గరిమెళ్ళ వ్యాసాలు/ఆంధ్ర భాషా పరిణామము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర భాషా పరిణామము

  మానవులలో ఎట్టి పరిణామములు జరుగుచుండునో వారు మాట్లాదుచుండు లేక వ్రాయుచుండు భాషలో కూడా అట్టి పరిమాణములు జరుగుచుండుట సహజము. భరతఖండము నందలి ప్రతి జాతియందును నేడు అత్యద్భుతమైన పరిణామములు జరుగుచున్నవి. ప్రాత విశ్వాసములపై ఒక వరుసనుండి నిరోధము, కొత్త సూత్రములపై నొ వరుసనుండి విశ్వస్దము లేచుదున్నది. ప్రాతదేపరమావధి క్రొత్తదెల్లయు నీటిబుడగవలె తాత్కాలికమను భావములు కూడా ఒక ప్రక్కను రేకెత్తు చున్నవి. ప్రాచీన నాగరికత లెని దేశములలో వలె మనదేశమువంటి దేశములలో క్రొత్త పద్దతులపై దుర్దాహము ప్రబలుట సంభవింపదు. క్రొత్తదానిపై కెల్ల నెగ బ్రాకగోరుకొందరు చపలురుండుచున్నను, అనతి కాలములో వారికే ప్రాచీన చైతన్యతా జ్ఞానముదయించి, వారి భావములను మదించి మరియొక నూతన మార్గమునకు వారలను త్రిప్పివైచును.
 అయినను దేనిని క్రొత్తదను నేకైక కారణమున తృణీకరించుట లెస్సయును కదు, సాధ్యమునుకాదు. ఎవరెంత గింజుకున్నను "క్రొత్తప్రాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్ము చునేయుండును. క్రొత్త దాని నేవగించుకొని వారును అవలంభించు వారును గూడ వాని తత్వమునామూలాగ్రముగా గ్రహించియే గర్హించుటయో. స్వీకరించుటయో ఛెయుచుందురు. మన భరతఖండమును, అందుగల వ్విధ రాష్ట్రములును ప్రస్తుతము ఈ అవస్థయందే తటపటాయించుచున్నవి. ప్రాతవానిని విసర్ఝించుటకును వీలులేదు. క్రొత్తవాని ననేకమును స్వీకరించకయు తప్పదు.
  ఈ విధమైన చైతన్య్హము వలన మన ఆంధ్ర భాష యెట్లు పలుభంగులుగా పరిణామము నందు చున్నదో గమనించుట యెంత యును అవసరము. ఈ పరిణామముల కన్నింటికి ఈ జాతీయ నూతన చైతన్యమే కారణమని చెప్పుటకు వీలులేదు. జాతులలో నిజాతీయసంబంధమైన నూతన సంచలనములు కలుగుచున్నను, మానుచున్నను కాలగమనమును పట్టి కూడా మార్పులును, పరిణామములును సంభవించుచునే యుండును. వేయిసంవత్సరముల క్రిందటి పదములును, ప్రయోగములును, వ్యాకరణవి శేషములును యెన్ని నేటికి మాయమైనవో యెవ్వరూహింపగలరు? ఆనాటి వ్రాతప్రతులేవైన దిరికిన యెడల ఇది ఆంధ్రయేనా అను సందేహము మనకు కలుగక మానదు.
  అయినను అస్థిరమైన బాషలు మాతునంత వేగముగా స్థిరమైన భాషలు మారవు. స్థిరమైన భాషలలోకి యెన్నిమార్పులువచ్చినను వానియాచార రూపము ఒక రీతిని శాశ్వత ముగానే ఉండును. ఆంధ్రభషకు నన్నయభట్టు కాలమున ఒక మొస్తరు స్థిరత్వమేర్పడినదని చెప్పవచ్చును. అతని తర్వాత సమసిద్ధులైన కవిద్యయము అతని వరవడిని బట్టి తమ గ్రంధములు వ్రాయుచుండిరి. తరువాత కవులు తమ పదములు కవిత్రయ ప్రయోగములేనా ఒక ప్రమాణము బట్టి కొలుచుకొనుచుండిరి తరువాత నెందరో కవులు నూతన ప్రయోగములు చేయుచున్నను మహాకవి ప్రయోగముల కున్న గౌరవము అల్పకవుల వ్రాతలకు లేక మాడిపోవుచుండేడివి. మహాకవులు కూడా అనేకులు పుట్టి నూతన ప్రయోగములను నిరసించుచుండేడివి. మహాకవులు కూడా అనేకులు పుట్టి నూతన ప్రయోగములను నిరసించుచుండుట వలనను భాషకొక క్రొత్త మోస్తరు స్థిరత్వమేర్పడినది. ఇది పద్యకావ్యముల దోరణి.
  గద్య కావ్యములకును, పదకవిత్వములకును ఇట్టి నిర్బందము లేవియును లేకుల్ండెడివి. సాధారణ కవి మండలులు, వ్యాసకర్తలు వ్యాఖ్యాతలు వాడుకభాషను విరివిగా ఉపయోగించి మహాకవ్యమూల యందలిగూఢ్యార్ధములను తేట తెలుగులో ప్రజలకెఱుకపరచుచుండిరి. ఈవ్యావహారిక భాషా వ్యాఖ్యానములు విరివిగా నుండుట వలన కావ్యభాష ప్రాతగిల్లక ఏనాటికిని సరిక్రొత్తదగు నూత్నత్వముతోనే రాణింపజొచ్చినది. ఈ విధముగా ప్రాతక్రొత్తలు స్నేహముగా సరళరీతిని మధ్యయుగము లేక రాయల యుగము దాకా వర్ధిల్లినవి. రాయల యుగములో నాంధ్రభాష ఒక మహోన్నత్వదశ ననుభవించినది. ప్రాత పురాణ కవిత్వములోనికి క్రొత్త ప్రబంధ ఫక్కీలు ప్రవేశించినవి. క్రొత్త కల్పనలు నిరాఘాటముగా సాగుచుండినవి. వీనితోకూడా క్రొత్త ప్రయోగములు విరివిగా దూరినవి. కవులను పొషించుట, కవిత్వమ్లను వినిపించుట, రాజులకు మంత్రులకు, శ్రీమంతులకు పరిపాటియైనది. ఆకాలమున పుట్టిన ప్రబంధములకును, కృతులకును అంతులేదని చెప్పవచ్చును. నేటికి అచ్చుపడిన నెన్నొపడగా మిగిలవెన్నో తంజావూరు భాండాగారమునందును గృహస్థుల గృహములందును యున్నవి. ప్రతి గృహస్థునకును తానొక కవి
గరిమెళ్ళ వ్యాసాలు కుటుంబమువాడనని చెప్పుకొనుటకు గర్వముగా వుండెను. ప్రతి కవియు తన తాత ముత్తాతలెటువంటి కవులో యే యే గ్రంధములు వ్రాసిరో గ్రంధాదిని యేకరువు పెట్టుకొనుట సంప్రదాయమైనది. జన సామాన్యములో కవి జనదరణము హెచ్చిపోయెను. ఎవరికి విద్యయున్నను ఏ విధ్య లేకున్నను నోటిలో నాలుగు మాటలుండి పద్యములల్లగల శక్తి యుంటే చాలును. దేశాటనము గౌరవముగాచేయగల అధారము లభించుచుండేడిది ప్రతి మహాకవియు అనేకిఅ సాధారణ లేఖలును నిత్యవ్యవహారములును కూడా కవిత్వభాషలో జరుపుకొనుట యొక విశేషముగ నెంచబడెను. ఇవి నిజముగా ఆంధ్రభాషామతల్లికి అధిక సౌభాగ్యదినములు దేశములో యెన్ని యుద్ధములు వచ్చి యెందరు ప్రాతరాజులు కూలి క్రొత్త సంస్థానములు క్రొత్త గద్దెలు యేర్పడుచున్నను, కవితా పోషణము కవితా ప్రసంగములును యధారీతిని సాగుచునే యుండెను. క్షత్రియులు, రెడ్లు, వెలమలు, సమస్త పౌరుష్ జాతులును కవిపోషణము నేమరకనే యుండిరి కనుక విజ్ఞానము వేయిచేతుల రేడు వలె దేశము నంతటిని వెలిగించుచునే యుండెను.
   ఈ ప్రబంద భాష యెంత విజృంభించి కూడా, కవిత్రయము భాషను వెనుకకు త్రోయలేదు. నేటికిని ఈ ప్రబంధము లెంత సుగ్రాహ్యము లై యున్నవో తిక్కనాదుల భాష కూడా అంత సుగ్రాహ్యమై యున్నదన్న ఆంధ్రభాష యొక మోస్తరుగా స్థిర స్వరూపమును వహించియున్నదని చెప్పుట్ కాటంకమెమి కలదు? అయినను స్థిరత్వమునే ఒక మోస్తరు దేవతగా భావించి పూజింపమొదలు పెట్టినచో అనుకరనము ప్రబలి అసలు చైతన్య మంతరించక మానదు. పిద్ప కాలపు ప్రబంధముల కిట్టి దోషమే కొంతవరకు పట్టిపోయినది. ఈ స్థితికి ఆ కాలపు కవుల స్థిరత్వారాధన మొక్కటియే కారణము కాదు. ఆంధ్రజాతీయ చైతన్యమే మందగించిన రోజులవి. ఆంధ్రుల శిల్ప నైపుణ్యము , క్షాత్రప్రజ్ఞ వైదిక దీక్ష, ప్రాచీన గౌరవ సంప్రదాయ పరిరక్షణము మొదలగు సుగుణములెల్లయు నసివాళ్లు వాడినవి అంతకౌ ముందుండిన దేశీయ - అల్లకల్లోలములడుగంటి బ్రిటిషు ప్రభుత్వము వారి వర్తక వాణిజ్యముల కనుకూలమైన శాంతి వాతావరణమేర్పడినది. దేశస్థులందరి ప్రజ్ఞలును ఆ ప్రభుత్వనీతిని పోషించుదెననే వ్యాపింపజొచ్చినవి. ఆంధ్ర సంస్కృత భాషలలో
గరిమెళ్ళ వ్యాసాలు
పాండిత్యము, బిరుదుల కంటె ప్రభుత్వము వారిచ్చు బియ్యే, ఎమ్మే, టైటిల్సు మీద వ్యామోహము హెచ్చినది. ఆంధ్రభాషోపన్యాస దోరణి యందు కంటె ఆంగ్లేయ భాషా వాచాలత్వమునందు చపలత హెచ్చినది. గ్రామమ్లలోని పెద్ద మనుషులు తీర్పుల యందు కంటె జిల్లాకోర్ఘు హైకోర్డుల తీర్పుల కెగబ్రాకు ఆసక్తి పెరిగినది. స్వదేశీ వస్త్రములు, బొమ్మలు, కత్తులు, ఆయుధములు, వస్తువుల కంటె విదేశీ వానిపై కులుకు వర్ధిల్లినది. ఆంధ్రభాషయందును, ఆంధ్రాచారముల యందును గల ఆసక్తి యొక మోస్తరు చాదస్తము క్రింద భావించ బదినది. వాని యందింకను దీక్షగల వారికి శ్రీమంతులిచ్చు పారితోషికములు దానములుగా బావించబడుట వలన, వానిని స్వీకరించువారి ఆత్మగౌరవము క్రుంగిపోయినది. ఆంధ్రభాషామతల్లికి దుర్దినములివి. పిల్లల పాఠ్యపుస్తకములు మినహాగా మరియెట్టి యుద్గ్రందములును ఈ కాలమున పొడమలేదు. అవితప్ప యితర గ్రంధములు చెల్లలేదు. విద్యాశాఖవారి పోషణము తప్ప సాహిత్యలేకాభివృద్దికి వేరు మార్గము లేదాయను. క్రమక్రమముగా కవి సంతానము లడుగండినవి. ప్రతివానికిని ద్రవ్యాపేక్షయు, ఉదొయ్గపరవశత్వమును నిత్యవిధులైనవి. దీమంతులకు కొందరికి ఆంధ్రవిజ్ఞానాభిలాష యుండినను అది కేవలము భెషజమాత్రమై యుండెను. స్వజాతీయ చైతన్య్హము నశించిన జాతికి ఇట్తి దుర్గతి పట్టుట ఆశ్చర్యము కాదు.
  ఈ విధముగా 1907 వ సంవత్సరమువరకు వచ్చితిమి. బంగాళావిభజనము ధర్మమార్గంలో ఒక వినూతన జాతీయ చైతన్యము అసేతుశీతాచల పర్యంతమును చెలరేగినది. భారత జాతి జాతులన్నిటికి వలెనే ఆంధ్రులకును మెలుకువ కలిగి ఉదాసీనత వీడినది. ఆంధ్రభాషయందు, ఆంధ్రజాతీయత యందును, ఒక భక్తి ఉదయించినది. దీనితో ప్రాచీన విజ్ఞాన పరిశోధనము, చరిత్ర స్మరనము, ప్రబంధపఠనము తలయెత్తినవి. విద్యాధికులు అందునను విద్యార్ధులకళాశాలలో నేర్చుకొనుచుండు విషయములతో తృప్తిపడి యూరకుండక తీరిక యైనప్పుడెల్లా ఆంధ్ర గ్రంధ పఠనము నవలంబించి అందలి సారస్వమును గ్రహింపజొచ్చిరి. తాము పరిశీలించుచుండిన ఆంగ్ల కవుల విశిష్టమహత్త్యమును గుర్తించి తమ భాషలో అట్టి మార్పులను తెచ్చుటకై కంకణ్ము కట్టుకొనిరి. ఆంగ్లసాహిత్య చరిత్రము వలె ఆంధ్రసాహిత్య చరితమును యే యే కారణముల నెట్టి యెట్టి పరిణామములకు పారమైనదో యూహించి వ్రాయజొచ్చిరి. కోటిప్రబంధములున్నను అందులోని
 గరిమెళ్ళ వ్యాసాలు విషయమును విమర్శించి రసమును వెలిబుచ్చి విమర్శకులు లేకుండుటే ఆంధ్రబాషానీరసత్వమునకు కారణమని ఊహించి విమర్శక గ్రంధములను వ్రాయజొచ్చిరి.
 పాఠశాలలో ఆంగ్లభాషఖూఫట్టముకట్టబడినదనిన్నీ, ఆంధ్రభాషతోడపెళ్ళికూతురివలె కూర్చున్నదనిన్నీ, అందులో నేర్పంబడు విషయములు యేదో వెట్టికై మాత్రమే చెప్పబడుచున్నవ నిన్నీ దేశస్థులు గ్రహించినారు. ఆంధ్రభాషకధిక ప్రాముఖ్య మీయవలెననిన్నీ, ఆంధ్రరాష్ట్రమేర్పడాలెననిన్నీ మొట్టమొదట ఆంధ్రదేశమునందు జాతీయాందోళనము ప్రభవించినది. పాఠశాలలోని గద్యపాఠ్యగ్రంధముల భాష సనాతన గద్య గ్రంధభాష కాదనిన్నీ, గద్యభాషలో అనెక వ్యావహారిక పదాలొ గ్రంధాలు చదువ వలెనన్నా వ్రాయవలెనన్నా వాడుక భాషపై పూర్వకాలంలో ఇప్పుడున్నంతవెగటూ, ఏవగింపూ లేక అటువంతి ప్రయొగాలు కవులు తమ పద్యకావ్యాలలో కూడా ధారాళంగా వాడుతూ నిజమైన వాడుక భాష కుండే సౌందర్యం రాదనిన్నీ, శ్రిగిడుగు రామ మూర్తి పంతులుగారు, వగైరాలు తమ పరిశోధనలు ఉదాహరణ రూపకంగా అఖండమైన ప్రచారం చేశారు. చెళ్ల పిళ్ల వెంకట కవీశ్వరుని వంటి శతాఫదాన్లుకూడా ఈ వాదన నంగీకరించి ఈ భాషలో నేడు ధారాళంగా గద్యం వ్రాసేస్తున్నారు. ఆ గద్యం గ్రాంధిక భాషకంటే వేయిరెట్లు అందంగా వుందని కూడా మనము అంగీకరించక గప్పకుండావుంది. వాడుక భాషమీద నిరసన దండయాత్ర చేయడం ఇప్పుడు అవివేకం, వ్యర్ధం కూదాను అయినా బ్రిటిషు పాఠశాలలు స్థాపించబడినప్పటినుంచీ ఈ కృతభాషలో వ్రాయడం మన కఃభ్యాసమయ్యేవుంది. 'వచ్చింది ' అనేదానికి బదులు 'వచ్చినది ' అనో ఐతే అనుటకుబదులు అయినను అనో, వచ్చాను అనే దనికి బదులు వచ్చితిమి అనో పూర్వపదం పడుతూనే వుంటుంది. కృతక భాషే అనండ్శి మరే భాషోఅనంది ఆ భాషలో ఉండే ప్రయోగాలన్నిటిను బహిష్కరిస్తూ గ్రంధాలు వ్రాయగల గడుసరి నేటివరకు యేవరూ పుట్టలేదు. బహుశా ఒక్క రామమూర్తి పంతులుగారు వారి వంటి ఒకరిద్దరు మినహాగా
గరిమెళ్ళ వ్యాసాలు
ఇక శుద్ధ గ్రాంధిక భాషలో వ్రాయగలవారు అసలే శూన్యంగా వున్నారు. ఇదుగోనేను లేచానని యెవరైనా అన్నారా! 'దీనిలోని ప్రయోగాలు శుద్ధ తప్పులు, ఈ పదాలు కేవలం వాడుకలు ' అని యెవ్వరైనా చూపించవచ్చును. ప్రస్తుతం మన భాషాస్థితి ఈ రెండింటి మధ్యనాల్ ఉఱ్ఱూతలూగుచున్నది. వ్యావహారిక భాషావాదము నంగీకరించకా తప్పదు. అంగీకరిస్తే దానికి హద్దులు నెర్పరచడమూ కష్టమే. ఉన్నవి అన్న శబ్ధానికి ఉన్నాయి, ఉన్నయి, ఉన్నై మొదల్గు ప్రాంతీయాలను వాడుతున్నారు. నిలుచుండు శబ్ధానికి నిలుచొను, నిల్చొను, నించొను, నుంచొను, శబ్దములను కూడా వాడుతున్నారు. వేళకు జ్ఞాపకానికి రావు కాని ఇటివంటి ప్రయోగాలు వందలూవేలుపత్రికలలో కనబడుతున్నతి. కొన్నింటిని చూచి రమమూర్తి పంతులుగారే ఆశ్చర్యపడుతున్నరు. అయినాఏప్రాంతంలోనైనా సర్వసాధరణంగా వాడుకలో వుండే ప్రయోగాల్ని ఇతర ప్రాంతాల్లో లెవన్న కారణం చేత యెట్లా విడనాడగలము? బహుశా ఇట్లాగు రెండు మూడు శతాబ్దాలు వెళ్ళేసరికి ఇవన్నీ మనకు ప్రాతగిల్లి ఆశ్చర్యకరంగా వుండక పోవచ్చును. అంతవరకు యెవరెవరే భాషలో వ్రాస్తున్నా ఆక్షేపించడానికెవ్వరికీ అదికారంలెదు. వీనిలో కొన్ని కెవలం ప్రాంతీయములను కాదని అఖిల ప్రాంతీయములను వ్రాసేవారిని మనము కొనియాడవలసినదే. అట్లు కాదని కేవలం ప్రాంతీయాలను వాడే వారిని కూడా మన మబినందించ వలసినదే,. కలగా పులగంగా వ్రాసేవారిని కూడా మన మబినందించక తప్పదు. రాగా రాగా యేమిటితోచుచున్నదంటే జనులు వ్రాసే భాషలనుబట్టిమనమట్టే పేచీలు పెట్టుకోరాదనిన్నీ తోచుచున్నది. విషయమును బట్టి భాషయొక్క ధోరణి మారుతూనె వుంటుంచి. ఒక వ్యాసములోనే రెండు మూడు విషయములలాంటివి ఎత్తుకోవలసి వస్తుంది. అటువంటప్పుడు ధోరణి కూడా మారుతూనే వుంటుంది. ఈ వ్యాసంలోనే భాషల తత్వములు, ఆంధ్రభాష పరిమాణములు, మొదలైన విషయములను తీసుకున్నప్పుడు ప్రారంభించిన దోరణికిన్నీ, వ్యవహారిక భాషావశ్వకతను నిరూపించవలసిన ధోరణికిన్నీ యెంతో భేదము కనిపించుచున్నది. ఒకేధోరణిల్ళొ వ్యాసమంతా సాగించామంటే సాధ్యమైనదికాదు. ఈ ఒక్క వ్యాసమునే కాదు. నేనే గ్రంధమును వ్రాతామని
గరిమెళ్ళ వ్యాసాలు నిశ్చయించుకొని కూర్చున్నా అది ఒక ధోరణిలో ప్రారంభం కావడం మధ్యన మరియొక ధోరణిలోకి పోవడం, తరువాత మరియొక ధోరణికి రావడం ఇది మామూలై పోయించు. ఇది నా చేతకానితనమని యైన కొదరనుకొవచ్చును. విషయమును బట్టి ధోరణి అట్లు మారవలసి వచ్చినదని యైనా కొందర్నుకోవచ్చును. ఇదైనా నాఒక్కని నుదుట వ్రాయబడ్డ వ్రాతలాగ కనిపించలేదు. ప్రస్తుత వార్తాపత్రికా సుప్రసిద్ధ విలేఖరులనుకొనబడే అనేకులు వ్రాతలలో యింత్రో కొంతో యిటువంటి భేదము అగుపించుచున్నవి. తొలిచూపుకు ఇద్ వెఱ్ఱి వెంగళఫ్ఫా ధోరణుల వలె కన్పించును. కాని న్ ఇదానించి చూస్తే యిది యీ విధంగా యీ కాలంలో వుండక తప్పదు కాబోలు ననిపించుతుంది. కేవలం పాఠ్యపుస్తకములను వ్రాసేవారు కొంచెం పట్టుపూరాగా పూర్వపుధోరణిలోనే వ్రాస్తున్నారు. లేకుంటే అవి పాఠ్యగ్రంధములుగా అంగీకరింపరేమో అన్నభావం చేతను, అయినా వారు ఆసమయముల యందు తీసుకునే అతి జాగ్రత్త, భయము, అవ్యగ్రత అందులో ఉంటే వచ్చే ఉపద్రవం యేమీ లేదు. అని బాలకులకు చూచించును కాని, పాఠశాలలను విడచి పెద్ద వారైన తరువాత వ్రాయగల గ్రంధములే ధోరణిలొ వ్రాయవలెనో నిర్భందించవు. కేవల పాఠ్యపుస్తకములు కాక గణితము, భూగోళము, చరిత్ర్ సైన్సు మొదలైన విషయములను వ్రాసే పుస్తకములలోని భాషైన్నికట్టుదిట్టములతో ఉండవలెనని నియమించ నక్కారలేదు. ఏ గ్రంధకర్తకు ఏ ధోరణి యే సమయమున బాగుంటుందని తోస్తే ఆధోరణీలోనే వ్రాయవచ్చును. ఆ పుస్తకములను విద్యార్ధులు పఠించడం ఆధోరణికొరకు కాదు. ఆ విషయ విజ్ఞానము కొరకు ఏ విషయమైనను సుగ్రాహ్యముగ ఉండవలెనంటే, ఆ యా సందర్భములకు తగినట్లు గ్రంధకర్తధోరణిని మార్చుకొనక తప్పదు. కనుక పాఠ్య గ్రంధ నిర్ణయమండలులవారు పూర్వపు అధికరములతో విఱ్ఱవీగి, నవీన గ్రంధములను ధోరణుల కారణముగా త్రోసివేయరాదు. విషయము మనోహరమై, అవశ్యమై యున్నప్పుడు, గ్రంధము ప్రవీణునిచే వ్రాయబడినప్పుడు వారు దేనినైనను అంగీకరించక తప్పదు. లేని యెడల యేవేవో కొందరికిష్తమైన శయాపద్ధతుల నభివృద్ధి పరచుట కొరకు ప్ర్రశస్తమైన విషములనే త్రోసిరాజు చేసిన నేరము వారియందు నిలచును.
గరిమెళ్ళ వ్యాసాలు
దుష్టప్రయోగం నిర్ధుష్టప్రయోగం అన్నశబ్దాలకిప్పుడు పాటించుచున్న అర్ధములు తృప్తికరములు కావు మిత్రులు, అదృష్టవంతుడనుటకై అదృష్టుడు, పందాం క్రుసించుట, కలస్త (కలసి) వ్రాశి, పుస్తకం, యీ మొదలైనవానిని దుష్ట ప్రయోగము లనవలెను. రాతిరి యనుటకు రేతిరి, లేచియనుటకు లెగిసి, పోతుంది అనుటకు పోతాది, వస్తుంది అనుతకు వస్తాది, ఈ పదములను ఇప్పటివరకు శిష్ఠులుపయోగించకుండా వున్నారు. గనుక ఇటివంటి వానిని కొంచె మెడబెట్టుట మంచిది. తెలుగు బూతుమాటలను దుష్ధ్టములనక తప్పదు గదా! ఇటువంటి వాటిని మినహాగా తక్కిన వానినెల్ల నిర్ధుష్తములుగానే భావించవలెను. భారతబొగ్గు, ఇండియన్ భీమా, తపాలాఫీసు మొదలైన మిశ్రసమాసముల నెందరో వ్రాయుచున్నారు. వీనిపై కినిసిన లాభములేదు. ఇటువంటి వన్నీ పాఠకులకు బాగా పరిచయమైతేనే కాని, ఈ సమస్యలను గూర్చి వ్రాయువారు తమ భవములను ధారాళముగా ముందు ముందు ప్రసంగించ గలుగుట కవకశము లేర్పడవు. ధోరణులు మార్చుకొనుట కేట్లు లేఖకులకు స్వాతంత్ర్య మీయబడుచున్నదో మిశ్రసమాసములపట్ల కూడా అట్లే స్వాతంత్ర్యము నీయవలెను. కాల కొల్త, వేద పంట మొదలైన సమాసములనే నేను కొన్ని సందర్భముల యందు వ్రాసితిని. ఇటివంటివి అపూర్వములని చెప్పి విడచి పెట్టితే చాలును.
   ఇక పదములను ప్రయోగములను ఇడచిపెట్టి వాక్యరచనా పద్దతికి వత్తము కొందరు వ్రాయు వాక్యములలో కర్తృవాచకౌను పొల్చుకొనుత కష్టము తరచుగా అది క్రియకు చాలా దూరమై యుండును. కర్తృర్ధకములో ప్ర్రారంభించబడిన వాక్యములు కర్మార్ధకములలోను, కర్మార్ధకములో ప్రారంభించబడిన వాక్యములు కర్తృర్ధకములోను, ఏకవచన క్రియము ఈ మోస్తరు లోపములుండుచుండును. వ్రాసిన వ్యాసమును పున: పఠన మొనరించినచో ఇవి యన్నియును తొలగగలవు విశేణములకు విశేష్యమొకప్పుడు దూరమై వేరొక విశేష్యమునకు సంబందించి నట్లగుపించును కామాలు, సెమికొలనులు, హైఫనులు, అడ్డుగీతలు మొదలగు వానిని పెట్టుటలో కొందరే సూత్రమును కాని యాదస్తులో పెట్టుకొన్నట్లు కనిపించదు. ఇటువంటి వాని నన్నింటిని భాషా సంస్కరణములనిన్నీ నవీన పంధాలనిన్నీ సమర్ధిస్తున్నో అలక్ష్యం చేస్తున్నో విడచిపట్టుటకు వీలులేదు.
గరిమెళ్ళ వ్యాసాలు
చిన్న చిన్న వాక్యములనువ్రాస్తే ఇట్టి చిక్కులనేకము తొలగి పోవును కాని కొన్ని భావములను చిన్న చిన్న వాక్యములుగా త్రించివేయుటకు వీలులేని సందర్బములలో వాటిని వ్రాయక తప్పడు. శాసనములలోని క్లాజులు, తీర్మానములలోని వాక్యభాగముగముల్ (Phrases) విడదీయుట కెట్లుసాధ్యము? కనుక వీనిని వ్రాయునప్పుడు లేఖకులు జాగ్రత్తగా ఉండవలనని ఉషారు చెప్పుటకంటే మన మధికము చేయజాలము.
  ఇవికాక విభక్తుల ప్రయోగములలోనే మునుపటికిని, ఇప్పటి వాడుకకును భేదము కనిపించుచున్నది. నావల్ల కదు అనుటకు అతి తరచుగా నా చేత కాదనుచున్నాము దానియందు లెక వాని యందుకున్ను దానిలోలేక వారిలో అనువిభక్తులకున్ను భేదము చేయక కలగాపులగముగా వాడుచున్నాము. వానికి చెప్పితిమి అనుటకు వానితొ చెప్పితిమనుచున్నాము. ఇటువంటి సందర్భములలో సరియైన విభక్తిని ప్రయోగిస్తేనే సబబుగానూ, వాడుకలోని విభక్తిని ప్రయోగిస్తేనే వికారముగానూ, వాడుకలోని విభక్తిని ప్రయోగిస్తేనే సబబుగా కనిపించును. బహుళములు, ఆదేశములు మొదలగు వానిమూలకముగా చిన్నయసూరిగారు ఇటువంటి మార్పులు కొన్నింటికి శాంక్షను ఇచ్చియున్నారు. గనుక వానిలో ఈ మొదలైన వానిని నవవ్యాకరణవేత్తలు చేర్చవలసి యుంటుంది.
  ఇంతవరకు పదములు వాక్యములను గురించియే మన మాలోచించి యున్నాము. ఇమ విషయమునకు వత్తము కేవలము సాహిత్యమును గూర్చిన శ్రద్ధ ప్రపంచమునందే నానాటికి సన్నగిల్లుచున్నది. కేవలసాహిత్యపరిజ్ఞానమును చర్చలకును యెవరెవరో రసికుల యొక్క విలాసములకు విడచి పెట్టవలసినదిగాను, విషయ పరిజ్ఞానమే మానవులకు పరమావదిగాను నేడు తలచుబడుచున్నది. ఏదో హిస్టరీయో, జాగ్రఫీయో, సైన్సో రాజకీయగ్రంధమో, అర్ధశాస్త్రప్రసంగమో, కోఆపరేషను భోగట్టాయో, లేబరు సమస్యయో, రైతులబాధలో అయితే జనసామాన్యము దానివైపునకు దృష్టిని పరపుచున్నారు. కవిత్వమో, కళయో అయితే దానిని మూజూచి విడచుచున్నారు. అదవా అట్టివానిని వంటికి పట్టించుకున్నను, కాస్తతీరిక సమయల్ విలాసముగా మాత్రమేభావించుచున్నారు. పద్యాలను, పాటలను తమ పత్రికలలో ప్రకటింపనొల్లని అనేక ఆంధ్ర ఆంగ్ల పత్రికాధిపతులు నేడు వేనవేలున్నారు. ఆఖరుకు చిన్న కధలకు గూడా ఒక మూల తావివ్వని పత్రిలలు కొన్ని ఉన్నవి.
గరిమెళ్ళ వ్యాసాలు
పత్రికలు బహిష్కరించినంతమాత్రమున వాని ప్రత్రిభ కొరత పడదనియు, వానియెడల జనసామాన్యమునకు నిజమైనఆసక్తి ఉండుచునే యుండుననియు మనము ఖచ్చితంగా చెప్పవచ్చును. కాని వానికి తీరిక సమయములందలి విలాసములకు తగినంత స్థానమును మాత్రమే యివ్వవలెననుట యు సమంజసమే. నేడుజాతులభావము లెల్లయు మహందోళన ముతో తల్లడిల్లుచున్నవి. ఆంధ్రజాతి భావములును నట్లే యున్నవి. పంటలెంత యెక్కువైతే కాటుక యంత యెక్కువగుటకు విజ్ఞాన (Science) యెంత యెక్కువైతే ఆజ్ఞానమంత యెక్కువగుటకు,కోర్టులెంత యెక్కువైతే నేరములన్ని హెచ్చుచుండుటకు, సైన్యములెంత వృద్ధి యైతే అశాంతి అంత వర్ధిల్లుటకు కారణము లెవ్వియో ప్రజలు తెలుసు కొనుటకు తల్లడిల్లి పోవుచున్నారు. ఈ మహా రహస్యములు బట్టబయలు కానిదే ప్రపంచవాసులందరికినీ నిజమైన శాంతి కాని సౌఖ్యముకాని కలుగనేరదు. ఒక్కొక్కరొక్కొక్క సిద్దాంతమును పట్టుకొని యుద్ధమునకు వచ్చుచున్నరు. ఈ మహాకల్లోలములో శాంతి నెలకొనగలదా యను ఆశకూడా అంతరించుచున్నది. ఈకల్లోలమెంత వృద్ధి యైతే విప్లవ వాదులంత మంచి దంటున్నారు. దీనిని చూచీ చూడడములో శాంతివాదులు బెగ్గ్లిపోయి తమ పురాతన పద్ధతులను మరించ కట్టుదిట్టము చేసుకొనుచున్నారు. ప్రతీవరమునందును పైకి యెంత మేలు కనిపించితే లోపల నంత గుల్ల యున్నట్లు స్పష్టముగ కనిపించు చునే యున్నది అయినా, సిద్దాంతాలు ఆ మాటకు ఒప్పుకొనకున్నారు. ఈ విషయములను గూర్చి నిష్పాక్షికముగా ఆలోచించి ప్రజలకు సత్యమును నిరూపెంచవలసిన బాధ్యత ప్రతి విద్యాధికుని యందును గలదు.
  అయినను ఈ ప్రచారము కూడా అంతసులభసధ్యమైనట్లు కనబడదు. ఒకప్రక్కన ప్రభుత్వముల నుండియు వేరొకప్రక్కన ప్రతిపక్షముననుండియు అట్టివారిపై దోషపరంపరలైన శిక్షణలో దూషణలొ కురియుచునే యుండును. ఎవ్వరి విశ్వాసము లెట్లాటి వైనను, తీరా నొరు విప్పేటప్పటికో, కలం తీసేటప్పటికో, పూర్వాపరసంశుద్ధికొరకో, కొందరికి అహితముగా ఉండకుండుట కొరకో, తద్వ్యతిరేకమైన వాక్యములను తెలుపవలసివచ్చు చుండును. మనసులో ఉన్న మాటంతా పైకి చెప్పితే చాలును. అనెకులకు తమ రాజకీయ నాయకత్వములు గాలిలో నెగిరిపోవునోయని భయము ఉద్యోగములూడి పోవునో అని భయము నిజమైన సత్యాన్వేషు లెప్పటికిని ఉండనే ఉందురు ఒకప్పుడుతామేదో మాట అన్నాము కదా అని ఊరుకోనక, భావము మారినప్పుడు క్రొత్తదానిని చెప్పుచునె యుందురు. రాజకీయ నాయకత్వమును పాటింపదు. ప్రపంచ ప్రశంసల కొరకు తూగులాడరు. ఉద్యోగములు పోయినను సరకు చేయరు. నిదానము మీద అట్టివారి మాటయే నిలుచును.
 ప్రస్తుతం, ఆంధ్రదేశాము నందుగల ప్రతీసమస్యను ఈరీతిని తర్జణనచేసి నిజమును నిరూపిస్తూ బోధించగలవారు అవసరం. ఇందుకై వారు ఒక రాజకీయములేమి, ఆర్ధికములేమి, సాంఘికములెమి, శాస్త్రీయములేమి, అధ్యత్మికములేమి, సమస్త సమస్యలను పరిశోధనము చేసి తేటతెలుగులో వరి భావములను వ్రాయుచుండవలెను. ఆంధ్రదేశమిప్పుడీ యుగములో తేలుచున్నది. కవీశ్వరులీ గీతములను పాడుచున్నారు. వక్తలీ ప్రసంగముల నల్లుచున్నారు. విద్యాశాలలు వీనిని తమ ప్రణాళికలో చేర్చుకొనుజూచుచున్నవి. రాజకీయ వాదులీ మార్పుల నాచరణములో పెట్టుటకై ప్రయత్నించుచున్నారు. ఈమాహకల్లోలములో ఉత్తములైన వారందరికినె యే పదము యేధోరణి సులువైనట్లు కనిఫించితే దానిని వాడి తీరుదురు.
  ఇదికాక మనమిప్పుడు నేర్చుచున్న ఈఆధునిక విజ్ఞానమున కంతకును మనకు మాతృక ఆంగ్లభాష దాని పోలికలు, వాసనలు, పదములు, పరిభాష వద్దన్నను మనకు తప్పదు. అదేయిప్పటి రాజకీయ భాష, ఏలక్షనుల భాష, వైధ్యబాష, సహకారుల భాస్ధ, శాసనకారుల భాష్, జనులందరికిని దీనిని గూర్చిన ఆంగ్ల పదములు నోరు తిరుగునట్లు తెలుగు, సంస్కృతం తర్జుమాలు నోరు తిరగవు. ఆంధ్రదేశము బహువిశాలమైనది కన్నడ భాషా ప్రాంతీయులకు అనే#క కన్నడ పదములు ప్రయోగములు, అరవ భాషా ప్రాంతీయులకు కొన్ని ఉరుదు మర్యాదలు, తమ స్వంత భాషలోని వానివిగానే అల్లుకొని పోయినవి. ఇదీ కాక మండల భాషకును, యాసకును భేదమెంతో కొంత ఉండనే ఉన్నది. రెయిళ్లు లేని కాలములో, పరిచయములు తక్కువైన కాలములో ఇవి ఒక దాని కొకతి సవతి బిడ్డలవలె కనిపించుచుండవచ్చును. బ్రిటిషు గవర్నమెంటుధర్మమంటూ, కాంగ్రెసు ధర్మమంటూ, ఆంధ్రనాయకుల ధర్మమంటూ, ఆంధ్రమంతా ఒకే
గరిమెళ్ళ వ్యాసాలు
రాష్ట్రము, ఒకేభాష, ఆంధ్రులు ఒకేజాతి లను భాఫము బాగూఅ పాదుకొనినది. నేదు మనము దూరరూరపు బంధువులవలె చూచీ చూడనట్లు కాలక్షేపము సేసుకొనుటకు వీలులేదు. ఇంతకుముందు మనకిట్టి పరస్పర సంబంధములు తక్కువగ ఉండుటవల్లనె ఒకరికొకరము దూరస్థులవ్లె కనిపించితిమి. కాని రాకపోలు, ఉత్తర ప్రత్యుత్తర,ఇ;ఇ. సంబంధబాందవ్యములు యెక్కువయై యుండినచో ఆంధ్రభాషలో ఇట్టి ప్రభేదము లుండకపోయెడివేమో?
  ఈ భేదములను చెరుపుకొని మనమందరము నెకకుటుంము వారమని గ్రహింఅవలసిన తరుణమిది. కనుక మీ ప్రాంతముమాట మాకు తెలియదు, కనుక దానిని వ్రాయకూడదు అని ఒకరినొకరమనుకొనకూడదు. ఏమండలమునందలి పెద్దలు అక్కడి పరిభాషలో తమ సమస్య్హలను గూర్చి వ్రాయుచు ప్రచురించుచు ఉండవలెన్. తక్కిన మండలముల వారెల్లరును వానిని ఆనందముతొ పఠించి గ్రహించుచుండవలెను. ఇట్లు ఒక పది సంవత్సరముల పాటు జరిగినచో ఆంధ్రుల పదబాహుళ్యము, విజ్ఞానము, పరస్పర స్నేహం, సంపద, సౌభాగ్యము వర్ధిల్లును. మనము తోడి జాతుల వారందరితో సమూలమై, భారతీయ నాగరికతకు పెట్టని కోటలముజ్ కాగలుగుము గుజరాతీ, బెంగాళీ, హిందీ, మహారాష్ట్ర భాషల వారందరును ఈ రీతిగానే తమ విజ్ఞానమును, భాషలను, సమస్యలను, సర్వమునుజ్ పరిష్కరించు కొని సత్వరాభివృద్ధిని పొందుచున్నారు. మనము కొన్ని పెడభోదనలు వినియో, వేరు చింతనలు నొక్కియో పాతిక సంవత్సరముల క్రిందట ప్రారంభించిన ఈ శుభప్రదాందోళనము యొక్క ఫలితమును నేటివరకును అనుభవింపజాలకున్నాము. ఈ విధమైన సర్వతోముఖాందోళనము జరుగుటకు భాషయొక్కటి యే ప్రశస్త సాధనము క్నుక ప్రతిభాస్ధాసేవకుడును తన చాకచక్యమును, ప్రతిభను, విజ్ఞానమునుజ్ ప్రకటించుకొనుటకై భాష కెన్ని విధములగు చక్కని మార్గములను గూర్చవలెనో అన్నిటిని గూర్ఫగడంగును గాక! వచ్చీరానిజ్ఞానముతో తెలిసి తెలియని పదాలను ప్రయోగించి ఇదంతా భాషాసంస్కారమే అనిభావించుకొను వెల్తితనము లేకుంటే చాలును. భాషాపోషకమైన, ప్రతీ విధమైన మార్పువకున్ను స్వాగతం సుస్వాగతం!
-ఏప్రిల్ 1938 భారతి.