కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు.

ప్రథమాంకము.

<poem>

     1. ప్రదేశము ౼౼ ప్రభు మందిరమునందలి చావడి.

(ప్రభువు, వర్తకుఁడు, కారాగృహాధిపతి ఉద్యోగస్ధులు ఇత

            సేవకులు పవేశించినమీఁదట.

ఏజియ౯ ౼౼ నరపాల ! యరుదెమ్ము ననుశిక్షసేయ,

    మరణదండమున మాను నావెతలు.

ప్రభు ౼౼ వర్తక ! మఱియేమపలుక కుమింక

    వార్తులకొఱకుఁగానకట ! మాలంక
    ధర్మశాస్త్రంబుల తగవేదఁగాను,
    గూర్మిఁ, బాక్షికబుద్ధిఁ గూరను నేను.
    వేయేల ? మాదీవిబేరులఁ బట్టి,
    న్యాయమార్గమునందె నడచెడునట్టి
    వారి, మీచట్టాలఁ బరీఁగించుకిన్న
    క్తూరశిక్షలకును గుఱిసేయ మొన్న, ౼౼
    ప్రాణదానమునకు బదులుగానొసఁగఁ
    బాణిని బంగారుపస లేమిఁ బొసఁగఁ ౼౼
    మీరాజు, దతమాలి, మీఱిమావారిఁ,
    గ్రూరుఁడై, చంపినకొఱగామి, నోరి !
    పుట్టినవైరంబు, గట్టిమచ్చరము: 
    నెట్టును మీమీఁద నెప్పుడుఁగరము,
    జాలిపుట్టఁగ నీవు, జడినిప్పులొలుకు
    క్రాలెడుమావేఁడికఱకుఁ జూవులకు.
<poem>
ప్రధమాకము

ఏల ? యన్నను ... మాకు, నెపుడుఁజివ్వకును
జాలఁ గాల్దృవ్వునచ్చటివారలకును,
అప్పగిదిని నైన నధికవైరంబు
నప్పటినుండియు, నొఫ్ఫసంఘంబు
చేరి, యిచ్చోటమావారలచేత,
ఇఁకముందువాణిజ్య మొకరితోనొకరు,
ఒకరిపట్టణ్ముల నొనరఁగానొకరు,
కావింపకుండంగఁ గట్టుదిట్టములు
వావిరిఁబుట్టింపఁబడె ననైకములు.
వినుమంతయేకాదు; వెలయమీదేశ
మునను జన్మించినజనుఁడు మాదేశ
మందు సంతలఁగాని యంగళ్ళఁగాని
కందోయి కొక్కింత కననయ్యెనేని,
మాసీమ మనుజుండు మఱియెవ్వఁడేని,
మీసీమనందైన మెలఁగునయేని,
హాయిగానుండుటకు నదనున, నొక్క
వేయివరాల నర్పించినఁదక్క
జీవంబు లప్పుడ చెచ్చెరఁబోను;
ఆవానిసొమ్మెల్ల నధిపుపాలౌను.
ఇక్కడనీయొద్ద నెసఁగుసొమ్మెల్ల
నెక్కువవెలఁగట్టి యిచ్చిన, నల్ల
నూఱువరాలకె న్యూనంబు కానం
దీఱదు జీవము లైగక, నీయాన

కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు

ఏజి --- జౌ! మేలు ! నాకిదియ ప్రసాదమరయ;
     నీమాటయెల్లను నెఱవేఱునేని,
     యీదినమ్మునఁ గ్రుంకునినునితోఁగూడ
     నాదుకష్టంబులు నాశంబులు నాశంబునొందు.

పభు --- అవునోయివర్తక ! యడిగెద నొకటిఁ,
     జవిబుట్టఁదెల్పుము సంగ్రహంబుగను,
     మీదేశమునుబాసి మెలఁగంగనేల
     మాదేశమునకేల మఱివచ్చితిపుడు ?

ఏజి --- వచియింపరాని నాబహుళదుర్దశల
     వచియింపుమనుకంటెభారంబునొకటిఁ,
     బూనుపఁగారాదు పొనఁగవామీఁద;
     ఐననులోకంబు లన్నియునాదు
     దురవస్ధలెల్ల నాదోషంబువలన
     దొరలక, విధిచేతఁ దొడరినవౌటఁ
     దెలిసికొంటకు, నాదు స్ధీరవిచారంబు
     సెలవిచ్చునంతయుఁ జెప్పెదనిపుడు:
     సరకాజియాలోన జన్మించినాఁడ;
     పరిణయమయినాఁడఁ బడఁతుకనోర్తు;
     ననుఁ జేసికొనకున్న, నన్నులమిన్న
     జననుత మైనట్టిసౌఖ్యంబుఁ గాంచు;
     దైవంబు మాయెడ దయమాలకున్న
     నావలిననుగాంచు వాతిసౌఖ్యంబు;
     ఆనందముననుంటి నామెతోనేను;
     నానాఁటవర్ధిల్లె నాకల్మిమిగుల,

ప్రధమాంకము

పరదేశమున నాదుపనులను జూచు
మరియాదగల బేరిమరణంబుదాఁక,
ఎపిడామిననునకు నేఁజేసినట్టి
యపరిమిత సముద్రయాత్రలవల్ల.
తెరువుననొకమూల దిగఁబెట్టిచన్న
సరకులనైనను జాగ్రత్తసేయు
ఘనుఁడాతఁడెలనాగకౌఁగిలినుండి,
నను సమాకర్షించెఁదనదేశమునకు;
ఆఱుమాసములైన నరుగకమున్న
తీఱనివిరహంపుఁదీవ్రవేదనను,
చిక్కిసగంబయి చక్కెరబోఁడి
గ్రక్కునఁబయనంపుఁగార్యముల్నడపి,
సేమంబుతోవచ్చి, చెచ్చెరఁదాను
మే మున్నసీమను మేరమైఁజేరె:
చిరకాలమచట వసింపకమున్న
తరుణియిక్కఱముద్దుతనయులఁగాంచె;
చిత్రంబు! చూడ నాచిఱుతవారెంత
మాత్రము భేదమన్మాటయులేక
పేరులచేఁదక్క వీఁడువాఁడంచు
నారయరాకుండనలరారిరంత;
అనిమిషననె యాసత్రమందె
మానినిబీదది మఱియోర్తుకనియె,
నాదారిమగవారి నమడబిడ్డలను
భేదమేమియులేక విలసిల్లువారి:
నే, వారిజనకులు నిరుపేదలౌటఁ,

కామెడీ ఆఫ్ ఎఱ్రర్సు

గావలెననుకొని, కవలపిల్లలను
బెంచితి, నాముద్దుబిడ్డలవద్ద
వంచనలేక సేవలు సేయుకొఱకు.
అట్టిబాలురు కల్గనాత్మనుప్పొంగి,
గట్టిగానింటికిఁ, గాంతాలలామ,
ప్రతిదినంబునునన్నుఁబయనంబుచేసి
వెతఁబెట్టజొచ్చెను వెడలుదమంచు;
ఇష్ట్ంబులేకయే యే నియ్యకొంటిఁ,
గష్టపడవలసి, కటకటా ! వేగ.
యానప్రాత్రంబెక్కి, యామడదూర
మానేలవిడిచి మే మరుగకమున్న,
యెప్పుడుగాలిని నెదరింప నోడు
నుప్పుసంద్రము మాదుముప్పును జాటె;
జీవింతుమనునాశ, శీఘ్రంబుగానె,
మావారివిడిపోయె; ముఱియేలయన్న,
భగవంతుఁడిచ్చిన ప్రభను మాయింప
నిగిడినమేఘము ల్నిమిషనిమిషము,
బెదరిచెదరిన మాహృదయంబులందు
నుదయింపఁజేసె సద్యోమృత్యుభీతి.
నామట్టునకు నేను సామోదముననె
యీమృతి కెట్లైన నీకొందుఁగాని
ముందువచ్చెడు నట్టిముప్పును దలఁచి
కుందెడునాలినిఁ, గులసతిఁజూచి
వివరంబు తెలియక వేడుకకొఱకుఁ

ప్రధమాంకము

    
గవకూడి యేడ్చేడు కనలపిలలను,
గాంచిన మనసేల్లఁగర ఁగిపారుటయు
వంచనలెకుండవారికి నాకు
దగిన రక్షణముగలుగు నుపాయంబు
నొగి రొయవల సెను నొనరంగ నాకు,,
యితరమర్గము లప్పుడెవియు లేని
కతమున నీరితిఁగావింపబడయె--
పడనవారెల్ల రు బ్రాణార్తు లగుచు
మడిసెడినొడను మా కొపగించి,
ప్రక్క గటిన చిన్నవడవలమిద
గ్రక్కునబొరి గార్యంబుతప్పి
 గాలివానలు పట్టుకలంబు కొరకు
జాలుట కుంచిన చావుకొయకును
  పెద్దవరుల నాదు పెండ్లముకటె
  నిద్దఱబ్రేమలొనిడి యెుక్కచివర..
చిన్నవరుల నొక్కచివరను నేను
  దినగా గట్టితి దిఱనికుర్మి,,
ఈలల బలురు నేర్పటచెసి
యాలియు నేనును హళిగలటి
 సుతులమిద్ద
గొతుకక యుకొక కొనగటకొంచు
దేలి ప్రవహంబు వాలునటి
లిలబొయితిమి కోరి తునకెసి,
అంతట భాస్క్రుడు డటైతొ తేంచి,

872 కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు

  వింతగాఁజీఁకట్టవిరియంగ ఁజేసె:
  నీరధియంతయు నిశ్చలంబయ్యె,
  దూరంబునందుండి కోరింత దొకటి,
  యొపిడారసు దొకటి, యెదురఁగానించె.
  నపుడునావలురెండు: అవిరాకముంద-
  పలుకంగఁజాల నిపయిని మఱేమి,
  తెలియుండు శేషంబు దీనినిబట్టి.

  ప్రభు-నడుమఁదెంపకుమిట్లు:నుడువు మి మిఁద:
    గడముట్టవృద్ధుండ! కధయెల్ల నాకు:
    చాలనోరిమి నిన్ను క్షమియింపకున్న,
   జాలినై నను బొందఁజాలందు మేము.

ఏజి-దైవం బెయిటమమ్మూఁదాఁజేసెనేని
    నేవానిననవచ్చు నిర్దయుఁడంచు:
    ఎట్టన-నోడలట్లీరేనుక్రోసు
   లెట్టయెదురనుండ గట్టొండుతాఁకి,
   నడిమికి రెండయ్యెవడి నూఁతకోల:
   యెడఁబాసి చెఱియొక్కకడనుబోవలనె,
  ఇట్టియక్రమమైనయెడలఁబాటనందు:
  గుట్టుగానిద్దఱకు, సమంబుగాఁగ,
  సంతోషమింతయు, సంతాపమింతయు
 వంతులగలయఁగూర్చెభాగ్యదేవతయు
 పాపమాయబలయు, భారహీనతను
 త్రోవుడుపడనట్టి దుఃఖంబుతోడఁ,
 బెనుగాలికిని మహావేగంబుగాను

ప్రధమాంకము

గొనిపోవఁబడియెను; కోరింతుసీమ
బెసస్తలామువ్వుర వెలిఁ దాగ్చినట్టు
వాస్తవంబుగ దృష్టిపధమున ఁదోఁచె.
కడకు మేమును నొక్క పడవమీఁదికిని
విడువ కెక్కించుకోఁబడితిమి వేగ,
మమ్మట్లుగాచుట నఱిభాగ్యమంచు
నమ్మి, సహాయంబొనర్చిరి వారు;
దైవికంబుగ వారినావ, కరంబు
నావేళమెల్ల ఁగాఁ బోవక యున్నఁ,
బట్టినచేపలఁ బాఱవైవంగ
నెట్టునువచ్చు; కాఁబట్టి వారవుడ
యింటికై మరలిరి; యిట్లునాసుఖము
మంటఁగలియు టెల్ల వింటిరిగాదె
వాకొనుచుంటకు నాకు దైవంబు,
వేయేల?యీరీతివిశ్వంబులోన
నాయు వెక్కువపోసెనక్కటా!యివపుడు.
ప్రభు-వారికై నీవు విచారించెదిపుడు,
వారికినీకు నీవఱకును నేమి
పొసఁగెనోదయచేసి పూర్ణంబుగాఁగ
వెస వినిపింపవే వివరంబుగాను.
ఏజి-నాపిన్నకొమరుండునాప్రాణసముఁడు
పాపము! ప్రేమతోఁబదునెన్మిదేండ్ల
ప్రయంబునప్పుడు, భ్రాతనువెదక
నోయనమతిపుట్టి, సాయంబుకొఱకు,
తనరీతినే సోదరునిఁగోలుపోయి

కామడీఆఫ్ ఎఱ్ఱర్సు

మనమునఁబేరును మఱవక యున్న
సేవకుఁదనతోడ శీఘ్రంబ పనుపఁ
దావేఁడికొనెనన్ను దయపుట్టునట్టు;
అల్లపుత్రునిఁజూడ నభిలాష మెంతో
యుల్లం

ప్రధమాంకము

మాశాస్త్రములకును, మారాజ్యమునకు,
మాశపదములకు, మాగణ్యతకును
వ్యతిరిక్తమేమియు నయియుండకున్న,
మదిలోననమ్ముము, మఱినీకు మేము
తప్పక యుపకారదానంబు సేయ
నిప్పుడు వలసినదే; యౌనుగాని,
మరణశిక్షనునీకు మాంపలేకున్న,
జేతనయినమేలుఁ జెసెదనీకు
నీతఱిమఱియేది యేమైనఁగాని:
కాఁబట్టి నే నేఁడు గడువిత్తునీకు,
వేఁబోయిసాయంబె వెదకికొంచీవు
ప్రాణంబునెట్లైన రక్షించుకొమ్ము;
త్రాణమై నిచటిమిత్రచయంబు నొకట
వేఁడియైనను, బదుల్వేఁడుయునైనఁ,
గూడఁబెట్టుముసొమ్ము, నేఁడెట్టులైన,
నటులైన బ్రతుకుదు నట్లుగాకున్నఁ,
బటుగతి జీవము ల్పాయంగ వలయు.
కారాగృహాధ్యక్ష! కావలినుంచు
ఘోరముగ నితనిఁగొనిపోయినీవు.
కారా---దేవ! యాలాగునఁగావింతు నేను.
దేవ! యాలగునఁగావింతునేను.
ఏజి---అసహాయుఁడౌచు, నిరాశనుజెంది
వెసఁబోయెను బెహారివెతలిన్మడింప.
(అందఱు నిష్కృమించిరి.)

కామడీ ఆఫ్ ఎఱ్రర్సు

2. ప్రదేశము.---ఒకబహిరంగస్ఠలము
(సరకాజియా ఆంటిఫోలసు, ద్రోమియా, ఒకవర్తకడు ప్రవేశించి

వర్త---ఎపిడామినమువాడనేననెఁబోకు;
నృపతి, యట్లన్నచోఁ, నీసొత్తుఁగొనును.
సరకాజియానుండి చనుదెంచినట్ట్టి
వరవర్తకుఁ డొకండు పట్టుకోఁబడియె,
నీవురంబుననేఁడె, యిటవచ్చెఁగాన;
పాపమాతడు, తనప్రాణముల్గాచి
కొనధనమీలేమిఁ, గోల్పోవుఁజుమ్ము
తనదుజీవంబును, తరణియీప్రొద్దు
చరమాద్రిసరసకు జరగకమున్న,
పురిరాజశాసనమునుబట్టి యకట!
ఇదెకొమ్ము నావద్ద నిచ్చినసొమ్ము,
పదిలంబుగా భద్రపరచికొమ్మావు.

స. ఆం---కొనిపొమ్ము, ద్రోమియో! మనముండుసత్ర
మునకునుదీనిని, మోసంబులేక
కనిపట్టియుండు మక్కడనీవు, నేను
జనుదెంచువరకును జ్రాగ్రత్తగాఁగ.
జాములో భోజనసమయమౌఁ గానఁ
నీమధ్య, నేఁబోయి యీవీటఁగలుగు
వారలనడవళ్ళు వర్తకసరణి,
చారుగృహంబులసౌరు, వీక్షీంచి,
చనుదెంచి నిదురింతు సత్రంబులోన.
వినుము మార్గాయాసమునఁజేసి, నేను

ప్రథమాంకము

బడలియున్నఁడను,బలమెల్ల నుడిగి:
కడుపడిఁగదలు మిక్కడనుండనీవు.
ప.ద్రో-- నీమాటలనుబట్టి,నినుబట్టికొండు
రీమంచివేళ నె యేగుమువేగ
            (నిష్కమించెను.)
స.ఆం--చనవుకతంబున,సందేహపడక
యనయంబు హాస్యోక్తులను వచియించి,
నవ్వించి యలరించు,నామదియందు,
నెవ్వగలేమైన నెలకొన్న యపుడు,
దయచేసి,యిఁకఁగొంతతడవునాతోడఁ
బ్రియమార నటునిటు వీటనుదిరిగి,
సత్రంబునకువచ్చి, సరసభోజనము
మిత్రుఁడ! నాయింట మీరుచేసెదరే?

వర్త--విందునకునునన్ను బిలిచినేఁడొక్క
యిందలివర్తకుఁ డేగకయున్న
నెన్నియొ కార్యంబులిటఁ జెడుఁగాన
నన్ను నీవేళను మన్నింపవలయు.
ఐదుగంటలకును నంగడివీధి
కాదరమునవచ్చి, యామీద నిన్ను,
సాయంతనము నిద్రసమయంబుదాఁకఁ,
బాయకయుండెదఁ, బంపుమునన్ను,

స. ఆం---మంచిది. సెలవిమ్ము! మఱినేనపోయి
యించుకతిరిగెద నిందుమనందు.

వర్త---ఇచ్చవచ్చినయట్టు లెల్లెడఁదిరిగి
ముచ్చటదీరంగఁ బురమునుజూడు

కామడీ ఆఫ్ ఎఱర్సు

నం. ఆం-ఉదకబిందువొకటి , యుదధిలోఁబడిన

         యుదరబిందువు నొండు వెదకిపైఁదీయ
         గడలిలోపలఁజొచ్చి,  కానక తాను
         నడఁగినవడువున,  నన్ననుఁదల్లి
         నరయుదుననివచ్చి యందందతిరిగి,
        దురదృష్టమున నేనె తూలుచున్నాఁడ.

ఎసి- ద్రోమియోవచ్చుచున్నాడు.)

        వడినింతవేగంబ వచ్చితివేమి?

ఎ. ద్రో--వేగమాయిది: చాలజాగయ్యెనిప్డు

        వడవడి ద్రోమియోవచ్చుచున్నాదు
        మాగి దింపఁగఁబడె మాంసపుగూర  :
        ఆవల గడియారమడిచెఁ బండ్రెండు,
       దేవిగారొక్కటితీసిరి నన్ను.
      అన్నంబు చల్ల్లాఱె; నందుచేవార
      లున్నారు కాఁకగా; నన్నమట్లయ్యె
       దేవరవారు మందిరము చేరమిని ;
       దేవర రారైరి తినబుద్ధిలేమి ;
        తినబుద్ధిలేదయ్యె దిట్టంబుగాను
       ఘనులెచ్చటనొ విందుఁగైకొనఁబోలు.
        మీకేమి? మీకొఱ కాఁకలితోడఁ
        జీకాకుపడి మేము చెడుచుంటి మింట.

స. ఆం-ఈపాటిచాలించు మీప్రసంగంబు,

        నేపట్టునను, నమ్మి యేనునీచేత
        నిచ్చినద్రవ్యంబు నిప్పుడు పెట్టి
వచ్చినాఁడవొచెప్పు వాస్తముగను,

ప్రథమాంకము

ఎ.ద్రో-గుఱపుపల్లంబుకుట్టినందునకు, కుఱవాని కొసంగుకొఱ కిచ్చినట్టి నాలుగణాలునా? నావద్దలేవు; ఏల? వానికపుడెయిచ్చి పుచ్చుతిని.

స. ఆ.--ఉల్లాసముగలేను, నుల్ల మందిపుడు; కొల్లగ ముద్దులుగుడువక, యింక సొమ్మేడ నునిచితో సమ్మితిఁజెప్పు ; నమ్మితివేలాగు నరునినొక్కరుని, నూరికిఁ గడుక్రొత్తవారమై యుండ, నారీతిసొమ్మెల్ల నటఁబెట్టిరాఁగ!

ఎ. ద్రో--హాస్యోక్తులా యిప్పుడాడుచిన్నారు? హాస్యమావల భోజనావసరమున, నాడుకోవచ్చును ; అమ్మగారయ్యఁ దోడితేఁ బనిచెప్ప నీడవచ్చితిని. కొనిపోవకున్న, నాపనియౌనునిజము ; ననుగొట్టుఁ, దమదోషమునఁజేసియుమ్మ. కడుపె నాకునుబోలె గడియారమౌచు, కడి కింటికిని, దూత కార్యంబులేక, నినుఁగొట్టవలయును, నిక్కంబుగాఁగ, ననితోఁచుచున్నది యాత్మలోనాకు.

స. ఆం--రా, ద్రోమియో! యిటు రా; హాస్యమునకు, భద్రము: నీకిదవసరంబు గాదు; దాఁ చుకొమ్మివియెల్లఁ, దఱివచ్చుదాఁక! నీచేతికిచ్చిన నెఱధనమేది?

ఎ.ద్రో--నాచేతికా? మీరునాకెందుకొఱకు, తోఁచక ధనమియ్యఁదొలుతనువలసె!

కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు

స. ఆం - రస్కర శ్రేష్ఠుడ దయచేయుమిటకు

మస్కరి చేష్టల మఱి కట్టి పెట్టి,
నీ బాధ్యతను నెల్ల, నేఁ డేమిచేసి,
యోబాలిశుడు ! వచ్చితో చెప్పునాకు.

ఎ. ద్రో- నాదు బాధ్యతయెల్ల నడువీధినుండు

యాదటమిముభోజనార్ధంబు బసకుఁ
గొనిపోవుటయె: ఆవలనట నీకొఱకుఁ
గనిపెట్టియుం దమ్మగారు, సోదరియు.

స. ఆం - స్ధాయిగ దెల్పుము దైవంబునెదుర,

నీయొద్దనుంచిన వేయివరాల
నేసురక్షిత మైనయిక్కను బెట్టి
నాసరసకువచ్చి నాడొవొ నిజము;
లేకున్న, మదినెమ్మి లేనప్పుడిట్లు,
నాకడ మేలముల్నడసించు చున్న
నీతలప్రక్కలు నేజేయుదిపుడు.
చేతిధనం బేమిచేసితొచెపుమ.

ఎ. ద్రో- వెదకినను, వరాలువేయినాయొద్ద

నొదవనేరవు; కాని యున్నవి వేయి
దెబ్బలు, తలమీద దేవర వారు,
కొట్టినవన్నియు గొన్ని తక్కువగ;
గట్టిగా నవియెల్ల గ్రమ్మఱ నేనుఁ
నేలిన వారు కర్పించుదునేనిఁ
దాళంగలే రేమొ తరువాతమీరు.


స,అం-అం! యమ్మదెబ్బలా? యీయెడనీకు నేయమ్మకల దురా? హీన నేవకుడ ఎ. ద్రో -దేవర బార్య , మందిరము జేర నీవు వచ్చెడు దాక నిలయంబులోన నన్న బంచిన యట్టినాతి, మాయమ్మ .

స. ఆం-ఎగతాళీ చేసెది? యీరేతివు. మొగము ముందఱ నన్ను దగు భీతి లేక ఇదిగొ క నొనుము నిన్నేమి చేసెదెనొ. పదరకు నెర దొంగ !పట్టు ముప ట్టు.

ఎ. ద్రో .- అ! యిది యేమియయ్యా ? చాలు జాలు చేయితీ యమును ! పాఱిపో యెద నేను స. ఆం- నాపని కాజేసి , నడిపించెధనము పాపా త్ము డేదొమాయో పాయ మరసి. విను చుందు మెపుడు నీ వీ డెల్ల కాల మును మోసముల కెల్ల నిల్లంచు. అట్టేక న్నులు గప్పు నైంద్ర జాలి కులు పట్టీమతులు మార్చు పటు మంత్రి కులును నంగ వై కల్యంబు లవలీలజేయు పొంగ డు దయ్యా లపో తులు, మఱియు బలుకుల బంది ళ్ళూ వై చి క్రు ంగి ప గల వారు , లోబో నగ ౯బ్రా ము వారు దురితంబు లిట్టి జరిపించు వారు పురినిండ గలరట వుట్ట పుట్టలుగ ఇది యెల్ల వా స్తవమే య య్యె నేని దుది లేని చేటు పా టొ ద వెను నాకు ఇప్పు డే పో యెద , నీ బా ని సీ ని జప్పు న నెమ కంగ , పత్ర ంబు నకును, నొక్క ంబునకు నే డు రెక్క లువచ్చు . నొక్కొ యంచు ను భ య మొదవెడునా కు . <poem>ద్వితీయాంశము

 పురుషులు దరలొన బరమస్వతంత్రు
 లరయంగం గాలంబె యదిపతివారి
 రదిచూచి, పొవుడు  రరుదెంతు  రెండు;
 మదిలొనవగవగ మఱియెర్పు కొమ్ము
 డ్రీ– మొగవారికిస్వతంత్రమొగినుండ నెల
  మగువలకంటె మహెచ్చుగాను?
 లూసి— వారలపనియెల్ల  వాడవాడలన్
 యూరిలొనిప్పుడు  నుండునుగాన.
 నీడ్రి—ఈరీతీవిభునెడ  నేజెసినప్పుడు
 క్రూరముగానన్నుఁ  గొపించుఁజుమ్మ
 లూద—నీ  మనొరయమును  నిలిపివెయుటకుఁ
 గామిని! యాతండు కళ్ళెమంచెఁగు
 ఏడ్రి—చూడఁగనటువంటిసుదతులులేరు.
 గాడిద లొఁబడుఁ గళ్ళెంబునకును
లూసి—బ్రహరములు గల్గు  స్వాతంత్ర్యమునకు
 బహువుగ నిక్కిన పక్షంబునందు
 అవనిని, జలమున,  నాకాశమందు.
 భువనెశ్వరునిచేతఁ బుట్టింపబడిన.