కలుములు నీవి శివా శివా
స్వరూపం
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
కలుములు నీవి శివా శివా కులుకులు నావి శివా శివా గొణిగెదవు నీవేదో-గుసగుసగా ఎదపొదలో చిలుకవలె అదె పలికి-వెలిగెదను ఘనకవిగా గుండియలో కోయిలవై-కూసెదవే నువు కొసరి నిను రెట్టించెడి తెగువే-నవరాగాలయి సాగె హంసవలె ఉల్లమున-అంచులలో వాలెదవు అదిగని నా అల్లరులే-నాట్యములై చెల్లునులే నీ పేరే నాడులలో-ఉరవడి సుడులెత్తు ఆ సుడులే చక్రములై-యోగముగానాకందు నీ సిరులు నీ విభుత-నావని నే కులికెదను నీ కృప కల్గిన నేనే-సచిదానందము కానా