కార్తీక మహా పురాణము/మూడవ రోజు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నిటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే ఉండి. కార్తీకమాసంలో విష్ణు సన్నిధిని ఎవరయితే భగవద్గీతగా పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ పాము కుబుసంలాగా తొలగిపోతాయి. వైకుంఠానికి క్షేత్ర పాలకులౌటారు. ఎవరయితే కార్తీకమాసంలో తులసీదళాలతో గానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలు అనుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే ఏ పూరాణాన్ని అయినా సరే ప్రవచించేవారు సర్వ కర్మ బంధ విముక్తులౌతారు.

కార్తీక వనభోజనాలు

యః కార్తీకే సైట్ వనభోజన మాచరేత్ |

నయాతి వైష్ణవం ధామ సర్వ పాపైః ప్రముచ్యతే||

కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాప విముక్తులై విష్ణు దామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చందాలాదుల సంభాషణలను విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది.

కనుక మహారాజా!కార్తీకమాశ శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరిచెట్టు కింద సాలగ్రామం ఉంచి గాంధ పుష్పాక్షతలతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణులణు ఆహ్వానించి గౌరవించి, వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీకమాసంలో వనభోజనాన్ని ఎవరయితే నిర్వహిస్తారో, వారు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచీ విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు.

ఓ జనక మహారాజా! ఈ కార్తీక మహత్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుదు దుర్యోనీ సంకటం నుండి రక్షించబడ్డాడు. ఆ కథ చెప్తాను, విను.

దేవదత్తోపాఖ్యానం[మార్చు]

పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుదు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైణ కొడుకు పుట్టాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతన్ని పాపవిముక్తుడిని చేయాలని సంకల్పించి నాయనా! రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలం హరి సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఇలా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి అవ్వు అని చెప్పాడు. కానీ ఆ కొడుకు తాను అటువంటి కట్టు కథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని చేయనని చెప్పాడు. అందుకు తండ్రి దేవశర్మ బాధపడుతూ, అడవిలో చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు.

శాపానికి భయపడిణ ఆ కొడుకు తండ్రి కాళ్ళమీద పడి తరుణోపాయం చెప్పమని కోరగా ఆయన బాబూ! నువ్వు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని పూర్తిగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అని శాపవిముక్తి అనుగ్రహించాడు.