కూసుమంచి గణపేశ్వరాలయం/మరికొన్ని సూచనలు

వికీసోర్స్ నుండి

మరికొన్ని సూచనలు

  1. అనుబంధ ఆలయాలైన ముక్కంటేశ్వర, వేణుగోపాలస్వామి ఆలయాలను దేవాలయ పరిధిలోకి తీసుకురావాలి. వాటి చుట్టూ రక్షణగా గోడ నిర్మించాలి. సందర్శనకు అనువుగా బాట వేయించాలి. వాటి ఆవరణను శుభ్రం చేయించాలి. కళ్యాణమంటప నిర్మాణం చేయాలి. రసాయన ప్రక్షాళన చేసి మసి మరియు సున్నంలాంటివి తొలగించాలి.
  2. వేణుగోపాలస్వామి ఆలయానికి తక్షణమే మరమత్తులు చేయించాలి. దానికి కూడా రక్షిత కట్టడాల జాబితాలో చోటుకల్పించాలి.
  3. గ్రామంలో మరేమైనా శాసనాలూ, నాణేలు, సమాచారం వున్నాయేమో సేకరించాలి. ఈ విషయమై గ్రామంలో తగినంత అవగాహనను కల్పించాలి.
  4. గంగాదేవి చెరువును బాగుచేయించుకోవాలి. దాని ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తేవాలి.
  5. గ్రామాన్ని గురించి, ఆలయాన్ని గురించి వాడుకలోని కథలు, కైఫియత్తులు, సాహిత్య రచనల కోసం మరింత ప్రయత్నించాలి.
  6. సందర్శకులకు అందుబాటులో వుండేలా ఆలయ చరిత్ర, ప్రత్యేకతల గురించి వివరణలు రాసిన ఫలకాలను ఏర్పాటు చేయాలి
  7. ప్రాధమికంగా తయారైన ఈసమాచారానికి సవరణలూ, పూరణలు చేసి ఆలయచరిత్రను అందుబాటులోకి తీసుకురావాలి.
  8. ఆలయానికి సంబంధించిన వివరాలతో ఒక వెబ్ సైట్ తయారుచేసి నిర్వహిస్తే బాగుంటుంది.
  9. దేవాలయానికి అనుబంధంగా ఆర్ధిక వనరులను, మానవ వనరులనూ తగినంత పెంపుదల చేసి పునర్వైభవానికై యత్నించాలి.