Jump to content

కాశీమజిలీకథలు/ఏడవ భాగము/140వ మజిలీ

వికీసోర్స్ నుండి

రుల పేరులు వ్రాయబడిన పత్రిక యొకటి కోటగోడకు నంటింపఁబడియున్నది. ఆయా సామంతరాజులకుఁ తెలియజేయుడని చక్రవర్తియాజ్ఞ యిచ్చియున్నాడఁట. (డగుత్తికతో) నాపత్రికలో మనవారి యిద్దరి పేరులు వ్రాయఁబడియున్నవి స్వామీ! మేమనాధలమైపోతిమి మహారాజా! అని చెప్పి దుఃఖించిరి.

ఆవృత్తాంతము విని వారి మరణమునకు వగచుచు అపర సంస్కారములు గావించెను.

అని యెఱింగించి....ఇట్లని చెప్పఁదొడఁగెను.

140 వ మజిలీ.

కుశసుకుమారులకథ

అయ్యో? కాలమా ! నాకెంత చెడ్డదానవైతివి. మదీయ చరణసఖపసారిత కిరీటుం డగు విశోకునిచేత గాందిశీకునిఁగావించి భార్యాపుత్రికలతో నన్నిట్లువనములపాలుగావి౦ తువా? హావిశోకా! బాహు బలవిజిత సకల నృపకుమారుండగు సుకుమారుండును నిర్వ క్రమ పరాక్రమ వివశుండగు కుశుండును బ్రహ్మరాక్షషసునిచేఁ జంపఁ బడుటంబట్టిగదా? నన్నిట్లు రాజ్యభ్రష్టుని గావించి పురినుండి వెడలఁగొట్టితివి. అక్కటా కుసుమసుకు మారవతియగు రతియు అత్యంతమృదుగాత్రియైయొప్పు ధర్మరతియుఁ గాళులు పొక్కులెక్క నూర్పుల నిగుడింపుచు నడుగామడ పడపునశ్రమయడర నడుచుచుండు నిడుము జూచి నాయెడదకడు చిదుములై పోవుచున్నదిగదా: సీ! నావంటి అభాగ్యుఁ డెందును లేఁడు కొడుకు లిరువురుం బోయిరి. అల్లుళ్ళు గంతుగొనిరి. రాజ్యంబు శత్రు నృపా క్రాంతమైనది. నగరసుఖంబు లాకాశకుసుమంబులై నవి. పరిజనులు వదలిరి. ఆశ్రితులు విడిచిరి జరతలకెక్కినది. ఇట్టివేళగూడ నేనెట్టి సుఖం బనుభవించుటకుఁ బోవుచుంటినో తెలియదు. ఇఁక మరణము కన్న నాకొండు శరణములేదు. థర్మ రతి చెప్పినమాట లానాఁడు తలకెక్కినవి కావు. ఇప్పుడు స్మరణ వచ్చుచున్నవి. ప్రేయసీ! నాకిప్పుడు మంచిమాటలం జెప్పి యుల్లము నిలువబెట్టుము పుత్రీ! రతీ! నీయవస్థ జూచుచుండియుఁ బ్రాణములుదాల్చియు౦టి నావంటి కఠినహృదయుండెం దైనంగలఁడా యని దుఖించుచు నొక్క చెట్టు క్రిందఁ జతికిలఁబడిన చంద్రగుప్తుని నూరడింపుచు ధర్మరతి యిట్లనియె.

ప్రాణేశ్వరా! కొడుకులును గోడండ్రును గూతుండ్రును మీరు బుట్టినప్పటి కుండిరా ? నడుమవచ్చిరి. నడుమవోయిరి. వారికొరకు విచారమమిటికి ? మొదట నుండియు నేను వారి నస్థిరులుగానే తలంచుచుంటిని. నాకు మునుపుసంతోషమును లేదు. ఇప్పుడు విచారమునులేదు ఒకరికొకరి సంబంధములేదు. సంబంధము లట్టివే కావున అస్థిరములని యెఱింగినఁ దద్వియోగము దుఃఖమునకుఁ గారణము కానేరదు. మనము తపోవనంబునకుఁ బోవుచుంటిమి. విచారింపవలదు. అదియునుంగాక మన పుణ్యము మంచిదైనచో నిందును మేలు గలుగ వచ్చునని యపదేశించినది.

రతికి మతిపోయినది. తల్లిమాట లేమియు లక్ష్యము సేయదు ఆమె పిచ్చిదని యాయువతి అభిప్రాయము. అట్లు శోక సాగరమీదుచు వారు మువ్వురు అవ్వన మధ్యమునుండి పోవుచుండ నొకదండ సుకుమారుఁడును గుశుఁడును నెదురుపడిరి.

దూరమందుండగనే గురుతుపట్టి చంద్రగుప్తుఁడు అమ్మా రతీ! అదిగో నీమగఁడు వాఁడే నీసోదరుఁడు వీరిద్దరు మృతినొంది పిశాచములై అడవులఁ దిరుగు చున్నారు కాఁబోలు. అయ్యో ? వీరు దుర్మరణము నొందుటచే వీరికిట్టి పిశాచత్వము వచ్చినది. ఇప్పు డేమి చేయఁ దగినది ఏమికావలసిన అది పెట్టఁగలము. మనమీదఁ బడి చంపరు గదాయని బెదురుగదురఁ బలికిన విని రతి నాయనా ? మనయందు వీరికి బ్రీతియుండదా ? వెనుకటిప్రేమ యంతయు మరతురా యేమి మనము వచ్చితి మనియే వీరు చూచుటకు వచ్చిరని తలంచుదును. నాకేమియు భయములేదు. దాపు నకుఁబోయి మాట్లాడెదను జూఁడుడు అని ముందరకు నడవఁబోయిన వారించుచుఁ దండ్రి అమ్మా తొందర పడకుము మృతినొందిన తరువాత ప్రేమలెట్లుండునో తెలియదు. పిశాచములైన వారికి వెనుకటిస్మృతి యుండదు. నిలునిలు నిదానించుమని పలుకుచు గదలక మెల్లగా నొక చెట్టుక్రిందఁ గూర్చుండెను.

ఇంతలో వారిద్దరును నాచెట్టు కిందకువచ్చి కూర్చుండి చంద్రగుప్తుని మీదేయూ రని అడిగిరి. అయ్యో! బాబులారా ! మీకిట్టి యవస్థ పట్టినదా! ప్రేతలైపోయితిరా? మీకేమికావలయునో చెప్పుఁడు అని గద్గదకంఠముతో నడిగినవారు వారిం గురుతు పట్టలేకపోవుటచే నెందులకో యేడ్చుచున్నారని మఱేమియుఁ బ్రశ్నవేయకయందే కూర్చుండిరి.

రతి నిలువలేక హా ప్రాణనాధా నీవు గతాసుడవై పిశాచరూపము ధరించి తివా మీ పాదము లిట్టు ముందరకే యున్నవేమి ? పిశాచములకు మడుమలు వెనుక కుండునని చెప్పుదురే? మీరిచ్చటికేల వచ్చితిరి. అని అడిగిన వారు మీరెవ్వరోముందు జెప్పిన మా వృత్తాంతము వెనుక జెప్పెదమనిన రాజు ఇట్లనియె.

అయ్యా ! భూతములారా ! నేనొక దౌర్భాగ్యుఁడను నాకు వెనకటి జన్మ మున రాజ్యము గలదు. అల్లుఁడును కొడుకు చక్రవర్తికి యుద్ధములో సహాయము వెళ్ళి బహ్మరాక్షసునిచేఁజంపఁబడిరి. సైన్యముతో నావీరులిద్దరు సమయుట దెలిసి కొని మాకు నాజన్మ శత్రువైన విశోకుఁడను రాజు మానగిరిపై దండెత్తి మమ్ముఁ బారదోలి రాజ్యమాక్రమించుకొనియెను తద్భయంబున బురము వెడలి యేకాంతముగా అడవులంబడి పోవుచుంటిమి ! నాపేరు చంద్రగుప్తుఁడు ఇది నా భార్య థర్మరతి. ఇది నా కూఁతురు. మీరూపములు జూడ మావారి పోలికగానున్నవి. మీవృత్తాంత మెఱింగింపుఁడని పలికిన వారిద్దరు నేలంబడి మూర్చిల్లి అంతలోఁ దెప్పరిల్లి హా! మీకెంతకష్టము వచ్చినది. అయ్యో ? మేమే వారము మీరూపములు మారిపోవుటచే మిమ్ము గురుతుపట్టలేక పోయితిమి. మేము జావలేదు. దైవికముగా బ్రతికితిమి ఇంటికి వచ్చుచుంటిమి. దారిలో మీరు గనంబడితిరని నొడివినఁ జంద్రగుప్తుఁడిట్లనియె

మిమ్ము బ్రహ్మరాక్షసుఁడు భక్షించెనని మాకుఁ జక్రవర్తి జాబువ్రాసెనుగదా! మీరెట్లు బ్రతికితిరి ? నాకేమియు నమ్మకములేదు మీకథచెప్పి నమ్మించుఁడని అడిగిన వాండ్రిట్లనిరి.

అమ్మహా ఘోరసంగ్రామములో నిలువరించి కుశుఁడును నేనుతురగారూఢు లమై పోరుచున్న సమయంబున నొక మహాభూతంబభూత సాథ్యసావహంబగుచు వచ్చి సైనికుల గబళములభాతి మ్రింగుచు రధికుల నేరి చదియగొట్టి గదులుగట్టి మెడపై వేసి కొని బిట్టచివరఁదను నెలవునకుఁ దీసికొనిపోయి అందొకచెట్టు కొమ్మకు మా గుడిదగిలించి యితర శవముల రక్తమాంసముల భార్యతో నారగింపుచు నాట్యము సేయుచుండెను. మాకాయుశ్శేష ముండబట్టి వాఁడుమమ్ముజావగొట్టినను మా ప్రాణ ములు దేహమును విడిచినవికావు గిలగిల గొట్టుకొనుచుఁ గొమ్మల వ్రేలాడుచుంటిమి. పుణ్యాత్ములన్నిచోట్లను గలరు. అందొక చిన్నది మాపరితాపము చూచిమెల్లగ వచ్చి మాకాళ్ళకట్లు విప్పి అవ్వలికిఁ బొమ్మని సంజ్ఞ జేసినది. అట్టి మహోపకారము గావించిన అమ్మించుఁబోణి కేదియేని యుపకారము చేయవలయునని తలఁచి నాచేతియుంగరమిచ్చి కోమలీ! మేమొక దేశమున కధికారులము నీకతంబునఁ బ్రతికి తిమి. నీవెవ్వతెవో తెలియదు నీకుల శీలనామంబులు వినుట కవకాశములేదు. నీవెన్నఁ డైన దెరపికి వచ్చినచో మాదేశమునకు రమ్ము. ఈయుంగర మానవాలిమ్ము దగిన మేలు గావింతుమని చెప్పుచు అందు నిలిచినవాఁడు దడవఁగలడని వెరపుతో డొంక డొంకల సందు నడంగి వడిగనీవల బడితిమి మృత్యు ముఖంబు దాచినట్లుగా సంతో షించుచు అది ఏదేశమో తెలియక అరయుచుఁ గొన్నిదినములకు నాప్రాంతమందలి యొక పల్లెజేరతిమి.

ఆ రాక్షసునిచేతి దెబ్బతో యమలోకము జూచివచ్చితిమి రక్తమాంసములు క్షీణించినవి. నడువశక్తి లేకున్నను నాభూతిభీతిచే నెట్లో అడవి దాటితిమి. అక్క డక్కడఁ బల్లెలయందు నివసించి దొరకిన యాహారమువలన దేహమును గాపాడుచు మనదేశమునకు దారి దెలిసికొని మెల్లగా నడుచుచు నీ మార్గమున వచ్చుచుంటిమి. ఇందుమీరు గనంబడితిరి ఇదియే మావృత్తాంతము మమ్ముఁ బ్రేతంగాఁదలంచిమీరు బెద రితిరి. మేమట్టివారమని తలపవలసినదే కాని ఆచిన్నది మాకు దైవములాగున వచ్చి విడిపించినది. అని యావృత్తాంత మంతయు నెఱింగించిన విని యారాజు వారిం గౌఁగ లించుకొని ప్రహర్ష సాగరంబున మునింగెను. రతియు అతిశయమగు విస్మయముతో వారి పాదంబుల కొరగి హృదయపరితాప మెఱింగించెను. ధర్మరతి మందహాసము గావింపుచు నీశ్లోకము చదివినది.


శ్లో. పనె రణె శత్రుజలాగ్ని మథ్యె మహార్ణవే పర్వతమస్తకె వాః
    సుప్తంప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని.

మీపూర్వకృత పుణ్యమే మిమ్ము రక్షించినది. అని పలికి మఱియు నిట్లనియె. మీరు ప్రకృతి నిరతులుగారా? సర్వము స్వశక్తి చేతనే నడుచునని చెప్పుచుండువారె ! ఇప్పుడామాట లేమైనవి. ఇప్పుడైన పెద్దల మాటలయందు విశ్వాసముంచుదురా ? అని పలికిన నామె వెఱ్ఱిదానిగాఁ దలంచి అందులకేమియు నుత్తరమిచ్చిరికారు.

అప్పుడు సుకుమారుఁడు శోకగద్గద కంఠుండై మహారాజా! విశోకుఁడు మిమ్ముఁబురినుండి లేవఁగొట్టెనా? మంత్రులెవ్వరును సహాయము చేయలేదా? అయ్యో ! యీయాఁడువాండ్రతోఁ గూడికొని విపినంబుల నెట్టికష్టముల గావించితిరి. అచ్చట వృత్తాంతము మరల నొడువుఁడు క ర్తవ్యమాలోచింతమని పలికిన విని చంద్రగుప్తుఁడు కన్నీరుగార విశోకుఁడు మనపై నెప్పుడు నీసుబూనియేయున్న వాఁడుగదా? సైన్యా ధిక్యము దలంచియు మీశౌర్యముదలంచియు నివురుగప్పిన నిప్పువళె నణఁగియున్నాడు. సైన్యమంతయుఁదీసికొని మీయిరువురును చక్రవర్తికి సహాయముపోయి మడిసిరనువార్త వినినతోడనే పయ్యెరకు రవులుకొను నగ్నివలె విజృంభించి సేనలతో వచ్చి పట్టణము చుట్టవేసెను. మంత్రులు మీకుఁ బలాయనమే మానరక్షణము అని నాకుఁదెలియజేసిరి. యుద్ధముసేయుటకు సేనలులేవుగదా? విశోకోుఁడు గడు దుర్మార్గుఁడు స్త్రీలఁజెరబట్ట గలఁడు అని బెగడుజెంది కట్టుగుడ్డలతోఁ గోటవిడిచి మారుదారింబారిపోయివచ్చితిమి. నాకోడలు పుట్టినింటకడ నుండుటచే నికాయాపద దప్పినది. మేము మువ్వురము అడవులంబడి యాకిలములుదినుచుఁ దిఱుగుచుంటిమి రాజ్యమయినం బోవుఁగాక మీరు గనంబడితిరి. ఇదియు పదివేలు. ఇందొకచో నాశ్రమము గల్పించుకొని తపంబుగావిం తము. ఇంటికిఁ బోవలదని పలికిన ధర్మరతి పరమానంద భరితహృదయయై యదియే కర్తవ్యమని చెప్పినది. సుకుమారుండు మీసముపైఁ జేయివైచుచు నేమీ అనదులవలె శత్రువులకోడి మనమీవిపినముల వసింపమా! యెంతమాట బలికితిరి. చతురుపాయముల వినియోగించి యెట్లోరాజ్యము సంపాదింపక విడుతుమా పదుఁడు. పదుఁడు. ప్రచ్చన్నముగా నగర మునకరిగి మర్మముల నరసి సమయమెఱిఁగి వైరిం బరిభవింతమని చెప్పిన నామాటఁ గుశుఁడును రతియు బలపరచిరి.

ఆమాటవిని రాజు అయ్యో మనకు బలములులేవు ఆయుధసాధనములు శూన్యము ధనహీనులము శత్రువుదుర్గముల గట్టిపరచికొని యాక్రమించియుండెను. మనలందెలిసె నేని బలవంతమున జంపింపకమానఁడు. అంతయేలవచ్చె. వనంబులఁ దపంబు సేసికొని సుఖంబుగఁగాలము గడుపరాదా! అనిచెస్పిన విని కుశుఁడు తండ్రినాక్షేపించుచు నిట్ట నియె

మాతల్లి వేదాంతము నీకును వచ్చినదికాఁబోలు వనవాసక్లేశము లనుభవించి

తొల్లి పాండుసుతులు రాజ్యము సంపాదించుకొనలేదా? మాకుబలము లేకున్న బంధు వుల నాశ్రయించి సేనలంగూర్చుకొందుము. మిత్రుల నాశ్రయింతుము అని చెప్పి తండ్రి నొప్పించెను. క్రమంబున నరణ్యములుదాటి పర్వతముల నతిక్రమించి యొక నాఁడు వేకువజామునకుఁ దమరాజధానికింబోయి మారువేషముతో వికటదంతుండను పురోహితునియింటికిబోయి తమ్మెఱింగించి కొన్నిదినములు మీయింట వసింతుము తావిమ్మని కోరికొనిరి.

వికటద౦తునికథ

వికటదంతుడను బ్రాహ్మణుఁడు కడుదుర్మార్గుఁడు. కృతఘ్నుఁడు. రాజువలన ననేకదానములంది గొప్పవైభవముతో నొప్పుచుండియుఁ గ్రొత్తరాజు నాశ్రయించి యున్నకతంబున నిట్లనియె.

మిమ్ము నాయింట దాచితినేని విశోకునికిఁ దెలియక మానదు ఎఱింగిన భార్యా పుత్రాదులతో నన్నతఁడు నాశనముచేయకమానఁడు తనకుమాలినధర్మముండదుగదా? మీపుణ్యము. మీరు మాయింట నుండవీలులేదు మఱియొకచోటికిం బొండని యుత్తరము జెప్పెను.

ఆమాట విని కుశుఁడు నీవు మావలన ననేకోపకారములు పొందితివి. ఈ మాత్రము సదుపాయము చేయలేవా? నీకేమియు భయము రానీయము. పదిదినములు చోటిమ్ము నీమేలు మరువమని యెంతబ్రతిమాలినను నాబ్రాహ్మణుఁడు అనుమతింప లేదు. వేగ మవ్వలికిఁ బొండని తొందర పెట్టెను.

వానికృతఘ్నతకు మిక్కిలి యక్కజమందుచు వారు మఱియొక మిత్రునిం టికింబోయి తమ్మెఱింగించి కొన్నిదినములు నిలువనెలనిమ్మని కోరికొనిరి. ఆవైశ్యుఁడు వానియెడఁ గృతజ్ఞతజూపుచు వారిస్థితినిగుఱించి పరితపించుచుఁ దన యింట దావిచ్చి రహస్యము బయలుపడనీయక కాపాడుచుండెను.

చంద్రగుప్తుఁడు తన కత్యంత ప్రియమిత్రుఁడైన వజ్రదత్తుని కొకజాబు వ్రాసి యావైశ్యునిమూలముగ నతనియొద్ద కనిపెను. విశోకునిచే జయింపఁబడి మేము ప్రచ్చ న్నముగా నీనగరమున వసియించియున్నవారము. మాకుఁ గొన్ని సాధనములును సేనలుం బంపితివేని వీనిం బరిమార్చి రాజ్యము మేము గైకొందుము. దీనదశజెంది యున్న మాకీపాటియుపకారము జేయవలయునని యాజాబునందున్నది.

ఈలోపల వికటదంతుఁడు విశోకునొద్ధకుఁ బోయి చంద్రగుప్తుఁడు భార్యా పుత్రులతో వచ్చి ప్రచ్చన్నముగా నీయూరఁ బ్రవేశించి యున్నవాఁడు. నన్నుఁ దావీ యమని యడిగిన నిచ్చితినికాను. ఎంత ప్రచ్చన్నముగా వసియించి యున్నవాఁడు. నీయంతరములు వెదకుచుండును. మీకు హితుండగాన నింతజెప్పితినని యెఱింగించిన నతఁడు జడియుచు, వానిజాడ దెలిసి కొనుటకుఁ బెక్కండ్రరాజపురుషుల గూఢచారుల నియోగించెను.

ఒకగూఢచారుఁ డెట్లో జాడలమీఁద వైశ్యగృహ సంస్థితులగు వారియుదంతము తెలిసికొని విశోకునికిఁ దెలియజేసెను అతండు దండనాధపురస్సరముగాఁ బెక్కండ్ర దూతలనంపి హఠాత్తుగా వారినందరం బట్టుకొని నిగళములు దగిలించి కారాగారంబునఁ బడవేయించెను.

అని యెఱింగించి...

141 వ మజిలీ.

సూర్యవర్మకథ

ఆహా! దైవము ధర్మమునందు వసియింపఁడా? దైవమే వచ్చి మనకుఁ దోడ్పడి మనశత్రువగు సూర్యవర్మం గడతేర్చెను. అని దేవవర్మ యల్లునితోఁ గూతురితో ముచ్చటించుటయు యమున యమ్మహాభూతస్వరూపుండైన పరమేశ్వరుండు చక్ర వర్తిస్థానంబున మఱి యెవ్వరినో నిలిపెనని చెప్పుకొనుచున్నవారు మీకేమైన వర్త మానము దెలిసినదా? వార్తవచ్చినదా అని అడిగిన నది కింవదంతియేకాని నిజమైన వార్త దెలియదని అల్పుఁడు జెప్పెను.

ఆమాటలోనే యొకదూతవచ్చి వాకిట నిలిచి చక్రవర్తిసందేశ పత్రిక లోపలి కనిపెను. అదివిప్పి చదువ నిట్లున్నది.

దేవయజనాగ్రహార కాపురస్థుఁడగు నగ్నివర్మకూఁతురు సురస అల్పునిపై