క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన

మలిన మౌ నా హృదయము ధామ మెటు లయ్యె

నతివిశుద్ధము మధురము నఘరహితము

ప్రణయమున కంచు సందియపడుదు వేమొ!


ప్రేయసీ! శర్వరీ తమోవీథుల బడి

చందురుడు రాడె పూర్ణతేజస్వి యగుచు?

అఘవిదూషిత మీ హృదయంబునందె

ప్రేమ కోమలతమము పవిత్ర మయ్యె.