క్రీడాభిరామము/ఆరవ భాగము
<poem>
శ్రీకాకుళపు తిర్నాళ్ళు
దవనపున్నమ కాకుళాధ్యక్షుడైన తెలుగురాయడు దేవతాధీశ్వరుండు భువనహితముగ నుత్సవం బవధరింప నందు బోయితి మీ పోయినట్టి యేడు
కారవేల్ల మతల్లికా కల్పవల్లి కడుపు నిండార గాంచిన కొడుకుకుర్ర జార చోర మహాధూర్త చక్రవర్తి దేవవేశ్యాభుజంగుండు తెలుగుభర్త
పసిడికోర వేడిపాలారగించిన బుల్లసిలిన యధరపల్లవమున విప్రకన్య చనువు వెలయించుచున్నాడు విశ్వమునకు కాకుళేశ్వరుండు
ఈరసమెత్తు వేదములు హ్రీ వహియించు బురాణసంహితల్ సౌరభహీనమౌ నుపనిషత్తులు లేబడు నాగమావళుల్ గారవముల్లసిల్ల సరికాకుళనాథుడు నాగదేవ భ ట్టారకునింట బుట్టి ప్రకటంబుగ వేడుక నాదరింపగన్
గరుడస్తంభ ప్రతిష్ఠాకలన మొదలుగా గల్పమంత్రోక్త పుష్పా ధ్వర పర్యంతంబు కృష్ణాతటిని తటమునన్ ద్వాదశక్రోశ ధాత్రీ పరివేషాభ్యంతరశ్రీ పరమపదమునం బర్వకాలంబునందున్ బరనారీ సంగమాదుల్ భగవదనుమతిం బాపములుగాక యుండున్
వ్యామగ్రాహ్య నితంబ బింబ కుచ హారాభీల భద్రాకృతుల్ కామాంధల్ వెలనాటి కోడెవిధవల్ కాకొల్ని తిర్నాళ్ళలో నా మాంధాత్రుడు భీమసేనుడు హిడింబాధీశ్వరుండోపునో యేమోగాని తెమల్పనేర రితరుల్ హేలారతిక్రీడలన్
పేర్చిన సందడిం బెదవి పీల్చి రయంబున జన్నులొత్తి చే దూర్చి యనంగమందిరము దూకొని కూరిమినీరు జర్రనన్ గార్చుకొనంగ జేసి యిరుకౌగిట నుప్పరమెత్తి యేటికిం దార్చి రమింతు రూళుల వితంతువులం దిరునాళ్ళ పల్లవుల్
ముంజె పదనైన శంబర భంజనుగేహములు గలుగు బ్రాహ్మణవిధవా పుంజము లుండగ నూరక లంజియ లేమిటికి కాకుళయ తిరునాళ్ళన్
జవరాలి బొడగన్న సన్న్యాసిపై నేయు దులసి లేజికురాకు తూపు మరుడు వేదవిప్రునిగన్న విధవపై ఝళిపించు దర్భపల్లవహేతి దర్పకుండు కటకారకుల కన్య గనిన హాళికుమీద బొడుచు బూమునికోల పుష్పశరుడు నాడింధముని గన్న నాతిపై నేయును నలరు జిచ్చరకోల నంగభవుడు
బెరసి వెన్నెల గాయంగ బేరకమ్మ పులినతలముల నాయాయి కొలములెరిగి తాల్చు శస్త్రాస్త్రములు జారదంపతులకు నసమబాణుండు తిరునాళ్ళ నన్నినాళ్ళ
అని యనంతరంబ యా ముందటం జనుదెంచు వితంతుసమూహముం గని యాశీర్వదింప వలయునని
వితంతువులు
చెలగి చెలగి పొత్తిచీరలు గట్టెడు మాసకమ్మకు దీర్ఘమాయురస్తు సారెసారెకు దేవసదనంబులకు నేగు చెడిపెకు సంకల్పసిద్ధి రస్తు నిత్యంబు వ్యభిచారనిష్టతో నుండెడు విధవకు బుత్రాభివృద్ధి రస్తు దళముగా దులసిపేరులు ధరించినయట్టి విశ్వస్త కారోగ్యవిభవ మస్తు
మిండముండకు సంపత్సమృద్ధి రస్తు పరచుతెంపికి నిత్యసౌభాగ్య మస్తు వదరుబోడికి నీప్సితావాప్తి రస్తు బలువితంతుకు మైథునప్రాప్తి రస్తు
అని యట చనునప్పుడు
(…..)
అనిన గాంధర్వి పరదేశపట్టణంబుల వితంతువుల చేత వక్షఃకుట్టనంబు సేయించుకొన మరిగి నీ వెట్టు మమ్ముం దలంతువు పదపద విచ్చేయు మనుచు నీర్య్షా కుటిలంబగు కటాక్షంబునం జూచిన
లవలవ జన్నుదోయి గదలన్ దొలుకారు మెరుంగుదీగలం గవకవ నవ్వుడాలు దెలికన్నుల మించులు చౌకళింపగా నవనవ యౌవనంబు గల నాటి భవ త్పురుషాయితోద్ధతుల్ శివశివ యెన్ని భంగులను జిత్తములో మరవంగ వచ్చునే
కార్యాంతర వ్యాసంగంబున నార్యవాటికిం బోవుచున్నవాడ మన మదనరేఖాకన్య దర్పణావలోక ముహూర్తంబు సుముహూర్తం బయ్యెడు బోయివచ్చెదనని
నాగసొరము
వెడలి పశ్చిమదిశ నాల్గుగడియలంత ప్రొద్దు గలుగంగ నడువీథి బోయిపోయి కేళిసఖుడును దా నాలకించి చనియె నాగసొరముల మ్రోత యన్నాగరికుడు
పాములాట
నాగస్వర సుషిర సర న్నాగవరా ళ్యాది వివిధ నానారాగ ప్రాగల్భ్య ప్రకట ఫణా భోగములై యాడజొచ్చె భోగీంద్రంబుల్
కద్రూమహాదేవి గారాపు సంతతి మధుకైటభారాతి మడుగుపాన్పు కాలకంఠుని యంఘ్రి గండపెండారంబు భానుమంతుని తేరి ప్రగ్రహంబు నక్షత్రవీథి నెన్నడిమి పెద్దగ్రహంబు మూలాలవాలంబు మొదటిదుంప యాదిభైరవదేవు యజ్ఞోపవీతంబు క్రీడావరాహంబు తోడి జోడు
యర్కనందను నెలకట్టె యంపకోల పులుగురాయని తాత్కాలపుణ్యభిక్ష కేతకీపుష్ప వాసనా కేత్రిమాసి పర్వతేంద్రంబు తరిత్రాడు పాపరేడు
ఇమ్మహానాగంబులు మనకుం గార్యసిద్ధి యొసగుం గాక యని చని ముందట
కడగోర దీర్చిన కస్తూరి గీర్బొట్టు నెక్కసక్కెంబుగా జక్క మెరయ నడ్డంబు ద్రికటంబునై యురస్స్థలమున గంధసార స్థాసకములు మెరయ జాలనిగ్గులు గుల్కు పాలరెక్కల కుచ్చు వామకర్ణంబుతో వక్కళింప బెనచి వెండ్రుకలతో బెనవెట్టి చుట్టిన ప్రాత చెంద్రిక వన్నె పాగ యమర
జన్నిదంబుగ బెనుబాము సవదరించి యంఘ్రికటకంబు ఘల్లు ఘల్లనుచు మొరయ నాహితుండిక గరళవిద్యాధిరాజు వచ్చె బాములమెంగడు వదరులాడు
ఫూత్కారపవనంబు పూరించుపుక్కిళ్ళు ముసిడిపండుల తోడ ముద్దుగురియ సందిటి సంకుపూసల సద్దు కటు తుంబి నాదస్వరోజ్జృంభణముల నడప నేడురంధ్రమ్ములు నిరుగేల వ్రేళ్ళను వివృతి సంవృతి లీల విస్తరింప నాలాప తాళాంత రాంతరంబుల యందు విక్కను శబ్దముల్ చొక్కటముగ
నాగసింధు ప్రభేద నానావరాట రాగ గంధర్వ లహరికారంభణముల మిహిపదంబుగ బాములమెంగ డూదె భోగిరాజులు నర్తింప నాగసొరము
అట చని ముందట నొక్క మంటపంబున విట భట పటలంబు నెదురుకట్ల నార్భటింప టిట్టిభుండు విని గోవిందశర్మ నడిగిన
గడిడు
నున్నవై నలుపెక్కి నొసలి చేరువకంటి కెకువ వైచిన శిఖ పెకలుచుండ దటపెట దిమికిట ధ్వను లోలిబుట్టింప జాలు గుమ్మెట చంక వ్రేలుచుండ నలుకనై మీజేత నంటిన యా క్రొత్త మువ్వలత్తెము సారె ములుగుచుండ (..) నొసలు స్రుక్కించు నావుర్న నోరు దెరచు గ్రుడ్లు మిడికించు రాగంబు గుమ్మడించు బాడుగతులకు దను దానె పరగి యాడు నల్ల యాతండువో తూర్పునాటి గడిడు
మేషయుద్ధము
అనుచు నట పోవ గంటె కిరాట రెండు మేషకంఠీరవంబులు నీరాటరేవున నీరను ముంచి నస్యంబు సేయుచు బెంచుటం జేసి ధేనువుల ననుధావనంబు సేయు వత్సంబులుం బోలె వాత్సల్యంబునం దన యేలికల వెంట కంఠగ్రైవేయ ఘంటికా టంకారంబులును విషమ విషాణకోటి ఘటిత కపా లాయసాశ్వత్థ పల్లవ గుళుచ్ఛ రింఛోళికా ఘణఘణత్కారంబులు చెలంగ యుద్ధక్రీడా సన్నద్ధంబులై వచ్చుచున్నయవి యీ సజీవద్యూతంబు చూతము కాక యనుచు గౌతూహలంబున నిలిచియున్న యవసరంబున వాహ్యాలిప్రదేశంబునం బందెగాండ్రు పందెంబు నొడిసి తలపెట్టిన
ఉభయము భావవీథి జయమొందిన భంగి భయం బొకింత లే కభిముఖమయ్యె వెన్వెనుకకై యట కొన్ని పదంబు లేగుచున్ రభసముతో దువాళి గొని భ్రగ్గున దాకెడు జూడు సెట్టి టి ట్టిభ దిదిథీ యనంగను గడింది నదభ్రము లీ యురభ్రముల్
నిటలమ్ము లవిసి నెత్తురు సొటసొట వడియంగ సమరశూరోత్తములై కటుకునను మెండుతగరులు చటులాటోపమున రెండు సరిబడ బోరెన్
వట్టివెదురు మోపు వైచిన చందాన గుండు గుండు మీద గూలినట్లు కడిది మ్రోత మేషకంఠీరవంబులు తాకి తాకి తస్సి తట్టువారె
ఇట్లు తట్టువారి పొట్టేళ్ళు నాస్కందం బుడిగి మంద నిశ్వాసోచ్ఛ్వాసంబులై డిల్లపడి మూర్ఛిల్లిన
హాహా నృపాల సింహాసనాధిష్ఠాన రత్నకంబళకాభిరామ రోమ మజ్ఝా కృపీట సంభవ మహాదిక్పాల హేలావిహార వాహ్యాళి వాహ మాయురే ప్రవిలంబమానాండ సంపాత కుతుకానుధావిత క్రోష్టురాజ అహహ శ్రీవీరభద్రావతార మహేశ నిహత దక్ష కబంధ నిహిత వదన
భళిరె మేంఠరాజ బాపు రురభ్రేశ ఔర యేడకేంద్ర యరరె తగర మమ్మ హుం క్రియాభిమానా దరిద్రాణ మేలుమేలు గొర్రె మిండగీడ
మీకు నీ గండంబులు దొలంగుం గాక యనుచు నట చని ముందట గక్షవిలంబిత తామ్రచూడులగు నూడుపందెగాండ్ర గనుగొని యిదియును నొక్క సజీవద్యూతంబ యీ దురోదర క్రీడావిహారంబు నాదరింప వలయు బానుగంటి కలుకోడి తోడబుట్టువులు వోని యీ జగజెట్టి కోడిపుంజుల యందు బ్రత్యేకంబు
కోళ్ళ పోరితము
పారిజాతపు బూవు నా బరగు జూడు తామ్రచూడంబు చూడాపథంబు జొత్తు దర్పభరమున బ్రహ్మరంధ్రంబు నడుము జించి వెడలిన క్రోధాగ్ని శిఖయు బోలె
టిట్టిభ యవలోకింపు నారికేళ బక జాతీయంబులై యీ జగజెట్టి కోడిపుంజులు మెడలు నిక్కించుచు రెక్కలల్లార్చుచు గొక్కొక్కొ యని కాల్గ్రవ్వి క్రొవ్వు మిగిలి తరళ తారకోద్వృత్త రక్తాంతలోచన మండలంబులై యొండొంటిం గదిసి చురచుర జూచి యేచిన కోపాటోపంబున గుప్పించి యుప్పరం బెగసి చరణాంగుళీ కుటిల నఖశిఖాకోటి కుట్టినంబులం జిరుదొగడు లెగయ వక్షస్థలంబులు వ్రచ్చి వంచరలాడియుం ద్రోసియు లాసియు నాసాపుటంబులం బుటబుటన నడునెత్తిం జొత్తలు నెత్తురు విర్రగా గరచియు బరచియు గొరకొరం గొరుకు ముఖంబున గురుకు గురుకు మనుచు సవ్యాపసవ్యంబుల నోహరిం బక్షవిక్షేపంబులం బడలువడ నడిచియు నొడిచియు నడికినడికి తప్పించుకొని సలిచప్పుడు గాక యుండం గాళ్ళక్రిందికి దూరియు జీరియు మాటిమాటికి ఘాటఘాటఘాట యని కృకాటం బుక్కుదండసంబులు వోని ముక్కులం జెక్కులం జిక్కగా నొక్కి యిట్టట్టనక బిట్టూని పట్టి గాలంపు గొంకులభంగి వంకలగు కొంకికత్తులం కడుపులొడిచికొని చించి చెండాడి కొండుకసేపు వాలిసుగ్రీవుల విధంబున విందానువిందుల చందంబున మురారిచాణూరుల ప్రకారంబున నేకాంగయుద్ధంబు సేసి చారణ గంధర్వ గరుడ విద్యాధర శ్లాఘనీయంబుగా నమోఘపరాక్రమంబు సలిపి వీరవ్రతం బేపార వాహ్యాళీమండలంబునం దమకు దార పాయగిలం బడి పోటుగండ్లలొప్పు రుధిరంబులం దొప్పదోగి మూర్ఛాంధకారంబున మునుగుచున్నయవి
హా కుమారస్వామి యౌపవాహ్యములార హా మంత్రదేవతాస్వాములార హా కాలవిజ్ఞాన పాక కోవిదులార హా భూతభుక్తి కుంభార్హులార హా యహల్యాజార యభన హేతువులార హా బలాత్కార కామాంధులార హా నిరంకుశ మహాహంకార నిధులార హా కామవిజయ కాహళములార
హా ఖగేంద్రంబులార కయ్యమున నీల్గ పోవుచున్నారె దేవతాభువనమునకు మీరు రంభా తిలోత్తమా మేనకాది భోగకార్యార్థమై కోడిపుంజులార
అని యట పోవుచు నా దక్షిణంబున పైడికుండల మొగసాల తోడిది మాధవశర్మ కూతురు మధుమావతిదేవి మందిరంబు <poem>