Jump to content

కళాపూర్ణోదయము (1943)/సంపాదకోక్తి

వికీసోర్స్ నుండి

సంపాదకోక్తి.

మానవ సమితి కేకకాలమున హృదయంగమసుగతిని విజ్ఞా నానందముల నందఁ జేయుటకు సమర్థము లగుపదార్దము లలో సగ్రగణ్యము వరేణ్య సాహిత్య మే.' సందియము లేదు. కాని సుదీర్ఘ కాలమునకుఁగాని యహోదయ పుణ్యసమయము సమకూర నేర నట్లు చిరకాలమునకుఁగాని దివ్యకావ్యోదయము కలుగ నేరదు. సత్కావ్యసుధామాధురి నిత్య సేవ్యము. నిస్తు లము. “సుకవితా యద్యసి రాజ్యేన కిమ్” (సుకవితాసంపదకు రాజ్య వైభవముగూడ సాటి కాజాలదు) అని సాహితీరసాభి జలు దెలిపి యున్నారు.

నిజాసమానమాధుర్యగరిమచే రసికహృదయముల నా నందముగ్గములనుగాఁ జేయునదియే సుకవిత. అట్టిసాహితీ భా రతి నితర భాషాసాహిత్యగ చనలకంటెఁ దేట తేనెనీటుమాటల తో సలరారు తెనుఁగుఁ గై తలయల్లికలు పరిమళమిళిత మృదుల సుమదళ సుందరము లగుప్రసూనవల్లీమతల్లికలతీగునఁ జదువకు లయుల్లముల నానందభరితములనుగాఁ జేయు ననుట నిక్క మగుమాట.

గీర్వాణ వాణీనిర్మితము లగుకావ్యములు భావప్రౌఢము లయ్యుఁ బదలాలిత్య గరిమను దెలుఁగుఁగబ్బములవన్నెకు సరిరా కున్న యవి. ఈ యది సామాన్యజనభావము గోదు. ప్రాకృతసం స్కృతాది భాషా సౌకుమార్యములఁ జక్కఁగ నెఱింగి నర సజ్ఞుల యభిప్రాయము. కాని కేవలాంధ్ర పదకదంబమునకంటె సంస్కృ తమిళితము లగు తెలుఁగునుడులపలుకుబడి శ్రుతిలీన మగుగాన నినదము కైవడి వీనులకు నిుపు జనింపఁ జేయు ననుటకు సంది యము లేదు. సంస్కృతకృతులయందలిఘనతను బాగుగ నెటిఁ గిననన్న యభట్టారకాదిపండితకవితల్లజులు దెలుఁగు నుడికారం పుసొంపులకుఁ బరవశులై తెలుఁగునాఁటిమాటల పూదోటల లో లలితమోహనము లగుత్రిలింగ సాహితీకృతిలతికల మొలక లెత్తించిరి.

మున్ను నన్నయనాఁట నాంధ్రకవితావసుంధరను నాఁ టఁబడినయీ తెలుఁగు లేఁ గౌతతీఁగియ నానాఁటికి విరివిగఁ 'బ రిఁగి మహదామోదసుందరము లగుసాహితీసుమమంజరుల వెల్లివిరియఁ జేసినది. ఈరీతి లలితకవితావ్రతతీ ప్రసూనసౌరభము లతో నలరారు నాంధ్రసాహిత్యో ద్యానవాటికను బింగళి సూర నార్యునికవితావల్లరి మల్లె లీవియచందాన నన్ని విధముల మిన్న గా నెన్నికఁ గాంచియున్నది.

ఈకవితల్లజుఁ డనే కామూల్య కావ్యముల వీరచించియు న్నాడు. కాని నేఁడు మనకందోయికి విం దొసంగుచున్న పసం దుఁగబ్బములు “రాఘవపాండవీయ” "కళాపూగోదయ” "ప్రభావతీ ప్రద్యుమ్న " ములు మాత్రమే. వీనియం దాద్యంతములు పురాణేతివృత్త శోభితములు. నడిమిక బ్బ మన్న నో చిత్త హరము లగుకొంగొత్త కతలవిన్నాణములతో నల రారుచున్నది. పెక్కు పలుకు లేల? తెలుఁగు బాసలో నిదివటి కిట్టి ప్రశస్త వస్తుసుందర మగుపుస్తక ముదయించి యుండ లేదు. నిరుపమానకావ్యనిర్మాణ చాతుడివిలసిత మగునీక ణ పూచోదయ కావ్యము ప్రార్డు లగు భాషాభిమానులచే నేటి కాఱుతడవ లచ్చొత్తింపఁబడినది. కాని యీముద్రిత శ్రతు లన్నియు ఛందోదోషమిళితము లై పాఠ సంశయక లితము లై వ్యాకృతిచ్యుతివలితము లై యుండుటచేఁ బాఠకమహాశయుల క క్లేశముగ రుచ్య మగుకావ్యరసము నాస్వాదిం చుభాగ్యము సందీయఁజలకున్నవి. అందు చేఁ గళాపూర్ణోదయము:కు వే బొక నిర్దుష్టముద్రణ మావశ్యక మైనది.

‘పద్యనవల' యనిఁ దగునీకళాపూర్ణోదయముసకుఁ బరి శుద్ద మగుప్రతిని ముద్రింపింప నెంచి సత్కావృపఠన ప్రకట నాభిలాషులును, సలక్షణాంధ్రభాషాపోషణ మనీషులును, అస్మ Uభువ రేణ్యులు నగు శ్రీ శ్రీ పీఠికాపురమహా రాజ రావు వేం కటకుమాగమహీపతి సూర్యారావుబహద్దరు వారు న న్నాద రము మోజు సంబోధించి “కళాపూర్ణోదయమునందలి సందిగ్ధ పాఠముల ముద్రితాముద్రిత ప్రతు-సాహాయ్యమున సవరించు టయే కాక క్లిష్టము లగుఘట్టములకు లఘు వ్యాఖ్యను వ్రాస్, అకారాక్రమముగఁ గరినపదముల కర్ణముల సమకూర్చిము చ్చునకు సిద్ధము చేయుఁడు. వీనితోఁ గళాపూషోదయమును దిరుగ ముద్రింప నెం చితిమి” అని సెలవిచ్చిరి.

తోడనే నేను శ్రీనారిల్డో నుసార మముద్రితకళా పూరోదయ ప్రతులకై సంచారము సాగించుచుండఁ బర మే శ్వరకృపచేఁ బశ్చిమగోదావరీమండలములోనియేలూరు పుర నివాసులును నాంధ్రభాషాభిమానులును న్యాయవాద కోవి గులు సగు శ్రీమాన్ నల్లానీ చక్రవర్తులకృష్ణమాచార్యులయ్య వార్లంగారి దర్శన భాగ్యము సంప్రాప్త మాయె.

అంత నే వారిలో నా ప్రయత్నమును దెలుప వెంటనే “మా తాతగారు సుపాదించి యుంచినను ముద్రిత గ్రంధముల లోఁగళాపూదం ప్రతి యొక టి గలదు. మీరు మాయూరకి వచ్చిన చో నిచ్చెదను” అని సౌహార్దమ తో సెలవిచ్చిం. అంత నేఁ బేదకుఁ బెన్ని ధి దొరకిన చందాన నుప్పొంగి జారిభవసము న కేఁగితిని. తోడనే శ్రీయాచార్యులవారు కళాపూడోదయము యొక్క వ్రాతప్రతిని గొనివచ్చి నా కందిచ్చి గారహించిరి.

ఆప్రతిలో నిదివజకు ముద్రితము వైనకళాపూడోదయు ములలోఁ జూపట్టనిచక్కనిపాఠభేదము లనేకములు గన్పట్టి సవి. పిమ్మట శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాల సమస నున్న పరవస్తు చిన్నయసూరిగారివ్రాతప్రతులలో నిఁకఁ గొన్ని 'సునిశితము లగుపాఠములు చూషట్టినవి. కాని యింకను సుగ్ర హింపవలసిన పాఠములు మిగిలియుండుట చేఁ బ్రస్తుతము తిరుష తిలో నున్న ప్రభుత్వము వారి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము లో నియముద్రిత ప్రతులను, తంజనగరములోని సరస్వతీమహలు సందలి బ్రాత ప్రతులను బరిశీలి౦ప మజీ కొన్ని యనుకూల పాఠ ములు గానవచ్చినవి. తరువాత శబ్దర త్నాకరసూర్య రాయాంధ్ర సఘటువులలోఁ గొన్ని సరసము లగు పాఠములు గోచరము లైనవి. ఈరీతిగ సంప్రాప్తము లెనపాఠము లెనిమిది వందలకుఁ బైగా నిందుఁ బొందుపటి చితిని. ఇందుచే నీకళాపూర్లోదయం దుబింబము పాఠ సంశయనీహారము క్త మై యనాయాసాస్వాద్య మగు నిజక ధాసుధామాధుర్యము చే విబుధామోదమును సమ కూర్పఁ జాలు నని నముచున్నాఁడను.

ఈకవితీలకునిక వి తాఘనతను గూర్చి వివేక నిధు లగు శ్రీశ్రీపీఠికాపురాధిపతు లిందుఁ బొందుపఱచినపీఠికవలస సూర నార్యునించనా నైభవము చద: వరులకు సౌకల్యము గ విదితము కాగలదు. . జమ గ నాపింగళికులసలిని హేళికవి” ప్రతిభ నెన్న నీ సూర్యరాయనృపాలమౌళియే యన్ని విధముల సర్దులు. మఱియు నీ ప్రభుచంద్రుసకు సూర నార్య కావ్యరచ నలపై గౌర వాదరములు మెండు. కావున నే మొదట వావిళ్ళ వారు “రాఘవ పాండవీయ” “కళాపూర్ణోదయ” ముల ముద్రిం చునాఁడును బిమ్మట పురాణపుడమల్లయ్యశాస్త్రి గారి వ్యా న్యాసముతో “ప్రభావతీ ప్రద్యుమ్న మును” ప్రకటించుపట్టు) సను, పిదప శ్రీమల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు కళా పూడోదయము సచ్చాత్తించుపదనునను నేఁ డీసంపుటమును వెల్లడించు వేళను వలయుధనముల నొసంగుటయే గాక యీ నూతసప్రతికి సూర నార్యకు తాఘనతనుగూర్చిన చక్క నిపీఠిక నుగూడ వ్రాసియున్నారు.

నిజమే. నళినీముకుళములకృత్యము నీటినుండి వెలికి వచ్చుట. ఆ పైని వానిని ఏక సింపఁ జేసి ఘనామోద శ్రీ సుందర ములనుగా నొనర్చుట తామర జేనిపని. ఆతీరుస నే సాహితీకోశ ముల కార్యము కవివరునిక లమునోటినుండి వెలువడుటయే.అనం తర మాకోశములఁ 1 కాశింపఁ జేసి యమం దానం దేందిరామం దిరములనుగాఁ జేయుట వసుంధరారమణుల కార్యము. కావున నట్టిపద్మినీముకుళ దిన నాయకులును, ఇట్టికవితాకోశ మే దినీశు లును లో కానంద సంధాన కార్యపరాయణు లై తేజరిల్లుదురు గావుత,

నే నీ నూతన ప్రతిని సమకూర్చుటలో వావిళ్ల వారియచ్చు కూటమునను సరస్వతీ ముద్రణాలయమునను బ్రకటితము లైన కళాపూష్ణోదయమ"లఁ బ్రమాణముగాఁ దీసికొంటిని. వీస్యం దుఁ జూపట్టని పాఠముల మీఁదఁ బేర్కొ నఁబడిన గ్రంధముల నుండి చేకొంటిని. మఱియుఁ క్లిష్ట ఘట్టములకు మూలసంఖ్యల నిచ్చి “వెన్నెల” అను పేరుతో లఘువ్యాఖ్యను, కఠినపదముల కకారాదిక్రమముగ ను వివరణమును, కొత్తఁగాఁ జేర్చిన పాత ముల నేయే ప్రతులనుండియు నేయేగ్రంధములనుండియుఁ దీసి కొంటినో తెలుపుటకై పద్య సంఖ్యలతో నాయా పాఠములను వానిమాతృకానామములను గ్రంధాంతమునఁ బ్రకటించితిని.

ఈనూత్న పాఠ సంగ్రహోద్యమమున నాకు బాసట మే నపండితమండలికి గౌరవపూర్వకముగా ధన్యనాదముల సంద జేయుచున్నాఁడను. మఱియు లఘున్యాఖ్యను వ్రాయుటలో బ్రహ్మశ్రీ ప్రయాగ వేంకట రామశాస్త్రి గారు చేసిససాహా య్యము ప్రశంసార్హము.

నేను సర్వజ్ఞుఁడను గాకుండుట చే ని దేవియేని ప్రమా దము లుండనోపు. వానిని సహృదయు లగు పాఠకసోదరులు పాటింప కుందురుగాక.

ఓం తత్సత్.

విబుధ విధేయుఁడు, కాశీభట్ట సుబ్బయ్య శాస్త్రీ,