Jump to content

గీతాంజలి (ఆదిపూడి సోమనాథరావు అనువాదం)

వికీసోర్స్ నుండి
Geetanjali Cover Page
Geetanjali Cover Page

విన్నపము.

తటుక్కునఁ బుష్పఫలభరితమైనవృక్షంబును భూగర్భబుననుండి యుద్భవింపఁజేసి లోకుల నద్భుతంబున ముంచునైద్రజాలికునివలె జీవులలో నణఁగిమణఁగియుండుసమస్త శక్తులని దక్షణమ వికసింపఁజేయునదియు, గ్రీష్మాతపసంతప్తులై దప్పి గొన్న పాంథులకు నిర్మల శైత్యనీరంబులఁ బ్రసాదించి శాంతినాపాదించువిమలసరోవరంబుభాతిఁ దాపత్రయసంతప్తు లైన సంసారుల హృదయదాహంబు శాంతింప నానందనీరంబు నొసంగ నదియును, ఎడారిం బడి పోవుచు నెంత దూరము దృష్టిఁ బఱనను సైకతసముద్రంబె కాక మఱిద్దియును గాన రానివాని వనంబునకు నానావిధ పత్రపుష్పఫలోపేతం బగునుద్యానవనంబు నేత్రానందంబు సేయు తెఱంగున సారహీన సంసార సాధారణ కృత్యంబుల మగ్నులగువారికిఁ బారమార్థిక మహాసౌందర్యంబను దృష్టిగోచరము చేయునదియును నై ప్రకాశించునది యెక్క నిశ్చలంబైనభక్తి యే యని పెద్దలు చెప్పుచుందురు.

లోకమంతను నొక్క కుటుంబముగ నెంచి మానవ హృదయ క్షేత్రంబున నీభక్తి బీజంబును నాటుటకై తమకుఁ బరమేశ్వరుఁడు ప్రసాదించిన కవిత్వాదిసమస్త శక్తుల నుపయోగించ ఎన్ని రాచకార్యమ్ములలో మనంబు మగ్నంబైయుండినను బ్రధానేంద్రియం బగు నేత్రేంద్రియము భాధింపఁబడుచుండినను లెక్కసేయక తమయమూల్యమైన కాలంబును గొంత నొసంగి నాయీగీతాంజలిని జాలవఱకుఁ బరిశీలించిన మన్మిత్రులగు బ్రహ్మశ్రీ మ.రా.శ్రీ మొక్కపాటి సుబ్బారాయుడు పంతులు గారికిని, నత్యల్పకాలమున సర్వోత్తమంబుగ నిప్పొత్తంబును ముద్రించి యిచ్చిన శ్రీ విద్యజ్ఞనమనోరంజనీ ముద్రాశాలాధికారులకును నేనెంతయు గృతజ్ఞతాపూర్వకవందనముల సమర్పించుచున్నాఁడను.

పిఠాపురము, 23-0-1913

ఇట్లు విన్నవించు
సజ్జనవిధేయుడు,
ఆదిపూడి సోమనాధ రావు

అంకితము.

గీ. ఆసియాకవిసార్వభౌ ♦ మాంక మంది
   యమరుచుండు రవీంద్ర నా ♦ థాఖ్యసుకవి
   కంజలిని గూర్చి యతని గీ ♦ తాంజలికిని
   దెలుఁగుగీతాళిఁజేసితి ♦ సులభశైలి.

గీ. భక్తగణములపాలిటి ♦ పారిజాత
   మైనపరమేశ్వరున కిది ♦ యంకితముగ
   నొసఁగితినిగాన రవిసోము ♦ లుండుదాఁక
   నతని దయచేతఁ దిరమయి ♦ యలరుఁగాత.



విషయసూచిక