గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/పోతూరు

వికీసోర్స్ నుండి

పోతూరు గ్రామ కైఫియ్యతు

యాదాస్తు మవుంజె పోతూరు పాతికె కుంట్ట పర్గణె వినికొండ్డ

తాలూకె రాజా వాశిరెడ్డి వెంక్కటాద్రినాయుడు

యీ గ్రామం చాలా కైఫియ్యతు వుంన్నది. అని విని రెండ్డు దినములు వుండ్డినాము. కరణాలు సర్కారుతో జమా మంజూరి చేశి దండ కవిలెలు అగుపించ్చి లెదు గన్కు అక్కడ వుంన్న శాసనములు మాత్రం వ్రాశినాము

(చిత్తగించ్చవలెను. ) స్వస్తిశ్రీ శకవరుషంబ్బులు ౧౩౧౨ (1890 A.D.) అగునెటి ప్రభవ సంవత్సర శ్రావణ బ౮ జయవారం జయంత్తి పుణ్యకాలాన మానూరి కొండ్డమ నాయునింగారు తమ తల్లి దండ్రులకు పుణ్యముగాను శ్రీ పూనూరి మదన గోపాల స్వామి వారికి అంగ్గ రంగ్గ వైభవము కుంన్ను ధారభోశి పూనూరి పొలములొను చోడయేశ్వరి పరంగ్గాను పెట్టిన క్షేత్రం భ ౪ న ౧౦ యిండ్కు వంక్కాయలపాటి తెరవుచేను. నక్కవాగు తెరపుచేను. ఊచకుంట్ట తెరవుచెను పాలూరి తెరవు తూపు౯చేను. పాలూరి తెరువున పడమటి చేను. యిదువుల పాటి తెరవు దక్షిణం చెనుంన్ను, నూతల పాటి తెరవు దక్షిణం చెను రెండు సమపి౯ంచ్చిరి. తింమ్మపోతు రాయునింగారికి మండ్డపములు సమపి౯ంచ్చిరి

స్వదత్తా ద్విగుణం పుణ్యం
పరదత్తాను పాలనం
పరదత్తా పహరెణో
స్వదత్తా భీష్టఫలం పొతా

శ్రీ మన్మహామంగ్డలెశ్వర పూసపాటి గజపతి రాజుంగారు పూనూరి గోపాలస్వామికి ద్రోణాదుల యిడ్పులపాడు తెర్వు దక్షిణపు వయిపు తెరవుగాను భ ౧ తమ తండ్రి రామరాజుగారికి తమ తల్లి వెంక్కమ్మగార్కి పుణ్యముగాను ధారబోశి యిచ్చిరి. మరి భ ౨ చేను యిచ్చిరి.

స్వస్తి శ్రీ శక వరుషంబ్బులు ౧౪౫౧ (1529 AD) అగునెటి సర్వ భౌమనామ సంవత్సర పుష్య బ 3 ఆదివారం శ్రీ త్రిపురాంత్తక లింగ్గమ్కు దేవళం ప్రతిష్ట చెశి తమ తండ్రి మారినెడి కిన్ని త్మ తల్లి శింగ్గసానికిన్ని పుణ్యముగారు మంట్టపములు కట్టించిరి.

ప్రజోత్పత్తి నామ సంవత్సర ఆషాడ బ ౬ గురువారం ది ౧౧ జులాయి ఆన. ౧౮౧౧ (1811 AD) సంవత్సరం. - మల్లయ్య వాలు