Jump to content

గీతాంజలి (ఆదిపూడి సోమనాథరావు అనువాదం)/గీతాంజలి కావ్యం

వికీసోర్స్ నుండి

గీతాంజలి.

1

అంతరహితునిగా నన్ను ♦ నలరఁ జేసి
మాటిమాటికి బోర్లించి ♦ మరల నూత్న
ప్రాణమును నింతు వీక్షుద్ర ♦ పాత్రయందు
నీకటాక్షుంబు చేత లో ♦ కైకనాథ!
కొండకోనల నీపిల్లఁ ♦ గ్రోవియందు
నూతనానందమధురసం ♦ గీతములను
నూఁదుచుందువు మిగుల వి ♦ నోదముగను
నీకటాక్షంబుచేత లో ♦ కైకనాథ!
అమృతకరముల నీవు న ♦ న్నంటఁ గానె
హర్షమునఁ బోంగి నామది ♦ యాపఁగాని
వాక్సుధాపూరములఁ గొల్పు ♦ వక్త్ర మందు
నీకటాక్షంబుచేత లో ♦ కైకనాథ!
కురియుచుందువు నాచిన్న ♦ కరములందె
యెంతకాలము చన్న న ♦ నంతవరము;
లెంతఁగురిసిన నవకాశ ♦ మిక నుండు
నీకటాక్షంబుచేత లో ♦ కైకనాథ!

2

పాడు మనునాజ్ఞ నీచేతఁ ♦ బడసినపుడు
గర్వభరమున నెద విచ్చు ♦ కరణిఁ దోఁచు;
నంత నాదృష్టి నీముఖ ♦ మందుఁ బఱుపఁ
గనుల నానందపూరముల్ ♦ గ్రమ్మి పాఱు.
జీవితములోనిద్వంద్వముల్ ♦ చెఱఁగి కరఁగి
యొక్క రమ్యశుభాకృతి ♦ నొంది యొప్పుఁ;
బక్షములు విచ్చుఁ బూజ్యభా ♦ వంబు పొదలి
యబ్ది దాఁటంగ నెగయు వి ♦ హంగమట్లు.
నదుగానంబు నీకు నా ♦ నంద మంచు
దేవ! నీసన్నిధిని నేను ♦ గేవలంబు
గాయకుఁడఁ గాని వే ఱేమి ♦ గానటంచుఁ
దేటముగ మదిలోపలఁ ♦ దెలియవచ్చు.
అల రెడుమదీయగీతప ♦ క్షాంచలమున
నందగాఁ గాని నీదుపా ♦ దాబ్జా మంటి
గానరస మాని మది చొక్కుఁ ♦ గాంచియుంట

విభుఁడ వగునిన్ను సఖుఁ డని ♦ పిలుతు మఱచి.

3


ఎట్టిదో నాథ! నీగాన ♦ మే నెఱుంగ;

నిరత మాలింతు నాశ్చర్య ♦ భరితుఁడగుచు;

నీదుగానంబు వెలిఁగించు ♦ నిఖిలజగము ;
నీదుగానానిలం బాడు ♦ నింగిఁ జెలఁగి ;
నీదుగానాచ్ఛ వాహిని ♦ నిఖిల శైల
వప్రములఁ వ్రచ్చి పఱచు ని ♦ ర్వక్రగతిని.
పాడ నీతోడ నామది ♦ వలచుఁ గాని
తగినకంఠస్వరము లేమిఁ ♦ దల్లడిల్లుఁ ;
గడఁగి భాషింప గానంబు ♦ గాదు గాన
"నతులభవదీయగా నజా ♦ లాంతరమున
నాదుమదిఁ జెఱఁగొంటి వో ♦ నాథ!" యంచు
నఱతు నెల్గెత్తి నేను ని ♦ రాశఁ జెంది.

4

నాదుపాణంబునకును బ్రా ♦ ణంబ వైన
నీవు సర్వాంగ మంటు స ♦ జీవుడంచుఁ
దెలిసి, నిర్మలముగ నాదు ♦ దేహముంప
జతన మొనరింతు శక్తి వం ♦ చనము లేక.
బుద్ధిదీపంబు మన్మనం ♦ బున నమర్చు
నట్టి సత్యస్వరూపుఁ డీ ♦ వంచు నెఱిఁగి
తలఁపులోనుండి యనృతముల్ ♦ తొలఁగఁ జేయ
జతన మొనరింతు శక్తి వం ♦ చనములేక .
హృదయకుహరాంతరంబు స ♦ ర్వేశ! నీకుఁ

 

బీఠిక నెఱింగిప్రేమపు ♦ ష్పింపఁ జేసి
నెఱయు హృద్దోషముల నెల్లఁ ♦ దఱిమివైన
జతన మొనరింతుశక్తి వం ♦ చనము లేక,
కార్య మొనరించుటకునయి ♦ కలుగుబలము
పొడము నీశక్తిచే నని ♦ బుద్ధిఁ దెలిసి
ప్రకటపఱుపంగ నిన్ను నా ♦ పనులయందు

జతనమొనరింతు శక్తివం ♦ చనము లేక.

5


ఒక్కనిముసంబు నీప్రక్క ♦ నుండుచనువుఁ
గోరితిని దయసేయు ము ♦ దారమతిని;
దిన్నగ నొనర్తు నావల ♦ నున్నపనుల
సుందరం బగునీమోముఁ ♦ జూడనేని
మదికి శాంతియు విశ్రాంతి ♦ మాయమగును;
నాడుశ్రమ మెల్ల నింతయు ♦ మోద మిడక
పోరమే లేనిబహుకష్ట ♦ వార్ధిలోని
తుదిమొదలు లేనికృషిఁబోలెఁ ♦ దోఁచుచుండు.
వెచ్చనూర్పుచు గొణుఁగుచు ♦ వచ్చి నిలిచె
జాలకముకడ నేఁడు వే ♦ సంగిప్రోడ;
రమ్యపుష్పవనాస్థాన ♦ రంగమందు

గాన సభలను గొల్చుచుఁ ♦ గ్రాలెనళులు

శాంతితోఁ బొంగు నిట్టివి ♦ శ్రాంతి వేళ
నీముఖాముఖఁ గూర్చుండి ♦ నిశ్చలముగఁ
బ్రాణ మంకితముగ నిడు ♦ పాటఁ బాడ
నెంతయును యోగ్యసమయమై ♦ యెసఁగుఁ గాదె?

6

ఈసుమము జాగు సేయక ♦ కోసి కొమ్ము
ఆలసించిన దుమ్ములో ♦ రాలుఁ జుమ్ము
నెలవు దీనికి నీదండఁ ♦ గలుగదేని
త్వత్కరస్పర్శబాధచే ♦ సత్కరించి
కోసి కొ; మ్మాలసింపక ♦ కోసి కొమ్ము.
బాగుగా నాకు మెలఁకువ ♦ వచ్చులోనఁ
బొద్దువోవునొ ముగియునో ♦ పూజవేళ
యంచు భయపడుచుంటి; నా ♦ కభయ మిచ్చి
కోసి కొ; మ్మాలసింపక ♦ కోసి కొమ్ము.
అంతగా రంగు లేకున్న ♦ నల్పముగను
బరిమళం బున్న నిప్పువ్వు ♦ ప్రభువతంస
స్వీకరింపుము భవదీయ ♦ సేవకొఱకుఁ;
దప్పి పోకుండఁ దరుణంబు ♦ దయ దలిర్పఁ
గోసి కొ; మ్మాలసింపక ♦ కోసి కొమ్ము.

7

నాదుగానాంగన దొఱంగె ♦ నగల నెల్ల;
వస్త్రభూషణగర్వ మ ♦ ప్పడఁతి పడదు
భూషలం గల్గునన్యోన్య ♦ మునకు హాని
నాకు నీ కవి యడ్డమై ♦ నడుమ నిలుచు
రణితమున ముద్గునీగూఢ ♦ రమ్యవాణి.
నీవు తల యెత్తి చూచిన ♦ నిలువలేక
నాదుక విదంభము నశించు ♦ నానచేతఁ;
గవులకెల్లను నాధుఁడై ♦ క్రాలుదేవ!
నీదుపాదాబ్జములకడ ♦ నిలిచినాఁడ ;
నీవు రమ్యస్వరంబుల ♦ నింపి పాడ
వేణు వగురీతి నాదుజీ ♦ వితము నేను
జల్పుదును గాక సరళము౯ ♦ సాధువుగను.


8


కంఠమునఁ దారహారది ♦ కములఁ దాల్చి
యెడలిపై రాజవస్త్రంబు ♦ లొప్పుచుండు
బాలుఁ డాటలసౌఖ్యంబు ♦ బడయఁ గలడె?
ఆడఁ గడఁగినయపు డెల్ల ♦ నతనియుడుపు
లడ్డముగ వచ్చి యాతని ♦ నాఁపుచుండుఁ;

 

జిన్గునో మాయునో యను ♦ చింతచేతఁ
దాను జనులకు దూరమై ♦ తలఁగు చుండు;
వేడ్కఁ దిరుగాడుటకుఁ గూడ ♦ వెఱచు చుండు.
సౌఖ్య మొసఁగెడుభూమిర ♦ జంబునుండి,
జనసమూహము లనుగొప్ప ♦ సంతలోన
వేడ్కఁ దిరుగాడఁగాఁ గల్గు ♦ స్వేచ్ఛనుండి,
దూరముగనుంచి తళతళ ♦ ద్యుతుల నీను
బాలురకు నీవు పెట్టిన ♦ బంధనములు

నిష్పలంబులు; మాతరో! ♦ నిష్పలములు.

9


ఓరి మూర్ఖుఁడ! నీదుబా ♦ హువులమీఁద
నిన్నుఁ గొంపోవ నీవు య ♦ త్నించినావె?
నీదువాకిట బిచ్చంబు ♦ నీవె యెత్త
వచ్చినాడవె? భిక్షుకా! ♦ వచ్చినావె?
సకలభారంబు వహియింప ♦ జాలినట్టి
ప్రభుకరమ్ములఁ బెట్టునీ ♦ భారమెల్ల.
దృష్టి వెన్కకుఁ ద్రిప్పి చిం ♦ తిల్లఁ బోకు.
తాను ముట్టినదీపము౯ ♦ దక్షణమున
నూఁది యార్పును; నీయాశ ♦ యుర్విలోన
మలిన మది; దానిచేతుల ♦ వలన నీవు

గొనకు మేవరమైనను ♦ గొనకు కొనకు.
శుద్ధప్రేమాస్పదుండైన ♦ శుభుఁ డొసంగు
దానినే స్వీకరింపుము ♦ ధన్యుఁ డగుము.


10


బీద సాదల పతితుల ♦ విడుదులందె
నీదుపాదారవిందముల్ ♦ నిలిచి యుండుఁ;
గాన నచ్చట నెప్పుడుఁ ♦ గ్రాలుచుండు
నీదుపదపీఠ మెంతయు ♦ నిశ్చలముగ.
బీద సాదల పతితుల ♦ విడుదులందు
నిలిచి యుండెను నీపాద ♦ నీరజములు
నీకు మ్రొక్కంగ భక్తి య ♦ త్నించునాకు
నందరానంతలోఁతున ♦ నలరు దేవ!
బీద సాదల పతితుల ♦ వెంటవెంటఁ
గంతబొంతలఁ దాలిచి ♦ కరుణతోడ
నరుగుచుండెడునట్టి యో ♦ పరమపురుష !
గరువ మెపుడైన నీకడ ♦ కరుగఁ గలదె?
సఖులు లేనట్టివారికి ♦ సఖుడ వగుచు
బీద సాదల పతితుల ♦ వెంటవెంట
నుండి ప్రేమాస్వరూపివై ♦ యొప్పునిన్నుఁ
జేరఁగారాదు నాధ! నా ♦ చిత్త మెపుడు.

11

జపతపంబులు గానముల్ ♦ చాలుఁ జాలు;
నన్నితలుపులు మూసి యీ ♦ యాలయమునఁ
జిమ్మచీఁకటిగొందిలోఁ ♦ జేరి యిట్టు
లొంటి నెవ్వని బూజించు ♦ చుంటి విపుడు?
తెఱచి కన్నులఁ జూడుము ♦ దేవుఁ డెదుటఁ
గానవచ్చునొ లేదొ నీ ♦ కన్నులకును.
గట్టియాభూమి దున్నెడు ♦ కాఁపువాఁడు
కూలికై త్రోవఁ గంకరఁ ♦ గొట్టువాఁడు
కష్టపడుచోట నాతఁడు ♦ గలడు; చూడు!
దుమ్ము తనవస్త్రములమీదఁ ♦ గ్రమ్ముచుండ
నెండవానలలో వారి ♦ దండ నుండు;
నతనివలె శుభ్రవస్త్రంబు ♦ నవలఁ బెట్టి
దుమ్ములోనికి నీవును ♦ రమ్ము! రమ్ము.
మోక్షమా? చూడు మద్ది యే ♦ మూలఁ గలదొ
నాధుఁడునుగూడ సృష్టిబం ♦ ధమ్ముఁ దాను
బూని యున్నాఁడు సంతోష ♦ పూర్వకముగ;
విడక మనలోన బద్దుడై ♦ వెలసినాడు.
ధూపదీపాదులను బెట్టి ♦ దూరమందు

వెలుపలికి రమ్ము ధ్యానంబు ♦ వీడి నీవు;

నలిగినీవస్త్రములు మాయ ♦ నష్ట మేమి?
చెమట నుదుటను బట్టంగ ♦ శ్రమ యొనర్చి
దర్శనముఁజేసి యాతని ♦ దండ నిలుము,


12


ఆచరింపగ నేఁ బూని ♦ నట్టియాత్ర
చాల దూరమ్ము; కాలమ్ము ♦ చాలఁ బట్టుఁ ;
దొలివెలుఁగుఁ దేరిపై నెక్కి ♦ త్రోవఁ దీసి
యుడుగ్రాహమ్ములలో జాడ ♦ లునిచియునిచి
చవితి సకలజగంబు ల౯ ♦ పనులఁ బట్టి.
ఇట్లు నిన్ను సమీపింప ♦ నిచ్చుత్రోవ
యెంతయును దీర్ఘతరమయి ♦ యెనఁగుచుండు.
నాధుతమశాంతజీవన ♦ సాధనంబు
దుర్గమంబు దురూహ్యంబు ♦ దుస్సహంబు.
యాత్రికుఁడు తనవాకిటి ♦ కరుగులోనఁ
బ్రతిపరకవాటమును దట్ట ♦ వలసి నట్టు
లంతరాంతరమందిర ♦ మంతమందు
నరుగ వెలిజగములనెల్లఁ ♦ దిరుగ వలయు.
కనుల నే మూసి "ఇదిగో నీ" ♦ వనెడులోన
నెంతయోదూరముగ నక్షు ♦ లేగి వచ్చె.

"హా! యెచట నుంటి వీ,, వను ♦ నట్టిప్రశ్న

యశ్రుతటిసీసహస్రమై ♦ యట్టె కరఁగి
"ఉంటి నే నిద" యనియెడు ♦ నుత్తరంపు

వరదయై ముంచె జగములఁ ♦ బ్రళయ మట్లు

1౩


పాడఁగా వచ్చినట్టినా ♦ పాట నేను
నేటివఱకును బాడంగ ♦ నేరనైతిఁ;
దంతు లెగఁదిగఁద్రిప్పుచుఁ ♦ దంబురకును
లలిని శ్రుతిఁ గూర్చుటందె కా ♦ లంబు గడచెఁ;
దరుణ మింకను రాలేదు ♦ తధ్య మరయఁ;
బొందికగ శబ్ధములకూర్పు ♦ పొసగలేదు;
ఆశమాత్రము బాధించు ♦ నాత్మయందు;
గాలి నిట్టూర్పువిడుచుట ♦ గలిగెఁ గాని
వేడ్కగా విరిమాత్రము ♦ విచ్చలెదు;
చేరి యతనిముఖాబ్జా మీ ♦ క్షింపలేదు;
లీలఁ దత్కంఠనాద మా ♦ లింపలేదు;
గృహమునకు ముందు వీథిలో ♦ నేగునతని
కాల్పడినిమాత్ర మెవినఁ ♦ గంటిఁ జెవిని;
అతడు గూర్చుండుటకుఁ దగు ♦ నాసనంబు
పఱచుటందె గతించె నా ♦ బ్రతు కిదెల్ల.
గృహములో దీప మింక వె ♦ ల్గింపలేదు;

ఎట్లురమ్మంచుఁ బిలుతుఁ బ్రా ♦ ణేశు నిటకుఁ;
గాని యాతని నొకనాఁడు ♦ గలిసికొందు
ననెడు పేరాసతో నేను ♦ మనుచు నుంటిఁ

గలుగలే దింక నే వానిఁ ♦ గలిసికొనుట.

14


నాదుకోర్కులు వేనవేల్ ♦ నాప్రలాప
మెంతయో జాలిఁ గొల్పెడు ♦ నెవని కయినఁ;
గాని కాపాడితివి నన్ను ♦ గఠినమతిని
బ్రార్ధనల నెల్ల నీవు ది ♦ రస్కరించి
యిట్టి ప్రబలానుకంపంబు ♦ నెన్నిమార్లొ
నాదుజీవితమునఁ జూపి ♦ నావు నీవు.
అధిప! యత్యాశచేఁ గల్గు ♦ నార్తి నుండి
నన్నుఁ గాపాడి పరమేశ ♦ నాఁడునాఁట
నడుగకయె నాకు నొసఁగిన ♦ యతులసరళ
వరము లగు మావసమునకుఁ ♦ బ్రాణమునకు
దేహమున కాకసమునకు ♦ దేజమునకు
నెంతయును యోగ్యునిగఁ జేసి ♦ యెసఁగుదీవు.
నాకుఁ బరమావధివి గాన ♦ నాధ! నిన్నుఁ
గరము మెలఁకువ నొక్క మా ♦ ఱరయుచుందు;

మెలఁకువను దక్కి యొకమాఱు ♦ మేలఁగుచుందుఁ

గాని నీవేలొకో దాఁగి ♦ కానరావు.
తఱచుగా నాదుకోర్కెలఁ ♦ దలఁగద్రోసి
చపలదుర్బలవాంఛచే ♦ సంభవించు
నాపదలనుండి రక్షించి ♦ యధిప! నన్నుఁ
బూర్ణవిశ్వాసపాత్రుగాఁ ♦ బొదలఁజేసి

నెమ్మితో నన్నుఁ గరము మ ♦ న్నించినావు.

15


నిన్గుఱించిన గీతముల్ ♦ నేర్చి పాడ
నిచట నున్నాఁడ జగముల ♦ నేలుఱేఁడ!
భవ్యతర మగునీదివ్య ♦ భవనమందు
మూల నొకచోటు నాకును ♦ బొలుచుచుండు.
ఇజ్జగంబున నాకుఁ బ ♦ నేమి లేదు.
విఫలమై యుండునాదుజీ ♦ వితము గాన
నిర్విషయగీతములె పాడ ♦ నేర్చియుండు.
మౌనముగ నిన్నుఁ బరమేశ! మధ్యరాత్రి
యనెడునయ్యంధకారాల ♦ యంబునందుఁ
బూజ సల్పుటకయి గంట ♦ మ్రోగునపుడు
నీయెదుట నిల్చి పాడఁగా ♦ నెమ్మితోడ
నాకు నాజ్ఞనొసంగు మ ♦ నాథనాథ!

భాసురంబుగ నొప్పుప్ర ♦ భాతమందు

నందమగుపైఁడివీణియ ♦ యందు శ్రుతిని
హాయిగాఁ గూర్చినప్పుడు ♦ హర్షమునను

నెదుసన్నిధి నొసఁగి మ ♦ న్నింపుమయ్య!

16


అమలసౌభాగ్య జగదుత్స ♦ వమున కేను
బిలువఁబడితిని బరమసం ♦ ప్రీతితోడ;
ధన్య మయ్యెను నాజీవి ♦ తమ్ము నేఁడు;
కనులపండువుగా నెల్లఁ ♦ గంటిఁ గంటి;
విందుగా వీనులకు నెల్ల ♦ వింటి వింటి;
నొప్పగా నాదు వాద్యమీ ♦ యుత్సవమున
నెలమి వాయించుపని నాకు ♦ నీయఁబడియె;
శక్తివంచనలేక నే ♦ సలుపఁగంటి;
నెమ్మితో లోపలికిఁ బోయి ♦ నిన్నుఁ జూచి
"నెమ్మదిగ భక్తితో వంద ♦ నమ్ము సలుపు

 సమయమా" యని యడిగెద ♦ స్వామి నిపుడు.

17


కడకు నాతనికరములఁ ♦ బడఁగ నెంచి
వేచి యున్నాఁడఁ బూజ్యమౌ ♦ ప్రేమకొఱకు

నేను జేసిన జాగెల్ల ♦ దానికొఱకె

చేయవలసినపనులను ♦ జేయకుండు
తప్పిదముఁ జేసి యుంటయు ♦ దానికొఱకె.
కట్తుదిట్టములను నన్నుఁ ♦ గట్టివేయ
వచ్చుచున్నారు వారల ♦ వశముగాను
వేచియున్నాఁడఁ బూజ్యమౌ ♦ ప్రేమకొఱకుఁ
గడకు నాతనికరములఁ ♦ బడఁగ నెంచి.
మందుఁడా యని నిందింత్రు ♦ మహిని బ్రజలు
జనులవాక్యంబు నిజము ని ♦ స్సంశయంబు;
సంతబేరము లన్నియు ♦ శాంతమొందెఁ
బనులతొందర గలవారి ♦ పనులు ముగిసెఁ
బిలిచిన౯ బోక నే నున్న ♦ నలిగినారు
పిలిచి మరలిన వారలు ♦ ప్రీతిఁ దొఱఁగి;
కడకు నాతనికరములఁ ♦ బడఁగ నెంచి

వేచియున్నాడఁ బూజ్యమౌ ♦ ప్రేమకొఱకు.

18


కమ్ముకొని పయిఁబయిని మే ♦ ఘములు వచ్చెఁ
గడలనెల్లను జిమ్మచీఁ ♦ కటుల గ్రమ్మె
నొంటిగా బైటవాకిట ♦ నుంతువేల
యొంటిగా బైటఁ బ్రేమమా ♦ యంతు వేల?

బనులతొందర గలపట్ట ♦ పగటియందుఁ

బ్రజలతోఁ గూడి చక్కగాఁ ♦ బాటుపడితిఁ
గాని యీయొంటిగాఢాంధ ♦ కారవేళ
యందు నాకున్న దెల్ల నీ ♦ యాశ యొకటె.
వదనకమలముఁ జూపి స ♦ మ్ముదము నిడక
ప్రేమమా నీవు న౯ వెలి ♦ వేసితేని
దీర్ఘమైనట్టి యీవర్ష ♦ దినము నెట్లు
గడపఁగల్గుదునో నాకు ♦ గానరాదు.
దూరముగ నాకసంబునఁ ♦ దోఁచుదమము
నందె నాదృష్టి నంతను ♦ బొందుపఱతు;
శాంతి సుంతయు లేక సం ♦ చలత నొందు

వాతమునఁ బడి నామది ♦ వంతఁ దిరుగు.

19


ఈవు మాట్లాడలేనినా ♦ హృదయమందు
మౌనమును జక్కగా నింపి ♦ దాని నోర్తుఁ
దలను నోపిక వంచి చు ♦ క్కలనుగూడి
జాగరంబుండు రాతిరి ♦ చంద మంది
యెంతయును నేచియుండుదు ♦ శాంతముగను;
వచ్చుఁ దప్పదు నిజముప్ర ♦ భాతవేళ
చిమ్మచీఁకటి యంతయు ♦ జెదరిపోవు.

ఆకసముఁ జీల్చుకొనుచునీ ♦ యమలవాణి

స్వర్ణతటినీసహస్రంబు ♦ పగిది డిగ్గు;
నంత నొక్కొక్కనాగూఁటి ♦ యందు నీదు
కలికిపలుకులు గీతప ♦ క్షములఁ దాల్చు;
నీవిమలమంజుగీతముల్ ♦ నావనమ్ము

లందుఁ బుష్పాకృతులఁ దాల్చి ♦ యలరఁజొచ్చు.

20


అంబుజాతము వికసించి ♦ నట్టివేళ
నకట! నామది యెచటికో ♦ యరగియుండెఁ
గానఁ దెలియంగ నైతిని ♦ దాని నేను.
పుష్ప మొకటియు లేకుండె ♦ బుట్టయందు
నైన నప్పువ్వుపై దృష్టి ♦ యరుగదయ్యెఁ;
గాని న న్వెత పలుమాఱు ♦ కలఁపజొచ్చె;
నంత మేల్కాంచి కాంచితి ♦ వింతయైన
పరిమళముజాడ దక్షిణ ♦ వాతమందు;
నాపఁగాఁగాని యపరిమి ♦ తాశఁ గొలిపి
మదిని వేధించునప్పరి ♦ మళలవంబు.
నిండుదనమును వేతకుచు ♦ నుండుగ్రీష్మ
ఋతువు తమిఁ బుచ్చు నూపిరి ♦ రీతీఁ దోఁచె;
గాని యిది యింతదగ్గఱఁ ♦ గ్రాలె ననియు,

మఱియు నిది నాది యనియును ♦ మన్మనమునఁ

దద్ధయు గభీరతరమైన ♦ తలమునందుఁ
బూర్ణమాధుర్య మిది పూచి ♦ పొలిచె ననియుఁ

దెలియలేనైతి నప్పుడు ♦ తెలియనైతి.

21


ఇడఁగవలయును నేను నా ♦ పడవ నీట;
నూరకే యెట్టులుండుట ♦ యొడ్డుమీద?
గటకటా! యెంతకాలంబుఁ ♦ గడపవలయుఁ?
బూచి చిగిరింపఁగాజెసి ♦ పోయె మధువు;
బొత్తిగా నెండిపోయిన ♦ పూలమోచి
వేచియున్నాఁడఁ జూచుచు ♦ వెనుకముందు;
నలలఘోషంబు లెంతయు ♦ నధిక మయ్యె;
జలధితీరపునీడల ♦ సందునుండి
యిలను బటపటఁ బండుటా ♦ కులును రాలె.
శూన్యమం దేమి చూచెదు ♦ చూడ్కి నిలిపి?
అదిగో! దూరాన నాతీర ♦ మందునుండి
తేలివచ్చెడుగీతితో ♦ గాలిలోనఁ;

బొచ్చుకొని వచ్చుకంపము౯ ♦ జూడలేవె?

22


శ్రావణములోని గాఢస ♦ చ్చాయలందు

రేయినిశ్శబ్ధమై యుండు ♦ రీతినుండి
యెల్లకావలివారల ♦ నేమఱించి
యడుగుపై నడుగిడుచు ర ♦ హస్యముగను
సంచరించుచు నుందువు ♦ స్వామి! నీవు.
పూర్వవాయువుతా నెంత ♦ పూన్కి తొడ
నఱచి పిలుచుచునుండిన ♦ సరకుగొనక
నేఁటివేకువ మోడిచె ♦ నేత్రములను.
నీలమును మించునిచ్చలు ♦ మేలుకాంచు
నాకసముమీఁద దట్టమై ♦ యమరె ముసుఁగు;
గానములసద్దు నణఁచెను ♦ గాననములు;
ప్రతిగృహకవాటమును మూయ ♦ బడెను; గాని
నిర్జనం బైనవీధిలో ♦ నీ వొకఁడవె
పాంథ! తిరుగుచునున్నావు ♦ భయములెేక,
ఓమదీయైకనన్మిత్ర ! ♦ యోమదీయ
ప్రియతమప్రాణనాథ! నా ♦ గృహమునందుఁ
దెఱవఁబడె నన్నితలుఁపులు ♦ దేవ! నీవు

వచ్చి స్వప్నంబు కైవడి ♦ వలదు చనఁగ.

23


ఈ మాహావర్షరాత్రిలో ♦ నెలమితోడఁ

బ్రేమఁ జూపెడుయాత్రకై ♦ వెడలినావె?


యాశలెల్లను భంగ మై ♦ నట్టిదాని
వలెను గగనంబు మూల్గు నో ♦ ప్రాణమిత్ర!
నిద్ర వచ్చుట యెక్కడ! ♦ నేఁటిరాత్రిఁ;
దీసి తలుపులు పలుమాఱుఁ ♦ దీసి తీసి
చూచినకొలందిఁ జీఁకటే ♦ చూడ నయ్యెఁ;
గానఁబడ దేమియును ముందుఁ ♦ గానఁబడదు.
ఎద్ది నీమార్గ మద్భుతం ♦ బెచట నుండు?
నల్లని మషీజలమ్ముల ♦ వెల్గు వట్లు
తనరు నేనీలవాహినీ ♦ తటమునుండి
తద్దయును గోపభావంబు ♦ దాల్చి పోల్చి
నల్లఁబాఱిన యెవనాం ♦ తమ్మునుండి
యేమహాగాఢనీలాధ్వ ♦ సీమనుండి

వచ్చినాడవు? నాకడ ♦ వచ్చినావు.

24


నిద్రచే గప్పి భూమిని ♦ నెమ్మితోడ
సంజఁ దూలుచు నుండెడు ♦ సారసంపు
ఱేకులను మూయుచుండు లో ♦ కైకనాధ!
పగలు చనెనేనిఁ బక్షులు ♦ పాడవేని
గాలి బడలిక చేఁ గుంది ♦ కదలదేని

నాపయినిగూడఁ గప్పుము ♦ సాధ! యిపుడు

గ్రాల ముసుఁగుగ గాఢాంధ ♦ కారపటము.
భోజనపదార్ధములు యాత్ర ♦ ముగియులోన
ముగిసియున్నట్టి పుట్టముల్ ♦ మిగుల మాసి
చినిఁగి యున్నట్టి బడలికఁ ♦ జెందినట్టి
యాత్రికునిలజ్జలెముల ♦ నపనయించి
త్వద్దయారూపరాత్రి య౯ ♦ దండ యొసఁగి

మరల నలరంగఁ జేయుము ♦ విరినిబోలె.

25


బడలుట౯ రాత్రి శ్రమలచే ♦ గడపకుండ
నాదువిశ్వాసభరము నీ ♦ మీఁదఁ బెట్టి
హాయిగా నిద్రఁ జెంది న ♦ న్నలరనిమ్ము
నీకటాక్షంబుచే జగ ♦ దేకనాధ!
పూజ్యతర మైనభవదీయ ♦ పూజయందు
నల్పయత్నముతోడినా ♦ యలసినట్టి
యాత్మ పురికొల్పకుండ నా ♦ కాజ్ఞ నిడుము
నీకటాక్షంబుచే జగ ♦ దేకనాధ!
పగలు బలిడలినకనులు ప్ర ♦ భాతవేళఁ
దిరిగి సంతోషభరమునఁఁ ♦ దేజరిలఁగ
వానిపై రాత్రి యను ♦ మూఁత వైతు వీవు

నీకటాక్షంబుచే జగ ♦ దేక నాధ!

26

అతడు వేంచేసి నాయొద్ద ♦ నలరుచుండెఁ;
గాని మూర్ఖత నేను మే ♦ ల్కాంచనయితి.
ఇంతపాపిష్ఠి నిద్ర నా ♦ కేలఁ బట్టె;
నెంతదౌర్భాగ్యవంతుఁడ! ♦ నెంతజెడుఁడ?
స్వామి దయచేసె రాత్రి ని ♦ శ్శబ్ధవేళఁ;
జేతులను వీణ యెంతయుఁ ♦ జెలఁగు చుండె;
పరమనోహరతన్మృదు ♦ ధ్వనులచేతఁ
బ్రతిరవము లీనఁజొచ్చెనా ♦ స్వప్నములను.
ఏల నశియించే నారాత్రు ♦ లివ్విధమున?
నెవనియూపిరి నానిద్ర ♦ నెలమినంటు
నతనిదృష్టికి నే నిట్టు ♦ లనవరతముఁ

దప్పిపొవుట యేలోకో ♦ చెప్పఁ జాల.

27


దీపమా? యేడ నున్నది? ♦ దీపమేడ?
దానివెలిఁగించు మండు నా ♦ శానలంబె?
జ్వాలయే లేదు దీపంబు ♦ వలన నేమి ?
హృదయమా! నీదుగతియెల్ల ♦ నింతయేని

మృత్యువే దీనికంటెను ♦ మేలు నీకు.

నీతలుపుఁ గష్టదేవత ♦ నిలిచి తట్టె ;
స్వామి మేల్కాంచి సంకేత ♦ సదనమునకుఁ
జిమ్మచీఁకటి రాత్రిలో ♦ రమ్మటంచుఁ
బుచ్చుసందేశమును నీకు ♦ దెచ్చెనదిగొ!
ఆకసంబున మేఘంబు ♦ లట్టె క్రమ్మి
యెడ తెరపిలేక ధారగా ♦ వృష్టి గురిసె;
నేదియో నన్నుఁ బురికొల్పె ♦ నెఱుగ లేను;
దీనియర్ధం బదేమియో ♦ దెలియఁ జాల
నిముసమున మించి మెఱపు నా ♦ నేత్రదృష్టి
గాఢతమ మైనతమములో ♦ గాడఁ ద్రోసె.
రాత్రి చేసెడిగానమ్ము ♦ రమ్మటంచుఁ
బిలుచు; నాదారి నామది ♦ వెదకు చుండె
దీపమా? యేడ నున్నది ♦ దీప మేడ?
దానివెలిఁగించుమండు నా ♦ శానలంబె!
ఉఱుముచున్నది; జోరని ♦ యోరుగాలి
విసరికొనిపోవు చున్నది ♦ వింటి యందు;
రాత్రియున్నది నల్లని ♦ ఱాతిరీతిఁ;
గడవకుండును గాక నా ♦ కాలమెల్ల
గాఢమైనట్టి యీయంధ ♦ కారమందె.
ప్రేమ యనుదివ్వె నీదుజీ ♦ వితముచేత

జాగుచేయక వెల్గించి ♦ బాగుపడుము.

28

తెగకయున్నవి వలయురుల్; ♦ ద్రెంపఁ గడఁగ
నెంతయును నొప్పిగలుగు నా ♦ హృదయమునకు
నేను వలచినదంతయు ♦ స్వేచ్చయొకటె;
కానిసిగ్గగుచున్నది ♦ దానిఁగోర
నాకు దెలియను నీవు ర ♦ త్నాలగనివి;
నే నెఱుంగుదు నిన్ను స ♦ న్మిత్రమంచుఁ;
గాని నాగదిలో నిండి ♦ క్రాలుచుండు
వట్టియాడంబరంబులఁ ♦ బార వైవ
హృదయ మొప్పక యున్నది ♦ యించు కైన;
తొడిగె యున్నట్టిపుట్టమ్ము ♦ దుమ్ము వమ్ము.
ఎంతయిష్టమ్ము లేకున్న ♦ నెలమితోడ
విడువలేకుండ దానినే ♦ తొడుగు చుందుఁ;
దప్పు లొప్పులుఁ గల వెన్నొ ♦ చెప్పజాలఁ;
దెలుపఁ గూడని వెన్నియో ♦ గలవు చాల;
నైన నామంచికై నిన్ను ♦ నడుగ వచ్చి

యెంతువో విన్నపం బని ♦ యెదఁ జలింతు

29


నే నిడిననాదునామంబు ♦ లోనివాఁడు

గుందుచున్నాఁడు చింత ని ♦ గ్గొందిలోనఁ;
జుట్టు నీగోడఁ గట్టగాఁ ♦ జొచ్చినాడఁ;
బెరిఁగి యిది నాఁడునాఁటికి ♦ వింటినంట
మన్నిజస్థితి తచ్చాయ ♦ మఱుఁగు వడియె.
గర్వపడుచుందు నీగోడ ♦ గాంచి కాంచి;
కన్న మేదియు దీనిలోఁ ♦ గలుగకుండఁ
బొందుగా మట్టితోఁ బూతఁ ♦ బూయుచుందు;
నింత మెలకువఁ బనిచేసి ♦ యంతమందు

మన్నిజస్థితినే నేను ♦ మఱచిపొదు.

30


నాదుసం కేతమునకు నే ♦ మోద మొప్ప
నొంటిఁగా బైలుదేరితి ♦ నొంటిగానె;
కాని చీకటిలో నాఁకు ♦ గాఁన బడక
వెంతనంటెను మెల్లఁగా ♦ వీడెవండో.
తప్పుకొనుటకు నటునిటుఁ ♦ దలఁగు చుందుఁ;
గాని తప్పించుకొననైతి ♦ వీనినుండి.
దుమ్ము రేఁపును వీఁడు దం ♦ భమ్ము లాడి;
వానికేకను నాప్రతి ♦ వాక్యమందుఁ
గూర్చుచుండును దాను సం ♦ కోచపడక;

నాధ! వీఁడెవ్వఁడో కాదు ♦ నాయహమ్ము.

అతఁడెంతయు సిగ్గు లే ♦ నట్టివాడు.
అతనితోఁ గూడి నీద్వార ♦ మందుఁ జేర

నాకు సిగ్గగుచుండు న ♦ నాధనాధ!

31


"బద్ధుఁడా నీకు నెవనిచే ♦ బంధనంబు
గలిగెనో నాకుఁ జెప్పంగఁ ♦ గలవె?" యనినఁ
"బ్రభువుచే" నని బద్ధుండు ♦ పలికెనిట్లు;
"శక్తి సంపదలందు నీ ♦ జగతిలోన
నందఱిని మించఁగల నని ♦ యాత్మ నెంచి
యధిపునకు జెల్లవలసిన ♦ యర్ధమెల్లఁ
గూర్చి యుంచితి నాస్వంత ♦ కోశమందుఁ;
బ్రభువునకు సిద్దపఱచిన ♦ పాన్పుమీఁద
నిద్రపోయితిఁ బన్నుండి ♦ నిలువలేక;
కానిమేల్కొని మద్ధనా ♦ గారమందె
యిట్లు బద్దుండ నైయుంట ♦ నేను గంటి."
"ఇట్లు తేగనట్టిసంకిలి ♦ నెవడు నేసె
బద్ధుడా! చెప్పవే" యని ప్రశ్న సేయ
నొసఁగె నాతఁడు మరల నీ ♦ యుత్తరంబు
"ఎంతయో శ్రధ్దతోడ నీ ♦ శృంఖలంబు

నేనె కావించుకొంటి వే ♦ ఱెవరు గాదు;

జగము నాగెల్వఁగూడని ♦ శక్తి కొగ్గు;
నేను నిరుపద్రవస్వేచ్చ ♦ నెగడుచుందు;
నంచు రాత్రింబగళ్లు నే ♦ నగ్నికడను
గష్టపడి కాచి కఠినంబు ♦ గాఁగఁ గొట్టి
చేసితిని దీని నెంతయు ♦ సిద్ధముగను;
గొలుకులన్నియు దృఢముగా ♦ గూర్చఁ బడియె

గాని చిక్కించుకొని నన్నె ♦ కరము నొక్కె."

32


ఈజగతిలోనఁ బ్రేమించు ♦ హితులు నన్నుఁ
బట్టి బంధింతు రెంతయు ♦ భద్రముగను.
స్వేచ్ఛ నన్నుంచునట్టినీ ♦ ప్రేమ మరయ
నంత కధికంబు వేరు నై ♦ యలరుచుండు.
మఱతు వారిని నే నంచు ♦ వెఱచి నన్ను
నొక్కపుడుఁగూడ నొంటిగా ♦ నుండనీరు.
ఎన్నిదినములు గడచిన ♦ నేమి చెపుదు
నొక్కమా ఱైనఁ గనపడ ♦ కుందు నీవు.
ఎలమి నాప్రార్ధనల నిన్నుఁ ♦ బిలువ కున్నఁ
బ్రీతితో నిన్ను హృదయానఁ ♦ బెట్ట కున్న

వేచు నీప్రేమ మెపుడు నా ♦ ప్రేమకొఱకె.

33

పగలు కొందఱు వచ్చి నా ♦ భవనమునకు
"నిచట నొక చిన్నగది యిచ్చి ♦ తేని మేము
సాయపడి దేవపూజలో ♦ స్వామి దైన
వరప్రసాదంబునందు మా ♦వంతుఁ గొందు"
మంచు నొకమూల సాధువు ♦ లట్టులుండి
రాత్రి చీకటిలోనఁ బ ♦ విత్రమైన
గుడిఁ బ్రవేశించి యల్లరి ♦ గడు నొనర్చి
స్వామిసన్నిధిలోని ప్ర ♦ సాద మెల్ల
నతిమలినఘోరభూరిదు ♦ రాశచేత

నాఁచికొని రేమి చెప్పుదు ♦ నాచరిత్ర?

34


"నాదుసర్వస్వమా?" యంచు ♦ నాధ! నిన్నుఁ
బిలువఁగాఁ గల్గి నాలోన ♦ మెలఁగుచుండు
నంశమే సర్వదా నిల్చి ♦ యలరుఁ గాత!
అన్నిటను నిన్నె పొందుచు ♦ నన్నికడల
నిన్నె చూచుచు నాప్రేమ ♦ నిరత మొసఁగి
కొలుచునాలోనియంశమే ♦ నిలుచుఁగాత!

ప్రభువ! నిను దాఁప కెప్పుడుఁ ♦ బ్రకటపఱచి

పొలుచునాలోనియంశమే ♦ నిలుచుఁ గాత!
భవదుదా రేచ్చలో నను ♦ బద్ధుఁ జేసి
జీవితంబున నీకోర్కి ♦ చెల్లఁ జేసి
నీదుప్రేమానుబంధమ్ము ♦ నెగడఁ జేయ

వెలుంగు మద్బంధనాంశమే ♦ నిలుచుఁ గాత!

35


ఉన్నతశిరంబు నిర్భయ ♦ యుతమనంబు
నుచితవిద్యాప్రదాసమ ♦ హోదయంబు
క్షుద్రకుచితగృహచ్చిద్ర ♦ కుడ్యజాత
విభజనవిహీనలోకంబు ♦ శుభకరంబు
సత్యగంభీరదేశసం ♦ జనితపూత
వాక్యసముదాయశోభిత ♦ వైభవంబు
పూర్ణతను బొందఁగా నెంచి ♦ భుజము లెత్తి
వృద్ధిఁ గాంచెడువివిధ ప ♦ రిశ్రమంబు
సారహీనదురాచార ♦ వార మనెడు
నూషరక్షెత్రములఁ బార ♦ కుండునట్టి
నదమలవివేకపూరసం ♦ చారణంబు
జ్ఞానయత్నంబు లానాఁడు ♦ నాఁటి కలరు
పగిది నీచేత నడుపంగఁ ♦ బడు మనంబు

చారుసత్యస్వతంత్రభూ ♦ స్వర్గమరయ;

జనక! నాదేశజనులు ద ♦ త్స్వర్గమునకు

మేలుకొందురు గాక! నీ ♦ మూలకముగ.

36


భావమునఁ బాదుకొన్నట్టి ♦ పాపములను
మూలవిచ్చేదముగఁ గొట్టి ♦ మోదమిడుము.
ప్రభువతంసమ! యిదియ నా ♦ ప్రార్ధనమ్ము.
లీల సుఖదు:ఖముల నోర్వఁ నా ♦ జాలునట్లు
కూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.
బీదసాదల నెన్నఁడు వీడనట్టు
లోర్చి గర్వాంధునకు నొగ్గ ♦ కుండునట్లు
కూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.
తుచ్చసంసారవిషయాళిఁ ♦ దూలకుండ
మనసు ఘనమార్గమునఁ బెట్టి ♦ మనెడునట్లు
కూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.
స్వామి! సంపూర్ణమైనట్టి ♦ ప్రేమతోడ
బలము నర్పించి నీయిచ్చ ♦ సలుపునట్లు

కూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.

37


శక్తి తుద ముట్టె; నాయాత్ర ♦ సాగ దింక

మూయఁబడెఁ ద్రోవ; సామగ్రి ♦ ముగిసి పోయెఁ;
గొనకు నెందేనిఁ దల దాఁచు ♦ కొనఁగవలసె;
నంచు మదిలోన నేను ద ♦ లంచు చుంటిఁ;
గాని నీయిచ్చ కవధి నా ♦ లోన గలదె?
ప్రాఁతమాటలు నొటిలో ♦ పల నశింప
స్వాంతమందుండి నవగీత ♦ చయము వెడలు.
ప్రాఁతపథములు దప్పిన ♦ భవ్యముగను

గ్రొత్తదేశంబు వింతలఁ ♦ గూడి తోఁచు.

38


"నేను వలచిన దంతయు ♦ నిన్నె నిన్నె”
యనెడుమాటల నాహృద ♦ యంబు సతము
నిండుఁదమితోడ వల్లించు ♦ చుండుఁ గాత!
విడక రేయుంబవళ్లును ♦ వెంట నంటి
నన్నుఁబెడత్రోవలను బెట్టు ♦ చున్నయాశ
లెల్ల మిధ్యలె కాని మ ♦ రేమి గావు.
వెళ్తురునకైన ప్రార్ధన ♦ వెలికి నిడక
రేయి చీకటిలో దాఁచు ♦ రీతి యందు
నేనువలచినదంతయు ♦ నిన్నె యనెడు
మ్రోఁత విస్మృతమతిలోన ♦ మ్రోగుఁచుండు.

శాంతమును నెంతగొట్టిన ♦ శాంతమందె

శాంతమును రోయుచండ వ ♦ ర్షంబుఁబోలె
దేవ! నీప్రేమ కే నెంతఁ ♦ దిరుగఁ బడిన
"నేను వలచిన దంతయు ♦ నిన్నె నిన్నె"

యనెడు మాటలె నాలోన ♦ నలరుచుండు.

39


చిత్త మిది గట్టిసారి శు ♦ ష్కించినపుడు
వరదయావృష్ఠితోఁ గూడి ♦ తరలి రమ్ము.
జీవకళ జీవితములోనఁ ♦ జెడినయపుడు
విమలగానామృతం బొల్క ♦ వెడలి రమ్ము.
బాహ్యశబ్ధంబు చెవిలోనఁ ♦ బడకయుండ
నెల్లకడలను దుములంబు ♦ లెచ్చినపుడు
శాంతివిశ్రాంతులను గూడి ♦ సౌమ్యమూర్తి !
వడివడిగ నాదుమదిపయి ♦ వ్రాల రమ్ము.
తుచ్చహృదయమ్ము దైన్యంబు ♦ తోడ నొక్క
మూలఁ దలవంచి కూర్చుండు ♦ కాలమందు
దేవదేవేంద్ర! తలుపులు ♦ దెఱచివైచి
రమ్ము రాజ్యూభిషిక్తస ♦ మ్రాట్టుభంగి.
మాయతో నాస మదికన్ను ♦ మూయునపుడు
నిర్మలాతులభూరి ని ♦ ర్నిద్రతేజ!

మెఱుము లుఱుములతో రమ్ము ♦ మేఘమట్లు.

40

స్వామి? శుష్కించినట్టి నా ♦ స్వాంతమందు
నెంతయోకాలము గతించె ♦ వృష్టిలేక.
యంబరం బంబరము లేని ♦ యట్టు లుండి
యతిభాయావహ మైనయా ♦ కృతిని దాల్చె;
నంబుదముమీఁదివలిపొర ♦ యైన లేదు.
శాంతవృష్టికి నైననూ ♦ చనయె లేదు.
శిష్టమోహన ! నీకు న ♦ భీష్టమేని
మృత్యుభీకరచండప్ర ♦ వృష్టిఁ బంపి
మెఱపుదెబ్బలచేతను ♦ మింటి నెల్లఁ
దత్తరిలునట్లు చేయుము ♦ తక్షణంబ.
దారుణనిరాశతోడిమ ♦ త్స్వాంతమందుఁ
దిన్నగాఁ జేరి కాల్చునీ ♦ దీక్ష్ణమైన
యుష్ణము మరల్చు మోనాధ! యోర్వలేను.
కోపమును దండ్రి! మదిలోనఁ ♦ గొన్ననాఁటి
కంటఁ దడిఁగొన్న తల్లివోల్ ♦ గ్రాలుచుండు

త్వర్ధయాభ్రముఁ బైనుండి ♦ వ్రాలనిమ్ము.

41


ఏడనిల్చితి? వోప్రియ! ♦ నీడడాఁగి;

వారివెన్కను గన్నులఁ ♦ బడకయుండ
దుమ్ము గ్రమ్మినత్రోవలోఁ ♦ ద్రోసికొనుచుఁ
జనుచునున్నారు దాఁటిని౯ ♦ సరకు గొనక;
పూజసామగ్రి ముందటఁ ♦ బొందుపఱచి
వేచి బడలితి నెంతయో ♦ వేళనుండి;
వచ్చిపొయెడువారు పు ♦ ష్పములయందు
నొక్కొటొక్కటె కొనిపోవు ♦ చుండి రిదిగో!
బుట్ట వట్టిది గావచ్చెఁ ♦ బూలు ముగిసి;
కడచెఁ బూర్వాపరాహ్ణముల్; ♦ పొడమె సంజ
నిద్ర కనులకు రాఁ జొచ్చె ♦ నీడ నుంట;
గృహములకు నేగువార లీ ♦ క్షించి నన్నుఁ
జేరి నవ్వుచు ముంచిరి ♦ సిగ్గులోన.
బిచ్చ మెత్తెడుకన్నియ ♦ విధము దోఁప
గొంగు మోమునఁ గూరిచి ♦ కూరుచుంటి;
"నేమిగొరెద?" వని నన్ను ♦ నెవ రడిగినఁ
గన్నులను వాల్చి క్రిందికి ♦ మిన్న కుంటి;
నీకొఱకు వేచి యున్నాను ♦ నే నటంచు
వచ్చుటకు మాట నీవు నా ♦ కిచ్చి తంచుఁ
జేరి యడిగినవారితోఁ ♦ జెప్ప నగునె?
తుచ్చ మగుదీనిఁ గాన్కగాఁ ♦ దెచ్చితి నని

యెట్లు తెల్పుదు నాకు సి ♦ గ్గేని గాదె?

పొంగుదును దీనికయి యంత ♦ రంగమందె.
గడ్డిపైఁ గూరుచుండి యా ♦ కసముఁ జూచి
నీవు దేవ! తటాలున ♦ నింగినుండి
భవ్యతరముగ దిగెడు వై ♦ భవముఁ గూర్చి
కలవరించుచు నుంటి ని ♦ క్కరణి నేను.
ఒక్కమారు తళుక్కని ♦ లెక్కలేని
దీపకొటులు వెల్గె దే ♦ దీప్యముగను.
నీరథస్వర్ణకేతన ♦ నిచయ మెల్ల
నిగనిగల నీని పటపట ♦ నింగి నాడె.
దేవ! నను దుమ్ములోనుండి ♦ లేవ నెత్తి
వేసవిని గాలిఁ దూలుతీ ♦ వియనితాస
గర్వలజ్ఞాభరంబులఁ ♦ గడువడంకు
చింపిగుడ్డల నిబ్బీద ♦ చిన్నదానిఁ
బ్రీతి నీప్రక్కఁ గూర్చుండ ♦ బెట్టికొనఁగ
నీవు పీఠంబు డిగ్గి వేం ♦ చేయఁజూడ
నిరుగడల దారిపొడుగున ♦ నెల్లజనులు
నివ్వెఱను నోరు దెఱచుచు ♦ నిల్వఁ బడిరి.
కాని యెంతయొకాలంబు ♦ గడచి పోయె;
వింతవఱకును వేచిన ♦ యీ చెవులకు
నీరథరథాంగనినదంబు ♦ చేర రాదు.

కనుల మిఱుమిట్లు ♦ గొలిపెడి ♦ కాంతితోడి

వైభవమ్ములు కలకల ♦ స్వనము లొప్ప
నెన్నియొయుత్సవము లిట్టు ♦ లేగుచుండ
వీనివెనుకను నీడలో ♦ మౌనముగను
నిలిచి యుండెడువాఁడవు ♦ నీవె కావె?
వ్యర్ధ మగునానతో వేచి ♦ వంతఁ గుంది

యిట్లు కృశియింపవలసిన ♦ దేనె కాదె?

42


ఏను నీవును మాత్రమే ♦ యెక్కి పడవ
యాత్ర వెడలంగ వలయు; న ♦ య్యాత్రయందు
దేశ మేనియు మఱియు ను ♦ ద్దేశమేని
నుండ దనియును జగతిలో ♦ నొక్కనికిని
దెలియఁ గూడనియట్టి యా ♦ దేశమనియు
వేకువను నొక్క గుసగుస ♦ వినఁగ వచ్చె.
పారమేలెని యమ్మహా ♦ వార్ధియందు
నాధ! సడిలేక వినెడునీ ♦ నవ్వుచేత
వివిధమధురస్వరములచే ♦ వింతగాను
శబ్ధబంధములను వీడి ♦ సరళముగను
దరఁగ లట్టులు మద్గీత ♦ తతులు పొంగు.
తరుణ మింకను రాలేదె ♦ తరలుటకును?

సలుపవలసిన కార్యముల్ ♦ గలవె యింక ?

అదిగొ! తీరంబుపై సంజ ♦ యావహించెఁ;
గనువెలుతు రుండఁగనె యా ♦ కడలిపులుఁగు
లెలమిఁ దమతమగూఁడుల ♦ కెగసి వచ్చె.
ఎపుడు విత్తురు గొలుసుల? ♦ నెపుడు పడవ
సంజయందలి కడపటి ♦ చాయ వోలెఁ
గానరాకుండ రాత్రిలొఁ ♦ గలసి పొవు?

నెవఁడు చెప్పంగఁ గలఁడిది ♦ యెవని కెఱుక?

43


స్వామి! నే నీకు సంసిద్ధ ♦ పడనినాఁడు
పిలువఁ బడకుండ నాకును ♦ దెలియకుండ
నొక్కసామాన్యుకరణి నా ♦ యుల్లమందు
నెమ్మదిగఁ జొచ్చి నాజీవి ♦ తమ్ము లోని
స్థిరముగా మది నిల్వని ♦ చిన్ని చిన్ని
యెన్నియోయంశములమీఁద ♦ నీశ! నీదు
"నిత్తే" మ౯ముద్రఁ జక్కగా ♦ నొత్తి నావు.
లీల దీపంబు నేను వె ♦ ల్గింప నేఁడు
కాంతిపడి వానిమీఁద నీ ♦ సంతకంబు
స్పష్టముగఁ దోఁచె నవియెల్ల ♦ బాల్యమందుఁ
గాంచి మఱచినసుఖదు:ఖ ♦ గణముతోడఁ

జేరి దుమ్మున నటునిటుఁ ♦ జెదరియుండె.

శైశవంబున దుమ్ములో ♦ సలిపినట్టి
క్రీడలనుగూడ నేవతోఁ ♦ జూడ వీవు.
తార లీనెడునిప్ప్రతి ♦ ధ్వనులుఁ గూడ

నాటకగది నాఁడు నేవిన్న ♦ యడుగుసడులె.

44


విడువకుండఁగ వెలుతురు ♦ వెంట నంటి
తఱుము నీడను వేసంగి ♦ దారిఁ బట్టి
వచ్చు చుండెడువర్షము౯ ♦ వాంఛతోడ
వీధివెంబడిఁ గూర్చుండి ♦ వేచి యిట్లు
గాంచు టెంతయు మోదమ్ము ♦ నించు మదికి.
కాంచి యెఱుఁగనియంతరి ♦ క్షములనుండి
దూత లరుదెంచి శుభవార్త ♦ తోడ నాకు
స్వాగత మొసంగి తమదారిఁ ♦ జనిరి వేగ.
అంతరంగము లోలోన ♦ నలరఁ దొడఁగె.
మధుర మగునూర్పుతో వీఁచె ♦ మారుతంబు
ప్రొద్దు వొడిచినదాదిగా ♦ బ్రొద్దు గ్రుంకు
దనుకఁ గూర్చుందు వాకిటఁ ♦ దలఁగ కుండ;
నన్ను దున్నట్లుగా వచ్చు ♦ నెన్నఁడేని
శుభసమయ మేను దప్పక ♦ చూతు నంచు

నెమ్మది నెఱింగి యున్నాను ♦ నిశ్చయముగ.

ఇంతలోపల నిచట నే ♦ కాంతమందుఁ
బరమసంతొషమునఁ బాటఁ ♦ బాడుచుందు.
గాలియునుగూడా నాశాసు ♦ గంధ మంది

పొలయుచున్నది యెంతయు ♦ ముదము నింపి.

45


ఆలకించితె నడిలేని ♦ యతనినడక?
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండుఁ
బగలు పగలును రే రేయి ♦ యుగము యుగము
నిమిషనిమిషము నాతఁడు ♦ నిలుపకుండ
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండు.
వివిధరీతుల నామనో ♦ వృత్తులందుఁ
బాట లెన్నియె నానాటఁ ♦ బాడి యుంటి,
వానిపదజాల మంతయు ♦ వ్యక్తపఱచు
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చు నంచు.
చారుపరిమళముల వెదఁ ♦ జల్లి చల్లి
వఱలు చైత్రంబులో వన ♦ పథము వట్టి
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చు చుండు.
ధాత్రిఁ దమి ముంచునవ్యర్ష ♦ రాత్రులందు
నుఱుము మేఘరధం బెక్కి ♦ తఱలివచ్చు

వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండు.

చింతఁ జిక్కినచిత్తము౯ ♦ జేరి యొ
తద్దయను శాంతి నిడునవి ♦ తత్సదములె.
పైఁడిజిగినంటి సంతొష ♦ భావమునకుఁ

దశతళలఁ గూర్చునవి కూడఁ ♦ దత్సదములె.

46


ఎంతకాలంబునుండి న ♦ న్నెలమిఁ జేర
నెడ తెగక వచ్చుచున్నావొ ♦ యెఱుగ నేను;
రవికిఁ జుక్కులకెని ని ♦ రంతరంబు
నిన్ను నానుండి దాఁపగా ♦ నెన్నఁడేని
శక్తి గలుగంగఁజాలునే ♦ స్వామి! చెపుమ.
మాపు ఱేపును నెన్నియో ♦ మార్లు నాకు
వినఁబడియె నీదుకాల్సడి ♦ వినఁగఁబడియె;
వచ్చి నీదూత నామదిఁ ♦ జొచ్చి నన్ను
గోప్యముగఁ బిల్చి పోయెను ♦ గూర్మితోడ.
ఏమొకోకాని నేఁడు నా ♦ కెపుడు లేని
యతిశయం బైనయుత్సాహ ♦ మంకురించె;
మించి హర్షంబు మదిని గ ♦ లంచి పాఱెఁ;
బని ముగించెడుతఱి వచ్చె ♦ ననగఁ దోఁచె.
సన్నిధిని దెల్పుపరిమళ ♦ సారలవము

ఘ్రాణపర్వముగా సోఁకె ♦ గాలిఁ గలసి.

47

అతనికై వేచి యుంటి ని ♦ రర్ధకముగ;
రాత్రి కొనముట్టవచ్చెను ♦ రాఁడు రాఁడు;
బడలి నిద్రించినపుడు నా ♦ బసకు నతఁడు
వచ్చునొ హటాత్తుగాను బ్ర ♦ భాతవేళ
నంచు నాచిత్త మందు భ ♦ యంబు వొడమె.
దారి తెఱవుడు; తెఱువుడు ♦ తలుపు లెల్ల;
నతని నాటంకపఱువకుఁ ♦ డాప్తులార!
అతనికాల్సడి నను లేవ ♦ దయ్యెనేని
లేవ యత్నింపకుఁడు మీరు ♦ లేపకుండు.
కలకలముసేయుపక్షుల ♦ వలసఁ గాని
సుప్రభాతోత్సవంబునఁ ♦ జూఱలాడు
గాలిచేఁ గాని మేల్కొనఁ ♦ గాదు నాకు.
నాధుఁ డొకవేళ నున్నదు ♦ న్నట్లు వచ్చి
యాలయముఁ జేరెనేనియు ♦ హాయిగాను
నిద్ర పోనిండు; పోనిండు ♦ నిద్ర నన్ను.
అతఁడు ముట్టినఁ జాలు నే ♦ నంతరింతు
ననెడువెలలెనినిద్ర నా ♦ హాయినిద్ర!
నిదుర చీఁకటిలోనుండి ♦ పొదలి వచ్చు
స్వప్నగతి నిల్వ నతఁడు నా ♦ సమ్ముఖమున

నతనిచిఱునవ్వుకాంతిచే ♦ నట్టె విచ్చు
మన్నిమీలితనేత్రాల ♦ కున్నెసాటి?
కాంతు లన్నిఁటిలోఁ దొలి ♦ కాంతివలెను
రూపులన్నిఁటిలోఁ దొలి ♦ రూపువలెను
నతఁడు దృష్టికిగోచర ♦ మగునుగాత!
తెలివి నొందిననాయాత్మ ♦ తొలిసుకంబు
నతనికడకంటిచూపుచే ♦ నందుఁగాత !

కాంచి నను నేను నాతని ♦ గాంతుఁగాత!

48

శాంతముగనున్నప్రాభాత ♦ సమయవార్ధి
చారురుతములచేత సం ♦ చలన మొందే.
త్రోవకడఁ బూలు వికసించి ♦ తొంగలించె;
స్వర్ణసంపద మేఘాల ♦ సందులందు
సిరులఁ జల్లుచు విరివిగాఁ ♦ జెదరి యుండె.
దేని లక్ష్యంబుసేయక ♦ ధీరులట్లు
తొరతొరగఁ బొవుచుంటిమి ♦ త్రోవఁబట్టి
పాటలు విలాసముగ మేము ♦ పాడలేదు;
ఆటలనుగూడ నెవ్వియు ♦ నాడలేదు;
బేరములకయి గ్రామముల్ ♦ చేరలేదు;
నోటిలోనుండి యొకటైన ♦ మాట లేదు;

ఎవ్వఁ డొకసారి యైనను ♦ నవ్వలేదు;
నేలఁ జూచుచు నెక్కడ ♦ నిలువలేదు.
వేళ గడచినకొలఁదిని ♦ వేగ మెచ్చ
నడుచుచుంటిమి మార్గంభు ♦ గడచుచుండె;
గగనమణి నింగినడుమను ♦ గ్రాలఁజొచ్చెఁ;
బావురమ్ములు నీడలో ♦ పలను మూల్గె.
మట్టమధ్యాహ్నమందలి ♦ మండుగాలి
నెడుటాకులు సుడిగొని ♦ నృత్యమాడె.
మఱ్ఱిక్రీనీడ గొల్లఁడు ♦ గుఱ్ఱవెట్టి
కలవరించుచు నిద్రించె ♦ గాళ్లు చాపి;
నీటియొడ్డునఁ గొర్చుండి ♦ నేనుఁగూడ
బడలియుండినయంగముల్ ♦ పచ్చగడ్ది
మీదఁ జాపితిఁ గొంచెము ♦ సేదదీరఁ;
దుచ్చముగఁ జూచి నవ్విరి ♦ తోడివారు;
తరలిపోయిరి యెత్తిన ♦ తలలతోడఁ;
దిరిగి చూడక నిలువక ♦ తెన్నువట్టి
కొనకు దూరాన నీలంపు ♦ మసకలోనఁ
గలసిపొయిరి కనులకుఁ ♦ గానరాక;
ఎన్నియె బయళ్ల, గుట్టల ♦ నెక్కిదాఁటి
చనుచుండిరి దూరదే ♦ శములఁ గడచి.
అంతమొఱుఁగనిమార్గమ్ము ♦ నంది చన్న

ధీరవరులార! మాన్యులు ♦ మీరెసుండు.
వెక్కిరింతలు చీవాట్లు ♦ పెక్కుమార్లు
లేపయత్నింప లక్ష్యంబు ♦ లేకయుంటి.
హర్షగర్భితగాఢదై ♦ న్యంబునందు
మందమోదాంకురచ్చాయ ♦ యందుఁ బడితి;
నింక లేవనటంచు నే ♦ నెంచుచుంటి.
కొనల రవికాంతి ప్రసరించు ♦ క్రొత్తతమము
లొనివిశ్రాంతి నాహృద ♦ యానఁ బర్వె;
యాత్రవిషయంబె మఱచితి ♦ నాత్మలోన;
నీడఁబోలినమాయలో ♦ నెగడుచుండు
వింతలకు గానములకు నా ♦ స్వాంత మెల్లఁ
బెట్టివై చితి నూరక ♦ పెనగకుండ.
కట్టకడపట మేల్కాంచి ♦ కనులు దెఱవ
నీవు ననుఁ జేరి యిట్లు నా ♦ నిద్ర నెల్ల
స్మేరపూరంబుచే ముంచు ♦ చెలువుఁ గంటి.
దీర్ఘమును దుర్గమంబు నీ ♦ దివ్యపథము;
నిన్నుఁ బొందంగ సాధ్యమై ♦ యున్నెయంచు

నెంత వెఱచితి నేనుబ్రా ♦ ణేశ మదిని!

49


నీదుసింహాసనము డిగ్గి ♦ నెమ్మితోడ

నాకుటీరమువాఁకిట ♦ నాధ! నీవు
వచ్చి నిలిచితి వేమన ♦ వచ్చుఁ బ్రేమ!
చేరి యొకమూల గానంబు ♦ సేయుచుంటి;
నొంటిగా నేను బరులకు ♦ గంటఁబడక
యీమధురగీతి చెవిసొఁక ♦ నెలమితోడ
నాకుటీరమువాఁకిట ♦ నాధ! నీవు
వచ్చి నిలిచితి వేమన ♦ వచ్చుఁ బ్రేమ!
గానమున జాణలెందఱో ♦ గలరు; నీదు
భవనమునఁ బాట లెప్పుడుఁ ♦ బాడుచుంద్రు.
ఏఱిఁగి యెఱుఁగక పాడిన ♦ సరళగీతి
యెట్లు నీప్రీతిపాత్రమై ♦ యెసఁగె దేవ?
చేతమున జాలినిడుచున్న ♦ గీత మొకటి
జగతిలోనిమహాగాన ♦ సమితిఁ గలయ,
సుమము నొక్కటి పారితో ♦ షముగఁ గొంచు
నాకుటీరములోనికి ♦ నాధ! నీవు

వచ్చి నిలిచితి వేమన ♦ వచ్చుఁ బ్రేమ!

50


ఇంట నింటను బిచ్చంబు ♦ నెత్తుటకును
గ్రామమునఁ బోవుచుండ మా ♦ ర్గంబు వట్టి
పరమవైభవదీప్తసు ♦ స్వప్న మట్లు

కానఁబడె దూరమున నీదు ♦ కనకరథము.
అహహ! ఱేఱేఁ డెవండని ♦ యబ్రపడితి
నతిశయింపఁగ జొచ్చె నా ♦ యాశ లెల్ల;
వదలె నాదుర్దినము లని ♦ మదికిఁ దొఁచె;
సిరులు వెదజల్లఁబడును బో ♦ క్షితి నటంచు
నడుగకయె యియ్యఁబడుఁ గోన ♦ నగునటంచు
బిచ్చమునకయి దూరాన ♦ వేచియుంటి;
వడిగ రథమును నాకడ ♦ వచ్చి నిలిచె.
దృష్టి నామీఁదఁ బఱపుచుఁ ♦ దేరు డిగ్గి
నవ్వుచును వచ్చితివి నీవు ♦ నన్నుఁ జేర;
భాగ్యము ఫలించె ననుకొంటిఁ ♦ బ్రభువతంస?
యింతలోఁ జాపి కుడిచెయ్యి ♦ యేమి నాకు
నియ్యఁగల వని యడిగితి ♦ వేమి చెపుదు?
బిచ్చగానికిఁ జేఁజూపి ♦ బిచ్చ మడుగు
నిట్టి నీప్రభుపరిహాస ♦ మెన్నఁ దరమె?
చిత్తము చలించె నేనేమి ♦ చెప్ప నగునొో
నాకెే తెలియక యుండెను ♦ నాధ! యపుడు.
సన్నధాన్యంపుగింజ నా ♦ సంచినుండి
తీసి యిచ్చితి నీకు నో ♦ దేవదేవ!
కాని యామాపు సంచిలోఁ ♦ గ్రాలుచుండు
ధాన్యమును గుప్పవోసిన ♦ దానిలోన

నగపడియె మిన్కులీనుచు ♦ నద్భుతముగఁ;
బరమపూరుష! యొక చిన్న ♦ పైఁడిగింజ.
అంత నాదెల్ల నీకిచ్చు ♦ నట్టిబుద్ది
కటకటా! నాఁడు నాకేల ♦ కలుగదయ్యె

నంచు విలపించితిని జాల ♦ నాత్మలోన.

51


రాత్రి యరుదెంచె నెల్లడఁ ♦ గ్రమ్మెఁ దమము;
పనులు ముగిసెను రాత్రి రా ♦ వలయువారు;
వచ్చి రందఱుఁ గడపటి ♦ వాఁడు వచ్చె;
నూరితలుపుల మూసిరి ♦ యుచితరీతిఁ;
బ్రభువు రానున్నవాఁ డని ♦ పలికె నొకఁడు.
అందులకు నవ్వి యిట్లు కా ♦ దంటి మేము.
తలుపుఁ దట్టినయట్లు శ ♦ బ్ధంబు గలిగె.
గాలి యని చెప్పి యచటిదీ ♦ పాల నార్పి
కూర్కుకై పండి యుండగాఁ ♦ గొంతవడికి
నదిగొ! వినబడె దూతప ♦ ల్కనియె నొకఁడు.
అందులకు నవ్వి యది వాయు ♦ వంటి మేము.
నట్టనడు రేయి నొకమహా ♦ నాద మొదవెఁ;
గలవరించుచునిద్రలో ♦ పలఁ బరుంట
దూరమునఁ గల్గునుఱుముగాఁ ♦ దోఁచె మాకు;

నుర్వి వణఁకెను గుడ్యమ్ము ♦ లూఁగియాడెఁ;
దద్ధయును గల్గె భంగమ్ము ♦ నిద్దురకును.
అదిగో! రధచక్రనినదమం ♦ చనియె నొకఁడు.
గొణిగితిమి యఱుమం చని ♦ కూర్కి యుండ
రాత్రి యుండఁగ నంధకా ♦ రమ్ము నందె
భూరిభేరీవమ్ములు ♦ బొరుకొనియె.
లేదు జాలమ్ము లెండను ♦ నద మడరె.
ఱొమ్ములను బెట్టుకొని మాక ♦ రమ్ము లపుడు
వడవడ వడంకుచుంటిమి ♦ భయముచేత.
అదిగొ! ఱేనిధ్వజం బని ♦ యనియె నొకఁడు
అంత మునిగాళ్ల నిలఁబడి ♦ యందఱమును
నఱచితిమి యాలసింపఁ గా ♦ దనుచుఁ దమిని.
రాజు వేంచేసెఁ బూలహా ♦ రంబు లేడ?
విభుఁడు గూర్చుండుటకు సింహ ♦ పీఠ మేడ?
భవ్యతరముగ వెల్గుదీ ♦ పంబు లేడ?
బ్రత్కు లజ్జాభరం బయ్యె; ♦ బ్రదుక నేల ?
వితతభవనంభు లే దలం ♦ కృతులు లేవు.
అనుచు మేమున్నఁ గనుఁగొని ♦ యనియె నొకఁడు
"అఱచి ఫలమేమి స్వాగత ♦ మతని కిమ్ము.
వట్టిచేతులతో మఱి ♦ వట్టివైన
గదుల కాతనిఁ గొనిపొమ్ము ♦ కదలి రమ్ము."

తెఱవఁబడుఁగాక తలుపులు; ♦ దివ్యరవము
పొడమ శంఖాళి యొత్తంగఁ ♦ బడునుగాక !
అంధకారమయంబు భ ♦ యంకరంబు
నైనమనయింటి కరుదెంచె ♦ నధిఁపు డిపుడు
నట్టనడు రేయి మనయెడ ♦ నెట్టిదయయొ;
మేఘముల్ గడునుఱిమెను ♦ మింటఁ గ్రమ్మి;
తమము మెఱపులచేతను ♦ దత్తరిల్లెఁ;
దెమ్ము నీచింపిచాప నీ ♦ దేవునకును;
ముందు ముంగిటఁ బఱువుము ♦ పొందికగను;
గాలరాత్రికి నాధుఁడై ♦ గ్రాలుఱేఁడు

చండవర్షంబులోఁ జెప్ప ♦ కుండ వచ్చె.

52


నీదుగొజ్జంగిపూదండ ♦ నేను గోరఁ
దలఁచితిని గాని ధైర్యంబు ♦ గలుగ దయ్యె.
స్వామి! వేకువ వీడునీ ♦ పాన్పుమీఁద
రాలినవి గొన వేచితిఁ ♦ జాలఁ దమిని.
అర్థికైవడి వేడ్కతో ♦ నరయు చుంటి
రేపకడ నొక రెండు పూ ♦ ఱేకులకును
అహహ! నేనేమి గనుగొంటి ♦ నరసి యరసి
నాకు నీవిడ్డప్రేమ చి ♦ హ్నం బదెద్ది?

దివ్యసుమములో? పరిమళ ♦ ద్రవ్యతతులో?
కాక పన్నీరుబుడ్డియా? ♦ కాదు కాదు.
జ్వాలవలె వెల్గి పిడుగువోల్ ♦ బరువుఁగల్గి
వరలుబలమైననీకర ♦ వాలు దేవ!
బాలరవికిరణాళి ప్ర ♦ భాతవేళ
వచ్చి నీసెజ్జఁ బర్వు గ ♦ వాక్షమునను.
వనిత! నీవేమి గంటివే ♦ యనుచు నన్ను
వేకువను బక్షి గూయుచు ♦ వేడ్క నడుగు.
దివ్యసుమములో? పరిమళ ♦ ద్రవ్యతతులో?
కాక పన్నీరుబుడ్డియా? ♦ కాదుకాదు.
నీకరము పట్టు ఖడ్గంబు ♦ భీకరంబు.
ఎట్టివర మిది నాకుఁ బ్రా ♦ ణేశయంచు
వింతతోఁ గూరుచుండి యో ♦ చింతు నెపుడు.
ఎచట దాపంగవలయునో ♦ యెఱుఁగ రాదు.
అబల నేఁగానఁ దాల్పంగ ♦ నగును సిగ్గు.
అక్కునను జేర్పఁ గాదు గా ♦ యంబు వడును.
అయిన నీవు ప్రసాదించి ♦ నట్టిదీని
దు:ఖకరమైన భరమైనఁ ♦ దొఱఁగకుందు.
హృదయసీమనె ధరియించి ♦ యెసఁగుచుందు.
ఇది మొదలు లేదు భయము నా ♦ కీజగాన
నాదుపోరాటముల నెల్ల ♦ నాధ! జయము

నీకె కల్గును బో యింక ♦ నిక్కముగను.
మకుటముగ నిత్తుఁ బ్రాణంబు; ♦ మరణమునకు
నతనిసాయంబు నీవు నా ♦ కంపియుంట.
బంధనమ్ముల నెల్లను ♦ బట్టి నఱుక
భవదతులఖడ్గ మున్నది ♦ భయము లేదు.
సేయ నిఁకఁ దుచ్చమైనకై ♦ సేఁత లెవియు
వేచి మూలల విలపించు ♦ విధముగాని
వలపు సిగ్గులు గాని నా ♦ వలన నింకఁ
గలుగఁజాలవు ప్రాణేశ ♦ కలుగలేవు
యోగ్యభూషణముగ ఖడ్గ ♦ మొసఁగినావు

బ్నొమ్మసొమ్ముల నెనింకఁ ♦ బూనఁ బూన

53


పలు తెఱంగులరంగులఁ ♦ బరిఢవిల్లు
రత్నములచేత నక్షత్ర ♦ రాజి చేత
ఖచిత మైనట్టినీదుకం ♦ కణము చూడ
నెంతయు మనోహరంబయి ♦ యెసగుఁ; గాని
సంజకొపమ్మువోలు కెం ♦జాయలోనఁ
జక్కవిచ్చిన గరుడుని ♦ ఱెక్కలట్లు
కాంతివంపుననెల్గు నీ ♦ కత్తి చూడ
నంతకంటెన్ నందమై ♦ యలరుదేవ!

మిత్తికడపటిదెబ్బచే ♦ హత్తి నట్టి
బాధఁ దుదిఁ దత్తరిల్లెడు ♦ ప్రాణమట్లు
సంచలించుచు నుండునీ ♦ మించుకత్తి
చండకాంతిని మెఱసి యు ♦ ద్దండమోహ
మంతయును భస్మ మొనరించు ♦ నతులశుభ్ర
తేజమును బోలి క్రాలునీ ♦ తేజువాలు.
ఉడుమణులచేత ఖచితమై ♦ యెప్పనీదు
కంకణము సుందరం బయి ♦ కడుఁ జెలంగుఁ;
గాని చూడంగఁ దలపంగఁ ♦ గానియట్టి
యతులసౌందర్యమహిమచే ♦ నలరుగాదె.

వరలునీచేత తరవారి ♦ వజ్రధాది!

54


అడుగ లే దేమియును నిన్ను ♦ నడుగ లేదు.
చెవిని బడ నీకు నాపేరుఁ ♦ జెప్ప లేదు.
నీ వరుగుచుండ నూరక ♦ నిలిచి యుంటిఁ;
గ్రాలు చుండెడువృక్షంపు ♦ వాలునీడ
నొంటిగా నుంటి నే నూతి ♦ యొడ్డునందు.
నీరు నల్లనికడవల ♦ నిండ నింపి
కొంచుఁ బోయిరి యిండ్లకు ♦ మించుబోండ్లు
అమ్మ ప్రొద్దెక్కెఁ బోదము ♦ రమ్మటంచుఁ

బిలిచినం బోక యేమేమొ ♦ తలఁపులందు
మునిఁగి తోఁచక నేఁ బ్రొద్దుఁ ♦ బుచ్చు చుంటి.
నాకు నీవచ్చునడి చెవి ♦ సొఁక లేదు.
ననుఁ గనెడుచూపె నీవిన్నఁ ♦ దనముఁ జెప్పె.
"దప్పిఁ గొంటిని బాంథుఁడ ! ♦ దప్పిఁ గొంటి."
ననెడునీకంఠమే తెల్ప ♦ నలసి యుంటఁ;
గానఁ గలవరమును మాని ♦ కడవ వంచి
నీరుదోయిటఁ బోసితి ♦ నీరములను;
గాలిచే మీఁద నాకులు ♦ గలగలమనెఁ;
గనులఁ బడకుండఁ గూసెఁ బి ♦ కంబు నీడ.
దారికొనవంపులోనుండి ♦ తరలి వచ్చి
పొగడపూవుసువాసనల్ ♦ బుగులుకొనియె.
అడిగితివి పేరు గావునఁ ♦ బొడమి లజ్జ
మౌనమును దాల్చి నిల్చితి ♦ మాట లుడిగి.
ఇంతకును నేను జేసిన ♦ దేమి గలదు
నీవు నన్మదిలోపల ♦ నిల్చుటకును?
నీకు దాహంబుఁ దీర్పఁగా ♦ నీర మీయఁ
గాంచుటయె హర్షమున నన్ను ♦ ముంచు చుండు.
స్థిరముగా మన్మనంబునఁ ♦ జేరి నిలిచి
తెల్లగాఁ దెల్లవాఱెను; ♦ మెల్ల మెల్లఁ
బక్షిజాలమ్ము లటనటగా ♦ బాడఁ జొచ్చె.

}}
}}

నింబవృక్షంబుపైఁ బత్ర ♦ నిచయములును
గదలి గాలికిఁ జప్పుడు ♦ గలుగఁ జేసెఁ;

జింత సేయుచుఁ గూర్చుంటిఁ ♦ జిత్తమునను.

55


మాంద్య మింకను విడదు నీ ♦ మానసమును;
నిద్ర యింకను విడదు నీ ♦ నేత్రములను;
బుష్పరాజము ఠీవితో ♦ ముండ్లనడుమ
నెంతయును గ్రాలె ననుటను ♦ నీవు వినవె?
మేల్కొనుము జాగు సేయక ♦ మేలు కొనుము.
ప్రొద్దు వ్యర్ధంబుగాఁ బుచ్చఁ ♦ బోకు వినుము.
మత్సఖుం డీశిలామయ ♦ మార్గమునకు
నంతమం దుండుకేవలై ♦ కాంతసీమ
నొంటిగాఁ దాను గూర్చుండి ♦ యున్నవాఁడు.
మోసపుచ్చకు పుచ్చకు ♦ మోసమతని.
మేల్కొనుము జాగు సేయక ♦ మేలుకొనుము.
మండు మధ్యాహ్మమందలి ♦ యెండవడికి
బెదరి దివి గుండె లదరిన ♦ నదరుఁ గాక;
తప్తసికతంబు దాహవ ♦ స్త్రంబుఁ దాను
వింతగాఁ దాల్చ విప్పిన ♦ విప్పుఁ గాక;
హృదయగంభీరతలమున ♦ ముదము లేదె?

మెట్టినపు డెల్లఁ ద్రోవ య౯ ♦ మేలివీణె

భవ్యరవముల నీనదే ♦ బాధపేర?

56


నిండి నాలోన నీహర్ష ♦ ముండు నిట్లు.
ఇత్తెఱంగున ననుఁ జేర ♦ వత్తు వీవు.
ఏనె లేకున్న నీప్రేమ ♦ మెచట నుండు?
దివిభుల నెల్ల నేలెడు ♦ దేవదేవ!
చెన్నుమీఱుచు నుందునీ ♦ సిరుల కెల్లఁ
గైకొనితి నీవు నన్ను భా ♦ గస్థుఁ గాఁగ.
నీమహానంద మేవేళ ♦ నృత్యమాడు
నదనముగ నుండుఁ గాదె నా ♦ హృదయసీమ
భవదుదారేచ్చ రూపంబుఁ ♦ బదయుచుండు;
సతతమును దేవ! నాదుజీ ♦ వితమునందు.
నన్ను మోహింపఁజేయఁగా ♦ నాథనాథ!
భవ్యరూపంబు నీ విట్లు ♦ పడసినావు.
దీని కై నీదుప్రేమంబు ♦ లీన మౌను
బేర్మితో నిన్నుఁ బ్రేమించు ♦ ప్రేమలోనఁ;
గడకు రెం డిట్లు పూర్తిగఁ ♦ గలసి పొవ
నందుఁ గానంగ వత్తు నా ♦ నందముగను.

57

తేజమా! నాదుతేజమా! ♦ దీప్తి చేత
జగములను నింపితేజమా! ♦ స్వాంతమందు
శాంతములను గూర్పు తేజమా! ♦ చక్షువులను
ముద్దుఁగొనుతేజమా!నీకు ♦ నుద్ది యెద్ది?
ప్రేమమా! నాదుజీవన ♦ సీమనడుమ
నిరతమును దేజ మెంతయు ♦ నృత్యమాడు.
ప్రేమమా! ప్రేమతంతులఁ ♦ బ్రేమతోడఁ
దేజ మొకయింతఁ దాఁకినఁ ♦ దేటముగను
నింగి విచ్చును గాలి చె ♦ లంగి వీచు;
హర్షపూరము భూమిపై ♦ నట్టె పాఱు;
నెలమితోడ సీతాకోక ♦ చిలుక లెపుడు
తేజ మనునర్ధిమీఁదనె ♦ తెరలువిప్పుఁ;
జెలఁగుతేజోబ్ది వీచికా ♦ శీర్షములనె
వలసి కల్వలు మల్లెలు ♦ విచ్చుచుండు.
స్వర్ణమును మేఘములమీఁద ♦ బారఁ జల్లి
రత్నరాజిని వెదఁజల్లు ♦ రాజుఁగూడఁ;
దేజమే సుమ్ము ప్రేమమా! ♦ తేజె సుమ్ము
పర్వుఁ బైఁబయిఁ బర్వంబు ♦ పత్రములను

హర్ష మంతటఁ బ్రాఁకును ♦ హద్దుమీఱి

నాక నది ముంపఁ దీర మా ♦ నందరసము

వెల్లువగఁ బాఱి జగముల ♦ నెల్ల నిండె.

58


ధరను మితిమీఱుగడ్దిగాఁ ♦ బఱపుచుండు,
చావుబ్రదుకుల గవలనీ ♦ జగతిమీఁద
నంచితంబుగ నృత్య మా ♦ డించుచుండు,
గాలివానను బ్రాణులఁ ♦ గదిపి లేపి
వీఁకమై వింతగా నవ్వి ♦ వీచుచుండు
వెతయనెడువిచ్చు కెందమ్మి ♦ పీటయందు
జాఱఁ గన్నీరు మిన్నక ♦ కూరుచుండు,
దుమ్ములో నున్నదెల్లను ♦ దులిపివైచి
యించుకయు నెమియైనను ♦ నెఱుఁకుండు
వివిధహర్షప్రవృత్తులు ♦ వేడ్క మీఱఁ

గలసి పోవుత నాయంత్య ♦ గానమందు.

59

పత్త్రముల నృత్యమాడెడు ♦ పైఁడికాంతి
నింగి మెల్లఁగ నరిగెడు ♦నీరదములు
చల్లగా ఫాల మంటుచుఁ ♦ జనెడుగాలి
యెల్ల నీప్రేమకాని వే ♦ ఱేమి గాదు.

పరమపూరుష! ప్రియతమ! ♦ ప్రాణనాధ!
నీవు నామది కనుపుసం ♦ దేశ మగుచు
వరదగాఁజొచ్చెఁ గనులఁ బ్రా ♦ భాతకాంతి
మించునీమోముపైనుండి ♦ వంచి తీవు;
క్రాలునీకంటిచూపు నా ♦ కనుల వ్రాలె;

భక్తితో నామనంబు నీ ♦ పాదమంటె.

60

పారమే లేనిసంసార ♦ వార్ధితీర
మందుఁ జేరిరి పిల్ల లా ♦ నందముగను;
మీఁద శాంత మనంతమౌ ♦ మిన్ను పొదలె;
జలధి ఘోషిల్లుచుండె వి ♦ శ్రాంతి గనక;
పారమేలేనిసంసార ♦ వార్ధి తటిని
వేడ్కనుం ద్రాట పాటలఁ ♦ బిల్ల లెపుడు.
ఇసుకచే నిండ్లఁ గట్టుచు ♦ నెసఁగుచుంద్రు;
వట్టిగుల్లలతో నాడి ♦ వఱలుచుంద్రు;
ఎండుటాకులఁ బడవల ♦ నెలమి నల్లి
నగుచు విడుతురు తేల సం ♦ ద్రమ్ముమీఁదఁ;
బారమే లేనిసంసార ♦ వార్ధితటిని
వేడ్కతో నాడుచుందురు ♦ పిల్ల లిట్లు.
ఈఁద నెఱుఁగరు వలవైచి ♦ యెఱుఁగ రెపుడు;

ముత్తెములఁ దీయువారలు ♦ ముత్తెములకు
మునుఁగుచుందురు మున్నీట ♦ ముదముతోడ;
నరుగుదురు నావ లెక్కి బే ♦ హార్లుగాని
పొందుగా గుల్కరాళ్లను ♦ బ్రోగుసేసి
చల్లుచుందురు మాటికిఁ ♦ బిల్ల లెలమి;
దాఁగుసిరులను వెదుకంగఁ ♦ దలఁప రెపుడు;
వలలు వైచుట యెట్టిదో ♦ తెలియకుంద్రు.
వార్ధి పకపక నవ్విన ♦ పగిది పొంగు.
తీరసుస్మేరమొప్పును ♦ దెల్లఁగాను.
అంత మొదవించుశక్తితో ♦ నలరు నలలు
పిల్ల నిడి తొట్ల నూఁపెడు ♦ తల్లివోలెఁ
బాడు నర్థములేనట్టి ♦ పాట లెపుడు
హాయిగా బాలు రెంతయు ♦ నాలకింప.
తోయనిధి యాడుఁ బిల్లల ♦ తోడఁ గూడి;
తీరసుస్మేర మొప్పును ♦ దెల్లఁగాను.
పారమే లెనిసంసార ♦ వార్ధితటిని
వేడ్కతోఁ గూడి యుందురు ♦ పిల్ల లెల్ల;
విపథమై పోల్చుచుండెడు ♦ వింటియందుఁ
గడఁగి సంచార మొనరించు ♦ గాలివాన;
దుష్పథంబైన వార్దిని ♦ దూలి తూలి
విఱుగుచుండును నావలు ♦ విఱుగుచుండు;

మృత్యుదేవత స్వేచ్చఁజ ♦ రింపఁజొచ్చె:
వేడ్కతో నాడుచున్నారు ♦ పిల్ల లెల్ల;
పారమేలేని సంసార ♦ వార్ధితటిని

వేడ్కతోఁ గూడుచున్నారు ♦ పిల్ల లెల్ల

61


శిశువు కన్నులఁ గదలుచుఁ ♦ జెలఁగు నిద్ర
వచ్చు నెటనుండి తెలిసిన ♦ వారు గలరె?
ప్రేమఁ గిన్నరవరు లుండు ♦ గ్రామమందు
మిణుఁగురుఁబురుంగు మిన్కుల ♦ మించుచుండు
చారుతరపుణ్యకానన ♦ చ్చాయలందు
విమలమోహనమూర్తు లై ♦ వ్రేలుచుండు
నిగ్గులఁ జలించునారెండు ♦ మొగ్గలందు
నది వసించెడు నని జను ♦ లనుచునుంద్రు.
శిశువుకన్నుల మొద్దిడి ♦ చెలఁగుకొఱకు
వచ్చునిద్దుర యటనుండి ♦ వచ్చుచుండు.
నిదురపోయెడిశిశువుకెం ♦ బెదవులందుఁ
జెన్నుమీఱఁగఁ జలియించు ♦ చిన్న నవ్వు
పుట్టు నెచ్చటఁ దెలిసిన ♦ పురుషుఁ డున్నె?
మంచుగప్పినవేకువఁ ♦ గాంచుకలను
నంతరించు శరన్మేఘ ♦ సంచలమును

నర్ధచంద్రునివెలిమిను ♦ కంటినపుడు
మించునీచిన్ని నవ్వు జ ♦ న్మించెఁ దొలుత
ననుచు నుందురు జను లిల ♦ ననుచునుంద్రు.
శిశువు సర్వాంగములయందుఁ ♦ జేరి యలరు
మృదుమధురమైనక్రొంజిగి ♦ యింతవఱకు
నెచట డాఁగెనా యెవఁడేని ♦ నెఱిఁగి యున్నె?
తల్లి చిఱుకన్నియగ నుండు ♦ తఱిని నిద్ది
కోమలావ్యక్తగూఢన ♦ త్స్రేమఁ గూడి

యామొహృదయాన వ్యాపించి ♦ యణఁగి యుండె.

62


పలు తెఱంగులరంగుల ♦ గలసి వెలుఁగు
క్రీడవస్తువులను నీకుఁ ♦ బ్రీతి నిడిన
యపుడు తెలియును నాకు నో ♦ యనుఁగుబి
యిన్నిరంగులు మేఘాల ♦ నేలఁగలవొ?
యిన్నిరంగుల నీటిలో ♦ నేలఁగలవొ?
పూలలో నేల రంగులు ♦ పొదుగఁబడెనొ.
ఆడుటకు నిన్నుఁ గొల్ప నేఁ ♦ బాడఁదొడఁగు
నపుడు తెలియును నాకు నో ♦ యనుఁగుబిడ్డ!
యేల నాకులలో గాన ♦ లీల గలదొ?
యేల నాలించు భువి హృద ♦ యమ్ము సోఁకఁ

దరఁగ లెల్లను దమతమ ♦ ధ్వనులఁ గూర్చి
పల్లవులఁ జేసి పంపఁగాఁ ♦ బాటుపడునొ.
ఆశతోఁ గూడియున్ననీ ♦ హస్తములను
మధుర మైనపదార్ధముల్ ♦ మమత నిడిన
యపుడు తెలియును నాకు నో ♦ యనుఁగుబిడ్ద!
యేల విరిగిన్నెలోఁ దేనె ♦ గీలుకొనెనొ
యేల గొప్యమ్ముగా ఫల ♦ జాలమందు
నేర్పుతో మంచిరసములు ♦ గూర్పఁబడెనొ.
పూని నవ్వింప నీమోము ♦ ముద్దుగొన్న
యపుడు తెలియును నాకు నో ♦ యనుఁగుబిడ్డ!
వేకువను నింగిపైనుండి ♦ వెడలుకాంతి
యందు బ్రవహించుసంతోష ♦ మనఁగ నేమొ
వేసవిని గాలి నన్నంట ♦ వీచినప్పు

డందుఁ గలిగినయానంద ♦ మనఁగ నేమొ.

63


తెలిసియుండనిమిత్రుల ♦ దెలియఁజేసి
నావి గానట్టిగృహములఁ ♦ దావు లొసఁగి
పరిచయము లేనివాని సో ♦ దరునిఁ జేసి
దూరమును దగ్గఱగఁ జేయు ♦ దొరవు నీవు.

ఉండి పరిచయమైనట్టి ♦ యునికి వీడ

మదికి నెంతయు నాయాస ♦ మొదవుచుండుఁ;
గ్రొత్తలోఁ బ్రాఁత యుంటయు ♦ గూర్మితోడ
నీవునుం గూడి యుంటయు ♦ నేను మఱతు.
పరిచయము లేనివానితో ♦ భవ్యమైన
హర్షబంధమ్ము నాయాత్మ ♦ కమరఁ గొల్పి
నెమ్మిఁ దుద లేనినాజీవి ♦ తమ్మునందు
నేకమిత్రుఁడవై యుండి ♦ యెనగునీవె
యిచట గాని మఱెచ్చట ♦ నేనిఁగాని
జననమరణాదులందునా ♦ సరస నుండి
నన్ను నడిపించుచుందు వ ♦ నాథనాథ!
నిన్ను నెఱిఁగిన నిఁక నున్నె ♦ భిన్నబుద్ది?
తెఱవఁ బడుఁ దల్పులన్నియుఁ ♦ దెఱవఁబడును
పెక్కులీలల నొక్కఁడై ♦ వెలయునీదు
ప్రవిమలస్పర్శ కేను దూ ♦ రంబుగాక

యుండఁ గోరెడునాకోర్కె ♦ పండనిమ్ము.

64


చేరి నేనొకనిర్జన ♦ సీమయందు
నేటవాలుగఁ బ్రవహించు ♦ నేటియొద్దఁ
గడుఁ బొడుగుగాఁగఁ బెరిఁగిన ♦ గడ్దిలోన
నిలిచి యిట్లంటి నామెతో ♦ నెలమితోడఁ;

"గొంగునీడను దీపంబు ♦ గూర్చి యిట్టు
లెచటి కేగెద? కన్నెరో! ♦ యెఱుఁగఁ జెపుమ.
ఉండె నాయిల్లు చీఁకటి ♦ నొంటిగాను;
ఇమ్ము దీపమ్ముకన్నెరో ! ♦ యిమ్ము నాకు."
అన్న నల్లనికన్నుల ♦ నట్టె యెత్తి
మసకలోఁజూచి నామోము ♦ మగువ యపుడు
తరణి పడమటఁ గ్రుంకిన ♦ తఱిని నేట
దీపమును దేల్ప వచ్చితిఁ ♦ దెలియు మనియె.
గడుఁ బొడవుగాఁగఁ బెరిగిన ♦ గడ్దిలోన
నొంటిగా నేను నిలఁబడి ♦ యుండి యుండి
కాంచితిఁ జలించుదీపంబు ♦ గంగలోనా
నూరకే కొట్టుకొనిపోవు ♦ చుంట; నంత
రాత్రి నిశ్శబ్ద మగుడు నా ♦ రమణీతోడఁ
"గన్నెరో! నీదుదీపమ్ము ♦ లన్ని వెలిఁగె
నెచటి కేగెదు దీపమ్ము ♦ నింకఁ గొనుచు?
నుండె నాయిల్లు చీఁకటి ♦ నొంటిగాను.
ఇమ్ము దీపమ్ము కన్నెరో! ♦ యిమ్ము నాకు."
అన్న నల్లనికన్నుల ♦ నట్టె యెత్తి
వదన మీక్షించి సంశయ ♦ పడుచు నిలిచి
"దివికి నంకితముగ నాదు ♦ దీప మియ్య
వచినా" నని కడపటఁ ♦ బలికె నామె.

వృథగ నాకన్నె దీపంబు ♦ వెలుఁగుచుండ
నిలిచి చూచితి నేనును ♦ నిలిచి నిలిచి.
రజనిపతి లేనియామధ్య ♦ రాత్రియందు
"అమ్మ! దీపమ్ము నీహృద ♦ యమ్ముకడను
బెట్టి కన్నెరొ! నీవేమి ♦ వెదకె దిపుడు?
ఉండె నాయిల్లు చీఁకటి ♦ నొంటిగాను
ఇమ్ము దీపమ్ము కన్నెరో? ♦ ఇమ్ము నాకు."
అన్న నిలబడి తలఁపోసి ♦ యాన్యమందుఁ
జీఁకటిం దృష్టి పఱిచి యా ♦ చెలువ మిన్న
"నెమ్మి దీపంబు దీపోత్స ♦ వమ్మునందుఁ
జేర్చఁ దెచ్చితి" ననుచుఁ దాఁ ♦ జెప్పి పొయె
నామె చిన్ననిదివ్వె దీ ♦ పాళిలోనఁ
గాలిపోవంగ వ్యర్ధమై ♦ కన్నులారఁ

జూచుచుండితి నిలఁబడి ♦ చూచుచుంటి

65


అభవ! యీనాదుజీవిత ♦ మనెడునట్టి
నిండితొల్కాడుగిన్నెలో ♦ నుండి దేవ!
యేమధురదివ్యరసమును ♦ బ్రేమతోడఁ
గ్రోలుకోరికి యున్నదో ♦ కూర్మిఁ జెపుమ!
ఓకవీంద్ర! మదీయవి ♦ లోకనముల

నీదుసృష్టిని గనుటయు ♦ నాదుచెవుల
వాఁకిళుల నిల్చి నీనిత్య ♦ పరమశాంతి
వినుటయును నీకు వేడ్కలై ♦ వెలసియున్నె?
నీజగము నామనంబున ♦ నేర్పుతోడ
నల్లుచున్నవి పదముల ♦ నందముగను;
నీప్రమోదమ్ము వానికి ♦ నింపు నింపు;
నెన్నగాఁగానిప్రేమతో ♦ నిన్ను నీవె
నాకు నొసఁగుచునాయందె ♦ నాథ నీవె

పొందుచుందువు నీపరి ♦ పూర్ణసుఖము.

66


సంజ మిణుకుమిణు క్కను ♦ సమయమునను
మద్గభీరతలమ్మును ♦ మాననట్టి
వేకువనుగూడ ముసుఁగును ♦ వీడనట్టి
దానినుంచి మదీయాంత ♦ గానమందు
నెలమిఁ దుదికాన్కగా నీకు ♦ నిడెద దేవ!
పలుకులు వరించి మెప్పును ♦ బడయ దయ్యె;
హస్తములు చాచె బోధన ♦ వ్యర్ధముగను
బదిలముగఁ బెట్టి దీని నా ♦ హృదయమందు
దేశదేశమ్ము లెల్లను ♦ దిరిగినాను;
దీనఁ గడచెను నాదువృ ♦ ద్ధిక్షయములు;

పనులఁ దలఁపుల నిద్రల ♦ స్వప్నములను
నీమెయే యేలుచుండియు ♦ నేకతముగఁ
దొలఁగియే యుండు నెప్పుడుఁ ♦ దొలఁగి యుండు;
నెందఱో యీమెకొఱకు నా ♦ యిల్లు సేరి
యరుగుచుందురు తుదకు ని ♦ రాశఁ జెంది.
ఈమెను ముఖాముఖం జూచి ♦ యెఱుగ రెవరు;
నీదుసమ్మతి నొంది తా ♦ నెగడుటకును

వేచి యున్నది యొంటిగా ♦ వేచి యుండె

67


నీవె యాకసమును మఱి ♦ నీవే గూఁడు.
నీదుప్రేమయే గూఁటిలో ♦ నెగడుజీవుఁ
జిత్రవర్ణమ్ములను మఱి ♦ చిత్రశబ్ద
చిత్రగంధమ్ములం గూర్చుఁ ♦ జిత్రరూప!
మహికి మకుటోత్సవము సల్ప ♦ మోననియతి
విమలసౌందర్యహారంబు ♦ వెట్టి యున్న
పైఁడిబుట్టను గుడిచేతఁ ♦ బట్టి వచ్చు
భవ్యతరముగ సతము ప్రా ♦ భాతవనిత.
పసులమందలు వీడిన ♦ బయళులందు
జాడ లేనట్టిత్రోవలఁ ♦ జల్లఁగాను
శాంతపశ్చిమజలధిప్ర ♦ శాంతజలము

నించి బంగారుకుండలో ♦ నెమ్మిఁ దెచ్చు
సతము సంధ్యాంగనామణి ♦ సౌరుమీఱఁ;
గాని జీవాత్మ యెగయఁగాఁ ♦ గ్రాలుచుండు
నంత మెఱుఁగనియట్టి య ♦ నంతమందు
వికలవిశదసితచ్ఛటల్ ♦ వెలుగుఁ గాని
రంగు రూపము పగలును ♦ రాత్రు లనెడు

పలుకులే లేవు చూడనా ♦ స్థలమునందు.

68


నేను గార్చెడుకన్నీట ♦ నేను విడుచు
వేఁడినిట్టూర్పులను నేను ♦ బాడునట్టి
గానములచేత నైనమే ♦ ఘముల నీదు
పాదములకడఁ జేర్పఁగా ♦ నీదుసూర్య
కిరణ మీనాదుభూమిపైఁ ♦ గరముఁ జాచి
నాదు జీవితకాలది ♦ నంబు ముగియు
వఱకు నావాఁకిటను నిల్చి ♦ వఱలు దేవ!
క్రాలుచుక్కలతోడి వ ♦ క్షస్థలమునఁ
బలు తెఱంగులముడుతలు ♦ పడెడునట్లు
వివిధరూపంబులను బొంది ♦ వెలుఁగునట్లు
సారెకును దిద్ది యెప్పుడు ♦ మారుచుండు
రంగులను రంగువేసి హొ ♦ రంగు మిఱఁ

దాల్చుచుందువు మేఘవ♦ స్త్రంబు దేవ!
తేలికయు మెత్తఁదనము న ♦ స్థిరతబాష్ప
జలములును నల్లదనమును ♦ జాల నుంట
దానిఁ బ్రేమింతువు గదా యు ♦ దారచరిత!
కాన నీకేవలశ్వేత ♦ కాంతిమీఁద

జాలిమైఁ గప్పుఁ దత్తమో ♦ చ్చాయ లెపుడు.

69


నాదునాడులయందు న ♦ నారతంబుఁ
బాఱు జీవనపూర మే ♦ పాఱుచుండు
సకలజగములయందును ♦ సంతతంబు
నొక్కతీరున లయ దప్ప ♦ కుండునట్లు.
అదియె పొదలుచుఁ దలయెత్తు ♦ నవనినుండి
పొలుచుపలు తెఱుఁగులగడ్డి ♦ పోచ లగుచు;
నదియె యుప్పొంగు బుష్పప ♦ త్రాళియగుచు;
నదియె వృద్ధిక్షయంబుల ♦ నంది చెలఁగు
లోలసంసారసాగర ♦ డోలయందు
నూఁపఁబడుచుండు నెప్పుడు ♦ నూఁపఁబడును.
చేతనాత్మక మైనవి ♦ ఖ్యాతజగతి
యంటుమాత్రన నాయావ ♦ యపములెల్ల

ధన్యతను గాంచె నంచునేఁ ♦ దలఁచు చుందు;
నెంతయోకాలమునుబట్టి ♦ హృదయ మంటి
యిపుడు మచ్చోణితంబున ♦ నృత్యమాడు

నాయహంభావ మెన్న స ♦ నాతనంబు

70

ఒక్కలయగతి నేగునీ ♦ యుత్సవమున
నలరుటయు భీతిఁ గొల్పెడు ♦ హర్షమనెడు
సుడిని బడి తూలి బ్రద్ధలై ♦ మడియుటయును
నీకు బాహ్యంబు లౌ నేమొ ♦ నాకుఁ జెపుమ.
తిరగి చూడక నిలువక ♦ తెన్నువట్టి
యన్నియును గొట్టుకొనిపొవు ♦ నద్భుతముగ
వానినాపంగ శక్తి యె ♦వ్వనికిఁ గలదు?
సకలమునుబోవుఁ బోవుఁ గొ ♦ ట్టుకొని పోవుఁ;
గనకవిశ్రాంతి పాఱు నీ ♦ గానగతికిఁ
దగినరీతిని నడుగులఁ ♦ ద్వరగ నిడుచు
వచ్చుచుం బోవుఋతువులు ♦ దెచ్చి తెచ్చి
వర్ణములఁ బాటలను మఱి ♦ పరిమళములఁ
బోయుచుండును సెలయేళ్లఁ ♦ బోలె నెపుడు
క్షణములొఁ దూలి పొలయు సౌ ♦ ఖ్యములయందు.

71

నన్ను నేఁ బెద్ద యనుకొని ♦ యన్నికడల
రంగునీడల నీప్రభా ♦ రాశిమీఁద
నెలకొలుపుచుందు నిదె గదా ♦ నీదుమాయ.
నీవె నీలోనిభాగంబు ♦ నెమ్మిఁ దీసి
పిలుతు వద్దాని నెన్నియో ♦ పేళ్లచేత;
నీవిభాగమె నాదునా ♦ కృతిని గాంచె;
గగనమంతటనుండి యీ ♦ కఠినగీతి
ప్రతిరవము లీనుఁ జిత్ర బా ♦ ష్పములయందు
హర్షభయములయందును, ♦ నాశలందు;
వీచికలు మాటిమాటికి ♦ లేచి పడును;
గలలు విరియుచు వెండియుఁ ♦ గలుగుచుండు;
నీవు నాయందు నోడుదు ♦ నీకు నీవె.
ఈ వొనర్చిన తెరమీఁద ♦ నెన్నియేని
జిత్రములు వ్రాయఁబడియె వి ♦ చిత్రముగను
మించురేయుబవళ్లను ♦ కుంచెతోడ.
గనఁగ విసు గగుసరళ రే ♦ ఖలను వీడి
యతివిచిత్రపువంపుల ♦ నల్లఁబడిన
నీదుపీఠంబు తెరవెన్క ♦ నెగడుచుండు.
నీకు నా కగుబండుగ ♦ నింగిఁ బర్వె;

గాలి నీ నా సమశ్రుతి ♦ గలసి మ్రోఁగెఁ;
బొదలి మన మాడుదాఁగుడు ♦ మూఁతలాట

కున్నె యంతమ్ము కాలమ్ము ♦ లెన్ని చన్న.

72

ఆతినిగూఢంబుగా నన్ను ♦ నంటి యంటి
ప్రకట మౌనట్లు ననులేపు ♦ ప్రభు వనంగ
నంతరాంతరమందు ను ♦ న్నట్టియతఁడె.
నాదునేత్రాలపై మంత్ర ♦ మూఁదుచుండి
వివిధసుఖదు:ఖమూర్చనల్ ♦ వెలయు నట్లు
నాదుహృత్తంత్రులను మహా ♦ నందముగను
వాటముగ మీటుచుండెడు ♦ వాఁడు నతఁడె.
ఎంతయును జంచలం బయి ♦ యెసఁగుచుండు
నీలసితపీతహరిత వ ♦ ర్ణాలిచేత
మాయ యనుజాలమును సదా ♦ నేయు చుండి
దేని నంటిన మఱతునో ♦ నేను నన్నె
యట్టితనచరణాబ్జమ్ము ♦ లందముగను
మాయముడుతలలొనుండి ♦ మానసాక్షి
పథమునకు గోచరము సేయు ♦ వాఁడు నతఁడె.
ఎంతకాలము వచ్చిన ♦ నెంత చన్న
నామముల నెన్నియోరూప ♦ ధామములను

మోదములను మఱెన్నియో ♦ ఖేదములను

సతము నామదిఁ గొల్పెడు ♦ స్వామి యతఁడె.

73


ముక్తి నేఁ గోర నెపుడు వి ♦ రక్తి యందుఁ
బ్రమద మొసఁగెడు వేనవేల్ ♦ బంధనముల
మోక్షపరిరంభణసుఖం బె ♦ పొడము మదికి.
వివిధవర్ణసుగంధముల్ ♦ వెలసి యున్న
క్రొత్తద్రాక్షారసమ్మును ♦ గూర్మితోడ
వంచి తిన్నగ నాదుమృ ♦ త్పాత్రయందు
నిరతమును బోయుచుందువు ♦ నిండునట్లు.
తావకజ్వాలచేత వం ♦ దలకొలంది
వివిధదీపాల వెలిగించి ♦ వింత గదుర
దేవ! నీయాలయంబున ♦ దివ్యపీఠి
ముందుఁ బెట్టును నాజగ ♦ మందముగను.
మూయ నాయింద్రియద్వార ♦ ములను మూయ
గన్నుఁ జెవియును స్పర్శంబుఁ ♦ గాంచుసుఖము
నీసుఖంబును వహియించు ♦ నిక్కువముగ.
నాదుమాయావినోద మా ♦ నందతేజ
మగుచు వెల్గును నాయాశ ♦ లన్నిగూడఁ
బక్వమగుప్రేమఫలము లై ♦ పరిణమించు.

74

పగలు ముగిసెను; భూమిపైఁ ♦ బడియె నీడ;
సమయ మయ్యెను గడవలో ♦ జలము నింపి
తేఁగ నదికడ కే నరు ♦ దెంచుటకును;
జాలి యిడునీటిగానము ♦ సంజగాలి
కెంతయును గొల్పెఁ దమకంబు ♦ వింతగాను.
పిలుచు చున్నది మసకలో ♦ పలికి నన్ను;
నందు నిశ్చబ్ధముగ నుండె ♦ జనులు లెమిఁ;
దెరువరియుఁగూడ దెన్నునఁ ♦ దిరుగ కుండె;
బడలికలు వాపుగాలి వీ ♦ వంగఁ దొడఁగె;
జిన్నతరఁగలు నదిలోనఁ ♦ జెలఁగఁ జొచ్చె;
మరలుదునొ లేనొ యింటికి ♦ నెఱుఁగ రాదు;
తెలియ డెవ్వఁడు నాతోడఁ ♦ గలిసి కొనునొ;
రేవుకడఁ జిన్నపడవలోఁ ♦ బ్రీతితోడ

నెవ్వఁడోగాని వీణ వా ♦ యించె నదిగొ!

75


యోగ్యముగ మర్త్యు లగుమాప్ర ♦ యోజనములఁ
గూర్మి నెరవేర్చిననుగూడఁ ♦ గొఱఁత పడక
మరల నిను జేరఁ బాఱు న ♦ మందగతిని

నీప్రసాదంబు లెల్ల న ♦ నింద్యచరిత!
తనకుఁ గలనిత్యకర్తవ్య ♦ మును నొనర్పఁ
బల్లెలం బొలములఁ జొచ్చి ♦ పఱచి కూడ
నెడతగక పాఱునేఱు నీ ♦ కడకె మరలుఁ
గడకు నీపాదకమలముల్ ♦ గడుగుకొఱుకు.
విరివిరిసి చక్కగాఁ దన ♦ పరిమళమును
గాలిలోపలఁ గమ్మగాఁ ♦ గ్రమ్మికూడఁ
గొనకుఁ దను నీకు నర్పించు ♦ కొనుటె తనకు
నంత్యకర్తవ్యముగ నెంచు ♦ నమలచరిత!
పొందునె కొఱంత జగము నీ ♦ పూజవలన?
కవులు పలుకుచునుండువా ♦ క్యముల కవని
నెవ్వ రేయర్ధ మొనరించి ♦ రేనిఁగూడ

వానిఫలితార్ద మెల్ల నీ ♦ వైపె చూపు.

76


నాఁడునాఁటికి నాప్రాణ ♦ నాథ! నేను
నీముఖాముఖి నిలువఁగా ♦ నేర్తుఁ గాక!
చేతులను గట్టుకొని జగ ♦ జ్జ్యోతి వైన
నీకు నేను ముఖాముఖి ♦ నిలుతుఁ గాక!
కడువిశాలంపునీదు నా ♦ కనముక్రింద
నేకతంబుగ మౌనంబు ♦ నే ధరించి

వినయ మొప్పెడుమదితోడ ♦ వెలయు చుండి
నీముఖాముఖ నెప్పుడు ♦ నిలుతుఁ గాక!
తమపనులఁ బోరుజనులసం ♦ దడిని గలిగి
కూడి వడివడిఁ జనియెడు ♦ గుంపు గలిగి
పాటుతో నిండియుండు నీ ♦ వసుధయందు
నీముఖాముఖ నెప్పుడు ♦ నిలుతుఁ గాక!
జగములోపల నాపని ♦ ముగిసి నపుడు
మాటలాడక యొంటిగా ♦ మౌననియతి

నీముఖాముఖి నోప్రభు! ♦ నిలుతుఁ గాక!

77


నాకు దేవుండ నీవని ♦ నాథ! తెలిసి
తొలఁగి నిలుతును గొంచెము ♦ తొలఁగి నిలుతు.
నీవు నాస్వంతమే యను ♦ నెఱుక లేక
చేరకుండుదు దగ్గఱఁ ♦ జేరకుందు.
నాకుఁ దండ్రివి నీవని ♦ నాథ! తెలిసి
యేను నీచరణంబుల ♦ కెఱఁగు చుందు.
స్నేహితునివలె నీచేతఁ ♦ జేయి నేను
గలప కుండుదుఁ జేతిని ♦ గలప కుందు.
నీవు నాస్వంత మనునట్లు ♦ నిన్నే నాకు
మిత్రునిగ నెంచి మదిఁ జేర్చి ♦ మించునట్లు

నీవు చనుదెంచుచోట నే ♦ నిలువ లేదు.
భ్రాతలందెల్ల భ్రాత వై ♦ వరలు దీవు;
కాని వారల నెవరెల ♦ క్ష్యంబుసేయ;
నో మహాప్రభు! నీతోడ ♦ నున్నదెల్లఁ
బంచికొనలేదు నినట్లు గాఁగ నే ♦ వారితోడఁ
బంచుకొనలేదు కొర్చిన ♦ భాగ్యములను.
అధిప! నీకడనిల్చిన ♦ యట్లు గాఁగ
జనులసుఖదు:ఖములయందు ♦ సరస జేరి
నిలువలేదు నిజంబుగ ♦ నిలువ లేదు.
ఒసఁగఁ బ్రాణంబు వెనుదీయు ♦ చున్నవాఁడఁ;
గాన జీవనజలధి మ ♦ గ్నంబుఁ గాక

యున్నవాఁడను దీనుఁడై ♦ యున్నవాఁడ.

78


సృష్టియంతయుఁ గ్రొత్తగఁ ♦ జెలఁగునాఁడు
చుక్కలెల్లను నెంతయు ♦ శుభ్రమైన
తొలివెలుఁగుచేతఁ దళతళ ♦ వెలుఁగుచుండ
నింగి సభదీఱి దేవతల్ ♦ నెమ్మిఁ బాడి
"రహహ! పూర్ణస్వరూపమా! యమలమైన
యద్భుతానందరూపమా" ♦ యంచు మించి
"కాంతిపఙ్క్తిని నొకవెల్తి ♦ కాన వచ్చె;

నకట! యొకచుక్క జాఱిన ♦ యట్లు దోఁచె"
నంచు నెల్గెత్తి వారిలో ♦ నఱచె నొకఁడు.
"వీణబంగరుతీగియ ♦ వీడి పడియె;
రాగతాళంబు లన్నియు ♦ నాఁగిపోయె.
ఓహో! జాఱినచుక్క స ♦ ర్వోత్తమంబు
గగనమునకెల్ల మణియయి ♦ క్రాలు చుండె"
నంచునాశ్చర్యమున నంద ♦ ఱఱచి రపుడు.
నాఁటినుండియు వా రెల్ల ♦ చోటులందు
వెదకుచుందురు దానికై ♦ విడువకుండ.
"జగమునకు దానితో నొక్క ♦ నగయె తొలఁగె"
ననెడుమాటయె వారిలో ♦ నల్లుకొనియెఁ;
గాని నిశ్శబ్దఁనిశి దమ ♦ లోనఁ దామె
గుసగుసలువోయెఁ జుక్కలు ♦ కూడి నగుచు
వెదకుటెల్లను దానికై ♦ వృథయవృథయ

దేనిలో నది సంపూర్ణ ♦ మైన దంచు.

37


దేవ! నిన్గాంచుభాగ్య మీ ♦ జీవితమున
నేను గనఁజాల నేని యో ♦ దీనరక్ష!
"తప్పితిని నీదుదృష్టికిఁ ♦ దప్పితి" నని
యెప్పుడును నాదుమదిలోన ♦ నెంచ నిమ్ము.

ఒక్కక్షణమైన మఱవక ♦ యుండ నిమ్ము.
స్వప్నజగ్రదవస్థల ♦ స్వామి! నేను
దారుణం బగునీచింతఁ ♦ దాల్పనిమ్ము.
జగ మనెడునట్టియీ గొప్ప ♦ సంతయందుఁ
గడపుచుండఁగఁ గాలంబుఁ ♦ గరములందు
నే గడించినలాభంబు ♦ నిండి నపుడు
చూడ నాయార్దనంబెల్ల ♦ శూన్య మంచు
నెప్పుడును నాదుమదిలోన ♦ నెంచ నిమ్ము.
ఒక్కక్షణమైన మఱవక ♦ యుండ నిమ్ము.
స్వప్నజాగ్రదవస్థల ♦ స్వామి! నేను
దారుణం బగునీచింతఁ ♦ దాల్చ నిమ్ము.
బడలి రోజుచుఁ ద్రోవకుఁ ♦ బ్రక్కయందుఁ
గూదుచుండినయప్పుడు ♦ గూరుకొనఁగఁ
బఱపుదుమ్మున నేలపైఁ ♦ బఱచు నపుడు
పయన మింకను బహుదూర ♦ మయిన దంచు,
నెప్పుడును నాదుమదిలోన ♦ నెంచ నిమ్ము.
ఒక్కక్షణమైన మఱవక ♦ యుండ నిమ్ము.
స్వప్నజగ్రదవస్ధల ♦ స్వామి! నేను
దారుణం బగునీచింతఁ ♦ దాల్ప నిమ్ము.
గదులు కైసేఁతలను గాంచి ♦ క్రాలినపుడు
వేణుహృద్యనినాదముల్ ♦ వెలసినపుడు

పక్కుమనినవ్వుశబ్దముల్ ♦ పర్వినపుడు
పిలివనైతిని నిన్ను నా ♦ నెలవు కంచు
నెపుడును నాదుమదిలోన ♦ నెంచ నిమ్ము.
ఒక్కక్షణమైన మఱవక ♦ యుండ నిమ్ము
స్వప్నజాగ్రదవస్ధల ♦ స్వామి! నేను

దారుణం బగునీచింతఁ ♦ దాల్ప నిమ్ము
.

80


అంబరమ్మున నెంతయు ♦ వ్యర్ధముగను
సంచరించెడు శరదభ్ర ♦ శకల మట్లు
నాథ! యున్నాఁడ నిర్మలానంతతేజ!
దేవ! నేను భవఛ్చుభ్ర ♦ తేజమందు
లీన మైపోవునట్లు నా ♦ లోనియావి
నంటి నీ వింకఁ గఱగింప ♦ కుంట నీకు
వెలిగ నే నుండి లెక్కింతు ♦ నెలలు నేండ్లు.
ఇదియె నీయాట యిదియె నీ ♦ యిచ్చయేని
వట్టిదియుఁ జంచలంబు నై ♦ నట్టినన్ను
బలు తెఱంగులరంగుల ♦ నలరఁ జేసి
పొలుచు చుండెడుబంగరు ♦ పూఁతఁ బూసి
సోలి యాడెడుగాలిపైఁ ♦ దేలఁ జేసి
నెఱవు మెన్నియెవింతల ♦ నేర్పుమీఱ.

రాత్రి నీయాటఁ జాలింప ♦ రాజ! నీవు
దలఁచితేనియు గాఢమౌ ♦ ధ్వాంతముననొ
యమలప్రాభాతవిస్మిత ♦ మందు నేని
స్వఛ్చతర మై వెలింగెడు ♦ శైత్యముననొ

కలసిపోవుదుఁ గనులకు ♦ గాన రాక

81


ఎన్నియోమార్లు తోఁచక ♦ యున్నవేళ
వమ్ముగాఁబుచ్చి నట్టికా ♦ లమ్ముఁ గూర్చి
యుల్లమున నే గరమ్ముఁ జిం ♦ తిల్లినాఁడఁ;
గాని నాకాల మూరక ♦ కడవ లేదు.
దేవ! నాజీవితమునఁ బ్ర ♦ తిక్షణమును
స్వయముగా నీకరమ్ములఁ ♦ బట్టినావు.
అన్నిఁటను గల్గి లోలోన ♦ నలరు చుండి
పూన్కితో విత్తనమ్ముల ♦ మొలకలుగను!
మొగ్గలను సాంపుగుల్కెడు ♦ పువ్వులుగను,
బూల ఫలములుగాఁ జేసి ♦ ప్రోతు వీవు.
బడలి తొఁచక పాన్పుపైఁ ♦ బండి యుండి
యాఁగెఁ బనులెల్ల ననుకొంటి ♦ హాయిఁ గంటి
లేచి వేకువఁ దోఁటను ♦ జూచుసరికి
వింతవింతల విరులచే ♦ వెలసి యుండె.

82


నాథ! నీచేతఁ గాల మ ♦ నంత మగును.
నీక్షణంబుల లెక్కింప ♦ నేర్చు నెవఁడు?
వడిగ రేయింబళ్లును ♦ గడచుచుండు.
విరులవలెను యుగంబులు ♦ విచ్చినాడు.
దేవ! వేచుట యన నేమొ ♦ తెలియ నీకె.
ప్రధమదశ నుండుసన్నని ♦ వనసుమంబు
పూర్ణపరిణామమును బొంది ♦ పొదలుటకును
బైఁబయిని నెన్నియో శతా ♦ బ్దములు గడచు
వమ్ముగాఁ బుచ్చ మాకుఁ గా ♦ లమ్ము లేమి
వృధగఁ దరుణముఁ బొనీక ♦ పెనగవలయు
జాల మొనరింప మాకంత ♦ కాలుమున్నె?
వచ్చి మొఱలిడు ప్రతివాని ♦ కిచ్చుచుంటఁ
గాల మంతయు వ్యర్ధమై ♦ కడచిపోవు.
కొనకు నాకాన్క నీపీఠ ♦ మునకు రాక
కాలమెంతయు వ్యర్ధమై ♦ కడచిపోవు.
అంత నిలుపక నేను ది ♦ నాంతమందుఁ
తలుపు మూయుదు రనుభీతిఁ ♦ ద్వరగవత్తుఁ
గాని యింకను గాలంబు ♦ గలిగి యుండు.

83


శోకబాష్పాళిచే మాత! ♦ నీకు నొక్క
కంఠహారంబు నిచ్చెదఁ ♦ గాన్కగాగఁ
దమప్రకాశంబుచేతను ♦ దార లెల్ల
నీదుచరణంబులను గూర్ప ♦ నెమ్మితోడ
సందెలొనరించెఁ గాని నీ ♦ యక్కునందు
వరలి వ్రేలాడు నేనిడు ♦ సరముసుమ్ము.
వచ్చు నీనుండి కీర్తియు ♦ భాగ్య మెపుడు
నిచ్చటయు నీయకుంట నీ ♦ యిచ్చ నుండు
నాదుశోకము మాత్రము ♦ నాదె నాదె.
దీని కాన్కగ నీకు నేఁ ♦ దెచ్చినపుడు

నీకరుణచేత నన్ను మ ♦ న్నింతువీవు.

84


అంతటను నిండియుండి య ♦ నంతమైన
గగనమునఁ బెక్కురూపముల్ ♦ గలుగఁజేయు
నదియును వియోగచింతయే ♦ యరసి చూడ.
సతము రాత్రులయందు ని ♦ శ్శబ్దముగను
జుక్కలోనుండి చుక్కను ♦ జూచుచుండి
వర్షరాత్రుల నాకుల ♦ వలనఁ గలుగు

శబ్దముల యక్షగానంబు ♦ సలుపుచుండు
నదియును వియోగచింతయే ♦ యరసిచూడ.
మాటిమాటికి మనుజుల ♦ మందిరముల
భేదమోదానురాగవాం ♦ ఛాదు లగుచు
మత్కవిత్వహృదంతర ♦ మార్గమునను
బాటగఁ గరంగి సతతముఁ ♦ బాఱుచుండు

నదియును వియోగచింతయే ♦ యరసిచూడ.

85


నాధుభవనమునుండి యా ♦ యోధవరులు
గడగి యని కయి తొలుదొల్త ♦ వెడలినపుడు
తమబలము నెల్ల నెచ్చట ♦ దాచి చనిరి?
శస్త్రకవచంబు లెచ్చట ♦ జాఱి పడియె?
ప్రభునివాసంబునం దుండి ♦ వచ్చునపుడు
వార లుండిరి యనదల ♦ పగిదిఁజూడ
శరపరంపర వారిపైఁ ♦ గురిసి యుండె.
స్వామిభవనము మరి చేరఁ ♦ జనెడునపుడు
తమబలములెల్ల నెచ్చట ♦ దాచి చనిరి?
ఖడ్గశరచాపములు వారి ♦ కడను లేవు
నుదుటిపై శాంతరసము సొం ♦ పొదవి యుండె
మరల విభుమందిరముఁ జేరఁ ♦ దరలునపుడు

వదలి యుండిరి జీవిత ♦ ఫలము లెల్ల.

86


చేరి వాఁకిట మిత్తి నీ ♦ సేవకుండు
నెఱుఁగ రానట్టిసంద్రంబు ♦ నెలమి దాఁటి
దేవ! నీ యాజ్ఞ నిదె నాకు ♦ దెచ్చినాఁడు;
కటికరాతిరిఁ జిమ్ముచీఁ ♦ కటులుగ్రమ్మె;
నాత్మ చలియించె భీతిచే ♦ నైన నేను;
దీపమును గొని తలుపులఁ ♦ దెఱచివైచి
స్వాగతం బిచ్చి మ్రొక్కెద ♦ సంతసమున
వాఁకిటను వచ్చి నిలిచిన ♦ వాఁడుచూడ
నీవు పంపినదూతయై ♦ నెగడుచుంటఁ;
గరములను మోడ్చి కన్నీరు ♦ గ్రమ్ముచుండ
నతని బూజింతు నెంతయు ♦ నర్ధితోడఁ;
జరణములజిత్తకోశంబుఁ ♦ దెఱచిపెట్టి
యతని బూజింతు నెంతయు ♦ నర్ధితోడఁ
దానువచ్చినపని తీర్చి ♦ తరలునతఁడు
నాదుప్రాభాతమున నిల్చి ♦ నల్లనీడ.
పాడువడినట్టి నాయింట ♦ వదలఁబడిన
నేను మాత్రమె నీతుది ♦ కానుక యయు
నిలిచి యుండుదు నోనాథ! ♦ నిలిచియుందు.

87


కట్టకడపటియాశతో ♦ గదిని జేరి
యామెకయి మూలమూలల ♦ యందువెదకి
కాననైతిని నేనామెఁ ♦ గాననైతి.
ఇల్లు చిన్నది పోయిన ♦ దెద్దియైనఁ
గానఁబడ దెన్నటికినైనఁ ♦ గానఁ బడదు;
నీదుభవన మనంతమై ♦ నెగడుఁ గాన
స్వామి యామెను వెదుకంగ ♦ వచ్చినాఁడ;
నీదుసంధ్యాంబరంబను ♦ నిగ్గులొల్కు
పైఁడి మేల్కట్టునీడలో ♦ పలను నిల్చి
నేను దమి నిక్కి చూచెద ♦ నీముఖంబు;
నిత్యమను వార్ధితుదిఁ జేరి ♦ నిలిచినాను
దానిలో నాశ మొద్దాని ♦ కేని లేదు.
కంటిలోపల నశ్రువుల్ ♦ గ్రమ్మియుంట
నాశ గాని మరెట్టిసౌ ♦ ఖ్యంబు గాని
యెముఖచ్చాయ గాని నా ♦ కెఱుఁగరాదు.
ఏమియును లేక వట్టిగా ♦ నెనగునన్ను
నమ్మహావార్ధిలోపల ♦ నద్ది యద్ది
పూర్ణమైనట్టి లోఁతులో ♦ ముంచి విడుము
విశ్వమంతట లోపల ♦ విలయమందు

నాసుఖస్పర్శ నొకతూరి ♦ నందనిమ్ము.

88


శిధిలదేవాలయంబునఁ ♦ జెలఁగుదేవ!
నిన్నుఁగూర్చినపాటలు ♦ నెమ్మితోడ
వీణెతంతులు పాడవు ♦ విఱిగియుంట;
స్వామి! నీపూజసమయంబుఁ ♦ జాటవింక
సంజవేళల గంటలు ♦ చప్పు డుడిగి;
గాలి మౌనము ధరియించి ♦ కదలకుండు
జీర్ణభవదీయవాసంబుఁ ♦ జేరవచ్చె
మధురమధుమాసవాతమ ♦ మందగతిని;
పూలపరిమళవార్తల ♦ లీలఁదెచ్చెఁ
గాని యాపూలఁ గాన్కగాఁ ♦ గాంచవింక.
మున్ను నీపూజఁ గావించు ♦ చున్నవాఁడు
వరముఁ గనకుండ నింకను ♦ దిరుగుచుండు
ధూమమును నీడలునుబొయి ♦ దుమ్ముఁగలయ
సంజవేళను బడలికఁ ♦ జాలిగలిగి
డెంద మెంతయు క్షుద్భాధ ♦ గుందుచుండ
శిధిలదేవాలయంబును ♦ జేరునతఁడు.
జీర్ణదేవాలయంబున ♦ జెలఁగుదేవ!
సడియె లేకుండ జరుగు ను ♦ త్సవము లెల్ల

రేలఁ బూజలుగలుగుదీ ♦ పాలె లేక ;
నేర్పరులచేతఁ జక్కగాఁ ♦ దీర్పఁబడిన
వేనవేల్క్రొత్త బొమ్మలు ♦ వెలయఁగలవు;
వానివానికిఁ గాలంబు ♦ వచ్చినపుడు
శూన్యపావన వాహిని౯ ♦ జొచ్చిపొవు.
బొత్తిగాఁ బూజఁ గనకుండ ♦ బొదలువాఁడు

కేవలముజీర్ణసదనంపు ♦ దేవుఁ డొకఁడె.

89


అఱవకుము కేకవేయకు ♦ మనుచు నన్ను
గోరి యున్నాఁడు నాథుండు ♦ కూర్మితోడ
నింక గుసగుసమాత్రమె ♦ యొసఁగగలదు;
మనసులోమాట పాటలో ♦ గొనిగి పోవుఁ;
బ్రభునిసంతకుఁ జనిరెల్ల ♦ వారునిపుడు
అమ్మువారును గొనువారు ♦ నచటఁ గలరు
పనులమధ్యను దినమధ్య ♦ మునను నాకు
సెల వకాలంబులోపలఁ ♦ గలిగెనిపుడు
కాల మిది గాకయున్నను ♦ బూలునాకు
నిచ్చుఁగావుతఁ బూఁదోఁట ♦ నెలమితోడ;
మట్టమధ్యాహ్న మిప్పుడు ♦ మధుకరములు
వీడిసొమరితమును ♦ బాడుఁగాత!

మేలుకీడులతోఁ జాలఁ ♦ గాల మరిగె.
వర్ధదినముల నాతొడ ♦ నాడుకొన్న
వాఁడు నాహృదయంబును ♦ నేఁడు లాగె.
పనికిమాలినయట్టి యే ♦ పనికి నన్ను

నిట్లు తటుకునఁ బిలిచెనో ♦ యెఱుఁగరాదు.

90


నీదువాఁకిలి మరణంబు ♦ నిలిచి తట్ట
నేమి యొసఁగెదు కాన్కగా ♦ నీవు చెపుమ?
అట్టులరుదెంచినట్టినా ♦ యతిథిముందుఁ
బాత్ర సంపూర్ణజీవిత ♦ పాత్ర నిడుదుఁ;
బంప నేనట్టిచేతులఁ ♦ బంప నతని.
నాదుదినములు కడఁగన్న ♦ నాఁడు వచ్చి
నాదువాఁకిలి నామర ♦ ణంబు దట్ట
శీతదినముల వేసంగి ♦ రాతురులను
గన్న మధురఫలంబుల ♦ గారవముల
నెంతయును శ్రమ నేఁగన్న ♦ యెల్లసిరులఁ

బొందుగాఁ గూర్చి యాతని ♦ ముందు నిడుదు
.

91


జీవితమునకు ఫలితార్ధ ♦ మై వెలుంగు

మరణమా! చెవి గునగుస ♦ మాటఁ జెప్ప
రమ్ము; తడవేల మరణమా! ♦ రమ్ము రమ్ము!
అర్ధి నీకయి వేచితి ♦ ననుదినమ్ము;
నీకొఱకై యుంటి సుఖదు:ఖ ♦ నిచయ మోర్చి;
నాయవియు నేను నాయాశ ♦ నాదు ప్రేమ
మన్నియును నిన్నుకూర్చి గో ♦ ప్యముగఁ బాఱె;
నొక్కపరిఁ దుది న౯జూడు ♦ మోమరణమ!
నీవశంబయి పోవునా ♦ జీవనమ్ము.
లీలఁ గూర్పంగఁబడినట్టి ♦ పూలదండ
సిద్ధ మయ్యెను; వరునికై ♦ సిద్ధ మయ్యె.
పెండ్లి కాఁగానె వధువు సం ♦ ప్రీతి రాత్రి
నేకతమ్ముగ నెవ్వరి ♦ దృష్టిఁ బడక

నిలయమును వీడి ప్రభువుతోఁ ♦ గలిసికొనును.

92


పాయు నిబ్భూమి నాదృష్టి ♦ పథమునుండి
యొక్కనాఁడని తెలియదుఁ ♦ జక్కగాను.
ప్రాణ మాజ్ఞను గైకొని ♦ మౌనముగను
బోవుఁ దుది తెర నాకండ్ల ♦ ముందుఁ బఱపి;
కాని చుక్కలు రాత్రులఁ ♦ గాచు విడక
వేకువయు నెప్పటట్టులు ♦ వేగుచుండు

జెలఁగు నలలట్లు కాలంబు ♦ చేరి చేరి
చల్లుచుండును సుఖదు:ఖ ♦ చయము సతము.
ఇట్టి నాయంతమును మది ♦ నెంచినపుడు
కాలమందలియవధి నా ♦ కనులు వీడి
మరణమనుకాంతైఁ గైకోని ♦ మహిని గాంచు
లీలఁ జల్లిననీభాగ్య ♦ జాలములను.
మరణ మవధిగ నెంచెడు ♦ మనసుకంటెఁ
బరమనీచము తుచ్ఛమ్ము ♦ మరియుఁ గలదె?
వ్యర్ధముగ నేను దమిఁ గోరి ♦ నట్టివెల్ల
నేను గాంచినవెల్లను ♦ బోనిపోని!
ఏవతో లక్ష్యపెట్టని ♦ వెల్ల నాకు

దాని సత్యమ్ముగాఁ దాల్చ ♦ రాని రాని!

93


సెలవుఁ గాంచితి నిఁకను మీ ♦ సెలవుఁ గొందు
నేస లిడి పంపుఁ డిదె మీకు ♦ శిరము వంచి
బయలుదేరుచు నున్నాను ♦ భ్రాతలార!
తలుపు తాళము లివె కొండు ♦ దయదలిర్ప
నింటిపై స్వత్వమెల్ల నే ♦ నెడలినాఁడ;
వినఁగ మీతుదిశుభవాక్కు ♦ వేచినాఁడ;
జరపితిని బెక్కునాళ్లు మీ ♦ పొరుగునందు

నిడినదానికి మించి నేఁ ♦ బడసినాఁడఁ;
దెల్ల వాఱెను గదిమూలఁ ♦ దేజరిలిన
దీపమును నారె నే బైలు ♦ దేరుటకును

సిధ్జ మైతిని రమ్మని ♦ చీటి వచ్చె.

94


మేలు గోరుఁడు నేవీడు ♦ కాలమందు
మిత్రుల్లార! మదీయ స ♦ న్మిత్రులార!
ఆకసము తెల్లవాఱెను ♦ నాకుఁ జూడ
నందముగఁ గానవచ్చె నా ♦ యాత్రపథము.
అటకుఁ గొనిపోవ నేమున్న ♦ దనుచు మీర
లడుగకుఁడు పైన మయ్యెద ♦ నధిపుకడకు
నాశతో నిండి తోల్కాడు ♦ నాత్మతోడ
దద్దయును రిక్తమైన హ ♦ స్తములతోడ
పెండ్లిహారంబు మెడను సం ♦ ప్రీతి నిడుదుఁ
భాంధువలెఁ దాల్చ నేఁగావి ♦ వస్త్రములను
తెన్నులోన నపాయంబు ♦ లెన్ని యున్న
బెదరి చెదరక యుండుదు ♦ మదినినేను
యాత్ర ముగిసెడునంతలో ♦ నంబరమున
పాంధ్యనక్షత్ర ముదయించు ♦ సంజలోన
జాలిఁగొలిపెడుగీతముల్ ♦ సర్వభౌము

మందిరద్వారమునఁ జెవి ♦ విందు సేయు.

95


కడఁగి యీజీవితములోని ♦ గడపనెప్పు
డేను దాఁటితినో నాకు ♦ నెఱక లేదు;
అడవి నడురేయి మొగ్గవో ♦ లహహ నన్ను
వింతలో వింత యగు మహా ♦ విశ్వమందు
నేమహాక్తి గొలిపెనో ♦ యెఱుఁగరాదు.
వేకువను గాంతి నాకన్ను ♦ సోఁకగానె
నేను లోకమ్ములోఁ గ్రొత్త ♦ గా నటంచుఁ
బేరు రూపును లేక య ♦ భేధ్యుఁడైన
ప్రభువు నాతల్లిరూ పొంది ♦ పరమకరుణఁ
జెతులను దాల్చె నని తొఁచె ♦ జిత్తమందు.
ఇట్లు తెలియంగఁ గాని యీ ♦ యీశ్వరుండె
చిరపరిచితుండువోలె నా ♦ మరణమందుఁ
గూడఁ గనఁబడుఁ గనఁబడుఁ ♦ గూర్మితోడ;
నిప్పు డీజీవితమ్ము నే ♦ నెలమిఁ జూతుఁ
గాన మృతిఁగూడఁ బ్రేమతోఁ ♦ గాంతు నపుడు;
తల్లికుడిఱొమ్మునం దుండి ♦ తన్నుఁ దీయ
నుత్తరక్షణమందునఁ ♦ జిత్త మలర
నెడమఱొమ్మున శాంతిని ♦ బడయుకొఱకె

పిల్ల యేడ్చుట యెఱుగఁమె ♦ పృధ్వియందు.

96


ఇజ్జగంబును వదలి నే ♦ నేగునప్పు
డనుపమానంబె చూచితి ♦ ననెడుమాట
వీడుతఱిఁ జెప్పమాటయై ♦ వలయుఁగాత!
కాంతి వార్ధిని వికసించు ♦ కమలమందు
నున్నతేనెను నేఁజవి ♦ గొన్నవాఁడ
నహహ! ధన్యుఁడ ధన్యుఁడ ♦ ననెడుమాట
వీడుతఱిఁ జెప్పుమాటయై ♦ వెలయుఁగాత !
అంతమే లేనిరూపంబు ♦ లమరి యుండు
నీవిలాసాలయంబున ♦ నెలమి నాడి
మించినాఁడ నరూపుని ♦ గాంచినాఁడ
స్వర్శకందనివాఁడు ప్ర ♦ సన్నమూర్తి
యంటెఁ గావున నాదు స ♦ ర్వాంగములును
దేహమెల్లను గగురించి ♦ తేజరిల్లె
నంత మిటఁ గల్గఁ గల్గని ♦ యనెడుమాట

వీడుతఱిఁ జెప్పుమాటయై ♦ వెలయుఁగాత!

97


నిన్నుజతఁగూడి నేనాడు ♦ చున్ననాఁడు

నిన్ను నెవఁడని నేను బ్ర ♦ శ్నింపలేదు;
సిగ్గు వెఱపుల నెఱుఁగక ♦ చెలఁగుచుంటి;
జీతివం బెల్ల గజిబిజిఁ ♦ జెంది యుండెఁ;
గేవలము స్నేహితునివలె ♦ దేవ! నీవు
వేకువను లేపుచుంటివి ♦ వింతగాను.
పఱచినడుపుచు నుంటివి ♦ వనపథముల.
ఆదినములందు నీచేయు ♦ నందమైన
గానములలోనియర్ధంబుఁ ♦ గనుగొనంగ
నాకు నింతయు లక్ష్యంబు ♦ లేకయుండె.
మట్లుమాత్రమె గ్రహియించె ♦ మద్గళంబు
నాట్య మాడెను లయఁ గోని ♦ నామనంబు.
అట నంతయుఁ జాలించి ♦ నప్పు డిప్పు
డహహ! తటుకునఁ గనఁబడు ♦ నది యిదేమి?
సద్ధుసేయనినక్షత్ర ♦ సమితిఁ గూడి
జగము కనులను వాల్చి నీ ♦ చరణములను

నద్భుతంబుగ నిలఁబడె ♦ నద్భుతముగ.

98


నాదుభంగమ్ము దాల్చుహా ♦ రాదికములఁ
బొంకముగ నేను నెన్ని న ♦ లంకరింతుఁ;
బరిభవమునుండి తప్పుకో ♦ బలము లేదు.

గర్వభంగము నాకగుఁ ♦ గల్లగాదు.
బంధములు తెగు నెంతయు ♦ బాధ నొసఁగి
వేణుగతినట్టి నామది ♦ విడుచునూర్పు
గట్టిఱాయియుఁ గన్నీటఁ ♦ గరఁగిపోవు.
నిచ్చలు౯ శతపత్రము ♦ విచ్చకున్నె?
దానితేనియ తప్పక ♦ తరలి పాఱు
నీలముగ నింగినుండి తా ♦ నిక్కి చూచి
కన్నొకటినాకు రమ్మని ♦ సన్నసేయు;
మిగుల దేమియు నాదేమి ♦ మిగులకుండుఁ;

గందు మరణంబు నీపాద ♦ కమలమందు.

99


నాశిరస్త్రాణమును దీసి ♦ నాధ! యిడిన
దాని ధరియించుటకు నీకుఁ ♦ దరుణ మగును.
కాఁగ నున్నది యగును ♦ దక్షణమునందె
వ్యర్ధ మీనాదుపోరాట ♦ వ్యర్ధ మయ్య!
స్వాంతమా! చేతులను దీసి ♦ చప్పు డుడిగి
యోటమికి నోర్చి యుంచిన ♦ చోట నీవు
పరమశాంతిని నుంట లా ♦ భంబటందు
నెంచుమా నాదుహృదయమా ♦ యెంచుకొనుమ.
అట్టె వీఁచినగాలికి ♦ నారి యారి

పోవుచుండెడు నాదీప ♦ ములను వెలుగఁ
జేయ మాటికి యత్నించు ♦ చేతలందు
మఱచుచుండుదుఁ దక్కిన ♦ మాటలెల్ల.
కాని యిఁకఁ దెల్వినొనరింతుఁ ♦ గార్య మేను
జీఁకటిని నేలఁబఱచి నా ♦ చిన్నచాఁప
వేచియుండుదు నీకయి ♦ వేచియుందు
ప్రభువతంసమ! నీయిచ్చ ♦ వచ్చినపుడు

రమ్ము కూర్చుండు మిట నీవు ♦ నెమ్మదిగను.

100


రూపమే లేక పూర్ణమై ♦ రూఢిమెఱయు
ముతెైమును గాంచుకొఱకు నై ♦ మునుఁగుచుందు
లోఁతుగా రూపవారిధి ♦ లోన నేను;
వాతహతమైనయీనాదు ♦ పడవ నెక్కి
రేవు రేవున కేనిఁక ♦ బోవఁ బోవ.
అలలపై లేచి పడి యాడు ♦ నాదినములు
గడచి నేఁటికి నెంతయో ♦ కాల మయ్యె.
మరణమేలేనిదానిలో ♦ మరణ మంద
వేడ్కతో నుంటి నుంటి నే ♦ వేడ్క తోడ.
నాదుజీవితమనువీణె ♦ మోదమునను
గ్రాలుచుండునగాధ మా ♦ ర్గమ్మునందు

శబ్దమేలేనితంతుల ♦ చారుగాన
రసము పొంగుమహాస్థాన ♦ రంగమునకు
దీసికొనిపోదుఁ దప్పక ♦ దీని నిపుడు.
నిత్యమను పాటలో దీని ♦ నెమ్మిఁగూర్తు;
దీనికడసడియూపిరి ♦ తీఱినపుడు
మౌనముగ నుండునీవీణె ♦ మౌనికాళ్ల

కప్పగింతును దప్పక ♦ యప్పగింతు.

101

దేవ! యెప్పుడు నేను నా ♦ జీవితమున
నాదుగీతాళిచేతనే ♦ నాథ! నిన్ను
వెదకుచుంటిని దప్పక ♦ వెదకుచుంటి.
ఇంటి కింటికి నన్నవి ♦ యెలమిఁ జేర్చె
వానితో నుండుటను నావ్ర ♦ పంచ మెల్ల
వెదకి యంటినయట్టులు ♦ మదికిఁ దోఁచె.
నేను నేర్చినపాఠము ♦ లెల్లనాకు
నవియె నేర్పెను దప్పక ♦ యవియె నేర్పె;
నెన్నియోగూఢమార్గమ్ము ♦ లెఱుఁగఁజేసె.
అంతరాకాశమందున ♦ నలరుచుండు
నెన్నియోచుక్కలను నాదు ♦ దృష్టిముందు
నవియె పెట్టను దప్పక ♦ యనియె పెట్టె.

మోదఖేదంబు లొప్పెడు ♦ భూమిలోని
వివిధచిత్రమ్ములను జూప ♦ వేడ్కతోడ
నవియె నడిపెను దప్పక ♦ యనియె నడిపె.
తుదకు యాత్రాంతమున సంజ ♦ యొదవినప్పు
డేప్రభుద్వారమున నవి ♦ యెలమిఁ జేర్చె?

నేప్రభుద్వారమున నవి ♦ యెలమిఁ జేర్చె?

102


కాంచితిని నిన్ను నేనని ♦ గర్వపడితి
మనుజులందఱిలోపల ♦ మహిని; గాన
వారు నాకార్యముల నెల్లఁ ♦ బ్రభువతంస!
నీదుచిత్తమ్ములే కాంచి ♦ నెమ్మితోడ
నాతఁ డెవఁ డని వచ్చి న ♦ న్నడుగుచుంద్రు.
ఏమిచెప్పంగవలయునో ♦ యెఱుఁగఁ గాన
నహహ! నేఁజెప్పలే నని ♦ యనిన నన్ను
దేవ! నిందించి నిరసించి ♦ పోవుచుంద్రు;
కూరుచుందువు చిఱునవ్వుఁ ♦ గూడి నీవు.
నిన్నుఁగూర్చిననాకథల్ ♦ నింపుచుందు
నిత్యగీతాళిలోపల ♦ నింపుచుందు;
నాత్మ దాఁగక యీరహ ♦ స్యంబు వెలికి
వెల్లిగొన వారు వచ్చిమా ♦ కెల్ల దీని

యర్ధ మంతయుఁ జెప్పుమం ♦ చడుగుచుంద్రు.
ఏమిచెప్పంగవలయునో ♦ యెఱుగఁ గాన
నర్ధమెఱిఁగిన వా రెవ్వ ♦ రనిన నన్ను
దేవ! నవ్వుచు నిరసించి ♦ పోవుచుంద్రు;

కూరుచుందువు చిఱునవ్వుఁ ♦ గూడి నీవు.

103


నాథ! యొకవందనమ్ముతో ♦ నాకు నున్న
యింద్రియములెల్లఁ బురివిచ్చి ♦యిజ్జగంబు
నంటుఁ గావుత నీచర ♦ ణాబ్జమందు!
నాథ! యొకవందనమ్ముతో ♦ నామనంబు
నీరముల నిండి కురియని ♦ నీరదంబు
నింగిలో శ్రావణమ్మున ♦ వంగినట్లు
వంగుఁగావుత నీమహా ♦ ద్వారమందు!
నాథ! యొకవందనమ్ముతో ♦ నాదువివిధ
గతుల గీతమ్ములెల్లను ♦ గలసియేక
పూరమై శాంతవారధిఁ ♦ జేరుఁగాత!
గూండ్ల కరుగఁగ మనసులోఁ ♦ గోర్కిపుట్టి
పర్వతంబుల నుండెడు ♦ పట్టులకును
రేయిపవలును వదలక ♦ పోయిచేర
నరుగుచుండెడుబకపాళి ♦ యందమునను

దేవ! యొకవందనమ్ముతో ♦ జీవన మిది
యయ్యనంతాలయముఁ జేర ♦ నరుగుఁగాత!

గద్య.

ఇది శ్రీపరమేశ్వర కరుణాఫలిత లలితకవితాకలిత శ్రీ
రామలక్ష్మాంబా బుచ్చివేంకయామాత్యతనూజాత
సకలసజ్జనవిధేయ ఆదిపూడి సోమనాథ
నామధేయప్రణీతంబయిన
గీతాంజలి
సంపూర్ణము.