కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/41వ మజిలీ
ఆ దూతలు భాస్కరునివార్త యందలి జనులవలస విని విచారింపుచుఁ బోయి తమ ఱేని కెఱింగించిరి. అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించుటయుఁ దదనంతరోదంతము తరువాతి మజలీయం దిట్లని చెప్పదొడంగెను.
నలువది యొకటవ మజిలీ
హేమప్రభ కథ
అచ్చట భాస్కరుఁడు పరోపకారమునకై సముద్రములోఁబడి కొంతసేపునకుఁ గన్నులుదెఱచి చూచినంత మణిమయ స్తంభసుందరమగు నొక దివ్య మందిరములో శాకములతట్టలోఁ బడినట్లు తెలిసికొని యట్టె లేచినలుమూలలు చూచుచు నయ్యారే ! యిదియేమి చోద్యము? నేను సముద్రములోఁబడి మునిఁగితినిగదా ? యీ మందిరమెక్కడిది ? యిది ఇంద్రజాలమా ? లేక స్వప్నమా? యిందలి విశేషము లరయ స్వర్గమువలెఁదోచుచున్నది. నేను మృతినొంది స్వర్గమున కరిగితినా ? యిది నా పూర్వదేహమువలెనున్న దిగదా! ఆ తెలిసినది నేనీదేహముతోనే పుణ్యలోకమున కరిగితిని గాఁబోలు అగునిందలి విశేషము లరసెదంగాక! యని తలంచుచుఁ గొంత దూరము తిరిగి అదిగో ! యెవ్వతెయో భయంకరాకారముతో నిటువచ్చుచున్నది దీనింజూడ భయము గలుగుచున్నదిగదా ? ముక్కును మొగమును వికృతముగా నున్నవి. నోరు గుహవలెఁ దెఱవఁబడి యున్నది. నాలుక జ్వాలవలె వ్రేలాడు చున్నది పురాణములో రాక్షసస్త్రీనిట్లువర్ణింతురు. స్వర్గములో రాక్షసి యుండ నేమిటికోకదా ? దీనియెదుటఁ బడితినేని నన్నుఁ గబళములాగున నోఁటిలోవైచికొనును. దాఁగియుండెదనని తలఁచి యొకమూల నడఁగియుండెను. అంతలో నారక్కసి నిప్పులుగ్రక్కుచువచ్చి యందొకపీఠంబునం గూర్చుండి అయోముఖీ ? యెక్కడ నున్నావు ? ఆహారము సిద్ధపఱచితివా ? యని యడిగినది. అప్పుడొక మూలనుండి యయోముఖివచ్చి దేవీ ! యంతయు సిద్ధపఱచితిని. కాని అని యర్థోక్తిగాఁ బలికి యూరకున్నంత నాజ్వాలాముఖి సగముమాటాడి యూరకుంటివేమి ? మనుష్య మాంసము వచ్చినదా ? లోహధ్వజమును విడుచుట మఱచితిరాయేమి? యని యడిగినది.
దేవీ ! లోహధ్వజము వాడుకవేళనే విడిచితిని. ఏమికారణముచేతనో కాని మనుష్యశరీరమువచ్చి శాకములతట్టలోఁ బడియుండలేదు కాదీవఱ కెప్పుడును వలఁబడ్డ ---వలెవచ్చి చచ్చిన శవము శాకకుసూలములో నుండునది. ఒక్కొక్కసారి నేల బడిన మనుష్యులు వచ్చిపడియుండువారు. దానిగుఱి తప్పినదేమో తెలియదని చెప్పిన ------------ నాకు మయుఁడిచ్చిన వరమేల తప్పును ? నీవే కపటము జేసితివని తోచుచున్నది. వేయి సంవత్సరములనుండి జరుగుచున్న పని నేఁడేలతప్పును? నిజము జెప్పు మనుటయు నేనేమియు నెఱుగనని ప్రమాణముఁ జేసినది.
అప్పుడా రక్కసి తొందరపడుచు నోసీ ? శూలనఖ యెక్కడనున్నది ? ఇటు రమ్మనుమనుటయు నది దానిం దీసికొనివచ్చి యెదుర నిలఁబెట్టినది. శూలనఖా ! నీవరిగి నా మనుమరాలినిటు తీసికొని రమ్మని చెప్పిన నదిపోయివచ్చి అమ్మా ! ఆమె ఇప్పుడు సఖులతోఁ గూడి యుద్యానవనములోఁ గ్రీడింపుచున్నది. నామాట వినిపించు కొన్నదిగాదు. గట్టిగాఁ బిలిచినంత సఖులచే మొత్తించినది. దెబ్బలుపడి వచ్చితినని చెప్పినది.
అప్పు డా రక్కసి అబ్బా ! వృద్ధులమాటలు పిల్లవాండ్రు వినిపించు కొనరుగదా ? దీనికి నాయందుఁ బెంచిన విశ్వాస మించుకయును లేదు. నామాటకు దేవేంద్రుఁడు సైతము వెఱచువాఁడు. నా యాహారవిషయమై యించుకయు విమర్శింపదు. సంతతము సఖులతో గ్రీడింపుచుండును. అయోముఖీ: నీవై నం బోయి నాజాతకముండు పుస్తకము దానిపెట్టెలోనున్నది. యిమ్మని యడిగి తీసికొని వత్తువే ? అని చెప్పినది.
అదియుం బోయి వచ్చి అమ్మా ! ఇప్పుడు మన హేమప్రభ పెండ్లియాట లాడుచున్నది. మాటాడినదికాదు. వేళదాటినది. నీవు భుజింపుము. తరువాతఁ దీసికొనివత్తును. నీయొద్దఁ జనువుచే వచ్చినదికాదు. లేకున్న నీయాజ్ఞకుఁ ద్రిలోకాధి పతియైన జేతులుగట్టుకొని యెదుర నిలువఁబడడా ? యని చెప్పినది. అదియు దా మాటకు సమాధానపడి భుజింప మొదలు పెట్టినది. అట్టి సమయమున నయోముఖి అమ్మా ! హేమప్రభకు మంచిప్రాయము వచ్చినది. వివాహము గావించితివికావేమి ? ఇప్పు డిరువురు సఖురాండ్రకు వధూవరుల వేషమువైచి వివాహముగావింపుచుఁ దత్క్రీడాలాపముల ముచ్చటగాఁ జూడఁదొడంగినది. ఇదియే మంచి సమయము. ఆమెకుఁ దల్లివైన దండ్రివైన నీవేకదా ? యని యడిగిన నాజ్వాలాముఖి యిట్లనియె.
ఏకార్యములోను నాతో నది యేకీభవించదు. అది సంతతము రాక్షసజాతిని నిందించుచు మనుష్యులనైన దేవతలనైనఁ బెండ్లియాడెదనని చెప్పుచున్నది. మన కాహారమైన మనుష్యులును శత్రువులైన దేవతలును బనకిరారని నేనెంత చెప్పినను సమ్మతింపదు. ఏమి చేయుదును? లేకున్న నీపాటికి నెవ్వనికో యొక గొప్పరాక్షసునికిఁ గట్టి పెట్టక పోవుదునా ? దాని ఖర్మమట్లున్నది. పోనిమ్ము. పెంచిన మోహమున నింతగాఁబరితపించుచున్నదాన. రాక్షసులందముగాఁ నుండరఁట. చిన్నముక్కులు చిన్నకన్నులు చిన్నముఖములు చిన్న పండ్లు చిన్ననోరులు గలిగిన మనుష్యులేమి యందముగా నుందురో తెలియదు అని పలుకుటయు నయోముఖి అమ్మా ! నీ మనుమరాలు మనుష్యులనేపోలినదేమి రాక్షసుల యందమువచ్చినది కాదేమని యడిగిన నది యిట్లనియె. నా కూఁతనికిని పాడుపోలికయే వచ్చినది. అది విద్యాధరుని వరించి యీచిన్నదానిం గన్నది. అందుమూలముననే దేవతల పోలిక వచ్చినది. దాని యభిలాషయు నట్లేయున్నది. కాని నేను బ్రతికియుండఁగా నితర జాతివారికిఁ బెండ్లిచేయనని చెప్పుచు భుజించి లేచినది.
అప్పుడు పరిచారిక లిరువురు దానిని శయనగృహంబునకుఁ దీసికొనిపోయి తల్పంబునం బరుండఁబెట్టిరి. అప్పుడది యయోముఖితో ఓసీ ! నీవిప్పుడు పోయి హేమప్రభ నడిగి నా జాతకమును దీసికొని రమ్ము. సమయమరసి యడిగిన నది యియ్యక మానదు. ఈపాటికి నాటలు చాలించునని చెప్పిన నదిపోయి యా చిన్న దానిం బ్రతిమాలికొని యాపుస్తకమును సంగ్రహించుకొని వచ్చినది. జ్వాలాముఖి పండుకొని అయెముఖితో ఓసి ! నా కీ జాతకమును మయుఁడువ్రాసి యిచ్చెను. దీని ప్రకారము ఫలము గనంబడుచున్నది. నవగ్రహముల దశలు నాకిరువదిమాఱులు తిరిగినవి. వీని నొక్కసారి చక్కగాఁ జదివి వినిపింపుమని కోరిన నది తనకు జదువురాదని చెప్పినది.
అప్పు డది యాపుస్తకము విప్పిచూచి అయ్యో ? నేను బెద్దదాననై పోయితినిగదా ? అక్షరములు గనంబడుటలేదు. కన్నులకు బొరలుగ్రమ్మినవి కాబోలు నిది యెవ్వరు చదువఁగలరని యడిగిన నయోముఖి అమ్మా ! మన హేమప్రభకుఁ గాక యీభాష యెవ్వరికిఁ దెలియ దని చెప్పినది. దాని నెట్లయిన నొకసారి యిక్కడికిఁ దీసికొని రమ్మని చెప్పిన నదిపోయి హేమప్రభ సఖురాలిఁ గాంతిమంజరి యను దాని దీసికొని వచ్చి అమ్మా ! యిదిగో దీనిం జదువుటకై హేమప్రభ కాంతిమంజరిం బంపినది. ఆ పుస్తకము దీని చేతికిమ్మని చెప్పినది. కాంతిమంజరి యాపుస్తకమును గై కొని తత్ఫలంబులన్నియు వరుసగాఁ జదివినది. కోట్లకొలది యది గావించిన జీవహింసలన్నియు నప్పుడు తెల్లమైనవి. మఱియు లోహధ్వజమువలన వచ్చిన మానవుఁడు తనకు గనంబడినప్పుడు మారకము జరుగునని వ్రాయంబడియున్నది. ఆ మాటలువిని యది యడలుచు అయ్యో ! నే నీ యనుమానముచేతనే జాతకమును దెమ్మంటిని. నాకు మారకము వచ్చినది కాఁబోలు. సాధనమేమి అయోముఖీ ? నన్నెట్లుకాపాడెదవు కాంతిమంజరీ ? ఇఁక జాలు నీవుపోయి మా హేమప్రభ నిటు రమ్మను. అని యూరక దుఃఖింపుచుండ వారింపుచు నయోముఖి యిట్లనియె అమ్మా ! లోహధ్వజమువలన వచ్చిన మానవుఁడు గనంబడినప్పుడుగదా నీవు విచారింపవలసినది ? ఇప్పు డట్టివాఁడు రానిదే చింతించెదవేటికి ? అది మరియొకప్పుడుగాని యిప్పుడు కాదని యోదార్చినది.
గూఢస్థానమునవసించి యా సంవాద మంతయును విని విజయభాస్కరుండు ఔరా ! ఇది నేను స్వర్గమనుకొంటిని. కాదు మయుండు సముద్రమధ్యంబున నీ గృహంబు నిర్మించి దీని కిచ్చినట్లు తెల్లమైనది. అబ్బా ! యీరండ అనేక కోటిజీవముల హింసించి యిప్పుడు తనకు మారకము వచ్చినదని విని యెంత విలపించుచున్నదో ? యెదరి బ్రాణములుం దనప్రాణములవంటివని యేల తలంపరాదో ? యిన్నీచం జరి మార్చిన లోకోపకారమగును. అట్టి సాధనమేమియుఁ గనంబడకున్నదే ? కానిమ్ము. ఇది యిప్పుడు నిద్రఁబోవుచున్నది. పరిచారికలు దూరముగా నెక్కడికోపోయిరి. యీ మందిరము నలుమూలలు దిరిగి చూచెదంగాక యని యందు వెడలి మఱియొక గది దగ్గిర కరిగినంత వంటశాల గనంబడినది. అందు ననేక నరకళేబరరుధిరాప్లుతమైన ఖడ్గ మొండు గనంబడినది.
ఆ రాజపుత్రుండా కరవాలము హస్తంబునబూని సాహసముగా నారక్కసి పరుండియున్న మందిరములోనికింబోయి యోసీ ! పాపాత్మురాల ! దయావిహీనవై కోట్ల కొలది ప్రాణంబుల నీకత్తిచేఁ బొఁగొంటివి. యిప్పుడీ కత్తియే నీపాలిటికి మిత్తి యైనది. లెమ్ము, లెమ్ము కాచికొనుమని పలుకుచు నదిలేచి పరికించునంతలో దాని యుత్తమాంగమును గదళీకాండంబు చందంబున ఖండించి శరీరముతో వేఱుచేసెను. పిమ్మటఁ జప్పుడు కాకుండ నా గది తలుపునకు గొణ్ణెమువెట్టి యందలి విశేషము లరయుచుఁ బోవఁబోవ నొకచో బార్వతీమందిరము గన్నులపండువుగావించినది. రత్న శోపానశోభితంబై మణిశిలాభిత్తి మండితంబై రత్నచిత్రతోచ్ఛ్రయ ధ్వజంబై యొప్పు నక్కాత్యాయనీ మందిరముఁజూచుచు విస్మయముజెందుచు నతం డద్దేవికి మ్రొక్కి వినుతించుచున్నంతలో నాప్రాంతమందెద్దియో రొదయగుటయు నతండెవ్వరో వచ్చు చున్నారని తలంచి యందొకమూల నడంగి యుండెను.
అప్పు డమ్మవారి ప్రక్కనున్న కవాటముదెఱచికొని యిందీవరంబులంబోలు వాలుగన్నులును పద్మమువంటి మొగంబును మృణాళనాళంబులబాలు బాహువులు మృదుశరీరమును బుష్పములవంటినవ్వునుం గలిగిమూర్తీభవించిన సరోజనియో యన స్త్రీసహస్రంబులు సేవింప నొక చక్కనిచిన్నది యక్కడికివచ్చి కాత్యాయని కెదురుగా సఖులతోఁగూడఁ గూర్చుండి తంత్రీనాదములతోఁ గంఠనాదముల మేళగించి యమ్మవారిం గీర్తించుచుఁ గొంతసేపు హాయిగాఁ బాడినది.
తరువాతఁ గాంతిమంజరి లేచి కాత్యాయనీమహాదేవీ ! చిరకాలమునుండి నా సఖురాలు నీపాదసేవఁ జేయుచున్నది. దానికిఁ దగిన మగనింగూర్చితివికాదుగద ? నీయనుగ్రహ మెప్పటికివచ్చునో తెలియదని ప్రార్థించినది ఆ మాటలువిని హేమప్రభ "సఖీ ! మాజరఠరాక్షసి బ్రతికియుండఁగా నాకు వివాహముకాదు. నీకేమిటికి వెఱ్ఱి పడియెదపు ? పిమ్మటఁగాని అమ్మవారికి దయరాదు." అని పలికినది. అప్పుడు కాంతిమంజరి “సఖీ ! నీతోఁ జెప్పమఱచితిని. ఇందాక మీయవ్వనాచేఁ దన జాతక ఫలములఁ జదివించుకొని మారకము వచ్చినదని విచారింపుచు నిన్నుఁ దీసికొని రమ్మన్నది. పాపము పోయి చూతము వత్తువా ?" యనుటయు ననుమోదించి యా హేమప్రభ యా దెసకుఁబోయెను. తదీయ రూప విభ్రమవిలాసంబు లరసి రాజకుమారుండు మోహపరవశుండై అయ్యారే ! యీచిన్నదానిరూపము జగన్మోహనముగా నున్న యది. నిష్కాముఁడనగు నాచిత్తమునే వికారమునొందింపుచున్నది. ఓహో ! సౌందర్యమునం దెట్టిశక్తియున్నది. యేమోయనుకొంటిని. ఇది యంగీకరించెనేనిఁ బెండ్లియాడి గార్హ్యస్థ్యము నడుపుదునుకదా ? యని యూహింపుచు సీ ? నాకిట్టిబుద్ధియేమిటికిఁ బుట్ట వలయును ? అవ్వెలఁది యనుమోదింపనిచో నాబుద్దివ్యభిచరిం నట్లౌనుగదా ? ప్రమాద మూహించితినని పశ్చాత్తాపముఁ జెందుచు వారేమిచేయుచున్నారోయని వెనుక వెనుకఁ బోయి చూచుచుండెను. హేమప్రభ సఖులతో జ్వాలాముఖియొద్దకరిగి చచ్చియున్న యారక్కసిం జూచి వెఱచుచు శోకగద్గదకంఠియై అమ్మయ్యో ? మా యవ్వఁనెవ్వడో కుత్తుక నుత్తరించెను ఇఁక నాకు దిక్కెయ్యది ? యెట్లు బ్రతుకుదాన ? నేమి సేయుదు ? నని పెద్దయెలుంగున నురస్తాడనము గావింపుచు నేడువఁ దొడంగినది. సఖురాండ్రందఱు గన్నీరు విడువజొచ్చిరి.
కాంతిమతి ? అయ్యో పాపము నాతో నిన్నుఁ జూపించుమని యడిగినది తనకు మరణ మాసన్న మైనదని యెఱుంగును సుమీ ! దీని నిట్లు ఖండించిన వారెవ్వరో యరయ వలయు. మనల నేమిచేయునో ? నీవు ధైర్యముగా నుండి ముందరి కార్యమాలోచించుమని యోదార్చుచు హేమప్రభకు శోకోపశమనముఁ గావింప జొచ్చినది. హేమప్రభ కాంతిమంజరితో 'సఖీ ! నీ వన్నట్లు దీనిం జంపినవా రెవ్వరో యరయ వలయు. నిష్కారణ మిట్లేల నీల్గెడిని ? నఱకఁ బడిన కంఠము గనంబడు చున్నదిగదా ? మన మందిరము నలుమూలలు వెదకి యుద్యాన వనముఁ జూచి రండని సఖుల కందఱకు నియమింపుము. నే నిందే యుండెదనని చెప్పినఁ గాంతిమతి సఖులఁ వెంటబెట్టుకొని యా మందిరము లన్నియు వెదక మొదలు పెట్టినది ఆ మాటలు విని నంతనే భాస్కరుఁ డమ్మవారి చాటునకుఁ బోయి డాఁగియుండెను. ఆ కాంతలా నిశాంతమంతయు వెదకి వచ్చిన తరువాత భాస్కరుఁడా దారులన్నియుఁ గుఱుతుఁ జూచుకొని మెల్లగా నమ్మవారి ప్రక్కనున్న గుమ్మము దెఱచికొని యుద్యానవనము లోనికిం బోయెను.
శీతల జల పూరితములై కనకమణి సోపాన విరాజితములగు వాపీరూప తటాకముల చేతను సకలరుకుసుమ కిసలయ ఫలవిసర మనోహరంబులగు వివిధతరు లతావితానముల చేతను శోభిల్లుచున్న యయ్యుద్యానవనముఁ జూచి యారాజ కుమారుండు మారవిలాసములు మాననమున మొలకెత్తుచుండ విస్మయముఁ జెందుచు నందందు విహరింపుచున్న సమయంబున హేమప్రభ సఖులతో స్నానముఁ జేయనొక తటాకమునకు వచ్చి యా ప్రాంతమం దా రాజపుత్త్రుంగాంచి హర్షవిస్మయ వ్యాకుల చిత్తయై కాంతిమంజరి కిట్లనియె.
సఖీ ! యా పాదపము దాపునఁ బూవులఁ గోయుచున్న పురుష సింహుఁ డెవ్వఁడో పరికించితివా ? వసంతుఁడు రూపముగైకొన యిందు విహరింపవచ్చెననితోచు చున్నది. కానిచో నివ్వనాంతరమునకుఁ బురుషేతరు లెట్లువత్తురు ? నీ వరిగి వాని వృత్తాంత మరిసి రమ్మని పంపిన నది వోయి యా రాజకుమారునికి నమస్కరింపుచు నార్యా ! నీకు స్వాగతమౌఁగాక నీవు కంతుఁడవా ? వసంతుఁడవా ? జయంతుఁడవా ? నీ వృత్తాంతముఁ జెప్పుము. నీ వీ రహస్యగృహంబున కెట్లు వచ్చితివి ? పేరేమి ? యెవ్వని కుమారుండ ? వని యడిగిన నతండు సంతసించుచు -
బోటీ ! నీ మాటలచే మాకుఁ బ్రమోదము గలిగినది. నేను నీ వనినవారిలో నొక్కండనుగాను. విక్రమార్క చక్రవర్తి ప్రసిద్ధి మీరు వినియే యుందురు. ఆయన మనుమఁడను. నా పేరు విజయభాస్కరు డందురు. సముద్రంబున నౌకాయానంబున నరుగునప్పుడు లోహధ్వజము బయలు వెడలుటయు నయ్యుత్పాతంబు ప్రజలనంటకుండ నేను సముద్రములో నురికితిని దానంజేసి యిక్కడకు రాఁదటస్థించినది. ఇదియే నా వృత్తాంతము. అనుటయు నది యా వృద్ధ రాక్షసిని సంహరించినవాఁడవు నీవేకావా ? యని యడిగిన నేనేయని యొప్పుకొనియెను.
నిష్కారణము నామె నేమిటికి వధియించితివని యడిగిన నతండు లోక కంటకురాలగుటఁ బరమార్చితినని చెప్పెను. అప్పుడది పోయి హేమప్రభ కావృత్తాంత మంతయు జెప్పి ఆహా ! విక్రమార్కుని కీర్తి విద్యాధరులు సంతతము గానము చేయు చుందురు అతండు మంచి ధర్మాత్ముఁడు సాహసవితరణాది గుణంబుల దేవగణంబులకు సైత మచ్చెరువు గలుగఁ జేసెను. ఈతఁడతని మనుమఁడు. అట్టియెఁడ రూపంబున నసామాన్యుఁడు గదా ? బ్రహ్మ వీని నీనిమిత్తమే తీసికొని వచ్చెనని తలంచెదను. ముసలి దాని చావుచూడ దీనికే కారణము. అని పలుకుచు స్ఫురణమభినయించి.
సఖీ ! యీతండు నీభర్తయగుటనిక్కువమే. జ్ఞాపకమువచ్చినది. మీయవ్వ జాతకములో నట్లున్నది ఎవ్వాడు నీకు మారకుఁడో యాతండే నీమనుమరాలికి మనోహరుఁడని వ్రాయబడి యున్నది. చదువునప్పుడా మాట దాటించి చదివితిని. అని చెప్పిన విని హేమప్రభ నవ్వుచు నీ కట్టి నమ్మకము కలిగి యుండిన నీ కార్యము సంఘటింపుమని పలికినది.
అప్పుడు కాంతిమంజరి హేమప్రభను వెంటఁ బెట్టుకొని యా చిన్న వాని యొద్దకరిగి సఖీ ! యితండు విక్రమార్కుని మనుమఁడు విజయభాస్కరుం డనువాఁడు. గుణంబుల నతనికన్న నధికుండు. వీని చరిత్ర యంతయు వింటిని. ఇప్పుడు మన యింటి కతిధిగా వచ్చెఁ గావున సత్కరింపుమని పలుకుచు నార్యా ! యీ చిన్నది మా కందఱకు హృదయ స్థానమైయున్నది. దీని పేరు హేమప్రభ యండ్రు. ఇది విద్యాధర చక్రవర్తి యగు విశ్వావసునికి మనుమరాలు. దేవవ్రతుని కూఁతురు. దీని మాతృ సంప్రదాయము రాక్షసజాతిలోఁ జేరినను దీని గుణంబులట్టివిగావు నీవు పూజ నీయుఁడవు గావున మా గృహంబునకు విచ్చేయవలయునని చెప్పిన నితండు నవ్వుచు నిది మీ గృహము కాదా ? ఇంతకు ముందే వచ్చితిమని యుత్తర మిచ్చెను.
అప్పు డొక పుష్పమాలిక హేమప్రభ నతని కంఠమునందు వేయించినది. అతని చేత మఱియొక దండ నయ్యండజయాన మెడలో వేయించినది. అంతలో సఖురాండ్రందఱు నచ్చటికి వచ్చి పూవులం జల్లుచు వధూవరుల నాశీర్వదించిరి మాలో వివాహ పద్ధతు లివియేయని యాతనికిం దెలియఁజేసిరి. ఆ సమయంబు నజలోర్మిశిఖరశీకర నికరంబులును, తరులతా ప్రవాళ కుసుమంబులును గాలిచే వారి సమీపమునఁ బడి జలవనాదిదేవతలు వధూవరులపై నభినందించుచు జల్లు సేసలువలె విలసిల్లెను పిమ్మట వారిని భోదిసంపదలకు సంకేత స్థానమువలె నొప్పుచున్న యొక కేళీగృహంబునకుఁ దీసికొని పోయి పుష్పశయ్యం గూర్చుండఁబెట్టి మంగళగీతములం బాడుచు నిరువురకు మనోహరోత్సుకత్వము గలుగఁ జేసిరి. కొంత తడవు సఖులెల్ల విచ్చలవిడి శృంగార చేష్టలఁ గావించిరి. పిమ్మటఁ గాంతిమంజరి బాస్కరునితో రాజపుత్రా ! యిది నీ భార్యయైనది. యిటు పిమ్మట నీ యిష్టము వచ్చినట్లు చేసికొనుము. మే మందరముఁ బోవుచున్నార మని పలుకుచు దలుపు బిగించి సఖులతోఁ గూడ యవ్వలికిఁ బోయిరి. తదనంతర మా రాజుపుత్రుఁ డయ్యోపారత్నమునకు సంతోషము గలుగ జేయుచుఁ గొన్ని దినములు గడపి యొకనాఁ డతండు కాంతా ! నే నెంతకాల మిట్లు పరోపకార విముఖుండనై యిందుండుదును! పామరుండువోలె నిధువనక్రీడయే జన్మకు సార్థకమని యూహింపవలయునా? భూలోకమునకుం బోవు తెఱవుఁ జూపెద నని ప్రతిదిన మూరింపుచుంటివి. నా వృత్తాంత మంతయు వినియుంటివి గదా? నా తల్లి నా కొఱకెంత చింతించుచుండునొ ! ఆమెం జూచిరావలదా? యని యడిగిన నా జవ్వని నవ్వుచు నిట్లనియె.
ప్రాణేశ్వరా ! నీవు నా కిందుఁ గావించినది పరోపకారముకాదాదీననెక్కుడు పుణ్యము గలుగకపోదు. వినుము. నీ తల్లిం జూడక పోవుటచే నీ యుల్లము తల్లడిల్లు చున్నది. నా తల్లియు నట్టిదని యేల తలంపవైతివి ? నిష్కారణము దాని నేమిటికి వధించితివి ? అది నీ కేమి యపకారముఁ జేసినది ? ఆ పాతక మనుభవించుటకే మరి కొంతకాలము నీకీ బంధనము విధించితి నని యుత్తరముఁ జెప్పినది. అను నగు. నీ తల్లి నా కొక్కనికే యపకారముఁ జేయలేదు. జగంబునకే శత్రురాలు అబ్బా ! ఆ రండగాంచిన జీవహింసలకు మేరయున్నదా ? ఆ వృత్తాంతము వినియే లోకకంటకురాలని పరిమార్పితిని. ఇట్టి బంధనములు పెక్కులను భవించవచ్చును. ఈ పరిహాసములకేమి ? కాని నాకుఁ దెరు వెఱింగింపుమని యతండు తొందర పెట్టెను.
మఱియొక నాఁ దచ్ఛేడియ మోహనరత్న ------------ కంకణ మొకటి యతని చేతం దొడిగి యొక సరస్సు చెంతకుఁ దీసికొనిపోయి ఆర్య పుత్రా ! నీవు తలంచుకొని యీ తటాకంబున మునింగితివేని నీ యిచ్చ వచ్చినచోటికిఁ బోవుదువు. వెండియు నిచ్చటికి రాఁ దలంపుగలిగినప్పు డీ కంకణమును జేత నిడికొని తలంచుకొని యే తటాకంబున మునింగిస నిచ్చటికి వత్తువు. ఇదియే సాంకేతికము. ఈకంకణము నేమఱ వద్దు సుమీ ? మీ తల్లిం జూచి వారములోపున రాకున్నఁ జింతిల్లు దాన దీన బంధుండవు నీ వెఱుంగనిది లేదని యతనిచే నొప్పించుకొని మోము ముద్దు గొనుచు భూలోక గమనంబున కనుజ్ఞ యిచ్చినది.
అతండు కొన్ని రత్నములు మూట గట్టుకొని యా కాసారమున మునింగి శోభావతీ పురంబున కరుగునట్లు తలంచుకొని లేచి చూచినంత నప్పట్టణము కన్నుల పండువు గావించినది. అప్పుడు హేమప్రభా ప్రభావంబు వేతెఱంగుల గొనియాడుచు నల్లన నప్పుట భేదనము లోనికిం జని యశస్కరుని గుఱించి వితర్కింపఁ దన్నుఁ గుఱించి పశ్చాత్తాపముం జెందుచు విరక్తుండై తీర్ధాటనము సేయ నరిగినట్లు తెలిసినది. పిమ్మటఁ దన బసలోనికిం బోయి తల్లిం జీరిన నామెయుఁ బుత్రశోక వ్యాకులచిత్తయై యెందేనిం బోయినట్లు వినఁబడినది. అప్పుడా రాజపుత్రుఁడు మిక్కిలి విచారింపుచు వారి జాడ నరయు తలంపుతో ననేక జనపదంబులు తిరిగి తిరిగి యొకనాఁడు సాయంకాలమునకుఁ గలభాషిణి యున్న చంద్రప్రస్థ పురంబునకుం బోయి యొక దేవాలయములోఁ బండుకొని ధ్యానింపుచుండెను.
కలభాషిణికథ
అంతలో నొకస్త్రీ వచ్చి యతని వీఁపు తట్టుచు మదనకేతనా ! లెమ్ము లెమ్ము. రాజపుత్రికను గోట దాటించి వచ్చితివి మేము పయనమై శ్రీ శైలమునకుం బోవుచుంటిమి. నీవు మమ్ము ముందరి మజిలీలోఁ గలిసికొనుము. కార్యసంఘటనముఁ జేయుటకు నేనుపూట నా కిత్తునన్న పారితోషిపముఁ దీసికొని రావలయుం జుమీ. పోవుచున్నదాన. నిలువ వీలులేదు. కలభాషిణి నొక్కరితను నిలువం బెట్టి వచ్చితినని పలుకుచు నా యువతి యరిగినది. భాస్కరుఁ డామాట లన్నియు విని వెఱగందుచు నోహో ! ఇది యెవ్వతెయో ? నన్ను జూచి మదనకేతనా, యని పిలుచుచు నేమో ముచ్చటించినది. పాపము వీరికెద్దియో సాంకేతిక మున్నది కాఁబోలు. రాజపుత్రికను గోట దాటించి వచ్చితినని చెప్పినది. ఇది జారకృత్యము కావచ్చును. లోకమున నెన్ని వింతలైన నున్నవి కదా ! యని యూహింపుచు నక్కడనే పండుకొని యుండెను.
అప్పుడు మఱియొక తరుణుఁ డా ప్రాంతమందుఁ దిరుగుచు ------- వయస్యా ! యా దాసీరండమాట విని యీ యర్ధరాత్రమున నీపాడు దేవాలయములో వచ్చి మోసపోయితిమి. పాదరక్షలైన లేవు. ఈ గడ్డిలో నేపామైన గ-------------- వాన జీరఁగలదు. పోవుదము రమ్ము ఇఁకరాదు. ప్రొద్దుపోయినది. ---------------- రాజుపుత్రికకు వివాహ మహాత్సవ యెల్లుండి జరుగునని గ్రామమంతయు ----------- పుచున్నారే. నీవు దాని మాట యెట్లునమ్మితి వనుటయు, నాతండు మిత్రమా నంతయుఁ జెప్పలేదు విను ఈ రాజపుత్రిక కలభాషిణి సౌందర్యాతిశయ మిట్టిదని చెప్పుటకు నాకుఁ గాదుగదా సృష్టించిన విరించి తరముగాదు. ఆ తరళాక్షినుద్యానవనమునకుఁ బోవుచుండ హథాత్తుగాఁ జాచితిని అప్పటినుండి నా యవస్థ యిట్టిదని చెప్పుటకు శక్యముగాదు పూఁబోఁడి. తోట ... టి. మా చిన్నదా..? బాణస,కాలుగలదు. లంచ గోని సంఘటనచేయుదు దాని నాశ్రయించితిని. అది మీ నా పిల.. 44 నని సంవత్సరము నుం త్రిప్పుచున్నది కలకానికి ఒకటి వృత్తాంతము నీవు వినియే ముందపు అయి వరించిన చిన్న వినిపించినంతనతండు సముద్ర ములోని ఇడినట్లు తెలియ వచ్చినది. తన త మీసి నా మణి యొక్క సంబంధము కదిని పెండ్లి చూడమనిని గోరు క్షము లేదట. ఇప్పుడి పెండ్లి బలవంత పూపుతోణితో ముగాఁజేయ నిశ్చించినారం. ఆ సంగతి యెఱింగి కలభాషిణి రహస్యముగా శ్రీ శైలమున కడగ స్పయిన ఆపయన మీరాత్రియే చేయుడు మరియు మనలను నారు వచ్చి చెప్పెదననియు సన్నందు వలియుండు మనియుఁ చెప్పినది ఇదియే వృత్తాంత ఎట్ల యిననది రాకమానదు. కొంచెము సేపు తాము నేను దానికిఁ గానుక యిత్తునని చెప్పితిని. మిత్రమా : తొందర పడుకుమని బ్రతి మాలిన నతం డిట్లనియె. మదనకేతనా ! నీ మాటలువిని వెత్తికుదిరినది రోఁకలి తలకుం జుట్టుమని నట్లున్నది. దీనిలో నీకు వచ్చులాభమియో తెలయకున్నది. రాజపుత్రిక చరిత్రము విన శీలవంతుకాలువలెఁ దోచుచున్నది. సావిత్రియుఁబోలె రెండవవానిఁ బెండ్లి యాడ నని చెప్పి చెప్పుకొనన శ్రీశైలమునకుఁ దాటిపోవుచున్నది కాబోలు : అట్టి దాని గుర్తునని చెప్పిన పూవుఁటోడిమాట యెట్లునమ్మితివి ? చాలుఁజాలు చక్రవర్తి పుత్రునికన్న నీ వెక్కుడువాడివనియా స్వీకరించుట ? ఆ రండ లంచముతిని మండలించిన నతండిట్ల సియె. యేమి యంచిన్నది పెండ్లిమానుకొని నిన్ను చెప్పిన మాట విశ్వసింపుచున్న వాఁడవా యని మిత్రుడా : నా మాట వినుము. సాగించుండునుకదా : దారిలోఁ గలిసికొని కలభాషిణి యొంటిగాఁ బ్రణ పరిచయము గలుగఁజేసికొని తీయ మాటలచే ప్రేమగలుగఁ జేసెదను. ఈ మధ్య నేను కొక్కోకము సంపాదించి మంతయుఁ జూచితిని; దానిలో నుంచి చమత్కారములైన సంగతుకున్నది. అదియునుగాక నా యందముల కాచిన నే వరింపకుండును ? ది స్వాతి శయోక్తిగాఁ దలంపకుము. స్త్రీల చేష్టితముల నీ వెఱుంగవు. ఇప్పుడున్న బుద్ధి మణి కొంచెము సేపునక్కంచదని తలంపుము. అరుంధతికైనను బరపురు తో బస్ మనము లేకాంతముగాఁ బస గలిగినేని మనస్సు చలించకమానదు. కావలసినంతల మములు చదించను. ఇదంతయు నాలోచించిన ప్రాణముని వచ్చి చప్ప మి. పువు(చోడితోఁ చెప్పియుంచితిని. నేర యతిక్రమించినది. పియపన మాగిపోయిన దేమో తెలియదు. ఇప్పటికైన నా మాట నమ్మెదవా ? యనుటయు నతండు నవ్వుచుఁ గాముకుల స్వభావ మిట్లేయుండును. నా మాటలు నీ మది కెక్కునా ? నీ యిష్టము వచ్చినట్లు కానిమ్ము. నాకు నిద్రవచ్చుచున్నది. నేను పోయివత్తునని పలికి యతం డరిగెను.
మదనకేతనుండును మఱికొంతసేపుండి యింటికి పోయెను. రాజపుత్రుఁడా సంవాద మంతయువిని కలభాషిణి యనఁ దాను దొంగలవలన నిడిపించిన చిన్నదిగా నిశ్చయించి అయ్యారే ? యా బాలికను బ్రాహ్మణ పుత్రునకుం బెండ్లి చేయునట్ల నిరూపించితినే ? అది యేటికిఁ దప్పినది. నా వృత్తాంతమెట్లు తెలిసినది. మఱియొకనిం బెండ్లియాడక యోగినియై పారిపోవనేల? చిత్రముగా నున్నది. యీ విటుని వలపు విన యేమిచేయునో చూచెదంగాక యని పూవుఁబోడి యెఱింగించిన గ్రామముల పేరు జ్ఞాపకముంచుకొని యా మార్గముల వెంబడిఁ బయనము సాగించుచు నాలుగు దినములకు వారి గలిసికొనియెను.
పూవుఁబోడి మదనకేతునితో మాటాడుచుండ వారేయని గ్రహించి యతండు వెనువెంట దూరముగా నడచుచుండెను. రాజుపుత్రుండు తపంబున కుద్యమించు పార్వతియుంబోలె జటావల్కలములఁ దాల్చి కనకమణిభూషాంబరముల నూడ్చియున్న యా చిన్న దానిని జూచి నాలుగైదు సంవత్సరములై నది. అప్పుడీ యొప్పులకుప్ప సమాక్రాంత యౌవన యగుచున్నది. ఇప్పుడు సమారూఢయౌవనయై యున్నది. ఆహా ! యీ మోహనాంగి జటావల్కలములఁ దాలిచినను మనోహరము గానే యున్నదిగదా ! స్వభావసుందరులకు వికృతియుఁ గ్రొత్తయందమును దెచ్చునని చెప్పినమాట యదార్ధమగును. ఈ బాలిక శీలమును బరీక్షించుట యావశ్యకమై యున్నదని దలంచుచు మఱికొన్ని పయనములు సాగించెను.
మదనకేతనుఁడు నవసర మరసి వారితోఁ పోపుచుండెను. ఒకనాఁడు కలభాషిణి పూవుబోఁడీ ! యీ చిన్నవాఁ డెవ్వఁడు? తఱచు నీవు మాటాడుచుంటివి. నీ వెఱింగిన వాఁడాయేమి? మన వెనువెంటఁ దిరుగుచున్నవాఁడేల ? యని యడిగిన నది యువతీ ! యితండు బ్రాహ్మణ కుమారుఁడు శ్రీశైలమునకుఁ పోవుచున్నాడట. దారిలోనే పరియచమైనది. మంచివాడు మనకు సహాయముగా నుండునని మాటలాడు చుంటినని యుత్తరముఁ జెప్పినది. అతండును నక్కవినయములు చూపుచుఁ గొంత కొంత పరిచయము గలుగఁజేసికొని మాటల--- జొచ్చుచుఁ బురాణగాదల వినుపింపుచుఁ దోడ నడచుచుండెను.
ఒకనాఁడు రాత్రి శ్రీశైల ప్రాంత కాంతారములో వసించి యున్నప్పుడు మదనకేతనుండు పూవుఁబోడి నెద్దియో మిషచే దాపున లేకుండుటజేసి ధరతో రాణశిష్టం వచ్చి ప్రస్తాకంగా నోరు అప్పటించు కొంటిని ఎగుము. యౌవనము చంద్రం పూరయావనములో నుంటివి. రూపముఁ జూఁడ ద్రిలోక మోహజనకమై యున్నది. ఇట్టి ప్రాయమునఁ దగిన వరుని వరించి యైహిక సుఖంబు లనుభవింపక యుత్కృష్ట వ్రతంబులం బూని జోగురాలవై తిరుగుచుంటివేమి ? స్వర్గమునమాత్ర మేమియున్నదనుకొంటివి. అక్కడికిఁ పోయినను శృంగారచేష్టలే. యౌవన విలాసములే. ఇంతకన్న మఱేమియునులేదు. ఇక్కడ వృద్ధులై వ్రతములంబూని పిమ్మట స్వర్గమునకుం పోయి క్రొత్తదేహములం దాల్చి యందు వెండియుఁ గ్రీడింపుచుందురు. ఇక్కఁడజేయు పనియే యక్కడను జేయుచుందురు. నీ విక్కడ విడిచి యక్కడిదానిం గోరనేల ? నేను నవరస రసికుండ. నన్ను బరిగ్రహింపుము. స్వర్గసౌఖ్యంబులన్నియు నీ కిందు జరగఁజేసెదనని చెప్పుచుండఁగ నయ్యిందువదన వానికేమియుఁ బ్రత్యుత్తర మీయక పూవుఁబోడీ ! పూవుఁబోఁడి ! యని పిలిచినది. అది యా ప్రాంతమందె యుండి మాటాడినదికాదు.
అప్పుడతండు బోఁటీ ! నా మాట లేమియు నుత్తరమిచ్చితివి కావేమి ? పూఁబోఁడి యేమిటికి ? నిన్ను ద్యానవనములోఁ జూచినది మొదలు నా మదనవేదన యేమని చెప్పుదును? నేటికి సమయము దొరికినది. నా మాట కంగీకరించిన సరే లేకున్న బలాత్కారముగానైన నా యభీష్టముఁ దీర్చుకొనక మాననని పలుకుటయు నక్కుటిలకుంతల చటులముగాఁ జూచుచు ఛీ ! నీచా ? నా చిత్తమరయ కూరక ప్రల్లదములఁ బ్రేలెదవేల? నా మనోహరుఁడు భాస్కరుండు పరలోకగతుండైన నొరుల వరింతునా ? పాపాత్మా | యిట్టియూహతో నా వెనువెంటఁ దిరుగుచుంటివా ? పోపొమ్ము. నీ మాటలు నా చెవి కెక్కవని పలికినది.
అప్పుడు వాఁడు కానిమ్ము నీకడ్డుపడువారెవ్వరో చూతునుగాక మంచి మాటలచే బోటులు వశమగుదురా? యని పలుకుచుఁ దదీయ జటాకలాపముచేతఁ బట్టుకొని మోము చుంబింపం బోయిన నయ్యువతీమణి విదళించుకొనుచు అయ్యో ! పూవుఁబోఁడీ యీ దుర్మార్గుఁడు నన్ను బాధింపుచున్నాఁడు. రమ్మురమ్మని పెద్ద కేక పెట్టినది. ఆమాట వినియునది వచ్చినదికాదు. అప్పుడు భాస్కరుఁడా ప్రాంతపాదపము మాటుననుండి యంతయు వినుచున్న వాఁడు కావున ఖడ్గము కేల నుంకించుచు వెఱవకుము వెఱవకుము నేనిదే వచ్చుచున్న వాఁడనని పలుకుచు నొక్కగంతున నచ్చటికి వచ్చి నిలిచెను. అతనింజూచి యా బ్రాహ్మణబ్రువుఁడు పారిపోయెను.
అంతలోఁ బూవుబోణివచ్చి అమ్మా ! యేమియేమి ? యట్లడలుచున్నావని పలికిన నయ్యువతి నయ్యో ? నీ వెందుఁ బోయితివి ? మనతో వచ్చుచున్న నీచుఁ డేమి చేసెనో చూచితివా ? యీపుణ్యాత్ముఁడు రక్షించెను. దుర్జనుల సహవాసము కూడదని పెద్దలు చెప్పియుండలేదా? యని యతని చర్యలఁ జెప్పి భాస్కరుని వినుతించినది. పూఁబోణియు సమయోచితములగు పలుకులచే నాచెలువకు ధైర్యముగలుగఁ జేసినది. రాజపుత్రుండు తదీయ సతీత్వధర్మమునకును వివేకమునకును మిక్కిలి సంతసించెను. మఱియు నిప్పుడు తన్నెఱింగించినను గపటమే యనుకొనునని తలంచి మాఱుమాటాడక శ్రీశైలమున కరుగుచుఁ గొన్నిపయనములు వారి ననుసరించియే సాఁగించెను. ఒకచోఁ గాళులు పొక్కులెక్కి వెతఁజెందుచు నడువలేక నడుచు చున్నయొక వృద్ధురాలిం జూచి యతండు జాలిపడి యామెకుఁ జేయూతయిచ్చి మెల్లగాఁ నడిపించుచుఁ దీసికొనిపోయెను. దానంజేసి తుదముట్ట వారితోఁబోవుటకు వీలుపడినది కాదు.
విజయభాస్కరుండు శ్రీశైలమునకరిగి మహాశివరాత్రినాఁడు పాతాళగంగా ప్రవాహంబునఁ దీర్థంబులాడి మల్లికార్డున లింగమునభిషేకాద్యర్చనలఁ గావించి తాఁ దెచ్చిన రత్నములన్నియు నందుఁ గోటితీర్దప్రాంతమందలి మంటపంలోఁ గూర్చుండి సద్గోష్ఠిఁజేయుచున్న పరివ్రాజకబృందమునకుఁ బంచిపెట్టి వారియొద్దఁ గూర్చుండి సాయంకాలము వఱకుఁ దదీయసంభాషణామృతముఁ గ్రోలి శ్రోత్రానందముఁగావించు కొనియెను. ఆ కూటములో ధర్మములకెల్ల నేధర్మముత్తమమని యొకఁడు ప్రశ్న వేయఁ బరోపకారము భీతరక్షణము పరమోత్తమధర్మములని యందఱు నేకగ్రీవముగా బలికిరి. అధర్మమును గుఱించియే పెద్దతడవు వితర్కింపుచు ననేకపురాణేతిహాసముల నుపన్యసించుచుండిరి. అట్టి సమయంబునఁ గోటితీర్థమున గుభాలుమను చప్పు డొకటి వినంబడినది. తోడనే ఆహా ! యెవ్వరో దీనిలోఁబడినారు. పడినారను ధ్వని నలుమూలల వ్యాపించినది ఆ రోద విని యావిరక్తులందఱు తటాలున లేచి యా బావి యొద్దకుఁ బోయి దుర్జన హృదయంబు వోలెఁ దయోమయంబైయున్న యా నూఁతిలోనికి దొంగిచూడఁ దొడంగిరి. అప్పు డారాజపుత్రుండు వడివడి జనుదెంచి (మరణ మకాలమునరాదు మహినెవ్వకిన్) అను మునుపటి పద్యమును జదువుచు యోగులెల్ల వెఱఁగంది చూచుచుండ గభాలున నయ్యంధకారకూపంబున నుఱికి యందు మునిగి యున్న దేహిం బట్టుకొని నీఁటి పైకిఁ దేలించెను.
అంతలో మఱి కొందఱు పుణ్యాత్ములు త్రాళ్ళువైచుకొని దిగి వారిరువురిని బైకిఁదీసిరి. అప్పుడందుఁ బడినది యొక జోగురాలుగా దెలిసికొని తద్విరక్తి కందఱు వెరఁగు పడఁ జొచ్చిరి. అప్పుడా జోగురాలు కన్నులం దెఱచి హాపుత్రా ! హా భాస్కరా ? హా గుణనిధీ | హా దయాళూ ! నీవనిన ట్లకాలమున మరణమురాదుగదా? అయ్యో ! తండ్రీ ! నీవు పరలోకగతుండ వైతివని వినియు నీ కృపణప్రాణములు నన్ను వీడకున్నవి. నేను బ్రతికి యేమిచేయుదును ? నాకు దిక్కెవ్వరు ? సార్థకమేమి యని యూరక విలపింపఁజొచ్చినది.
ఆ పరివేదనము విని యందొక విరక్తుండు. ముందరికి వచ్చి అమ్మా ! నీవు భాస్కరుని తల్లి వని తెలిసికొంటిని. అప్పుణ్యాత్మునిఁ జంపించిన ద్రోహిని నేనే సుమీ ! తత్పాపపరిహారమునకే రాజ్యము విడిచి విరక్తుండనై తీర్థాలు తిరుగుచుంటిని. ఏమి చేసినను నా హృదయపరితాపము చల్లారకున్నది. భవదీయ దయామృతము నాపైనించుక ప్రసరింపఁజేసితివేని చల్లాఱునేమో ? నా రాజ్యమంతయు నీకిచ్చివేసితిని. నీ యిష్టము వచ్చినట్లర్దులకుఁ బంచి పెట్టుకొనుము. నన్నే నీ కుమారునిఁగా జూచికొను మని యనేక ప్రకారముల బ్రార్దించి యామె శోకము నిబ్బడిగావించెను. అప్పుడు భాస్కరుఁడు వారిరువురం గుఱుతుపట్టి సంతోషశోక విస్మయరసావేశ హృదయుండై పరమేశ్వరుని ఘటనావై చిత్ర్యమునుఁ బెక్కుగతులఁ గొనియాడుచుఁ అమ్మా ! విచారింపకుము. నేను నీపుత్రుండ భాస్కరుండ నన్నిటు దైవమే సంఘటించెనని పెద్దయెలుంగున నుచ్చరింపుటయు నాయిల్లాలు దిగ్గునలేచి యేమేమీ ? నీవు నాముద్దులపట్టివి భాస్కరుండవే ? ఆహా ! యెట్టిమాట వినంబడినది. ఇది కల గాదుగదా. తండ్రీ ! నీవు సముద్రములో మునింగితివని వింటేనే ? యది యసత్యమా యేమి ? యని యనేకప్రకారములఁ బలవరింపుచు నతనిం గుచ్చియెత్తి యక్కునం జేర్చుకొని శిరము మూర్కొని లాలింపుచు నానందసాగరమున మునిఁగినది. పిమ్మట యశస్కరుఁడు భాస్కరుని చేయిపట్టుకొని పుణ్యాత్మా ! యీ పాపమతి యెవ్వఁడో యెఱుంగుదువా ? వినుము
మ. కరుణాబంధరు ధైర్యమందరు శుభాకారున్ సదాధారునిన్
బరమోదారుఁ బరాంగనావిముఖు నాపద్బాంధవు నిన్ను ని
ష్ఠురము ల్పెక్కువచించి దోషమతి వంచుంజంపఁగా బుచ్చుము
ష్కరుఁడ న్మూడుఁడ ద్రోహు డన్ ఖలుఁడనేగష్టుండనో భాస్కరా.
అని మఱియు మహాత్మా ! నీవు పరోపకారమునకై సముద్రంబునం బడి మునిఁగిపోయితివని వూదూతలు చెప్పిరి. అది యసత్యమాయేమి ? నీ వెట్లు బ్రతికి వచ్చితివి ? నీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన భాస్కరుం డా రాజసత్తముని నవ్వృత్తమున కచ్చెరువందుచు దేవా ! సముద్రములో మునింగినను గిరినుండి పడినను వహ్నిఁజొచ్చినను అకాలమున మృతిరాదుగదా ! అట్టి నిశ్చయజ్ఞానము గలిగియుండినచో విచారమేలగల్గెడిని ? ఆపదలు సుఖమునకును సుఖమాపదలకును నొక్కొక్కసారి కారణమగుచుండును. నా వృత్తాంతము చాలయున్నది సావకాశముగాఁ నెఱింగించెద. మిమ్మిందు గనుంగొంటి నింతియ పదివేలు. నాకతంబున నీవు రాజవిరక్తుడవైతివని మిక్కిలి పరితపించుచుంటి. నే సుఖినైతి నీవింకఁ బోయి రాజ్యము జేసికొమ్మని పలికిన నానృపతిలకుం డిట్లనియె.
మహాత్మా ! నీ సుగుణంబులఁ గొనియాడ నాదిశేషుండు చాలఁడనిన నే నెంతవాఁడ ? ఇట్టి నిన్నూరక దండించిన నేను రాజ్యార్హుండ నెట్లగదును ? నా రాజ్యము నీయదియెకాని నాదికాదు. నీవే యేలికొనుము. మఱియు నీవొక రాజపుత్రికను చోరులనుండి రక్షించితివఁట. ఆ చిన్నది నిన్నే కాని పెండ్లి యాడనని శపధముఁ జేసికొనియున్నదఁట. ఆ వార్త తరువాత నాకుఁ దెలియవచ్చినది. ఆ సతీతిలకముం బెండ్లి యాడి రాజ్యము నీవు పాలించుకొనుము. ఇదియే నా ప్రార్ధన యని యెంతయో బ్రతిమాలికొనియెను. కాని యతం డంగీకరింపలేదు.
అప్పుడు చారుమతి భాస్కరా ! నీచే దొంగలవలన రక్షింపఁబడిన చిన్నది కలభాషిణి నిజము దెలిసికొని నిన్నేకాని పెండ్లియాడనని శపధము జేసికొనియున్నదఁట. ఇంతలో నీవు సముద్రములో మునిఁగితివని యారాజు మఱియొకనికిఁ బెండ్లి జేయఁ బ్రయత్నింప సమ్మతింపక జటావల్కములఁ దాలిచి శ్రీశైలమునకుఁ బాఱిపోయివచ్చినది. దారిలో నన్నుఁ గలిసికొని తనవృత్తాంత మడిగిన నాకుఁ జెప్పినది. నా వృత్తాంతము సైతము దానికిఁ జెప్పితిని. ఒండొరులయవస్థ కిరువురము దుఃఖింపుచు నిచ్చటికిఁ జేరితిమి. నాఁటినుండియు నన్ను విడువక నాతోఁ దిరుగు చున్నది నేఁటిసాయంకాలమున నెవ్వడో చిన్న వాఁడు యోగులకు రత్నములు బంచి పెట్టుచున్నాఁడని యెల్ల రు జెప్పుకొనగావిని నీ వెనుకటిమాట జ్ఞాపకమువచ్చుటచే శోకమాపఁజాలక యాబాలికకు జెప్పకయేవచ్చి యీతీర్ధములోఁబడితిని. ఆ చిన్నది కడు నుత్తమురాలు పతివ్రత. నీవు దానిం బెండ్లి యాడి సుఖింపుమని పలుకుచుండగనే కలభాషిణి యచ్చటికివచ్చి యామెం గౌఁగిలించుకొనుచు "అత్తా ! ఆశ్చర్యములు వినంబడినవి యధార్థమేయగునా ? నీవు నాతోఁజెప్పక యెట్లు వచ్చితివి ? నీకుమరుఁడు నిన్నుద్దరించెనఁట. భాస్కరుఁడే ? మదీయ హృదయజల భాస్కరుం డతండేనా ?" యని యడిగినఁ జారుమతి గారవింపుచు నెడమసందిటం బట్టికొని కుడిసందిటఁ గుమారుం జేర్చుకొని యల్లన నిట్లనియె.
వత్సా ! కలభాషిణి యిదియే సుమీ ! నీనిమిత్త మెట్టివేషము ధరించెనో చూచితివా ? దీని నీవు పరిణయమాడవలయును ననుచుఁ గలభాషిణీ ! వీఁడే నీభర్త. నీయదృష్టమే వీని నిట్లు కాపాడినది. నీవు ధన్యురాలవు. వీఁడు నిన్ను బెండ్లియాడఁ గలఁడని పలికినది. అప్పుడు కలభాషిణి లజ్జావదనయై బొటనవ్రేలు నేల వ్రాయుచుఁ బ్రహర్షసాగరమున మునింగి యభీష్టదేవతలఁ బ్రార్దింపుచుండెను. అమ్మా! యా చిన్నది తండ్రిమాట మన్నింపక స్వతంత్రించి యిల్లువిడిచి యొక్కరితవచ్చి దేశాటనముఁ జేయుచున్నదిగదా ? ఇది సతీధర్మమేమో చెప్పుము. స్త్రీస్వభావమెవ్వఁడు గ్రహింపఁగలఁడు ? ఈయువతి యే యూహతో నిల్లువెడలినదో నీవు చెప్పగలవా ? పరులు శంకింపకుందురా పరీక్షించి కాని పరిణయమాడుట కంగీకరింపనని రాజపుత్రుఁడు పలికిన విని యాకలికి యులికిపడుచు నిట్లనియె.
అత్తా ! యీమెచిత్తంబన్యాయత్తంబు కాదని పావకుస్పృశించెదను. త్రికరణంబులచేత భాస్కరుఁడే పతియని తలంచియుంటి. ఇందులకు భాస్కరుఁడే సాక్షి. పరీక్షించియే చేసికొనవచ్చునని యించుక వెఱపు గదురఁబలికిన విని చారుమతి. “వత్సా ! యీరాచపట్టి దృఢవ్రతయనియే చెప్పగలను. పదిదినములనుండి నేను జూచుచుంటిని. సంతతము నీగుణములే యడుగుచుండును. నీరూపమే ప్రశంసించుచుండును. నీయౌదార్యమే కొనియాడుచుండును. అట్టి యభిప్రాయము లేదేని యిన్ని యిడుమలు గుడువనేల ? తండ్రి చెప్పిన వడుపునం బెండ్లి యాడి సుఖింపరాదా ?" యని యెన్నియో చెప్పిన నవ్వుచు నతండు దారిలోఁ బరీక్షించిన విషయమంతయు రహస్యముగాఁ దల్లి కెఱింగించి పెండ్లి యాడుట కంగీకరించెను.
పిమ్మట యశస్కరుండు మిగుల సంతోషింపుచుఁ బెండ్లి పెద్దయై యా క్షేత్రంబున మల్లి ఖార్జునమహాదేవుండు సాక్షిగా వారికి వివాహముగావించెను. అతండు వివాహసమయమున వర్గత్రయ ముచ్చరించునప్పుడు భాస్కరుఁడు విక్రమార్కుని మనుమడని విని యింతింతరాని సంతసముఁ జెందుచు నెల్లరకుఁ దత్ప్రసిద్ధి వెల్ల యగునట్లు వాని సుగుణములన్నియు బలుమారు గై వారము గావించెను. భాస్కరుండా లోపలనే తల్లి కిఁ బ్రభావతివృత్తాంత మెఱింగించె నట్టి సమయమున బూఁబోణి యా రహస్యమాలించియున్నది కావున నారాజపుత్త్రు కరముననున్న రత్నకంకణమెట్లో సంగ్రహించి తన వెనువెంటఁ దిరుగుచున్న మదనకేతునకిచ్చి యా రహస్యమంతయుఁ చెప్పి పో పొమ్ము. కలభాషిణకన్నఁ జక్కని చిన్నదానిం గూర్చితిగదా ! నీ ఋణము దీర్చుకొంటి నేనును బోయి వత్తునని చెప్పి తా నెచ్చటికో పోయినది.
పిమ్మట యశస్కరుఁడు వారి దమ వీటికి రమ్మనియు రాజ్యమేలుకొమ్మనియు బ్రతిమాలికొనుటయు రాజపుత్త్రుండు దేవా ! నాకు మీరాజ్యమందించుకయు నభిలాషలేదు. దైవానుగ్రహము గలిగిన మా తాతపీఠమే నే నధిష్టించెదను. అదియునుంగాక యిక్కలభాషిణి తన గ్రామమునకు రమ్మని వేఁడుకొనుచున్నది. తండ్రి రాజ్యమునకాయుపతియే కర్త్రియగుచున్నది. నా నిమిత్తమామత్తకాశిని యైహికసుఖముల నేవగించి జోగురాలై తిరిగినది. మీ రెఱింగినదేకదా ? తొలుత మే మాపురమున కరిగి పిమ్మట మీ పట్టణమునకు వచ్చి విందులారగింతుము. అట్లు చేయుట కాజ్ఞయిమ్మని వినయపూర్వకముగాఁ బ్రార్థించి తదనుజ్ఞవడసి కతిపఁ ప్రయాణముల భార్యయు దల్లియు సేవింప జంద్రప్రస్థపట్టణమున కరిగెను.
అందుఁ గలభాషిణినిగురించి ప్రజలు తండ్రియు నెట్లుచెప్పుకొనుచున్నారో యని తొలుతఁ దమ్మెఱింగింపక రాజపుత్రుఁడు వారితో గూడ నొక సత్రములో బసఁజేసెను. ఆ సత్రమున పలుదేశములనుండి వచ్చు పోవు వారికి నివసించుటకుఁ భుజించుటకును దగిన సదుపాయములు గలిగియున్నది. అందొకమూల వివాహములు, నొకమూల సంతర్పణములు, నొకమూల నుపన్యాసములు, నొకమూల బురాణములు, నొకమూల నృత్యగాన ప్రసక్తియు నహోరాత్రము లేకరీతిగా జరుగుచుండును. అందాకర్ణించిన బెక్కు దేశముల వారలు వినంబడుచుండును. పట్టణములోని రహస్యము లన్నియు నందుఁ దెల్లముగాక మానవు. వీఁటిలో నేదియైన వింతపని రాత్రి జరిగినదో లేదో తెల్ల వాఱక మున్నె యా సత్రములో వ్యాపించి యుండును.
ఆ రాజపుత్త్రుడా సత్రములో విచిత్ర చారిత్రము లాకర్ణింపుచు వింతలం జూచుచు నలుమూలలు దిరుగుచుండ నొక దండ గూర్చుండి యాత్మీయకథానుగుణ మైన మాటల బాటసారులు కొందఱిట్లు సంభాషించుకొనిరి.
విదేశీయుఁడు - బ్రాహ్మణుఁడా ! మీ దేగ్రామము ?
బ్రాహ్మణుఁడు - మాది యుజ్జయిని.
విదే - ఉజ్జయిని యన సాహసవిక్రమార్కుని పట్టణము కాదా ?
బ్రాహ్మ - అవును.
విదేశీ - అమ్మహారాజు కుశలియై యున్నవాఁడా ?
బ్రాహ్మ - అతం డుండిన మాకీకర్మమేమి ? స్వర్గస్తుఁడయ్యెను.
విదే - శివశివా ! యెంతమాట వింటిమి. ఆహా ! అమ్మహారాజు వితరణాది సుగుణంబుల ననంతుఁడైనఁ గొనియాడఁ గలడా? మా దెసనతని వాడుక యెక్కుడుగా వ్యాపించి యున్నది.
బ్రా - మీ దే దేశము?
విదే - దక్షిణాది. అనంతశయనము.
బ్రా - మీ దేశ మొక్కటియేనా ? చతురంబోధిపరీతం బగు ధరాచలం బంతయు నతని వాడుక మ్రోసియున్నది గదా ?
విదే - ఆయనకు సంతానమున్నదియా ?
బ్రా - పాలసముద్రములో హాలాహలము పుట్టినట్టతనికిఁ గీర్తికేతుండను కుమారుం డుదయించె వాని నపకీర్తికేతుండనియే చెప్పఁదగినది. ఆ పాపాత్ముండే మమ్మిట్లు బాధింపుచున్నాడు.
తండ్రి యనంతరము సింహాసనమెక్కి తండ్రిచేసిన దానధర్మములన్నియు మానిపించి తండ్రి నాక్షేపించుచు నప్పుణ్యాత్ముఁడు మా కిచ్చిన యగ్రహారములకు బన్నులం గట్టెను. దేవక్షేత్రముల లాగికొనియెను. సత్రములఁ దీసివేసెను. యాచించుట యపరాధమని యర్థులఁ జెఱసాలఁ బెట్టించెను. ఇంతకన్నఁ దానమేమి యున్నది ?
విదే - ఆహా ! అతం డంత పుణ్యాత్ముఁడా ? తరువాత ?
బ్రా - సతీసుత రత్నములు తన చిత్తమునకు వ్యతిరేకముగా దాన ధర్మములు చేసిరని వారి నిష్కారణ మడవికిఁ బంపి చంపించె ఇంతకన్నఁ గ్రూరుం డెందైనం గలడా ? విదేశీ - హరహరా ! యెంత దారుణము? ఎంత దారుణము ? తరువాత ?
బ్రా -- తరువాత వానికిఁ దగిన ప్రాయశ్చిత్త మైనది లెండి. దైవము లేఁడా యేమి?
విదేశీ - ఎట్టెట్టు వక్కాణింపుము.
బ్రా - వినుండు. పిమ్మట నతండు దుష్కులప్రసూత యగు నొకజాతిం బెండ్లి యాడి యందాత్మ సదృశుండగు పుత్రు నొక్కని గనియెను.
విదేశీ - తరువాత ?
బ్రా - ఈ పట్టణరాజు తన పుత్రిక కలభాషిణిని నిత్తునని శుభపత్రికలు వ్రాయింపగాఁ గుమారుండు చిన్నవాఁడైనను రాజ్యరోధంబునంజేసి నమ్మించి సపుత్రకముగా నచ్చటికిఁ దరలివచ్చెను.
విదేశీ - ఆ రాజునకు బురుష సంతానము లేదా యేమి ?
బ్రా - లేదు లేదు. ఆ చిన్నది యొక్కరితియే.
విదే - తరువాత ?
బ్రా - ఆ కలభాషిణి యేమికారణముననో శుభముహూర్తమునకుఁ బూర్వమే యెక్కడికో వెళ్ళిపోయినదఁట.
విదేశీ - కారణమేమి ?
బ్రా – అందులకుఁ గారణమా ? స్త్రీల చర్యలు మీరెరుంగనివా యేమి ? మనవాఁడే యొక బ్రాహ్మణ కుమారుడు దాసీముఖముగా సంబంధము గలుపుకొని లేవనెత్తికొని పోయెను. స్త్రీలకుఁ బరపురుష సంగముకన్న నానందము మఱియొకటి లేదుగదా ?
మఱియొకఁడు - ఛీ ! ఛీ ! మూర్ఖా ! వాడాదోషములేలఁ గట్టికొనియెదవు ? కలభాషిణి మహాపతివ్రత. సావిత్రియుంబోలె మొదట నిశ్చయించిన పతి మృతుం డయ్యెనని విని విచారింపుచుఁ దండ్రి పునర్వివాహముఁ జేయుటకు నిశ్చయింపగాఁ నంగీకరింపక విరక్తితో వెళ్ళినది. ఇదియే నిజము.
ఒకఁడు - చాలు చాలు. నీ వేమి యెరుంగుదువు ? వాని పేరు మదనకేతనుఁడు. వాఁడు నాతోఁ జెప్పియే యరిగెను. వానికొఱకు వాని వారలు విచారింపు చున్నారు చూచిరమ్ము.
విదేశీ - పోనిండు ఎట్లయిన మననేమి. తరువాత నేమిజరిగినది ?
బ్రా -- కుమారి పరారి యయ్యెనని చింతింపుచుండఁ జంద్రగుప్తునియొద్దకుఁ గీర్తికేతుండు దనకైన పయనపురొక్కమిచ్చు కొమ్మని వార్తనంపెను.
విదే -- కుమారుండు బెండ్లికూతురుకన్న జాల చిన్న - స ముతించిన ప్రతులు వర్థం . . . . . బ్రా - చంద్రగుప్తుఁడు మొదట నల్లుని జూచినప్పుడే వరహీనమని సమ్మతింపఁలేదట. పిమ్మట నట్టు జరిగినకదా ? వరహీన కారణము నిరూపించి యందలి నష్టమీయనని చంద్రగుప్తుఁడు ప్రత్యుత్తర మొసంగెను తన్మూలమున నిరువురకు విరోధము జనించినది.
విదే - తరువాత తరువాత ?
బ్రా - తరువాత నా విరోధము ప్రబలుటచేఁ జతురంగబలములతో నిరువురకు గొప్ప యుద్ధము జరిగినది.
విదే - (నవ్వుచు) పెండ్లికూతురు పారిపోయినను వీరి కలహము లడఁగ లేదా ? తుదకెవ్వరు గెల్చిరి ?
బ్రా - చంద్రగుప్తుడు గీర్తికేతుని సంగరరంగమున నోడించి సపుత్రకముగ బంధీగృహంబునం బెట్టించి యతని రాజ్యము లాగికొనియెను.
విదే - సాధు సాధు. సాధుజనుల బాధించిన పాప మూరక పోవునా ? పిమ్మట ?
బ్రా - పిమ్మట నేమి యున్నది. ఆ రాజ్యమునకు జంద్రగుప్తుడే ప్రభు వయ్యెను. కావున మా యగ్రహారములకు విధించిన పన్నులు దీసివేయుమని ప్రార్ధించుటకై వచ్చితి నిదియే వృత్తాంతము.
విదే - అన్నన్నా ! విక్రమార్కుని రాజ్యమున కెన్ని పాట్లు వచ్చినవి. అతని పుణ్యమైనను గాచినది కాదే ? కపుత్రునిచేఁ గులమిట్లే చెడిపోవును. అని మాటలాడికొనిరి.
ఆ సంవాదమంతయు భాస్కరుడు విని విస్మయ చింతాసంతాపములు స్వాంత ముత్తలపెట్ట అయ్యో ? మా తండ్రిని తమ్ముని జెఱబెట్టినఁ జంద్రగుప్తుఁడు నాకు శత్రుఁడుగాక మిత్రుఁడా ? అదియునుంగాక నేనిప్పు డతనియొద్ద కల్లుండనై పోయి బాంధవ్యంబుజూపిన ననుమోదించునా ? కలభాషిణిని మఱియొక ------ దలంచియె యుండును. నాకంతయేల వచ్చినది ? అతండే నా యొద్దకువచ్చి బ్రతిమాలుకొనునట్లు చేయునుచితము. నాకు జంద్రావలోకుండను యశస్కరుండు యుద్దమున దోడ్పదురు. కాకున్నను మదీయ బాహుబలంబున నీ రాజు పీచమడుప లేనా? అని తలంచుచు స్మరణమబినయించుకొని ఆహా నా ప్రియురాలు హేమప్రభ మాట మఱచిపోయితిగదా ! అందు రాక్ష---- లున్నవి. వీరిపాలిటి రక్కసి నాలు. అన్నా : అన్నా శీక . దనతో వండినే పత్తనున్న మలనిజాయితి. నేను గృతఘ్నుం. అచ్చటి న స ... - (1 : At : తెలిసినది. కంకణ ప్రభావమునఁ కదా.
ఇంత మఱపు వచ్చినదేమి ? (చేతులు తడువుకొనుచు) అయ్యో ఆ కంకణ మేమైపోయినది. యెప్పుడు పోయినదో జ్ఞాపకము లేదేమి ? పాపము మా తల్లియైనఁ . గలభాషిణియైనఁ దీసిరేమో వారికి దాని వృత్తాంతముఁ జెప్పియుంటినికాదా. అని తలంచి సత్వరముగా దనగదిలోని కరిగి భార్యను దల్లిని నాచేతి కంకణము దీసిరా యని యడిగిన వారేమియు నెఱుఁగమని యుత్తరముఁ జెప్పిరి.
అప్పు డతం డేమియుం దోచక యున్మ త్తతతో హేమప్రభను గుఱించి పలుతెఱంగులఁ జింతించుచు సత్రము విడిచి సాయంకాలముదనుక నూరెల్ల గ్రుమ్మరుచు నుత్తరదిశకుం బోయిన నందు వాఁడు పండుకొన్న పాడుదేవాలయము గనంబడినది. చీఁకటిగా నున్నను వెరువక యుతండా కోవెల యావరణలోనికింబోయి నలుమూలలు విమర్శించుచున్నంత నా ప్రాంతమందు స్త్రీ పురుషుల సంవాద మిట్లు వినబడినది
స్త్రీ - బ్రాహ్మణుబ్రువుఁడా నా మనోహరుఁ డేడీ ? నన్నీ చీకటిలో నీ పాఁడుగుడికిం దీసికొని వచ్చితి వేమిటికి ?
పురు - కొమ్మా ! నీ మనోహరుండు పరలోకగతుం డయ్యెనని వింటి. ఆ మాట నీకు నుడువజాలక యిక్కడికిఁ దీసికొనివచ్చితిని.
స్త్రీ - ఏమంటివి ? మదీయ హృదయభాస్కరుండు భాస్కరుం డస్తమించెనా ? హా ! మనోహరా ! హా ! సుగుణాకర ! హా ! దయాసాగర ! వెంటనే వత్తునని చెప్పిపోయితివే ? ఇంత యక్కటికము లేకపోవలయునా ? అయ్యో ? నీ యనురాగ మెట్లు మఱచిపోదును. నీవుపోయిన లోకమొద్దియో చెప్పుము. సత్వరమున వచ్చి కలసికొందును అని విచారింపఁ జొచ్చినది.
పురు - నారీమణీ ! ఊరక వగచెదవేల ? వగపున చచ్చినవారు వత్తురా ? ఊరడిల్లు మూరడిల్లుము.
స్త్రీ - ఏమిచూచుకొని యూరడిల్లెదను ? నాకు గతి యెద్ది ? కర్తవ్య మేమి ?
పురు – నేనుండ నీకుఁ గొఱంతయేల ? నన్నుఁ జూచుకొనియే ధైర్యము వహించి యుండుము. నీకుఁ గతి నేనే.
స్త్రీ - నీ వలన నాకుఁ బ్రయోజనమేమి ?
పురు - నీకేమి కావలయునో యదియెల్ల నేను సవరించగలను. నాకంటె నతం డధికుండనుకొంటివా యేమి ?
స్త్రీ - (కనులెఱ్ఱఁజేసి) పాపాత్మా ? ఏమి సవరింతువు ?
పురు - నీకేది యభీష్టమో యదియే.
స్త్రీ - దుఃఖార్తురాల నగుట నింతవఱకు సైరించితిని. ప్రల్లదము లాడకుము. పురు - దుఃఖోపశమనములగు పలుకుల కులికెదవేల ? నన్నుఁ బెండ్లియాడుమని పలికినఁ గోపపడెదవా యేమి ?
స్త్రీ - (పెడమోముతో) సీ! మూర్ఖ! నా చిత్తవృత్తి నెరుంగక మాటాడు చుంటివి ?
పురు - నీవు కామాకులచిత్తవైతివని యెఱిఁగియె యిట్లనుచుంటి తదుప శమన వాక్యములఁ దప్పని యెంచెదవేల ?
స్త్రీ - చాలు చాలు. దాపునకు రాకుము. దూరముగా బొమ్ము.
పురు – (మోహావేశముతో) బోఁటీ! నన్నే మిటికి వే పెదవు? మదనుండు పదనిడిన యడిదమున నా యెడద నడుచుచున్నాఁడు. నీ యధరామృత మిచ్చి నన్ను బ్రతికింపుము (అని కౌఁగిలింపఁ బోవుచున్నాడు.)
స్త్రీ - హా ! దురాత్మా ! నన్నట్లు కపటమునఁ దీసికొని వచ్చి వంచింతువేఁ హా ! వేల్పులారా ! హా ! భాస్కరా ! హా ! సుధాకారా ! హా ! పుణ్యాత్ములారా ! నన్నొక నీచుఁడు బాధింపుచున్న వాఁడు. రక్షింపరే యని పెద్దయెలుంగున మొఱ పెట్టినది.
వారి సంవాద మాలింపుచున్న భాస్కరుఁ డప్పుడు అబలా ! వెఱవకుము. నే నిదిగో వచ్చుచున్న వాఁడనని పలుకుచు వడిగా నచ్చటికిఁ బోయెను. ఆ ధ్వని విని యా పురుషుఁడు పాఱిపోయెను. కనకమణి భూషా విశేషరుచి నిచయంబుల మిరుమిట్లు గొలుపుచు నా చీకటిలో మెఱయుచున్న యా చిన్న దానిని జూచి భాస్కరుండు వెరగు పడుచుఁ బడఁతీ నీ వెవ్వతెవు ? ఈ చీకటిలో నిచ్చట కెట్లు వచ్చితివి? నీ వృత్తాంతము చెప్పుమని యడిగిన నమ్మగువ తత్కంఠ ద్వని గురుతుపట్టి భాస్కరుఁడను సందియముతో నార్యా ! నా వృత్తాంతము చాలా గలదు. సావకాశముగా జెప్పెద. నీవుమదీయ శోకాంధకారము వాయజేయ నరుదెంచిన భాస్కరుఁడవని తలంచెద. ముందుగా నీ వృత్తాంతమించుక చెప్పి శ్రోత్రానందముఁ గావింపుమని సానునయముగాఁ బ్రార్థించుటయు నా రాజపుత్రుం డిట్లనియె.
యువతీ ! నీ మాట వ్యర్థమేలయగును నా పేరు భాస్కరుండే యందురు. నేనొక రాజపుత్రుండ. హేమప్రభయను విద్యాధరిం బరిణయంబై యాయింతి యిచ్చిన కంకణము పాఱవేసికొని తత్సమాగమ శూన్యుండనగుటచే నున్మాదముఁ జెంది యీ చీఁకటిలో నిచ్చటికి వచ్చితిని. నా రత్న కంకణ మెందుఁ బడినదో తెలియదు. అది నీ కిందు దొరకెనేని నా కిమ్ము. అని విచారింపఁ దొడంగెను.
అప్పుడా చిన్నది హా ! మనోహరా ! హా ! పురుషప్రవరా ! యని పలుకుచు నతని కంఠము బిగ్గఁ గౌఁగిలించుకొన్నది. అత్తఱి రాజపుత్రుఁడు కోపించుచు, సీ ! యీఁయాడు జాతికి వివేకమింతయు నుండదుగదా ! కామాసక్తునిగా దలఁచి యా చిన్నది నన్నుఁ గౌఁగిలించుకొన్నది నా చిత్తశుద్ధి యెఱుంగదు. బుద్ధిఁజెప్పవలయునని తలంచుచుఁ 'గొమ్మా ! పరపురుషుల నిట్లంటవచ్చునా ? దురితముగాదా ? నీవు వుత్తమురాలవని తలఁచి వచ్చితిని కాదే ?" యనుటయు నవ్వుచు నా జవ్వని యిట్ల నియె.
ప్రాణేశ్వరా ! నన్నన్యఁగా దలంచుచుంటివా ? కాను కాను. నీ దాసురాలను హేమప్రభను; దైవానుగ్రహ మిట్లు గలిగినదని పలుకఁగా, ఏమేమీ ! నీవు హేమప్రభవే ? ఎట్లు వచ్చితివి ? ఆహా ! యేమి చిత్రము ! నాకీ చీఁకటిలో నిచ్చటికి వచ్చుటకు బుద్ధి పుట్టించినవాఁడు పరమేశ్వరుఁడు కాడా? అయ్యారే ! యెంత చోద్యము అని వెఱఁగుపడుచుఁ గానిమ్ము. నే నిచ్చటికి వచ్చిన విధం బెఱింగింపు మనుటయు నా కలకంటి యిట్లనియె. నాధా ! మీ రరిగిన పిదపఁ బది దినములెట్లో గడిపితిని పిమ్మట క్షణమొక యుగమువలెఁ దోఁచినది. మీ మాటలఁదలచుకొనుచు మీ క్రీడలే చూచుకొనుచు మీ చర్యలే చెప్పుకొనుచు మఱికొన్ని దినములు జరిపితిని. మీరు వత్తునన్న గడవు దాటిన తరువాత విరహాగ్ని పాల్పడితిని. అట్లుండఁగా నొక బ్రాహ్మణ కుమారుండు యీ యుద్యాన వనములో నా చెలిక త్తెలకుఁ గనంబడెను. వానిని జూచి యెవ్వఁడవు ? ఏమిటికి వచ్చితివని వాండ్రడిగిరి. నేను విజయభాస్కరుని మిత్రుఁడను. అతండు తన భార్య హేమప్రభను దీసికొని రమ్మని నన్నుఁ బంపెను. అందులకై వచ్చితినని చెప్పెనట. ఆ మాట విని యా బోటులు సంతోషముతో వచ్చి నాకా తెఱంగెఱింగించిరి. ఇంతింతనరాని సంతోషముతో నేను వానిని రప్పించిభోజన భాజనాది సత్కారము లపూర్వములుగాఁ జేసి సంఖోపవిష్ణుండై యున్న తఱి దాపున నిలువంబడి సఖులచే నీ వృత్తాంతం బడిగితిని.
మీరీ పట్టణములో నున్నారనియు, నన్ను దీసికొనుటకై తన్ను బంపి రనియు, నెన్నియో గురుతులు చెప్పి నా రత్న కంకణముఁ జూపెను. నేను యదార్థ మని నమ్మి రెండుదినములతని నందాపి మిక్కిలి గౌరవింపుచు నేటి సాయంకాలము మీ దర్శన మగునని సంతోషముతోఁ జక్కగా నలంకరించుకొని యా మాయావితోఁ గూడ నా తటాకములో మునిఁగితిని. ఆ క్రూరుచ్చనికిఁ జేరవలయునని నాతో జెప్పుటచే నిట్లు తలంచితిని. వచ్చినది మొదటవాని చర్యలు వేరుగా నున్నవి నా ప్రాణవల్లభుం డేడి ? యెందున్నాఁడు ? చూపుమన నేనూరక తొందర సేయఁగ జీఁకటి పడువఱకు నిదిగో యిదిగో యని జరపి చివరకు స్వర్గస్తుం డయ్యెనని చెప్పుటయే కాక తన్ను బెండ్లి యాడుమని యడిగెను. తరువాయి మాటలుమీరు వింటిరిగద. ఇంతలో దైవము మిమ్ముఁ దెచ్చెను ఇదియే నా వృత్తాంతము. వాఁడెవ్వఁడు ? ఆ కంకణము వానికెట్లు వచ్చినదని యడిగిన నా రాజపుత్రుండు స్మృతి సభినయించుచు నిట్లనియె.
తెలిసినది తెలిసినది. వాఁడీ యూరువాఁడే కలభాషిణినివరించి తద్దాసీ మూలమున నా ప్రోయాలితో శ్రీ శైల ప్రయాణము గావించెను. దారిలోఁ గలభాషిణి నిట్లె బలాత్కారముగా బట్టికొన బోవగానప్పుడు నేనే యడ్డు పడితిని పిమ్మట నీ కథ మా తల్లితోఁ జెప్పుచుండగా వినెను కాఁబోలు. నా కంకణ మెట్లు సంగ్రహించెనో, ఆ మాట నేఁటి వఱకు నాకు జ్ఞాపకము రాలేదు. ఔరా ! దైవ మెట్టి సంఘటనలు గావింపుచుండెనో చూడుము. అని వెరఁగుపడుచు దాను సముద్ర మందిరము విడిచినది మొదలు నాఁటివరకు జరిగిన కధ యంతయు హేమప్రభకుఁ తెలియజేసి కలభాషిణియుఁ దల్లియు నున్న సత్రమందిరమునకుఁ దీసికొనిపోయి వారికిం జూపెను.
కలభాషిణియు హేమప్రభయుఁ జూచుకొని యొండొరుల రూప రేఖా విలాసములకు విస్మయ మొందఁజొచ్చిరి చారుమతి హేమప్రభను గాంచి మిగుల నానందించుచు నెక్కుడుగా గారవించినది నాఁటిరేయి తమ తమ మాటలం జెప్పుకొనుచుఁ బరమానందముతో వారు త్రుటిగా వెళ్ళించిరి. అమ్మరునాడు విజయభాస్కరుండు హేమప్రభతో యువతీ ! ఈ చంద్రగుప్తుండు మా తండ్రిని జెఱఁబెట్టెను. అతనితోఁ బోరు గావింపవలసియున్నది. ఇట్టి సమయమున మీరిందుండరాదు. సముద్ర మందిరమునకు బోయి యుండుడు. సంగరంబున విజయంబు గై కొని మిమ్ము వెండియుం బిలిపించెదనని పలికిన విని యక్కలికి యిట్ల నియె.
నాథా ! మీరతి ప్రయాసపడి బవరముఁ జేయనేల ? మీ దాయ చంద్రగుప్తుని బంధించి మీ పాదమూలమున నశ్రమంబునం జేర్చునట్లు నేను నియమించెద వినుండు. మా మందిరములో గిరిమస్తక యనుసార్ధక నామముగల రక్కిసియున్నది. దానిని జూచిన దేవతలు సైతము వెఱచుచుందురు. అది మేము చెప్పినట్లు చేయు చుండును. దాని యునికి చేతంగదా మా యవ్వకు వేల్పులు దాసులైరి. అద్దానినిప్పుడు రప్పించెదను. అది నీ పంచినట్టు చేసి విజయము గావించెడిని. మనము తలపువ్వు వాడకుండ నిందే యుండవచ్చునని చెప్పి యతం డొడంబడిన పిమ్మట దానిం దీసికొనిరా నా విద్యాధరి సముద్ర మందిరమునకుం బోయెను.
ఆ లోపల భాస్కరుండు "కీర్తికేతుండు తనకుఁ దండ్రి యనియు నతని సపుత్త్రకముగాఁ దీసికొని వచ్చిఁ తప్పుచేసితినని పలుకుచు నా చెంత విడువలయు ననియు నొక రాయబారము నంపెను. చంద్రగుప్తుడా మాట విని యకసక్కెము లాడుచు నిట్టి రాయబారము మఱియొక మారు పంపితివేని యపరాధముగా నెంచి శిక్షింతుము. ఇది మొదటి తప్పుగానెంచి మన్నించితిమని తిరుగ వార్త నంపెను. అంతలో హేమప్రభ గిరిమస్తకం దీసికొని వచ్చి యతని యెదుటం బెట్టెను. దాని కరచరణాద్యవయములు సామాన్యముగా నున్నవి. శిరమొకటియే గిలియంత యున్నది. అది యా శిరముతో వ్రేసినంత పర్వతములైనను నుగ్గయిపోవును. దాని వదనబిలము పెనుగుహవలె నొప్పుచుండును. అట్టి రక్కసిం జూచి భాస్కరుండు విస్మయ సాధ్వసంబులు మనంబున నావిర్భవింప దానికిఁ జేయవలసిన కృత్యమిట్లు బోధించెను.
గిరిమస్తకా ! నీ యాకృతిఁ జూచినంత నెంతవారికిని స్వాంతమున భీతి కలుగక మానదు. నీవు ప్రజల జోలికిం బోక యెదుర్కొనిన వీరభటులనైనఁ జంపక పరిభవించుచుఁ జంద్రగుప్తుని బంధించి నా యొద్దకుఁ దీసికొని రావలయు నిదియే నీ కృత్యమనుటయు నది వల్లె యని పలికి సంవర్త వారి వాహ గర్జాసదృశముగా నట్టహాసముఁ జేయుటయు నా ధ్వని వినిన ప్రజలెల్లరు మూర్చ మునింగి పెద్ద తడవునకుఁ దెప్పిరిల్లిరి. అప్పు డతండయ్యో ? నీ విట్లు లోకపద్రవకరముగ నఱవకుము. వెఱపుగలుగచున్నది. నీ కంఠ ధ్వని ప్రళయ సమయ స్తనితమునకు మూఁడుమడుంగు లెక్కుడుగా నున్నది. కావున నోరు మెదల్పక నీ పనిఁగావించుకొని రమ్ము . పొమ్మని పలికిన నా రక్కసి యెక్కుడు జనంబున నరిగి తన్నుఁ జూచి ప్రజలెల్లఁజెల్లాచెదరై పాఱిపోవఁ జంద్రగుప్తుని కోట నవలీలం దాటి రాజమందిరములో నున్న యా నరేంద్రుంబట్టికొని పిడికిటం బెట్టి యడ్డమువచ్చిన వారి గొట్టుచుఁ బిమ్మట జెటసాలనున్న కీర్తికేతుని నిగళంబులు విడఁగొట్టి నెత్తిపై వేఱొక దెసం బెట్టుకొని విజయభాస్కరుని పాదమూలమునం జేర్చినది.
అప్పుడు భాస్కరుండు చంద్రగుప్తుం జూచి రాజా ! నిన్న నేమేమో బీరములు పలికితివఁట. ఇప్పుడేమనియెదవు ? మా తండ్రిని విడుతువే ? యనుటయు నా రాజు తలవంచుకొని యూరకొనియెను. పిమ్మటఁ గలభాషిణి వచ్చి తండ్రికి నమస్కరింపుచు జనకా ! యీయన మీ యల్లుఁడు సుమా ! తొలుత నన్ను దొంగల వలనఁ గాపాడిన మహాత్ముండితండే. దైవకృపచే నేనీ రాజపుత్రునే భర్తగాఁ బడసితినని యా వృత్తాంత మంతయుం జెప్పిన విని యా నృపతి యపరిమితానందముఁ జెందుచు నతనిం గౌఁగిలించుకొని మహాత్మా ! నిన్నెఱుంగక యవమాన పఱచిన తప్పుఁగావుము. నా కారీతినే సందేశముఁ బంపినచో నింత యేటికి వచ్చును ? ఇంతకు మత్పురాకృత సుకృతము ఫలించినది. నిన్నల్లునిగాఁ బడసితినని పెక్కు తెఱంగుల వినుతించెను. తరువాతఁ గీర్తికేతుండు విజయభాస్కరుని వాని తల్లిం జూచి యెఱింగి మిగుల నానందముఁ జెందుచుఁ దానువారికి గావించిన యవమతికి సిగ్గుజెంది యేమియుం బలుకక నమ్రవదనుండై యున్న, విజయభాస్కరుండు తండ్రికి నమస్కరింపుచు ప్రక్కనున్న తమ్ముని గ్రుచ్చియెత్తి తా నిల్లు విడిచినది మొదలునాఁటి తుదవఱకు జరిగిన కథ యంతయు వారికెఱింగించెను. కీర్తికేతుండును దనకుఁదాన నిందించు కొనుచుఁ బుత్రు చేయి పట్టుకొని తండ్రీ ! నీవే మా తండ్రి కీర్తిం నిలిపితివి. నేను పాపాత్ముండ రాజమ్మున కుర్హుండకాను. ఇఁక నీవే యేలికొనుమని పలుకుచు దనపాదంబులంబడియున్న జారుమతి లేవనెత్తి గౌరవించుచు ననునయ వాక్యములచే నాయింతి సంతాపము వాయ జేసెను. పిమ్మటఁ జంద్రగుప్తుఁడు మిగుల వైభవముతోఁ గలభాషిణికి భాస్కరునికిని వెండియుఁ బాణిగ్రహణ మహోత్సవము జరిగించెను. ఆ యుత్సవమునకుఁ జంద్రావలోకుఁడు యశస్కరుఁడు చతురంగ బలపరివృత్తులైవచ్చి పరిచారుకులవలె భాస్కరున నుపచారములు చేయదొడంగిరి.
ఆ యుత్సవ దినములలో నొకనాఁడు నిగమశర్మతండ్రి రాజపుత్రునొద్దకు వచ్చి మహాత్మా ! వల్లనాఁడు మా యింటబసఁజేసి మా దారిద్ర్యముఁ భోఁగొట్టదలంచి యాచిన్నదాని మాకప్పగించితి. మావాండ్రు నీ మహిమం దెలిసికొ'నలేక నిన్నుఁ దల్లితో నూఁతిలోఁ బడద్రోసిరి. ఆ పాతకమునకు ఫలం భనుభవించుచున్నారు. ఇప్పుడేమైపోయిరో తెలియదు నీవు విక్రమార్కుని మనుమఁడవని తరువాత వింటిమి. మాప్రారబ్దమిట్లున్నది. దిక్కుమాలినవాఁడనై తిరుగుచున్నాఁడనని విచారింపఁగా విని పరితపించచు విజయభాస్కరుండు "బ్రతికియున్నచో మీవాండ్రఁదీసికొనివచ్చి యప్పగింతు. నీవు దుఃఖింపవలద"ని యోదార్చెను. ఆ యుత్సవానంతరము నుజ్జయినికిఁ బోవుటకుఁ గీర్తికేతుఁడు తొందరపెట్టెను. గిరిమస్తక మస్తకముపై కొండపై నెక్కినట్లు చతురంగబలములు సామంతులు బంధువులునెక్కుటయు నది మెల్లగా నడువఁజొచ్చినది. విజయభాస్కరుఁడట్లు దిగ్విజయముఁజేసి సకల బంధురాజ సహితుండై యిరువురి భార్యలతో నుజ్జయినికిఁ బయనము సాగించుచు దారిలో నొక చోట విడిసి గిరిమస్తక నయ్యడవినంతయు బెఱికివేయుమని యాజ్ఞాపించెను. ఆ రక్కసియు ముహూర్తకాలములో నయ్యరణ్యమంతయు నరికి ప్రోగులు పెట్టినది. పిమ్మట స్కంధంబులఁ బరీక్షఁ సేయించి యొక్క చెట్టుమొదట సోపానములు గనంబడుటయు నా రాజపుత్త్రుఁడు కతిపయపరివార సహితుండై యాపాతాళమందిరమున కరిగెను. అందు శక్తిగుడిముంగిట బశువులవలెఁ గట్టబడియున్న నిగమశర్మయుఁ దల్లి యు సోదరులుం గసంబడిరి.
రాజపుత్త్రుండు సామంతరాజులకుఁ దగ్గృహ వృత్తాంతమంతయుం జెప్పి నిగమశర్మను సోదరులతోఁగూడ బంధవిముక్తులంగావించి తండ్రితోఁగూర్పెను. పిమ్మట నా చోరులనెల్లఁ బట్టికొని బుద్ధులంజేసి యందుగల ధనరాశులన్నియు గోనెలనెక్కించి గిరిమస్తకమస్తకముమీదఁబడవేసి వెండియుం బయనము గావించెను. రాజకుమారుఁడు గావించిన కృత్యములన్నియు వారెల్ల నద్భుతముగాఁ జెప్పుకొనుచుండిరి. అట్టి మహా వై భవముతో నుజ్జయినికింబోయి శుభముహూర్తంబున నారాజపుత్త్రుండు పట్టాభిషిక్తుండై యశస్కరుఁడు చంద్రావలోకుఁడు లోనగు రాజులఁ బెద్దకాలము దనయొద్ద నుంచుకొని తగు సత్కారములు గావింపుచు వారి వారి నెలవుల కనిపెను. గిరిమస్తకయను రక్కసి కామరూపిణి కావున దాను దలంచినప్పుడువచ్చి కార్యములు నెరవేర్చి వెళ్ళుచుండవలయునని కోరికొని యప్పుడా సముద్రగృహమున కనిపెను. నాటం గోలె విక్రమార్కునికి బేతాళుండువోలె నారక్కసి విజయభాస్కరుండు తలంచినప్పుడువచ్చి కార్యములుసేసి యరుగుచుండునది. కలభాషిణియు హేమప్రభయుఁ దన కెక్కుడు సంతసము గలుగజేయఁ జారుమతి నీతిబోధ సేయుచుండ విక్రమార్కునికన్న నెక్కుడు ధర్మముగా విజయభాస్కరుండు రాజ్యముఁ బాలింపుచుండెను.
గోపా ! యప్పుడా గిరిమస్తక దంత మొక్కటి రాపిడిచే నూడి యా యెడదలోఁ బడిపోయినది. అదియే నీకిప్పుడు దొరికినది. పూర్వమిది చాల పెద్దదిగా నుండునది. పోయిపోయి మన్నై యిప్పుడింత మాత్రము మిగిలినది. ఇదియే దీని వృంతము. కధా, సాచుర్యములేని వస్తువులచి సతుగపుగదా య పలుకులు మనసు . మనం తి .......... కును.
నలువది రెండవ మజిలీ
సx | 1:8 . . . . . గుడి సమ thics | మణిమvie మరిని 1 గోపా | it. "ii) - 4 | Tara r) :). 1 . మ . . . . రసము ? నంది
- 1.1 kish a vive an ai - 1 న్న.. సుగనల సూకరణములు
• మనుషులు మున్న ముకుం జూచి ఎలుగుపడుచు సం...దు, విను. అప్పటి క న నాసనముసుం , యవ్వBS | దాకినది. ఆయు లి: " నా నిరుషుడు మంచము శిశంబున ఏడుకొని చకసమునం ఊపుచున్నట్లు కసంబడినది. ద్వ లాంతము వక్కాణించి నాకాసండముఁ గలుగు జేయుఁడని ప్రార్థించిన నాసిద్ధుండు ఉద్దయుఁ బ్రీతుండై మన ప్రభావమునఁ చదు దంతముఁ డెల్లముగా నాకలించుకొని తల యూచుచు నిట్లు చెప్పం దొడంగెను.
పుష్ప హాసుని కథ
గోపా ! వినుము గంగాతీరంబునఁ సింధుగారంబను నగరంబున ధనంజయుఁడను రాజు రాజ్యంబు సేయుచుండెను. ధర్మశీలుండగు నానృపాలునకుఁ కాలక్రమంబుస సుందరకుం డను నందనుండను లలితయను తనూజయుం జనించిరి. అమ్మహారాజొకనాఁడు పేరోలగంబున్న సమయంబునఁ బ్రతీహారి వచ్చి నమస్కరింపుచు దేవా ! గుహుండను పల్లెవాఁడు పదియేఁడులు ప్రాయముగల కొడుకు నెత్తుకొని వచ్చి ద్వారంబున దేవదర్శనంబునకై వేచియున్న వాఁడు. ప్రవేశమునకు సెలవే ? యని యడిగిన న న్నరపతి శిరఃకంపమున నంగీకారమును సూచించిన నా ద్వారపాలుం డరిగి వానిం దీసికొని పచ్చెను . గుహుండు రాజు నెదుటఁ జంకనున్న కుమారునిం దింపి నమస్కరించి పుత్రునిచేతఁగూడ దండము పెట్టించెను. లేకులం వెగడు సోగకన్నులును నిండుచంగుతుం బురడించు ముద్దు...గం.. తను చెక్కులు వెడఁజయుడము దీర్ఘ బాసువులు సువర్ణచ్చాయం ను.. | అదన పూపు గ్రమ్ము కొడపతుమ్మెడంవల ముంగతులు మె*ము) పై ... 0:34 ..... : నిలపవచ్చిన కంతుఁడో జయుతుఁడో యసం తన ప స్వప్న . చిన్న 0 గాంచి మాసృపతి ముతాశ్చర్య నటుడు