గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928/రామమోహన గ్రంథాలయము
స్వరూపం
రామమోహన గ్రంథాలయము.
ఘంటసాల, కృష్ణాజిల్లా.
ఈ గ్రంథ్హాలయము చాలకాలమునుండి పనిచేయుచున్నది. కాని ధనములేమిచే తృప్తికరముగా పనిచేయజాలకున్నది. కొంతకాలము క్రిందట యీ గ్రామసహకారపరపతిసంఘమువారి యాజమాన్యమున నిర్వహించుటకు తీసికొనబడినది. దీని లోకలు కోఆపరేటీవుయూనియనువారు యీ గ్రంథాలయమునకు రెండువందల రూపాయిలు విరాళ మిప్పించవలసినదిగా ప్రభుత్వవారికి సిఫార్సుచేసినారు.