కాశీయాత్ర చరిత్ర/ఇరువది ఐదవ ప్రకరణము
ఇరువది ఐదవ ప్రకరణము
సెప్టెంబరునెల 1 తేది ఉదయాత్పూరము నాలుగంటలకు బయిలువెళ్ళీ యిక్కడికి 14 ఆమడలదూరములో వుండే పొన్నేరి యనే స్థలము 10 గంటలకు చేరినాను.*[1] దారి రేగడభూమి గనుకనున్ను వర్షాలునిండాగా యిప్పట్లో కురిశివున్నది గనుకనున్ను నడవడానకు నిండా ప్రయాసగా వుండినది. పొన్నేరి వూరిముందర అరణ్యనది రొమ్ములమట్టు నీళ్ళుండగా కాలినడకగా దాటినాము. పొన్నేరియనే వూరు రెండుభాగాలుగా విభజింపబడి వున్నది. ఆరెండు భాగాలున్ను కలియడానకు మధ్యే వొక విశాలమయిన అంగడివీధి సత్రాలు సహితముగా కట్టివున్నది. యీ వీధిలో ప్రతిసంవత్సరము హరిహరాదులు వారివారి వాహనారూఢులయి సంధించే వుత్సవము జరుగుచున్నది. గనుక ఏతద్విషయమయి యీ వీధిని బహుసుందరముగా యేర్పరచివున్నారు. దక్షిణభాగమందు వుండేవూళ్ళో ఆరుముఖ మొదలారి వొక శివాలయము తటాకము మొదలైన ధర్మస్థలములను నిర్మించివున్నాడు. ఉత్తరభాగమందు అనారి విష్ణుస్థలము తటాకము మొదలయిన దేవాలయ బ్రహ్మాలయాలు వున్నవి. 40 బ్రాహ్మణయిండ్లు కలవు. బట్టలు సహితముగా కావలసిన పదార్ధాలు అన్ని యీ వూళ్ళో దొరుకును. విశాలమయిన సత్రాలు చెన్నపట్టణపు వారు కొన్ని కట్టివున్నారు. విష్ణు స్థలమునకు భూరూపకమయిన జీవనము వుండేటందున కుంఫిణీవారు ధర్మకర్తను యేర్పరచి పనులు జరుపుకుంటారు. శివస్థలమునకు ఆరుముఖ మొదలారి వొక ముఠాను తీసి దాని ఆర్జితముగుండా అతి విమర్శగా నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు జిరిగింపుచున్నాడు.
ఈస్థల మహాత్మ్యము బ్రహ్మాండపురాణాంతర్భూతముగా 5 అధ్యాయాలువున్నవి. వాటిసారమేమంటే శ్రీకృష్ణమూర్తి ద్వాపరాంతమందు కలిలో తాను యీస్థలములో మూర్తీభవింఛేటట్టు ఋషులకు చెప్పివున్నందున ఈ రహస్యము భారద్వాజులు తెలుసుకుని యిదే బృందావనక్షేత్రమని నిశ్చయించి యిక్కడ స్వామిసాక్షాత్కారము పొందడమునకు బ్రహ్మను కూర్చి తపస్సుచేసినట్టున్ను బ్రహ్మభారద్వాజుల యిష్టసిద్ధి అయ్యేకొరకు విష్ణుప్రీత్యర్ధముగా నారాయణవనములో యాగము చేసినట్టున్ను అప్పుడు అరణి మధనలో ప్రధమము వొక నది పుట్టినంతలో ఆ అరణ్యనదిని భారద్వాజుల నిత్యకర్మాదులకు వొదిగేటట్టుగా యీ పొన్నేరికి పంపించినట్టున్ను పిమ్మట యాగానంతరము శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైనంతలో భారద్వాజుల యిష్టసిద్ధి చేయమని వేడుకుని శేషశాయి రూపముతో ఈ స్థలములో విరాజమాను డయ్యేటట్టు చేసినట్తున్ను పిమ్మట వొక గోవు పాలు కార్చడం మూలముగా వూహించి పుట్టచేత కప్పబడియుంఛే స్వయంభు కృష్ణమూర్తిని కరిపాండ్యరాజు వేశేషక్షీరాభిషేకము వల్ల బయిలుపరచి దేవాగారాలు కట్టి తనపేరు సహితముగా కరికృష్ణుడని నామమరణముచేసి ఆరాధనచేయనుచూ వచ్చినట్టున్ను ఈ అరణ్యనదిన్ని ఈ స్థలమున్ను తదారభ్య యింద్రాదుల శాపాన్ని పోగొట్టి అనేకులను పావనులుగా చేయుచూ వుండేటట్టు విదితమయివున్నవి.
ఈ దినము వుట్లపండగ గనుక యిక్కడ భొజనానికి నిలిచి స్వామి దర్శనమున్ని చేసి నాలుగుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములోవుండే విచ్చూరికి రాత్రి 2 గంటలకు చేరినాను. మధ్యాహ్నముమీద నడిచినదారి రేగడభూమి. బండిదారి వొకటి కాలిదారి వొకటి అంతు రెండుదారులు కలిగివున్నవి. కాలిదారిగానే నడుస్తున్నవి. వర్షాకాలము గనుక బహు ప్రయూసగా వున్నది. పొన్నేరికి 2 గదియల దూరములో యెలవంబేటి వద్ద కొరత లేదు నడుముల మట్టులోతు గనుక కాలినడకగానే దాటినాము. విశేష ప్రవాహకాలమందు పడవలు తెప్పలగుండా దాటవలసినది. విచ్చూరు లింగిశెట్టివారికి శ్రోత్రియగ్రామము. సంవత్సరానకు వెయివరహాలు యెత్తును. 30 బ్ర్రాహ్మణ యిండ్లు కలవు. సమస్త పదార్దాలు దొరుకును. చుట్టూ అశ్వద్ధవృక్షాలుగల రమణీయమయిన వొక తామరకొలను అగ్రహారమునకు సమీపముగా వున్నది. యిక్కడ ఈ రాత్రి మసుసటి దినము మధ్యాహ్నమువరకు నిలిచినాను.
లోకములో యీశ్వరుడు వొక రూపముతో ఆదరింపుచు మాతాపిత్రాదులు అనేక రసాలను కాలోచితముగా తెచ్దుకొని వొక్కొక్క రసముతో వొక్కక్క విధమయిన అభినయాన్ని పట్టి శిసువులను రక్షించేటట్టు సమస్తవిధాలా యెదటనిలిచి యీశ్వరుడు మాట్లాడుచు వుండగా యీశ్వరుడు ప్రత్యక్షముకావలె నని లోకులు యీశ్వర సాన్నిధ్యము కావలెననిన్ని పిచ్చి తపస్సులు చేయుచున్నారు. యిందుకు కారణము జగదీశ్వరుని దురత్యయ మయిన మాయకాని వేరేకాదు.
2 తేది మధ్యాహ్నము మీదట 4 గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడ దూరములో వుండే తిరువట్టూరు అనే మహాస్థలము అస్తమానానకు చేరినాను. *[2] దారి వుప్పురేగడిభూమి. చెరిసగము దూరములో సుంకపుమెట్టు వొకటి వున్నది. సుంకము వసూలు నిమిత్తము యిక్కడ మూటలు ముల్లెలు చెన్నపట్టణమునకు నాలుగు పక్కలా వుండే మెట్లలో సోదా యిచ్చేటట్టుయిక్కడ యివ్వవలశినది. నేటి దారిలోమధ్యే కాకిర్రేవు కాలువ దాటవలశినది. వారధి మీదపోతే కొంతచుట్టు గనుక పడవలగుండా ఆ కాలువ దాటినాను. వర్షాకాలము గనుక దారి అడుసుగా వున్నది. యీతిరువట్టూరు బహు సుందరమైన వూరు. ప్రతిసంవత్సరము యిక్కడ జరిగే బ్రహ్మోత్సవము వసంతకాలములో శుక్లపక్షములో అపర రాత్రిళ్ళలో విభాము జరుగుటచేత చెన్నపట్టణములో సమస్త విధములయిన జీవనోపాయాలు కలవారు నిద్రాకాలాన్ని మానుషానందాను భవానకు వుపయోగము చేసుకుని చెన్నపట్టణము మొదలు తిరువట్టూరివరకి 2 కోసులదూరములో అడుగుకు వొక సత్రముకట్టి దానికి తగ్గ వుపచారములు వారువారు ఆ సత్రాలలో చేస్తూవుండడమువల్ల సౌఖ్యముగా వచ్చి యీబ్రంహ్మోత్సవాన్నిన్ని వేడుకపరచి తాము ఆనందపడిపోతూ వుంటారు. యీవూళ్ళో చెన్నపట్టణపు వుపపన్నులు అనేకసత్రాలు కట్తివున్నారు. విశాలమయిన వీధులు కలవి. వీధులు తెంకాయచెట్లశాలల వల్లను బయిటితిన్నెలు పందిళ్ళుచేతనున్ను అలంకరించబడివున్నవి. సుందరమయిన దేవాలయము తటాక సహితముగా వున్నది. సమస్తపదార్ధాలు దొరుకును. యీ గుడిధర్మము లింగిశెట్టి కుమారుడైన అరుణాచల శెట్టి తనచేతి సొమ్ము సంవత్సరానకు 2000 వరహాలదాకా ఖర్చు చేసి జరిగింపుదున్నాడు. ఆ ధర్మము కాక అతను అన్నదానాపేక్ష చాలా కల వంశములో జనించినాడు గనుక ఆ వాసన యీ పురుషుణ్ని బాగా పట్టి వున్నది.
యీ స్థల మహాత్మ్యము యే మంటే సృష్టికి ఆదియందు భూమి జలార్ణవమై వుండగా యీశ్వరుడు సృష్టికి అంకురముగా వొక ఔదుంబర వృక్షము కలగచేసి చండవాయువు చేత ఆవృక్షమును యుక్తప్రదేశములో నిలుపుమని పంపించినట్టున్ను ఆ వృక్షము యీ వూళ్ళో పతనమై పాతాళలోకము అంటినట్టున్ను దాన్ని వేళ్ళపుష్టి భూమిని అప్పట్లో ఆవరించి భూమి మీద వుండే వుదకాన్ని పానము చేసి భూమిని బయిలు పడతోశినట్టున్ను అప్పట్లో వినాయకుడు మొదలయిన ఆవరణదేవతలు ఆచెట్టు కింద ప్రవేశించినట్టున్ను ఆదిశేషుడుకూడా వొకపుట్టను యిక్కడ కల్పించుకొని వసింపుచున్నట్టున్ను అఘుపి8మ్మట యీస్థలములో వసించగలందులకు పార్వతిని రమ్మంటే సృష్టి స్థితి సంహారములలో అధికారము తనకుకూడ యివ్వకగాని తాను రానని చెప్ప్నట్టున్ను పిమ్మట యీశ్వరుడు అదేప్రకారము అధికారము యిచ్చి పార్వతిని వెంటపెట్టుకుని ఆదిశేషునివల్ల పూజింపబడి అతను కట్టుకునివున్న వల్మీకములోనే ప్రవేశించి అద్యాది వుండేటట్టున్ను పార్వతీదేవినిన్ని త్రిపురసుందర్యాకారము వహించి సృష్టి స్థితి సంహారాధికారము చేయుచూ యిక్కడ విలశిల్లి వుండేటట్టున్ను చేస్తూవుండడమువల్ల సౌఖ్యముగా వచ్చి యీ బ్రంహ్మోత్సవాన్నిన్ని వేడుకపరచి తాము ఆనందపడిపోతూ వుంటారు. యీవూళ్ళో చెన్నపట్నము వుపసంపన్నులు అనేకసత్రాలు కట్తివున్నారు. విశాలమయిన వీఢులు కలవి. వీధులు టెంకాయచెట్లశాలల వల్లను బయిటితిన్నలు పందిళ్ళచేతనున్ను అలంకరించబడివున్నది. సుందరమయినచేవాలయము తటాక సహిరముగా వున్నది. సమస్తపదార్థాలు దొరుకును. యీవూరు తోటల చేత ఆవరించబడి వున్నది. యీ గుడిధర్మము లింగిశెట్టి కుమారుడైన అరుణాచలశెట్టి తనచేతి సొమ్ము సంవత్సరానకు 2000 వర్హాలదాకా ఖర్చు చేసి జరిగింపుచున్నాడు. ఆ ధర్మము కాక అతను వేశివుండే, తోట కట్టివుండే సత్రమున్ను సుందరముగా వున్నది. అతను అన్నదానాపేక్ష చాలా కల వంశములో జనించినాడు గనుక ఆవాసన యీ పురుషుణ్ణి బాగా పట్టి వున్నది.
యీ స్థల మహాత్మ్యము యేమంటే సృష్టికి ఆదియందు భూమి జలార్ణవమై వుండగా యీశ్వరుడు సృష్టికి అంకురముగా వొక ఔదుంబద వృక్షము కలగచేసి చండవాయువుచేత ఆవృక్షమును యుక్త ప్రదేశములో నిలువుమని పంపించి నట్టున్ను ఆ వృక్షము యీ ప్రదేశములో నిలువుమని పంపించినట్టున్ను ఆ వృక్షము యీ వూళ్ళో పతనమై పాతాళలోకము అంటినట్టున్ను అక్కడ వుండే ఆదిశేషుడు ఆవృక్షాన్ని పోషింపుచువచ్చునట్టున్ను దాన్ని వేళ్ళ పుష్టి భూమిని అప్పట్లో ఆవరించి భూమి మీద వుండే వుదకాన్ని పానము చేసి భూమిని బయిలు పడతొశినట్టున్ను అప్పట్లో వినాయకుడు మొదలయిన ఆవరణ దేవతలు ఆ చెట్టు కింద ప్రవేశించినట్టున్ను ఆదిశేషుడుకూడా వొకపుట్టను యిక్కడ కల్పించుకొని వసింపుచున్నట్టున్ను అటుపమ్మట యీ స్థలములో వసించగలందులకు పార్వతిని తెమ్మంటే సృష్టి స్థితి సంహారములలో అధికారము తనకుకూడా యివ్వక గాని తాను రానని చెప్పినట్టున్ను పిమ్మట యీశ్వరుడు అదేప్రకారము అధికారము యిచ్చి పార్వతిని వెంటపెట్టుకుని ఆది శేషునివల్ల పూజింపబడి అతను కట్టుకునివున్న వల్మీకములోనే ప్రవేశించి అద్యాపి వుండేటట్టున్ను పార్వతీ దేవిన్ని త్రిపురసుందర్యాకారము వహించి సృష్టిస్థితి సంహారాధికారము చేయుచూ యిక్కడ విలశిల్లి వుండేటట్టున్ను పిమ్మట యీశ్వరుడు తన ప్రతిభాతిని మూర్తీగాచేసి సుందరుడని నామముపెట్టి పార్వతియొక్క ప్రతిభాతితో పొగడచెట్టుకింద యిద్దరి కిన్ని వివాహముచేసినట్టున్ను ఆ వాహము ఛూడవచ్చిన గంగాస్నాతయయిన భక్తుడు కాలాతీతముగా వచ్చి వివాహము చూడడానకు లేకపోయెనని దు:ఖపడితే అతని గంగను యిక్కడి తటాకములొ విలసింపచేసి మళ్ళీ ఆవివాహ లాంఛన జరిగించి అతనికి దర్శనము యిచ్చినట్టున్ను ఆ వివాహలాంచన ప్రతిసంవత్సరము యిప్పుడు బ్రహ్మోత్సవములో పొగడమాను సేవ అని జరిగేటట్టున్ను బ్రహ్మకు పార్వతి నిమిత్తము తాను ఆడిన తాండవము యీశ్వరుడు యిక్కడ మళ్ళీ దర్శనము అయ్యేటట్టు చేసినట్టున్ను మరికొన్ని కాలాలలో కొందరు భక్తులకు అపహరించబడ్డ భాగ్యాన్ని త్యాగము చేసినట్టున్ను మొట్టమొదట పుట్టిన పురి అయినందున యీవూరు ఆదిపురి అనిపేరు కలిగి తాండవము చూపుటచేత తాండవ ప్రయుక్తమయిన భవును అనే నటనలు ఆడుతూ త్యాగద్వారా త్యాగరాజు అని మూర్తి పేరువహించి వల్మీకనివాసముచేత అదే మూలస్థానమై వుండేటట్టుగా ప్రసిద్దిపడి యున్నది. యిక్కడ మరునాడు దాకా వచింనాను.
3 తేది సాయంకాలము 5 గంటలకు బయిలువెళ్ళి యిష్టులతో కూడా చెన్నపట్టణమునకు అరకోసెడుదూరములో తండయారు వేడులో వుండే నాతోట యిల్లు ఆరుగంటలకు చేరినాను. దారి యిసక పొరభూమి. యిరుపక్కలా తోటలు సత్రాలు దట్టముగా వుండుటచేతనున్ను భాట వెడల్పు చలాకలిగివుండుట చేతనున్ను బహు రమణీయముగా చూడవేదుకగా వున్నది. జగదీశ్వరుడు ఈ తృణాన్ని మేరువు చేసుననే వాక్యము సత్యము అని నేను అతి ఘోర ప్రమాణము చేయగలను. అది యెట్లాగంటే నేను స్వస్థలము వదిలి మళ్ళీచేరినకాలము 15 మాసాలౌ 15 దినాలు 10 నిమిషాలు. నాస్వస్థలము వదిలి దూరదేశము సంచరించి మళ్ళీవఛ్ఛినట్టు నాకు నాపరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లుకూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్థలముచేర్చినాడు. గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువుచేస్తాడనే మాట సత్యం సత్యం పున:సత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలశినది.
నా జన్మభూమి అయిన చెన్నపట్టణపు వృత్తాంతము యెటువంటిదంటే 300 యేండ్ల కిందట చంద్రగిగిలో బీజానగరపు స్దంస్థానాధిపతి యయిన శ్రీరంగరాయడు దొరతనము చేయుచుండగా డే అనే దొర యీ సముద్రతీరమునందు వొక రేవుబందరు కట్టించవలనని యత్నము చేసి శ్రీగంగరాయణ్ని అడిగి వుత్తరువు తీసుకుని యీ ప్రాంత్యాలకు జమీందారుడయిన దామర్ల వెంకటాద్రినాయుడి పేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటాద్రినాయడు డే దొరకు కృతపరిచయుడు గనుక శ్రీరంగరాయడు తన పేరుపెట్టి శ్రీరంగరాయ పట్టణము అని రేవు బందరు కట్టమన్నా వెంకటాద్రినాయడు తన తండ్రియైన చెన్నపనాయడి పేరట చెన్నపట్టణ మని పేరుపెట్టి కట్టమని చెప్పడమేగాక తానే సన్నిధానాధిపతి గనుక అదే నామకరణము ఆరంభములో ఛేసినందున చెన్నపట్టణమని పేరు కలిగినది. తత్పూర్వము యీరేవును యింగిలీషువారు మదిరాసు అంటూ వచ్చినారు.
పిమ్మట 1644 యింగిలీషు సంవత్సరములో రేవు బందరుకు చేరినట్టుగా వొక కోటకట్టి చముద్రతీరము నందు రెండుకోసుల భూమిని యింగిలీషువారు స్వాధీనము చేసుకున్నారు. అటుపిమ్మట 1661 సంవత్సరములో యింగిలీషువారిలో కొంత అంత:కలహము జరిగి అరాజమమయి 1671 సంవత్సరములో మళ్ళీ స్థిరపడి యీ రేవు బందరు సుంకము యిజారా కుంఫిణీవారి చేసినారు. వంబడిగానే కుంఫిణీవారి ప్రాపకము కోరి జగదీశ్వరుడు సత్యవాదులపై పక్షపాతి గనుక యింగిలీషువారు చాలా సత్యసంధులయినందున యీ బస్తీలో మూడు లక్షల ప్రజ వాసముఛెశేటట్టు చేశినాడు. పిమ్మట 1666 సంవత్సరములో 40000 వరహాలు సాలుకు యెత్తేపాటి భూమి కుంఫిణీవారి యధీనమయినది. పిమ్మట 1702 సంవత్సరములో డిల్లీ పాదుషా అవరంగజీబు తరపున దావూతుఖానుడు దండుయెత్తివచ్చి యింగిలీషువారిని చాలా కలతపెట్టినాడు. అప్పట్లో అనేక తెగలు అనేక దేశములనుంచి యిక్కడికి చేరినందున యెడమచెయ్యి కక్షి అని కుడిచెయ్యి కక్షి*[3] అని రెండు పక్కలుగా యిక్కడివారు చీళి యింగిలీషువారికి చాలా శ్రమను కలగఛెసినారు. అందుకు 40 సంవత్సరముల తర్వాత ప్రాంసువారు యీకోట తీసుకొని యింగిలీషువారిని వెళ్ళకొట్తినా హిందూస్థాన్ లో యింగిలీషుజాతికి దిగ్విజయము కలిగి వుండెను గనుక వారు వొకపాటిగా సమాళించినారు. వెంబడిగానే 5 సంవత్సరములకు రాజీ మీద యీ స్థలమును యింగిలీషువారు స్వాధీనము చేసుకున్నారు. 1742 సంవత్సరములో కలాపన పొసగి జగదీశ్డ్వరుని కటాక్షముచేత ప్రాంసు దండు పరారి అయిపోయినది. అది మొదలుగా అరికాటి నవాబును విహితపరుచుకుని క్షేమముగా కాలము తోయుచుండగా 1767 సంవత్సరమువరకు హయిదరుతో నవాబు నిమిత్తము పోరవలశి వచ్చినది.
అది మొదలు యధాక్రమముగా అరికాటినవాబు రాజ్యమంతా యింగిలీషువారి అధీనమయి వుత్తరము గంజాం మొదలు దక్షిణము తిన్నెవల్లి శీమవరకున్ను తూర్పుసముద్రము మొదలు పశ్చిమసముద్రమువరకున్ను యేకచక్రాధిపత్యముగా యీ చెన్నపట్టణమును రాజధాని చేసుకుని కుంఫిణీవారు యేలుతూ వున్నారు. యీ రాజదానికింద యిప్పుడు వుండే జిల్లాలు యిరువైవొకటి. యింత భూమిమధ్యే మయి సుమారు మళయాళము కొచ్చిల్ యీ దేశముల రాజులుతప్ప కొదవ అందరు జమీందారి పాయకాలవారు గాని యుద్ధసన్నద్ధులు కాగల భూపతులు వొక్కడున్నులేరు.
యీ చెన్నపట్టణము కొడి (జండా) కింద యిప్పుడు సాలుకు సుమారు ఒకటింకాలు కోటివరహాలు వసూలవుతున్నవి. ఖరుచులు అప్పులకు యిచ్చేవడ్డి సహాగా వసూలుకు యెక్కువగాని తక్కువలేదు. యీ చెన్నపట్టణము కొడికింద కుంఫిణీవారి అప్పు సుమారు రెండుకోట్లవరహాలు వుండును. స్థావరజంగమ రూపమైనస్థితి మూడుకోట్ల వరహాలు వుండునని తోచుచున్నది. దండు 40 వేలమంది ఫౌజువున్నది. యీ చెన్నపట్టణపు బస్తీకి మూడుపక్కలా షహరు (పానా) గోడపెట్టివున్నది. తూర్పుపక్క సముద్రమేగాని గోడలేదు. బస్తీకోసెడు దూరములో దక్షిణపక్క యుద్ధసన్నద్ధమయిన కోట సముద్రవారగా కట్టివున్నారు. వుత్తరపక్క సముద్రముగట్టున యెగుమతి దిగుమతులయ్యే రేవు సరుకు వేసేకొట్లున్ను కట్టి వున్నవి. ఈ చెన్నపట్నానికంతా పాపంవీథి శాలవీధి ఈరెండున్ను విశాలమైనవి. నిండా కుసంధి అయిన వీధులుకావు. యిండ్లకు రెండువిధాల పన్ను రూకలు తీసుకుని వీధులుపూడ్చి మరామత్తుచెసి ఠాణాలు వుంచి కుంఫిణీవారు కావలి కాస్తూవుంటారు. యిండ్లు తలవాకిలి తిన్నెలు పందిళ్ళు బయిటికి అలంకారముగానున్నూ లోపల కలకొద్దిలో ఘాలికి అడ్దులేకుండా కట్టియున్నారు. పది దేవాలయముల దాకా యున్నవి. అందులో విభవముగా ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతూ వుంచున్నవి.
సముద్రముగుండా వచ్చేపొయ్యే సరుకులకు తీరువసుంకము తీశే నిమిత్తము సముద్రతీరమందు కష్టంహవుసు అని వొక కఛ్ఛేరివున్నది. గట్టున వచ్చేపొయ్యే సరుకులకు తీరువ తియ్యడానకు పడమటిపక్క లాండు కష్టంహవుసు అని వొక కచ్చేరి కట్టివున్నది. మిగిలిన కఛ్ఛేరీలు కొన్ని రేవులొనున్ను, కొన్ని కోటలోనున్ను, కొన్ని బయటతొటలలోనున్ను చేయుచూ వుంటారు. సర్వాధికారియైన గౌనరుయిల్లు అరికాటి నవాబు యిల్లున్ను కోటకు దక్షిణభాగ మందు పావుకోసు దూరములొ తిరువళిక్కేణి అనె వుపగ్రామములో వున్నవి. జాతుల వాండ్లందరు బస్తీకి దక్షిణము ఆమడ దూరములో వుండే పెరుంబూరి వరకున్ను సుందరమయిన తోటలు వేసి బంగాళాలు, యిండ్లు కట్టుకుని వున్నారు. బస్తీలోపలవుండే హిందువుల యిండ్లలో అయ్యాపిళ్ళ యిల్లు పెద్దది. కోటలోపల వుండే యిండ్లలో వాడలకు తెలిశే నిమిత్తము రాత్రిళ్ళు దీపముపెట్టే యెక్కీసుచెంజియిల్లు పెద్దది. బయిటావుండే జాతులవాండ్ల మిద్దెలలో మురాతు (J.Moorat) కట్టిన యిల్లు పెద్దది.
బస్తీకి దక్షిణము తిరువళిక్కేణి, మయిలాపూరు, తిరువటేశ్వరుని పేట మొదలయిన కొన్ని వుపగ్రామాలు వున్నవి. పడమటిపక్క చూళ పొరికపాక, కోమలేశ్వరునిగుడి యివి మొదలయిన కొన్ని గ్రామాదు లున్నవి. వుత్తరభాగమందు చాకలపేట, రాయపురము, తండయారువేదు మొదలయిన్ కొన్ని గ్రామాలు వున్నవి. యీ బస్తీలో వుండే హిందువులు అందరు వుత్తరభాగమందు తిరువట్టూరి వరకు ఆరామక్షేత్రాలు భేటాగా యేర్పరచుకొని విలాసకాలముల యందు అక్కడికి వెళ్ళి విహరిస్తూ వుంటారు. కోమలేశ్వరున గుడివద్ద వొక చిన్నయేరు ప్రవహింపుచున్నది. దక్షిణపక్క మయిలాపూరు చెరువు కట్టివున్నది. పడమటిపక్క లుంగంబాక చెరువు కట్టియున్నది. వుత్తరపక్క ప్రతి తోటలలో తటాకాలు, దొరువులు తొవ్వివున్నారు. అందులో జగదీశ్వరుని కటాక్షముచేత మంచినీళ్ళు కలిగివున్నవి. సమస్త ద్వీపాంతరాల పదార్ధాలు కలవు. పనివాండ్లసహా అమితముగా కలరు. అయితే జనసమ్మర్దముచేత భూమి ఆరోగ్యమయినది కాదు. వుష్ణవయువు భూమి. సంకలిత రోగాలు ప్రాప్తిస్తూ వస్తున్నవి. కాల నియమాలు లేకుండా కాయగూరలు, ఫలాదులు, పుష్పాదులు అమితముగా దొరుకుచున్నవి.
యిక్కడివారి ప్రకృతులు ఉపాయవేత్తలుగాని సాహసులుగారు. ద్రావిడాంధ్రకర్ణాటక దేశాలమధ్యే యీ ప్రదేశము వుండుటచేత బాల్యాదారభ్య దేశ్యములయిన ఆ మూడు భాషలున్ను ముందు దొరతనముచేసినవారి తురకభాష, యిప్పుడు దొరతనము చేసే యింగిలీషువారి భాషయున్నూ నోటనానడముచేతనున్ను, పదార్ధములుగా కొన్ని సంసృతవాక్యాలు అభ్యసించుటచేతనున్ను యిక్కడివారి వుచ్చారణ స్ఫుటముగా వుంటూ వచ్చుచున్నది. యిక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్ను, పురుషుల పట్ల నిండా చొరవచేసుకొగలవారుగానున్ను అగుపడుతారు. అయితే వస్త్ర్రాభరణప్రియులే గాని నైజగుణమయిన సాహసము నిండా కలవారుగా తోచలేదు.
యిక్కడి భూమి సారవత్తు కాకపోయినా లోకులు చేసే కృషివల్ల ఫలకారిగా వున్నది. వృక్షాదులు పుష్టికలవి కాకపోయినప్పటికిన్ని యిక్కడ సమస్తదేశపు వృక్షాదులున్ను కలవు. సమస్తజారుల పుష్పాదులు చూడవచ్చును. యిక్కడివారు చాలా మూర వెడల్పుకలబట్టలు కట్టుతారు. యధోచితము యిక్కడివారు కర్మకులుగానున్ను, దేవబ్రాహ్మణ విశ్వాసము కలవారుగానున్ను వుంటారు. యిక్కడి హిందువులకు పూర్వపు పురోవృద్ధి లేకపోయినప్పటికిన్ని ముందర చెందిన వాసనను ప్రయాసమీద కాపాడుకుంటూ వస్తారు. జాతులవారి జనబాహుళ్యము వారి విభవముతో స్త్రీ పురుష సల్లాపాలు చూడ వలిస్తే ప్రతిదినము సాయంకాలమందు పరంగికొండశాల [4] లోను సముద్రము వద్ది వాడరేవుశాల*లోనున్ను నిలిస్తే వారందరు వాహన విశేషాలు యెక్కి వస్తారు గనుక చూచి ఆనందించ వచ్చును. యిట్టిదొరతనములో జగదీశ్వరుడు నావంశపరంపరగా జీవనము కలగజేసి నన్ను వుంచియున్నాడు.
కాశియాత్ర చరిత్ర సంపూర్ణమైనది.
ఏనుగుల వీరాస్వామయ్యగారి
కాశీయాత్ర చరిత్ర
అనుబంధము
సంపాదకుడు
దిగవల్లి వేంకట శివరావు
బెజవాడ
అనుబంధము
సూచిక:
విషయములు పుట
1.సౌరమానము, చాంద్రమానము,బౌర్హస్పత్యమానము,
అధిక క్షయ మాసాలు 1-4
2.సనరణల పట్టిక 3-16
3.చెన్నపట్టణ ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారములో వున్న
కాశీయాత్ర చరిత్ర అసలు గ్రంధం వ్రాతప్రతి - మచ్చుపుటలు 17-33
4.కాశీయాత్ర చరిత్రలోని కొన్ని పదముల అర్ధములు 34-40
5.అకారాది విధయసూచిక 41-79
కృతజ్నత
ఈ గ్రంధప్రకటనకు అనేక అంతరాయాలు కలిగినప్పటికీ, పరమేశ్వరుని అనుగ్రమహంవల్లను, మిత్రుల తోడ్పాటువల్లను, ఇది నిర్వహింపగలిగాను. ఈకార్యంలో బ్రహ్మశ్రీ శతావధాని వేలూరి శివరామశాస్త్రులుగారు, శ్రీ చెరుకుపల్లి వేంకటప్పయ్యగారు, శ్రీ ఘంటసాల సీతారమశర్మగారు, శ్రీ చల్లా జగన్నాధంగారు, శ్రీ కుందా నరసింహమూర్తిగారు మొదలైన నామిత్రులు చాలా శ్రద్దతీసుకుని నాకనేక విధాలుగా తోడ్పడ్డారు. శ్రీ శాస్త్రులువారు తమ ఆరోగ్యం సరిగ్గాలేనప్పటికీ పుస్తకాన్ని జాగ్రత్తగా పరిశోధించి కొన్ని ప్రయోగాలకు అవసరమైన అర్ధాలు వ్రాసి యివ్వడమేగాక అకారాది విషయ సూచికను కూడా సరిచూసి కొన్ని సంగతులు చేర్చారు. వీరందరికి కృతజ్నుడను.
9-10-41 -దిగవల్లి వేంకటశివరావు 1941 సం|| మార్చి 16 తేది మొదలు జూలై 9 వ తేది వరకు ఆంధ్రనార పత్రికలో వారానికి ఆరు ఏడు కలములచొప్పునను, మార్చి 1 వ తేది మొదలు మే 10 తేది వరకు కృష్ణాపత్రికలోనూ, వరసగా ప్రతివారము వ్యాసాలరూపంగా ప్రకటితమైనది. ఇది ఇంకా పుస్తకరూపంగా ప్రకటించబడలేదు. మీకు కావలిస్టే ఆ సంచికలు తెప్పించుకుని చదివి చూడండి. చ్సరిత్రపేరున మన కన్నులు గప్పుతూ బ్రిటిష్ ప్రభువుల యాధిక్యతను మన అల్పత్వమును ప్రకటించుటకు భారత దేశమున బ్రిటిష్ రాజ్యతంత్రమును సమర్థించుటకు ఏర్పడిన చరిత్ర వాజ్మయం లోని అసత్యపు వ్రాతల నన్నింటినీ పూర్వకాలంనాటి ఇంగ్లీషు గ్రంధకర్తల నోళ్ళద్వారానె ఖండించి రాజకీయార్థిక రహస్యాలను భేదించి యధార్ధ చరిత్రను బయల్పరచ గలిగాను. ఇంకా వివరాలు కావలసిన వారు చదువుకో గలందులకు అసలు గ్రంధాలపేర్లుకూడా అందులో వుదాహరించాను. ఇది నాలుగేళ్ళనుంచీ చేస్తూవున్న పరిశొధన యొక్క ఫలితము.
ఆంధ్ర వార పత్రికలోని వ్యాసాల శీర్షికలు చూడండి:
- "విస్సన్న చెప్పింది వేదం-విన్ సెంటుస్మిత్తు వ్రాసింది చరిత్ర"
(ప్రచారంలో లేకుండా చేయబడిన పూర్వచరిత్రలు; చరిత్రలో కెక్కకుండా చేయబడిన, ఆంగ్లయుగంనాటి చరిత్రాంశాలు; నూతనంగా సృష్టిమబడిన పక్షపాతపు చరిత్రలు.)
- భారతదేశ పారతంత్ర్యము - భారతీయుల దేశాభిమానము.
(భారతీయులు బ్రిటిష్ రాజ్యతంత్రానికి సులభంగా లొంగలేదు- దానికి ఇష్టపడి హర్షించలేరు - నూరేండ్లు పోరాడారు.)
- ధరణాకూర్చొనుట - సాత్విక విరోధము.
(1678-82; 1865; 1813-15 సంవత్సతములలో కుంఫిణీ పరిపాలనలో జరిగిన సత్యాగ్రహముల చరిత్ర.)
- ఇంగ్లీషు దొరతనముయొక్క ప్రత్యక్ష ఫలితాలు.
(భారత దేశ రాజకీయ ఆర్ధిక సాంఘిక పరిస్థితులలలో మార్పులు.)
- బ్రిటిష్ హెబరుగారి భారదేశయాత్ర.
(1824-26 మధ్య ఆయన చూచిన భారతదేశ స్థితిగతులు.)
- కృష్ణాపత్రికలో- "ఇంగ్లీషు చదువుల చరిత్ర."
కాశీయాత్ర చరిత్ర - అనుబంధము
సౌరమాన చాంద్ర మాసములు - అధిక క్షయమాసాలు.
ప్రపంచములో మనుష్యులందరూ సూర్యచంద్రుల నడకలను బట్టి కాలం లెక్కించుకుంటారు. అమావాస్యనుండి అమావాస్యవరకు గాని పౌర్ణమినుండి పౌర్ణమివరకూ గాని చంద్రుని వృద్ధి క్షయాలు చూసి నెలలు లెక్కపెట్టుకుంటారు. ఇలాంటి నెలలో రమారమి 29 1/2 రోజులు వుంటాయి. అలాగే సూర్యుడి నడకవల్ల కలిగేఋతువుపోయి అది మళ్ళీ రాగానే ఒక సంవత్సరమైనదని వ్యవహరించు కుంటారు. సూర్యుడు ఆకాశ చక్రంలో మేషాది పండ్రెండు రాసులూ తిరిగి రవడానికి 365 రోజుల 6 గంటల 12 నిమిషాలు 30 సెమనులు పడుతుంది. 12 చాంద్రమాన మాసాలూ కలిసి 354 రోజుల 8 గంటల 48 నిమిషాల 34 సెకనులు మాత్రమే అవుతాయి. సూర్యుడొక రాసినుంచి ఇంకొక రాసిలో ప్రవేశించడానికి సంక్రాంతి అంటారు. దానికి పట్టే కాలాన్నే మాసంగా లెక్క పెట్టుకుంటే ఒకనెలలో 29 లేక 30 రోజులు ఇంకొక నెలలో 31 రోజులు వుంటూవుంటాయి. అలాంటి 12 నెలల సౌరసవత్సరానికి రోజులు 365 1/2 అవుతాయి. ఇలాంటి పండ్రెండు సంక్రాంతులను బట్టి ఏర్పడిన 12 మాసాలకూ మేషాది 12 రాసుల పేళ్ళు చైత్ర వైశఖాది 12 పేర్లుకూడా వ్యహారంలో వున్నాయి. ఈపద్ధతికే సౌరమాసం అని అంటారు. ఇది అరవదేశంలోను మళయాళదేశంలోనూ బంగాళాదేశంలోను వాడుకలోవుంది.
క్రీస్తుశకంలో ఇంగ్లీషువారు వాడేమాసాలుకూడా సౌరమానమాసాలే. తురకలు కేవలమూ నెలబాలుణ్ణీచూసి లెక్కపెట్టే చాంద్రమానమాసాలే వాడుకుంటారు. సౌరమాన సంవత్సరం కన్న చాంద్రమాన సంవత్సరం చిన్నది అవడంవల్ల వారి పండుగలు కొన్నాళ్ళవరకూ ఒక ఋతువులోను కొన్నాళ్ళతరువాత ఇంకొక ఋతువులోనూ వస్తూవుంటాయి.. పైన చెప్పినట్లు చంద్రసూర్యులు గమనాన్ని బట్టి గాక బృహస్పతి గమనాన్నిబట్టి కాలం లెక్కించుకొనే బార్హస్పత్యేమానం అనేది ఒకటి ఉత్తర హిందూస్థానంలోమగద దేశము మొదలైనచోట్లను ఓడ్రదేశంలోను వాడుకలో వున్నది. ఈ మాసంలో సంవత్సరానికి రమారమి 360 రోజులే వుంటాయి.
మన ఆంధ్రదేశంలోను మహారాష్ట్ర కర్ణాటక దేశాలలోను చాంద్రమానమే వాడుకలో వున్నది. చాంధ్రమానం శుద్ధపాడ్యమితోను సౌరమాన మాసం సంక్రాంతితోను ఆరంభం అవడం వల్లను ఒకే పెరుగల మేష లేక చైత్రమాసం యొక్కవ్యాప్తి సౌరచాంద్రమానాలనుబట్టి తేడా వున్నందువల్లను యీరెండు మాసాలని బట్టి ఏర్పరచిన పర్వదినాలకు, సంబంధం లేకుండాపోతుందని మన జ్యోతిష్కులు చాంద్రమానాన్ని సౌరమానానికి లంకేవేసి మన సంవత్సరాదిని సౌరమానం మేష మాసం మన చైత్రమున్నూ వృషభమాసం వైశాహమున్నూ అవుతాయి. పైవుద్దేశ్యంతో మన పంచాంగాలలో తిధి వార నక్షత్రాదులను కూడా ఇలాగే సరిపుచ్చారు. అమావాస్యనాడు సూర్యచంధ్రులు కలిసియుంటారు. చండ్రుడు రొజుకు రమారమి కాశీయాత్ర చరిత్ర - అనుమంధము
13 అంశలు (డిగ్రీలు) నడుస్తాడు, సూర్యుడు ఒక అమ్శ మాత్రమే నడుస్తాడు. అందువల్ల వీరిద్దరికీ 59 ఘడియల 4 విగడియలలో, (23 1/2 గంటలలో) 12 అంశల అంతరం కలుగుతుంది. ఈఅంశం వల్లనే ఒక తిధి ఏర్పడుతుంది. ఇలాంటి 30 తిధుల కొక చాంద్రమాసం అవుతుంది. అయితే చాంద్రమాన సంవత్సరంలో తిధులు 360 వున్నా రోజులు 354 మాత్రమే గనక తిధులు వృద్ధిక్షయం చెంది 6 రోజులు తగ్గుతాయి. సూర్యచంద్ర్రుల నడకలలో తేడాలవల్ల ఒక తిధివ్యాప్తి ఒకప్పుడు 65 గడియలు ఇంకొకప్పుడు 53 గడియలూ వుంటుంది. ఇలాగ మొత్తం మీద చాంద్రమాన సంవత్సరంలో 13 క్షయ తిధులూ 7 వృద్ధి తిధులూ వుంటాయి.
ఇంక నక్షత్రాల సంగతికూడా ఇంతే. మొత్తం మీద చంద్రుడు రోజుకో నక్షత్రంలో వుంటాడుగనుక నక్షత్రమాసంలో 27 రోజులు పైచిల్లర వుంటాయి. తిధులలాగనే కొన్ని నక్షత్రాల వ్యాప్తి వృద్ధీ కొన్నింటిని క్షయమూ చెందుతుంది.
వారానికి 7 రోజులే వుంటాయి గాని పక్షంలో మాత్రం ఒక్కొకప్పుడు 13 రోజులు, ఒక్కొక్కప్పుడు 14 రోజులు, 16 రోజులుకూడా వుంటాయి.
పైన చెప్పినట్లు చాంద్రమానాన్ని సౌరమానంతో సరిపుచ్చడంలో రమారమి మూడు సంవత్సరాల కొకమాటు చాంద్రమాన సంవత్సరంలో 13 నెలలు ఏర్పరచ వలసి వస్తూ వుంటుంది. దానికే అధిక మాసమంటారు. ఏమాసం అధికమాసంగా నిర్ణయించడం అనే విషయంలో కూడా సంక్రాంతినే లక్ష్యంగా తీసుకుంటారు. సూర్య చంద్రుల గమనాలను బట్టి చాంద్రమానం చిన్నదిన్నీ సౌరమానం పెద్దదిన్నీఅ అయినప్పుడు ఆ చాంద్రమానంలో సంక్రాంతి వుండదు. ఆమాసాన్ని అధికమాసంగా నిర్ణయిస్తారు. చాంద్రమాసము పెద్దదిన్నీ సౌరమాసము చిన్నదిన్నీ అయినప్పుడు ఆ చాంద్రమాసంలో సూర్యుడు ఒకరాసి దాటి యింకొక రాసిలోకి పోయి మళ్ళీ దానిని కూడా దాటి మూడవరాసిలోనికి పొతాడు. ఒకేచాంద్రమాసంలో ఇలాగ రెండు సంక్రాంతులు కలగడంవల్ల ఆమాసానికి రెండు పేళ్ళు పెట్టవలసి వస్తుంది. అందుచేత ఆ సంవత్సరంలో ఒక నెలను అణిచివేస్తారు. దనికే క్షయమాసమంటారు. అప్పుడు 11 నెలలే వుండవలసిందేగాని క్షయమాసం వచ్చిన సంవత్సరంలో తప్పకుండా అధికమాసంకూడా వస్తూవుంటుంది గనుక ఆ సంవత్సరంలోకూడా సరిగ్గా 12 నెలలు వుంటాయి. క్షయమాసాలు చాలా అదుదుగావస్తాయి. నూరు సంవత్సరాలలో ఒకటి రెండు క్షయమాసాలు వస్తాయి. శాలివాహన శకము 1744 వ సంవత్సరము (క్రీ.శ. 1822-23) చిత్రభాను నామ సంవత్సరంలో ఆశ్వయిజం అధికమాసంగాను పుష్యమాసం క్షయమాసంగాను వచ్చాయి. మళ్ళీ (1963-64) శోభకృతు సంవత్సరంలో పుష్యము క్షయమాసంగాను ఆశ్వీజము అధికమాసం గాను వస్తాయి. ఎఫ్ఫుడువచ్చినా క్షయమాసం మార్గశీర్ష పౌష మాఘ మాసాలలో నే వస్తాయి. ఎందుచేతంటే ఈ చాంద్రమాసాలకు 29 దినముల వ్యాప్తిగల సౌరమాసములతో సంబంధం వున్నది.*
- చూడు: ఆంధ్రవిజ్ఞాన సర్వస్వంలో కొమఱ్రాజు లక్షమణరావుపంతులు గారు వ్రాసిన "అధికమాసం" అనే వ్యాసము: లక్ష్మణరాయ వ్యాసావళిలో 'పంచాగము ' అనేవ్యాసము.
కాశీయాత్ర చరిత్ర - సవరణల పట్టిక
[మార్చు]- ↑ * ఇక్కడ యీదులనారాయణయ్యగారి దగ్గఱ బసచేసినా నని వ్రాతప్రతి 420 పుట.
- ↑ * 'కోమలేశ్వరుడి గుడి మునియపిళ్ళ కొమారుడు శ్రీనివాసపిళ్ళ వారున్ను వచ్చి కలుసుకొని తమ సంకల్పం సిద్దించెగదా అని ఆనంద పడ్డాడు ' అని వ్రాత ప్రతి 481 పుటలో వున్నది.
- ↑ * కుడియెడమల కులకక్షలు: వైష్ణవబ్రాహణులలోని వడగలి తెంగలి తెగలవలెనే ద్విజేతరకులములందు కుడి ఎడమ కులకక్షలు చాలాకాలమువరకు అతి తీవ్రముగా నుండేవి. కుడిచెయ్యి కలకక్షిలో లింగధారణముచేసిన నేతగాండ్రు, తెలికలవాండ్లు, కుట్రపుపనివాండ్రు, బలిజలు, గొఱ్ఱెల కాపరులు, కుమ్మరులు, మేదరులు, చాకళ్ళు, మంగళ్ళు, జోగులు, బుడబుక్కలవాండ్రు, మాలలు నుండిరి. ఈ కుడికులమువారిని కొన్నిచోట్ల చైనాచారులని న్ని, కొన్నిచోట్ల మహానాటివారనిన్ని వ్యవహరించిరి. ఎడమచెయ్యి కులములను పాంచాలలనిన్ని, మత్తుజనిన్ని వ్యహరించిరి. వీరిలో జందెములు వేసికొను అయిదు తెగల బత్తులు, వెండి బంగారు పనిచేయు కంసాలిబత్తులు, రాగి యిత్తడి పనిచేయు కంచరిబత్తులు, రాతి పనిచేయు శిల్పులు, రంగులువేయు హటగాదులు, నేతనేయు దెవాంగులును, గొల్లలు, మతరాచలు, మాదిగలు మొదలగువారుండేవారు. ఈ రెండు కక్షలలోని కులములవారు వొకరికన్న వొక రెక్కువ వారమనిన్ని తమకు ముందుగా మర్యాదలు జరుగవలెనన్ని తగవులాడుచుండేవారు. ఈ రెండు తెగలకు వేరువేరు మతాచారములుండెను. దేవతలు దేవుళ్ళు నుండిరి. వీరి వివాహములందు మరణములందు కొలువులందు జాతరలందు ఒక కులకక్షివారి వీధులనుండి రెండవకక్షి కులములవా రూగేంపులు చేయకూడదను కులకట్టులు నిషేధములు అనాదిసిద్ధముగా నుండి తగవులకు దెబ్బలాటలకు కారణ మగుచుండెను. పెండ్లిండ్లలో మహానాటివారిలో మాలలు గుఱ్ఱమునెక్కి యూరేగుటకు కొన్ని గ్రామములందభ్యంతర ముండెను. తక్కివారిలో ఆయా కులముల తారతమ్యములను బట్టి పల్లకీలు మొదలైనవి యెక్కి భజంత్రీలు మేళతాళములతో నూరేగినచో నెడమకులములవా రభ్యంతర పెట్టకుండిరి. ఇంకను చిత్రవిచిత్రములైన యాచారాలుండెను. ఇవి మీరినట్లయితే రెండవారు ఆటంక పరుచుచుండేవారు. చాలాకాలమువరకు నింగ్లీషు కుంఫినీప్రభుత్వము వారీ కులమర్యాదలను కాపాడుచునే యుండిరి. సివిలు క్రిమినలు కోర్టు లీ తగవులతో నిండుచుండేను. దేశము తెలుగు మీరిన తరువార రోడ్లు మొదలగు బహిరంగస్థలములలో నందరికిని సమానమైన హక్కులు కల సమ సిద్ధాంతము స్థాపింపబడినది. చెన్నపట్టణమున 1652, 170-7, 1718 సంవత్సరములం దిట్టితగవులువచ్చింట్లు కుంఫిణీ వారి రికార్డులలోనే వివరింపబడియున్నది. ఈ రెండుకులములవారికి పెద్దనాయకునిపేట ముత్యాలపేటలలో ప్రత్యేక వీధు లేర్పాటు చేయబడెను.
- ↑ పరంగికొండ అనగా సెంట్ తామస్‌మౌంటు. 'శాల' యనగా బాటకిరు ప్రక్కల నీడకొరకు వేయు చెట్లవరుస. ఆకాలమున మౌంటురోడ్డులో కోటదగ్గర నుండి సెంట్ తామస్‌మౌంటుకు పోవు దారిలో 5 మైళ్ళ దూరమున కారన్ వాలీసు స్మారక చిహ్నము వరకు బాట విశాలమైనునుపైయుండెను. దానికి రెండుప్రక్కల మఱ్ఱిచెట్లు ఇతరవృక్షములు వరుసగానుండెను. ఇంగ్లీషు స్త్రీ పురుషులు సాయంకాల మా స్మారక చిహ్నము వరకు పల్లకీలలోను బండ్లలోను పోయి అక్కడ నేడు బీచిలోవలెనే సరససల్లాపములతో విహరించుచుండిరి. ఇట్లే వాడరేవు అనగా హార్బరు వద్దను నీడకొరకు చెట్లు వరుసగా పెంచియుండిరి. ఇదియే వాడరేవుశాల.