కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/317వ మజిలీ

వికీసోర్స్ నుండి

317 వ మజిలీ

శైలకందరము కథ

మణిగ్రీవజలంధరులు విమానముమీద ననంగమోహినిని బెట్టుకొని యక్ష లోకమునుండి తిన్నగా బుడమికేతెంచి హిమశై ల శిఖరమున నొక రమణీయప్రదేశమును జేరి అందు దివ్యయానము నిలిపి యప్పటికిని దెలివిదప్పియున్న యా యలినీల లామ నొక కందరాంతరమున కెత్తుకొనిపోయి యందు లలితాపల్లవములచే నమరింప బడిన శయ్యయందు బరుండబెట్టిరి. ఆమెకు స్మృతి వచ్చులోపల నాప్రాంతమందున్న స్వాదు ఫలముల గొన్ని దెచ్చి యుంచుట సమంజసమని తలంచి వారిరువురిలో నొక డట గాపుండుటకును రెండవవాడు ఫలాన్వేషనమునకుబోవుటకును నిశ్చయించుకొనిరి. మణిగ్రీవుడందుండెను. జలంధరుండు విమానమెక్కి యా * ప్రాంతముల యందు ఫలముల కై తిరుగుచుండెను ఇంతలో ననంగమోహినికి తెలివివచ్చి గుహాముఖమున నున్న మణిగ్రీవుని జూచి చకితురాలయ్యెను. కుచ్చిత కార్యాచరణపరాయణుండగు నాయక్షకుల కలంకుని బారినుండి తప్పించుకొనుట కుపాయమును జూపింపుమని పర మేశ్వరుని ప్రార్దించుచు మణిగ్రీవుడెరుంగకుండ మెల్లగా నా శయ్యనుండి లేచి తెంపున నా గుహలో గొంతదూరము లోనికి బోయి నిముసములో మాయమయ్యెను.

కొంతసేపటికి మణిగ్రీవుండా వేదండయానకు దెలివివచ్చినదేమో యని తిరిగిచూడ నా శయ్య యందామె వానికి గనంబడలేదు. అ౦దుల కులుకుచు నతండతి రయమున లేచి యచ్చటకేగి పరికించెను. అందామె యెందును జూపట్టకుండుటకు మనమున భయవిషాదవిస్మయములం బొందుచు నాగహ్వరాంతమునకు బారిపోయినదని నిశ్చయించి యామెను వెదుక లోనికిఁబోయెను. అంధకారబంధురంబై కరము భయా నకంబగు నగ్గుహాంతరమున వాని కేమియుం గనఁబడలేదు. అనంగమోహిని తప్పక యందెందో దాగియుండెనని నమ్ముచు నెట్లయిన నామెను బట్టుకొనవలె నను పట్టు దలతో నామెయందుగల మోహాతిరేకమున నొడలెరుంగక యతి సాహసమున ముందునకు తడవికొనుచు నడచుచుండెను. ఆ గుహ క్రమక్రమముగా సంకుచితమై నడచుటకు వీలులేకపోవుటయు నతండు గొంతదూరము ప్రాకుచు బోయెను. చివుర కందు గూర్చుండుటకుఁ గూడ తావులేకపోయెను. ఆ గుహాగర్భమున బోరగిలఁ బరుండి ముందేగఁజాలక చేతులతో నలుమూలలఁ దడవుచు ననంగమోహినీ యని పిలచుచు నామూలమున నీవును నీకొరకై నేనును నీదారుణ గహ్వరంబున నంతరించవలసినదేనా యని విలపించుచు యుత్కృష్ట యక్షవంశమునఁ బుట్టి యిట్టి యకార్యకరణమునకుఁ గడంగిన నాకుఁ దగిన యనుభవమైనదని నిందించుకొనుచుఁ గొంతతడ వొడ లెరుంగక పడియుండెను.

ఫలములకై పోయిన జలంధరుండు గుహాముఖమున కేతెంచి యందు మణి గ్రీవుఁడు గాని యనంగమోహినిగాని కనంబడకుండుటకు విస్మయమందుచు మణి గ్రీవుండు నిక్కముగఁ దన్ను మాయఁజేసి యా సరోజాననఁ దీసికొనియెందో పోయె నని నిశ్చయించి వాని ననేక విధముల నిందించుచు నమ్మదవతితో గలియుభాగ్యము దనకు‌ లేకపోయెనని వగచుచుఁ దానిఁక నందుండిఁ బ్రయోజనము లేదని తలంచి నిస్పృహుఁడై నిజలోకమునకు మరలిపోవనెంచి యంతలో వారినయ్యరణ్యమున వెదకి కనుఁగొన వలయునను నూహ జనింప దివ్యయానంబెక్కి వారికొఱకై యాప్రాంత ముల యందుఁ దిరుగుచుండెను.

అట్లు విమర్శించుచుండ ముందొకచోటఁ బేటికాహస్తుండగు శబరబాలకుండు వానికిగోచరమయ్యెను. వానింజూచి మొదట యనంగమోహినిని గైకొనిపోవు మణి గ్రీవుండని తలంచి పటురయమున వాండున్న చోటకు జలంధరుఁడు విమానమును బోనిచ్చెను. కానియందున్నవాఁడు యక్షలోకమునుండి భూలోకమునకు వెనుక దాము గొని తెచ్చిన వానిఁగా నిరూపించి విమానమునుదిగి వాని సమీపమునకు బోయి యోరీ ! నీవింకను జీవములఁబడసియే యుంటివా ? మేమప్పుడు నిన్ను పైనుండి విసరివేయక విమానమెక్కించి యిచ్చటకుఁ దీసికొనువచ్చుట మాదే తప్పు. ఇఁక నేటితో నీజీవితావధి తీరినదని పలుకుచు భయకంపితుఁడై యొదిగియున్న యా శబర బాలకుని బట్టి యా పెట్టియందుఁ దిరుగఁబెట్టి యంతరిక్షమునకు విమానముమీదఁ దీసి కొనిపోయి యా పెట్టితో వానిని గ్రిందకుఁ ద్రోసివేసెను. పిమ్మట జలంధరుం డనంగ మోహినీ మణిగ్రీవులు దనకింతలోఁ గనంబడుట దుర్లభమని తలంచుచు మనమున విరక్తి బూని యాదారినే నిజ నివాసమునకుఁ బోయెను.

మణిగ్రీవుండు శైలకందరాంతరమున నట్లు వివశుఁడై పడియుండి కొండొక వడి కొడలెరిగి తనభంగపాటున కడలుచు నా గుహనుండి బైటపడు నుపాయము దెలిసికొనఁ జాలక యదు తహతహంపడుచుండెను. అచ్చటినుండి వెనుకకుఁ దిరిగి పోవలెనన్నను నది సాధ్యముగాఁ గనంబడుటలేదు ఆ గుహాబిల మధ్యంబునఁ దనకుఁ జావుదప్పదని నిశ్చయించుకొని యెట్లయినను నవకాశ మున్నంతవరకు ముందునకు జరుగుటయే ధీరలక్షణమని తలంచి బోర్లతో నతికష్టముమీద రెండు బారలమేరఁ బ్రాకఁగలిగెను. అచ్చట‌ నాబిలము గొంచెము విశాలముగా నుండుటచే ముందేగుటకు వాని కించుక ప్రోత్సాహకరముగా నుండెను. మరికొంత దూరమట్లే ప్రాకుచుఁబ్రోవనా సొరంగము గ్రమక్రమముగా బెద్దదగుచుఁ గొంతవరకు వంగినడచుటకును బిదప నిలువఁబడి ముందేగుటకును ననుకూలమయ్యెను. ఆ బిలము ననుసరించి ముందేగుచుండ నెదుర వానికి వెలుఁగు గనంబడెను. దానింజూచి యా యక్షకుమారుండు ముదమందుచు ననంగమోహిని యా మార్గముననే పోయియుండునని తలంచి యామెను ముందు గనుంగొన వచ్చునను నాశతో నతిరయంబున నడచుచుఁ గొండొకవడి కా బిలంబునిర్గ మించి యొక కాసారతీరమును జేరుకొనగల్గెను.

ఆ సరోవర సమీపమున రమణీయ సైకతస్థలమున నొక తరుణీమణి కూర్చుని యుండుట దిలకించి మణిగ్రీవు డామె యనంగమోహిని యను నాశతో నమందగమనమున సన్నిధికేగెను. తావలచిన లలనామణి యొంటరిగ నట్టి రమణీయ ప్రదేశమున లభింపగల్గెనను నుత్సాహముతో నే తెంచిన యా యక్షకుమారునకు తోడనే మిగుల నాశాభంగము సంభవించెను. తలవనితలంపుగా వాని కచ్చట గుణవతి ప్రత్యక్షమయ్యెను. తనసోదరి యందు గనంబడిన వెంటనే వానికి వచింప నలవి గానంత మనోవైకల్యముగలిగెను. అమాంత మామెపైబడి మడియింప వలయునను నంతటి పాపచింత హృదయమునబుట్టెను. ఆయోషామణి యావలమోమైయుండి యెవ్వరి కొరకో నిరీక్షించుచుండుటచేత మణిగ్రీవుని యాగమనంబామె మొదట గ్రహించియుండ లేదు. ఇంతలో నామె చెలికత్తెయగు చిత్రలేఖ యచ్చటికి వచ్చి యచ్చిగురాడుబోణి వెనుక గ్రోధారుణ దుర్నిరీక్ష్యవదనుడై నిలువబడియున్న మణిగ్రీవుని దిలకించి కించిద్భయ విస్మయావేశహృదయాంబుజాతయై యొడలు కంపమొందుచుండ దీవ్ర గమనమున వారిని సమీపించి గుణవతి నుద్దేశించి నెచ్చెలీ ! నీ వెనుకనున్న సోదరునిం దిలకింపలేదా? జ్యేష్టసోదరుడు తండ్రితోసమానుడని యెరింగి యుచితరీతిని సన్మానింప వలయుననుట దెలియదా యని మందలించుచున్నట్లామె నుద్భోధించెను.

ఆమాటల కులికిపడి లేచి గుణవతి‌ చేరువనున్న యన్నగారింజూచి 'యనంగమోహిని నెందుదోడ్కొనిపోతి'వని గద్దించి యడిగెను. అనంగమోహిని పేరు వినినతోడనే వాని యాగ్రహమంతయు నంతరించెను. దృఢపరీభవ వ్యధాకలిత హృద యుఁడై గద్గదస్వరంబున‌ నామె యేమైనదో తెలియదని యతఁడు బదులు చెప్పెను. ఆ మాట విని గుణవతి దండతాడిత భుజంగము వడుపున మండిపడుచు నిట్లనియె.

నీచుఁడా ! సహోదరినగు నామాటయైనఁ బాటింపక యవినీతుడఁవై యబలల మగు మమ్ముగొట్టి యా చకోరాక్షిని బలిమిమై మ్రుచ్చులించుకొని పోయి యిప్పు డేమియు నెరుంగనని చెప్పుట నీ దుష్టస్వభావమును స్పష్టపరచు చుండెనుగదా ! ఆ నారీశిరోమణి నెందుఁ దోడ్కొనిపోతోవి ? ఏమి చేసితివి? నిక్కము వచింపుము లేకున్నఁ బెద్దలయొద్ద నీకు బుద్ధి జెప్పింపఁగలనని కసరుచున్న చెలియలితో మణిఁ గ్రీవుండనునయ పూర్వకముగా నిట్లనియె.

సోదరీ! నాపై నేమిటికిఁ గినుకఁ జూపెదవు. నే నిప్పుడు నీతో సత్యమునే పలుకుచుంటిని. మూఢుండనై యావేదండయానను దోడ్కొనివచ్చి యిమ్మహారణ్య మధ్యమునం దామె నెడఁబాసితిని. జలంధరుఁ డేమయ్యెనో తెలిసికొనఁ జాలనైతినని తనవృత్తాంత మా మూల చూడముగా వక్కాణించి మరియు నిట్లనియె. ఆ నవకుసుమ కోమలాంగి యీ దారినేవచ్చి నీ కిందు నిక్కముగఁ గనంబడియుండును. ఆమె నాకుఁ జిక్కకుండుటకీ చిత్రలేఖ సహాయమున నీ వెచ్చటనో మరుగుపరచి యుందువు. సహ జన్ముడనగు నాపైఁ గనికరము గలిగి యా చిలుకల కొలికిని నా కొసంగి నన్ను రక్షిం పుము. ఆ సుందరాంగి యునికి నెరుఁగకున్న నా హృదయము మదన దావానలంబున వ్రయ్యలగుట నిక్కువమగును. నా మనోపహారిణిని నాకొసంగి పుణ్యము గట్టుకొను మని బ్రతిమాలుకొనుచున్న మణిగ్రీవునకు గుణవతి యిట్లనియె.

ఓరీ ! ఆ సాథ్వీలలామపై నీకుఁగల మరులు మరలించుకొనుము. ఆమె నీకు సహోదరివంటిదని యెరుంగుము. ఆమెను నీవెట్టి బలాత్కారము సేసినను మహాపాతక హేతువని నమ్ముము. ఆ మగువ నెచ్చటనో దాచియుంచి యిట్లపూరపు గథయొకటి గల్పించు చుంటివని సంశయింపవలసి వచ్చుచున్నది. లేకున్న గుహలో శయనించి యున్న యాడుది తన్ముఖమునఁ గాపున్న నిన్ను వంచించి యెచ్చటకుఁ బోగలదు. నీమాటలు సత్యదూరములనుట నిశ్చయము. మీదు మిక్కిలి మేమామెను మరుగున పరచియుంటిమని యెదురువాదు మోపుట నీయబద్ద నాటకమునకు సూచనగా నున్నది. వివేకము గలవాఁడవైన నిప్పుడైన నా సన్నిధినుండి నీవెత్తుకొనిపోయిన మత్తకాశినిని వైళమ నాకప్పగించిపొమ్ము. లేకున్న మీఁద నేమగునో నీవ యాలోచించుకొమ్మని పలుకుచున్న యక్కలికి తలమిన్న కా యక్షకుమారుండు వెండియు నిట్లనియె.

సోదరీ ! నేనెంత జెప్పినను నమ్మకున్న నేమి చేయఁగలవాడను. తాత పాదుని యాన నేనిందేమియు నసత్యమాడలేదు. నన్ను మోసపుచ్చుటకు నీవే యామె నెచ్చటనో దాచియుంచి నాతో బూటకము లాడుచుంటివని నమ్ముచున్నాను. ఈ మహా రణ్య మధ్యమునకు మీరే తెంచుటయును నిందు నీవొక్కతెవుండి చిత్రలేఖ నెచ్చ టకో పంపియుండుటయును సంశయింపఁ దగిన విషయములు గావా? నన్నింక వేద నలంబెట్టుట మాని యా మానినీ శిరోరత్నమును వేగఁ జూపింపుము. నీ మేలెన్నఁడును మరచిపోనని పలుకుచున్న యన్న కాయన్నులమిన్న యిట్లనియె.

అయ్యో ! మేమా యోషామణి నిచ్చటఁ జూచియుండలేదని చెప్పుచున్నను నీవు నమ్మవేమిపాపము ! మమ్మునిర్జించి బలాత్కారముగా నీవామెను తీసికొని పోయిన పిమ్మట నిప్పటివరకు మాకామెజాడ యేమియును దెలియదు. నీ వేగిన పిదప నెదరుగదురు హృదయములతో మేము మొదట నాయంతఃపురమున కరిగి యనంగ మోహిని నెడబాయుటకు వాపోవుచు నీ వలన నామెకెట్టి కష్టము సంభవించుచుండెనో యని యడలుచు నేమిచేయుటకుం దోచక కొంత తడవు నిర్వీన్నులమై యుంటిమి. ఆ సాధ్వీలలామ నెట్లయినను గనుంగొని నీబారినుండి తప్పింపవలయునను దృఢనిశ్చయ ముతోఁ పిదప వీమానమెక్కి యీచిత్రలేఖ సహాయమున మీ కొఱకందందు వెదకుచుఁ గ్రమంబున నీహిమశైల శిఖరంబున కేతెంచితిని. ఇందు రమణీయమగు నీకాసార తీరంబున నించుక విశ్రమింపఁ దలంపు మిగులుటచే నేనిందుండి చిత్రలేఖ నీ ప్రాంత ముల మీజాడ యేమైనఁ దెలియునేమో చూచిరమ్మని విమానముమీదఁ బంపించి యామెరాక నిరీక్షించియుంటిని. ఇంతలో నీవును జిత్రలేఖయును నేకకాలముననే యిచ్చట నాకుఁ దిరుగఁ గనంబడిరి. అనంగమోహిని జాడయేమైనఁ జిత్రలేఖ యెరింగి వచ్చెనేమో యామెయే చెప్పవలయునని యూఱకుండెను. అప్పుడు చిత్రలేఖ గుణవతితో నిట్లనియె.

ప్రియసఖీ ! నీయానతి వడువున దివ్యయానంబెక్కి యనంగమోహిని కొఱ కీప్రాంతములయం దతి శ్రద్దతో వెదకుచుండగా నొకవైపు నుండి విమానము మీద మిగుల వేగముగాఁ బోవుచుండిన జలంధరుండు నాకెదురయ్యెను తొందరగాఁ బోవుచుండుటచే నతఁడు నన్ను గమనించి యున్నట్లు తోచదు. నేను వాని నీక్షించి యనంగమోహని యుదంతము నతండెరింగి యుండవచ్చునని ప్రచ్చన్నముగా వాని విమానము వెనుక మదీయ దివ్యయానమును గొంతదూరము బోనిచ్చితిని. మణి గ్రీవుఁడు లేకుండ జలంధరుఁడట్లొంటరిగాఁ బోవుచుండుట నాకెంతేని వింతగాఁ దోచెను. అనంగమోహిని మూలమున వారిద్దరి కేమైనఁ దిరుగ కలహము సంభవించె నేమోయని సంశయించితిని. వాని దివ్యయానము దిన్నఁగా నాకసంబున నుత్తరపు దిక్కుగాఁ బోవుచుండుట చేత నతఁడు యక్షలోకమునకే యరుగు చున్నాఁడని నిశ్చ యించి నేను వెనుకకు మరలి వచ్చితిని. వాని విమానముమీద నెద్ధియో యున్నట్లు గనంబడినది కాని నేను దానికిఁ జాలదూరమున నుండుటచే నది యేమైనదియును‌ గుర్తింపఁజాలనైతిని. ఆతఁడట్లెచ్చటనుండి వచ్చుచుండెనో యావిమానము నందుఁగల వస్తువేమో విమర్శింపవలసియున్నది. ఈ వృత్తాంతము నీకెరింగించుటకే నేనిందు వెంటనే తిరిగివచ్చి యిచ్చట మణిగ్రీవుని నీసమీపమునఁ జూచితినని యూరకుండెను. ఆ మాటలువిని మణిగ్రీవుం డిట్లనియె. ‌ చిత్రలేఖా ! జలంధరుని యొద్దఁగలవస్తు నెట్లుండెను. నా సన్నిధినుండి ఫలమూలాదులంగొని వచ్చుటకే గదా యతఁడు విమానము మీఁద నరిగియుండెను. అందున్నది వివిధ వన్యఫలాదుల పోవులేమోయని తలంపఁ గూడదాయని యడుగు టయుఁ జిత్రలేఖ తల ద్రిప్పుచు నట్టివేమియును గాదని మాత్రము రూఢిగాఁ జెప్పఁ గలను. అందున్న వస్తువించుక దీర్ఘముగా నుండి వాని పాదసమీపమున నడ్డముగాఁ బడియుండెనని బదులు చెప్పినది. అప్పుడు మణిగ్రీవుండు హృదయోద్వేగమున నొడలు గంపమొంద గుణవతితో నిట్లనియె.

చూచితివా ! జలంధరుని మిత్రద్రోహము ! నేనిచ్చటికి జేరిన మార్గముననే యా మానినీరత్న మేతెంచియుండుట వాడు విమానము మీదనుండి తిలకించి సన్నిధి కేతెంచి యామెను బలాత్కరించి యుండును. వానిని మొదటినుండియును దిరస్క రించుచున్న యా యన్నులమిన్న వానినొల్లక భయోద్రేకమున మేనెరుంగక పడి యుండును. అప్పట్టున వాడామెను విమానమున బరుండబెట్టుకొని యెచ్చెటికో యెత్తు కొని పోయి యుండును. ఇది నిశ్చయము ఆ మిత్రఘ్ను డెందున్నను వెదకిపట్టుకొని వానిని మట్టుబెట్టువరకు నా మనంబునకు శాంతియుండనేరదు. వాడామెను యక్ష లోకమునకు దీసికొనిపోయి యుండడు. ఎచ్చటనో పివిక్త ప్రదేశంబునకు గొనిపోయి యందు దనకోర్కె దీర్చుకొన జూచుచుండును. కావున నేనిప్పుడే మీరెక్కివచ్చిన విమానముమీద బోయి వాని నరసి యనంగమోహినిని విడిపించుకొని వచ్చెదను. అంత దనుక మీరిచ్చటనే యుండుడని చెప్పి వారి నొప్పించి యప్పుడే యందున్న విమాన మెక్కి మిగులవేగముగా బై కెగరిపోయెను.

గుణవతి చిత్రలేఖతో నందెంతసేపు వేచి యుండినను నెవ్వరి జాడయును గనుపింపలేదు. పిమ్మట చిత్రలేఖ చేయూతగొని యచ్చటినుండి యా యరణ్యమున ముందుగొంత దూరమేగెను. అచ్చట వారికొక నూతన మార్గంబు గనంబడెను. దాని ననుసరించి యా సాయంసమయంబు వరకును వారాయరణ్య మధ్యమున దిరుగు చుండిరి. అప్పుడు వారికెదుర నిర్వురు పురుషులు వచ్చుచున్నట్లు గోచరించెను. వారిని మణిగ్రీవ, జలంధరులని తలంచుచు నతివేగమున సమీపించి చూడగా నందొక డరింద ముండును, రెండవవాడు దివోదాస ధారుణీంద్రుడును నగుటకు గుణవతి మిగుల నబ్బురపడుచు దృటిలో నిజహృదయాధినాధుని పాదపంకేరుహంబులమ్రోల వ్రాలి యుండెను. ఆకస్మికముగా నియ్యరణ్యమధ్యంబున నా యక్షకులకన్యకల గాంచి యా పురుషు లిర్వురును నివ్వెరంబొంది కొంతతడవేమియు మాటలాడజాలకుండిరి.

పిమ్మట దివోదాసుండు గుణవతిని జేతులతో బై కెత్తి యక్కునం జేర్చు కొని మిగుల నాదరించెను చిత్రలేఖవలన వారి వృత్తాంతమంతయును విని విస్మయా వేశ హృదయ సరోజుండై యిట్లనియె. ఔరా! అనంగమోహిని కాపదలమీద నాపదలు గలుగుచుండెను గదా ! అదృష్టచిత్తుని బారిఁపడి యా కాంతామణి యెంత బలవంత బొందుచుండెనో యూహింప శక్యముగాకున్నది కార్యాంతర వ్యగ్రహృదయుండనై యామెను మీ యంతఃపురమున నాడు విడచి నేనరుగవలసి వచ్చినది. నియోగమున మీరువారెందును లేరు. నాటినుండి యిప్పటివరకు నిముసమేని విశ్రాంతి లేకుండ దిరుగు చుంటిని. కాని తలపెట్టినపని మాత్రము పూర్తిగాకున్నది‌. మీరు నాడు ప్రసంగించు కొనిన మనుజబాలక ప్రేతాన్వేషణంబునకే నేను నా లోకమున కేతెంచి యుండుటచే దాని నమ్మవారి యాలయమునందు సంగ్రహించి యందు బ్రాణప్రతిష్ట జేయనెంచి యనంగమోహినిని మీ యింటనుంచి వెడలిపోతిని. అందు దేవి యనుగ్రహంబును నీసన్మిత్రలాభమును బొందితిని. శబరబాలకుడు బ్రాణములంబడసి యెచ్చటికో పోయె నని యమ్మవారివలన వింటినని యా భైరవ యాలయమున జరిగిన వృత్తాంతమెల్ల దెలుపుచు మరియు నిట్లనియె. ఆ యాలయమునుండి శబరబాలకాన్వేషణంబునకు మే మిరువురమును దలయొక దిక్కునకు బోతిమి. నేను తూర్పుదిక్కుగా బోయి నాలుగు దివసంబు లహోరాత్రంబులు వానికొరకు వెదకి వెదకి యెచ్చటను వాని జాడ నెరుం గక మొదట జేసికొన్న నియమము వడువున నరిందముని గలసికొనుటకు దిరుగ భైరవీదేవి యాలయము నొద్దకు వచ్చితిని. అరిందము డక్కడ నాకు గనుపింపలేదు. అందులకు నేను సంశయించుచుండగా మణిగ్రీవుడు విమానమెక్కి యాచక్కి కేతెం చెను. నన్ను జూచి యతండు దిన్నగా నేనున్న చోటికి వచ్చెను. వెనుక హిమశైలా రణ్యమందు గుంభునితో ద్వంద్వయుద్ధ మొనర్చునప్పుడు నన్నాతడు జూచియుండు టచే గుర్తుపట్టి మిగుల నమ్రతతో నాతో సంభాషించుచు దనయుదంతం బెరింగించి క్రమంబున మదీయ వృత్తాంతము దెలిసికొని యబ్బురపడుచు నిట్లనియె.

దివోదాసధారుణీ దేవేంద్రా ! మీ సాహసౌదార్య విక్రమ క్రమం బత్యద్భు తము. దేవతలు సైతము భవదీయాజ్ఞానువర్తులై ప్రవర్తింపవలసి వచ్చుటచే మీ ప్రభావం బమానుషంబుగదా ! అనంగ మోహినియును గుణవతియును మిమ్మువరించి యుండుట వింతగాదు. జలంధరుని ప్రోద్బలముననే నింత కెన్నేనియనుచితకార్యంబు లొనరించితిని. అనంగమోహినీ రూపమోహితుండనై మదనోన్మాదంబున నామెను గష్టముల పాలు జేయుటయే కాక ధనాదృశులకు గూడ మిగుల నాయాసము గలుగ జేసితిని. నాయవినయమున కిప్పటికి నిక్కముగ బశ్చాత్తాపము బొందుచుంటిని. అనంగమోహినియందలి వాంఛ నాకు పూర్తిగ దొలగిపోయెను. నాకిప్పటినుండి యామె తోడబుట్టువు వంటిది.

ఇక మీద నరిందముండువలె నేనును మీకు మిత్రుడనై యాత్మబాంధువుడనై మెలంగగలవాడను. మీ యాజ్ఞ జవదాటనని త్రికరణంబుల బాస జేయుచున్నాను. నన్ను విశ్వసించి యనంగమోహినీ సమాన్వేషణమునకు నియోగింపుడు. జలంధరు డొనరించిన పాపకృత్యమునకు వానిని బట్టుకొని యుచితరీతి దండించుటకు నా మనంబు తొందరపడుచున్నది. చిత్రలేఖాద్వితీయ గుణవతిని హిమగిరి శిఖరమున నిప్పుడే విడిచివచ్చితిని. ముందుగ జలంధరుని నలకాపురమున వెదకి యందు గనంబడనియెడల వాడెచ్చట దాగియున్నను బోయి పట్టుకొను తలంపు నాకంతయముగా కేగినప్పుడు పుట్టుటచే దిన్నగా నిచ్చటికప్పు డేతెంచెను. ఇందును నేను పురంబులోనికి కేగినప్పుడు లేదని చెప్పుచుండగనే జలంధరుం డచ్చటికి వచ్చి మమ్ము జూచి యక్కజపడ దొడం గెను. వానిని‌ దిలకించిన తోడనే మణిగ్రీవుండు మండిపడుచు నోరీ ! మిత్రద్రోహీ! కపట క్రియారంభ సంరంభుండవై తవ. వ్‌ మ్‌ తేమి? అనంగ [ప్ర నకు ఫలం

వొంచుదు జంంధరు ‌ నన్నా నీ దుర్మార్గ ఎ గాంమాటల కచ్చెటి వెన్పతే సొందగలపం నవమ ఖల 0శెల్ల వాయె మిత్రమా ! నిజమెరుంగక నన్నిట్లు నిష్టురము లాడదగునా ? అనంగ మోహినీ వృత్తాంతము నీకన్న నే నెక్కుడెరుంగుదునా ! మిమ్మిరువుర నగ్గిరికందర మున విడిచి నేను ఫలాన్వేశణంబున కేగియుండలేదా ? నేనచ్చటికి‌ దిరుగవచ్చుసరికి మీ రిరువురు నందు నాకు గనబడిరా ? నన్ను మోసపుచ్చి యచ్చపరాక్షిని నీవెచ్చటికో తీసికొనిపోతివని దలంచి మనంబున నాకంబుగ్రీ‌వపై విరక్తిబుట్ట నెట్టకేల కిప్పట్టునకు దిరిగి వచ్చియున్న నాపై నిందలమోపుట న్యాయమగునా? అనంగమోహిని యేమై నదో నే నేరుంగను. నీవా కందరము విడచి యెచ్చటికేగి యిప్పుడిక్కడకు వచ్చి యుంటివో గ్రహింపజాలను. నీయుదంతము నాకు వింత గొలుపుచున్నదను జలంథ రుని మాటల నాక్షేపించుచు మణిగ్రీవుడు వెండియు నిట్లనియె.

ఓరీ ! నీగడుసుమాటల నిక గట్టిపెట్టుము. నీ యుక్తులకు మోసపోవు వారెవరిందు లేరు. హిమవంతము నుండి‌ నీవిచ్చటకు విరక్తుండవై తిరిగివచ్చి యుంటివని చెప్పుచుంటివే ? అప్పుడు విమానము మీద నీపాదములమ్రోల నడ్డముగా బరుండబెట్ట బడియున్న వ్యక్తి నెవ్వరును జూడలే దనుకొనుచుంటివి కాబోలును. మిత్రద్రోహివై నీవా యళికుంతల నందు బెట్టుకొని యంతరిక్షమున కేగియుండుట నేను గ్రహింప గల్గితినని నీకిప్పటికైన నమ్మకము గలుగుటలేదా ! నాతో నిక వ్యర్థ వాదమునకు బూనక యాకనకగాత్రిని వేగమే మా కప్పగింపుము లేదేని నీ మాన ప్రాణంబులు దక్కవని నిక్కముగ నమ్ముమని గద్దించి పలుకుచున్న వానికి జలం ధరుం డిట్లనియె.

మిత్రమా ! విమానముమీఁద నేనంబరమునకుఁ గొనిపోయినది యనంగ మోహినీ స్వరూపమని భ్రమించుటంజేసి నీవిట్లు నాపైఁ గినుకఁ జూపుచుంటివి. కాని యందున్న దొక మనుష్యబాలకునిఁ బంధించియుంచిన మందసమని యెరింగిన నీ భ్రమ నివారణ కాఁగలదని పలికినతోడనే నేనదరిపడి యీవృత్తాంతము సాంతముగాఁ జెప్పుమని యడిగితిని. మణిగ్రీవుండును దాని నెరుంగ గుతూహలపడెను. అప్పుడు జలంధరుండు జరిగినవృత్తాంతమెల్ల మాకు దెలియఁజేసెను. వాని మాటలు మణి గ్రీవుఁడును నేనును విశ్వసించితిమి. అప్పుడు నేను జలంధరునితో వెండియు నిట్లంక్ష్టిని.

చెలికాఁడా ! ఒకవిషయము నెరుంగఁగోరిన మఱియొక యదంతము నీ వలన మాకుఁ దెలిసెను. ఈ వృత్తాంత మెఱుంగుటకే నే ని‌ట్లు లోకాంతరంబులఁ గ్రుమ్మరుచుంటిని అందున్న శబర బాలకుని వాని యాప్తుల సన్నిధిఁజేర్చుటకు నేను శపథము జేసియుంటిని. ఆపెట్టెలోఁ బెట్టి నీవు వానిని దివంబునుండి క్రిందకుఁ బడఁ ద్రోసితివి. వాఁడెచ్చట పడెనో యేమయ్య నో కనుంగొనవలయును. మఱియు ననంగ మోహిని యాకందరాంతరమున నే మయ్యెనో తెలిసికొనవలయును. ఇదియునుంగాక గుణవతి కాననాంతరంబున దిక్కెవ్వరును లేక యెంత యడలుచున్నదో గదా ? ఆమె క్షేమము నరిసి సురక్షితమగు తావునకుఁ జేర్పవలయును. ఈ మూడు కార్యములును మనకు ముఖ్యములే యగుటం జేసి మనము మువ్వురము నిందులకు బూనుకొనవలయు నని వారికి నచ్చునట్లుపన్యసించితిని. నామాటలకు వారిర్వురును సమ్మతించిరి. నాయందు వారికెంతేని భక్తి విశ్వాసములు గుదిరినవి. నాయాజ్ఞ నిసుమంతేని మీరక నమ్మకముగా మెలంగుటకు బాసఁజేసిరి. అప్పుడు నేను మణిగ్రీవుని మీనిమిత్తము బంపి జలంధరుని శబర బాలకాన్వేషణంబునకు నియమించి నే ననంగమోహినిని వెదకుటకుఁ బూను కొంటిని మేమువ్వురమును విమానమెక్కి. యనంగమోహిని మాయమైన హిమగిరి కంతరమున కేగితిమి. అందు నేను దిగి తక్కినవారిని వారిపనిమీఁదఁ బంపి వేసితిని. వారి జాడ నాకు మఱల నిప్పటివఱకుఁ దెలియలేదు. నేను నగ్గుహాంతరమునకేగి విమర్శింపుచుఁ బోవుచుంటిని. కాని యనంగ మోహిని యునికి నాకెచ్చటను గనంబడ లేదు. చీఁకటిలో నా గుహాబిలంబునఁ బడిపోవఁబోవఁ జివరకు నేనొక దేవతాలయ ప్రాంగణంబునకుఁ జేరుకొంటిని. ఆ దివ్యాలయములోనికి బోయి యందున్న శాంభవీ దేవిని స్తుతించుచుండ నచ్చటికెవ్వరో వచ్చుచున్న సందడియగుటయు నచ్చట నేమి జరుగునో చూడవచ్చునని గొబ్బున నాదేవీ విగ్రహము వెనుకకు బోయి యందుఁ బొంచియుంటిని.

ఇంతలో నల్వురు దేవకాంతలచ్చటికివచ్చి భక్తితత్పరలై యాయమ్మవారి నర్చించి యనుకూలవాల్లభ్యంబుదయసేయుమని ప్రార్థించుటయు వారియెదుటకుఁ దానరిగి వారిచే వరింపఁబడుటయుఁ బిమ్మట యంత్రబిలమునందుఁ జొచ్చి హేమసౌధ విశేషముల గ్రహించుటయుఁ దరువాత నరిందముని యాపదఁ దప్పించి వానితోఁ దిరుగఁ బైకివచ్చుటయును మొదలగు వృత్తాంతమంతయును వారికెఱింగించి మఱియు నిట్లనియె.

అట్లు నేనరిందమునితో భూవివరంబు వెల్వడి వచ్చిన యనంతరము దేవ కన్యకలు దేవీపూజకై యాలయంబునకరిగిరి. వారివెనుక మేమును నాగుడిలోని కేగఁ దలచి వేఱొక ద్వారంబునఁ బ్రవేశించితిమి. కాని యామార్గమున మా కెచ్చటను వెనుకఁ జూచిన యూలయము గనంబడలేదు. ఆదారి క్రమంబున మమ్మీయరణ్యము నకుఁ దీసికొనివచ్చినది. ఇచ్చట మీరుకనంబడుటచే మాయాగమనంబు వ్యర్థము గాలేదని పలికి యా యక్షకాంతలకు సంతోషముగలుగఁ జేసెను.

ఇంతలోఁ జీఁకటిపడినది వారతికష్టముమీఁధ నొకమార్గమునం బడి కొంత దూరమరిగిరి. కాని ముందిఁక నడచుటస శక్యముగాలేదు. అచ్చటనొకవిశాల వృక్ష మూలంబున నారాత్రిగడపి యుదయమున నచ్చటనుండి బయలదేరి వారుముందుఁ గొంతదూర మరిగిరి అచ్చట వారికొక సుందరసరోవరంబు నేత్రపర్వమొనర్చెను. దా పరిసరంబున నిర్వురుపురుషులు దిరుగుచుండుట జూచి వారిని మణిగ్రీవజలంధరులుగా నిరూపించి దివోదాసుండు తక్కినవారితో నందేగెను. మణిగ్రీవజలంధరులు వీరిని జూచి మిగుల నానందమును బొందిరి. విమానయానంబున శబరబాలకుని నిమిత్తమై యరిగిన జలంధరుండు తనపూన్కెయంతయును విఫలమైనదని నుడివి యిప్పుడే యిచ్చటి కేతెంచి మణిగ్రీవుని గలసికొంటినని తానొర్చినప్రముత్నము లన్నియును దివోదాసున కెరింగించెను. మణిగ్రీవుండును గుణవతి కొఱకై యరణ్యమధ్యమందారాత్రి యంత యును దాఁబడిన యిడుమల నా మహారాజున కెరింగించెను.

పిమ్మట దివోదాసుండు శబర బాలకుండు దొరకువఱకుఁ దాను నిజరాజ ధానిని జేరవీలులేదని చెప్పుచు గుణవతిని చెలికత్తియతో దివ్యయానంబున నలకాపురంబు నకుఁ దీసికొనిపొమ్మని మణిగ్రీవునితోఁ జెప్పెను. అందులకు గుణవతి మొదట సమ్మ తించినదిగాదు. శబర బాలకుని వానియాప్తుల సన్నిదిఁ జేర్చిన వెంటనే నేను నీకొఱకు యక్షలోకంబున కేతెంతునని నమ్మకముగలుగునట్లు దివోదాసుఁడు వచించుటచేత నామె యెట్టకేల కంగీకరించినది. అప్పుడు మణిగ్రీవుండు గుణవతిని జిత్రలేఖను విమాన మెక్కించుకొని జలంధరుండు వెంటరా నలకాపురంబున కేగెను. దివోదాసుండును నరిందముని దనవెంటనుంచుకొని శబరబాలాన్వేషణంబున కరుగఁదలచి యందుఁ గన బడిన యొకమార్గము ననుసరించి ముందు బోయెను.


318 వ మజిలీ

రత్న చూడుని కథ

వింధ్యారణ్యంబున రత్నచూడుఁడు మౌనిసత్తముడనఁ బ్రసిద్ధి కెక్కి యుండెను. దివోదాసునిచేఁ బుడమి నుండుట కనుమతిఁ బడసియున్నకతంబున నా నాగోత్తముఁడు నిర్భయముగా నందొక యుచితస్థలంబునఁ దపంబొనరించుచుఁ గాలము బుచ్చుచుండెను. దివోదాసుని బలవిక్రమ ప్రభావములు దలంపునకు వచ్చినప్పుడెల్ల నతండు మిగుల నక్కజంపడుచు వానిని దైవసమునిగా నెన్నుచుండెను. ఆరాజేంద్రుని సుగుణగుణములఁ బలుమారు ప్రస్తుతింపుచుండెను. తనకతండొనరించిన యుపకారము నకుఁ బ్రతి యెన్నఁడైనఁజేసి వానియందుఁ దనకుఁ గల కృతజ్ఞతను వెల్లడింపవలయు నని యతండు సమయమును బ్రతీక్షించియుండెను.

ఇట్లుండఁ గొన్నిదినముల కొక సంధ్యాసమయమున నా నాగకులప్రదీప కుండు ప్రాంతసరోవరమునకుఁ బోయి వచ్చుచుండ నంతరిక్షమునుండి యెద్దియో నీటిలోఁ బడిన ధ్వనియగుటయు నతండదరిపడి వెనుకకుఁ దిరిగిచూడ నాపద్మాకరమున నొకమందసము మునుఁగుచుఁ దేలుచు గోచరమయ్యెను. రత్నచూడుఁ డాపెట్టెను సమీపించి దానిని బట్టుకొని తీరమునకుఁజేరి మూఁతఁబైకెత్తి చూడ నందొక మనుష్య బాలకుఁడు కరగతప్రాణుఁడై యుండుట పొడకట్టెను. తోడనేయతండాబాలకు నందుండి