Jump to content

గాన విద్యా వినోదిని

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

గానవిద్యావినోదిని

ఇందు

సంగీత విద్యనభ్యసించువారల కత్యంతోపయుక్తంబగు

స్వరగీతవర్ణపద్యానేక ముఖ్యవిషయములు

చేర్పబడియున్నవి.

గ్రంథకర్త

వీణె-బసవప్ప, హుబ్బళ్లి.

____

మద్రాస్ ఆనందముద్రణాలయ ముద్రితము.

____

1915

పీఠిక.

వేదప్రసిద్ధంబై నందికేశ్వర, నారద, భరత, తుంబుర, వశిష్ట, దుర్గ, గౌతమ, కోహళ, భరద్వాజ, దత్తిలి, భృంగి, మతంగ, బృహస్పతి, శుక్ర, ఆంజనేయ, వినాయక, షణ్ముఖ, ఆదిశేష, కాశ్యప, అంగీరస, జైమిని, రావణ, చవ, యజ్ఞవల్క్య, వాయు, రంభా, అభినవగుప్త, అర్జున, శార్జ్ఞ్గ దేవ, సోమనాథులు మొదలయినవారు సంగీతశాస్త్ర ప్రకాశకులు.

ఈ సంగీత శాస్త్రమును పరిశోదించి పురందరదాసులవారు స్వరావళిగీతములను, మఱియనేక కృతులు వ్రాసి విధ్యార్ధులు శులభోపాయముగా గ్రహించుటకు ఏర్పాటు చేసిరి. దీక్షితులవారు, శ్యామశాస్త్రులవారు, త్యాగయ్యగారు అనేక కృతులను జేసి సకలమైన తమ శిష్యకోటికి భోధించినందున సంగీతవిధ్యార్దులును, పండితులెల్లరును వీటినే సదా అభ్యసించి యానందించుచున్నారనుట యెల్లరకును సుప్రసిద్ధము. త్యాగయ్య గారి శిష్యులగు వాలాజానగరునందు వేంకటరమణ భాగవతులు గారి పౌత్రుల సేవయు, మైసూరు వీణె శేషణ్ణ గారి సేవయు బహుకాలము చేసి వీరి కృప వలన గ్రహించిన విషయములను సంగీతవిద్య నభ్యసింపఁ గోరువారలెల్లరకును సులభమార్గముగ గ్రహింపనొక గ్రంథముండినఁ జాల నుపయోగకరమని తలఁచి ఈ "గానవిధ్యావినోదిని" అను గ్రంథమును రచించినాడను. ఈ గ్రంథములో స్వర, గీత, వర్ణ, స్వరజతి, కృతులు, పదములు, జావళ్ళు, తిల్లాన, తహన, 72 మేళకర్త రాగములను, వీణాశాస్త్రప్రకారముగా (12) చక్రములందు సంక్షేపించి ఆయాస్థానమందు ఆయాస్వరమును వ్రాసి జంత్రగాత్రాదుల నభ్యసించువారి కత్యంతోపయుక్తమగును. స్వరసాహిత్య విద్యాప్రవీణులు సమ్మతించునట్లును, విద్యార్ధులు సులభముగ గ్రహించునట్లును పరిష్కరింపఁబడినాడను.


విధ్వజ్జనవిధేయుడు,

వీణె - బసవప్ప, హుబ్బళ్లి.

విషయసూచిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

ఇతర మూల ప్రతులు

[మార్చు]

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.