గణపతి దేవుడు మాకు

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


రాగం: నాట                   తాళం: ఏక

పల్లవి:
గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండీ

అతడే ఓంకృతి నిజమండి వంకర తుండము చూడండీ
ఘీంకృతి కాదది వినరండి యెదలొ మ్రోగెడు రవమండీ

ఆనందప్రదుడతడండి మోదకమున్నది చూడండీ
లడ్డూ కాదది నమ్మండి కేవల సంవిత్సుఖమండీ

చేటల చెవులవి ఏలండీ విఘ్నపు తెరలను విదలించున్
ప్రేమతో భక్తుల కథల్ వినును విపులశ్రవుడై వెలుగొందున్

ఆదిమ పూజ్యుండితడండీ అగ్నియె ఆతని రూపమండీ
సర్వగణేశ్వరుడితడండీ సర్వాంతర్గతుడితడండీ

నిద్రలు మూటికి వెలుపలగా తనువులు మూటికి ఆవలగా
కాలాల్ మూటికి కావలిగా ఉండెడి సచ్చిదానందుడండీ