క్షాత్రకాలపు హింద్వార్యులు/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి సాధారణ రాజ్యాంగస్థితి
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి సాధారణ రాజ్యాంగ స్థితి
----==---
అయోమార్గమొకటి ఒకస్థలమునుండి వెడలి కొంతదూరమువఱకు ఒకవిధముగా సాగిపోయి, అచ్చటనుండి రెండుశాఖలుగా జీలి రెండుభిన్నదశలకు బోయి పోయి ఆతనాగిపోవుటయు, శాఖ లాగి పోయిన భిన్న అంతిమస్థానము (terminus)లకు నడుమ ఎన్నియో మైళ్ళేఎడమేర్పడుటయు మనము చూచుచున్నాము. హంద్వార్యుల నాగరికతయు, గ్రీకార్యుల నాగరికతయు, ఈ యయోమార్గముపుగతిని పోలియున్నది. ఈ రెండు నాగరికతలును ఆరంభమున నొకస్థలముననే యుద్భవించెను; ఒకవిధముగానే వృద్ధిచెందెను. తరువాత నవి భిన్నమార్గముల ననుసరించి పోయి పోయి, తుదకు రెంటికిని ఏమాత్రమును సామ్యములేని యవస్థకు వచ్చినవి. ఇట్లీయంతరము పైరెండు తగలవారి యాహారవస్త్రాదులలో వాటిల్లినట్లె, క్షాత్రయుగాంతము నాటికి వారి సాధారణ రాజ్యాంగ దశయందును సంభవించియుండుట మనమీవ్యాస్మౌన జూడగలము.
క్షాత్రయుగరంభమున హింద్వార్యుల రాజ్యాంగస్థితి ఎట్లుందెనని మనము కొంత్ సూక్ష్మదృష్టితో బరికించితిమేని వారి సాధారణ రాజ్యాంగస్థితి.
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
మున నీపద్ధతి క్షాత్రయుగారంభమునకు పూర్వమే మొదలై దాదాపు తద్యుగాంతమువఱకు నట్లేలెయుండెను. ఆరంభమున వచ్చిన యార్యులతెగలు పశ్చిమోత్తర ద్వారముల ఈదేశమున ప్రవేశించి ఇచ్చటి సుఖప్రద ప్రాంతములలో పంజాబునుండి కోసల, విదేహదేశ ములవఱకు హిమాలయ పరిసరములలో నివసించిరి. ఇక *రెండవ మారీ దేశమున బ్రవేశించినవారు తమకెంటె పూర్వము వచ్చినవారిని కదలింపక యమునాచేంబలు నదీతీరములందు మాళవ గుజరాతు ప్రాంతాలలో నానాముల నేర్పఱచుకొనిది. ఈ విధముగా లెక్కకుమించిన తెగలు అనగా రాజ్యములు ఈదేశమున నేర్పడెను. ఇట్టి రాజ్యముల వేళ్ళు లీరకావ్యములందు పలుమారు వచ్చియున్నది. మెగస్తనీసు ఇట్టిరాజ్యములను 112 టిని పేర్కొని యున్నాడు. ఈ సంఖ్యకు మనమచ్చెరువొందవలసిన పనిలేదు. ఎందుచేతననగా ఒక సింధు పంజాబు దేశములలోనే లెక్కకు మిక్కిలియగు వేర్వేరు తెగలవారి రాజ్యములను అలెగ్జాండదు గెలువవలసిన వాడయ్యెనని మనము చదివియున్నాముకదా! అది యట్లుండె. రాజ్యములను స్థాపించుట ఎఱుగరని తోచుచున్నది. మన వారి రాజ్యమనగా, కొన్నివేళల, గ్రీకువారి రాజ్యమువలెనే
*వైద్యాగారు ఈదేశముమీద ఆర్యులు దండయాత్రలు రెండు మారులు జరిగినవని తలచుచున్నారు. ఇట్టి యూహకు కారణములు మాత్రము చూపి యుండ లేదు. ఒక క్రొత్తదేశమునకు నివసింపబోవువారు రెండు మారులు మాత్రమే పోయియుండిరని సాధించుట ఎట్లోమాకు దురూహ్యముగనున్నది.
వారి సాధారణ రాజ్యాంగస్థితి.
ఒక పట్టణమును ఆపట్టణవాసులు వ్యవసాయము చేసికొనుటకు అవసరమగునంత వైశాల్యముగల చుట్టు ప్రదేశమేయైయుండెను. ఐదూళ్ళు మాకిచ్చిన చాలునని ధర్మరాజు దుర్యోధనునకు సంధి సందేశమంపియుండేను. అనగా ఐదురుగు సొదరులకును ఐదురజ్యములు వచ్చినజాలుననియు, ఆంతమాత్రము లభించెనేని క్షత్రియుడగు వాని మనస్సునందుండు అధికారాసక్తి నెరవేరుననియు ధర్మజుడు తలచియుండెను. అప్పుడేకాదు, నేడును క్షత్రియుడగువడు ఒక గ్రామమునైనను సరేతాను సర్వస్వతంత్రుడుగా నేల గోరుచున్నాడు. క్షత్రయుగారంభమున ప్రతిఅట్టణమునకు నొకరాజుండినట్టు ఈక్రింది శ్లోకమువలన దెలియుచున్నది. *"తమకు తాము ప్రియము చేసికొను రాజులు ప్రతిగృహముననుకలదు. కాని వారిలో నొకడును సామ్రాట్టుకాలేదు. అట్టి బిరుదును సంపాదించుట కష్టము" అని భారతవర్షంఉనకు జక్రవర్తి కాగోరుచుండిన ధర్మజుడు పలుకుచున్నాడు. ప్రతిపట్టణమునకును రాజొకడుండె ననువచన మునుబట్టి చూచినచో, అట్టిరాజులకు పైవాడగు సామ్రాట్టు ఈ చిన్న రాజ్యములను రూపుపామకవారియొద్దనుండి కప్పములను గాని బహుమనములుగాని గొనుటలో తృప్తినొందుచుండేననికూడ తోచుచున్నది. జయింపబడిన రాజును పదబ్రష్టుని జేయగూడదనియు, అతని మరల స్వస్థానమున నిలుపవలయు ననియు, అతడు మృతుడైనచో ఆతని కుమారునకుగాని
- గృహేగృహే విరాజన, స్వస్యన్య ప్రియంకరా: ! నిచ
క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.
బంధువునకుగాని రాజ్యమియ్యవలయుననియు విధింపబడి యున్నది. దురోధన, యుధిష్టిరుల దిగ్విజ్యమువలన వారిరాజ్యం విస్తరిల్లినట్లెక్కడను కానరాదు. చుట్టుపట్టులనున్న రజ్యములు మాత్రము వారి సార్వభౌమత్వము నొప్పుకొనవలసినదయ్యెను. అల్పరష్ట్రముల స్వాతంత్ర్యమును గౌర్వించునట్టి యిట్టి యాచారము వలననే బ్రాహ్మణములలోను, ఉపనిషత్తుల లోను పేర్కొనబడిన రాజ్యముల నేకములు క్షాత్రయుగముజ్న మాత్రమేకాక, దాదాపు తధ్యుగాంతము నాటివఱకును మనకు కానవచ్చుచున్నవి. కాశీ, కోసల,విదేహ, చేది, శూరసేన, కురు, పాంచాల మత్స్య, వృష్టి, భోజ, మాలవ, క్షుద్రక,మద్ర, కేకయ, గాందార, సింధు. సౌవీర. కాంభోజ, కుశీనర, కిరాత, అనర్త మున్నగు అనేక రాజ్యములవేళ్ళు బ్రాహ్మణుల కాలమునుండి బౌద్ధయుగమువఱకు వచ్చుచున్నవి. రాజ్యపు పేరు సాధారణముగా నచ్చట వసించు తెగవారి పేరునకు బహువచన రూపముగానుండెను. కాశీ రాజ్యనామము మాత్రము పట్టణపు పేరునుబట్టి వచ్చినది. తక్కినవారిలో ననేకములపేళ్ళు రాజూల నామములనుండి వచ్చినవి. ఉదాహరనము కురురాజ్యము, శూరసేనరాజ్యము.
అసంఖ్య్హాకములగు నీ చిన్నరాజ్యముల నొక్కొక్కరాజు పాలించుచుందువాడు. గ్రీసుదేశమందు, చరిత్రారంభకాలమున పట్టణమున కొకరాజుండెనని మనకుదెలియును. గ్రీసులోవలెనే మన దేశమునందును జనులు (ముఖ్యముగా బ్రాహ్మణులు) రాజుల యధికారమునకుబూర్తిగ లొంగినవారుకారు. వారి సాధారణ రాజ్యాంగస్థితి.
ముఖ్యములగు నన్నిసమయములదును, జనులందఱు రప్పింపబడి యాలోచింపబడుచుండిరి. రామాయణమునందు మనకట్టి యుదాహరనము దొరకుచున్నది. దశరధుడు శ్రీరాముని యువరాజు జేయదలచినపుడు బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులను రావించి వరి నీ విషమున నభిప్రాయమడుగును.
రామాయణందీసందర్భమున నిచ్చినవర్ణనము నిజమైనది గా బొడకట్టుచున్నదికాని ఊహాజనితముగా దోచుటలెదు. ఈ విషయమున నేమైని సందేహముండినను, మరియొక సందర్భము నందలి వర్ణన దానిని దొలగించుచున్నది. శ్రీరముడరణ్యమున కేగిన పిద్ప్ దశరధుని మరణానంతరము భవితవ్యమును నిర్ణయించుటకు మరియొక సభ సమావేశమయ్యెను. ఈ సభయందు ద్విజులుండిరి. వీరు మంత్రులతో సమాలోచనము సల్పిరి. *రాముడును భరతుడును (ఇరువురును) లేరు; కనుజ్క వేరొకరాజు నెన్నుకొనవలయునని సైతము సభ్యులు సూచించిరి. ఈయంశములను మనసునందుంచుకొని విచారించితిమేని రాజు అధికారము నిరంకుశమైనది కాక, ప్రజాభిప్ర్రాయమునకు ముఖ్యముగా ఆర్య ప్రజాభిప్రాయముంకు లోబడినదై యుండెను. అప్పటికింకను రాజసత్తాక పద్ధతి (Monarchy) ఆరంభదశయందుండెను. అవ
- నానానగరవస్తవ్యా, వృధగ్జాన సదనపి |సమానినాయ మేదిన్యాం, ప్రధాన వృధివీపతి॥ బ్రాహ్మణాలమభ్యాచ్చ, పౌరవద సహ॥అయోధ్యాకాండ॥
- సమేత్యరాజకర్తార:, సభామీయర్ద్విజాఈ॥అయోధ్యాకాండ॥
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
నరమున్న పక్షమున జనులు తామే రాజును ఏర్పరుకొన గలిగి యుండిరి.
సాదారనముగా రాజసత్తాకపద్దతియే వాడుకయందుండినను, అన్నిచొట్లను ఈపద్దతియే సాగుచుండెనని మనమూహింపగూడదు. గ్రీసులోవలెనే మనదేశమునందును నాయకనత్తాక రాజ్యములు (Oligarchies)ను, ప్రజాసత్తాక రాజ్యములు (Republics)ను ఉండేను. రాజసత్తాకములలో రాజుచేయవలసిన కార్యములనన్నింటిని పైనజెప్పినరాజ్యములలో కులవృద్ధుల సభ (లేక శిష్టసభ Council of Elders) చేయుచుండెను. వీర కావ్యములు కానరావు, కాని మనదేశమున ప్రజాసత్తాకరాజ్యముల నెకములు కానరావు; కాని మనదేశమున ప్రజాసత్తాకరజ్యముల నేకములుండెనని గ్రీకుచరిత్రకారులు వ్రాసియున్నారు. కపిలవస్తునగరమందు శాక్యులలో కానవచ్చుచున్నది. పలుతెగలలోని వృద్ధులసమావేశముచే నేర్పడిన సభవలన జరుగుచుండిన పరిపాలనము అనగా నాయకసత్తాకపరిపాలనము మనదేశమందుండేననికూడజ్ స్పష్టముగా దెలియుచున్నది. మహాభారతము నందు "గణములు",గణపతులు, అను శబ్ధములు పలుమారు వచ్చి యున్నవి. వీనికి క్రమముగా, నాయకసత్తాకప్రజాసత్తాక పరిపాలనగ లతెగలు, వానివలన నెన్నుకొనబడిన రాజులు అనియేయర్దమని మాకు దోచుచున్నది. మహాభారతములో ననెకమరులువచ్చిన "గణానుత్సవం కేతాన్ " అను శబ్దముల యర్ధమేమో మాకు నిశ్చయముగ్తా దోచుటలేదు. అర్జునుడు ఉత్తర దిగ్విజయ యా {{center|వారి సాధారన రాజ్యాంగస్థితి.)
త్రయందు వీరిని జయించెను. #ప్రవేశ సంఖ్య తేది యేడుకుటుంబములు బహుశ: ద్రోణపర్వమున వచ్చిన నంశప్తకు లేయైయుందురు. బ్రర్వత ప్రాంతవాసులగుటవలనను, శలవారగుటవలనను, వీరు ఇప్పటికాలపు ఆప్రిదీల్ను(Afridis) పశ్చిమోత్తరపు సరిహద్దుననుండు ఇతరతెగలవారునునై యుండవచ్చును. ఏలయనగ, ఈతెగలవారు అతిపురాతనకాలముననుండి శూరులు గను స్వతంత్రాభిలాషులుగను ప్రసిద్దిజెందియుండుటేకాక ప్రజాసత్తాకమన నేమియో ప్రజాసత్తాకమున నేమియో తెలియక కాబోలు పైశబ్దముల యర్ధమును వివరింపలేదుజ్. "గణము"నకు నాయకుడుకా గోరువాడేమి ఛేయవలయునో పలుతావుల నాగ్రంధమున వచ్చినది.కనుక "గణపతి"యను నదొక గొప్పపదవియనియు, దానిబొందుటటకుజనులు యత్నించుచుండిరనియుస్పష్టముగ గానవచ్చుచున్నది. ఈ కారణములవన "గణము" "గణపతి" యనువాని యర్ధమును పైనమేము సూచించినదే యైయుండవలయునని మాయాశయము.
రాజ్యాంగ విషయమున గ్రీకుల్కును మనకును ఇంతవరకు సామ్యమే యుండినది.ఇచ్చటనుండియే గ్రీకార్యహిందుద్వార్య నాగరి కతయును అయోమార్గము రెండు భిన్నశాఖలుగజీలి రెండు భిన్నదశలకు బోయినదిమనదేశమున రాజులయదికరము క్రమక్రమముగావృద్ధియై వారిని నిరంకుశులుగను,ఈశ్వ
- పౌరసంయుదివర్జిత్య, దస్యన్ పర్వతవాసిన॥గణానుత్సవంకెతాన్ జయత్సస్తపాందన:॥
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
రాంశసంభూతులుగనుజేసి ప్రజలహక్కులను నానాటికి నశింపజెసెను,ఇక పశ్చిమమున గ్రీకులు రాజ్యాంగవిషయమున దమ భావముల వృద్ధిపరచుకొనిరి. అది యెట్టివృద్ధియనుకొనెదరు. నిరుపమానమైనది. ఆనాటిమాటయేకాదు; నేటికిని అధెన్సు ప్రజానత్తాకరాజ్యమే ప్రపంచమునందలి సకలప్రజాసత్తాకరాజ్యముల కును ఆదర్శమై యెప్పుచున్నది. ఇట్టి ప్రపండభేదము మనకును వారికిని కలుగుటకుగల కారణములను వెదకుట చాలకష్టము. ఆప్రయత్నముయ్ ఈవ్యాసముయొక్క యుద్దేశమునుకాదు. ప్ర్రాయశ: కారణములు ఈక్రిందివైయుండవచ్చును:- 1 జాగిభేదము లేర్పడుటవలన జనసామాన్యము రాజ్యాంగమున దమవిధుల మరచిపోయినందున క్షత్రియులుమాత్రమే ఈవిషయమునజోక్యం పుచ్చుకొన దగినవారైరి. 2. ఆర్యులు బహుళసంఖ్యాకులగు శూద్రులను సంఘమున ప్రవేశపెట్టుకొనిరి; కాని వారిని కాయకష్టమునకు పాలుచేసినందున జనసంఘములోని గొప్ప భాగమును రాజ్యాంగవిధులకు అనర్హముగచేసిరి. 3.మైదానములలో జనావాసము విశేషమగుటవలన, రాజ్యములు చిన్నవిగా నుండినప్పుడు జనాభిప్రాయమును దెలిసికొనుటయందుగల సౌకర్యములు తరువాత లేకపోయెను. ఇప్పటికాలమున విశాలములగు దేశములందు జనాభిప్రాయమును గనుగొనుటకు ఏర్పడిన పద్ధటూళూ ఆకాలమున జనులెరుగరు.
ఇక పశ్చిమమున గ్రీసుదేశపర్వత ప్రాంతములలో వసించిన తెగలవారు అందఱు ఒకవిధమైనవారుగను, దాదాపుగా అందరు ఆర్యులుగను, ఆదిమనివాసులసంబంధము మిగులతక్కువ
వారు సాధారణ రాజ్యూంగస్థితి
గా గలవారుగను నుండుటచేత వారు స్వతంత్రస్వభావులై నాయక సత్తాకరాజ్యముల నేర్పరచుకొనగలిగి మనదేశమందలితూర్పు భారములోని మగధవంటివిశాలదేశములలో అనార్యజాతులు ఆర్యానార్యసంయోగమువలన గలిగినమిశ్రమజాతులును విరివిగా నుండుటచేత అట్టిదేశములుజ్ ఎక్కువనిరంకుశపరిపాలనము కల వయ్యెను. 'దత్తు 'కృతమగు "పురాతనహిందూదేశసభ్యత"యను గ్రంధమునందుల్లేఖింపబదినది. ఐతరేయబ్రాహ్మణములోని ఈక్రింది వచనమువలన పైయంశమే స్థిరపడుచున్నది. ఈయర్ధమనగా కమరేయర్ధమునను ఈవచనమును సమన్వయించుటకు వలనుపడదు. "తూర్పుదిశయందలి రాజులు సామ్రాట్టులను బిరుదముల నందిరి. దక్షిణదిశస్వారు భోజులనిపిలువబడుదురు. అశ్చిమదేశీయులకు రాజులే లేరు. మధ్యమదేశముల రాజులు రాజులనియేపిలువబడుచున్నారు" అనగా తూర్పుదేశపురాజులు క్రమక్రమముగా నిరంకుశులగుచుండిరనియు, పశ్చిమదేశ జనులు ఇంకను స్వతంత్రులుగానుండి స్వపరిపాలనము కలిగియుండి రనియు తేలుచున్నది.
విదేహదేశపురాజగు జనకునితో ఉపనిషత్తులయందు వాడబడియున్న సామ్రాట్టు బిరుదము కాలక్రమమున 'రాజాధిరాజు ' అను నర్ధమున నుపయోగింపబడసాగినది. తూర్పుదేశమునందలి రాజులు బలవంతులగుటతో దృప్తిజెందక "సామ్రాట్టు" బిరుదమును గూడ కాంక్షింపసాగిరి. ఇంద్రప్రస్థమునకు రాజైన యుధిష్టిరుడిట్టి బిరుదమును బొందగోరిన సందర్భమున, మహాభారతమునందు, ఈబిరుదుమెట్లుత్పత్తియైనదియు కృష్ణుడు వివరించియున్నాడు, క్షాత్రయుగారంభముననో, బౌద్ధయుగారం
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
భంఊణాఖూ గొంచెము పూర్వమోయుండిన మనవారి రాజ్యాంగస్థితి వర్ణించినదగుటచేత ఆవివరము నీక్రిందవ్రాయుచున్నాము. "పరశురాముని బారినుండి తప్పించుకొనిన క్షత్రియులు ఏకమై ఈనియమము నేర్పరచుకొనిరి. ఈవిధిని సూర్యచంద్రవంశముల వారిరువురును ఒప్పుకొనిరి. ఇళకును ఇక్ష్వాకునకును జనించిన వారందరు నూర్గుగని మీరెరుగుదురు. యయాతివంశజులగు భోజులు నలుదిశలయందును లెక్కకు మిక్కిలిగా నున్నారు. ప్రస్తుతము రాజులందరును తమలో నెల్ల మిగుల బలవంతుడగు జరాసంధుని సామ్రాట్టుగా నెన్నుకొని యున్నారు. కనుకనే అతడు మధ్యదేశముననుభవించుచున్నాడు. శూరుడగు శిశుపాలుడు అతని సర్వసేనాని యైనాడు. కరూశ రాజగు వక్రదంతుడు అతనికి సహాకుడై యున్నాడు. పశ్చిమముననున్న యవనుల రాజగు భగదత్తుడు అసంఖ్యసేనలు కలవాడు, మురనరకులను తనకులోబరచుకొని తటస్థుడుగా నున్నాడు. పశ్చిమదక్షిణదిశల యందున్న కుంతిబోజపురుజిత్తు ఒకడుమత్రము నీకు మిత్రుడు. వంగదేశవసకులు, పౌండ్రక కిరాతులకును, రాజగు వాసుదేవునితో గూడి భీష్మకుడు జరాసంధపక్షపాతియైయున్నాడు. ఉత్తరదేశపు రాజులలో ననేకులు--పాంచాల, శూరసేన, మత్స్యదేశాధీశులును తదితరులును-జరాసంధునకు భయపడి దక్షిణమునకు బారిపోయినారు. ఎంతబలముగలవారైనను, ఎంతసమర్ధులమైనను మేముకూడ మధురవదలి దుర్భేద్యమైనదియు, స్త్రీలవలన నైనను రక్షింపబడవీలైనదియు నగు కుశస్థ
క్షాత్రయుగము హింద్వార్యులు.
క్రింద నునిచి వారిని ఇచ్చవచ్చినట్లు మార్చుచు రాజ్యము చేయు పద్దతి నారంభించినాడు డెరయను (Darius) అనియు తోచుచున్నది. అస్సీరియనులు (Assyrians) గాని ఇజిప్షనులు (Egyptians)గాని ఇట్టి యత్నము చేయలేదనియు, ప్రపంచమందలి మొట్టమొదట నిజమైన నిరంకుశచక్రవర్తి (Autocratic Emperor) డెరయనెయై యుండవచ్చుననియు మాతలంపు. కనుక సింధునదికి పశ్చిమముననున్న దేశమును వశపరచుకొని, దానిని తనపారసీక సామ్రాజ్యమున గలుపుకొని యొకసాత్రవుని క్రింద నుంచియుండిన డెరయనుయొక్క పద్ధతిని మనవారు--అందును ముఖ్యముగా విశాలరాష్ట్రముల కదినాధులగు తూర్పుప్రాంత ములవారు-ఆదర్శముగా గొనియుండిన నందాశ్చర్య మేమియులేదు. బహుశ: ఇతే చిన్నచిన్న రాజ్యములను పొట్టబెట్టుకొని నిరంకుశుడగు చక్రవర్తి పాలనము క్రింద మనదేశమున మొట్టమొదట హిందూదేశ చక్రవర్తి యగు సాంద్రకోటను అని గ్రీకులచే బిలువబడిన చంద్రేగుప్తుడు రాజ్యము చేసెను. ఈతని యాస్థానముననే మెగస్తనీసు (Megasthanes) అను చరిత్రకారుడు రాయబారిగా నుండెను. వీరకావ్యములందు పాటలీపుత్రముమాట ఎచ్చటను లేదు. మధరాజ్యమునకు రాజగృహ పట్టణమే రాజధానియని రెండు కావ్యములందును పలుమారు వచ్చినది. తరువాత కాలమున నుద్భవించిన సామ్రాజ్యములమాట కూడ వీరకావ్యములలో లేదు.
వారి సాధారణ రాజ్యాంగస్థితి.
అప్పటివర కింకను ప్రబలరాజ్యములు దుర్భల రాజ్యములనుండి కప్పముల గొనుటతోనే తృప్తినొందియుండెను. రాజ్యములను విశాలము చేసికొను నాచారము వాడుకలోకి వచ్చియుండలేదు.
అయినను, అప్పటికి రజసత్తాకపద్దతిమాత్రము సంపూర్ణము గాను నిరంకుశముగాను వ్యాపించియుండెను. వెనుకమేము చెప్పిన ప్రకారము ప్రజాసత్తాకపద్దతియు ప్రజతో నాలోచించి పరిపాలనజేయు పద్ధతియు, అచ్చటచ్చటా నుల్లేఖింప బడియున్నను, మొత్తముమీద వీరకావ్యములం దెచ్చటజూచినను రాజు నిధికరం ఎదుగులెనిది గాను, ప్రజల విధేయులజేసికొను నధికారము రాజునకు దైనదత్తముగాను ప్రశంసింపబడియున్నది. "రాజునకిట్టి యధికారమెట్లువచ్చె" నను ప్రశ్నకు తమయిచ్చ వచ్చినట్టు సమాధానము చెప్పుకొనిరి. అయినను రాజునకు గొన్నికర్తవ్యములు కలవనుమాటమాత్రమువారు మరచిపోలేదు. శాంతిపర్వములోని రాజధర్మవివరణమున, ఆరంభముననే యుదిష్టిరుడు భీష్ము నడుగును. "రాజశబ్దమెట్లువచ్చినది? తక్కిన యందరివలెనే రెండు చేతులును రెండు కన్నులును కలిగి వారితో తుల్యమగు జ్ఞానమును మాత్రమేకల మనుష్యునికి తక్కినవారిని పాలించు నధికారమెట్లువచ్చెను?" దీనికి భీష్ముని ప్రత్యుత్తరమిది. "కృతయుగమున రాజేలేడు. ఆకాలమున జనులందరు స్వతంత్రులయి ధర్మమును తామే నడపుచుండిరి. తరువాత మనుజులు క్రామక్రోధాదులకు వశులై అధర్మ మార్గానువర్తులై పాప కార్యములజేయసాగిరి. పాపము మిక్కుటమగుటవలన దేవతలకు
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
బాధలు కలిగినందున వారు బ్రహ్మయొద్దకుబోయి ఈయాపదను తొలగింపుమని వేదుకొనిరి. అంత బ్రహ్మదండనీతిని పెద్దగ్రంధముగా రచించి, దానిని శంకరునకు నేర్పెను. శంకరు డింద్రునకిచ్చెను. అతడు దానిని బృహస్పతికిచ్చెను. బృహస్పతి దాని క్లుప్తపరచి 3000 అధ్యాయములుకలగిదాజేసెను. దీనికి బృహస్పతినీతియని పేరు. శుక్రుడు దానినింకను సంగ్రహిపరచి 1000 అధ్యాయములలో నిమిడ్చెను. ప్రజాపతి యాశాస్త్రమును అనంగున కిచ్చెను. ఈ యనంగుడు తద్గ్రంధానుసారము ప్రపంచమును పాలించిన మొదటి రాజు. అతనిసుతుడు అతిబాలుడగువాడు తండ్రిమార్గము ననుసరించెను; కాని వానికుమారుడగు వేనుడు ధర్మాతిక్రమణము తో భూపరిపాలన మొనర్చి స్వేచ్చావర్తనుడయ్యను. కనుక ఋషులాతనివధించి అతని కుడితొడనుండి పృధువనువానిని సృజించిరి. పిమ్మట బ్రాహ్మణులును దేవతలును అతనితో నిట్లనిరి. "ఈభూమిని ధర్మశాస్త్రానుసారము నిష్పాక్షికముగా సమదృష్టితో బాలింపుము. బ్రాహ్మణుల శిక్షింపననియు వర్ణసాంకర్య్హమును ఆపెదననియు వాగ్దత్తముచేయును"పృధునట్లెవాగ్దత్తముచేసి తదనుసారము న్యాయముగా నేల యేలెను. బ్రాహ్మణులును దేవతలును స్వవచనా నుసారము అతనికి శ్రేష్టవస్తువుల నిచ్చిరి. అతడు భూమిమీద రాలను తీసివేయించి యదిపదునేను విధములగు గడ్దిని, మనుష్యలకును యక్షులకును ఇతరులకును కావలసియున్న వృక్షవర్గమును ఇచ్చునట్లుచేసెను. ప్రజారంజకుడగుటచేత అతడు "రాజు"
వారి సాధారణ రాజ్యాంగస్థితి
అని పిలువబడెను. * "తనయాజ్ఞ నెవరును మీరగూడదని విష్ణువు శాసించి తాను స్వయముగానే రాజుశరీరమును జొచ్చెను. ++ కావుననే ప్రపంచమంతయు దేవునకువలె రాజునకును మ్రొక్కెదరు. రాజగువాడు విష్ణూవంశముతోను దండనీతి యొక్క జ్ఞానము తోను పుట్టును." పురాతన హిందూదేశపు జిజ్ఞాసువులు రాజుయొక్క నిరంకుశాధికారము నీవిధముగా సమర్ధించిరి. రాజువిష్ణ్వంశ సంభూతుడయినను, ఈశ్వరదత్తమగు దండనీతి ననుసరించి న్యాయముగా ప్రజను పాలించుట అతనివిధి యనియు వారు నమ్ముచుండిరి. ఆకాలమున బ్రాహ్మణులు సాధారణశిక్షలనుండి తప్పించుకొనయత్నించిరి. కనుకనె స్మృత్యాదులందు బ్రాహ్మణుల దండించు విషయమున ప్రత్యేక నియమములు కలవు. ఈప్రకారము రాజులు, ప్రజనురంజింపజేయవలయునను తమకర్తవ్యములను నిర్లక్ష్యముచేసి క్రమక్రమముగా నిరంకుశులైరి.
రాజుయొక్క నిరంకుశాధికారము సత్పరిపాలనానిర్భంధము తోగూడియుండెనని వెనుక జెప్పియుంటిమి. తాయభీప్రాయమే మహాభారేతమునందు వేరొక యధ్యాయమున మరియొకవిధముగా సూచింపబడియున్నది. రాజునకును ప్రజలకును జరిగిన ఒడంబడికను బట్టి వారికిట్టి సంబంధమేర్పడినదని ఈయధ్యాయ
- రంజితాశ్చప్రజా: సర్వాస్తేన రాజేత శబ్ద్యతే॥శాంతి॥
++స్థానసంచాకరొద్విష్ణు, స్వయమేవ్నవాతేన॥ । నాతివర్తివ్యతేకశ్చి, ద్రాశంస్త్వామితిభారత:తపసాభగవాన్విష్ణు. రావివేశచభూమిపకిశాతికి
క్షాత్రయుగమునటి హింద్వార్యులు.
మునసాధింపబడినది. ఇట్టి యభిప్రాయమే పాశ్చాత్య విద్వాంసులలో గొందరు - హాబ్సు (Hobbs) మున్నగువారు - సూచించియున్నారు. "పూర్వకాలమున రాజనువాడు లేకపోవుట వలన ప్రజకనెక కష్టములు సంభవించెను. అందువలన జనులంద రేకీభవించి ఇతరుని దూషించినవాడును, కొట్టినవాడును, వరునిభార్యను చెఱచువాఢును, శిక్షంపబడవలయునని నియమము చేసికొనిరి. కాని యీనియమమును అమలులోబెట్టుటకు వలయుశక్తిలేనందున, వారందరు ప్రజాపతి కడకుబోయి, తమకొక పాలకుని నియమించుమనియు, అట్టిపాలకుని తాము గౌరవింతుమనియు, అతడు తమ్ము కాపాడవలసియుండుననియు, వేడికొనిరి. బ్రహ్మ మనువును ప్రజాపాలనము చేయుమని కోరెను. కాని మనువు అందున కొప్పుకొనక, జన్లు పాపాత్ములు కనుక వారిని పాలించుట పాపహెతువనియు, ప్రజాపరిపాలనము కష్టకార్యమనియు చెప్పెను. అంత జ్నులు మనువుతో నిట్లనిరి. తమరు భయపడవలసిన పనిలెదు. పాపాత్ములగువారే తమ పాపఫలము ననుభవింతురు. మీకు మాయొద్దనున్న్ పశువులలోను బంగరములోను అయిదవ భాగమును మాధాన్యములో పదియభాగమును ఇచ్చెదము. వివాహఋతువులో ఒక సుందరిని మీకిచ్చెదము. మాలో ముఖ్యులగువారు సాయుధులై మీకడవర్తింతురు. మమ్ము సుఖముగాను నియమబద్ధముగాను పాలింపుడు. మాకి లభీంచు పుణ్యమున నాల్గవభాగమును మెకిచ్చెదము. అంత మనువు వారివిన్నపము నంగీకరించి కార్యారంభమొనర్చెను. అతడు శత్రువుల నందఱ నిర్మూల
వారి సాధారణ రాజ్యాంగస్థితి.
పరచి జనులన్ ధర్మమార్గమున నడిపించెను. కనుక జనులు సదా తమకొరకొక రాజు నేర్పరచుకొనవలయున్." ధర్మమును నడపెదనని మనువును, దానికి ప్రతిగా పన్నుల చెల్లింతుమని ప్రజలను ఒడంబడిక చేసికొనిరను నబిప్రాయము చాలశ్రేష్టమైనదే కాని నిరంకుశప్రభువులు, మనదేశమందేమి ఇతరదేశములందేమి తమ వాగ్దత్తమను చెల్లించుకొనియుండుట అరుదుగా గాన వచ్చుచున్నది.
ఎంతటి నిరంకుశుడైనను, ఎంతటి భోగపరాయణుడైనను, రాజు, మొత్తముమీద శాంతిని స్థాపించుటయందును, న్యాయముచేయుట యందును సామాన్యముగా శ్రద్ధళువైయుండెను. రాజపాలనమ్న నున్నజనులు అరాజకముగా నున్న దేశములోని ప్రజలకంటే సర్వద ఎక్కువ్బలవంతులుగను ఎక్కువ సుఖులుగను ఉండుచు వచ్చిరి. ఆరాజకమువలన్ నష్టములు ఉభయ వీరకావ్యములందును విస్పష్టముగా వర్ణింపబడియున్నవి. బహుశ: జనులకుగల అరాజకభయమే రాజుల యధికారమును బలవత్తరముగ జేసియుండ వచ్చును. అయోధ్యకాండములోని 67 వ అధ్యాయమున, దశరధుడు మృతినొంది రాముడును భరతుడును దేశమున లేని సమయమున కర్తవ్యమును నిర్ణయించుటకు జనులు సభచేసిరి. ఆసందర్భమున నిట్లున్నది. "రాజులేని దేశమున మేఘములు వర్షింపవు. పిడికెడు డాన్యమైనను విత్తరు. పుత్రులు జననీజనకులకును, భార్యలు భర్తలకును విధేయులుగా నుండరు. ఏమనుజుడును తనసొత్తునుగాని తనభార్య సహవసము గాని యనుభవింపజాలడు. సత్యము
క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.
నకు గౌరవముండదు. వేదాధ్యయనపరులగు బ్రాహ్మణులు యాగాదులు జేయరు. ఇక పండుగల మాటయు, సాంఘిక సమావేశముల మాటయు చెప్పవలయునా? ఆభరణాలంకృతులగు జవ్వనులు సాయంత్రములందు పురము బయటి తొటలకు బోజాలరు. జనులు తలుపులు దెఱచి నిదురింపజాలరు. వేగముగ్ల బండ్లలోఅడవులకు బోననేగరు. వర్తకులు దేశసంచారము చేయలేరు. జనులు ధనుర్విద్యాబ్యాసము చేయనేరరు. ఊరూర దిగుచు ఎచ్చటకొరిన నచ్చట విశ్రాంతిగొను జ్ఞానులు కానరారు. వసంతకాలపు నవనవలాడు వృక్షములవలె ప్రకాశించుచుండు యౌవనులగు రాకొమరులు కన్పట్టరు. జలములేని నది వలెను, పచ్చికలేని యడవివలెను, పసులులేని కాపరివలెను(?) రాజులేని రాజ్యముండును. శరీరమునకు నేత్రములెట్లు ప్రధానములో, దేశమునకట్లె రాజు ధర్మపాలనార్ధముమవసరము. అహో! మంచిచెడుగులను వేరుపరచు రాజు లేనిచో, ఎచ్చటజూచినను అంధకారము నిండియుండును; ఏమియు కనుప్డదు." #రామాయణములోని సమస్తవర్ణనలవలెనే ఆరాజకమునుగూర్చిన పైవర్ణనకూడ చాలమనోహరముగా నున్నది. దుర్మార్గులగువారి పోకడల నడచుటకు రాజులేని పక్షమున కలుగు అనర్దములను గూర్చి మనవారెంత భయపడుచుండిరో పైవర్ణనయే చెప్పుచున్నది. ఈభయము అతివిస్తారమైనందున జనులు రాజ్యాంగమున శ్రద్ధగొనక, పరదేశీయులైనను సరే దేశమున శాంతిని
- అహోతమైవేదంస్యాన్న ప్రజ్ఞాయేతకించన! రాజూచేస్తున్నభవేల్లొకే విభర్జసాధ్యసాదుని: అయో॥
వారి సాధారణ రాజ్యాంగస్థితి.
నెలకొల్పుదుమని ధైర్యమిచ్చు ఎవ్వారికినను విధే యులైయుండ సిద్ధపడియుండిరి. రజు లేకఓవుటవలన గలుగు నష్టములు మహాబారతమునందలి శాంతిపర్వములోని 6-7-6-8 అధ్యాయములలోగూడ వర్ణింపబడినవి. ఈ వర్ణన రామాయణములోని వర్ణనయంత రమ్యముగా లేకపోయినను, ఎక్కువ ప్రత్యక్షముగా గానవచ్చుచున్నది. అచ్చ్ట్ నిట్లున్నది. "రాజు అసలే లేనట్టిగాని దుర్బలుడుగనున్నట్టిగాని దేశమునుజయించుటకై సమర్ధుడగు మనుజు డెనడేని కోరుచుండెనెని జనులాతనికి స్వాగతమిచ్చుటయే మంచిది. ఏలయన, అరాజకదోషములకంటే భయంకరములు మరేవియు లేవు. అతడుసంతసించెనేని అంతయు బాగుగానడుచును; ఆగ్రహించెనేని అతదు సర్వనాశనముచేయును. తిప్పలపెట్టక పాలిచ్చు ఆవును బాధింతురు." $ రాజ్యాంగమునందు రాజునకు ఆలోచనచెప్పు నధికారము తమకు గలదను మాటను జనులెట్లు మరచిరో మనకిఛట్ స్పష్టముగా గానవచ్చుచున్నది. జనులు తమ్ము దాము బలవంతుడగు వానికి పాలివ్వవలసిన యావులుగా భావించిరి. ఈవిధముగ క్షత్రయుగాంతము
$అధచెరభినర్తేత, రాజ్యార్ధి బలవత్తర: అరాజకాణిరాష్త్రాణి హత వీర్యాణివాపున ॥ప్రత్యర్గమాభిపూజ్యస్య: దేవదేవనుపశ్యెత సమగ్రంధఇంబవేత్॥బలనాన్ హిప్రకుపిత: కుర్యాన్ని శ్శేషతామసి॥భూయాంసంలభదేక్లేశం యాగౌర్బంతిదుర్దుహ । అభయాస్తదుహా రాజన్నైనతాం వితురంశ్యపి॥శాంతి:
క్షాత్రయుగమునాటి హింద్వారులు.
నాటికి హింద్వార్యుల రాజ్యాంగదశ విషాదకరముగా నేల కూలెనని దెలియుచున్నది.
రాజగువానిని ఎవరును అంటనైన కూడదనియు, అతని వచనములు దేవవాక్యములనియుకూడ నవస్థకు ఆకాలము వారు పాల్పడిరి. రాజు విషయమున దురుద్దేశములుకలవాడు ఈలోకముననేగాక పరలోకమునకూడ శిక్షననుభవించునని వారి తలంపు. *సుప్రసిద్దమగు నీశ్లోకము శాంతిపర్వమున నున్నది. $"మన్యుడేకదాయని రాజును చులకనగా జూడగూడదు. రాజనగా నరరూపముననున్న గొప్పదేవత." అధర్ములను శిక్షించునపుడును, నధర్ములను రక్షించునపుడును, "రాజు" యముడుగాను, "ఒకనియొద్దనుండి రధమును లాగికొని మరియొకనికిచ్చునపుడు "కుబేరుడు" గాను ఎంచబడు చుండెను. రాజు చేయుపనులు సక్రమములా యక్రమములాయని ప్రశ్నించు అధికారము ఎవరికిని లేదు. రాజద్రవ్యావహారి ఈలోకమున శిక్ష నొందిటయేకాక అతిలోతైన నరకూపమునకూడ కూలునని నమ్మబడుచుండెను. వేయేల? రాజుయొక్క దైవాంశ జనుల మనములందుధృడముగా నాటుకొనినందున, వారాతనికి జూపు విధేయత దాస్యముకు సమానమగు స్థితికివచ్చెను.
రాజునకుగల యధికారములలో నెల్ల గొప్పది జనులను
- యుస్తస్యపురుష: పాపం, మనసాప్యనచింతయెత్ ।మహాక్లిష్త:, ప్రేత్యాపినరకం శ్రజేత్॥
$నహిజాత్వమంతన్యో, మనుష్యఇతిభూమిప: । మహదేవతా హ్యేషా, నరరూపేణతిష్టతి॥
వారి సాధారణరాజ్యాంగస్థితి.
శిక్షింప గల్గుట మహాభారతమున దీనిని "దండ" మని వాడబడి యున్నది. కాలక్రమమున మూఢాభిప్రాయము లెన్నియో ఈ "దండ"ముయొక్క యధార్దమగు నర్ధముచుట్టును మూగెను. శాంతిపర్వములోని 1`2-122 అధ్యాయములలో నీ "దండ"ముయొక్కయు, తదాకారముయొక్కయు, దాని యుత్పత్తియెక్కయు వర్ణనలు కలవు. ఈ "దండము" ప్రజాపతివలన సృష్టింపబడెననియు, సర్వజనులయెడ నిష్పాక్షికముగా వాడబడిదగిన దనియు మేమిదివరకే వ్రాసియున్నాము. బ్రహ్మదీనిని క్షత్రియులకే యిచ్చెను. రాజు దీనిని యధేచ్చముగా ప్రయోగింపగూడదు. బ్రహ్మ విధించిన సమయముల ననుసరించి దీనిని వాడవలయును. "మానవజీవితము స్వల్పకాల పరిమితమగుట వలన క్రమముగా 3000 అధ్యాయములలోను 1000 యధ్యాయములలోను రచించిరి. మహాభారతముయొక్క తుది *నిర్మాణకాలమున నీ రేండు గ్రంధములు ఉండియుండవచ్చును, ఇప్పటికిని ఇట్టిపేర్లు గల గ్రంధము లున్నవి కాని యవి సౌతి # కాలమున నుండినవి కాక పొవచ్చును. శాంతిపర్వములోని రాజధర్మఘట్టము
- మహాభారతము మూడుమారులు నిర్మితమయ్యెననియు, ప్రస్తుతాకారము తుదియనియు, వైద్యా గారిభావము మా.హ.
$మహాభారతముతుదిమారు నిర్మించినవాడు (సౌతి) వైద్యాగారియాశయము(వైద్యాగాని "మహాభారతము"అను గ్రంధమును జూడుడు.)
క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.
పైగ్రంధముల సారాంశమై యుండవచ్చును. దండ నీతిఈశ్వరే దత్తమని యొప్పుకొనబడుటవలన, రాజుల నిరంకుశ వర్తనమునకు కొంత యాటంకము కలిగి యుండవచ్చును. మత సంబంధమగు భయమువలన, రాజులు ప్రజాపతి విధించిన నియమముల ననుసరింప చాలవఱకు బద్ధులుగా నుండియుండవచ్చును. ----