Jump to content

కృత కృత్యా

వికీసోర్స్ నుండి

ధన్యాసి రాగం- మధ్యాది తాళం

[మార్చు]

పల్లవి:
కృతకృత్యా భవితాసి రసనే కృష్ణ నామ జపనే ||

అనుపల్లవి:
శతమఖ ముఖ సుర సంసేవితం
నత ధ్రుతం సమ్మతం సతాం త్వం ||

చరణం 1:
సుధా దుగ్ధ మధు చూత కదళీ
మధురం తేన సమం మధురం నహి నహి భో ||

చరణం 2:
భ్రమాభ్రమారుత ముమాపతి స్తుత
మమోఘ మీదమేవ మహామంత్రం ||

చరణం 3:
జరాది భయ మోచక వాచక దాసు రామ
కవిరాజి రాజత ఫణితం ||