గోన గన్నారెడ్డి/పరిచయం
స్వరూపం
ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల పరిపాలన ప్రముఖ స్థానాన్ని వహిస్తుంది. కాకతీయ చక్రవర్తులలో రుద్రమదేవికి ప్రముఖ స్థానం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమెకు కుడిభుజం లాంటి నాయకుడైన గోన గన్నారెడ్డి చుట్టూ కథ అల్లుకున్నాడు రచయిత అడివి బాపిరాజు. రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు ఆమెను భావి చక్రవర్తిగా ప్రకటించిన నాటి నుండి రాజ్యంలో ఎదురైన పలు తిరుగుబాట్లను రుద్రమదేవి ఎదుర్కొని ఆమె నాయకత్వాన్ని సుస్థిరం చేసుకునే వరకు కథను నడిపించాడు రచయిత. ఇందులో గోన గన్నారెడ్డిది చాలా కీలకమైన పాత్ర. ఇందులో అలనాటి తెలుగు చక్రవర్తుల ఆచారాలు, సాంప్రదాయాలు, జన సామాన్య పద్ధతులు, యుద్ధ వ్యూహాలు, రాజ్యపాలనా తంత్రాలు పొందుపరచబడ్డాయి.