కుటుంబ నియంత్రణ పద్ధతులు/వేసక్టమీ
15. వేసక్టమీ
వేసక్టమీ - భయాలు
కామేశ్వరరావు నలుగురు పిల్లల తండ్రి. అయినా వయస్సులో కుర్రవాడే. రెండవ సంతానం కలిగీనప్పటి నుంచీ అతని భార్య సావిత్రి కామేశ్వరరావును వేసెక్టమీ చేయించుకోమని పోరు మొదలెట్టింది. అతనికి ఆపరేషన్ చేయించుకోవాలని ఉన్నా, వేసెక్టమీ చేయించుకుంటే పురుషత్వం ఎక్కడ తగ్గిపోతుందో అనే భయంతో ఇంత కాలం వాయిదా వేస్తూ వచ్చాడు. ఇంతేకాక వేసెక్టమీ చేయించుకుంటే శారీరకంగా అనారోగ్యం కలుగుతుందని, దాంపత్య జీవితాన్ని అనుభవించలేరనీ, వీళ్ళూ - వాళ్ళూ చెప్పే మాటలు అతనిలో పాతుకొనిపోయి వున్నాయి. కాని యెలాగో నాలుగవ సంతానం కలిగిన తరువాత వేసక్టమీ చేయించుకున్నాడు. వేసెక్టమీ అయితే చేయించుకున్నాడు కాని వీళ్ళూ - వాళ్ళూ పెట్టిన భయాలు అతనిలో అనుక్షణం ఆవహించే ఉన్నాయి. చివరికి కమేశ్వరరావు భయపడి నంతా అయింది. అతని భార్య సావిత్రి ఉత్సాహాంతో అతన్ని ఉత్తేజ పరుస్తూ వుంటే అతని కామసామర్ధ్యం సన్నగిల్లి నట్లు భావింఛాడు. చివరికి అతని మనస్సు భయాందోళ నలతో తల్లడిల్లిపోయి రతిలో అంగస్తంబనం జరగటం దుర్లభంగా అనిపిస్తోంది. రతిలో పాల్గొనే బ్రతీసారి సంయోగం తనకొక పరీక్షగా తయారయింది.
వాస్తవానికి వేసక్టమీ చేయించుకున్న తరువాత కామేశ్వరరావుకి రతిలో వైఫల్యం మానసిక మైనదే. శారీరకంగా గాని, ఆంగికంగాగాని, హార్మోన్ల పరంగాగాని ఏ లోపము కలిగికాదు. ఆపరేషన్ చేయించుకునే ముందు నుంచీ అతనిలో ఉన్న భయాలే రతి వైఫల్యానికి కారణాలు.
వేసక్టమీ అంటే ఏమిటి?
కణాలే గర్భోత్పత్తికి కారణం. వేసెక్టమీ ఆపరేషన్ చేయటానికి కడుపు కోయనవసరం లేదు. పురుషాంగాన్ని ముట్టనే అవసరం లేదు. పురుషాంగం క్రింద ఉన్న బీజ కోశంలోనే వీర్య వాహికలు ఉంటాయి. వేసెక్టమీ ఆపరేషన్‌ని బీజకోశానికి రెండువైపులా అర అంగుళం మేర కోసి అందుకోనుంచి వీర్యవాహికలని బయటకు తీసి కత్తిరించడం జరుగుతుంది. ఇలా కత్తిరించిన వాటి చివరలను దారంతో ముడివేసి, ఆ తరువాత వాటిని మామూలుగా బీజకోశములోకి నెట్టివేసి, బయట చర్మానికి గుట్టువేయడం జరుగుతుంది. బీజకోశానికి రెండువైపులా మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కనుక ఎటువంటి బాధ ఉండదు. ఈ ఆపరేషన్ పది నిమిషాలలోపే తేలికగా అయిపోతుంది.
వేసెక్టమీ ఆపరేషన్ ఛేయించుకున్నా వీర్యస్కలనం మామూలుగానే ఉంటుంది. అందులో వీర్యకణాలు మాత్రమే ఉండవు. మూత్రాశయానికి దిగువున ఉండే ప్రొస్టేటు గ్రంధియే వీర్యరసాలని తయారు చేస్తుంది. కనుక వీర్యంలో ఇంకే లోపమూ ఉండదు. ఈ ఆపరేషన్ చేయించుకున్న తరువాత కూడా అంతకు పూర్వంవలె సంసార సుఖాన్ని భర్త పూర్తిగా పొందగలడు. అతనివల్ల భార్యకు కూడా రతి సుఖం మామూలుగానే లబిస్తుంది. ఎటోచ్చీ గర్భధారణ జరగదు.
వేసెక్టమీ చేయించుకుంటే కామవాంఛ ఏమీ తగ్గదు. పైగా పిల్లలు కలగరు అనే ధైర్యం ఉండబట్టే ఇంతో అంతో కామవాంఛ ఎక్కువ కావటానికి అవకాశం ఉంది. ఎవరయినా ఈ ఆపరేషన్ అయిన తరువాత పురుషత్వం పోయిందనుకుంటే, అది కేవలం భయాలవల్ల మానసికంగా తెచ్చిపెట్టుకున్న దే కాని ఆంగికంగాగాని, శారీరకంగాగాని, ఏ బలహీనతా వచ్చి మాత్రం కాదు. ఆపోహలవల్ల పురుసత్వం పోయిందని, బావించేవాళ్లు కొందరు ఉంటే, మరి కొందరు వేసెక్టమీ చేయించుకున్న తరువాత తిరిగి వీర్య పుష్టిగల యువకులమయ్యామని అంటూ ఉంటారు. వారికి దాంపత్య జీవితంలో పూర్ఫంకంటే తృప్తి ఎక్కువ కలుగుతుందని చెబుతూ ఉంటారు. ఆ మధ్య ఓ వ్యక్తి తన అనుభవంలో తెలుసుకున్నది చెబుతూ వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకొనక ముందు ఎన్ని కుటుంబనియంత్రణ పద్ధతులు అవలంబిస్తున్నా అవి సక్రమంగా జరగక ఎక్కడ గర్భం వస్తుందో అని భయం భయంగా ఉండేదని, ఆపరేషన్ అయిన తరువాత అటువంటి భయానికి తావులేకుండా అయి రతిలో మనస్సు ఉత్తేజంగా ఉరకలేస్తుందని అన్నాడు. ఇది అక్షరాలా నిజం.
ఈ కామవాంఛ భార్యలో కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. భర్త ఆపరేషన్ చేయించుకున్న తరువాత భార్యకు గర్భధారణ భయం వదలిపోతుంది. అసలు ఆ భయమే ఆమెకు రతిలో జడురాలిగా ఉంచుతుంది. కాన్పు అయిన తరువాత కొన్ని నెలల వరకూ భర్తతో రతిలో పాల్గొనడానికే ఆమె భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వెంటనే గర్బం ఎక్కడ వస్తుందో అనే భయం ఉండటమే. ఆ భయంతోనే, బర్తమాట కాదనలేక, భర్త కామాన్ని తీర్చడం కోసం అయిష్టంగానే రతిలో పాల్గొంటుంది. అంతేకానీ తనంతటతాను హుషారుగా ముందుకు రాదు. కానీ భర్త ఆపరేషన్ చేయించుకున్న తరువాత అధిక సంతానం కలుగుతుందన్న భయం వుండదు. కనుక స్త్రీ ఉత్సాహంగా రతిలో పాల్గొంటుంది. భర్తను రతిలో పాల్గొనేందుకు ఉత్సాహపరుస్తుంది. ఇంతకు పూర్వం వరకు భార్య ఇష్టాఇష్టాలని గమనించకుండా తన కామాన్ని తీర్చుకునే భర్త ఇందువల్లనే ఆమెలో కామం ఎక్కువ అయిపోతున్నట్లు, తనలో ఈ ఆపరేషన్‌వల్ల కామం తక్కువ అయి పోతున్నట్లు భ్రమపడతారు. అంతేగాని ఇప్పుడు ఆమె నిర్భయంగా రతిలొ పాల్గొంటున్నదనీ, ఆమెలో ఇంతవరకు అణచుకున్న కామాన్ని స్వెచ్ఛగా వెల్లడిస్తుందని తెలుసుకోడు. పైగా వేసక్టమీ ఛెయించుకున్నందువల్ల, అతనివల్ల ఆమెకు తృప్తికలగక, రతిలో ఇంకా ఇంకా పాల్గొనమని కోరుతుందని భావిస్తాడు. దానివల్ల తనకి రతి సామర్ధ్యం తగ్గినదని భావించి మానసిక నపుంసకత్వం తెచ్చి పెట్టుకుంటాడు కూడాను.
వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నందువల్ల కామ వాంఛలోగాని, కామ సామర్ధ్యంలో గాని, ఏ లోపమూ ఉండదు. ఏమయినా వస్తే అది కేవలం ఆపోహలవల్ల, భయాలవల్ల మానసికంగా తెచ్చిపెట్టుకున్నదే. వేసెక్టమీవల్ల మరింత కామ సామర్ధ్యము
రవీంద్రనాధ్ టాగూర్ మెడికల్ కాలేజీ, ఉదయపూర్‌కి చెందిన డాక్టర్ గుప్తా, డాక్టర్ కొఠారి, వారి సహచరులు విశేష కృషి చేసి వేసక్టమీ చేయించుకున్న వాళ్ళలో పుంసత్వం ఏ మాత్రం తగ్గిపోదని ఋజువు చేసి చూపించారు. పురుషునిలో కామవాంఛ కలగాలన్నా, కామసామర్ధ్యం ఉండాలన్నా పురుష సెక్స్ హార్మోను అయిన టెస్టోస్టిరోన్ తగినంత మోతాదులో ఉండటం అవసరం. తెస్టోస్టిరోన్ హార్మోను ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు కామసామర్ధ్యం కూడా తగ్గిపోతుంది. అయితే కొందరిలో టెస్టోస్టిరోన్ ఉత్పత్తి తగ్గిపోకుండానే, కామసామర్ధ్యం సన్నగిల్లినట్లు అవుతుంది. దానికి కారణం వాళ్ళల్లో కామసామర్ధ్యం గురించి అనవసరంగా కలిగిన అనుమానాలు, భయాలవల్లనే వాస్తవానికి వేసక్టమీ చేయించుకున్న వాళ్ళల్లో కామసామర్ధ్యం గురించి అనవసరంగా కలిగిన అనుమానాలు, భయాలవలల్నె వాస్తవానికి వేసెక్టమీ చేయిందుకున్న వాళ్ళల్లో పురుష సెక్సు హార్మోన్ అయిన టెస్టోస్టిరోన్ ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీనివల్ల వేసక్టమీ చేయించుకున్న వాళ్ళలో కామసామర్ధ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు.
వృషణాలలో టెస్టోస్టిరోన్ ఉత్పత్తి చేయడానికి ప్రత్యేకమైన టిస్యూలు ఉంటాయి. ఈటిస్యూలనే లైడింగ్ సెల్స్ అని అంటారు. డాక్టర్ గుప్తా, డా: కొఠారి ఒక ప్రత్య్హేక పద్ధతి అవలంబించి వేసెక్టమీ చేయించుకున్న వాళ్ళాల్లో పురుష సెక్స్ హార్మోను ని ఉత్పత్తి చేసే లైడింగ్ సెల్స్ ని కరక్టుగా లెక్కకట్టడం చేశారు. ఆ పద్ధతి అవలంబిచగా వేసక్టమీ చేయించుకున్న పురుషులలో ఆపరేషన్ చేయించుకున్న రెండుసంవత్సరాలలో లైడింగ్ సెల్స్ మరింత పెంపొందాయి, వాటి సంఖ్య పెరగడంతోపాటు టెస్టోస్టిరోన్ ఉత్పత్తికూడా ఆపరేషన్ చేయించుకున్న ముందుకంటె ఎంతో ఎక్కువ పెరిగింది. ఈ రకంగా వేసెక్టమీ చేయించుకోవడానికి ముందు-తరువాత కొన్ని సంవత్సరాలపాటు ఆఫరేషన్ చేయించుకున్నవారి హార్మోనుని అంచనాకట్టి టెస్టోస్టిరోన్ ఉత్పత్తి పెరుగుతుందేతప్ప తగ్గదని నిర్ధారణచేసి చూపించారు. ఈ రకంగా అనేకమందిని పరీక్షచేసి పెద్ద శాస్త్రవేత్తలు తమ ప్రయోగ ఫలితాల గురించి ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రికలైన బ్రిటీష సర్జరీ జర్నల్ లోను, అమెరికన్ సర్జరీ జర్నల్ లోనూ, లాన్ సెట్ లోను, ఇంటర్నేషనల్ సర్జరీ జర్నల్ లోనూ, ఇంకా ఇతర జర్నల్స్‌లోను పరిశోధనల వ్యాసాలను ప్రకటించారు. కొత్తపధతి ద్వారా ఈ విధంగా వేసక్టమీ చేయించుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే టెస్టొస్టిరోన్ గురించి, లైడింగ సెల్స్ గురించి అంచనా కట్టడంలో మన భారతీయ శాస్త్రవేత్తలే విజయం సాధించారు. వేసక్టమీ చేయించుకున్న తరువాత....
వేసక్టమీ చేయించుకున్న వారికి వీర్యకణాలు పైకి పయనించడానికి అవకాశం లేక టెస్టికల్స్ దగ్గరలోనే ఆగి పోతాయి తరువాత అక్కడే నశించిపొతాయి. ఇలా కొంతకాలం జరిగేసరికి వృషణాలలో వీర్యకణాల్ని ఉత్పత్తి చేసే టిస్యూలు వాటిని చాలవరకు తగ్గించివేస్తాయి. ఒక ప్రక్క వృషణాలనుండి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటే రెండవప్రక్క వృషణాల నుండి పురుష సెక్స్ హార్మోనుల ఉత్పత్తి ఎక్కువవుతూ ఉంటుంది. అందుకని వేసెక్టమీ చేయించుకున్న వారిలో కామపరంగా సామర్ధ్యము, కోరికలు పెరుగుతాయే తప్ప తగ్గడం జరగదు. వేసక్టమీ చేయించుకున్న తరువాత ఎవరిలోనైనా కామసామర్ధ్యం సన్నగిల్లిందని అంటే అది కేవలం వారిలో ఉన్న భయాందోళనలు వల్లనే కాని వాస్తవంగా కామసామర్ధ్యం తగ్గడం కాదు.
టెస్టోస్టిరోన్ ఉత్పత్తి ఎలా పెరుగుతుంది ?
వేసక్టమీ చేయించుకున్న వాళ్ళలో లైడింగ్ స్వెల్స్ ఎక్కువ అవడానికిగాను, టేస్టోస్టిరోన్ ఉత్పత్తి పెరగడానికి గాని దోహదంచేసే స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ లేదు. అయినా వేసెక్టమీ చేయించుకున్న వాళ్ళలో వీర్య కణాలని ఉత్పత్తిచేసే టిస్యూలే కారణమని భావించడం జరుగుతోంది. వేసెక్టమీ చేయించుకున్న తరువాత వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది దానితో వీర్యకణాలని తయారు చెసే టిస్యూలు వృషణాలలో కృశించిపోతాయి ఈ కృశించిపోతున్న టిస్యూల ప్రభావం మెదడులో వున్న పిట్యూటరీ గ్రంధిమీద పడుతుంది. అప్పుడు పిట్యూటరీ గ్రంధి నుండి పురుష సెక్స్ హార్మోను అయిన టెస్టొస్టిరిన్ ఉత్పత్తి ఎక్కువ అవడానికి గొనాడోట్రాఫిన్ విదుదల అవుతుంది. ఈ విధంగా విడుదలైన గొనాడోట్ర్రాఫిన్ టెస్టొస్టిరోన్ ఉత్పత్తి మరింత పెరగడానికి దోహదంచేస్తుందని అభిప్రాయపడడం జరుగుతోంది. ఈ అభిప్రాయాన్నే మరికొన్ని పరిస్థితుల్లో పరిశీలించి సమర్ధించడం జరిగింది. కొందరిలో పుట్టుక నుంచే వీర్యవహికలు లేకుండా ఉంటాయి. ఆటువంటి వారిలో కూడా వేసేక్టమీ చేయించుకున్న వాళ్ళల్లో ఎలా గైతే పురుష సెక్స్ హార్మోనుని తయారుచేసే టిస్యూలు వృద్ధి చెందడం జ్రుగుతాయో వీళ్ళల్లోనూ అలాగే జరుగుతాయి.
నవ యౌవనము
వేసక్టమీ ఆరంభం - అభివృద్ధి
వేసక్టమీ ఆపరేషనుని మొదట్లో ఇంగ్లీషు సర్జన్ జాన్ హంటర్ 1775 లో చేసేవారు. తరువాత 1830 లో ఆస్ట్‌లీ కూపర్ దీనిని మరింత ఎక్కువ చేసేవారు. అటుపిమ్మట హర్రీ షార్స్ అనె అమెరికన్ సర్జన్ 1899 లో దీనిని మరింత ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. 1950 నుంచి పశ్చిమ ఆసియాలో కుటుంబ నియంత్రణ పద్ధతిగా విస్తృత ప్రాచుర్యం పొందింది. 1956 నుంచి భారతదేశంలో కూడా జాతీయ కుటుంబ నియంత్రణ పద్ధతిగా స్వీకరించి విస్తృతంగా అమలు పరచడం జరుగుతోంది.
1976-77 సంవత్సరంలో భారతదేశంలో 6 మిలియన్లు పురుషులు వాసెక్టమీ చేయిందుకోగా 1980--81 వచ్చేసరికి 21 మిలియన్లు ఈ ఆపరేషను చేయించుకున్నారు.
* * *