గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు/ప్రస్తావన

వికీసోర్స్ నుండి

ప్రస్తావన


  • [1] "మా తెలుగు తల్లికీ మల్లి పూదండ

   మాకన్న తల్లికీ మంగళారరులు
   గలగలా గోదారి కదలి పోతుంటేను
   బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
  బంగారు పంటలే పండుతాయీ
  మురిపాల ముత్యాలు దొరలుతాయీ....."

గోదావరీ, కృష్ణా, తుంగభద్రానదుల పావన జలాలతో పునీతమౌతున్న తెలుగునేల ఒకనాదు వెలనాదు, వేంగినాదు, సప్పినాదు, ములికినాదు, పల్నాడు, పాకనాడు, పొత్తపినాడు, కమ్మనాడు మొదలగు నాడులుగా విభజింపబడింది. స్వతంత్రావతరణనాటికి అది వేర్వేరు ప్రభుత్వాల క్రింద, ఆంధ్ర, తెలంగాణా, అని రెండుగా విభజింపబడివుంది. బ్రిటిషువారి మూసలో చ్రిత్రకారులు సర్కారులు, రాయలసీమ, తెలంగాణా అని మూడు ప్రాంతాలుగా విభజించి పరామర్శించరు. సాహిత్యకారులు తమ కావ్యాలలో రాయలసీమ, పలనాటిసీమ, వెలనాటిసీమ, నెల్లూరుసీమ, గుంటూరుసీమ, దివిసీమ, కోనసీమ, కళింగసీమ వగైరా పేర్లతో ఆయా ప్రాంతాలను పేర్కొనడంతో సీమల పేరుతో మరొక ప్రాంతీయ విభజన కనిపిస్తోంది. ఇంతకీ ఎవరు ఎలావిభజనచేసినా మొత్తంగా--

"తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణా నాది
రాయలసీమ నాది
నెల్లూరు నాది
సర్కారు నాది
అన్నీ కలిసిన తెలుగునాడు
మనదే మనదే మనదే"

అన్న సి.నా.రె. గీతం యీ జాతికి వేదం. అంతా తెలుగుసీమ అనేది యీ పూలదండలో దాగున్న దారం.

"వేదంలా ఘోషించే గోదావరి"
అమరధామంలా శోభిల్లే *రాజమహేంద్రి"

అనే ఆరుద్ర పాటలోని గోదావరై ఘోష ఆ తల్లి తన స్తన్యమిచ్చి పండించే ధాన్యరాసుల ధనాగారమే.


  • In the Map South Asia in the Age of Ghazna vids. Cahamanas, Later Chalukyas and Cholas C 9075 - 1200 (Page 32 plate IV -2) Rajahmundry, the present name is identified as 'Rajahmahendri '.

The Map South Asia in the time of Khalgis and Tuglags, C 1290-1390 is showing Rajahmunmdry as Rajamahendri Page 38 and V 2.

In the map South India C, 1390-1485 Rajahmundry is appearing as Rajimahendri (page 38 Plate V- 3 CC)

In the map South India C.1485- 1605. also following the suit stating Rajahmundry as Rajamahendri (Page 40 plate V 4 CC).

In the Map Religious and Culturl sites C. 1200 - 1525, Rajamahendri, in the place of Rajahmandry, is pointed and underlined showing its due importance page -1, plate V-5 (A)

The Map Northern South Asia during the Reign of Akbar 1556-1605 is also bearing the evidence of Rajamahendri (Page 44 plate V I A I CC)

In the Map South Asia during the reigns of Jahangir, Shajahan and Aurangajib 1605-1707 Rajahmundry could be seen as Rajamahendri Page 46 plate VI A-3 (A)

( A Historical Atlas of South Asia edited by Joseph E. Schwarzberg and published nby the Univeresity of Chicago and London. 1978)

బెంగుళూరు నుండి రాజమండ్రి రైల్వేటికెట్లపై యీనాటికీ హిందీ, కన్నడ భాషలలో 'రాజమహేంద్రి ' అనే ఉంటుంది.

మద్రాసు మ్యూజియంలో ఉన్న క్రీ.శ. 1001 నాటి తామ్రశాసనంలో 'రాజమహేంద్రి ' అని వ్రాయబడింది.

1802 నుండి 1859 వరకు 'రాజమహేంద్రి ' కేంద్రంగా 'రాజమహేంద్రి ' జిల్లా వుండేది.

అనంతరకాలంలో ఆంగ్లభాషా సంపర్కంతో ఉచ్చారణ సౌలభ్యంకోసం రాజమండ్రిగా మారి ఉంటుంది. నాసికాత్రయంబకం దగ్గర పుట్టిన గోదావరి ఉరవళ్ళు పరవల్లతో కొండలూ, పర్వతాలూ, లోయలలో స్వేచ్చా విహారం చేస్తూ, మంజీరా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావరి, శబరి వంటి చెలికత్తెలల్ జత కూడిజలకాలాడుతూ జలపాతాలూ, సెలయేళ్ళూ, నదీనదాలను దాటుకుంటూ తొమ్మిదివందల మైళ్ళు సుదూర్ యానంచేసి నిత్య యవ్వనంతో వయారాలొలికిస్తూ అందెల రవళులతో చిందులు వేస్తూ పరవశంతో సాగర ప్రియునిచేరే యీవడతిసోయగం అంతర్వేదివద్ధ ఒక మనోహర మధుర మంజుల సుందర్ దృశ్యం. ప్రజాశిల్పి కాటందొర క్రీ.శ.1852 ప్రాంతంలో ధవళేశ్వరుని సన్నిధిలో యీ నదీమతల్లికి ఆనకట్టకట్టి, ఆయ్హకట్టలేర్పరచి గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం ఛేశారు. ఆ స్వర్ణ భూమియే నేటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు. ఈ ఉభయ గోదావరి జిల్లాలను గోదావరి సీమగా పరిగణిస్తూ యీ పరిశోధన ఆ ప్రాంతానికి పరిమితం చేయడం జరిగింది.

అదిగో కొండలతో, కోనలతో, రాళ్ళతో, రప్పలతో కీకారణ్యంలావుండే యీప్రదేశం ధవళేశ్వర వారధితో దేశానికి గొప్ప ధాన్య్హాగారమయ్యింది. ఇక్కడ గోదావరి గౌతమి, వశిష్ట, వైనతేయ, దుల్య, ఆత్రేయ, భరద్వాజ, కౌశికి అనే ఏడుపాయలుగా విడి సప్తసాగరంగా పిలువబడుతూ ఇరుజిల్లాలను చుట్టుముట్టి పంటకరువూ, నీటి కరువూ లేకుండా బంగారు సీమ చేసి అన్నపూర్ణలా అందర్నీ ఆదుకుంటోంది. (కోపమొస్తే అది వేరే సంగరనుకోండి: అయినా అది తల్లికోపమే)

వేషంలో, భాషలో యిక్కడి ప్రజల తీరు సౌమ్యమైనది, ప్రసన్నమైనది. ఇక్కది ప్రకృతి సహజ సౌందర్యసుగుణాలరాశి. కళింగసీమలో "ఎల్లిపౌచ్చుండు" అంటే తెలంగాణాలో "వొచ్చిండు" అంటే, యిక్కడ "వచ్చాడు" అని వాడుక. అయినా

"వచ్చిందన్నా వచ్చాడాన్నా
వరాల తెలుగు ఓకటేనన్నా"

అనే సి.నా.రె. మాట అక్షర స్దత్యం.

ప్రజల్లో ప్రచార సాధనాలైన సినిమాలూ, పత్రికలూ గోదావరిసీమ భాషనే వాడుతున్నారు. గనుక యుదే ప్రామాణీక భాష అనడం సరికాదుగాని సర్వులకూ అర్ధమయ్యే నుడికారం యిందులో ఉంద్ని ఒప్పుకోక తప్పదు. శ్రీకాకుళం నుంచి పాయికారావుపేటవరకు వచ్చిన మాట తుని దగ్గర ఒక్కసారిగా మారిపోతుంది. రవికలేని చీరకట్టు, ముఖాన పెద్ద బొట్టు, చెవికి పోగులు, ముక్కుకాడవిడిచి రవిక తొదుక్కుని చీర సింగారించుకొని చిన్నబొట్టుతో చెవికి కమలాలు, ముక్కుపుడకలు ధరించి శారద్రాత్రి వెన్నెలలో ప్రవహించే గోదావరి మాతలా నిర్మలంగా సాగిపోతుంది ఏలూరువరకూ. ఏలూరు దాటిన దగ్గర నుంచి కృష్ణావాసుల నడికట్టు వేరు. మాటలో విసురు, వాడుక మాటల్లో భిన్నత్వం ఖచ్చితమైన వైవిధ్యాన్ని సూచిస్తాయి. గోదావరి జిల్లాల్లో ఉప్పట్టి అనే ఆటను యిక్కడ చెఱ్ఱాట అంటారు. ఆ పైన గుంటూరు వారిది కారంతీరు. ఇలాజిల్లా జిల్లాకు ఎంతోకొంత భిన్నత్వం కనిపిస్తుందిగాని ఉభయ గోదావరి జిల్లాలలో మాత్రం ఆటల్లో, పాటల్లో, మాటల్లో, చేష్టల్లో, వేషంలో భాషలో వీసమెత్తు తేడాకూడా కనిపించకుండడం విశేషం. ఏవో కొద్దిపాటి పట్టణాలు తప్ప యీ ప్రదేశమంతా పల్లెలమయమే. ఈ పట్టణాలుకూడా ఎక్కువభాగం పల్లె వాతావరణాన్నే ప్రస్పుటింపజేస్తాయి. ప్రస్తుత విషమైన జానపదకళలు, క్రీడలు, వేడుకలు విజ్ఞానతృకములు, వినోదాత్మకములు, ఆరోగ్య సందాయకములు, సంఘ శ్రేయ:కాములు. ఒకనాడు మూడు పువ్వులూ, ఆరుకాయలుగా జనజీవనంలో అంతర్బాగంగా అల్లుకుపోయి జ్వాజ్వల్యమానంగా వెలుగొందాయి. వీని విలువలు సమాఅజంమీద ఎన్నితరాలైనా తరగనివి చెరగనివి. అందుకే నేటి నాగరికులు వీనిని ఎంతొనక్కి నెట్టుతున్నా ఏదోలాగ బయటికొస్తూ వారికి తెలియకుండానే వారిలో కూడా ప్రవేశిస్తూ తమ ప్రతిభనూ ప్రజ్ఞనూ అవిచ్చిన్నంగా ప్రకటించుకుంటూనే ఉన్నాయి. దీనికి కారణం యీవిజ్ఞానం సమాజం మీదనేసుకున్న ప్రగాఢమైన ముద్ర. ఇది వ్డివడనిది, ముడివిడనిది.

                             ===== 
  1. * శంకరంబాడి సుందరాచార్యులు