కాశీమజిలీకథలు/ఏడవ భాగము/128వ మజిలీ
రాధము నిరూపించితివి ఈయపరాధద్వయమునకు నీవు దండ్యురాలవు. వేయు నిష్కము లిచ్చుకొనునట్లు నీకుశిక్ష విధించితిమి. ఈయనిచో రెండేఁడులు కారాగార ములో నుండవలయు నీతివాసి తీసికొనివచ్చి వీనికిచ్చివేయవలయును. అనిమంత్రులతో నాలోచించి యారాజురత్నాంగికి శిక్షవిధించుటయుఁ దచ్ఛాసనానుసారముగా రాజ భటులు పదపదయని గెంటుచు దానివెంట దాని యింటికింబోయి శిక్షాధనముతోఁ గూడ దివాసిని తీసికొనివచ్చి రాజునకు సమర్పించిరి.
ఓహో! ఈరాజు పక్షపాతముజేసి నాకపరాధము విధించెను. తివాసి తాను దీసి కొనుటకై యింత పన్నెను. కానిమ్ము వీరితోనే యయ్యెనా యేమి? పైయధికారులు లేరా? భూమియంతయు నీతఁడొక్కఁడే పాలించుచుండెనా? పైవారియొద్దకుఁ బోయి న్యాయము బొందివచ్చెదనని నిశ్చయించి రత్నాంగి ద్రవ్యనష్టమునకు మిక్కిలి విచా రించచు నుదయార్కునిపై నధికారముగల గజేంద్రవాహనుఁడను రాజునొద్ద కఱిగి నది.
న్యాయవాదుల సహాయముమూలమున రత్నాంగి యుదయార్కుఁడు తనకుఁ గావించిన యక్రమమును గజేంద్రవాహనునకుఁ దెలియఁ జేసినది. అమ్మహారాజు అయ్యభియోగమునను విమర్శించుటకు దనకు సామంతరాజుగానున్న సుమేధునొద్దక్కి, బంపెను.
అని యెఱింగించునప్పటికి ....
128 వ మజిలీ.
సుమేధుని కథ
గజేంద్రవాహనుఁడు సామంతచక్రవర్తి. ఆపృధివీపతి యధికారముక్రింద. నేబదియార్గురు సామంతరాజులుగలరు. సామంతరాజులు చేసిన న్యాయాన్యాయముల విమర్శింప గజేంద్రవాహనునికి నధికారముగలదు. తానుచేసిన శిక్షావిధులు సమంజస ములు కావని తోచినచోఁ ద్రిప్పివేయుచుండును. ఆయభియోగమునెల్ల విమర్శించి యందలి యదార్థము లెఱింగింప మిక్కిలి బుద్ధిమంతుఁడగు సుమేధుఁడనుసామంత రాజును నియమించెను. సుమేధుఁడును గజేంద్రవావానునిచే నీయఁబడిన నూఱు గ్రామ ములు గలవాఁడగుట రాజని పిలువఁబడుచుండును. సుమేధుఁడు తెలివిగలవాఁడు. ధర్మాసక్తుండని యెఱింగియుండుటదే గజేంద్రవాహనుఁ డతఁడుచేసిన తీరుపుల విమ ర్శింపకయే స్థిరపరచుచుండును.
రత్నాంగి తన యభియోగమాసుమేధునొద్దకుఁ బంపబడినదని విని యతనిచేఁ బాలింపఁబడుచున్న విద్యానగరమునకుఁ బోయినది. రత్నాంగి మధ్యయౌవనమందు న్నను వస్త్రధారణ మాల్యాను లేపనాది విశేషములచేఁ దొలిప్రాయమందున్నట్లు కనం బడుచుండును. రత్నాంగి యాటపాటల నంతనై పుణ్యము లేనిదైనను విటవిత్తాపహరణ మందు మంచి నేర్పుగలిగియున్నది. యువకులరంజించు వగలు, టక్కులు దానికే గలవు. విద్యానగరంబున బుష్పవేణిఅను వారకాంతయింటఁ బసజేసి దానితోఁ దన వృత్తాంతమెఱిగించి కన్నీరుగార్చుచు నిట్లనియె.
ఉదయార్కుఁడు వస్తులోభంబున నాకన్యాయముగా శిక్షవిధించెను. ఈయప రాధము మాపుకొననేని నేనాయూరిలోఁ గాపురము జేయఁజాలను. ఈసుమేధుఁ డెట్టి వాఁడో తెలియదు. నీవెప్పుడైనఁ బోయిచూచితివా? భార్యాపుత్రులు గలరా. ఎన్ని యేండ్ల వాఁడు? రసికుఁడగునా? కాడాఁయెఱింగింపుమనిఅడిగిన వినిపుష్పవేణియిట్ల నియె సుమేధుఁడు ధర్మస్వరూఁపుడని చెప్పుదురు. మిక్కిలి చక్కనివాఁడు. విహారార్థ మరుగుచుండఁ బెక్కుసారులు చూచితిని. పరస్త్రీలఁ గన్నెత్తిచూడఁడు. న్యాయా న్యాయ విమర్శనమం దతనికిఁ గలనేరుపు బృహస్పతికి లేదని చెప్పుకొనుచున్నారు. ధర్మసూక్షకము వానికే తెలియునఁట. కావున నీవు విచారింపనవసరము లేదు. న్యాయమే చేయును. మగవగ లతనిమదికిఁ దగులవు ఆశ్రయించిన బ్రయోజనములేదని చెప్పినది. కానిమ్ము మంచిమాట వింటిని ఎల్లుండి నాయపరాధము విమర్శింతురఁట. సాక్షులతో రమ్మని నాకు నాజ్ఞా పత్రికఁ బంపిరి. పరిచారిక నొకసాక్షిని దీసికొని వచ్చితిని. రెండవసాక్షివిగా నీవు రావలెను. నాగౌరవము గురించియు నీతినిగురించియు నీవు జెప్పవలయను. అని బ్రతిమాలిన నది అంగీకరించినది.
నిరూపణదివసంబున రత్నాంగి యిరువుర సాక్షులతో రాజసభకుఁ బోయినది. రాజభటులు రత్నాంగీ ? అని పిలిచినతోడనే సుమేధునియెదుటకుఁ బోయి నమస్క రించినది. సుమేధుఁడు దానిం జూచి రత్నాంగివి నీవేనా? ఉదయార్కుఁడు నీపై నపరాధద్వయము నిరూపించి నీకుశిక్షవిధించెను. నీ వాయపరాధములు చేయలేదని యెట్లు చెప్పుదువు? అని అడిగిన నది యిట్లనియె.
దేవా ! నేను వారకాంతను. నాయందు వారికొక కోపము గలిగియున్నది. ఒకప్పుడు నాకువర్తమానము చేయగాఁ బోలేకపోయితిని. దేవరవా రెఱుగనిధర్మ మేమగలదు. మఱియు నేను కొన్న తివాసిని వారూరక తీసికొనిరి. వస్తులోభంబున నాయందపరాధము నిరూపించి శిక్షించిరి. దేవరవారు ధర్మస్వరూపులు. నాకుల వృత్తి ప్రకారము జేసితిని. అది తప్పని శిక్షవిధించిన మే మేమిచేయఁగలము. అని కన్నీరు గార్చుచుఁ జెప్పిన వారించుచు నతం డిట్లనియె.
నీవు అడిగినమాటకే యుత్తరము చెప్పవలయునుగాని యితర ప్రసంగము జేయఁగూడదు. వినుము. నీకులవృత్తితప్పని యతం డనలేదు. నీవు యోగ్యమైన చిత్తవృత్తిగల యొకస్త్రీని ఇష్టములేనిదే వ్యభిచారమునకు నియమించితివఁట అది యొక తప్పు సుగుణసంపన్నుఁడగు కోయబాలునిపై వస్తువులతోఁగూడఁ దన కూతు రను దీసికొని పోయెనని యసత్యాభియోగము దెచ్చితివఁట అది రెండవతప్పు ఈ యపరాధద్వయమునకై నిన్నుదయార్కుఁడు శిక్షించెను. ఇందులకు నీవేమి చెప్పెద వని అడిగిన నది యిట్లనియె.
దేవా ! భోగమువాండ్రు ఇతరజాతులబాలికల దెచ్చికొని పెంచుకొనుట వాడుకయైయున్నది. అట్లే నేనొక కూతుం బెంచుకొంటిని. దానికా కుర్రవాఁడు తివాసి సుంకువగా నిచ్చి కలసికొని మరునాఁడు మాయిల్లు దాటించెను. అందుల కై యాకోయవానిపై నిజమైన యపరాధమే మోపితిని. తివాసిని వారు తీసుకొను తలంపుతో నీశిక్ష నాకు విధించిరి తండ్రీ అని మొర పెట్టుకొన్నది.
సుమేధుఁడు న్యాయవాదులతో నాయభియోగమును గురించి కొంత చర్చించి తివాసితోఁగూడ నాకోయపిల్ల వాని నిచ్చటికిఁ బంపుమని వ్రాసియుంటిమి పంపిరా? అని అడిగినఁ గ్రిందియుద్యోగి యొకపత్రికను విప్పి చదివి దేవా ! పిల్లవాఁడు రాలేదు. తివాసిపంపిరి వాఁడాతివాసి నమ్మి యానాఁడే కొండలలోనికిఁ బోవుటచేతఁ బిలి పించుట కాలస్యమగుచున్నది. కొంచెము కాలవ్యవధినొసంగిన పంపఁగలను అని యుదయార్కుఁడు వ్రాసియున్నాఁడని వినిపించెను.
అప్పుడు సుమేధుఁడు, చిత్రానన మెందున్నది. తెప్పింపుఁడని అడిగిన నొక పరిచారకుఁ డాచుట్టను తీసికొని యందు విప్పి పరచెను. ఆయల్లిక, యారంగులు నాదట్టన, యామెఱుఁగు, ఆవన్నె, యాతళ్కుచూచి సుమేధుఁడు మిగుల వెరగుపడుచు నల్లిక విమర్శించి వస్తువులు వితర్కించి విప్పివిప్పి గ్రుచ్చిగ్రుచ్చి నిదానించి మఱియు మఱియుఁజూచుచుఁ బెద్దతడవుఁ దాని గుఱించియే వితర్కించుచుండెను.
కన్నులు మూసికొని యొక్కింత సేపు ధ్యానించి రత్నాంగి మొగముజూచి మృగదత్తుఁడీ రత్నాసనము తానల్లెనని నీతోఁ జెప్పెనా? యీపని తనకెవ్వరు జెప్పిరో? యడిగితివా యనిపలికిన అవ్వెలఁది దేవా! అది వాఁడల్లినమాట వాస్తవము పనియెట్లు నేరుచుకొనెనో నాతోఁ జెప్పలేదు. ఉదయార్కునితోఁ జెప్పెనేమో తెలియదని యుత్తర మిచ్చినది.
అప్పుడతండాపత్రికలన్నియు మఱలఁ జదివెను. వానిలోకోయపల్లెలో నల్లిన చాపం జూచి నాబుద్దిబలముచే నాయల్లిక నేరుచుకొంటినని చెప్పినట్లున్నది. అప్పుడు తలయూచుచు నా పుడమిరేఁడు మృగదత్తుని సాధ్యమైనంత వేగముగా నిక్కడికిఁ బంపవలయును వాని వలనఁ గొన్నిసంగతులు తెలిసికొనవలసియున్నదని వ్రాయించి సుమేధుడు గజేంద్రవాహనుని ముద్రికలువైచి యుదయార్కునినొద్దకనిపెను. మఱియుఁ గొన్నిదినములు గడువిచ్చితిమి. మృగదత్తునిని వలన సాక్ష్యము తీసికొన వలసియున్నది. వాని రప్పించుట కుత్తరము లిచ్చితిమి. యప్పటికి నీవు రమ్ము, పొమ్ము. అని యెఱింగించి గడువుచెప్పి సుమేధుఁడు మృగదత్తునిరాక నరయు చుండెను ఉదయార్కుఁడు గజేంద్రవాహనుని శాసనపత్రికంజదివికొని తొందర పడుచు మృగదత్తుడు గనంబడినతోడనే పట్టుకొని తీసికొని రావలయునని చెప్పి పలువురఁ దూతల నలుమూలలకుఁ బంపెను.
అని యెఱింగించి-
129 వ మజిలీ కథ
గదాధరుని కథ
ఆహా ! విద్యయం దెట్టిమహిమయున్నది.
ఉ. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్యయశస్సుభోగకరి విద్యగురుండు విదేశబంధుఁడున్
విద్య విశిష్టదైవతము విద్యకుసాటిధనంబు లేదిలన్
విద్య నృపాలపూజితము విద్య నెరుంగనివాఁడు మర్త్యుడే.
చదివికొనక యెంతమూర్ఖుఁడ నైతిని. నాకా యిల్లా లీమాట చెప్పక పోయినచో నేమియుం దెలియదుగదా? ఇప్పుడు చదివికొనుటచే గ్రంథములు చూచుటకు శక్య మగుచున్నది నాలుగుమాసములలోనే వ్రాయుటయుఁ జదువుటయుఁ దెలిసినది. ఆమె చీకటిలో వ్రాసిన విషయములు తెల్లమైనవి. నాతల్లిదండ్రులు మృతినొందిరఁట అందున్నవారు నాతల్లికిఁ దల్లిదండ్రులఁట ఆమెకు నావృత్తాంతమెట్లు తెలిసినదియో? ఆమె యెందుఁబోయెనో తెలయదు. ఇఁక నేను రామదుర్గనగరమునకుఁ బోవుట కర్జము. బంధువులం గలసికొనియెద అయ్యో? నన్నుఁగోయవాఁడని నిరసింతురేమో వేషము మార్చెదనని మృగదత్తుఁడొకనాఁడు తలంచుచు నార్యవేషముతో బయలుదేరి యొక మార్గంబునంబడి నడుచుచుండెను.
ధ్యానించుచుండుటచేఁ దారిలో బాషాణకంటకాదులు అతని నంతగా బాధించినవి గావు పోవంబోవ మధ్యాహ్నమునకొక గ్రామము జేరెను. అందు భోజనసదుపాయ మెందుగలుగునని యరయుచు సత్రముండుటఁ దెలిసికొని అక్కడికిఁ బోయెను. అందు నాలుగు వర్ణములవారికిని భోజనము పెట్టుచుందురు. కుడిచి కూర్చున్న