చిన్ని బొమ్మ
నృపతి శ్రీ వీరభద్రేశితుః ప్రాకారముఖమంటపం (చ)
పరివృతః ప్రాకారమాతారకం ౹ (యిందుకు పద్యాలు) —

శ్లో: శాకాబ్దేత్రి శరాబ్ది సోమన హితశ్రీ
నందనాబ్యే సమే గ్రామ యన్మదలే
ప్రసిద్ధ మకరోత్ కీర్తి ప్రతాపోద
యాత్। శ్రీమన్మల్లయ చిన్ని బొమ్మ
నృపతిః శ్రీ వీరభద్రేతితుః ప్రాకా
రం ముఖమంటపంచ్చ పరితశ్చాకార
మాతారకం :-

అర్థము : శాలివాహనశకము 1453వ సంవత్సరమునాటికి సరియగు చాంద్రమాన నందననామ సంవత్సరమందు కీర్తి ప్రతాపోన్నతుడైన 'చిన్ని బొమ్మ' అను ప్రీతినామముగల రాజు యన్మదల గ్రామములోని వీరభద్రస్వామివారికి ప్రీతిగ- అనగా నా దేవాలయమునకు ప్రాకారము ముఖమండపము నందముగా నుండునట్లును ఆ యనమదల ప్రసిద్ధి నడయు నట్లు గావించెను)

సీ॥ గుణబాణగతి చంద్రగణనంబు శాలి
వాహనశక వర్షంబుల వనియందు
బరుగు నందన భాద్రపద శుద్ధ దశమిని
సోమవారమునాడు ప్రేమతోడ
యనమదల వీరంన్న కిరువుగా బ్రాకార
మును భోగరాగంబులనువు పరిచి
గణనాధుడయ్యప్పదండనాయకునకు
పుణ్యంబు కానని బుధులు పొగడ

తే॥ తారకమందార శారదాభ్ర
తు హీన హిమకర విఖ్యాతి సహరహంబు
గెలుచు సత్కీర్తి ధనముగా మెలగనేర్చు
మల్లనరనాధు చినబొమ్మ మనుజవిభుడు

(ఈ పై శ్లోక భావమే యీ సీసపద్యమున నిమిడ్చెను. ఇందలి విశేషము—— నందన నామ సంవత్సరపు మాస పక్ష-తిధి-వారములు ఇందు చెప్పబడినవి.)

సీ౹౹ గుణబాణగతి చంద్ర గణనంబు శాలివా
హన శకవర్షంబుల వనియందుఁ
బరగు నందన భాద్రపద శుద్ధదశమిని
సోమవారమునాడు ప్రేమతోడ
యెన్మదల్ వీరన్న కిరవుగాఁ బ్రాకార
మును భోగరాగంబులనుపు పణచి
గణనాధుఁడయ్యప్ప గఁడనాయకునకుఁ
బుణ్యంబు కాయుని బుధులు పొగడ

తే॥ తార తారకమందార శారదాభ్ర
తుహిన హిమకర విఖ్యాతి నహరహంబు
గెలుచు సత్కీర్తి ధనముగా మెలగ నేర్చు
మల్లనరనాధు చినబొమ్మ మనుజ విభుడు.

తా॥ శాలివాహనశకము 1453నకు సరియగు నందన నామ సంవత్సర భాద్రపద శుద్ధ దశమి సోమవారమునాడు యనమదల గ్రామములో నున్న వీరభద్ర దేవునకు ప్రీతిగా - ప్రాకార మును గట్టించి-భోగములకు స్థిరాస్తి నప్పగించి- అయ్యప్పయను సేనాపతికి పుణ్యము గలుగవలెనని - వెన్నెల - శంరన్మేఘము - మంచుకొండవంటి స్వచ్ఛమైన కీర్తి గల చిన బొమ్మ రాజు (ఇంటి పేరు మల్లనాధుని) సత్కీర్తితో మెలగెను ——

యీ ప్రకారంగ్గా చెశ్చి వారయి యెతద్ధర్మంబులు శాసనస్తంభంబుల మీద లిఖింప జేసినారు:)

పయ్ని వ్రాశ్నీ శ్రీకృష్ణరాయులు అచ్యుతరాయులు వారి ప్రభుత్వములు జరిగిన తర్వాతను స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబ్బులు ౧౪౬౫ (1543 AD) అగునేటి సాధారణ నామ సంవ్వత్సర ఆషాడ శు ౧౫ (15) సోమవారానను శ్రీమంన్మహా ముద్దలెశ్వర శ్రీమన్మహా రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీర ప్రతాప సదాశివ దేవమహారాయులు విద్యానగరమంద్దు రత్న శింహ్వాసనారూడులయ్ని పృధివీ రాజ్యము శెయుచుండ్డగాను శ్రీమన్మహామండలేశ్వర మూతి౯ రాజులుంగారి పుత్రులయ్ని రామరాజయ్య దేవ మహారాజులు గారికి పాలించనవు ధరించ్ని కొండ్డవీటి రాజ్యములోను యనమదల కరణాలు కాపులు మంగ్గళగిరి స్వామివారి సాక్షిగాను ఆంజనేయులకు పుట్టెడు క్షేత్రము సమపి౯ంచిరి. తదనంత్తరం పయిన వ్రాశ్ని సదాశివరాయులు రామరాయులు శ్రీరంగ్గరాయులు వారి ప్రభుత్వం శా ౧౫౦౦ (1578 AD) శకం వర్కు జర్గిన తర్వాతను మొగలాయి ప్రాభల్యమాయను గనుక మలికి విభురాంపాడు శహావారి తరపున ఆమీలు ముల్కి యీ దేశాన్కు ప్రభుత్వాన్కు వచ్చి కొండ్డవీడు నగయీరాలలో వుండ్డె దేవస్థానములు పాడుచెయించ్చి మసీదులు చెయించ్చె గన్కు యీస్థలమంద్దు వుండ్డబడ్డఘువంట్టి దేవస్థలములు అన్నీ ఆద్యంత్త రంలో పాడు అయ్నివి. శ్రీవీరభద్రస్వామి శ్రీగోపాలస్వామి శ్రీ ఆంజనేయులు యీదెవలయములు బహుజాగ్రత్త స్థలములు గన్కు మేచ్చొపద్రవములు సంభవించ్చకుండ్డా కాపుదారీ చెసుకొంన్నారు. ఆ దినములలో బాహుబలేంద్రుడు అనే అతడు యీస్థలాన్కు ప్రభుత్వాన్కు వచ్చి యీగ్రామాన్కు ఆగ్నేయ భాగమంద్దు చెరువు తవ్వించ్చినాడు. యీ కొండ్డవీటి సీమ సర్కారు సంతు బంద్దేలు చెశెటప్పుడు యీ గ్రామం గుంట్టూరు సంత్తులో దాఖలుచెశి బహుదినములు సంత్తు అమీలు పరంగ్గా హయిదరాబాదు సుభాకింద్దను ఆమాని మామలియ్యత్తు జర్గించినారు స్న ౦౧౨౨ (1712 AD) ఫసలీలో యీ సర్కారు వంట్లుచెశి జామీదాల౯కు పంచిపెట్టి యడల యీ గ్రామం ముతు౯జాంన్నగరు సర్కార్లు దేశముఖి మ్న నెవారయ్ని రమణయ్య మాణిక్యరాయునిఁ గారి వంట్లులోవచ్చి రెపల్లె తాలూకాలో దాఖలు ఆయ్ని దిగన్కు రమణయ్యగారు మల్లన్నగారు సీతన్నగారు గోపన్నగారు జగ్గన్నగారు ప్రభుత్వముచెశ్ని తర్వాతను తత్పుత్రులయ్ని భావన్న మాణిక్యరాయునింగారు బహుధర్మాత్ములయి మంకు౻ మజుకూరిలో పుండుకున్న దెవబ్రాహ్మణ స్వాస్యములకు నిరాటంకంగా జరిగి ప్రభుత్వం చేస్తూ వున్నారు——

రిమాకు౯ గ్రామం గుడికట్టు కుచ్చెళ్లు ౨౦౦
కిమ్నిహాలు
౪ ౦ గ్రామకంఠాలు ౫ కి
౨ కసుపా గ్రామకంఠం

యనమదల

b 2 10 ooCo 3 చెరువులు ౧౫ కి o 0 O 0 0 10 6 6 1 • | 2. w ది తిక్కిరెడ్డి పాలెం బుర్రావారి పాలెం కలువారిపాలెము మాలపల్లెలు మాదిగపల్లెలు 2... బాహుబలెందృడు అనే వడ్డిరాజు వెయించి, చెరువు ౧కి. రాజాభావ నారాయణరాయునిఁగారు వెయించిన చెరువు ౨ కి. తిర్గి జంగంన్నా మాణిక్యారాయినింగారు వెయించి చెర్వుగా కి. కాలినాయుడు వెయించి చెరువు కి. బుర్రా పాపప వెయించి చెదువు కి. దండమూడి అక్కెన్న వెయించి చెరువు కి. నిలివాడు వేయించి కుంటకి. వెంక్కట కుంట్ట కి. వనం తోటలు ౫ క్రీ. మద్దన బోయనికుంట్ట ౧కి, గొల్లపూడి పురుషోత్తముడు వెయించి కుంట్ట ౧' కంసాల వీరప్ప వెయించి చెరువు కి. 63 వుమ్మెత్తల కృష్ణమ్మగారు వెయించి చెరువు ౧ కి. ముప్పాళ్ళ అమ్మినీడు వెయించి చెరువు కి. గుత్తవారి కుంట్ట ౧కి. యనమడల వెంక్కసాని తోట ౦ కి. దఁడ్డమూడి అక్కన్న తోట ౧ కి. మర్రి వెంక్కటాద్రి తోట ౧కి. కాలి అక్కన్న తోట ౧ కి. ముప్పాళ్ళ అమ్మినీడు తోట కి డొంక్కలు ౫ కి. గుఁట్టూరునుంచి వినికొండ వొంగవోలు పొయ్యే డొంక్కలు ౨ కి. 64 ౦ ౦ కాలివారి పాలెపు డొంక్క బుర్రావారి పాలెపు డొంక్క తిక్కిరెడ్డిపాలెపు డొంక్క G oo OCC QUO b coc 2 u - o 60 గ్కా తతిమ్మా ౮౩ 4 కి యినాములు. శ్రీ వీరభద్రేశ్వరస్వామి వార్కి యినాం మెట్ట ౦ మాగాణి వేణుగోపాలస్వామివార్కి యినాం మెట్టపొలము • । ౦ మాగాణి పొలము గ్రామ కై ఫీయత్తులు ఆంజనేయస్వామివార్కి యినాం మెట్ట వడ్ల కమ్మలజుకు 4 అకలంక్కం వెంక్కటాచార్యులగార్కి దెంద్దుకూరి బ్రంహ్మావధానులు రాచకొండ వీరంన్న అంబ్బటిపూడి పురుషోత్తమావధానులు దెంద్దుకూరి వీరావధానులు నోగి లక్ష్మీపతి సోమయాజులుగార్కి పిఁగ్గశి బుచ్చయ్య కవీశ్వరుడు కవుతా నరసింహులు o 4 o గుడిమెళ్ళ కొండమాచార్యులు భాగవతుల రామకవిగారు ? చివుకుల నరసింహ శాస్త్రులుగారు అకలంక్కం అనంతాచార్యులు అయ్యవాల గారు శీంన్నం పాపయ్యగారు యనమదల వెంక్కసాని కళావం తిని కాలి అక్కన్న చర్వు యినాం దండ్డమూడి భగవాన్లు చెరువు యినాం రావూరి బుచ్చన్న చెరువు యినాము బొర్రముత్యాలు యనమదల ౦ ౦ గొల్లపూడి పురుషో త్తముని చెరువు యినాము మంన్నాల కామయ్య మన్నాల పరివెళి సోమయాజులు గ్రామ పురోహితులు రాజ పౌరోహితులు C 2 。 (?) గ్కా తతిమ్మా ౧ ఓouo రాజా భావన్నా మాణిక్యారాయునిం గారి సావరం గ్కా తలింమ్మా కెరి ౧౪౦౦ కయిఫియ్యతు మొరతుజా -- 85 ఆ స ౧౮౧౨ (1812 A.D.) సంవత్సరం - ది ౨3 (28) నెపంబ్బరు. ఆంగీరస నామ సంవ్వత్సర కాతికొక బహుళ ౫ (5) సోమవారం.