కాశీఖండము/ప్రకాశకవిజ్ఞప్తి
Appearance
ప్రకాశక విజ్ఞప్తి
1914-వ సంవత్సరాంతమున శ్రీనాథమహాకవి కృతమైన కాశీఖండమును ముద్రింప దలచి అచ్చుప్రతితో సంప్రతించుకొనుచు ఓరియంటలు లైబ్రరీలోనుండు వ్రాతప్రతులప్రకారము రెండు పర్యాయములు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారిచే పాఠములు సమకూర్పించితిమి. తరువాత ఆంధ్రసాహిత్యపరిషత్తు లోని వ్రాతప్రతిపాఠములను సమకూర్చితిమి. అప్పటిలో మాపండితులును కీర్తిశేషులగు శ్రీ ఉత్పల వేంకటనరసింహాచార్యులుగారు దీనిని పరిష్కరింపగా 1917 సం॥లో ప్రక టించితిమి. నే డీ కాశీఖండప్రతు లత్యావశ్యకముగ కానవచ్చుటచే దీనిని పునర్ముద్రణము గావించినారము. శ్రీనాథకవి తక్కిన గ్రంథములు త్వరలో పునర్ముద్రణము గావించు చున్నాము.
- ఇట్లు
- ప్రకాశకులు