గరిమెళ్ళ వ్యాసాలు/పల్లెటూరి కథలు

వికీసోర్స్ నుండి

పల్లెటూరి కథలు

విమర్శనము
   శ్రీయుత శనివారపు సుబ్బారావుగారు వ్రాసి ప్రచురించిన "పల్లెటూరి కధలు" అను గ్రంధముతో "తెనుగు చిన్నకధ" కు ఒక క్రొత్త దృక్పధమును, క్రొత్త సందేశమును, క్రొత్త రంగమును చిక్కినవని చదువరులు గ్రహించకపోరు. ఇదివరలో తెనుగు పత్రికలలోను, మాస ఉగాది సంచికలలోను ప్రచురింపబడుచుండు చిన్నకధలలోని యంకము మహొదయమగుచున్న నవయువక యువతీజనంబుల యుద్రేకములును, ఆందోళనములు, సంఘపు కట్టుబాట్లలో కొన్నిచోటుల బ్రాకిన దురాచారముల యొక్క దూషణలును, స్వేచ్చవలె కనిపించు స్వైరవిహార పరతంత్రతలును, వైరాగ్యములును, మరణములును మొదలగు నద్భుతములు (romances) మాత్రమే అయి యుండెడిది. చిన్నకధయొక్క సంకల్పమును, సార్ధక్యమును ఇదియేయని కొందరును, ఇంతియేయని కొందరురును తల్చియుండుటలో నాశ్చర్యము లేదు. చిన్నకధను చూచీ చూడడములో ముందు దానినే పఠించి, ఆ శృంగారమును, ఆ విభావమును, ఆ వైరాగ్యమును అనుభవించి దానిని విడిచిపట్టుట పాఠకుల కలవాటై పోయినది.
     ఇట్టి ఆంధ్రసారస్వతలోకమున నీ గ్రంధమును బ్రచురించి ఇంతకంటె సొగసై మనోహరమైన దిశకు ఈ "చిన్నకధ" చూడగలదన్న సంగతిని గ్రంధకర్త ప్రత్యుక్తముగ ఋజువు చేసినాడు. ఇతదు తొలుదొల్త చేసిన పని నవయౌవన సూత్రాంతమగు మోహమును, దాని పరిణామములను మాత్రమే కధలకు ప్రప్రధానాంశముగ జేయుట మాని, లోక వ్యవహరములను, సంసాత కష్టసుఖములను ప్రప్రధానాంశముగ జేసినాడు. పిదప మోహ పరతంత్రులును, శరీర సౌందర్యోపాసకులును నగు వన యౌవనుల ప్రధాన పాత్రలుగ జేయుట మాని సంసార కష్ట సుఖములు శరీరమునకు నాటి క్రింది మీదులు పడుచున్న గృహస్తులను, గేసురాండ్రను ప్రధాన పాత్రలుగా జేసినాడు. ఈ చిత్రించుటలోనే ఆలోపములు మాయమై సుగుణములు వృద్ధి చెంది, అన్యోన్యత కుదిరి సంసారములు చక్కపడు మార్గములను సూచించినాడు.
గరిమెళ్ళవ్యాసాలు
అయినను గ్రంధము నసపెట్టి నీతి బోధనలు చేయు శిక్షాస్మతివలె గాక, సుఖసల్లాపములు సలుపుచు నూనృత మార్గమున నడిపించి సుహ్వత్తునివలె సహవాస యొగ్యమై ప్రీతి దాయకమై యుండుట గ్రంధకర్త యొక్క, రచనా చమత్కృతిని చాటుచున్నది.
  ఒక కధలోని కొన్ని ప్రధానాంశముల బరిశీలింతము గ్రామ ప్రజల యొక్క మొట్టమొదటి యిబ్బంది ఉద్యోగస్తుల రాపిడి ఒక ముసలాయన చెప్పినట్లు "ఇప్పటి మునసబు కరణాలు - పెద్ద చిన్న తారతమ్యము లేకుండా ఏమి చేస్తానో చూడు నీ సంగతి కనుక్కుంటాను అనే బెదిరింపులతో యేడిపించుకు తింటూ" వుండడము పరిపాటి ఒక వూరి కరణం "లచ్చయ్య క్రొత్తలోగిటి అరుగులు ఆక్రమణము చేశాడు." అని పైకి వ్రాసి రెవిన్యూ ఇనస్పెక్టరుకు బాగా భోజనము మేపి కొలిపించి స్థిరపరచి, తాస్సీల్దారు నోటీసు అమలౌ జరిపించి వెంటనే పదిహేను రూపాయలు చొప్పున అమరాధం కడుతూ సివిలు క్రిమినలు చర్యలకు లోబడడమో జరిగేటట్లు చేయించాడు. ఆ వూరు మునపబే అంజయ్య పొలము గట్టుకొట్టి తనపొలములో చేర్చుకొని ఏమయ్యా అంటే రెండు నువ్వుల బస్తాలు అతని గడ్డికుప్పలో దాచి అతని మీద చోరీ కేసు పెట్టి మూడు మాసములు కఠిన శిక్ష వేయించాడు.  వూళ్ళోవెట్టివాణ్ని చాకలివాడ్ని, వడ్రపు పని చేసే బసవలింగాన్ని యేమర్రా దొంగ సాక్ష్య్లాలిచ్చినారని పెద్దమనిషి కొండయ్య అడిగితే "లేదుబాబయ్యా గ్రామ నౌకరికి భంగం వస్తుందని మీకు తెలియదా" యని వాళ్ల జవాబు, గ్రామ మునసబు కరణాలంటే పట్టణములోని వారిపై ఉద్యోగస్తులకు లంచము లిప్పించుచు తాము తింటూ ప్రజలను హింసించు టౌటులని అర్ధము. మరో మునసబు వెంకటసామి చేత అయుదు రూపాయలు లంచమిప్పిస్తేనే కాని ఒవర్సీలు త్వాష్టము వూరు కదలలేదు. ఇది గ్రామాధికారుల స్థితి.
  ఇక వీరి పైఅధికారులనగా పట్టణములో వుండే రెవెన్యూ ఇనస్పెక్టరు పోలీసు ఇనస్పెక్టరులు. మేజిస్ట్రేటులు, రిజిస్ట్రారులు ఓవర్సీలు మాట చెప్పనక్కరలేదు. రెవెన్యూ ఇనస్పెక్టరేది ఆక్రణమంటే అది ఆక్రమణము పోలీసు ఇనస్పెక్టరెవరిని దొంగంటే వాదు దొంగ. మేజిస్ట్రేటు కెటు మొమమాటముంటే అటు తీర్పు రిగిస్ట్రారు కియ్యవలసిన ప్రయివేటు ఫీజు ముట్టకుంటే "మూడు గంటలై పోయింది. అవతలకు పో" ఓర్సీలుకు రూపాయిలిస్తే నీరువచ్చే సదుపాయం వీలైతే చేస్తాడు. అన్ని తోవలూ సర్కారువే ఆ తోవంట బండి వెడితే జరిమానా, ఓర్సీలుకు లంచమిస్తే కాని అది తప్పదు. పట్టణములో ఇత్తడి చెంబు పట్టుకుంటే న్యూసెన్సు కేసు.
  ఈ ఉద్యోగస్తులు రిటైరైనా కాని వీళ్ళ పీడ పోదు. ఏమంటే అపుడు వాళ్ళూ ఒకళ్ళ కొకళ్ళు చుట్టాలో, స్నేహితులో ఔతారు. అందుచేత ఒకడికి వచ్చే లంచము ఇంకొక డెవ్వడూ తప్పించడు.
    వీరికెక్కడికక్కడే పుల్ఫాలు కావాలి. రెవిన్యూ ఇనస్పక్టరు వగైరాలు వస్తే కరణం గారింట విందులు పోలీసు ఇనస్పెక్టరులువస్తే మునసబు గారింట కోళ్లూ గొఱ్ఱెలూ కొట్టి భోజనాలు పోలీసు వాళ్లు అనగానే యే కారైనా ఆపేసి అందులో కూర్చొని చార్జి యెగవేయవచు. డెప్యూటీ కలెక్టరు గారి కుమారుడి కంటే మేస్టరులు  మార్కులు దిద్ది పేమచేయవలసిందే మైలుకూలీ ఓవర్సీలు దగ్గరకు పనివుండి వచ్చాడురా అంటే వాళ్ల ఆవులకు గడ్డివేసి కుడితి తాగించనిదే వెళ్లకూడదు. లంచాలు దిట్టముగా ముట్టిపోతే ఆక్రమణలు లేవు. గొంగతనాలు లేవు సర్కారు రోడ్దుమీద బళ్లు తోలడలు లేవు అంతా రామరాజ్యమే.
  పల్లెటూళ్లలో రెండవ అంశము చిలిపి జట్టీలు తొమ్మిదేండ్ల చంద్రమ్మ నడుస్తున్నపుడు ఏడేళ్ల నరసమ్మ పరికిణీ  మీద బురద పడితే నరసమ్మ తల్లి చంద్రమ్మను మోదీసింది. చంద్రమ్మ తల్లి నర్సమ్మను తిట్టింది. నరసమ్మ తల్లి జగడానికి వచ్చింది. ఎవరింట్లో మగవాళ్లు ఆ యింట్లో ఆడవాళ్ల తరపు ఎవరి చుట్టాల వాళ్లు వాళ్ల తరపు, నాలుగు రోజులిదో అలికిడి.
    మూడవ అంశము సహవాసము పల్లెటూరి కుర్రవాళ్లు చెడిపో వడ మున్నూ వెంకయ్య కొడుకు పురుషోత్తాన్ని చూచి చదువుకొని జ్ఞానం సంపాదించే వారెవరూ లేరు కాని, కోటయ్య కొడుకు రామనాధమును
గరిమెళ్ళ వ్యాసాలు
చూచి క్రాపింగుంచుటకు అవకతవకగా నాలుగింగ్లీష్ ముక్కలు పేలిండుకు కళ్లజోళ్ళూ, మేజు బల్లలు, చేతికర్రలు కొనిందుకు ఇంట్లో వస్తువులెత్తుకుపోయి బోగము వాళ్ల కిచ్చేటందుకు సత్యంలాటి కుర్రవాళ్లనేకులు సిద్ధము.
   నాలుగవ అంశము పల్లెటూళ్లవాళ్లు పడే దండుగలు పాపయ్య పెళ్లిసరకులు కొందామని యిల్లు బయలుదేరితే రెండు రూపాయలు పుచ్చుకొన్న టికెట్ల మేష్టరు రూపాయి పవలా టిక్కట్టిచ్చి చిల్లర లేదని తక్కిన ముప్పావలా వుంచేసుకొన్నాడు. ఇత్తడి చెంబు పట్టుకుంటే పట్టణంలో 'బెంచి మేజిస్ట్రేటు రెండు రూపాయీలు జరిమానా వేశాడు. వట్టి బట్టలకీ, జరీబట్టలకీ, బంగారానికీ, లైటులకీ, సెంటులకీ సుమారు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయినవి. ఇంటికి వచ్చి చూచుకుంటే పట్టుబట్టలు బరంపురానివి కాక అల్కా చీనావి అయినవి. జరీ రాగిదయిపోయించి. అత్తరులు పులుసు కంపు, పెట్రోలు లైటు మేంటెలు తగులబడింది. అరికేను లాంతరుకు వత్తెక్కలేదు. బస్తీలలో అంతా దగే అన్నాడు పాపయ్య మామగారు. అయినా రోజుల్ని బట్టి నడవాలన్నాడు గోపాలం.
  అయినా పల్లెటూళ్లను గురించి మనము బొత్తిగా నిరాశ పడనక్కరలేదు. ద్వజస్తంభము చుట్టూ చేరే పెద్దలలో కొండయ్యలాంటివళ్లు కొంఅరిని ధర్మంగా ప్రవర్తించలేరా అని అదమాయించగలరు. లచ్చయ్యలాంటి వాళ్లు దారేపోయేవాళ్లకి వీలుగా వుండేటందుకు రోడ్డు కలువ కలసేమొగలో చిన్నసత్రం కటించబూనుకుంటున్నారు. వెంకయ్య యేటా వైశాఖ మాసంలో తన యింట పురాణం చదివించడం మామూలైంది. "ఇంతకీ మనలో మనకి నీతీ జాతీ లేకపోవడం , అందుకు తోడు మనలో అధైర్యం కలగడాన్నిబట్టీ, నేడు మనమీస్థితికి వచ్చామని చీవాట్లు పెట్టిందుకు శాస్త్రిలాగు ధైర్యంగా నిలబడగలిగే వాళ్లున్నారు. కరణం యింటికి వేళకి అవడు వచ్చినా లేదనకుండా అన్నం పెడతాడు  పురుషోత్తం లాంటి వాళ్లు బి.య్యే పేసయి కూడా బానిస వృత్తిలో చేరక దేశసేవ చెయ్యాలనె కోరికతో ప్రజాసేవ సంఘంలో చేరుతున్నాడు. అయినదానికి, కానిదానికీ యింత డబ్బు పెట్టడం పూర్వసంప్రదాయం కాదనే పెద్దలున్నారు. చిన్నపిల్లల కోసం రుంజూలు తెంచుకుని దెబ్బలాడుకుంటోన్న పెద్దవాళ్లందరూ వాళ్లలో వాళ్లే సిగ్గుపడుతున్నారు.
 గరిమెళ్ళ వ్యాసాలు తిన్నగా ప్రవర్తించని వాళ్లకి దేముడే శాస్తి చేస్తాడనడానికి, మునసబు కూతురు ముండమోయడం, కరణం కూతుర్ని అల్లుడు వదిలి వేయడమే సాక్ష్యాలు.
   ఈ విధముగా పల్లెటూళ్ల తాలూకు కొన్ని చాయలు తీసి గ్రంధకర్త చిత్రించి ప్రచురించాడు. ఇట్టి వసంతములైన చాయలా గ్రామములపై నున్నవి. అవి గ్రహించి ముద్రించగాల్ చిత్రకారులవసరమై యున్నారు.  ఈ గ్రంధకర్త తాను రచియించినంత మేరలో పొందిన విజయూమును తానింకను పెక్కు  కధలు వ్రాయుటకు ప్రోత్సాహముగా గైకొని తన కృషిని కొనసాగించునుగాక యని కోరుచున్నాను.
- భారతి, సెప్టెంబర్, 1931