గీతాంజలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రవీంద్రునిజీవిత ఘటనలు[మార్చు]

గీతాంజలి తెలుగు అనువాద ముఖచిత్రం

గురుదేవులు రవీంద్రుడు 1861 మే 7న జన్మించారు.

తండ్రి మహర్షి దేవేంద్రునాథ ఠాగూరు.

తల్లి శారదాదేవి.

ఆ తల్లిదండ్రులకు 15 మంది సంతతి.

పధ్నాలుగోబిడ్డ, ఎనిమిదవ పుత్రుడు రవీంద్రుడు.

రచనారంభం 1873.

ప్రథమ పద్య కావ్య ప్రచురణ 1878.

మృణాళినీదేవితో వివాహం 1883.

మృణాళినీదేవి 1902లో స్వర్గస్తులైరి.

శాంతినికేతన్‌ స్థాపన 1901 డిసెంబరు.

గీతాంజలికి నోబుల్ బహుమతి 1913 నవంబరు.

(స్వీడిష్‌ నోబుల్ బహుమానం లక్షా ఇరవై వేల రూపాయలు)

విశ్వభారతి స్థాపన 1921 డిసెంబరు.

ఆ మహనీయుని నిర్యాణం 1941, ఆగస్టు 7.

అంజలి[మార్చు]

మానవ జీవన భావనల, మానవ జీవిత భావుకతలకు సుమాంజలి గీతాంజలి. మానవ మేధా మహనీయతకు కలకాలపు నివాళి గితాంజలి. కమనీయమయిన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే మంజుల కవితా మంజరి గీతాంజలి. జిలుగులతో గిలిగింతలు పెట్టి వెలుగుబాటలు తీర్చే రత్నదీపావళి గీతాంజలి.

చిన్నారిపూవు, సెలయేటి గలగల, పసిపాప బోసి నవ్వు, గాన మధుర మధుపాత్ర గీతాంజలి. మానవుని అంతరాంతాలలో వింగడింపరాని వేదనా వేదనల కలయిక గీతాంజలి. ఉన్నాడో లేడో తెలియక ,కనిపించీ కనిపించక దోబూచులాడే విశ్వాత్ముని విశ్వలీలల విలసనం గీతాంజలి. మానవత, విశ్వమానవత కళ్యాణం, విశ్వకళ్యాణం, సాధన సాధనాలు వీని ఈ సావాస్యం గీతాంజలి.

గీతాంజలి (1 - 10)[మార్చు]

1

నీవు నన్ను అంతగా సృష్టించావు అది నీ విలాసం. తాకితే చాలు, పగిలిపోయే యీ పాత్రికను నీవు మాటిమాటికి ఖాళీ చేసి మళ్ళీ కొత్త జీవితంలో నింపుతూ ఉంటావు. ఈ చిన్న వేణువును ఊదుతూ కొండలూ, కోనలూ తిరుగుతావు. నిత్య నూతనమైన మధుర గీతాలు ఆలపిస్తావు.

నీ మృదుల కరాల అమృతస్పర్శ సోకితే చాలు, నా చిన్నారి గుండెలో ఆనందం పరుగులు తీస్తుంది. ఏవో మాటలు నాలో పెల్లుబుకుతాయి.

నీవు ఇచ్చే మహాప్రసాదాన్ని స్వీకరించాలంటే---చూడు-- నా చేతులెంత చిన్నవో, ఈ చిన్న చేతులతో ఆ మహాప్రసాదాన్ని స్వీకరించగాలనా?

ఇలాగ యుగాలు గడిచిపోతాయి. అయినా నీవు కొత్త జీవితాన్ని పాడుతూనే వుంటావు. కొత్త పాటలు పాడుతూనే వుంటావు. అయినప్పటికీ యీ పాత్రను నింపడానికి ఖాళీ వుంటుంది.


2

నీవు నన్ను పాట పాడమని ఆజ్ఞాపించావు.

అప్పుడు నా హృదయం ఎంత పొంగి పోయిందనుకున్నావు? నన్ను కదా నీవు పాట పాడమని అడిగావనే గర్వంతో నా హృదయం పగిలిపోయిందేమోనని అనిపించింది. అప్పుడు నీ ముఖం వైపు చూశాను. నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

నా బ్రతుకులోని అపస్వరాలన్నీ కరిగి ఒక కమ్మని మధుశ్రుతిలో లీనమైనాయి. నాలోని పూజాభావం హాయిగా ఏ చింతా లేకుండా సాగరంపై ఎగురుతూ వెళ్ళే పక్షిలాగా రెక్కలు చాచింది.

నాకు తెలుసు. నీకు నా పాటంటే ఇష్టమని, గాయకుడు గానే నీ సాన్నిధ్యంలో నిల్చున్నానన్న విషయం కూడా నాకు తెలుసు.

నా పాట ఒక పక్షిలా రెక్కలు చాచితే, ఆ పంచక్షాలలో మాత్రమే నీ పాదాలు స్పృశిస్తాను.

కాని నీ పాదాలను మాత్రం నేను ఎన్నటికీ అందుకోలేను. గానామృతాన్ని తాగిన మత్తులోనన్ను నేను మరచిపోతాను. అప్పుడు నీవు నాకు ప్రభువన్న విషయం కూడా మరచి, మిత్రుడా! అని నిన్ను సంబోధిస్తాను.


3

నీవు పాడుతూ వున్నప్పుడు నేను వింటాను. నీవు ఎలా పాడుతున్నావో, ఏమి పాడుతున్నావో నాకు అవగతం కాదు. అయినా నిశ్శబ్దంగా ఆశ్చర్యంతో ఆ పాట వింటాను.

నీ గానజ్యోతి యీ ప్రపంచాన్నంతా దీప్తం చేస్తుంది. నీ గానంలోని జీవశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె వియత్తలమంతా నిండి పోతుంది. పరమ పావనమైన నీ గానవాహిని రాళ్ళనూ, రప్పలనూ ఛేదించుకుని పరుగులు తీస్తూ ప్రవహించి పోతుంది.

నీ గానంలో శ్రుతి కలపాలని నా హృదయం అర్రులు చాస్తుంది. కాని ఎంత పెగల్చుకున్నా గొంతులో నుంచి వెలువడదు. మాట బయటకు వచ్చినా మాట పాటగా మారదు.

ఏం చేయాలో తోచక వెర్రిగా ఏడుస్తాను.

ప్రభూ నీవు నన్ను నీ గానాల వలలో బందీని చేశావు సుమా!

4

జీవన జీవనమా!

నీ సజీవ స్పర్శ ఎల్లప్పుడూ నా శరీరంపై వుంటుందని తెలిసి, నా దేహాన్ని దేవాలయంలా పరిశుద్ధంగా వుంచుకోడానికి ప్రయత్నిస్తాను. అసత్యాన్ని మనసులో అడుగుపెట్టనివ్వక అల్లంత

దూరంలో వుంచుతాను. నా మనో మందిరంలో హేతు జ్యోతిని వెలిగించిన సత్యానివి నీవు.

నా హృదయాంతరంలో నీ పీఠం వున్నదని తెలిసి, దుష్టత్వాన్ని చేరనివ్వక నా హృదయాన్ని ఎల్లప్పుడూ నవవసంత ప్రేమారామంగా వుంచుకుంటాను.

నేను చేసే ప్రతి పనిలో నీవే ప్రతిఫలించాలని నా కోరిక. నీవు ప్రతిఫలిస్తే నాకు ఏ పని చేయాలన్నా శక్తి కలిగేది.


5

ఒక్క నిమిషం. కాసేపు నీ ప్రక్కన నన్నుకూర్చో నివ్వవూ?

పనులు తరువాత చేసుకుంటాను. నీ ముఖాన్ని ఒక్క మాటైనా చూడకపోతే, నా హృదయానికి శాంతీ, స్థిమితమూ ఉండవు. నాకు ఎంత చిన్న పని అయినా ఈదరాని మహాసముద్రంలా కనిపిస్తుంది.

కిటికీ దగ్గర కూర్చున్నాను. వేసవి వచ్చింది. వేసవి నిశ్వాసలు వినవస్తున్నాయి. వికసిస్తున్న పూల పొదల వద్ద భ్రమరాలు రొద చేస్తూ తిరుగుతున్నాయి.

ప్రభూ! ఇది కాసేపు నీ ముఖం వైపే చూస్తూ ప్రశాంతంగా నీప్రక్కనే కూర్చుని, తీరికగా నా జీవన గీతాన్ని నీకు సమర్పించవలసిన సమయం.


6

జాగు చేయకుండా ఈ చిన్నారి పూవును కోసి వేయి, ఇది రాలి ధూళిలో కలిసి పోవచ్చు.

ఈ చిన్ని పూవుకు నీ పుష్పమాలలో స్థానం అలంకరించే అర్హత లేకపోవచ్చు.

కానీ కనీసం నీ చేతిలో గిల్లి వేసి అయినా దీనిని గౌరవించు. నేను గమనించకుండానే ఈ చిన్ని పూవుకు కాలం అయిపోవచ్చు. పూజా సమయం దాటి పోవచ్చు. ఈ పూవు రంగు పాలిపోయింది కావచ్చు. పరిమళం లేని పూవే కావచ్చు. దీన్ని కోసి నీ పూజకు వినియోగించు.


7

నేను పాడే పాటకు ఆభరణాలు లేవు. అందచందాలు లేవు. సొమ్ములూ, శోభలూ విసర్జించింది నా పాట. అందంగా, ఆకర్షణీయంగా అలంకరించుకున్నానన్న అహం లేదునా పాటకు. ఆభరణాలూ, అలంకారాలు ముసరి లీనతకు అడ్డు వస్తాయి. నీవు నన్ను కౌగలించుకుని ఏవేవో గుసగుసలు వినిపిస్తూ వుంటే ఆభరణాల గలగలలో నీ గుసగుసలు వినిపించవు. నేనొక కవినన్న గర్వం నీ సాన్నిధ్యంలో అంతరించి పోతుంది.

ఓ మహాకవీ! నేను నీ పాదాల వద్ద కూర్చున్నాను. నా జీవితాన్ని ఒక చిన్న వేణువులాగ సుగమనం, సుందరం చేసుకోనీ - చాలు. నీవు వేణువును ఊదుదువుగాని.


8

కుర్రవానికి రాకుమారుని దుస్తులు తొడిగి సింగారించారు. మెడ నిండా సొమ్ములు దించారు. అప్పుడు అతడికి ఆటలోఆనందం ఏమి వుంటుంది.అడుగడుగునా అతని సింగారం అడ్డు వస్తుంది.

అలంకారం మాసి పోతుందేమోనని అతను ఒక మూల వొదిగి కూర్చుంటాడు. అడుగు కదపటానికి భయపడతాడు.

హాయినీ, ఆరోగ్యాన్ని ఇచ్చే భూమాత ఒడి నుంచి నన్ను విడదీసే ఈ అలంకారం నాకు వద్దమ్మా! ఇది నన్ను మానవ జీవన మహోత్సవంలో పాల్గొనకుండా చేస్తున్నది.

9

నీవు ఎంత వెర్రి వాడవు. నీ బరువు నీవే మోయాలని యత్నిస్తున్నావు.

భిక్షకుడా! నీ గడప దగ్గర నీవే భిక్షాటన చేస్తున్నావు.

అన్ని భారాలూ ఆయనపై వదిలి పెట్టు.ఆయనే అన్నింటినీ భరిస్తాడు. నీవు నిశ్చింతగా వుండు. నీ వాంఛాపరత, మలిన శ్వాసలో నీలోని దీప్తిని ఆర్పివేస్తుంది. ఈ అపవిత్రమైన హస్తాలతో కానుకలను స్వీకరించకు. పవిత్ర ప్రేమతో అందించిన కానుకలనే స్వీకరించు.


10

ఇదుగో నీ పాదపీఠం.

ఈ పీఠంపై నీ పాదాలు వుంచు.

ఇక్కడ పేదలూ, అధములూ, పరిత్యక్తులూ వుంటారు. నేను నీ పాదాలకు నమస్కరించాలని తలవంచినప్పుడు నా ప్రణామం ఈ అధో జగత్తులో వుండే నీ పాదాలను స్పృశించ లేదు.

నిరుపేద వలె, అధమాధముని వలె, పరిత్యక్తుని వలె, నీవు నడిచి వెళ్ళే త్రోవలో ధూళిని కూడా అహమిక స్పృశించ లేదు.

తోడు నీడ లేని పతిత లోకంలో నీవు ఉన్నచోటికి నా హృదయం వెతుక్కుంటూ రాగలదా?

గీతాంజలి (11 - 20)[మార్చు]

11

ఓయీ పూజారీ! ఇక నీ జపతపాలను, కీర్తనాన్ని విడిచి రా. తలుపులన్నీ మూసుకుని, ఈ దేవాలయపు చీకటి కోణంలో ఎవరి కోసం నీవు పూజిస్తున్నావు? ఒక్కమాటు కళ్ళు తెరచిచూడు.

నీవు ఏ దేవుని ఆరాధిస్తున్నావో, అతడు నీ ముందు లేడు.

అతడు ఎక్కడ ఉన్నాడో చూడు. రైతు రాతి నేలను దున్నుతూ ఉన్నచోట - రోడ్లు వేసే పనివాడు రాళ్ళుకొడుతూ ఉన్నచోట - అతడు వున్నాడూ. ఎండనక, వాననక పని చేస్తున్న వారి

వద్దనే అతను వున్నాడు.అతను దుస్తులు కూడా వారి దుస్తుల వలెనే దుమ్ము కొట్టుకుని వున్నవి.

నీవు కూడా అతని వలెనే ధూళి ధూసరితమైన నేల పైకిరా.

ముక్తి! ముక్తి ఎక్కడుందని భావించావు? మన ప్రభువే ఆనందంతో ఈ సృష్టి బంధాలను స్వీకరించాడు. అతను ఎల్లప్పుడూ మనతో కట్టుబడివున్నాడు.

ఓ పూజారీ! నీ జపతప ధ్యానాల నుంచి బయటకు రా! పుష్పాలను, ధూపదీప నైవేద్యాలను ఆవల వుంచు.

నీవు ధరించిన వసనాలు మాసి, చిరిగిపోతే మటుకు ఏమిటి? అతనితో, అతని బాసటే నిలిచి చెమటోడ్చి కష్టించు.


12

నా ప్రయాణం అతి దీర్ఘమైంది. అవధి ఎన్నడు చేరుకుంటానో! అవధిఎంత దూరమో!

తొలి వేకువలోనే బయలుదేరాను. లోకాల చీకటి బాటలో అనేక గ్రహ, నక్షత్రాలపైనా జాడవదులుతూ ప్రయాణంచేశాను.

అత్యంత సన్నిహితం గానీ చేరువకు చేర్చే పథం అతి దీర్ఘమైంది. అతి నిరాడంబరమైన పాట అనడానికి అవసరమైన శిక్షణ అత్యంత క్లిష్టం.

పధికుడు తన వాకిలి చేరుకునే వరకు ప్రతి తలుపూ తట్టాలి. కడకు గర్భాలయం చేరడానికి బాహిరమైన ప్రపంచాలన్నీ పరివ్రజించాలి.

నేను కళ్ళు మూసుకోవడానికి ముందు నా చూపులు దూరదూరాలకు ప్రసరించి, నిన్ను అన్వేషించాయి. కడకు కళ్ళు మూసుకుని, ఇక్కడే వున్నావు నీవు అన్నాను.

ఎక్కడ వున్నావు నీవు? అన్న ప్రశ్న - ఆక్రందన, సహస్రాశ్రు మహా వాహినిలుగా మారి, వరదలై లోకాన్ని ముంచెత్తి నేను ఉన్నాను అన్న జవాబు వినిపించింది.


13

నేను పాడవలసిన పాటలు ఈనాటి వరకు పాడనే లేదు. వీణ తీగలు సవరించుకుని శృతి పెట్టుకొనడంలోనే యింత కాలం గడిచిపోయింది.

పాట పాడే తరుణం ఇంతవరకూ రాలేదు. పాటలో పదాలు కుదరలేదు.ఎదలో మాత్రం పాట పాడాలనే వేదన ఉబికిపోతూ వుంది.

పూవు మొగ్గగానే వుంది. వికసించలేదు. నిశ్వసిస్తూ గాలి మాత్రం ఈల వేస్తూ ప్రక్క నుంచే

వెళుతూ వుంది.

అతని ముఖాన్ని నేను ఇంత వరకూ చూడ లేదు. అతని కంఠస్వరం ఇలా ఉంటుందని కూడా నాకు తెలీదు. నా గృహ ద్వారం ముందు వీధిలోంచి వెళుతున్న అతని అడుగుల చప్పుడు మాత్రమే విన్నాను.

క్షణమొక యుగంగా రోజు గడుస్తూ వుంది. అతని కోసం ఆసనం అలంకరించడంతోనే రోజు గడిచి పోయింది. ఇంకా దీపం వెలిగించలేదు. అతన్ని గృహంలో అడుగు పెట్టమని ఎలా ఆహ్వానించగలను? అతన్ని కలుసుకోగలననే ఆశతోనే బ్రతుకు వెళ్ళదీస్తూ ఉన్నాను. కాని ఆ ముహూర్తం రావడం లేదు.


14

అసంఖ్యాకం నా కోర్కెలు.

గుండెలు కరిగించే ఆక్రందన నాది.

నీ నిరాకరణలే నాకు రక్షలైనాయి.

నీ ప్రగాఢ దయా తుషారంనా పై వర్షిస్తున్నది. ఈ ఆకారం, ఈ వెలుతురు, ఈ తనువు, ఈ జీవనం, ఈ మనసు, మమత అడక్కుండా యిచ్చిన ఈ కానుకలు, అతి మమత నుంచి నన్ను రక్షిస్తున్నాయి.

ఏమీ తోచని క్షణాలు, అప్పుడప్పుడూ లేచి అవధికోసం వెదుకుతాను. కాని నీవు నిర్దయగా నాకు కనిపించకుండా దాక్కుంటావు.

నీ నిరాకరణే నన్ను మరింత దగ్గరగా లాక్కుని స్వీకరిస్తుంది.


15

నీ దర్బారులో నీ కోసం పాటలు పాడటానికని వున్నాను.

నీ దర్బారులో యిక్కడ ఈ మూల నాకో చిన్నస్థానం వుంది.

నీ లోకంలో నాకు పనులేవీ లేవు. నిరర్థకమైన నా జీవితం, ఎందుకో కాని అర్థం లేకుండానే గీతాలుగా బయలు వెడలుతుంది. నిశ్శబ్ద నిశీధ దేవాలయంలో నీ పూజకై గంట మ్రోగినప్పుడు, ప్రభూ! నీ ముందు నిల్చి పాడవలసిందిగా నన్ను ఆజ్ఞాపించు.

ప్రభాత మంద మలయానిలంలో, స్వర్ణ వీణను నేను సారించి పాడినప్పుడు, స్వామీ నా ముందు సాక్షాత్కరించి నన్ను సత్కరించు.


16

ఈ విశ్వ మహోత్సవాన్ని చూడ రమ్మని నాకు ఆహ్వానం వచ్చింది. నా బ్రతుకు ధన్యత చెందింది.

కండ్లార ఉత్సవాన్ని చూచాను. చెవులార ఉత్సవ కోలాహలాన్ని విన్నాను.

ఈ ఉత్సవంలో నా వీణ వాయించి, పాట పాడమని నన్ను పిలిచారు. వచ్చాను. నాకు

చేతనయినట్టు పాట పాడాను.

స్వామీ! ఇప్పుడిక నేను లోనికి వచ్చి, నీ వదన సీమను చూచి నీకు నా మౌన పూజను సమర్పించనా? అనుమతిస్తావా?


17

అతని కౌగిట్లో వాలి కరిగిపోయే ప్రేమమయ క్షణం కోసం కాచుకుని వున్నాను. ఇందు చేతనే ఇంత ఆలస్యమైనది. యెన్నెన్నో విషయాలు మరిచాను కూడా.

నాకు స్వేచ్ఛ లేకుండా చేసే అనేక నీతులూ, నియమాలూ నన్ను కట్టివేస్తున్నవి. కాని వాటిని నేను లెక్క చెయ్యను. అతని కౌగిట్లో కరిగి కలిసి పోయే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను.

అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. దేన్నీ లెక్క చెయ్యనని అంటారు. నిజమే మరి!

సంత రోజు గడిచిపోయింది.

పని తొందరలు ముగిసిపోయాయి. ఏదో పని మీద నన్ను పిలుద్దామని వచ్చి, నేను పలక్కపోతే వాళ్ళు కోపంతో వెళ్ళిపోయారు. కడపటికి అతని కౌగిట్లో కరిగిపోయే ఆ క్షణం కోసం కాచుకుని వున్నాను.


18

మబ్బులు, మబ్బులు, మబ్బులు - చీకటి.

ప్రియా! ఒంటరిగా నన్నెందుకు వాకిట్లో నిలిపి వుంచుతావు?

మధ్యాహ్నం పనివేళ, అందరితో పాటు కలిసి వున్నాను. కాని ఈ ఒంటరివేళ ఒక్క నీకోసమే యెదురు చూస్తున్నాను.

నీవు నీ ముఖాన్ని చూపకపోతే, నన్ను ఒంటరి దాన్నిగా వదిలేసే ఈ దీర్ఘ వర్ష రాత్రులు ఎలా గడపను? మబ్బు పట్టిన ఆకసం వంక చూస్తూ కూర్చున్నాను. నీ హృదయం వెర్రిగా ఈలలు వేస్తూ గాలితో పాటు తిరుగుతోంది.

19

నీవు నాతో ఒక్కమాటైనా మాట్లాడకపోతే, ఆ నిశ్శబ్దంతోనే నా హృదయ పాత్రికను నింపుకుని దానిని భరిస్తాను.

నిశ్చలంగా, నిశ్శబ్దంగా, తారలతో నిండిన రాత్రి బరువుగా తల వంచుకుని ఉదయం కోసం శాంతంగా వేచినట్టు నీ కోసం వేచివుంటాను. తెల్లవారుతుంది. చీకటి విచ్చిపోతుంది. నీ గొంతుక ఆకాశంలో నుంచి బంగారు రంగుల ప్రవాహాలుగా పారుతుంది. అప్పుడు నీ మాటలకు నా గూళ్ళలోని ప్రతి పక్షి మేలుకుని పాటలను మారు పలుకుతుంది. నా అడవిలోని ప్రతిపొదలో, రెమ్మ రెమ్మలో,కొమ్మ కొమ్మలో నీ మధురగీతి పూలు పూస్తుంది.


20

పద్మం పూచిన రోజున నా మనస్సు ఎక్కడెక్కడో విహరిస్తూ వుంది. ఎంచేతనో నాకు తెలీదు. నా పూల బుట్ట అలానే ఖాళీగా వుండి పోయింది. పూవుగానే మిగిలి పోయింది.

ఇప్పుడు మళ్ళీ ఏదో దిగులు నన్ను ఆవరించింది. నేను నా కలలోంచి ఉలిక్కిపడి లేచాను. దూరంగా ఎక్కడో దక్షిణానిలంలో ఒక విచిత్రమైన మధు భరిత పరిమళం నా నాసికను తాకింది. నా గుండె దడదడ కొట్టుకుంది. విరహంతో వసంతం ఫలవంతం అయ్యేందుకు తపోనిశ్వాసాయీ పరిమళం? ఈ తీయని పరిమళం నాలోనిదేనని, నా గుండె లోతులలో నుంచే బయలుదేరిందని ఆనాడు నాకు తెలియదు.

గీతాంజలి (21 - 30)[మార్చు]

21

పడవనిక బయలుదేరదీయాలి. తీరంలోనే గంటలు గంటలు గడిచి పోతున్నాయి. అయ్యో!

ఏంచేయను?

వసంతం వచ్చింది. పూలుపూచాయి. వసంతం వెళ్ళిపోయింది సెలవు తీసుకుని. ఇప్పుడు వాడిన పూల భారంతో నేను ఇక్కడ-తోచక-వేచివున్నాను.

సాగరంలో అలలు చెలరేగి అలజడి చేస్తున్నాయి. తీరంలో పాండుర పత్రాలు గాలికి గలగలలాడి రాలిపడుతున్నాయి.

ఈ సాగరతీరంలో నుంచుని ఏ శూన్యత వైపు తదేకంగా చూస్తున్నావు! ఆవలి ఒడ్డున దూరంగా వినిపించే పాట గాలిలో తేలివచ్చి కదిలించడం లేదూ?


22

అగాధశ్రావణాప్రభవినీల మేఘచ్ఛాయలలోనీవు ఎవ్వరికీ కానకుండారహస్యంగా నడిచివస్తావు.ఈనాటి ఉదయం కళ్ళుమూసుకుంది.

తూర్పునవీచిన వాయువుఎన్నిసార్లు పిలిచినామేల్కాంచలేదు.

నీలాలనింగిమేఘాల దుప్పటికప్పుకున్నది.

అడవిలో పక్షుల కిలకిలారావాలు అణగిపోయాయి. ఇండ్ల తలుపులన్నీ మూసివేశారు. ఈ వీధిలో నడిచివస్తున్న ఏకాంత పాంధుడివి నీవు ఒక్కడివే. ప్రియా! నా ఏకైక మిత్రుడా!నా ఇంటి తలుపులు నీ కోసం తెరిచి వుంచాను. నిద్రలో నడుస్తున్నవాని వలె నా ఇంట్లోకి రాకుండా అలా వెళ్ళిపోకు.


23

ఈ తుఫానురాత్రి...

ఈ ప్రేమయాత్రకుపూనుకున్నావేమిటిసఖుడా?

ఆకసంబాధితునివలెమూల్గుతూ వున్నది.నేను రాత్రంతా నిద్రపోలేదు.

మాటిమాటికిలేచి, తలుపులుతెరచి చూచేదాన్ని,వెలుపల చీకటి.

కళ్ళుపొడుచుకున్నా కానరానిచీకటి. ఏ త్రోవనవస్తావో తెలీదు.సిరాలా నల్లని ఏ నదీతీరం నుంచి నడిచివస్తావో, కోపంతో రుసరుసలాడేఏ అరణ్య పథంలో నడచివస్తావో?

ఏ కంటకపథాలు దాటి నన్నుకలుసుకోడానికి వస్తావో!


24

పగలుగడచి, పక్షులు పాడడంమానివేసి, గాలి వీచివీచి అలసి సొలసి అస్తమయమవుతేసాయంత్రం కన్నుమూసే కమలం రెక్కలుమూసి లోకాన్ని నిద్రదుప్పటితో కప్పినట్టే,చీకటి తెరనునాపై కప్పు. యాత్ర ముగియకమునుపే పొధేయంఅయిపోయిన యాత్రికునికిబట్టలు చిరిగిమాసి దుమ్ము కొట్టుకున్నవానికి,అలసిపోయినవానికి అవమానంతొలగించి, అశాంతి తొలగించి,చల్లని రాత్రిలోఅతన్ని పుష్పంలా తిరిగివికసించేట్టు చేయి.


25

బాగాఅలసిపోయిన రాత్రి-

పరువులూ,భారాలూ, బాధలూఅన్నీ నీకు వదలివేసిహాయిగా కన్ను మూసినిద్రిస్తాను.

అణగారిపోతున్ననా ఆంతరాత్మను, మేలుకొల్పినీ పూజకోసం సిద్ధం చేస్తాను.ప్రతి నిత్యం రాత్రివేళఅలసిన లోకాన్ని నిద్రపుచ్చికొత్త సంతోషంతో మళ్ళీమేలుకునేట్టుచేస్తావు.


26

నేనునిద్రపోతూ వుండగాఅతను వచ్చినా ప్రక్కనే కూచున్నాడు.కానీ నేను నిద్ర

మేలుకోలేదు.అయ్యో! పాపిష్టి నిద్రనన్ను దెయ్యంలాఆవరించింది.

రాత్రినిశ్చలంగా ఉన్నవేళఅతను వచ్చాడు.తన వీణను తీసుకొనివచ్చాడు. ఆ మధుర

శృతులలోనా కలలు కూడా కలసిమారు పలికాయి.

అయ్యో!భగవంతుడా!ప్రతిరాత్రి ఇలాగేవృధా అవుతున్నది.ఎవని సజీవ శ్వాస నానిద్రను స్పృశిస్తూ ఉన్నదోఅతన్ని ప్రతినిత్యంచూడలేకపోతున్నాను.


27

జ్యోతి?ఎక్కడుంది జ్యోతీ?తీవ్రవాంఛాగ్నిజ్వాలతో ఆ జ్యోతినివెలిగించు.

దీపంమాత్రమే వుంది.కాని ఆ దీపంలో ఎన్నడూఒక జ్యోతి మినుక్కుమనలేదు. హృదయమా-నీ గతి కూడా ఇటువంటిదే!ఇంతకంటే చావునయం. దు:ఖం నాతలుపు తట్టుతూవుంది.

నీప్రభువు నీకోసం వేచివున్నారు.రాత్రివేళ నిన్నుసంకేతానికి రమ్మన్నారుఅని నాకు సందేశం అందిస్తోంది.

రాత్రిఆకాశంలో మేఘాలు కమ్మాయి.వాన కుండ పోతగా కురుస్తూవుంది. నాలో ఏదో సంచలనంఏమిటో నాకు బోధపడదు.

ఒకక్షణం మెరుపు మెరిసే, మళ్ళీఇంతలో నాలో అగాధమైనచీకటి. ఈ రాత్రిఎక్కడో దూరంగా ఆ గానం పిలిచేచోటికి త్రోవకోసంనా హృదయంవెర్రిగా వెదుకుతూంది.

జ్యోతి?ఎక్కడుంది జ్యోతీ?జ్యోతిని తీవ్రవాంఛాజ్వాలతో వెలిగించండి.ఉరుములు, మెరుపులు,నల్లని బండలాపడివున్న కారునల్లనికాళరాత్రి. గంటలుదాటిపోతున్నాయి.

ప్రేమజ్యోతినిజీవితంతో వెలిగించు.


28

ఎంతత్రెంచుకున్నాతెగని బంధాలు.ఈ బంధాలు త్రెంచుకోడానికియత్నించినప్పుడల్లా

నాహృదయం బాధపడుతుంది.

నేనుకోరేదల్లా స్వేచ్ఛ.కాని స్వేచ్ఛను కోరుకున్నందుకేసిగ్గుపడతాను. నీవుఅమూల్యమైనపెన్నిధివని నాకు తెలుసు.నీకు మించిన సఖుడెవరూనాకు లేడని కూడా నాకుతెలుసు. కానీ నీవునా మందిరంలోకి వచ్చేటప్పుడు,ఈ బాహ్యాడంబరాన్నితుడిచిపెట్టలేకపోయాను.

నన్నుకప్పివున్న ముసుగుదుమ్ముతో, మృత్యువుతోనిండివుంది. ఈ ముసుగుచూస్తే నాకు తీరని రోత.కాని నీవు దీనితో ఎంతోఆప్యాయంగా కౌగిట్లోకి తీసుకుంటావు.

నాఋణాలు అసంఖ్యాకం.నా అపజయాలు అనంతం.నా అవమానం-భరించరానిది.కాని నేను నీ వద్దకునాకు శుభం చేకూర్చమనివరం కోరడానికి వచ్చినప్పుడు..నీవునిజంగా నాకు వరం ప్రసాదిస్తావనేభయంతో గజగజ వణికి పోతాను.


29

నేనుగాపిలవబడే వ్యక్తిఈ చీకటి కోణంలోపడి మ్రగ్గుతూ విలపిస్తున్నాడు.ఈ గోడను కట్టడంతోనేనా కాలం గడిచిపోతున్నది.ఈ గోడ పెరిగి పెరిగి ఆకసమంటేకొద్దీ నాలోని వ్యక్తిచీకటి నీడలోదాగి నాకు కనిపించకుండా ఉన్నాడు.

ఇంతపెద్ద గోడ కట్టానుకదాఅని నాకు ఎంతో గర్వం. ఈ గోడనుచక్కగా అలంకరిస్తాను.చిల్లి లేకుండాగట్టిగా సున్నం పూస్తాను.కాని ఇంత చేసినా నాలోఆ వ్యక్తి నాకు కనిపించడు.


30

ఎంతోదూరం నడచి ఒంటిగాఈ సంకేతానికి వచ్చాను.కాని ఈ నిశ్శబ్ద నిశీధంలోఎవరిదో అడుగుల చప్పుడునా వెనుకనే వినిపించింది.

అతనినుంచి తప్పించుకోవాలనిప్రక్కకు తొలుగుతాను.కాని అతన్ని తప్పించుకోలేను.

అతనుఅతి త్వరగా నడిచిధూళి రేపుతాడు. నేనుమాట్లాడిన ప్రతిమాటకూ అతను బిగ్గరగామారు పలుకుతాడు.

అతనుచిన్నారి నా అంతరాత్మనేప్రభూ! అతనుచాలా అల్లరివాడు.అతన్ని తోడుగా తీసుకొనినీ ఇంటి ముందుకురావాలంటే భయపడతాను.

గీతాంజలి (31 - 40)[మార్చు]

31

ఖైదీ!చెప్పు నిన్ను ఈ ఖైదులోఉంచింది ఎవరు?

నాయజమాని అని చెప్పాడుఖైదీ.

సంపదలో,అధికారంలో అందరినీమించిపోగలనని అనుకున్నాను.రాజుకు చెల్లించవలసినకప్పాన్ని కూడా ఇంటిలోనేదాచాను. నిద్ర ముంచుకొనివచ్చినప్పుడునా ప్రభువు కోసంపరచిన పక్కపై పవళించాను.నిద్ర మేల్కొని చూచేసరికినా ఖజానాలోనేనేను బందీగా వున్నాను

ఖైదీ!చెప్పవోయీ తెగిపోనిసంకెళ్ళను తయారుచేసింది ఎవరు?

నేనేఈ సంకెళ్ళను తయారుచేశాను. ఈ సంకెళ్ళనుఎంతో జాగ్రత్తగా మూసపోసితయారుచేశాను.ఈ సంకెళ్ళతో ప్రపంచాన్నియావత్తు బంధించి,నేను మాత్రంస్వేచ్ఛగా ఉండగలననిఅనుకున్నాను. రాత్రనక,పగలనక శ్రమించి,కొలిమి ఊది, మంటలురేపి, బలమైన ఈసంకెళ్ళను తయారుచేశాను.సంకెళ్ళు బాగా అతికితయారయిన తరువాతచూస్తే, అవే నన్నుగట్టిగా బంధించాయి


32

ఈ లోకంలోనన్ను ప్రేమించి,నా మంచి కోరేవారందరూ,అన్ని విధాలుగా నన్నుబంధించి, నన్నుభద్రంగా ఉంచాలనియత్నిస్తారు. కాని నీవుమాత్రం అలా చేయవు.నీ ప్రేమ వీరందరి ప్రేమకంటేగొప్పది.

నీవునన్ను ఎప్పుడూ స్వేచ్ఛగాఉంచడానికి యత్నిస్తావు.

ఈ లోకంలోవాళ్ళు నేనువాళ్ళను మరచిపోతాననేభయంతో, నన్నుఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వరు.ఇలా రోజులు వెళ్ళి,మారిపోతాయి. నీవు మాత్రంకనిపించవు. నా ప్రార్థనలలోనేను నిన్ను స్మరించకపోయినా,నా హృదయంలోనిన్ను నిలుపుకొనకపోయినా,నీ ప్రేమ ఎల్లప్పుడూనా ప్రేమ కోసం వేచిఉంటుంది.


33

పగటిపూటవారు నా ఇంటికివచ్చి,ఇక్కడ ఒక చిన్నగదిమాత్రమే మాకుకావాలి అని అన్నారు.

ఈశ్వరపూజలో నీకు తోడుగావుంటాము. ఆయనఏదైనా వరమిస్తే మాకుఅనుగ్రహించినవంతు మేము తీసుకుంటాముఅన్నారు! ఆ తరువాత వారునా గదిలో ఒక మూలనక్కి వినయంగా కూర్చున్నారు.

కాని,రాత్రి చీకటిలోవారు నా పవిత్ర పూజామందిరంలోకి త్రోసుకువచ్చి,పేరాశతో పూజా పీఠం వద్దనున్నప్రసాదాన్ని అపహరించడంనేను చూశాను.


34

నిన్నునా సర్వస్వంగా చెప్పుకునేఆ కాస్త ఔదార్యం నాకు మిగిలిస్తేనాకు అంతే చాలు.

అన్నిదిక్కులూ నిన్నే చూచి,నీ వద్దకు వచ్చిప్రతి చిన్న సేవనూనీకే సమర్పించి, నా

ప్రేమనుప్రతిక్షణం నీకే సమర్పించిఆ కాస్త శక్తిని నాలో మిగిలిస్తేఅంతే చాలు.

నిన్నుఏనాడూ నా సొంతమనిదాచుకోని ఆ కొంచెం వైశాల్యాన్నినాకు ప్రసాదిస్తే అంతేచాలు.

ఎప్పుడూనీ ఇచ్చకే నేను కట్టుబడివుండే ఆ చిన్ని సంకెలతెగిపోకుండా ఉంటేచాలు. నీ ఇచ్చనేనేను నా జీవితంలోనెరవేర్చే ఆ చిన్నిప్రేమ సంకెల తెగకుండాఉంటే చాలు.


35

ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,

ఎక్కడమానవుడు సగర్వంగాతల ఎత్తుకునితిరుగుతాడో,

ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగామనగలుగుతుందో,

ఎక్కడప్రపంచం ముక్కముక్కలైఇరుకైన గోడల మధ్యమ్రగ్గిపోవదో,

ఎక్కడమాటలు అగాధమైనసత్యం నుంచి బాహిరిల్లుతవో,

ఎక్కడఅవిరామమైన అన్వేషణ,పరిపూర్ణతవైపు చేతులుచాస్తుందో,

ఎక్కడపరిశుద్ధ జ్ఞానవాహినిమృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,

తలపులోపనిలో నిత్యవిశాలపథాలవైపు ఎక్కడ మనస్సుపయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ!నా దేశాన్ని మేల్కాంచేట్టుఅనుగ్రహించు.


36

నిన్నునేను ప్రార్థించేదిఒకందుకే ప్రభూ-

నాలోనిలోభిత్వాన్ని, సంకుచితత్వాన్నిసమూలంగా నిర్మూలించు.

కష్టసుఖాలనుతేలికగా భరించేశక్తి నాకు ప్రసాదించు.

నాప్రేమను నీ సేవలోఫలప్రదం చేసుకునేశక్తిని నాకు యివ్వు.

పేదవారినితిరస్కరించకుండా, అధికారగర్వంముందు తలవంచకుండావుండే బలాన్నినాకు అనుగ్రహించు.

సగర్వంగాతలయెత్తిరోజువారీ చిల్లరకష్టాలనుచూచి నవ్వే తత్వాన్నినాకు కలుగజేయి.

ప్రేమతోనా సర్వస్వాన్నీ నీ ఇచ్ఛకుసమర్పించే శక్తి నాలోప్రేరేపించు.


37

నాదీర్ఘ యాత్ర చివరకువచ్చిందని, నాలోశక్తి అంతా నశించిందని,నా ముందు త్రోవకనిపించడం లేదని,ప్రాధేయం అయిపోయిందని,ఎక్కడికో వెళ్ళి ఏకాంతంలోతలదాచుకునేసమయం వచ్చిందనిఅనుకున్నాను.

కానీనీ ఇచ్ఛ అనంతరం,పాతబడిన మాటలస్థానే కొత్త పాటలునాలో పలుకుతున్నాయి.

పాతబాటలు కనిపించకుండాచెరిగిపోయినచోట,కొత్త బాటలుకొత్త అందాలు చిందిస్తూ

బాహిరిల్లుతున్నాయి.


38

నీవేకావాలి....నీవే...నీవే..నీవే...కావాలి...ఇలా నా హృదయాన్నిఅహరహాలుజపం చేయనీ, ఇంతకన్నానాకు వేరే ఏమీ వద్దు.నా మనస్సులాగే ఇతరకోర్కెలన్నీ శూన్యమైనవి.

వెలుగుకోసంవేదనను రాత్రితనలో దాచుకున్నట్టు,నా హృదయాంతరాలలో'నీవే

కావాలి,నీవే కావాలి' అన్న మంత్రాక్షరాలనుదాచుకుంటాను. ప్రశాంతినిబెదరగొట్టేతుఫాను, ప్రశాంతిలోనేఅంతమైనట్టునీ ప్రేమపైనా తిరుగుబాటుకూడా 'నీ కోసమే..నీవే కావాలి'అనే మంత్రమేజపిస్తుంది.


39

క్షామంలోపృధ్వివలె గుండెయెండి బీటలువారినప్పుడు నాపై నీ దయావర్షంకురిపించి

సాక్షాత్కరించు.జీవితంలో అందచందాలునశించినప్పుడుఒక తీయని పాటలాసమీపించు.

నన్నువిదూర పంధాతర ధ్యానంనించి దూరం చేసేనిత్య కార్యక్రమరభస అన్నివైపులానన్ను చుట్టుముట్టినప్పుడు,నిశ్శబ్ద శాంతి మయమూర్తీశాంతిగా, విశ్రాంతిగా నా ముందుఅవతరించు.

భిక్షకునివలెపరాధీనమైన నాహృదయం ఒకమూల ముడుచుకునికూచున్న సమయాన,తలుపు బ్రద్దలుగాతెరిచి మహారాజా,సర్వవిధ రాజలాంఛనాలతోనాలో ప్రవేశించు.వాంఛ, విభ్రాంతితోమనస్సును అంధంచేసినప్పుడు. నిర్మలమూర్తీ, జ్ఞానీ నీ దీప్తితోశుభ్రగర్జతో నాకుకనిపించు.


40

నాశూన్య హృదిలోయెన్నాళ్ళయిందోఒక్క వాన చుక్కయినాకురిసి.

ఎంతవెదికినా ఆకాశంలో ఒక్కచిన్న మబ్బుతునకయినాకానరాదు.

నేడుకాకుంటే రేపైనా వానచినుకు పడుతుందనేఆశ లేదు. ఆకాశంలో మెరుపులచర్నకోలలు విసురుతూ,కోపో దీప్తమైన తుఫానువీచేట్లు చేయడమేనీ ఇచ్చ అవుతేఅలాగే తుఫానునుపంపు.

కానీ,ప్రభూ! నా హృదయాన్నిమాత్రం కాల్చివేస్తూనాకు వూపిరాడకుండా చేస్తున్నఈ నిశ్శబ్ద తీక్షణత్వాన్నిమాత్రం ఉపశమింపజేయి.తండ్రి కోపగించుకున్నరోజున, కన్నీటితోనిండిన తల్లిచూపువలె, నిర్భరమేఘానివై నీ చల్లదనాన్నిఅనుగ్రహించు.

గీతాంజలి (41 - 50)[మార్చు]

41

ప్రియా!నీవు వారందరికీ వెనకాలయెక్కడో నీడలలోదాగి నిల్చుని ఉన్నావు.నీవు లేవేమోఅనుకున్న వారందరూనిన్ను త్రోసుకుంటూనడిచి వెడతారు.

నేనిక్కడనా కాన్కలన్నీ పరుచుకొనినీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను.వచ్చిపోయేవారునా పూజాపాత్రలో ఒక్కొక్కపూవే ఏరుకొని పోతారు. నా పూజాపాత్ర ఖాళీ అవుతుంది.ఉదయమంతా నీ కోసంవేచి వున్నాను.మధ్యాహ్నంకూడా గడచిపోయింది.సాయంత్రమైంది.నీ కోసం వేచి వేచి,నా కండ్లు నిద్రతోతూగుతున్నాయి. ఇళ్ళకుతిరిగి వెళ్ళే వారునా వైపు చూచి, చిరునవ్వునవ్వి, నన్ను అవమానంతోముంచివేస్తున్నారు.ఒక బిచ్చగత్తెలాముసుగు కప్పుకుని ఒక మూలకూర్చున్నాను.

నీవుఇక్కడ కూర్చున్నావేం?నీకేం కావాలి? అని ఎవరైనాఅడిగినప్పుడు కండ్లుదించుకుంటాను,వారికి జవాబు చెప్పలేక.

నీకోసం నేను వేచి వున్నానని,నీవు తప్పకుండా వస్తావనివాగ్దానం చేశావని,నేను వారితో ఎలా చెప్పను?ఈ పేదరికాన్నే వరప్రసాదంగానీకు నేనిచ్చే కాన్కగాభరిస్తూ ఉన్నాననినేను పెదవి విప్పి వారితోఎలా చెప్పగలను.అవమానంతో ఈ భూమిలోక్రుంగిపోనూ? ఇలాగే ఈ అభిమానాన్నినా హృదయగర్భంలో దాచుకుంటున్నాను.

ఇలాఈ పచ్చని మైదానంలోకూర్చుని, నిర్మల నీలాకాశంవంకచూస్తూ హఠాత్తుగానీవు వస్తున్నట్లుకల కంటాను. దీపాలువెలుగుతాయి. బంగారుపతాకాలు నీ రథంపై ఎగురుతూవుంటాయి. త్రోవలోనిల్చున్నవారు నోళ్ళుతెరుచుకొని ఆశ్చర్యంతోచూస్తూ వుంటారు. నీవునీ రథం దిగి, వీధిప్రక్క కూర్చున్న ఈ బిచ్చగత్తెనుచేయిచ్చి లేవదీసిరథంలో నీ ప్రక్కనకూర్చుండబెట్టుకునితీసుకుని వెళతావు.నేను భయంతోచిన్న చిరుగాలికిపూల తీగె వణికినట్టువణుకుతూ నీ ప్రక్కనకూర్చుంటాను.

కానిఇది కల, నీవు రావు.కాలం గడిచిపోతుంది.నీ రథచక్రాల సవ్వడివినిపించదు. మరేవోఊరేగింపులు కోలాహలంగానా ముందునుంచిసాగిపోతాయి. అందరికీ వెనుకఆ నిశ్శబ్దచ్చాయలోనిలువవలసింది.నీవు ఒక్కడివేనా? నీకోసం వేచి వేచి, కన్నీరురాల్చి రాల్చి, హృదయంశుష్కించి వాడిపోవలసినదానిని నేను ఒకతెనేనా?


42

నీవూ,నేనూ తెల్లవారినవెంటనే పడవలోవెళ్ళిపోతామనిఅంతా గుసగుసలాడారు. మన

ప్రయాణంఈ ప్రపంచంలో ఎవ్వరికీతెలియదనీ,ఎక్కడికో, ఎందుకో మనంవెళ్ళిపోతామనిఅందరూ అనుకున్నారు.

మనంవెళ్ళేది ఏ దేశమూకాదనీ, మన యాత్రకుఅవధి లేదనీఅనుకున్నారు. తీరంలేనిఆ సాగరంలో మన పడవప్రయాణం చేస్తున్నప్పుడునీవు చిన్న చిరునవ్వుతోనా పాట వినాలని

కూచుంటే,నేను గొంతు విప్పి పాడతాను.సముద్ర తరంగాలలాగానాలోనుంచి తీయనిరాగాలు

మాటలబంధాలు త్రెంచుకునిస్వేచ్ఛగా బైటికివస్తాయి.

పడవబయలుదేరి వెళ్ళేతరుణం ఇంకా రాలేదా?ఇంకా మనం పూర్తి చేసుకోవలసినపనులు వున్నవా?

సాయంత్రమైంది.సముద్రంమీద ఎగిరేపక్షులు తమ గూళ్ళకుతిరిగి వెళుతున్నాయి.ఎప్పుడు ఈ బంధాలుతెగిపోతాయో?

ఎప్పుడుఈ పడవ కడపటిసూర్యకాంతి రాత్రిలోకిజారి కలిసిపోయినట్టుసాగరంలో బయలుదేరివెళుతుందో?


43

నీకోసం నేను అలంకరించుకునిసిద్ధంగా లేను.నీవు మామూలుమనిషివలె రహస్యంగా

నాహృదయంలోప్రవేశించి, నీ శాశ్వతముద్రను నా క్షణమాత్రజీవనంపై వదిలివెళ్ళావు.

ఈనాడునా జీవనక్షణాలపైనీ సంతకాన్ని నేనుచూచినప్పుడు,స్మృతిపథంలో

కలిసిపోయినసుఖదు:ఖాల ధూళిలోఆ క్షణాలు చెదురుగాపడి ఉండటం చూస్తాను.

నీవుఇంకా శిశువులా ధూళిలోఆడుకోవడం మరచిపోలేదు.నీ అడుగుల సవ్వడినా ఖేలాశాలలోవినిపించి తార నుంచితారకు వ్యాపించింది.


44

వెలుగునీడలాడే త్రోవప్రక్కన నిల్చి, వెలుగునీడల ఖేలనుగూడడం, తొలకరి చినుకులజల్లులు చూడడం-అదినాకో సంతోషం.

అజ్ఞాతవియత్పంథాంతరాలనుంచి సందేశవాహకులుకొత్త సందేశాలుమోసుకొని వస్తారు. నన్నుపిలిచి, అభినందించిత్రోవ ప్రక్కనే సాగివెళతారు. నా హృదయంలోలోపల ఆనందిస్తుంది.వెళ్ళిపోయే చిరుగాలికమ్మని తెరనువదిలి వెళుతుంది.

ఉదయంనుంచి సాయంత్రంవరకు ఇక్కడే వాకిట్లోకూచుంటాను, హఠాత్తుగాఏదో మధురక్షణంవస్తుందని ఎదురుచూస్తూ.ఈలోగా నాలో నేనే నవ్వుకుంటాను.నాలో నేనే పాడుకుంటాను.మధురక్షణం తప్పకవస్తుందనే వాగ్ధానంపరిమళంలా నా చుట్టూరానిండుతుంది.


45

చల్లనిఅతని అడుగుల చప్పుడునీవు యెన్నడూవినలేదూ?

అతనువస్తాడు, వస్తున్నాడు,ఎప్పుడూ వస్తుంటాడు.ప్రతిక్షణం, ప్రతియుగం,ప్రతిరోజు,

ప్రతిరాత్రి అతను వస్తూవుంటాడు, వస్తూనేవుంటాడు.

నామనస్సు పరి పరి విధాలపోయినప్పుడు నేనుయెన్నెన్నో పాటలుపాడాను. కాని అన్ని పాటలలోనూఒకే శ్రుతి వినిపించింది.అతను వస్తాడు,వస్తాడు. ఎప్పుడూ వస్తాడుఅని.

మధువసంత దినాలతోఅడవి బాటల నడచిఅతను వస్తాడు,వస్తాడు, వస్తాడు.

శ్రావణమాసవర్ష రాత్రులలోమిన్ను ఊగిసలాడే మేఘగర్జనలరథంలో అతను వస్తాడు,వస్తాడు, ఎల్లవేళలావస్తాడు.

కష్టంమీదకష్టం వచ్చినప్పుడు,అతని అడుగుల సవ్వడినా గుండెలపై వినిపిస్తుంది.అతని పాదాల స్వర్ణ స్పర్శనాలో ఆనందాన్ని వెలిగిస్తుంది.


46

ఏ విదూరసుదీర్ఘ కాలాంచలంనుంచి నీవు నన్నుకల్సుకోవాలని వస్తూవున్నావో నాకైతే

తెలీదు.సూర్యుడూ... తారలూ నిన్నునాకు దూరంగా వుంచలేదు.

అనేకఉదయాలలో, సాయంత్రాలలోనీ అడుగుల సవ్వడినాకు వినిపించింది. నీవుపంపిన దూత నా హృదయంచేరువకు వచ్చినన్ను రహస్యంగాపిలిచాడు.

ఈనాడునా జీవితం యిలా ఎందుకుసంతోషంతో పొంగులు వారుతూవున్నదో తెలియదు.ఏదో అపూర్వమైన ఆనందంనా హృదయాన్నిముంచెత్తుతూవున్నది. నా పనులన్నీకట్టిపెట్టవలసినతరుణం ఆసన్నమైనదేమో!నీ మధు సాక్షాత్కృతిమంద మనోహరపరిమళ సర్వత్రా వ్యాపించింది.

అతనికోసంనిరీక్షణలో రాత్రంతాగడిచిపోయింది. తెల్లవారినపిదప, అలసి సొలసి నేనుపక్కమీద ఒరిగి నిద్రించినతరువాత, హఠాత్తుగావస్తాడేమోననిభయం. మిత్రులారా!అతనికి త్రోవనివ్వండి.ఆపకండి. అతని అడుగులచప్పుడు విని నేనుమేలుకొనకపోతేనన్ను నిద్ర లేపకండి.పక్షుల కిలకిలా రావాలకు,ఉదయోత్సవ మందానిలస్పర్శకు నిద్రలేవడంనా అభిమతంకాదు.నా ప్రభువు నా గడపదగ్గరకు వచ్చినా,నన్ను నిశ్చలంగానిద్రించనివ్వండి.

అంతమైననా చిన్నారి నిద్రఅతని స్పర్శతో అదృశ్యంఅయ్యే భాగ్యం కోసమేకాచుకుని వుంది. అతనిచిరునవ్వు వెలుగులకేనా కనురెప్పలు విచ్చుకుంటాయి.ఒక స్వప్నంలా అతనునా ముందు నిల్చినప్పుడు,నేను కండ్లు విచ్చిచూస్తాను.

నాకన్నులు కాంచే అన్నిరూపాలకు అన్నివెలుగులకు తొలివెలుగుగా తొలిరూపంగా అతను నా ముందు ప్రత్యక్షంకావాలి.

నిద్రనుంచిమేల్కొన్న నా ఆత్మకుతొలి ఆనందోద్వేగం,అతని మధువీక్షణమేప్రసాదించాలి. అతనికోసం మళ్ళీ నేనుఇహంలో పడతాను.


47

ఉదయసమయాన మౌనగంభీర సాగరంలో పక్షులపాటలచిరు అలలు లేచాయి.

త్రోవప్రక్కన పూవులుసంతోషంతో కిలకిల నవ్వుతున్నాయి.మేము ఏమీ పట్టించుకోకుండామా త్రోవలో నడిచివెళుతున్నాము.మేఘాలు కదలి స్వర్ణరాసులను వెదజల్లుతున్నాయి.మేము పాటలు పాడటంలేదు. ఆటలూఆడటం లేదు.గ్రామంలో సంతకు వెళ్ళలేదు.మాట్లాడలేదు.నవ్వలేదు. త్రోవలోఅటూ-ఇటూ దిక్కులుచూడలేదు.ప్రొద్దెక్కే కొద్దీ త్వరత్వరగానడవసాగాము.

మధ్యాహ్నమైంది.సూర్యుడు నడినెత్తికివచ్చాడు.

గూళ్ళలోనీడలో చేరి పావురాళ్ళు'కుహూ' అంటున్నాయి.మర్రిచెట్టునీడలో కునుకు తీస్తున్నగొర్రెలకాపరి కలలుకంటున్నాడు. నేనుకొలను ప్రక్కనే పడుకొనిఅలసట తీర్చుకుంటున్నాను!

నాసఖులు నన్నుచూచి హేళనగానవ్వారు. సగర్వంగా తలెత్తుకొనివారి త్రోవన వారు పారిపోయారు.ఒక్కమాటు కూడా వారు వెనుదిరిగిచూడలేదు,ఒక్కక్షణం కూడా వారు విశ్రాంతితీసుకోలేదు. సాగిపోతున్నవారివంక నేను చూస్తున్నాను.వారు నడచి- నడచిదూరంగా కనిపించే విదూరవినీల పథంలో కలిసిపోయారు.ఎన్నెన్నో మైదానాలూ,కొండలూ, కోనలూ,లోయలూ దాటివెళ్ళారు.విచిత్ర, విదూర దేశాలుదాటి వెళ్ళారు. ఈ మహానంతపథ నిర్మాతవు నీవేప్రభూ.

నేనుమటుకు ఎక్కడికీ వెళ్ళలేదు.ఇక్కడే ఈ కొలను ఒడ్డునగడ్డి మైదానంలోపవళించి వున్నాను.ఒకరు వెక్కిరించి పోతారనినేను కూడా లేచియాత్ర చేద్దామనుకున్నాను.కాని లాభం లేదు.

నాపరాజయాన్ని సంతోషంతోస్వీకరించాను. సూర్యకాంతికిరణాలవంటిపచ్చని తమస్సుమెల్ల-మెల్లగానా మనస్సులో నిండింది!ఎందుకోసం ఈ ప్రయాణంచేశానో,యీ నీడలకూ, యీ పాటలమైదానానికీ ఎందుకని దాసోహమన్నానోనేనే విస్మరించాను.

చివరకునేను నా నిద్రనుంచిమేల్కాంచి కళ్ళుతెరచి చూసేసరికి,నీవు నా ప్రక్కనే నిల్చివున్నావు.నీ చిరునవ్వుతో నానిద్రని నిలిపివేస్తున్నావు.అయ్యో! ఎంత పిచ్చిదాన్ని!నీ వద్దకు చేర్చేపథం చాలా దూరమైందనీ,కంటకప్రాయమైందనీఅనుకున్నానే!


48

నీవునీ సింహాసనం నుంచిదిగివచ్చి, కుటీరద్వారంలోనిల్చున్నావు.

నేనునా కుటీరంలో ఒక మూలకూర్చుని ఒంటరిగా పాడుకుంటున్నాను.నా పాట నీ చెవులపడింది.

నీవుసింహపీఠంనుండిదిగివచ్చి నా కుటీరద్వారంలో నిల్చున్నావు.

నీదర్బారులో అనేకమందిమహావాగ్గేయకారకులున్నారు. వారు అన్నివేళలా అక్కడకీర్తనలు పాడుతూఉంటారు.

కానిఈ అల్పురాలి అమాయకగొంతుకే నిన్ను ఆకర్షించింది.విశ్వసంగీతంలో మేళవింపబడుచిన్న శ్రుతి. ఆశ్రుతికోసమే నీవునా కుటీరద్వారం వద్దకువచ్చావు. నాకు బహుమానంగాఇవ్వడానికి ఒక చిన్నపూవు తీసుకుని నా కుటీరద్వారంలో నిల్చున్నావు.


49

ఊరివీధిలో గడపకూ భిక్షార్థినైబయలుదేరినవేళ--- నీ బంగారు రథందూరంగా ఒక మహోజ్వలస్వప్నంలా కనిపించు. ఎవరబ్బాఈ రాజాధిరాజులనినేను ఆశ్చర్యపోయాను.

నాలోఆశలు చిగురించాయి. ఆకాశమంటాయి.నాకు పాడు కాలం గడిచిపోయిందికదా అనుకున్నాను. అడగకుండానేపెట్టే భిక్షకోసంధూళిలో అన్నివైపులావెదజల్లినసంపద కోసం వేచి నిల్చున్నాను.

నేనునిల్చిన చోటనేనీ రథం ఆగింది. నీ చూపునాపై వాలింది. చిరునవ్వునవ్వుతూ నీవురథాన్ని దిగివచ్చావు.చివరకు నా బ్రతుకుపండింది కదా అని సంబరపడ్డాను.అప్పుడు హఠాత్తుగానీవు నీ కుడిచేయిచాచి, 'నీవు నాకేం ఇస్తావు?'అని అడిగావు. ఒక రాజాధిరాజుఒక బిచ్చగత్తెనుచెయ్యిచాచి అడగడమనేదిఎంత పరిహాసమోచూడు! నాకు ఏం చేయాలోతోచక వెర్రిదానిలానిల్చున్నాను. అప్పుడునా సంచీలో నుంచిఒక చిన్న ధాన్యపుగింజను తీసి నీ చేతిలోఉంచాను.

నేనుభిక్షాటనం చేసిఇంటికి తిరిగి వచ్చినపిదప నా సంచీలో ధాన్యంక్రిందపోసి చూస్తే, ఆగింజల మధ్యఒక చిన్న బంగారపుగింజ కనిపించినప్పుడునేను నమ్మ లేకపోయాను. వెక్కి వెక్కిఏడ్చాను. అయ్యో నీవునన్ను 'నీవు నాకుఏమిస్తా'వని అడిగినప్పుడునా సర్వస్వం నీదేనని చెప్పేధైర్యం నాకు లేకపోయెనేఅనుకున్నాను.


50

చీకటిపడింది.చీకటి నలుదిక్కులాదట్టంగా అలుముకున్నది.పగలు, పని పాటలన్నీతీరిపోయాయి. చిట్టచివరిఅతిధి కూడా వచ్చివెళ్ళిపోయాడు.ఊళ్ళో యిళ్ళ తలుపులన్నీమూసి వేశారు. కొందరన్నారు,'ఇక ఒక్క రాజుగారు మాత్రమేరావలసి వున్నదని'మేము నవ్వి 'ఇదేంమాట' అన్నాము.

ఎవరోతలుపు తట్టినచప్పుడు వినిపించింది.గాలికి తలుపు చప్పుడయివుంటుందని వూరుకున్నాము,దీపాలు ఆర్పివేసి నిద్రకైప్రక్కల మీద పడుకున్నాము.కొందరన్నారు. 'బహుశాఆ వచ్చింది రాజుగారిదూత అయి వుండవచ్చునని'మేము నవ్వి-- 'అబ్బేఅదేం మాట! గాలికితలుపు చప్పుడైంది'అన్నాము.

ఆ తరువాతఅర్థరాత్రివేళఒక శబ్దం విన్పించింది.బహుశా దూరంగాఏదో పిడుగుపడి వుంటుందనిఅనుకున్నాము. భూమికంపించసాగింది. గోడలువూగిసలాడాయి. 'అదుగోరథచక్రాల చప్పుడు'అన్నారు ఎవరో ఒకరు. మేముసగం నిద్రలో, 'కాదు,అది మేఘ ఘర్జనలచప్పుడు' అన్నాము.

హఠాత్తుగాఢంకా శబ్దం వినిపించింది.'నిద్ర లేవండి.ఆలస్యం చేయకండి'అని ఒక కంఠస్వరం వినిపించింది.మేం భయంతో వణికిపోతూగుండెలు చేతులతోఅదుముకున్నాము. 'అదుగోరాజుగారి పతాక, ఆయనవస్తున్నాడు' అన్నారుఒకరు. మేము ఉలిక్కిపడిలేచినిలుచున్నాము.'ఇక ఆలస్యం చేయడానికివీలులేదు' అన్నాము.

'మహారాజువచ్చాడు. కాని ఏవీ దీపాలు?కాగడాలు? పుష్పమాలలు?ఆయన్ను ఆసీనుణ్నిచేయడానికి సింహాసనమేదీ?అయ్యో! ఎంత అవమానం!ఏం చేయాలి ఇప్పుడు?'

మాలోమేము త్రొక్కిసలాడాము.

'మీఅరుపుల వల్ల, ఆందోళనవల్ల లాభంలేదు. శూన్య హస్తాలతోఆయనకు స్వాగతమిచ్చినిరాలంకారంగా వున్నమీ గదులలోకి ఆయననుతీసుకొని వెళ్ళండి'అన్నారు ఒకరు.

తలుపులుతెరవండి. శంఖధ్వానాలతోమహారాజుకుస్వాగతమివ్వండి. ఈ అగాధనిశీధంలో మనఅంధగృహ చక్రవర్తిఅరుదెంచాడు. చీకటికాంతితో వణికిపోతోంది.చిరిగిన చాపను తెచ్చివసారాలో ఆయన కోసంవేయండి. హఠాత్తుగావచ్చిన తుఫానుతోపాటు,భయద

నిశీధచక్రవర్తి కూడా వచ్చారు.

గీతాంజలి (51 - 60)[మార్చు]

51

నీవునీ కంఠంలో ధరించినగులాబీ పూలమాలనునాకు ఇవ్వమని అడగాలనుకున్నాను.కాని నాకు ధైర్యం చాలలేదు.ఈ కోర్కెతోనే ఉదయం వరకువేచి వున్నాను.

నీవువెళ్ళిపోయిన తరువాతపక్కమీద రాలిన కొన్నిగులాబీ రేకులనుఏరుకుందామని. ఒకటిరెండు గులాబీ రేకులయినాదొరుకుతాయేమోననిబిచ్చగానిలా వెదికాను.

కానిఅప్పుడు నాకేం కనిపించిందనుకున్నావు?నీవు ప్రేమతో నాకోసంవిడిచివెళ్ళినచిహ్నం ఏమిటనుకున్నావు?పూలుకాదు. పరిమళాలువిరజిమ్మే సుగంధద్రవ్యాలూకాదు.అత్తరూ, పన్నీరులూకాదు. అగ్నిజ్వాలల్లాతళతళమెరిసే మెరుపుతీగ వంటినీ మహాఖడ్గాన్నివదిలివెళ్ళావు.లేత ఎండ కిటికీలోనుంచివచ్చి పక్కమీద పడింది.కిటికీ దగ్గరకు వచ్చినపిచ్చుక కిచకిచలాడుతూనన్ను ఇలా అడిగింది-'అమ్మాయీ! నీకు నీ ప్రియుడుఇచ్చి వెళ్ళినదేమిటి?పూలుకాదు. అత్తరులూపన్నీరులూ కావు-ఇదిగోఈ భయంకర ఖడ్గాన్నిఇచ్చి వెళ్ళాడు.'

నేనుఒంటరిగా కూర్చుని నాకేమీ అర్థంకాక ఇదేమి చిత్రమైనబహుమానంచెప్మా అని ఆలోచిస్తాను.విచిత్రమైనఈ బహుమానంఎక్కడ దాచాలో నాకు తెలీదు.అబలనైన నేనుఈ ఆభరణాన్ని ఎలాధరించను? ప్రేమతోహృదయానికిఒత్తుకుంటే ఇదినొప్పెడుతుంది. కానిఈ బాధాభారాన్ని నీవుఇచ్చిన బహుమతినిగౌరవంగా నా హృదయంలోదాచుకుంటాను. ఇక ఇప్పటినుంచిఈ లోకంలో నాకు ఎలాంటిభయం వుండదు.

నేనుచేసే ప్రతి సంఘర్షణలోనీకు విజయమే లభిస్తుంది.మృత్యువునునాకు మిత్రుడుగా వదిలివెళ్ళావు... నా జీవితంలోనేనీవు వదిలివెళ్ళినమిత్రునికి పట్టాభిషేకంచేస్తాను. నా బంధాలనుభేదించడానికిఈ ఖడ్గాన్ని యిచ్చివెళ్ళావు.

ఇకఈ లోకంలో నాకు ఎలాంటిభయములేదు.

ఇకఈనాటి నుంచి, నేనుఅన్ని ఆడంబరాలకు,అలంకారాలకు స్వస్తి చెబుతాను.హృదయేశ్వరా!ఇక ఈ చుప్పనాతితనానికిస్వస్తి. ఆభరణంగా ధరించమనిఒక మహా ఖడ్గాన్నినాకు ప్రసాదించావు. ఇకఈ బొమ్మల కొలువులఅలంకారాలతో నాకు నిమిత్తమేమిటి?

52

అందంగావుంది నీ చేతికిధరించిన కంకణం.

సహస్రవర్ణాల వజ్రవైఢూర్యాలు తాపినఆ కంకణం ఎంతో అందంగా వుంది.

కానీ,నీవు నాకు ప్రసాదించినఖడ్గం అంతకన్నమరీ అందంగా వుంది.

సంధ్యారుణాకారకాంతిలో గరుడపక్షి చాచినరెక్కలలా ఈ ఖడ్గాంచలాలుమెరుస్తున్నవి.

మృత్యుఘాతంలో జీవితంవెలిబుచ్చేకడపటి బాధానందరేఖలా ఖడ్గాంచలంప్రకంపిస్తోంది. భౌతికవాసననుయావత్తూ ఒక్కక్షణంలోభస్మీభూతంచేసే స్వచ్ఛ జ్వాలలామెరుస్తోంది నీవుప్రసాదించిన ఖడ్గం.తారలవలె మెరిసేవజ్ర వైఢూర్యాలుపొదిగిన నీ కంకణం అందమైనది.కాని,

మహేంద్రా!నీ ఖడ్గం అందం కానరానిది!అద్భుతం.

53

నీనుంచినేనేమీ కోరలేదు.నా పేరు కూడా నీ చెవిని వేయలేదు.వెళ్ళి వస్తావనినీవు సెలవు తీసుకొనివెళ్ళేటప్పుడునేను మౌనంగా ఒక్కమాటైనామాట్లాడకుండా నిల్చున్నాను.వాలుగా పడిన చెట్టునీడలోబావిగట్టున ఒంటిగానిల్చున్నాను. మట్టికుండలలోనీరు నింపుకుని ఆడంగులుఇళ్ళకు వెళ్ళిపోయారు.

'ప్రొద్దెక్కింది.నువ్వు రావూ?' అని నన్నుపిలిచారు. కాని నేను ఏదేదోకలలు కంటూ ఇక్కడేనిల్చిపోయాను.

నీవువచ్చేటప్పుడునీ అడుగుల చప్పుడునాకు వినిపించలేదు.దీనంగావున్న కళ్ళతోనావైపు చూచావు. అలసినకంఠస్వరంతో నీవు మెల్లగానాతో మాట్లాడావు.'నేనొక పాంధుణ్ని,నాకు దాహం వేస్తూంది'అన్నావు. పగటికలలలోమునిగివున్న నేనునీ మాటలు విని ఉలిక్కిపడి లేచినా కుండలోనుంచినీ దోసిట్లో నీరుపోశాను.పైన చెట్ల ఆకులుగలగలలాడాయి. చెట్లకొమ్మలలోదాగిన కోకిల కూజితంచేసింది. 'బాబ్లా'పూల పరిమళం త్రోవకొననుంచి తేలుతూవచ్చింది.

నాపేరేమిటో చెప్పమనినీవు అడిగినప్పుడునేను సిగ్గుతో తలవంచుకుని నిల్చున్నాను.

అవును,నీవు నన్ను ఎల్లప్పుడూగుర్తుంచుకోటానికి నేనుచేసిందేమిటి?

కానినీ దాహం తీర్చటానికినీరిచ్చానన్న జ్ఞాపకంఎప్పుడూ నా హృదయంలోపచ్చగా ఉంటుంది. నాహృదయాన్నిఎప్పుడూ మాధుర్యంతోనింపివేస్తుంది. చాలాప్రొద్దెక్కింది. వేపచెట్టుఆకులు గాలికి గలగలలాడుతున్నాయి.అలాగే బావి గట్టునకూచుని కలలు కంటున్నాను.


54

నీహృదయం యింకాతూగుతూనే వుంది.నీ కళ్ళలో ఇంకా నిద్రమబ్బులు తేలుతూనేవున్నవి.

ముళ్ళమధ్య గులాబీతలయెత్తిసగర్వంగా వూగుతూంది. కాలంవృధాచేయకు.మేలుకో! నిద్ర మేలుకో!

ఈ రాతిబాటచివర చీమ చిటుక్కుమన్నావినిపించే నిశ్చలనిశ్శబ్దంలో నా మిత్రుడునీకోసం ఒంటిగా కూచునిఉన్నాడు. అతన్ని మోసంచేయకు. మేలుకో!నిద్ర మేలుకో!

మధ్యాహ్నంఎండవల్ల ఆకాశం అలసటతోరొప్పితే నీకేమిటి?కణ-కణ కాలుతూవున్నఇసుక తన దాహపుదుప్పటిని భూమినిండాకప్పితే ఏమిటి?

నీహృదయాంతరాలలోఆనందం చిందులాడటంలేదా! నీ అడుగడుగునానీవు నడిచేపథ వీణ సంచలించిబాధా స్వరాలు పలకదా?

55

నాలోనీ ప్రీతి ఇలా సఫలీకృతమైంది.నాకోసం ఇలా నీవు మహోన్నతపీఠంనుంచి దిగి వచ్చావు.ప్రభూ! సర్వ స్వర్గ రాజాధీశ్వరా...నేనే కనక లేకుంటేనీ ప్రేమంతా ఏమై ఉండేది.

నీసర్వసౌభాగ్య సంపదకూనన్ను నీ భాగస్వామినిగాచేసుకున్నావు. నాహృదయంలోఅనవరతం నీ విలాసఖేల!నా జీవితంలో నీ ఇచ్చఅనవరతం నూతనరూపాలు ధరిస్తూ వుంది.

ఇందుకోసమేనా హృదయాన్నిఆకర్షించడానికి రాజరాజువైననీవు అలంకారాలు, ఆభరణాలుధరించి ముస్తాబుచేసుకున్నావు. ఇందుకోసమేనీ ప్రియురాలి ప్రేమలోనీ ప్రేమ విలీనమైత్వమేవాహంగాఐక్యమైనాయి.

56

జ్యోతీ!నా జ్యోతీ! జగజ్జోతీ!నా కంటి దీపమా!నా హృదయమధురోజ్వలదీప్తీ!

జ్యోతినృత్యం చేస్తున్నదిప్రియా! నా జీవనమధ్యంలో జ్యోతిపాడుతూ వుంది. ప్రియా,ప్రేమమయ స్వరాలుపలుకుతూ వుంది.ఆకాశం విచ్చుకుంది. గాలిపరుగులు తీస్తూంది.

నవ్వులూ,కేరింతలూ జగమంతానిండినవి. కాంతి సముద్రంలోసీతాకోక చిలుకలురెక్కలు విచ్చి ఈదుతూవున్నాయి. కాంతి తరంగాలనురుగులతో కలువలూ,మల్లెలు పుష్పిస్తున్నాయి.

కాంతిచెదిరి ప్రతి మేఘంపైస్వర్ణకాంతులు ప్రసరింపచేస్తోంది. ముత్యాలనువెదజల్లుతోంది.

ప్రియా!కొమ్మ కొమ్మకూ, రెమ్మరెమ్మకూ ఆనందం పరుగులుతీస్తూంది. ఆకాశ గంగ ఒడ్డులుత్రెంచుకుంది.ఆనందం సర్వత్రా వ్యాపించింది.

57

విశ్వంలోనిఆనందమయ రాగాలన్నీనా కడపటి గీతంలోకరిగి కలిసిపోవాలి. పచ్చనినీళ్ళతో పృథ్వినిప్రపుల్లం చేసే ఆనందం,కవలలను కలిపేఆనందం, జీవన్మరణాలనుమేళవించే ఆనందం,తుఫానులో వీచేఆనందం జీవితాన్నివూపుతూ మేల్కొలుపుతూపరిఢవిల్లిన ఆనందం....విచ్చుకున్న అరుణకమలంపై కన్నీటిబిందువులు రాలుస్తూకనిపించే ఆనందం,తన దానిని సర్వస్వం మన్నులోఒలకబోసుకునే ఆనందం...నాగీతంలో ధ్వనించాలి.

58

హృదయేశ్వరా!నాకు తెలుసు. ఇదంతానా ప్రేమే తప్ప మరేంకాదని, ఆకులపై చిందులాడేఈ బంగారు కాంతి, తూగుతూవూగుతూ మెల్లగాగగన తలంలోపయనించే ఈ మబ్బులు,నా నుదుటిని చల్లగాతాకి వెళ్ళిపోయేగాలి--- ఇదంతా నీ ప్రేమకునిదర్శనమే ప్రభూ.

ప్రభాతకాంతి నా హృదయంలోనిండింది. నా హృదయానికినీవిచ్చిన సందేశంఇదే. ఎక్కడో ఉన్నతపథం నుంచి ముఖంవంచి నీవు నా వంకచూస్తున్నావు. నీ కళ్ళునా కళ్ళలోకి చూస్తున్నాయి.నా హృదయంనీ పాదాలకు మోకరిల్లింది.

59

అనంతవిశ్వ సాగర తీరంలో పాపలుపోగవుతారు. పైన ఆకాశం, క్రిందఅవిరామంగా అలలు చెలరేగుతున్నసాగరం అనంతకోటిలోకాల సాగరతీరంలోపిల్లలు నవ్వుతూ,నృత్యం చేస్తూఆడుతూ, పాడుతూ పోగవుతారు.

ఇసుకగూళ్ళుకట్టిగవ్వలతో ఆటలాడుతారు.ఎండుటాకులను పడవలవలెసముద్రంలో వదిలి,నవ్వుతారు. అనంతవిశ్వసాగర తీరంలో పాపలుఆడుకుంటారు.

వారికిఈత రాదు. వలలువేసి చేపలు పట్టడంతెలీదు.

ముత్యాలఅన్వేషకులు ముత్యాలకోసంఉదధి గర్భంలోదిగుతారు. వర్తకులుతమ నావలలోదూర దేశాలకు తరలివెళతారు. పిల్లలుమాత్రం తీరంలోగవ్వలు ఏరి మళ్ళీవాటిని పారబోస్తూ వుంటారు.ఉదధి గర్భంలోనిఅమూల్య మణిమాణిక్యాల కోసంవెదకరు. వారికి వలలువేయడం తెలీదు.

సముద్రంఉత్తుంగగా పొంగి నురుగులనవ్వులు నవ్వుతుంది.మృత్యు తరంగాలుఅర్థం తెలియనిగీతాలను శిశువులకుపాడి వినిపిస్తాయి. తల్లిఊయలూపుతూ జోలపాటపాడినట్టు, సముద్రంపిల్లలతో ఆటలాడుకుంటుంది.నురుగుల నవ్వులుఒలకబోస్తుంది.

అనంతవిశ్వసాగర తీరంలో పాపలుపోగవుతారు.... గమ్యంలేనిఆకారంలో తుఫాను గర్జిస్తుంది.పడవలు పగిలిపోతాయి.మృత్యువు దూరంగాసాగరగర్భంలో తాండవిస్తుంది.

అనంతవిశ్వసాగర తీరంలో పాపలమహామేళజరుగుతుంది.

60

పసిపాపకంటిపై నిద్ర- ఎక్కడనుంచిఎలా వస్తుందో ఎవరికైనాతెలుసునా? అవును,దీన్ని గురించి ఒక కట్టుకథచెబుతారు. ఎక్కడోఉంటుందట నిద్ర,దేవలోకం లోన.

ఏ గ్రామంలోనో--ఎక్కడో మిణుగురు పురుగులకాంతులు మిలమిలమెరిసే అడవుల చీకటినీడల మధ్యనిద్ర తీసుకునివచ్చేరెండు పూలమొగ్గలువున్నవట. ఆమొగ్గల నుంచివస్తుందట నిద్ర.నిద్రించేటప్పుడుపసిపాప పెదవిపై తేలిఆడే చిరునవ్వు-అది ఎక్కడ పుట్టిందో

ఎవరికైనాతెలుసా? అవును,దీన్ని గురించి కూడా ఒకకట్టుకథ చెప్పుకుంటారు.చవితినాటి చంద్రునిపారిపోయిన కిరణం ఒకటివిచ్చుకొనిపోతున్నఒక వసంత మేఘం చలాన్నితాకిందని,

అక్కడఒకనాటి మంచుకురిసేఉదయాన తొలిగా ఈచిరునవ్వు పుట్టిందనీచెబుతారు.

పసిపాపఒంటిపై తొణికిసలాడేమిసిమి- ఇన్నాళ్ళూ ఎక్కడదాగి వుందో తెలుసా?పసిపాప తల్లి కన్నెపిల్లగాఉన్నప్పుడు, మృదులమోహన మధురప్రేమగా అది ఆ పిల్లఎదలో దాగివుంది.పసిపాప ప్రపంచంలో పడగానేఅది మిసిమిగా వికసించింది.

గీతాంజలి (61 - 70)[మార్చు]

61

అమ్మాయీ!నీకు నేను రంగు రంగులబొమ్మలు తెచ్చిపెట్టినప్పుడుమేఘాలలో అన్ని రంగులుఅలా ఎందుకు మిళితమైఖేలాలవుతాయోనాకు అర్థమవుతుంది.

రంగురంగుల పూలు ఎందుకుపుష్పిస్తాయో నాకు తెలుస్తుంది.

నృత్యంలోనీ అడుగులకు శృతి కలుపుతూనేను పాట పాడినప్పుడు,ఆకుల గలగలలలోసంగీతం ఎందుకు వినిపిస్తుందో?చెవివొగ్గి వినే పృథ్వివద్దకు సాగర తరంగాలుతమ సంగీత సందేశాన్నిఎందుకు పంపుతావో నాకు అర్థమవుతుంది.

నీకునేను తీయని మిఠాయివుండలు తెచ్చిపెట్టినప్పుడుపూలలో తేనెఎందుకని దాగి వున్నదో,తీయని మధురసంపండ్లలో ఎందుకనివున్నదో అర్థమవుతుంది.

నీవుచిరునవ్వు నవ్వుతావని,నీ ముఖాన్ని నేనుముద్దిడినప్పుడు,ఉదయ కాంతితో ప్రవహించేఆనందం ఏమిటో, వసంతమంద మలయానిలంశరీరాన్ని తాకినప్పుడుపులకరింపు ఎందుకు కలుగుతుందోనాకు బోధపడుతుంది.

62

అపరిచితులైనక్రొత్త మిత్రులతోనీవు నాకు పరిచయంచేశావు. నా ఇల్లుకాని ఇళ్ళలో నీవునాకు చోటు కల్పించావు.దూరాన్ని దగ్గరకు తీసుకొనివచ్చిఅపరిచితుణ్ణికూడా నాకు సోదరుని చేశావు.

అలవాటుపడిన ఆశ్రయాన్నివదిలిపెట్టాలంటేనా హృదయంలోఏదో బాధ. కొత్తస్థలాలలో కూడాప్రాచీనత కొంతవుంటుందని, అక్కడనీవు కూడా ఉంటావనివిస్మరిస్తాను.

జీవస్మరణాలమధ్యకాని, ఈ లోకంనుంచిమరొకలోకానికిగాని, ఎక్కడికినన్ను నడిపించాలో,నడిపించేదినీవే! నీవే నా అనంతజీవనసాగరంలో తోడునీడవు. అపరిచితనుతన అనుబంధాలతోనా హృదయాన్నికట్టివేస్తావు.

నీతోఒకసారి పరిచయం లభిస్తేచాలు-ఇక అపరిచితులంటూఎవరూ వుండరు. నీకు మూసినద్వారం ఏదీ వుండదు.

అందరితోకలిసి ఆనందంలో భాగంపంచుకొనే ఆ భాగ్యంనన్ను వదిలివెళ్ళకుండా నా ప్రార్థననుఅనుగ్రహించు.

63

ఒకటిగాప్రవహిస్తున్నఒక నది ఒడ్డున యేపుగాపెరిగిన గరిక బీడులోనుంచుని ఆ అమ్మాయినిఇలా అడిగాను.

అమ్మాయీదీపానికి ముసుగు అడ్డముగాఉంచి ఎక్కడకు వెళుతున్నావు?నా ఇల్లు చీకటిగావుంది. కొంచెం నీదీపాన్ని అరువిస్తావూ? అని.

అమ్మాయిఒక్క క్షణంపాటు తననల్లని కళ్ళెత్తినా వంక చూచి అస్తమయమైనతరువాత ఈ నదిలోనా దీప ప్రమిదను వదిలిపెట్టడానికివచ్చాను అన్నది.ఆ అమ్మాయి దీపం నదీతరంగాలలో తేలిపోతూఉండడం అలాగే ఒడ్డుననిల్చుని చూశాను. నిశ్శబ్దంగాచీకట్లు క్రమ్ముకునివస్తూ వుండగా మళ్ళీఆ అమ్మాయిని ఇలా అడిగాను.

అమ్మాయీ,నీవు నీ దీపాలన్నీవెలిగించావు. ఇప్పుడునీవు ఈ దీపం తీసుకునిఎక్కడికి వెళుతున్నావు?నా ఇల్లంతా చీకటిగుయ్యారంగా వుంది. కొంచెంనీ దీపాన్ని అరువిస్తావా అని.ఆ అమ్మాయి తన నల్లనికళ్ళెత్తి ఒక నిమిషంఅలాగే మౌనంగా నిల్చునిఇలా చెప్పసాగింది.నా దీపాన్ని ఆకాశానికి సమర్పించడానికివచ్చాను అన్నదిఆ అమ్మాయి. ఆ అమ్మాయి దీపంఅలాగే శూన్యంలో నిరర్థకంగావెలిగిపోతూ ఉండడాన్నిచూస్తూ నిల్చున్నాను.

వెన్నెలలేని అర్థరాత్రి మళ్ళీఆ అమ్మాయిని యిలా ప్రశ్నించాను.అమ్మాయీ! హృదయానికిదాపులో వున్న జ్యోతితోదేనికోసం వెదుకుతున్నావు?ఈ ఇల్లంతా చీకటిగుయ్యారంగా వుంది. కొంచెంనీ జ్యోతిని నాకు అరువిస్తావా?అని. ఆ అమ్మాయి ఒక క్షణంపాటుఆలోచించి నా ముఖంవైపుచూచి, దీపాలఉత్సవంలో పాల్గొనడానికినేను నా దీపాన్ని తెచ్చుకున్నానుఅన్నది. అనంతకోటిదీపాలలోఆ అమ్మాయి దీపం కూడా వెలిగిపోతూఉండడం చూచాను.


64

పొంగిపొరలే నా జీవితపాత్రికనుంచి నీవు ఆశించేనిత్య పానీయం ఏమిటిప్రభూ!

కవీ!నీ కల్పన నా కళ్ళలోప్రతిఫలించడంచూచి, నీ పాటలువినడానికి నా చెవులదగ్గర నిరీక్షించడం,అది నీకొక విలాసమా?

నీప్రపంచం నా మనస్సులోమాటల అల్లికఅల్లుతోంది. నీ అవసరంఆ మాటలకు స్వరాలువేస్తోంది. ప్రేమతోనిన్ను నీవు నాకు సమర్పించుకుంటావు...ఆపిదప నీ మధురిమనుయావత్తూ నాతోఆస్వాదిస్తావు.


65

నాహృదయాంతరాలలోకనిపించీ కనుపించనిసంధ్యాకాంతుల మధ్యదాగిన ఆమెను, ఉదయసమయకాంతిలో సైతంముసుగు తీయని ఆమెనునా కడపటి గీతంలోపొదిగి-నీకు చివరి కాన్కగాసమర్పించుకుంటానుదేవా!

మాటలుఆమెను మభ్యపెట్టచూచాయి. కాని విఫలమైనాయి.వేడికోలు తనదీర్ఘ బాహువులనుచాచినా ఆమెను స్పృశించలేకపోయింది.

నాహృదయ పేటికలోఆమెను దాచుకొని దేశదేశాలుతిరిగాను. ఆమె చుట్టూనా జీవితం పెరిగి విరిగింది.

నేనుఏం పనులు చేసినా,ఏ ఆలోచనలు చేసినా,ఏ కలలుకన్నా అన్నిటికీ,ఆమె అభినేత్రి.కాని ఆమె వాటిని అంటకుండాఅతీతంగా వుండేది.

అనేకులునా ఇంటి తలుపుతట్టి ఆమెకోసంఅడిగారు. కాని లాభంలేకనిరాశతో వెనుతిరిగివెళ్ళారు.

ఆమెనుముఖాముఖిగా ప్రత్యక్షంగాచూచినవారు ఈ లోకంలోఎవరూ లేరు. ఆమె ఇంతకాలంనీ గుర్తింపుకోసం ఎదురుచూస్తూఒంటరితనంతో వేచివున్నది.


66

విహాయాసానివినీవే, విహాయానంలోపక్షులు విశ్రమించే గూడుకూడా నీవే.

సౌందర్యమూర్తీ,ఆ గూటిలో నీ ప్రేమఆత్మలు అనేక శబ్దాలతో,రంగులతో, పరిమళాలతోకప్పివేస్తుంది.

కుడిచేతిలోబంగారు బుట్ట తీసుకునిముఖాన్ని పూలదండఅలంకరించుకుని, నిశ్శబ్దంగాపృథ్విని అలంకరించడానికిఉదయం నడచివస్తుంది.

గొర్రెలకాపరులు విడిచి వెళ్ళినపచ్చికబీళ్ళలోప్రశాంతంగా సాయంత్రంపరుచుకుంటుంది. పశ్చిమప్రశాంత అజ్లధినుంచిబంగారు కుండలో నీరుతీసుకొనివచ్చి, పచ్చికపైచల్లగా చల్లుతుంది.

కానిమానవాత్మ స్వేచ్ఛగావిహరించే అనంతవిహాయాన పధంలోపరిశుద్ధ అమలినస్వచ్ఛకాంతి రాజ్యంచేస్తుంది. అక్కడపగలులేదు. రాత్రిలేదు.రంగులూ...రూపాలు లేవు.మాటలేదు,పాటలేదు.


67

చాచినచేతులతో తొలిసూర్యకిరణం పృధ్వినిస్పర్శించి నా ముంగిటనిలుస్తుంది.

నాకన్నీరు, విశ్వాసలు, పాటలూనీకు చేరే సుదీర్ఘదినంప్రారంభమవుతుంది.

అత్యంతఆదరంతో నీవు ఆ మంచుమబ్బునునీ గుండెలకు అదుముకుంటావు.అనేక రంగులలో, అనేకరూపాలలో దాన్ని చిత్రిస్తావు.ఓ స్వేచ్ఛ మహోదాత్తమూర్తీ-అంతతేలికగా, మృదువుగా,కన్నీటితో కరిగిపోతూవుంటుంది. కాబట్టేనీవు ఆ మెత్తని మబ్బునిఅంతగా ప్రేమిస్తావు. అందుకనేఆ మేఘం నీ భయదస్వచ్చతను కాంతినితన కరుణా స్పదచ్చాయలతోకప్పివేస్తుంది.


68

అహరహాలు,నా నరనరాలలోప్రవహించేజీవన స్రవంతియే,ఈ లోకంలో తాళరాగలయబద్ధంగాప్రవహిస్తోంది.

అహరహాలు,నా నరనరాలలోప్రవహించేజీవన ధూళిలోఅణువణువులోచిందులాడే ఆనందంలో,కొమ్మ కొమ్మలో, రెమ్మరెమ్మలో ప్రవహిస్తున్నది.

జీవనమరణ మహాసాగరపుఆటుపోట్లు ఊయలలోఊదిన జీవనస్రవంతి ఇదే.

ఈ సజీవలోకస్పర్శవల్ల నా శరీరంలోప్రతి అవయవంనూతన చైతన్యంతోతొణికిసలాడింది.

యుగయుగాల జీవనస్పందన ఈ క్షణానకూడా నా రక్తంలో నృత్యంచేస్తోంది.


69

ఈ లయవిన్యాసంలో సంతోషించవూనీవు?

ఈ భయదఆనందపు సుడిగుండంలోగిర్రున తిరగవూ నీవు?

ప్రపంచంలోఅన్నీ పరుగెత్తి పోతున్నాయి.ఏవీ ఆగవు. వెనుదిరిగిచూడవు. ముందుకుసాగిపోతాయి. ఏ శక్తీ వాటినిఆపుచేయలేదు.

ఈ అవిరామసంగీతార్పిత గీతితోశ్రుతి కలుపుతూఋతువులు వస్తాయి,వెళతాయి. పాటలపరిమళాలతో, రంగురంగుల ముస్తాబుతోఋతువులు వచ్చివెళతాయి.


70

నన్నునేను నానా రూపాలుగా సృష్టించుకుని,నీ స్వచ్ఛ కాంతిపై- నీడలు ప్రసరించడంనీ మాయా ఖేల.

నీలోనేనీవొక అగడ్త కట్టుకునివేరుపడిన నీ వ్యక్తిత్వాన్నిఅనంతకోటి శృతులతోపలుకుతావు..నీవుఇలా నీ నుంచి నీవువేరుపడడం వల్లనేనేను దేహాన్నిధరించాను... నీవుపాడిన మహోజ్జ్వలగీతం గగనవీధిలోరంగురంగుల కన్నీరుగా, చిరునవ్వులుగా,ఆశలుగా, ఆవేదనలుగాప్రతిధ్వనించింది.

అలలులేచి మళ్ళీపడిపోతాయి...కలలుచెదిరి మళ్ళీపొదుగుతాయి. నీ స్వీయ పరాజయానికేనేను ప్రతిబింబాన్ని-

నీవుఎత్తిన యీ తెరపైఅహరహాలకుంచెతో అనేక చిత్రాలురచించావు. ఈ తెరవెనుక నీ విచిత్రరహస్య సింహాసనంఉన్నది. నీ, నా మహోత్సవకాంతి వియత్తలమంతటాపరుచుకుంది.

నీవూ,నేనూ కలసి పాడినమంగళగీతం వాతావరణమంతటాప్రతిధ్వనించింది.

నీనా దాగుడు మూతలతోయుగయుగాలు గడిచిపోతాయి.

గీతాంజలి (71 - 80)[మార్చు]

71

అతనేనా అంతరాంతరాలలోవున్న వ్యక్తి.

తనఅగాధ రహస్యస్పర్శతో నాలోని నన్నుమేల్కొలుపుతాడు.

ఈ కళ్ళలోనిమాయా మోహనత్వానికిఅతనే కారణం. నా హృదయతంత్రులు మీటిసుఖదు:ఖ గీతాలుపాడేది అతనే.

రంగురంగుల మాయావల్లరినిఅల్లేది- అతనే.అతని పాదాలు స్పృశించినప్పుడునన్ను నేను మరచిపోతాను.

రోజులువస్తాయి. వెళతాయి.యుగాలు గడిచిపోతాయి.అనేక నామాలతో నాహృదయాన్నిచూరగొన్న వ్యక్తిఅతనే.

72

సర్వసంగపరిత్యాగంలో కాదు నాకువిముక్తి లభించేది.అనంతకోటి అనురాగబంధాలతో నేనుస్వేచ్ఛను కౌగిలించుకుంటాను.

ఈ జీవనమృణ్మయ పాత్రలో,వివిధ వర్ణాల, పరిమళాల,మధుపానీయాన్నిఅనునిత్యం నాకోసం నీవునింపుతూ వుంటావు. నీదీప్తితో అనంతకోటిదీపాలు వెలుగొందుతాయి.నా ప్రపంచంలో, ఈ దీపమాలతోనీ ఆలయ ప్రాంగణాన్నిఅలంకరిస్తాను.

ఇంద్రియానుభూతినినిగ్రహించానునేను.... వాటి ద్వారాలుఎప్పుడూ తెరిచేవుంటాయి.

నేనుదేన్ని చూచినా,దేన్ని అలకించినా,దేన్ని స్పృశించినాఅంతటా నువ్వే వుంటావు.

నాభ్రాంతులన్నీపటాపంచలై ఆనందదీప్తి నాలో వెలుగొందుతుంది.నా వాంఛలన్నీనిర్భర ప్రేమ ఫలాలుగాఫలిస్తాయి.

73

సూర్యుడుఅస్తంగతుడైనాడు.

ప్రపంచమంతటానీడ వ్యాపించింది.

నీళ్ళుతేవడానికి నేనుఏటికి వెళ్ళాలి.

నీటిఅలలపై తేలేవిషాద మర్మర ధ్వనులతోసాయంకాలం పవనాలునన్ను ఆహ్వానిస్తున్నాయి.బైటికి రమ్మనినన్ను పిలుస్తున్నాయి.

వీధినిర్జనంగా వుంది.

ఒక్కపాంథుడైనా కనిపించడంలేదు.

గాలిఉత్సాహంగా వుంది.

నదిలోఅలలు ఉరుకులెత్తుతున్నాయి.తిరిగి నేను ఇంటికిచేరుకోగలనో, లేదోతెలీదు.

దారిలోనాకు ఎవరెదురవుతారో?దూరంగా నదిలో పడవలోనిఅజ్ఞాత వ్యక్తివేణునాదం వినిపిస్తోంది.


74

మర్త్యులమైనమాకు నీవిచ్చే వరాలుమా కోర్కెలన్నింటినీఫలప్రదం చేస్తాయి.

అయినా,నీ అనుగ్రహంఅనంతమైనది.

నదిప్రతి దినం పొలాలగుండా,పల్లెల గుండా ప్రవహిస్తుంది.అయినా, అనంతమైననదీజలాలునీ పాదాలు తాకడానికే ప్రవహిస్తాయి.

పూవుతన పరిమళంతోగాలిని మధురితంచేస్తుంది. అవి తననితాను నీకు అర్పణ చేసుకోవడమేదాని పరమావధి.

ఈ లోకంలోనీ పూజకేం కొరత లేదు.

కవివాక్కుల నుంచి అనేకులుఅనేక విధాలుగా అర్థం చెప్పుకుంటారు.కాని దాని పరమార్థం నిన్నేసూచిస్తుంది.

75

ప్రభూ!

అనుదినంనీ సన్నిధిలో ముఖాముఖిగాముకుళిత హస్తాలతోనిలుస్తాను.

శాంతగంభీర నిర్మల నీలాకాశంక్రింద, వినీలిత హృదయంతోనీ సన్నిధిలో నిల్చుంటాను.

నీవుసృష్టించిన ఈ బాధాభరితలోకంలో శ్రమ, ఆందోళన,సంఘర్షణల మధ్యపరుగులెత్తే అసంఖ్యాకప్రజలమధ్య,నీ సన్నిధిలో నిల్చుంటాను.

ఈ లోకంలోనా పని అంతా పూర్తి అయిన పిదప,ఒంటిగా, మౌనంగా నీముందు నిల్చుంటాను.

76

నీవునా దేవుడవనితెలుసు. అందుకనేనీకు దూరంగా వుంటాను.నీవు వాడివేననితెలియక దగ్గరకురాను.

నీవునా తండ్రివని తెలిసినీ పాదాలకు వందనంచేస్తాను. కాని స్నేహితునికరాన్ని గట్టిగా పట్టుకున్నట్టునీ కరాన్ని పట్టుకోలేను.

నన్నునీవు నీ దానిగా స్వీకరించేచోటనేను నిలిచి వుండను.నిన్ను నా హృదయానికిహత్తుకుని మిత్రుడవనిఅనుకోను.

నాఅన్నలలో నీవుఅన్నవు. కాని నా అన్నలనునేను లెక్కించను.వారికి భాగం పెట్టాకనా సంపాదనంతా నీతోనేపంచుకుంటాను.

సుఖదు:ఖాలతోమనుష్యుల ప్రక్కనేను వుండను.అందుకనే నీ ప్రక్కనవుంటాను.

జీవితాన్నిత్యజించడానికివెనుకాడతాను. అందుకనేజీవన మహాదధిలోఅడుగుపెట్టలేను.

77

తొలిగాసృష్టి ప్రారంభించినప్పుడు-

తారలతొలి వెలుగులుధగద్ధగాయమానంగావెదజల్లినవేళ.

దేవతలందరూగగనవీధిలో చేరిఎంత చక్కని సృష్టి!ఎంత మహానందం!అని ఏక స్వరంతో పాడారు.

కాని,ఇంతలో హఠాత్తుగాఎవరో కేకవేశారు. కాంతివాహినిలో ఏదోచీలిక కనిపిస్తోంది.ఒక నక్షత్రం అదృశ్యమైందిఅని.

కేకవిన్న వెంటనే దేవతలవీణ స్వర్ణ తంతువుఆగిపోయింది. అవును, ఆవెళ్ళిపోయిన తారకఅన్ని తారకలలోకి శిరోమాణిక్యంఅన్నారు దేవతలు.

నాటినుంచి నేటివరకుతప్పిపోయిన ఆ తారక కోసంఅన్వేషణ సాగుతూనేవున్నది. లోకంతన ఆనందాలలోఒకదాన్ని కోల్పోయిందన్నఆ కేక వినిపిస్తూనే వున్నది.

రాత్రివేళలలోకమంతా నిద్రించినతరువాత నిశ్శబ్దంలోతారలు చిరునవ్వునవ్వుతూ తమలోతాము ఇలా గుసగుసలాడుకుంటాయిఈ అన్వేషణ నిరర్థకం. అమలినపరిపూర్ణత ఏనాడో గడిచిపోయిందిఅని.

78

ఈ జీవితంలోనిన్నుకలుసుకునే భాగ్యానికినేను నోచుకొనకపోతే,నీ దర్శన భాగ్యాన్నినేను జారవిడుచుకున్నట్టుభావిస్తాను.

జాగ్రదావస్థలోను,స్వప్నావస్థలోను ఈవిషాదభారాన్ని మోసేఅవసరాన్ని నాకు కలిగించు.

జీవితమనేక్రిక్కిరిసిన సంతలో,నా రోజులు చెల్లిపోయి,రెండు చేతులూభోగభాగ్యాలనుపోగుచేసుకోనప్పుడు,నేను ఆర్థించిందిఏమీ లేదనే భావాన్నినాలో కలిగించు.

ఒక్కక్షణం కూడా నా యోచనాపథంనుంచి ఈ భావననుమరలించకు, జాగ్రదావస్థలోను,స్వప్నావస్థలోను,ఈ విషాద భారాన్ని మోసేఅవకాశాన్ని నాకు కలిగించు.

అలసిసొలసి రోడ్డుమీద నేనువిశ్రమించేటప్పుడుధూళిలో నా పాన్పుపరుచుకునేటప్పుడు,ఈ అనంత యాత్రఇంతటితో ముగియలేదనేభావాన్ని నాలో కలిగించు.

ఈ విషాదభావాన్ని సర్వావస్థలలోభరించే అవకాశంనాకు కలిగించు.

ఆనందోత్సాహాలతో,మేళతాళాలతో,నవ్వులతో నా గృహాంగణంప్రతిధ్వనించేటప్పుడు,నీ ఆహ్వానం కోసం చేసినఆడంబరం ఇది కాదనేభావాన్ని నాలో కలిగించు.జాగ్రదావస్థలో,స్వప్నావస్థలో ఈ వేదనాభారాన్ని మోసే శక్తి నాకుప్రసాదించు.

79

సూర్యుడా!

గగనవీధిలోగమ్యంలేక సంచరించేశరన్మేఘ శకలాన్ని నేను.

నీకిరణం నన్ను స్పర్శించి,నన్ను కనికరించి,నన్ను నీ కాంతిలోవిలీనం చేసుకోలేదు.

నన్నుఇలా నీకు దూరంగా వుంచడమేనీకు విలాసమయితే,ఈ నా శూన్యతనే స్వీకరించి,రకరకాల రంగులు చిత్రించిఆనందించు.

రాత్రివేళ,నీవు నీ ఖేలనువిరమించుకున్నప్పుడుమళ్ళీ రాత్రిలోనేను దాగిపోతాను.లేక స్వచ్చ ధవళఉదయ మందహాసంలోనో,చల్లని సంధతలోనోకరిగి కలిసిపోతాను.

80

ఏమీతోచని దినాలలో,ఏమీ సాధించకుండా గడిచిపోయిన కాలాన్ని గురించిచింతించసాగాను.కాని చెయ్యి జారిపోయినకాలం లేదు ప్రభూ!నా జీవితంలోని ప్రతిక్షణాన్ని నీవు తీసుకున్నావు.

ప్రపంచంలోనిప్రతి వస్తువులోఅంతర్నిహితంగాదాగివుండి, బీజాలనుమొక్కలుగా, మొగ్గలుగా,పుష్పాలుగా, ఫలాలుగామారుస్తున్నావు.

అలసిసొలసిఏమీతోచక పక్కమీద పడుకునివున్నాను. పనులన్నీముగిసిపోయాయని అనుకున్నాను.

తెల్లవారిలేచి చూసేసరికి,నా పూలతోట నిండా అద్భుతమైనపుష్పాలు పూచి ఉండటంచూచాను.

గీతాంజలి (81 - 90)[మార్చు]

81

నీచేతులలోనికాలం అనంతమైంది.ప్రభూ! క్షణాలులెక్కించడం ఎవరితరం?

రాత్రులూ,పగళ్ళూ గడిచిపోతాయి.యుగాలు పూలలాపూచి, పూలలా రాలిపోతాయి.కాని కాలానికి అతీతంగావుండడం నీకు తెలుసు.

ఒకచిన్న గడ్డి పూవునుఅలంకరించడానికి నీకుయుగాల కాలం పడుతుంది.

కానిమాకు ప్రతిక్షణం విలువైంది.ఆలస్యాలకు మేముసాహసించము.

అడిగినప్రతివానికి నా పూజాకుసుమాలను యిచ్చివేస్తాను. చివరకునీ సాన్నిధ్యంలో సమర్పించాలంటేఒక్క పుష్పం కూడా మిగలదు.సాయంత్రం కాగానే నీఆలయ ద్వారం మూసివేస్తారేమోనన్నభయంతో త్వరపడివస్తాను. కాని నేనువచ్చేసరికి యింకా చాలాసమయం మిగిలి వుంటుంది.

82

అమ్మా!నా విషాదాశ్రువులతో,నీకోసం ఒక ముత్యాలమాలగుచ్చుతాను.

నీపాదాలను అలంకరింపజేయడానికితారకలు కాంతి కంకణాలనుసంతరించాయి.

కాని,నేను కూర్చిన హారంనీ కంఠసీమనే అలంకరిస్తుంది.

కీర్తి,సిరిసంపదలు నీ నుంచేఉద్భవిస్తాయి.

వాటినిమాకు ప్రసాదించినా,తిరస్కరించినా అదినీ చేతుల్లోనేవుంది.

కానినా దు:ఖం మాత్రంపూర్తిగా నాదే. ఈ అశ్రుమాలనుసమర్పించినప్పుడునీ అనుగ్రహాన్నినాకు ప్రసాదిస్తావు.

83

ప్రపంచమంతటాపరివ్యాప్తమై, అనంతాకాశపథంలో అనంత రూపాలనుప్రసవించేది విరహవేదన.

తారతారలోమినుకు మినుకుమని మనవైపునిశ్శబ్ద దృక్కులుప్రసరించేది ఈ విరహవిషాద వేదనమే.

శ్రావణమాసవర్షరాత్రి, ఆకులగలగలలో పాటగావినిపించేది ఈ విరహవిషాద వేదనమే.

వాంఛగా,ప్రేమగా రూపొంది, ఇంటింటా,సుఖదు:ఖాలు కలిగించేదిఈ విరహ విషాద వేదనమే.నా కవి హృదయాన్నికరిగించి పాటలు పాడించేదిఈ విరహమే.

84

యోధులుతమ యజమానిమందిరం నుంచిబయటికి వచ్చినప్పుడునీరసంగా, నిస్సహాయంగాకనిపించారు. వారి శక్తినీ, సామర్థ్యాన్నీ,ఆయుధాలను ఎక్కడదాచారో మరి వారు తమయజమాని మందిరంనుంచి బయటఅడుగు పెట్టగానే వారిపైశరవర్షం కురిసింది.

యోధులుమళ్ళీ వారి యజమానిమందిరంలో అడుగిడినతరువాత వారి అస్త్రశస్త్రాలను యెక్కడదాచారో? వారి శక్తి ఏమైందో?

వారుఖడ్గాన్ని దించివేశారు.అస్త్రశస్త్రాలనువిసర్జించారు. వారి ముఖాలలోప్రశాంతత తాండవించింది.వారు తమ యజమానిమందిరంలో అడుగుపెట్టిన రోజునతమ జీవనఫలాన్ని వెనుక వదలివెళ్ళారు.

85

నీవునీ సేవకుని మృత్యువునునా వద్దకు పంపావు.

అతడుఅజ్ఞాత సముద్రంలోప్రయాణం చేసినీ సందేశాన్ని తీసుకొనినా యింటికి వచ్చాడు.

రాత్రిచీకటి. నా హృదయంలోయేదో భయం.అయినా నేను దీపం తీసుకునివాకిటివరకు వెళ్ళి,తలుపు తెరచిఅతన్ని లోనికి ఆహ్వానిస్తాను.నా వాకిట నిల్చివున్నదినీవు పంపిన దూతయేకదా!

ముకుళితహస్తాలతో, కన్నీటికాన్కలతో అతన్నిపూజిస్తాను.

నాహృదయ సర్వస్వాన్నిఅతని పాదాలవద్దవుంచుతాను.

అతడుతను వచ్చినపని ముగించుకుని తిరిగివెళతాడు- ఉదయంలోఒక నల్లని నీడనువిడిచి.

నానిర్జన గృహంలోనా పరిపక్వ అంతరాత్మ ఒకటేనీ కోసం కాన్కగా తెల్లవారిలేచి చూసేసరికి,నా పూలతోట నిండా అద్భుతమైనపుష్పాలు పూచి ఉండటంచూచాను.

86

ఆమెతప్పకుండా కనిపించి తీరుతుందనిగదిలో మూలలన్నీవెతుకుతాను, కాని ఎక్కడాఆమె జాడ కనుపించదు.

నాఇల్లే అసలు చిన్నది.ఏ వస్తువైనా నా యింట్లోపోతే మళ్ళీదొరకదు.

కాని,ప్రభూ! నీ భవనంఅనంతమైంది. ఆమెనువెదుకుతూ నేనునీ భవనం వద్దకువచ్చాను.

నీసాయంకాలపు ఆకాశపు చాందినీఛాయలో నిల్చొని,ఆతురతతో కండ్లెత్తినీ ముఖం వంక చూస్తాను.శాశ్వతాంచలంలో నిల్చానునేను.

ఇకఇక్కడ, నా నుంచి అదృశ్యమయ్యేదిఏదీ వుండదు. ఇక్కడఆశలేదు, ఆనందంలేదు. కన్నీటితెరలలో నుంచిచూచే ముఖసీమలేదు.

నాశూన్య జీవనపాత్రికను ఆ మహోదధిలోముంచి, పరిపూర్ణతప్రసాదించు.

ఈ విశ్వజనీనమధుస్పర్శను మరొకసారినన్ను అనుభవించనివ్వు.


87

ఓ శిధిలాలయదైవమా?

భగ్నవీణతంత్రులు ఇక నిన్నుకీర్తిస్తూ గానం చేయవు.

నీపూజా సమయాన్ని సూచిస్తూసంధ్యా ఘంటికలుమ్రోగవు.

నీచుట్టూ నిశ్చలనిశ్శబ్దం తప్ప మరేమీలేదు.

నీశూన్యాలయంలో అప్పుడప్పుడుదేశ దిమ్మరివంటివసంతకాలపు గాలిప్రవేశించి నిన్నుపలకరించి వెళుతుంది.నీకు పుష్పాల పూజ లేకున్నాపుష్పాలవద్ద నుంచిసందేశాలు తెస్తుంది.

నీవునిరాకరించిన వరం కోసం,నీ పాత కాలపు భక్తుడుయింకా నీ ఆలయ ఆవరణలోపిచ్చివానిలా పరిభ్రమిస్తాడు.

సాయంకాలంవేళ, వెలుగునీడలు,ధూళిలో తపస్సులోకలిసి కరిగిపోయేటప్పుడు,అతడు అలసి సొలసిక్షుధార్తహృదితోనీ శిధిలాలయాన్నిచేరుకుంటాడు.

పండుగలూ,పబ్బాలూ లేవయ్యానీకు.

పండుగరోజులు నీ గుళ్ళోదీపం వెలిగించేదిక్కైనా లేకుండావెళ్ళిపోతాయి.

నీవుఇలాగే వున్నావు. అనేకకొత్త విగ్రహాలుచెక్కి ప్రతిష్టిస్తున్నారు.కాని వాటి కాలం వచ్చినప్పుడుఅవి అజ్ఞాతంలో పడిపోతున్నాయి.

శిధిలాలయదైవమా? నిన్నుయెవరు లెక్కచేస్తారు?


88

'బిగ్గరగామాట్లాడకు' అజ్ఞాపించాడునా స్వామి. అందుకనే గుసగుసలుగారహస్యంగానే అతనితోమాట్లాడతాను.నా హృదయంచెప్పదలచిందిమెల్లని పాట ద్వారాఅతనికి అందజేస్తాను.రాజుగారి సంతకు అందరూపరుగులు తీస్తూ వెళతారు.అమ్మేవారూ, కొనేవారూ అంతాఅక్కడే వున్నారు. కానినాకు సంతకు వెళ్లడానికిసెలవు మంజూరుకాలేదు.

89

మృత్యుదేవతనీ తలుపు తట్టినప్పుడునీవు ఏమి సమర్పిస్తావు?

నాఅతిధి ముందునేనూ, నా పరిపూర్ణ జీవనపాత్రికను ఉంచుతాను.వట్టి చేతులతోఅతన్ని వెళ్ళనివ్వనునేను.

వసంత,శరద్రాత్రులు, నేనుకన్న తీయని కలలన్నీఅతనికి సమర్పిస్తాను.నా జీవన సంపాదనంతాఅతని మ్రోల ఉంచుతాను.

చరమదినమున మృత్యువతిధివైవచ్చి, నా తలుపుతట్టినా వెరగొందను.

90

మరణమా!నా జీవన చరమసాఫల్యమూర్తీ! ఏదీ,నా వద్దకు వచ్చినాకు నీ రహస్యం చెప్పు.నీ కోసమే రోజురోజునిరీక్షించాను. నీ కోసమే జీవనసుఖదు:ఖాలు భరించాను.

నాకలలు, నా ఆశలు, నాఆశయాలు, నా ప్రేమలు,నా సర్వస్వం రహస్యంగానీకు అభిముఖంగానేప్రవహించాయి.

ఒక్కసారినా వంక నీ చూపు ప్రసరించు.అంతే చాలు. నా బ్రతుకంతానీకు వశమైపోతుంది.

వరునిమెడలో అలంకరించడానికికూర్చిన పూలమాలసిద్ధంగా వుంది. వివాహంకాగానే వధువు తనగృహాన్ని విడిచి,తన ప్రభువునుఒంటరిగా ఏకాంత రాత్రిలోకలుసుకుంటుంది.

గీతాంజలి (91 - 102)[మార్చు]

91

ఈ లోకంనా దృష్టి నుంచి అదృశ్యమయ్యేరోజు ఒకటి వున్నదని,జీవితం కళ్ళపైకడపటి తెరదించి, నిశ్శబ్దంగాసెలవు తీసుకుని వెళుతుందనినాకు తెలుసు.

అయినాఆనాడు కూడా రాత్రివేళగగనంలో నక్షత్రాలునిరీక్షిస్తూ ప్రకాశిస్తాయి. సుఖదు:ఖాలనుఎగరవేస్తూ కాల సముద్రంలోగంటలు నిశ్వసిస్తాయి.

ఈ కడపటిక్షణాలను నేనుతలుచుకున్నప్పుడు,క్షణాలకు క్షణాలకుమధ్య అగడ్తలునశించి, మృత్యుదీపంసాయంతో, నీ లోకంలోనిఅనంత నిధులనుకాంచ గలుగుతాను.వేటికోసం వాంఛించానో,ఏవి నాకు లభించాయోవాటిని నశించని.నేను కోరి తృణీకరించిన వాటినేనాకు ప్రసాదించు.

92

నేనుసెలవు తీసుకోవలసినసమయం వచ్చింది.సోదరులారా! నాకు ఇక సెలవునివ్వండి.తలవంచి మీ అందరికీనమస్కరించి పయనమైవెళుతున్నాను.

ఇదుగోండి-నాఇంటి తాళపు చెవులనుతిరిగి ఇస్తున్నాను తీసుకోండి.నా ఇంటిపై హక్కులన్నీమీకు ఇచ్చి వేస్తున్నాను.నేను కడపటిసారిగామిమ్మల్ని అడిగేదినాలుగు చల్లనిమాటలతో నాకు సెలవుఇప్పించమని మాత్రమే.

చాలాదినాలు నేను మీతోకలిసి నివసించాను.నేను మీకు యిచ్చినదానికంటే ఎక్కువగామీ వద్దనుంచిస్వీకరించాను. ఇప్పుడు తెల్లవారింది.నా చీకటి కొంపలోదీపం ఆరింది. నన్నురమ్మని ఆదేశం వచ్చింది.ఇక నేను వెళ్ళడానికిసిద్ధంగా వున్నాను.

93

నేనుమిమ్మల్ని వీడి వెళ్ళేటప్పుడునా శుభం కోరండి మిత్రులారా!

ఆకాశంఅరుణోదయ రేఖలతోసిగ్గిలి ఎర్రబారింది.నా ముందు నా త్రోవఅందంగా పరుచుకుంది.

అక్కడికినేను ఏమి తీసుకుని వెడుతున్నాననినన్ను అడగకండి.శూన్యహస్తాలతోఆతృత హృదయంతోనేను బయలుదేరివెళుతున్నాను.

ఈనాడునా పెండ్లినాటి పూలదండధరిస్తాను. యాత్రికులుసహజంగా ధరించేకాషాయం కాదు నా వస్త్రం.

త్రోవలోఅనేక ప్రమాదాలున్నా,నా మనస్సులో భయావేశంలేదు.

నాయాత్ర ముగిసేసరికి,సంధ్యాతార ఉదయిస్తుంది.రాజుగారి మొగసాల సంధ్యగీతాలువినిపిస్తాయి.


94

ఈ జీవితంలోఅడుగిడిన తొలి క్షణంనాకు జ్ఞప్తిలేదు.

అడవిమొగ్గ అర్థరాత్రి వికసించినట్టువిశాల లోకంలో నన్నువికసింపజేసిన శక్తి ఏమిటోనాకు తెలీదు.

తెల్లవారిలేచి చూచేసరికిఒక్క క్షణంలో యీ లోకానికినేను అపరిచితుణ్ణికానున్న విషయం నాకుతెలిసింది. నామరూపరహితమైనఒక అనిర్వచనీయ శక్తినన్ను నా తల్లిఒడిలో వుంచినట్లుతెలిసింది. ఆ అనిర్వచనీయశక్తి,నా తల్లిగా రూపమొచ్చింది,నన్ను తన ఒడిలోలాలించింది.

ఇదేరీతి, మృత్యువులోసైతం ఇదే అనిర్వచనీయశక్తినాకు సాక్షాత్కరిస్తుంది.జీవితాన్ని ప్రేమిస్తున్నాను,కాబట్టే మృత్యువునుకూడా ప్రేమించ గలుగుతున్నాను.పిల్లకు పాలిచ్చేతల్లి కుడి స్థనంమార్చినప్పుడు శిశువురోదిస్తుంది. కాని ఎడమస్థనం పానం చేసివెంటనే ఓదార్పు పొందుతుంది.


95

నేనుమిమ్మల్ని వీడి వెళ్ళేటప్పుడుకడపటిసారిగా ఒక్కమాటచెప్పి వెడతాను.నేను ఇక్కడ యీ లోకంలోచూచింది అత్యద్భుతం!

కాంతిసాగరంపై పరుచుకున్న ఈ కమలంలోదాగిన రహస్యమధువును రుచిచూచాను.

చాలధన్యుణ్ణి,ఇదే నేను మీలో చివరిసారిగాచెప్పదలచినమాట. అనంత వేషాలయీ నాటక మందిరంలోనా పాత్ర నేను ధరించాను.రూపంలేని అతన్నికూడా అక్కడే నేను చూచాను.స్పర్శాతీతమైనఅతని స్పర్శతో నా శరీరం యావత్తూపులకించింది, సమాప్తిఇక్కడే సమీపిస్తే సమీపించనివ్వండి.ఇదే నా ఆఖరిమాట.


96

నీతోనేను ఆడుకున్నప్పుడునీ వెవరని నేనుప్రశ్నించలేదు.భయంకాని, లజ్జకాని లేకుండా కులాసాగాజీవితం గడిచింది.

ప్రతినిత్యం ఉదయాన్నేవచ్చి నిద్ర మేల్కొల్పినీవు నన్ను తీసుకునివెళ్ళేవాడివి. కొండలలో,కోనలలో నన్నుతిప్పేవాడివి.

ఆ రోజులలోనీవు నాకు పాడి వినిపించినపాటలకు అర్థమేమిటోతెలుసుకోడానికి నేనుయత్నించలేదు.నేను కూడా నీతో గొంతుకలిపి పాడాను. అంతే---నాహృదయం నీపాటలకు నృత్యంచేసింది.

ఇప్పుడుఆట పాటల రోజులుగడిచాక, నా ముందునిల్చిన ఈ విచిత్రదృశ్యం, ఇదేమిటి?అనంతకోటి నిశ్శబ్దతారకలతో లోకం నీ పాదాలచేధ్వనిస్తున్నది.


97

నాపరాజయాల పుష్పమాలికలతోనిన్ను అలంకరిస్తాను.పరాజయం పొందకుండావుండడం ఎన్నడూనాకు అలవాటు లేదు.

పరాజయంలోనా గర్వం విధ్వంస మవుతుందనినాకు తెలుసు. నా జీవితంబాధతో బంధాలుత్రెంచుకుంటుందనినాకు తెలుసు. నా శూన్యహృదయం వెక్కివెక్కి ఏడుస్తూ శూన్యగీతంఆలపిస్తుందని, గీతంవిన్న రాయి కూడా కరిగి కన్నీరైప్రవహిస్తుందనీనాకు తెలుసు.

పద్మసహస్ర దళాలుఎల్లప్పుడూ మూసుకునేఉండవనీ, పద్మ దళాలతోమధువు ఎల్లప్పుడూఅలాగే వుండదనీనాకు తెలుసు. నీలాకాశంనుంచి,ఒకే ఒక నేత్రం నా వైపుచూచి నిశ్శబ్దంగానన్ను పిలుస్తుంది.నా కోసం మిగిలేది ఏదీలేదు.నీ పాదాలవద్ద నేనుస్వీకరించేది కేవలంమృత్యువే.


98

నేనుచుక్కాని వదిలినప్పుడు,ఇక నీవే నౌక నడపవలసినసమయం వచ్చిందనినాకు తెలుసు.

ఎలాజరగవలసి వుంటేఅలా జరుగుతుంది.ఇక ఈ ఆయాసం వృధా.

ఇకఅనవసరంగా ఈ యాతనఎందుకు? నీ పరాజయాన్నిశాంతంగా భరించు.ఈశ్వరుడు నిన్ను ఎక్కడకూర్చుండబెడితే,అక్కడ నిశ్చలంగా కూర్చోడమేనీ భాగ్యంగా భావించు.

ప్రతిచిన్న గాలి విసురుకూనా దీపాలు ఆరిపోతున్నాయి.వీటిని వెలిగించుకునేయత్నంలో నేనుఇతర విషయాలన్నీమరచిపోతున్నాను.

కానీఇకముందు నేను జాగరూకతతోవుంటాను. నేలపైనచాప పరుచుకుని చీకటిలోవేచి వుంటాను.నీకు మనసైనప్పుడునిశ్శబ్దంగా వచ్చిఇక్కడ ఆశీనుడివి కా.


99

రూపరహితమైనఆణిముత్యాన్నిఅన్వేషిస్తూ అనంత కోటిరూపాల జలధిగాహంలో మునిగిపోతాను.

ఎన్నోతుఫానులకు చెదిరినఈ నా నావలో, ఇక రేవునుంచి రేవుకు ప్రయాణంచేయడం మానివేశాను.

అమరత్వంలోమరణించడమేఇప్పుడు నా ఆసక్తి.

అగాధసాగర గర్భంలోనికి, మౌనతంతువులు సంగీతంపాడే చోటికి, నా జీవనవీణను మోసుకొని పోతాను.

కడపటిరాగం పాడిన పిదప, నిశ్శబ్దపాద సన్నిధిలో ఈవీణను సమర్పిస్తాను.

100

నాజీవితంలో ఎల్లప్పుడూనిన్ను నా పాటలలోవెదికాను. లోకంలోగడప నుంచి గడపకుపాట పాడుతూ సంచరించాను.

నేనునేర్చిన పాఠాలన్నీనాకు నేర్పింది ఈ పాటలే.

ఈ లోకంలోనిరహస్య పదాలనుఈ పాటలే నాకు చూపాయి.నా హృదయదిగాంచలంలో అనేకతారకలు ఉదయించాయి.

సుఖదు:ఖాల విచిత్రసీమకు ఈ పాటలే నాకుబాట చూపాయి.

కడకునీ భవన ద్వారానికిచేర్చాయి.


101

నీవునాకు తెలుసుననినేను అందరితో చెప్పుకునిగర్వించాను.

నేనుచేసే ప్రతి పనిలోనీ ప్రతిబింబంవారికి కనిపిస్తుంది.

అప్పుడువారు 'ఎవరితను?' అనినన్ను ప్రశ్నిస్తారు.

వారికిఎలా సమాధానం చెప్పాలోనాకు బోధపడదు.

వారునన్ను నిందించి,వెక్కిరించి వెళ్ళిపోతారు.

నీకథలు గీతాలుగా పాడతాను.నేను దాచాలనుకున్నరహస్యం నా గుండెలనుఖేదించుకుని బైటికివస్తుంది. వారు నా దగ్గరకువచ్చి, 'నీ పాటలకుఅర్థమేమిటో చెప్పవూ?'

అనిప్రశ్నిస్తారు. వారికి ఎలాజవాబు చెప్పాలోనాకు తెలీదు. వారునన్ను చూచినవ్వి తృణీకరించివెళ్ళిపోతారు. నీవుమాత్రం అక్కడ చిరునవ్వునవ్వుతూ కూర్చుంటావు.


102

ఒకేఒక అభివందనంలోదేవా నా ఇంద్రియాలన్నీవిస్తరించి, నీ పాదాలవద్దఈ ప్రపంచాన్ని స్పృశించనివ్వు.

శ్రావణవర్షధార మేఘం వలెనా మనస్సు వినీతంగావంగి నీ ద్వారం వద్దనీకు అభివందనంచేయనివ్వు.

నాపాటలలోని వివిధస్వరాలన్నీ కలిసి ఒకే ఒక వాహినిగానిశ్శబ్ద సాగరంలోకి ప్రవహించినీకు అభివందనంచేయనివ్వు.

ఇంటిపైమనస్సు మరలి కొండలలోతమ గూళ్ళకు మరలివెళ్ళే పక్షుల బారులా,నా జీవితమంతా తనశాశ్వత గృహానికి యాత్రచేసిన ఒకే ఒక అభివందనమైనీ పాదాలు స్పృశించనివ్వు.

"https://te.wikisource.org/w/index.php?title=గీతాంజలి&oldid=212050" నుండి వెలికితీశారు