Jump to content

కవిత్వతత్త్వ విచారము/చదువరులకు విజ్ఞాపనము

వికీసోర్స్ నుండి


చదువరులకు విజ్ఞాపనము

క. నాతండ్రి, సుగుణమణిఖని
శ్రోత్రియుఁ డురువైభవండు, సుబ్రహ్మణ్యుం
డాతతగతి నాటిన వి
ద్యాతతులఫలంబు మీకు నభివేదింతున్. 1

మ. గుణమీవ్యాసమునందుఁ గొంచియము ; సాంగోపాంగ పూర్ణంబుగా
పునమైనట్టి కవిత్వవిద్య నెఱుఁగంగా నాకు శక్యంబె ? యో
జనమైమీరు విచారణ లలిపి, సంస్కారంబులంజూపి, భా
షను బెంపింకను మీఱఁదేర్తు రను విశ్వానంబునన్ వ్రాసితిన్. 2

ఉ. ఇంతియ కాని, నిర్ణయము లేర్పడపంగ నెవండఁ? గార్యదే
శాంతరగామినౌట మునుపట్లటు వచ్చిన కొంత యాంధముం
జింత పుటిల్లఁ జేయు పరినీర్ణత నెన్నఁడొచెందెఁ గాన సి
ద్ధాంతములేల నాకు ? దయతప్పక మీరలు చాలుఁజూచినన్. 3

క. పరీపరి విధములఁ బరిపరి
నరు లారాధింప, యవన మనశ్వరమై
పరగంగ నిత్యనవ్య
స్ఫురణమ్మనఁ బేర్చు కవిత సాం పేమందున్. 4

ఉ. కారణజన్ముఁడై, జననికాయము మెచ్చఁగ భారతంబు నా
నా రుచిరార్థయుక్తముగ, నవ్యత శాశ్వతమై తనర్ప, వి
స్పార వచోధురీణత, బ్రశస్తగతిం దెనిఁగించె నెవ్వఁ డా
సూరిని నాంధ్సలోక పరిశుద్ధ తపః పరిపాక రూపునిన్. 5

క. కవితా ప్రపంచ రవిఁ, ది
క్కవరేణ్యుం గొలిచి, యతని కడిఁది యశఃకాం
తివలన వ్యక్తములయిన
విశేషంబులను గొన్నిటిని బ్రకటింతుస్. 6