Jump to content

గోలకొండ కవుల సంచిక/ఆత్మకూరు సంస్థాన చరిత్ర

వికీసోర్స్ నుండి

ఆత్మకూరు సంస్థాన చరిత్ర.

ఈ కడపటి రాజులుంగారు చనిపోయి 84 సంవత్సరములయ్యెను వీరి ధర్మపత్ని శ్రీమంతు సవై రాణీ భాగ్యలక్ష్మమ్మ బహద్దరుగారు యిప్పుడు రాజ్యము చేయుచున్నారు.

ఈ సంస్థాన మూలపురుషులగు గోపాల రెడ్డిది మొదట తిరుపతి ప్రాంతపు చంద్రగిరి యనునగరము. రుద్రమ దేవి సామంతుఁడగు గోనబుద్ధారెడ్డి తిరుపతియాత్ర చేసినపు డీగోపాలు రెడ్డి వారికి సపర్యలు చేసెను. వీరిని బుదా రెడి తన రాజధానికి శా. శ. ౧౨౦ లో పిలిపించి మఖల నాడ గౌడరికమిచ్చెను. ఇతని యనంతరము చిన్న గోపి రెడ్డి శా. వినాశి పరగణాలు పంచుమహల్ తాలూకా, సర్నాడగౌడివత కాట భూప తీసనదుమూలమున పొందెను. క్రీ.శ. ౧౩౦రలో ప్రతాపరుద్రుని తోగ్గాకు కొడుకు జయించెను. తదనంతరము బహమనీ రాజ్య స్థాపనమయ్యేను. అప్పుడు అల్లావుద్దీన్ హసన్ గంగూ బహమనీపై రాజారాం అనువాడు తిరుగు బాటు చేయ గోపిరెడ్డికి వానిని బట్టుటకై తాకీదయ్యెను. ఆప్రకార మొనర్చు టచే ఫిరోజు గడునకు సంబంధించిన సర్కారు ముజఫర్నగర్" పరగణాలో కడెచూరులో నాడగౌడు సర్నాడగౌడు, దేశముఖ దేశపాండ్యాగిరి, దేశా యిగిరి మున్నగు రుసుములు వీరికిననదుద్వారా యియ్యబడ్డారు. వీరియనం తరము చంద్రారెడ్డి క ఏండ్లు రాజ్యము చేసెను. వీరే కురుమూర్తి దేవాల యము కట్టించిరి.

రెండవ గోపి రెడ్డి కాలములో గోలకొండ రాజ్యము అభివృద్ధికివచ్చెను. అప్పుడు అబ్దుల్లా కుతుబుషా చేయుచుండెను. ఆకాలములో గుణ రాజ్యము ముగడ్డ దుర్గమును గోపాలరావు అనునతడు స్వాధీనపరచుకొని తిరుగు బాటు చేసినందున సుల్తానుయాజ్ఞపై గోపిరెడ్డి యతనిఁబట్టుకొనెను. ఈపనికై వీరికి ముచ్చింతల అల్లిపురము అను జాగీర్లనిచ్చి పాన్సద్ (800) మన్సిబ్ దారీ ౨౦౦ సవార్లు ఉంచుకొనుటకు సెలవయ్యెరు. ఇతని కిద్దరు కొడుకులు వారు తమ జాగీరు భాగించుకొనిరి. గోపి రెడ్డి భాగమునకు అమరచింత వడ్డెమా నులు వచ్చెను, సాహెబు రెడ్డికి కడే చూరు, మగల వచ్చెను.

గోపిరెడ్డి యనంతరము శర్వారెడ్డి హి. ౧౦౯ర లో రాజ్యము చేసెను. తర్వాత రెండవ సర్వారెడ్డి ఔరంగజేబు కాలములో రాజ్యమునకు వచ్చెను. ఆకాలములో అలంగీరు సేనాని రాయచూరు మీదుగా సైన్య ముతో పోవుచుండ నతనికి సర్వారెడ్డి సాయపడెను. తత్ఫలితముగా వీరికి

VII

గోలకొండ కవుల సంచిక

మొత్తము తాలూకాను ఓం వేలకు గుత్తకిచ్చి దుప్పల్లిగ్రామము జాగీరు గానిచ్చి జుడా, నగార, 800 సవార్లు మున్నగు రాజచిహ్నము కొన సనదియ్యబడెను.

తిమ్మారెడ్డి కాలమువరకు పీష్వాల అధికారము ప్రారంభమయ్యెను. 'జా చంద్రసేన జిలేదారు పీష్వాల యాజ్ఞచే నీ దేశమువచ్చి తిమ్మా రెడ్డికి హి॥ ౧౧౨౦ లో అమరచింత, వడ్డెమాను పరగణాల మా. ఓం వేలకు గుత్తకిచ్చి *నపేర చంద్రగడము, తన భార్యపేర ధర్మపురము అనుగ్రా మములఁ గట్టించి వాని దేశముఖీ మున్న గురుసుములు వీరికేయిచ్చిపోయెను

రెండవ సాహేబు రెడ్డి కాలమువరకు ఆసఫ్లాహీ ప్రభుత్వము స్థాపింప బడెను. హి. ౧౧౩౬ లో ఆసఫ్ జాహీ కర్ణాటకముపై దండెత్తి పోవుచుండ సాహెబు రెడ్డి వారికి సాయపడినందున వారికి నవై రాజా బిరుదమును నిచ్చి పూర్వ సనదులు ఖాయపరచిరి.

తర్వాత వేంకట రెడ్డికి హి ౧౨౩ లో సికిందర్జా దర్శనమబ్బెను. వారికి అనురచింత, వడ్డెమాను పట్టీల సనదులను రాజా చందూలాలుగా రిప్పించిరి. ఇతని కాలమందే తిప్పుడుంపల్లెనుండి ప్రకృతపు ఆత్మకూరునకు రాజధాని మార్పబడెను.

రాజా సోమభూపాలరావుగారికి హి. ౧౨౨౬ లో సిరాజు చౌలా సిరాజుదౌలా మంత్రి కాలములో రూ ౨౨౦౧ ల మాషుకు వర్థమాను అమరచింత పట్టీలను శాశ్వతముగా బిల్ మఖ్తగా సనదులియ్యబడెను. సర్ సాలార్ జంగు కాలములో నీ మొత్తము 20 వేలు చేయబడెను.

వీరి కుమారులు శ్రీమఁతు సవై రాజా సీతారామ భూపాలరావు బల్వంత్ బహదరు విరోధికృతు సంవత్సర ఆశ్వయుజ బహుళ పంచమినాడు జన్మించిరి. ఆజానుబాహువు. గంభీరాకారము. వీరాగ్రేసరులు. రాజ్యయిను మిక్కిలి బాగుగ పరిపాలించుచుండినవారు. అనేక విద్వత్కుటుంబములను తమ సంస్థానమునందు నివసింపఁజేసిన వారు. వీరు గుఱ్ఱపుస్వారియం దద్భుత శక్తీ గలవారుగానుండిరి. గురికాల్చుటయందు నిరుపమానులు. పెద్దపులులను వేటాడుటయందు అత్యుత్సాహ సాహసములు గలవారుగానుండిరి. వీరు తమ కాలమున ఉకుశలవాగునుండి అనేక కాలువలను తీయించినవారు లక్షరూపా యలను వ్యయము చేసి మహాసప్తాహమును తమ తల్లిగారి యాజ్ఞచే తమకు CF వ వయస్సున శుక్ల సంవత్సరముని చేసి తమ వంశమును తమసంస్థాన మును దిగంతములకు ప్రసిద్ధి జెందునట్లు చేసినారు. వీరు తమ జీవిత కాల

VIII

ఆత్మకూరు సంస్థాన చరిత్ర

మున విశ్వావసు సంవత్సర కార్తీక బహుళ సప్తమినాఁడు తమ కుమారులగు T·జా శ్రీరా మభూపాలు గారికి పటాభిషేక మొనరించి అదేకారి కబహుళ నవమినాఁడు పరలోకగతు లెరి

వీరి కుమారులు కీర్తి శేషులయిన శ్రీమంతు సవై రాజా శ్రీరామ భూపాలు బల్వంత బహదరుగారు అమరచింతాత్మకూరు సంస్థానము ౧౮౧౦ శా.శకమున సర్వధారి సంవత్సర అధిక చైత్ర శుక్ల పంచమినాఁడు వృశ్చికలగ్న మందు రాజా సీతారామభూపాల బల్వంత్ బహద్దరు గారివలన రామలక్ష్మ మ్మగారి గర్భాబియందు నావిర్భవించిరి. ఈరాజా శ్రీరామభూపాల్ బహ దరుగారు ఆంధ్రాంగ్ల ఫార్సీ భాషలను అభ్యసించి యుండిపో. మరియు శాంతి, శమ, దమ, వివేకాది గుణములచే కూడుకొని యుండెడి వారు. ఈ రాజా శ్రీరామభూపాలు బహవరుగారు విశ్వావసు సంవత్సర కార్తీక బహుళ సప్త మినాఁడు తమ తండ్రిగారగు శ్రీమంతు సవై రాజా సీతారామభూపాలు బల్వంత బహనరు అమరచింతాత్మకూరు సంస్థానాధీశుల యాజ్ఞ చే సింహాస నమున మూ ర్థాభిషిక్తులై ప్రసిద్ధిబొంది ప్రమోదూత సంవత్సర వైశాఖ బహుళ అమావాస్యనాడు పరిలోకమును జెందిరి.

పారీణురాలు, శ్రీమంతు సవైరాజా శ్రీరామభూపాలరావు బల్వంత్ బహదకుగారి పట్టపురాణీ శ్రీమంతు సవైరాణీ భాగ్యలక్ష్మమ్మగారు పతివ్రతా శిరోమణులు, దేవబ్రాహ్మణ భక్తి యుక్తలు, ప్రజాపాలనా న్యాయైకవిచక్షణలు, ధైర్య స్థైర్య సౌశీల్య చాతుర్యవినయాని సుగుణో వేతలు, విద్యావివేకయతలు, రాజనీతినిపుణు రాలు. ఈ రాణీట హదరు గారీట్టి వారైనందుననే హెచ్.ఇ.హెచ్. నిజాం ఉస్మానియా పాదుషా గారి ప్రేమధా రాప్రవాహ పాత్రులై ఫసలి ౧౯ర౩ లో భావసంవత్సర జ్యేష్ఠ శుక్ల పూర్ణిమనాఁడు అమరచింతాత్మకూరు సంస్థాన సింహాసనమునందు పటా భిషిక్తులయిరి. ఈ రాణీ బహదరుగారు ఖరసంవత్సర ఆశ్వయుజ శుక్ల షష్ఠి నాఁడు వృషభ లగ్న మందు, దోమకొండ సంస్థానాధీశులగు జస్వంత్ గారివలన రంగమాంబయొక్క గర్భశుక్తిముక్తా ఫలమై జన్మించిరి. వీరు చిన్నతనము ననే యనేక సత్కార్యములను, అనంతశయనము నేతు మొదలగు దక్షిణ యాత్రలను తమ పెనిమిటియగు రాజా శ్రీరామభూపాలు శ్రీరామభూపాలు ప్రభువ రేణ్యుల తోపాటు చేసిన మహాపుణ్యమూర్తులు. శ్రీవారి రాజ్యపరిపాలనములో రాజ్యభివృద్ధి సర్వతో ము ఖము గా నుండుగాత మని పర మేశ్వరుని ప్రార్థించుచున్నాము.

IX