Jump to content

క్షాత్రకాలపు హింద్వార్యులు/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి భూగోళశాస్త్రజ్ఞానము

వికీసోర్స్ నుండి

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు - వారి భూగోళశాస్త్ర జ్ఞానము

క్షాత్రయుగారంభమున హింద్వార్యులకు భూగోళశాస్త్ర జ్ఞాన, మెంతయుండునో యూహించుట కష్టము కాని తద్యుగాంతము నాటికి వారికి హొందూదేశమునుగుఱించియు చుట్టుప్రక్కల నున్న దేశములనుగురించియు బాగుగా దెలిసియుండేనని చెప్పవచ్చును. ప్రపంచభూగోళమును గుఱించి వారికి వివరములంతగా దెలిసియుండలేదు. ఆప్రకారము తెలియనిచోట్లయందెల్ల వారు ఊహతో పనిగొనిరని తెలిసియున్నది. వీరికావ్యములందు వచ్చి యున్న వర్ణనలనుబట్టి వారి "ప్రపంచము" ఎట్టిదిగానుండేనో చూతము.

    మహాభారతానుసారము:-ప్రపంచము అనేక ద్వీపములు గా భాగింపబడియున్నది. మనముందు భూభాగమునకు "జంబూద్వీపము" అనగా జంబూవృక్షముకల ద్వీపము అని పేరు. ఈద్వీపము లనేక చ్వర్షములుగా విభజింపబడి యున్నది. *(పటము జూడుడు) భూమికి ఉత్తరౌ సరిహద్దున క్షీరసముద్రమున్నది. దక్షిణపు హద్దున లవణసముద్రము కలదు. పూర్వ పశ్చిమ

  • ఈవర్షములో కొన్ని నిజమైనవిగను కొన్ని యూహాజనితములుగను దొచుచున్నవి.

క్షాత్రేయుగమునాటి హింద్వార్యులు.

లందును సముద్రములున్నవి. *భూమధ్యప్రదేశమున మేరు పర్వత మున్నది. దీనికి దక్షిణమున మూడు పర్వతపంక్తులు పూర్వ పశ్చిమదిశలవ్యాపించియున్నచ్వి. వీనివేళ్ళు నిషధపర్వతము (ఆల్టాయ్); హేమకూటము (కారాకోరము) హిమాలయము; హిమాలయమునకు దక్షిణమున భారతవర్షమునూదేయక్షాంశమునున్న ఇతరదేశములును కలవు. వీని కుత్తరమున హైమవతవర్షమున్నది. నిషధపర్వమున కుత్తరమున ఇలావృతవర్షము కలదు, మేరువు, చిన్ననగు మఱి రెండు పర్వతములు (మాల్యవంతము గంధమాధవము, అనునవి) ఈభూభాగమును నాల్గు చిన్నభాగములుగా జేయుచున్నవి. ఈ నాల్గుభాగములలోనొకటి జంబూద్వీపము. ఈద్వీపమునకీపేరు అతివిశాలమగు నొక జంబూవృక్షమునుండి యుత్పత్తియై ఉత్తరకురు దేశమువైపు ప్రవహించిన జంబూనదినిబట్టి వచ్చినది. తక్కినమూడింటిలో పశ్చిమదిశనున్న రెండు దేశములకు 'భద్రాశ్వము, ' కేతుమాల, యని పేళ్లు. పైనవచ్చిన హైవవతవర్షమునందు ఇప్పటి జపాను, మంచూరియా, మంగోలియా, ఉత్తరతుర్కిస్థానము, జర్మనీ, ఇంగ్లాండు చేరి యుండవలెనని యనేకుల యభిప్రాయము ఇక మేరువు అనునది ఉత్తరధృవసమీపమున నుండెనని యూహించినచో ఇలావృత్తవర్షమున ఇప్పటి రష్యా, స్వీడను, నార్వేలు ఒకవైపునను ఉత్తరామెరికా ఇంకొకవైపునను చేరియుండెనని చెప్పవచ్చును ఇచ్చటిభూమి బంగారపుదని మనవారు చెప్పియున్నారు. ఉత్తర కనడాలోని యెకభాగమున బంగరుదొరకుచున్నమాట


  • ఈససముద్రముల పేర్లు మాత్రము కానరావు.

వారి భూగోళశాస్త్రజ్ఞానము.

వాస్తెవమేకాని ఈసామ్యము కాకతాళీయముగా సంభవించినదని తోచుచున్నది. ఈవర్షమునందే చేరియున్న రష్యాపైబేరియాలు ఇప్పటికాలమందంత సుఖప్రదమైనవి కాకపోయినను పురాతనకాల మున నిప్పటికంటె నెక్కువ వాసయోగ్యములుగా నుండి యుండ వచ్చును. ఇంతేకాక అని యార్యుల అతిపురతన నివాసస్థలము లైనకారణమున వారు ఆప్రదేశమును "పుణ్యభూమిగ నెంచుచుండి న్ నుండవచ్చును. మేరువున కుత్తరమున నున్న వని చెప్పబడి యున్న మూడు పర్వతముపంక్తులను మాత్రము మనవారెఱిగియే యుందిరనుట నిస్సంశయము. ఏలయనగా కైలాసపర్వతమున కుత్తరేముననున్న హరివర్షమునం దొక విశాలమైన ఇసుక యెడారి యు నొకసరోవరము ఉండినట్టు వర్ణింపబడియున్నది. మహప్రస్థానమునందు గూడ పాండవులు నుత్తరాభిముఖులై పొవు నపుడు ఒక్ యిసుక యెడారిని దాటిరని చెప్పబడియున్నది. ఈ యిసుకయెడారి యిప్పటి "గోబి" యెడారియేయనియుసరొవరము "అరల్ సముద్రము" (Sea of Aral) అనియుస్పష్టముగా దెలియుచునె యున్నది కదా.

కొంతయదార్ధమును కొంతయూహాజనితమును నగుపైవర్ణనయే ఇంచుకమార్పులతో రామాయణమునందు వచ్చినది; కాని రామాయణమునందు ఊహకు నిరంకుశ ప్రభుత్వములభించినందున మఱింతగందరగోళము సంభవించినది రామాయణమును తుదిమారువ్రాసిన యాతనికి హిందూదేశపు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

భూగోళవివరములు సరిగా తెలియవు. తెలసినభాగమంతయు నొక ఉత్తర హిందూస్థానము మాత్రమే. అట్లుండియు, అతడు సుగ్రీవుడు సీతాన్వేషణమునకై వానరులను నలుదెశలకంపుచుండిన కధగల సంధర్భములోల్ ప్రపంచభూగోళమును కేవలమూహపోహలతో నింఫి వర్ణించియున్నాడు ఈవర్ణనమునందు మేరువు ఉత్తరము నుంది యెగితి ప్రపంచముయొక్క దక్షిణదిశాంతమున వచ్చి నిలచినది రామాయణపు తుదికతన్ జోతిశ్శాస్త్రజ్ఞానము లేని వాడగుట చేతకాబోలు, మేరువు పశ్చిమముననుండనిచో సూర్యుడు మేరువుచుట్టు తిరుగుటెట్లు సంభవించునని సందేహపడి యామేరువును పశ్చిమదిశాంతమున స్థాపించెను!

     సూర్యుడు తూర్పుకొండలయందుదయించి పడమటి కొండలలో నస్తమించుననియు ఈ కొండలు రెండును ప్రపంచము నకు పూర్వపశ్చిమదిశలందు హద్దులనియు, వానికావలి ప్రదేశములు మనుష్యులు ప్రవేశించుటకు వీలులేనివనియు అస్తసమయమున సూర్యుడు మేరువువెనుకకుబోయి, పడమటికొందనుండి యుత్తరమునకుబోయి యుదయసమయము వరకు తూర్పుకొండవద్దకివచ్చుచుండుననియు మనవారి యూహ. మనమురొకరినె యననేల! భూమిపలకవలెనున్నదని నమ్ముచుండిన పూర్వకాలపువారందరికిని పశ్చిమము నకుబోయి యదృశ్యుడైన సూర్యుడు ఉదయము వఱకు తూర్పున కెట్లువచ్చుచున్నాడో యనునది మహదాశ్చర్య కరమగు సమస్యయైయుండెను!

అప్పటికాలపు హింద్వార్యుల ప్రపంచభూగోళజ్ఞానము సరియైనదిగా నుండకపోయినను, వారికి మనదేశమునుగుఱించి

వారి భూగోళస్త్రజ్ఞానము.

యు, మనచుట్టుప్రక్కలనున్న దేశములగురించియు బాగుగాదెలిసి యుండుననియు యెఫ్ఫుకొనకతప్పదు. హింమాలయము, కారకోర్ము, అల్టాయ్ అనుమూడు పర్వతపంక్తులును. తిబెత్, తుర్కిస్థానము, సైబీరియాల యందుండిన "గోబీ" మున్నగు నెడారులును, అనేకసరస్సులును వారికి దెలిసియుండెను. గ్రీకులను, వషికాయనులను, సిధియనులను, హూణులను, చైనీయులను, ఉత్తరప్రాంతములందు నివసించు అనాగరికజాతులను వారెఱింగియుండిరి. అలెగ్జాండరుని దండయాత్ర యైన పిమ్మట మనవారికి పైనబేర్కొనిన జాతులవారి పరిచయము కలిగెనని కొందఱువదింతురుకాని యదిసరికాదు. మహాభారము లోని యొకశ్లోకము *నందు ఉత్తరదిశయందలి మ్లేచ్చులు పేర్కొనబదియున్నారు. వారిలో హిందూదేశమున కుత్తర్మున నివసించుచుండినజాతులన్నియు చేరియున్నవి. క్షత్రయుగాంతము న అనగా అలగ్జాండరుదండయాత్రకు పిమ్మట ఈజాతులవారిని మనవారెఱుగుదురనుటయందు సంశయములేదు. కాని అంతకు పూర్వము కొన్నిశతాబ్దముల కాలమునుండియే మనవారు ఈజాతు లకు కృతపరిచయులేదనుటకు కారణములుకలవు. "డెరయను" అనుపారశీకదేశపురాజు సింధునదికి పశ్చిమముననున్న భూభాగమును తన సామ్రాజ్యమున గలిపికొని దానినొకసత్రపీ(Satrapy) గానేర్పఱచెను. కనుకపారసీక


  • యవనాశ్వనకాంభోజా, జారుణా మ్లేచ్చజాతయ: । సకృద్గృహా కులత్మాశ్చ, హూణా:పారసికైనసహ । తధైనరమణాశ్వినా॥, తధైనదశమాలికా:॥ --భీష్మపర్వము. అధ్యా:9

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

రాజదానియందును, పారసీక సేవలయందును జయింపబడినమన వారిలోననేకులుండియుందురు. కనుక మనవారు గ్రీకులను, సిధియనులను లెగ్జాండరుని రాకకెన్నియోశతాబ్దములకు పూర్వము ఎఱిగినవారైయుండవలెను. హీరోదోటసు, అనుచరిత్ర కారుడు డెరనయను, పాలనముక్రిందనున్న సాత్రపీలను వణికించుచు ఇరువదవ పాత్రసీయగుమనదేశనునదేశము (హిందూ దేశము) విశేషజనసంఖ్యకలదనియు, దీనికి తూర్పుసరిహద్దున నొకయెడారియున్నదనియు చెప్పియున్నాడు. హీరోడోటసు పై చరిత్ర గ్రంధమును క్రీ.పూ.450 సంవత్సరప్రాంతమున వ్రాసినాడు. కనుక ఆకాలమునవారిని గ్రీకులెఱిగియుండిరనుటస్పష్టము, అంతే కాదు. అస్సీరియనులు (Assyrians) తోడను చాల్డియనుల (Chaldeans) తోడను హింద్వార్యులకు అంతకుపూర్వమే సత్వ సంబంధములుండేను. కనుక మాయభీప్రాయమున; మనవారు యవను లనబడు అయోనియనులను గుఱించి క్రీ.పూ 450 సంవత్సరం కంటే పూర్వమే చెప్పుకొనగా విని యుండవచ్చును. పరిచయము మాత్రము "డెరయను" కాలమునుండి కలిగియుండవచ్చును. మహాభరతమునందలి యొక *శ్లోకమునం దున్నట్లు, అలెగ్జాండరుదండయాత్ర యైనతరువాత వారితో మనవారికి మఱింత సమీపసంబంధ మేర్పడియుండవలెను. యవనులనుగూర్చి చెప్పిన యీమాటయే పారసీకులు, సిధియనులు మున్నగు ఉత్తరదేశ వాసులకు గూడవర్తించు చున్నది.

 ఇమ హిందూదేశమునకువత్తము. క్షాత్రయుగరంభమునుండి

  • సర్వజ్ఞాయవజారజను, శూరశ్త్చినంశేషిత: ॥ కర్ణపర్వముజ్.

వారి భూగోళశాస్త్రజ్ఞానము.

తద్యుగాంతమునాటివఱకును కొంతస్పష్టముగనైన నేమి కొంత యస్పష్టముగనైననేమి, మనవారుఈదేశము నామూలాగ్రమెఱి గియుండిరి. వేదమునందు సముద్రముమాటవచ్చియున్నది. సింధు నదీప్రవాహమువెనువెంట నౌకలలోబోయి యుండిననేకాని వారికి సముద్రపు సంగతి తెలిసియుండదు. వేదమునందు పంజాబు నందలి నదుల పేళ్ళను, గంగాయమునల పేళ్ళును, (వీనియుత్పత్తి స్థానములకు సమీపమున వారీనదులనెఱిగియుండిరి.) వచ్చి యున్నవి. రామునికాలమున మనవారు తూర్పుసముద్రమను, గోదావరినదిని, కొంతయస్పస్టముగానైను లంకాద్వీపమును, తెలిసి యుండిరి. శ్రీకృష్ణునికాలమున ఉత్తరహీందూస్థానము నామూలాగ్రముగను,దక్షిణహిందూస్థానములోని చాలభాగమును మనమునఱిగియుండిరి. ఇంతయేల? మహాభారతము తుదిమారు నిర్మింపబడుటకుముందే, అలెగ్జాండరుని దాడికిముందే, మనవారికి హిందూదేశము బాగుగా దెలిసియుండుననుటకు సందియపడ వలసిన పనిలేదు.

అయినను పాశ్చాత్య విద్వాంసులు ఈవిషయమున తప్పుగా నభీప్రాయపడి యున్నారు. వారి వ్రాతలనుబట్టి చూచినచో, బుద్దుని కాలమున మనవారికి దక్షిణదేశము తెలియనేతెలియదు. చంద్రగుప్త కాలప్రాంతమున మనవారు లంకాద్వీపమున నివసింపబొయిరట! బుద్దుని నిర్యాణ సంవత్సరమున లంకాద్వీప మున మొట్టమొదట ఆర్యజనావాసమేర్పడెనను నభిప్రాయము తప్పనియు, నికాయములు వ్రాయబడుటకుముందు ఆర్యులు సింహళమునకువచ్చుట సంభవించి యుండదనియు, రైసు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

డేవిడ్సు వ్రాసియున్నాడు. ఇట్టివారమున కాధారమేమనగా, బుద్దుని కాలమున రచింపబడిన పైగ్రంధములలో చెప్పబడియున్న 16 రాజ్యములలో ఒక రాజ్యముమాత్రము వింధ్యకు దక్షిణమున గోదావరితీరమునుండినట్టు చెప్పబడియుండుటయట. "ఆగ్రంధములలో దక్షిణహిందూస్థానము, లంకాద్వీపము, పేర్కొన బడియుండకపోవుటే కాత గంగానదికి తూర్పుననున్న వంగ, ఒరిస్సా దేశములుకూడ లేవు; దక్షిణాపధమురాలేదు. "దక్షిణాపధమునకు వారువచ్చుట నికాయముల కాలమున సంభవించినది." "వ్నయ" గ్రంధమునందు "భరుకచ్చ" పేరును, "ఉదన" గ్రంధమునందు "సుష్పరక" పేరును వచ్చినవి" "రామాయణీయప్రాముఖ్యతగల దక్షిణహొందూదేశమును గుఱించియు లంకాద్వీపమును గుఱించియు ఉల్లెఖనమే లేకపోవుటయు, ఆర్యులపురోగమనము అంతపరిమితముగా నుండునదియు ఆలోచింపదగిన యంశములైయున్నవి" $ అని రైసుడేవిడ్సువ్రాసెను.

   పైవాదము మామనస్సునకు అసంగతమైనదిగా దోచుచున్నది. బుద్దునికాలపు ఒకగ్రంధమున పేర్కొనబడిన 16 రాజ్యములలో చెప్పబడనిరాజ్యము ఆకాలమున రెండుమారులు వచ్చియున్న షోడశమహారాజుల పేళ్ళలో లెని మహారజెవ్వడు పురాతన హిందూదేశమున నుండలేదనువదము వంటిది. పూర్వ కాలపు గ్రంధములందువచ్చిన యిట్టిపేళ్ళపట్టికలుఇ సమగ్రమమై నవియని యూహించుటకు కారణము కానరాదు. అగ్ర

$ Buddhist India by Rhys Davids. పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/108

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

వారు అలెగ్జాండరునకు చెప్పియుందిరని ఎరస్తనీసు వ్రాసిన గ్రంధమునగలదు. ఈ గ్రంధమున మనదేశమునందలి ముఖ్య ప్రాంతముల వైశాల్యములు చూపబడియున్నవి. దూరమును గురించి యావివరములు నేటికిని సరిఫోవుచున్నవనియు అంత పురాతన కాలమున మనవారికి దేశమునుగురించి యంతటివివరములు తెలిసియుండుట గొప్ప విషయమనియు, కన్నింగ్ హాము (General Cunningham) ఆశ్చర్యమును ప్రకటించియున్నడు.#

               --==---

  1. The close agreement of the discussions given by Alexander's informants with the actual size of the country is very remarkable and shows that the Indiana t that early date of their history had a very accurate knowledge of the form and extent of their native land.

(Cunnigham's Ancient Geography of India)