కుటుంబ నియంత్రణ పద్ధతులు/పురుషాంగ ఉపసంహరణ పద్ధతి

వికీసోర్స్ నుండి

6. పురుషాంగ ఉపసంహరణ పద్ధతి

ఫ్రీ లవ్ అంటే ప్రీతి ఉన్న పీతాంబరరావు ప్రియదర్శినిని ప్రేమించాడు. ఫ్రీ లవ్‌తో పాటు ఫ్రీ సెక్స్ కూడా భాగమే అని అతని ఉద్ద్యశ్యము. యవ్ఫన పొంగులో ఉన్న వాళ్ళు ప్రేమకు, సంకెళ్ళు యెందుకు ఉండాలని వాదిస్తారు. అదే ధోరణి ప్రియదర్శినిది కూడా. ఫ్రీ లవ్ ఫ్రీ సెక్స్ కి ప్రతీక అయిన పీతాంబరరావుకి ప్రియదర్శిని ఫ్రీడం నుంచి హుషారు కలిగించించి. పెళ్ళికాని పడతికి ప్రియుని ఫ్రీ సెక్స్ వల్ల కడుపు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? దానికి సంయోగ సమయంలో వీర్యస్కలనం అవబోయే సమయానికి రతి నుంచి పురుషాంగ ఉపసంహరణ తేలిక మార్గంగా కనబడింది. అసలు రతిలో పురుషాంగ ఉపసంహరణ పద్ధతి అంటే ఏమిటి? దానివల్ల భద్రత లేదా? ఇవన్నీ సందేహాలే కదూ.

రతిలో పురుషాంగ ఉపసంహరన పద్దతినే Coitus interruptus అని అంటారు. గర్భనిరోధానికి అనుసరించే ఈ పద్దతి తి పురాతన కాలం నుంచి ఉన్నదే. ఈనాడు కుటుంబ నియంత్రణ పద్ధతిగా ఇది చెలామణి అవుతోంది. ఈ పద్ధతి గురించి 3,000 సంవత్సరాల క్రితమే ఓల్డుటెస్టుమెంట్ గ్రంధమైన జనిసిస్‌లో వ్రాయబడి వుంది.

రతిలో పురుషాంగ ఉపసంహరణ

గర్భనిరోధక పద్ధతిగా రతిలో పురుషాంగ ఉపసంహరణని ఎంతో నైపుణ్యముతో నిర్వర్తించవలసి ఉంటుంది. స్త్రీ పురుషులు సంయోగములో పాల్గొన్నప్పుడు, పురుషునికి కామోద్రేకము చరమస్థాయికి చేరి వీర్యస్కలనం అయ్యే అనుభూతి కలగగానే పురుషాంగాన్ని యోనిలోనుంచి బయటకు తీసివేయడం ఈ పద్దతిలో జరిగే విశేషం. యోనిలోనుంచి పురుషాంగం ఉపసంహరించగానే యోని బయట వీర్యస్కలనం జరిగిపోతుంది. వీర్యస్కలనం యోని మార్గములో జరగదు. కనుక స్త్రీ గర్భవతి కావడం జరగదు. అయితే వీర్యస్కలనం ఏమాత్రం యోని మార్గంలో జరగకుండా పురుషాంగం పూర్తిగా ఉపసంహరించిన తరువాతే జరగడం ఎంతో ముఖ్యం. ఒకవేళ వీర్యస్కలనము యోనికి బయట అంతరాధరాలు, బాహ్యాధరాల మీద జరిగిన వీర్యకణాలు యోని మార్గంలోకి పయనించగల శక్తి కలిగి ఉంటాయి. కొందరి దృష్టిలో పూర్తిగా పురుషాంగం ప్రవేశం జరిగి వీర్య స్కలనమయితేనే గర్భము వస్తుంది, లేకపోతే రాదనే భావం ఉంది. అందుకని కొందరు యువతీ యువకులు అక్రమ కామ సంబంధాలలో కన్నెపొర చిరగకుండానే యోనిదగ్గర బాహ్యంగానే రతి జరిపి తృప్తిపడి గర్భము రాదని ధైర్యముగా ఉండిపోతారు. కాని యోని బయట స్కలనమైన వీర్యకణాలు యోని మార్గముగుండా ప్రయాణించి కడుపు తెచ్చిన సంఘటనలు కావలసినన్ని ఉన్నాయి.

కొంతమంది పురుషుల్లో వీర్యస్కలనం అయిన తరువాత కూడా అంగ స్తంభనం కొంత సమయము నిలిచే ఉంటుంది. ఇటువంటి యువకులు వీర్యస్కలనం ఎటువంటి ప్రమాదం లేకుండా పూర్తిగా బయటచేసి తిరిగి సంయోగానికి వెంటనే పూనుకుంటారు. ఇటువంటప్పుడు శిశ్నంకి చివర ఉన్న మూత్రనాళాన్ని తుడిచివేయాలి. శిశ్నాన్ని కప్పిపుచ్దే చర్మాన్ని కూడా పూర్తిగా గుడ్డతో తుడిచి వీర్యము దానికి అంటుకుని ఉండకుండా జాగ్రత్త పడాలి.

సంభోగ సమయంలో శుక్లమును విడవకుండా వుంటే

భార్యా భర్తలు రతిలో పాల్గొని భర్త సరిగ్గా వీర్య స్కలనం అవబోయే సమయానికి పురుషాంగాన్ని యోని నుంచి ఉపసంహరించే పద్ధతినే "పురుషాంగ ఉపసంహరణ పద్ధతి"అని అంటారు. ఇది అతి తేలికైన పద్ధతి, ఖర్చులేని పద్ధతి అయినా కొన్ని సందర్బాలలో పురుషాంగ ఉపసంహణ జరగక ముందే వీర్యస్కలనం అయిపోయిగర్భం వచ్చే అవకాశం ఉంది. పైగా ఈ పద్ధతివల్ల మానసికంగా అసంతృప్తి కలిగే ప్రమాదం ఉంది. ఎక్కుడ వీర్యస్కలనం అయిపోతుందో, ఎక్కడ గర్భం వచ్చేస్తుందో అనే భయంతో దంపతులిద్దరూ భయం భయంగా రతిలోపాల్గొన్నట్లయితే దాంపత్యసుఖం అనుభవించడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా స్త్రీ రతిలో పరాకాష్టని పొందలేదు. ఒకవేళ ఆమె రతిలోఉత్సుకత కనబరిచినా కోరిక పరాకాష్టకు చేరుకోబోయే సమయానికి పురుషాంగ ఉపసంహరణతో అసంతృప్తే మిగిలి తీరుతుంది.

ఉపసంహరణ పద్ధతి - లోపాలు

గర్భనిరొధక పద్దతిగా ఈ విధానము అవలంబించేటప్పుడు స్త్రీ ముందు తనకి గర్భము రాకుండా పురుషుడ్ని జాగ్రత్త తీసుకోవాలని కోరాలి. ఎందుకంటే పురుషునికి వీర్యస్కలనం ఎప్పుడు అవుతుందో స్త్రీ మొందే గమనించ లెదు. ఒక్కొక్కసారి తాను జాగ్రత్తగానే ఉంటానని పురుషుడు స్త్రీని నమ్మించి మాట నిలుపుకోలేకపొవచ్చు. అదీగాక పురుషునికి కామోద్రేకము చరమస్థాయికి చేరుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుషాంగ ఉపసంహరణ దుర్లభం అవవచ్చు. ఒక్కొక్కసారి ఆస్థితిలో పురుషాంగ ఉపసంహరణ చేస్తుండగానే తెలియకుండా వీర్యస్కలనము అయిపోవచ్చు. 50 శాతము పురుషుల్లో నిదానంగా రెండు మూడు పట్టు విడుపు లతో కొద్ది క్షణాలపాటు వీర్యస్కలనం అవుతుంది. ఈ రెండవ రకము వ్యక్తుల్లో వీర్యస్కలనం ముందు కొంత తెలియకుండా నిదానంగ అవడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి వ్యక్తులలో ముందు జరిగే వీర్యస్కలనం అనుభూతి వుండదు. చివరికి జరిగే వీర్యస్కలనం అనుభూతే వుంటుంది.

వీర్యస్కలనం తెలిసి అవడం, తెలియకుండా అవడం దాన్నిబట్టే కాకుండా రతి కొనసాగించగల సమయం బట్టి కూడా ఉపసంహరణ సామర్ధ్యం ఆధారపడి వుంటుంది. 50 శాతం పురుషులకి రతిలో పాల్గొన్న రెండు నుంచి అయిదు నిమిషాలలోగా వీర్యస్కలనం అయిపోతుంది. మిగిలిన 50 శాతం పురుషుల్లో రతిలో పాల్గొన్న అయిదునుంచి ఇరవై నిమిషాలకి వీర్యస్కలనం జరుగుతుంది. అయిదు నిమిషాలలోగా వీర్యస్కలనము అయిపోయే పురుషులు పురుషాంగ ఉపసంహరణ పద్దతిని సక్రమంగా అమలుపరచలేరు. ఈ రెండూ కాకపోతే ఒక్కొక్కసారి రతిలో కామోద్రేకం పతాకస్థాయికి చేరుకుని సరిగా వీర్యస్కలనం అవబోయే ముందు స్త్రీకిగాని, పురుషునికి గాని, లేక యిద్దరికి ఒక రకమైన శారీరక అశక్తత కలిగించుతుంది. అటువంటి స్థితిలో పురుషాంగం ఉపసంహరించాలన్నా కుదరని స్థితి లేదా ఆ మైకంలో ఈ విషయమే మరచిపోయే గతి పట్టవచ్చు.

ఉపసంహరణ పద్ధతి రతిలో అసంతృప్తి

కుటుంబ నియంత్రణ పద్ధతిగా అవలంబించే ఉపసంహరణ పద్ధతి వల్ల నరాల సంబంధంగా గాని, శారీరకంగా గాని బలహీనత కలుగుతుందా అనే విషయంపై విశేషంగా పరిశోధనలుజరిగాయి చివరికి దీనివల్లఎటువంటినరాల బలహీనతలు కలగవనీ, శారీరకబలహీనతలు ఏర్పడవనీ నిర్ధారించారు. అయితే రతిలో తృప్తి కలిగే విషయంలో కొంత లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా స్త్రీలలో సుఖప్రాప్తికలగడానికి కొంత సమయం పట్టుతుంది. కొన్ని సందర్బాల్లో స్త్రీకి సరిగ్గా సుఖప్రాప్తి ప్రారంభమయ్యే సమయానికి పురుషాంగాన్ని రతి నుంచి ఉపసంహరించడం జరుగుతుంది. ఇటువంటప్పుడు ఆ స్త్రీకి రతిలో అసంతృప్తి కలగడమో, రతి అంటేనె అసహ్యం కలగడమో జరుగుతాయి.

ఇలా కొందరు స్త్రీలలో రతి యెడల అసంతృప్తి ఏర్పడితే, మరికొందరిలో పురుషుడు ఉపసంహరణ చేయకపోతే వీర్యస్కలనం జరిగి ఎక్కడ గర్భం వస్తుందో అని భయపడి పోతూ వుంటారు. వారికి సంయోగంలో ఆనందం కంటే, భయం ఎక్కువగా వుంటూ వుంటుంది. ఇదే పరిస్థితి కొందరి పురుషులలో కూడా ఏర్పడుతూ వుంటుంది. ఎక్కడ పొరపాటున వీర్యస్కలనం అయిపోతుందో ఎక్కడ గర్భం వస్తుందో అనే భయంతో సంయోగంలో సరిగ్గా పాల్గొనలేక పోతారు. ఒక్కొక్కసారి ఆ భయం తీవ్రతతో వీర్యస్కలనం అయిపోతున్నా వారికి అంగ ఉపసంహరణ చేయలేని మానసిక అశక్తస్థితి ఏర్పడుతుంది. అప్పుడప్పుడు వీర్యస్కలనం జరగకముందే పురుషాంగంనుంచి వెలువడే పల్చని ప్రొస్టేటు ద్రవంలో కొన్ని వీర్యకణాలు వుండి వాటివల్ల కూడా గర్భం రావచ్చు. అందుకని రతిలో పురుషాంగం ఉపసంహరణ పద్ధతివల్ల గర్భం రాదని ధైర్యంగా వుండటానికి వీలు లేదు. గర్భనిరోధక పద్ధతిగా ఇది అవలంభించాలనుకున్నప్పుడు ఫోమ్ బిళ్ళలుకూడా యోని మార్గంలో వుపయోగించినట్లయితే చాలావరకు రక్షణ ఏర్పడుతుంది.

* * *