Jump to content

కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/మద్యనిషేధం అవసరమే!

వికీసోర్స్ నుండి


మద్యనిషేధం అవసరమే!

మద్యపానదోషాన్ని గుఱించి కొంత వ్రాస్తాను. యెందుకంటే కొన్నిసంవత్సరాల నుంచి ప్రతీ పత్రికలోనున్నూ దీన్ని మానిపించే ప్రయత్నాలు జరుగుతూ వున్నట్టు తఱుచు కనపడుతూవుంది. యిది చాలా సంతోషించ తగ్గవిషయం. మన పూర్వులు సప్తవ్యసనాలంటూ- "వెలCది జూదంబు పానంబు వేంట” ఇత్యాదిగా పేర్కొన్నవాటిలో పానాన్ని మూండోదాన్నిగా పరిగణించారు. కాని మహమ్మదీయులేమో అన్ని దుర్వ్యసన్గాలనున్నూ యిదే ప్రోత్సహిస్తుందని చెప్పి దీన్ని మొదటి దాన్నిగా పరిగణించి పూర్తిగా నిషేధించి వున్నట్టు ఆమతంలో వేత్త లైనవారివల్ల విని వున్నాను. పైగా యీ కథకూడా వారివల్లనే యెప్పడో విన్నాను-వొకానొక విజ్ఞాని మోక్షం పొందడానికి బయలుదేటినట్టున్నూ తీరా ద్వారాన్ని సమీపించాక అక్కడ నాలుతోవలు వేఱు వేఱుగా వున్నట్టున్నూ, అందులో వకచోట సర్వాంగసుందరి వొకానొక యావనవతి సర్వాభరణ భూషితురాలయి కూర్చుని యితణ్ణి చూచి లేచి అడ్డమయి “యెక్కడికి వెడతా" వని అడిగినట్టున్నూ, యీ ముముక్షువు "నేను మోక్షానికి వెడుతున్నానని చెప్పినట్టున్నూ, దానిమీద ఆ సుందరి-“సరే, వెడుదువుగాని నాతో యీరోజు మాత్రం శృంగారాన్ని అనుభవించితేనే తప్ప యీ మార్గాన్ని వెళ్లడానికి అవకాశంలేదని చెప్పినట్టున్నూ దానితో మనమోక్షగామి- “యీ పని చాలా తప్పకాబcట్టి నేనిందు కంగీకరించేది లేదు, మలో తోవను వెడతా" నని మళ్లీ మలో తోవను పోతూవుండంగా ఆ తోవలో వొకండు వొక మేకపోతునుచూపి– “యీ తోవను వెళ్లేటట్టయితే దీన్ని చంపి యీ మాంసాన్ని భక్షించి మటీ వెళ్లవలసిందని అడ్డగించినట్టున్నూ, దానిమీంద మన ముముక్షువు- “యిది జీవహింసతో చేరివుంది, కాCబట్టి ఈపని నేను చేసేదిలేదు, యింకోతోవను వెడతా"నని మళ్లీ మలో తోవనుపోతూ వుండంగా అక్కడ వొకండు జూదానికి సంబంధించిన పరికరాలన్నీ చూపించి “కొంచెంసేపు నాతో జూదమాడి వెడితే వెళ్లవలసిందే కాని లేనిపక్షాన్ని యీ మార్గాన్ని వెళ్లడానికి వల్లంగా"దని అభ్యంతరం చెప్పేటప్పటికి మన నిషధయోగ్యండు“జూదం ఆడడం చాలా తప్పపని, యీ దుష్కార్యం చేయడానికి నాకు బొత్తిగా యిష్టం లేదని చెప్పి మతో త్రోవను పోవడానికి మళ్లి వెడుతూవుండంగా ఆ త్రోవలో అలంకరించిన కల్లుకుండలతో వక మనిషి కూర్చుని - "అయ్యా వెడుదువుగాని, ఈలా రా కూర్చో చాలా పరిశ్రమపడి యెంతో దూరాన్నుంచి వచ్చావు. కొంచెం యీ మద్యాన్ని దాహం పుచ్చుకుని మటీ వెడుదువుగాని" అంటూ ఆతిథ్యానికి ఆహ్వానించేటప్పటికి మనవిరాగి“అబ్బే! యీ పని పంచమహాపాతకాలలో హిందువులు చేర్చి నిషేధించి వున్నారు, మహమ్మదీయులుకూడా దీన్ని చాలా తప్పపనిగానే చెప్పి దూషించారు. కాcబట్టి యీపని నేను చేసేదిలే" దనేటప్పటికి - "ఆపద్ధతిని యీ మార్గాన్ని వెళ్లడానికి అవకాశం లే" దని ఆ పురుషుడు “ఖజేరావు’ చెప్పడంతొటే మన పరమార్థవేది అనుకున్నాండు గదా! యేమనంటే? “వున్న మార్గాలేమో నాలుగే కనపడతాయి. నాలుగింటిలోనూ నాలుగు ప్రతిబంధకాలూ సిద్ధమయినాయి. వీట్లల్లో సూలసూక్ష్మాలు విచారిస్తే కొంత వీలుగావున్నది కల్లపుచ్చుకోవడమే. యేమంటే? యిందులో హింసాదోషంలేదు. యిది వొకచెట్టునుంచి పుట్టేది. పూర్వులయితే దీన్ని కూడా నిషేధించారుగాని నిషేధించినా దీన్ని అంగీకరించడంలో గుడ్డిలోమెల్లగా వుండడంచేత అట్టేతప్పగాతోంచదు. అంగీకరించని పక్షాన్ని మోక్షానికి వెళ్లడానికి యింకోతోవ కనపడడమే లేదుగదా!" అని చర్చించి యెట్టకేలకు మనస్సు సమాధానపఱచుకొని ఆమద్యాన్ని సేవించడంతోటట్టుగానే అంతకుముందు వుండే విజ్ఞానం యొక్కడికో పటాపంచలై పాతిపోయింది. దానితో వెనకచూచిన మేంకపోతును చంపి మాంసభక్షణ చేయవలసివచ్చింది. దానితో "తాటితో దబ్బనం"గా ఆ సర్వాంగసుందరి అవసరం అయింది. పిమ్మట ఆవిడతో జూదం ఆడడంకూడా అవసరమయింది. తుట్టతుదకి “నీవిమోక్షోహిమోక్ష" అనేవాక్యానికి ప్రథమోదాహరణంగా మన ముముక్షువు పరిణమించాండు. మహమ్మదీయులలో ప్రాజ్ఞలవల్ల విన్న యీ యితిహాసం వల్ల తేలిన సారాంశం - అన్ని దుర్వ్యసనాలకున్నూ మూలకందం సురాపానమే అని స్పష్టమయింది. కాcబట్టి పానం వర్ణించడం మహమ్మదీయులక్కూడా అంగీకారమే. యూరోపియన్లుకూడా దీన్ని వర్ణించేవిషయంలో అడ్డుతగలరు కాని వారిదేశంలోవుండే శీతోష్ణస్థితినిబట్టి మితంగా దీన్ని అంగీకరించవలసిందంటారు. కాని కొలఁదికాలంకిందట అమెరికాలోకూడా యీ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడానికి ఆరంభించారు. కృతకృత్యత్వాన్ని కూడా పొందడమైతే జరిగిందంట గాని మళ్లా ప్రారంభించినట్టు తెలుస్తూవుంది. ఆ ఖండంవారికిన్నీ మనకిన్నీ వుండే భేదం యేమిటంటే? మన ఆర్యులు యెంతో ఆలోచించి కాని యే విధినిన్నీయే నిషేధాన్నిన్నీ అమల్లో పెట్టరు. పెట్టితే అది యుగాలకొలఁది నిల్చిపోవలసిందే కాని మళ్లా వెంటనే నాటొడ్డుకుతూ అంటూ మాఱడం అంటూవుండదు. మనవారు విధించే కార్యాలకున్నూ పుణ్యానికిన్నీ లంకిసా ఆలాగేవుంటుంది. నిషేధానికిన్నీ పాపానికిన్నీ లంకిసా వుండి తీరుతుంది. యీ విషయంలో మహమ్మదీయులుకూడా మన మార్గాన్నే చాలా వఱకు అనుకరిస్తారు, కాని మనం పాపమనుకొనే కార్యాలు చాలా వఱకు వారికి పాపంగా కనపడవు- అందుచేత వాటిని వారు ఆచరిస్తూనే వుంటారనుకోవాలి. యెక్కువ ప్రాజ్ఞతకలవాళ్లతో ప్రసంగిస్తే మాత్రం మతవిషయంలో వుండే విశేషాలు కొన్ని కర్మ కాండబాపతు తప్ప యితరాచారాలలో మనకున్నూ వారికిన్నీ అంతగా భిన్నాభిప్రాయాలు కనపడవు-దయా సత్యశౌచాలు మూcడింటిలోను మూండవదానిలో వారికిన్నీ ఆర్యులకున్నూ చాలా భేదం కనపడుతుంది - ప్రస్తుతం మనక్కావలసింది పానాన్ని గూర్చిన నిషేధం - నేను వుదాహరించిన యితిహాసాన్ని బట్టిచూస్తే మహమ్మదీయులు పానాన్ని పూర్తిగా నిషేధించేవారే - మన ఆర్యులలో యెప్పడో యిక్ష్వాకుల కాలంలో ఈపానం బ్రాహ్మణులు కూడా మంచి నీళ్లతో పాటు ఆమోదించినట్లు కనపడుతుంది. కాని దీనివల్ల వచ్చే నష్టిని స్వానుభవంచేత కనిపెట్టి శుక్రాచార్యులు నిషేధించినట్టున్నూ భారతంవల్ల స్పష్టమవుతూ వుంది

క. "భూసురు లాదిగంగల జను లీసుర సేవించిరేని యిది మొదలుగcబా
పాసక్తిఁ బతితు లగుదురు చేసితి మర్యాద దీనిఁజేకొనుండు బుధుల్

యిందులో వున్న “ఇది మొదలుగ" అనే పదంవల్ల అంతకు ముందు మద్యపానం మహాపాతకాల్లో చేరలే దనుకొందామా? అయితే మహాపాతకాలు నాలుగే కావలసి వుంటుంది. కాCబట్టి ఆపదానికి అంత @ಮಿಭ್ಯಂ యివ్వడానికి వల్లపడదు. యీ కథలన్నీ అర్థవాదాలు. మొత్తం మద్యపానం నిషిద్ధ మనియ్యేవే మనం తెలుసుకోవలసింది. కాని రాజరు లనిపించుకొనే కుటుంబాలల్లో జన్మించినవారుకూడా శృంగారరసానుభవానికి హంగుగా దీన్ని ఆమోదించినట్లు మహాకవుల గ్రంథపోకడలు విశదపఱుస్తూవున్నాయి. కాని సంసారు లనిపించుకొనే సంపన్న గృహస్టులు దీన్ని ఆమోదించినట్టు కనపడదు. సంపన్న గృహస్టుల శృంగార రసానుభవానికిన్ని తదితరుల శృంగారానుభవానికిన్ని రతిరహస్యాదిగ్రంథాలు యెంతో భేదం కనపరచివున్నాయి- "పురుషభావవషట్కృతి వర్ణితం వనితయా నిజయా సు కృతీ కృతీ, మణితహీనరతోత్సవమాచరేత్” వగయిరా శ్లోకాలు చూడందగు- మద్యపానం చేయడం తప్పనే బ్రాహ్మణజాతి మనదేశంలో దానిస్థానంలో మటోవస్తువును సేవిస్తూ వున్నట్టు అంతగా కనపడదు, గాని ఉత్తరదేశంలో భంగుపానం చేయడం సర్వసాధారణంగా కనపడుతుంది. భంగు పుచ్చుకొనేవారికేనా చిలుములో గంజాయి వంచి పొగం బుచ్చుకోవడం చాలా దూష్యంగా ఆదేశంలో కనపడుతుంది. దీని స్థానంలో నల్లమందు కొన్ని దేశాల్లో వాడతారని వినడమైతే వుంది కాని మనదేశంలో నల్లమందు వాడడం మాత్రం యేదో వ్యాధిని పురస్కరించుకొనియ్యేవే కాని వినోదార్థం తీరికూర్చుని వాడడం కనపడదు. సంపన్న గృహస్టులకు తప్ప యితరులకు అందులో ముఖ్యంగా నిమ్నజాతులకు రెండే మందులు ವೊನ್ಸಿಟ್ಟು కనపడతాయి. అందులో వకటి నల్లమందు, రెండోది తెల్లమందు. తెల్లమందంటే? రసకర్పూరం. నిమ్నజాతుల్లో చాలామంది రెండేసియేళ్లకూ మూండేసి యేళ్లకూ యేరోగము లేకుండానే రసకర్పూరం వేసుకుంటూ వుండడం యీ దేశంలో చాలామంది యెఱిఁగిన విషయమే. వాళ్ల ఆయుర్దాయాన్ని కాపాడడం యీ తెల్లమందుమీందే ఆధారపడివుందని ఖండితంగా చెప్పవచ్చును. యిదంటూ లేనిపద్ధతిని యిప్పటికాలంలో వైద్యులు చేసేబిల్లు యిచ్చుకోతగ్గవాళ్లు వాళ్లల్లో వొకళ్లున్నూ వుండరని వేటే చెప్పనక్కఱలేదు. వాళ్లు కూలీ నాలీ చేసి యావజ్జన్మమూ సంపాదించిన సంపాదన వొక్కసారి జ్వరమో గిరమో వచ్చినప్పడు డాక్టరుచేసే బిల్లుకుcగాని విజిటింగుచార్టీకిఁగాని ఎన్నో వంతుకున్నూ రానేరాదు. అదిన్నీ కాక సంపన్న గృహస్టులమీఁదకి వచ్చినంత త్వరగా చొరవచేసి వాళ్లమీందకి ఆయావ్యాధులు తఱుచు రానేరావు - దానిక్కారణం వాళ్లు తప్పనివిధిగా పొట్టకోసంచేసే శరీరపరిశ్రమమే అని అందఱూ యెటింగిందే. యెప్పడేనా అనారోగ్యం కలిగితే తెల్లమందే వాళ్ల కాధారం. కొన్నింటికో? నల్లమందు. యీ రెంటితోటిన్నీ నూటికి తొంభై మంది జీవిస్తూవున్నారు. యీనల్లమందు కొన్ని సామాన్య క్షత్రియకుటుంబాలవారు తగిన హేతువు లేకుండానే వుగ్గుబాలతోపాటు పిల్లలకుకూడా తమతోపాటు వాడుకచేయడం క్వాచితంగా కనపడుతుంది. యీ కారణంచేతనే “భోజనం చేశారా?" అని అడగడానికి బదులు వారిలో - “నల్లమందు వేసుకొన్నారా?" అని అడగడం ఆచారమయింది - బ్రాహ్మణులలో దేవతార్చన అయిందా - శివపూజ అయిందా?” అని భోజనానికే పర్యాయపదంగా వాడడం యిదివఱలో వుండేది. క్రమంగా కాలదెర్భాగ్యంవల్ల ఆ ప్రశ్నలకు అవకాశం చాలా వఱకు నశించింది. యిది విషయాంతరం. మొత్తం, యే చైనా దేశంలోనో తీరి కూర్చుని నల్లమందు బెత్తికలకు బెత్తికలే తెలకపిండి అచ్చులమాదిరిగా తినడాన్ని గూర్చి నేనుచెప్పలేనుగాని మనదేశంలో మాత్రం దీనిని వాడేవారు వ్యాధిగ్రస్తులే అని ధ్రువంగా చెప్పవచ్చును - యీ మద్యపాన నిషేధంతోపాటు నల్లమందునుకూడా నిషేధించేయొడల యెందటో ముసలివాళ్లు మిక్కిలి చిక్కులో పడతారు - యీ నల్లమందు ఆనాcటికానాండు ధర పెరిగిపోతూ వుండడంచేత రోగగ్రస్తులుగా వుండే బీదలు ఇప్పుడే మిక్కిలి చిక్కుపడుతూవున్నారు - దీన్ని యిజారాపాడేవాళ్లు వొక్కొక్కచోట మటీ ధర హెచ్చించి బాధిస్తూవున్నారు. యీనిషేధం నల్లమందు క్కూడా వస్తే వైద్యులకుతప్ప యితరులకు యిది దొరకడం కష్టసాధ్యమవుతుంది కాంబోలునని కొంచెం నల్లమందుతో అవసరమున్న నేను భయపడుతూ వున్నాను. పత్రికల్లో దీన్ని కూడా నిషేధించినట్టే కనపడింది. గాంధీగారు ద్వంద్వాతీతులు. యెంతటి ద్వంద్వాతీతుండున్నూ కాకపోతే మోంకాలు దిగని అంగోస్త్రంతోటిన్నీ అలాటిదే పైమీందితుండుగుడ్డతోటిన్నీ లండనులో అందులోనున్నూ వార్ధక్యంలో కాలక్షేపం చేయడమంటే మజాకాకాదు. ఆయన మన పురాణాల్లో పుట్టలు వగైరాలలోవుండి తపస్సుచేసిన ఏబుషులకూ తీసిపోయే వ్యక్తికాడు. ఆయన సంకల్పం లోకకల్యాణదాయకం అని చెప్పక తప్పదు. కాని కొంతకాలందాంకానేనా నల్లమందుమట్టుకు దొరకడం బాలవృద్ధాతురులకు అవసరం. సరే తాలూకా ఆఫీసులలో కాంబోలును దొరుకుతుందని వ్రాశారు. కొందఱయితే అక్కడికివెళ్లి తెచ్చుకోంగలరు. గాని కొందఱందుకున్నూ సామర్థ్యంలేనివాళ్లున్నారు. ఆ ఆఫీసుకు పూCట బత్యాలు కట్టుకుని వెళ్లలేరు. సరికాదా. ఏకంగా తులమూ అఱతులమూ కొనుక్కోవడానికి త్రాణలేనివాళ్లే చాలామంది. కాంగ్రెస్సు మంత్రులు ఆలాటిదీనులను ప్రత్యేకించి వక్కకంటితో చూడాలి. వాళ్లు మత్తుకోసం నల్లమందు అభ్యసించిన తెగలోవాళ్లు కారని యేప్రమాణంపడితే ఆ ప్రమాణంచేసిచెప్పవచ్చును. ఆలాటివాళ్లకు వుపకారంనిమిత్తం యీ మీంద నల్లమందు వెల చాలాసులభం అయేటట్టుకూడా చేస్తే యెందటో దీనులు ఆశీర్వదిస్తారు. అయితే కొందఱు “నల్లమందులాగే బ్రాందిన్నీ వ్యాధినివారకమే, అందుకోసమే మేమున్నూ అభ్యసించామనే వారున్నూవుంటారు. కాని అది నిజమా? కాదా? అని విచారణచేస్తే తేలకపోదు. మద్యపానం శుక్రునికాలన్నుంచిన్నీ నిషేధింపC బడుతూనేవుంది కాని నశించినట్టు మాత్రం లేదు. పంుంగా వృద్ధికూడా పొందిందేమో? జారత్వచోరత్వాదులకన్న దీనికి యొక్కువ గౌరవం మనవారు యివ్వరు. యూరపుఖండ వాసులు మితిమీటితే పానాన్ని మనతోపాటు చూస్తారే కాని మితిలోవుంటే దాని జోలికి పోరు. పూర్వకాలంలో నల్లమందుజోలికి ప్రభుత్వం వెళ్లినట్లాధారాలు కనపడవు. దాన్ని వ్యాధిగ్రస్తులు తప్ప యితరులు వాడినట్టు గ్రంథ దృష్టాంతాలున్నూ కనపడవు. వ్యాధిగ్రస్తుల విషయంలో మత్తు పదార్థాలకేకాదు; యే పదార్థాలకున్నూ విధినిషేధాలున్నట్టు యేమతంలోనూ కనపడదు. యింకా కొందఱు నిష్టాపరులు మన ఆర్యులలోనే వుల్లి వగయిరా నిషిద్ధవస్తువుల భక్షణానికి ప్రాణాపాయ సమయంలోకూడా సందేహించి మానుకున్నవారు కనపడతారు. యీ మత్తుపదార్థాలనుండి తప్పించడమనేమిషతో ప్రభుత్వంవారు ద్రవ్యార్జనచేసినట్టు పూర్వం కనపడదు. అందుకు ఆరంభించింది మహమ్మదీయ ప్రభుత్వం అని తోస్తుంది, “అబ్కారీ" అనేమాట వల్ల యిది తెలుస్తూవుంది. కాని ఆ ప్రభుత్వం నల్లమందు, గంజాయి వగయిరాలకు విశేషించి పన్ను విధించినట్టు కనపడదు. నా చిన్నతనంలోకూడా వీట్లకు పన్ను లేనట్టే యిప్పడుకూడా మన్యంలో వుండేవాళ్లకు కాంబోలును యీ పన్నులేదని చెప్పకుంటారు. పోనీ యీ పదార్థాలు మత్తుకలిగిస్తాయనే కారణంచేత పన్నువేశారను కుంటే? ఉప్ప చేసుకున్న పాపమేమిటి? బాగా ఆలోచించిచూస్తే ప్రతిమనిషిన్నీ అంతో యింతో గవర్నమెంటుకు సహాయపడడం ఆవశ్యకం కనక ఈ ఉప్పపన్ను ద్వారా అట్టి సహాయాన్ని గవర్నమెంటు పొందుతూ వుందనుకోవాలి. పూర్వపురాజులకు ఋషులు కూడా పన్ను చెల్లించినట్టు “తాన్యుంఛ షష్ణాంకిత సైకతాని” అనే కాళిదాసుగారి శ్లోకపాదంవల్ల అవగతమవుతుంది. ఔషధంగా యీ దేశంలో “బాలవృద్ధాతురులు" వాడుకొనే నల్లమందు నానాంటికి మటీ హెచ్చుధరలో వుండడమనేది సాధుబాధగా పరిగణించవలసిందే కనక మన కాంగ్రెస్సు మంత్రులవల్ల యేమేనా వుపకారం జరిగితే బాగుండును - యేమందుకూ లొంగనికొన్ని బండవ్యాధులు దీనికి లొంగి కాలక్షేపం జరగడానికి పెద్దపెద్ద డాక్టర్లే వప్పుకుంటారు. యెవరిదాకానో అక్కఱలేదు పెద్దడాక్టర్లలో వొక్కరుగా పరిగణించతగ్గ వారున్నూ కాంగ్రెస్సు ప్రముఖులలో అగ్రగణ్యులలో వొకరున్నూ అయిన మన భోగరాజుగారే నల్లమందు మాహాత్మ్యానికి అంగీకరిస్తారు- యే చీనావాశ్లో దీనిని తీరికూర్చుని అభ్యసిస్తే అభ్యసిస్తురుగాక. మనదేశస్టులుమాత్రం అలా అభ్యసించి వుండరనియ్యేవే నానమ్మకం. అందుచేతే యింతగా వ్రాయడం. అయితే మద్యం దొరకని పద్ధతిని ఆబాపతు జనమంతా యీ మీఁద దీనికి యెగcబడతారేమో? అనేదిన్నీ విచారణీయమే యెగందీస్తే బ్రహ్మహత్య దిగం దీస్తే గోహత్యగా, కనపడుతూవుంది. అయినా మొట్టమొదట యీ దీనుల నిమిత్తం దీన్ని సులభసాధ్యంచేసి ಹಿಮ್ಮಿಟ చిక్కువస్తే మార్గాంతరం తొక్కడం యుక్తమేమో? రోగులకుఁగాని యిది యివ్వబడ దనేయెడల సర్టిఫికెట్టు తెచ్చుకోవలసివస్తుంది. అది ద్రవ్యైకసాధ్యం. దానితో ధనవంతులందఱూ సర్టిఫికెట్టు ద్వారా రోగులే అయి తంజావూరు సోమరి సత్రాన్ని జ్ఞప్తికి తెస్తారు. వుప్పంటే గంజిలేకా, గంజుంటే వుప్పలేక తిప్పలు పడే బీదలు సర్టిఫికెట్టుకు ప్రెయివేటుగా యిచ్చుకునేఫీజు తెచ్చుకోలేని రోగుల జాబితాలో చేర్చంబడతారు. పిడిరాయిలాగ తిరుగుతూవున్న వాళ్లెందరో డాక్టరు సర్టిఫికెట్టు సంపాదించుకొన్న పద్ధతిని వుద్యోగం చేయకుండా సెలవులోవుండి జీతం పుచ్చుకోవడమున్నూ నిజంగా రోగులైనవాళ్లు దాన్ని సంపాదించుకోలేక పనిచేస్తూనే వుండడమున్నూ సర్వానుభూతమే కాCబట్టి నల్లమందు యెవరికివ్వాలో యెవరికి వడ్లో తెలుసుకోవడం కష్టం, పెద్దచిక్కేవచ్చింది. దీనిలోవున్న తత్త్వం ಬುದ್ದಿ మదర్రేసరులు మంత్రులకు తెలియకపోదు. కాCబట్టి విస్తరించేదిలేదు. కొనసాగుతోందో లేదో చెప్పఁజాలం గాని గాంధీమహాత్ముండు పూనిన యీ వుద్యమంవల్ల జగత్తుకు కలిగే వుపకారం యింతా అంతా కాదు. స్త్రీలు కూడా తాగుమోతులు లేకపోలేదుగాని స్త్రీలలోకన్న పురుషులలో యూతెగ విస్తారంగావున్నట్టు తెలుస్తుంది. అందులో కూలిజనంలో యిది మిక్కిలి యొక్కువ. ఆ కూలి జనంలోనున్నూ మన ప్రాంతాల్లో వుప్పర్లు సంపాదించుకునే కూలి కొంచెం అదనంగానే వుంటుంది కాని అది సర్వమూ దీనికిందే వినియోగం. పంచమహాపాతకాలలో చేరిన యీ తాగుడు పూర్వకాలంలో అగ్రజాతుల్లో లేనేలేదని చెప్పడానికి సందేహం లేదుగాని యిటీవల పడమటిగాలి సోకిన తరవాత దీనికి అగ్రజాతులేమి జమీందార్లేమి పూర్తిగా అలవాటు పడ్డారు. యెంతో యోగ్యులైన జమీందార్లు, ప్లీడర్లు - వకరేమిటి? ఐశ్వర్యం వున్నవాళ్లు చాలామంది దీనివల్ల మానప్రాణాలు గోలుపోవడం నేను కళ్లారా చూచివున్నాను. వారివారి పేళ్లు యిందుదాహరించడం న్యాయంకాదు. కాcబట్టి వుదాహరించలేదు, పాణిగృహీతలోవకపద్యం దీన్ని గూర్చి వ్రాయంబడింది. దాని వుదాహరిస్తాను. ---

శా. "అన్నా వైనంట! బ్రాందియంట! విసికీ యం టక్కటా! నీకునీ
విన్నాణం బెటు లబ్బెరా? ద్విజకులావిర్భూతియున్ బానమున్
మున్నెచ్చో వినలేదు నీదుతలనే మున్జెన్ మహాపాప; ము
చ్ఛిన్నం బయ్యెఁ గులమ్మ నీకతన సీ! సీ! గోత్రవిధ్వంసకా!"

యజ్ఞయాగాదులు చేసిన సత్కులమందు పుట్టి పైపద్యానికి ప్రథమ లక్ష్యంగామాటిన పాశ్చాత్యవాసనావాసితు లెందలో మనదేశంలో వున్నారు. యీ మద్యపాననిషేధం గనక తుదనెగ్గితే అట్టివారంతా మంచి స్థితికి వస్తారనడానికి సందేహం లేదు.

మద్యపానం నశించడానిక్కూడా యుక్తాయుక్తజ్ఞానమే. అట్టి యుక్తాయుక్తజ్ఞానం ప్రతిమానవవ్యక్తికిన్నీ కలిగించాలంటే అది కష్టసాధ్యమే కాదు. కేవలమూ అసాధ్యమే అన్నమాట. అందుచేతే గాంధీ మహాత్ముండు నిర్బంధవిధానాన్ని మద్యపానం విషయంలో అవలంబింపచేసేటట్టు తోస్తుంది. నిర్బంధవిధానమంటే? అసలు ఆమద్య పదార్థవ్యత్పత్తినే ఆటంకపఱచడం. యిదికొంత అనాలోచనగానున్నూ వుంటుంది గాని గాంధీమహాత్ముని వంటి మహాఋషి-పైCగా రాజకీయనీతి ధురంధరుడు- మొదలు పెట్టినదాన్ని కాదనడానికి మనబోట్ల కధికారం లేదనుట నిర్వివాదాంశము. ఆయన మొదలు పెట్టినవాట్లల్లో నాకు అసాధ్యంగా మొట్టమొదటనుంచిన్నీ తోcచింది యీ మద్యపాన నిషేధమే కాని నేను కూడా అప్పటినుంచి యిప్పటివరకున్నూ తాళ్లు కల్లుగీత కివ్వడంలేదు. దానివల్ల వచ్చే లాభాన్ని అంతో యింతో “వుడతాభక్తి స్మారకంగా వదలుకొన్నవాణ్ణి. పదివేలూ యిరవైవేలూ వదులుకున్నవారు వదులుకుంటూవుంటే నేనున్నూ వదులుకొనడాన్ని గూర్చి యిందులో తెల్పడం పరిహాసాస్పదంకాకపోదు - అయితే “ఢిల్లీకిఢిల్లే పల్లెకుపల్లె కదా? యీ వుద్యమం నెగ్గడం యేలాగ? అని సందేహమే కాని నెగ్గితే సంతోషించని ప్రాజ్ఞండంటూ వుండనే వుండండు. నేను కోరేదల్లా మద్యపానంతో పాటు నల్లమందుకూడా నిషేధిస్తే యెందటో బాలవృద్ధాతురులు చిక్కుపడతారు. కనక దాన్ని మినహాయించడమే కాకుండా దాని వెల కూడా యిటీవల అభివృద్ధి పొందిన స్థితినుండి తగ్గించి తేలికచేయవలసిందనిన్నీ దీని కెన్నో ఉదాహరణలు చూపవచ్చును. వ్యాసం చాలా విస్తరించింది. కళల మాట దేవుడెఱుంగును గాని ప్రకృతం మద్యంతోపాటు నల్లమందు కూడా దొరకుండాచేస్తారేమో అనే భయంతో నేను దీన్ని మొదలుపెట్టి వున్నాను. సుమారు 16 సంవత్సరాలనుంచి నేను దాని సహాయంతోటే జీవయాత్ర గడుపుతూ వున్నాను. యీదేశంలో నావంటి వాళ్లేందతో ఉండి ఉంటారు. వీళ్లేవళూ షోకేళాగా దీన్ని అభ్యసించినవాళ్లు కారు. అందుచేత దాన్ని తేలికవెలకు కాకపోయినా యిప్పటి వెలకేనా దొరికే టట్టుగాచేస్తే చాలునని కాంగ్రెసుమంత్రులను కోరుతూ యీ వ్యాసాన్ని ముగిస్తూవున్నాను. -

★ ★ ★