Jump to content

కృషీవలుడు/పద్యాలు 1-10

వికీసోర్స్ నుండి

కృషీవలుడు


సమయమమూల్య, మొక్క నిమిషంబు వృథాచనఁ గ్రమ్మఱింపనే
రము; మనయాయువా త్రుటిపరంపరయౌట నెఱింగి, నిద్రమాం
ద్యమునుదొలంగి మీపనుల నారయుఁడో జనులారయంచు డం
బముగమెడన్నిగిడ్చి కృకవాకము గూసెడి నింటికొప్పునన్‌. 1

వడఁకుచుఁబాడు మేల్కొలుపుపాటకు రాటముఝుమ్ముమంచుఁ జే
సెడి మధురారవంబు శ్రుతిచెల్వువహింపఁగ, రాజనూఁది ముం
గడ నిడుకొన్న కుంపటిసెగన్‌ సొగియించుచు నమ్మలక్క లొ
క్కెడగుమిగూడినూల్వడకునిత్తఱిఁ దోఁచెను రెడ్డిచుక్కయున్‌. 2

అత్తల యాఁడుబిడ్డల భయం బొకవంకయుఁ గోర్కె వేఱెడం
జిత్తములాఁగఁ గ్రొవ్వెదయుఁ జీరయు వేసవరించి తూఁగుమై
మత్తున నున్నవల్లభుని మంచము మెల్లన వీడి దీనయై
బిత్తఱికోడ లిల్వెడలె వేకువఁ బ్రాఁచిపను ల్వొనర్పఁగన్‌. 3

రచ్చ చపారమందు నిడిరాతిరిఁ బుచ్చిన బాటసారులుం

జిచ్చు రగిల్చి మంటలకుఁ జేతులు చాపుచుఁ గూరుచుండి వా

రిచ్చకు వచ్చినట్టి కతలెల్ల వచింపుచుఁ దెల్లవాఱఁగా
వచ్చిన మూటముల్లె గొను పైనపుసందడి రేఁగె గొల్లునన్‌. 4

అమ్మీ, తూరుపుదెల్లవాఱె, నిఁకలెమ్మా, యంచనన్‌ మాల్గి మం
చమ్మున్‌ డిగ్గక, బుజ్జగించినను, పో చాల్చాలు, వేన్నీళ్లు లే
కెమ్మై నేఁ బలుదోముకొందుఁ జలిలో, నింతాగడంబా, యటం
చమ్మం గూఁతురు కోపగించుకొనుఁ గన్యాత్వంపు గారామునన్‌. 5

ఉష యనెడు కాఁపుటిల్లాలు హొన్నురాజ
నముల వరియెన్నుగంప గేహమున దింప
సంబరమున నెగురుచు సరసఁజేరు
పిల్లలనఁ బుల్గుతుటుములు వింటికెగసె. 6

అరుణమయూఖముల్‌ తరులతాంతరమార్గము దూరి గేహగో
పురములఁ బ్రాఁకు ప్రొద్దువొడుపుం దరుణంబున నీటికోసమై
సరసుల కేఁగు కాఁపునెఱజాణల నూపురమంజులార్భటుల్‌
నెఱసెఁ బ్రభాతమన్‌ శిశువునేర్చెడి ముద్దులమాటలో యనన్‌. 7

ఇరువులఁ జూరులందుఁ జరియించి తమోహరణైక దక్ష భా
స్కర కిరణాళి నీమృదులశయ్య సువర్ణమయంబు చేసె ని
ద్దుర నిఁకనైనమాని వెలిదోలుము బీళ్ళకు నాలమంద, ని
త్తఱిఁ దమిదీఱమేయుఁ బులుదంటులుఁ గమ్మనిమంచుపచ్చికల్‌. 8


ఓయి హాలిక! యెంత ప్రొద్దాయెఁ జూడు
మింత నిదురేల? పాలకై గొంతురాయ
లేఁగ యాదూడ పలుపును లాఁగికొనుచు
నఱచు చున్నది "యంభయంభా" యటంచు. 9

పొదుగు నిండుగఁ బాల్చేపి గుదులు త్రెంపి
దూడకై దొడ్డిగోడ రాపాడి దాఁటెఁ
దఱిపి పెయ్య; యింకేల మాంద్యమునఁ బొదల?
లెమ్మునిద్దుర; పాల్దీయఁ దెమ్ము చెంబు. 10

బిఱ్ఱుకడుపుగ నన్నంబుఁ బెరుఁగుఁ గుడిచి
దొడ్డి వెడలించు చున్నాడు గిడ్డిగములఁ
దమ్ముఁగుఱ్ఱడు; లేదూడ లమ్మలకును
బరుగు లిడనీక కట్టుము పలుపువెట్టి. 11

చెమరు ముత్యాలు చెక్కిళ్ల జెదరిజాఱ
ముద్దుచన్నులు పయ్యెద మురిపెమాడ
గాజునీలాలు మధుర నిక్వణము లొలయ
దధి మధించెడు కాంత గీతములు వినవొ? 12

ఉయ్యెల నిద్రలేచి తనయుం డెదుటన్‌ జనయిత్రి గాంచకే
కుయ్యిడు చున్నవాఁడు కులుకుంగనుదమ్ముల బాష్పబిందు లొ