కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/పశ్చాత్తాపము

వికీసోర్స్ నుండి


పశ్చాత్తాపము

సత్రాజిత్తుపేరు యెవరోగాని యొఱకుండా వంగగ యింతటి పరమోత్తముండు వేలకు వొక్కండుంటాండో వుండండో!

లోకంలో యెంతటి యోగ్యునికీ, యెంతటి బుద్ధిశాలికీ ప్రమాదం వుంటుంది. ఆ ప్రమాదం కొందఱికి కాలాంతరమందు తమకే గోచరిస్తుంది. కొందఱికో? యెవరో సూచించాక గోచరిస్తుంది. కొందఱికి యేవిధంచేతా గోచరించదు. అధవా గోచరిస్తుందే అనుకుందాం. తాను చేసిన తప్పిదాన్ని పశ్చాత్తాపంద్వారా తొలంగించుకొని నిర్దోషత్వాన్ని సంపాదించుకోవడం, "పెద్ద అవమానంగా" తోచి తన మనస్సు తనకు మంచిగా బోధిస్తూవున్నా దానిబోధకు కట్టుపడక "తాంబట్టిన కుందేటికి మూండేకాళ్లు" అనే ధోరణిలోకి దిగి మొదటచేసిన దోషాన్ని వేయింతలుగా పెంపు చేసుకోవడమే తఱచుగా లోకంలో అనుభూతం. రాజ్యాదులు వున్నవారిని గూర్చి యీ విషయం మటీ అనుభూతం. రాజుగారు తప్పచేసినా దాన్నియెవరూ తప్పని తెలుపంగూడదు ప్రత్యుత, వొప్పగా సమర్ధించాలి. రాజసేవకులు మంత్రి, మొదలు కాళ్లు పిసికేవాండిదాంకా యీ గుణం వుంటేనేగాని వాఁడు యెందుకూ పనికిరాడూ, యీ గుణం గృహస్టుభార్యలకున్నూ ఆవశ్యకమే. భర్తచేసే తప్పలను భార్య బాగా తెలుసుకొన్నప్పటికీ చట్టన సూచించకూడదు. సూచిస్తే యెంతో ప్రాజ్ఞండైతే తప్ప సర్వసాధారణంగా భర్త కోపోద్దీపితుండవుతాడు.

"పాతివ్రత్య ధర్మాలు చాలా కఠినధోరణిలో వుంటాయి. ఆయీ ధర్మాలు భర్త పరమశుంఠగా వున్నా దుర్మార్గుండుగా వున్నా అప్రయోజకుండుగా వున్నా ఆయనపట్ల భార్య చెల్లించవలసినవే, పైకి అడగి మడంగి చెల్లించినా హృదయంలో భర్తయొక్క “అపాత్రత్వం" గోచరించకపోదు. కాని ఆలా గోచరించడంకూడా తప్పిదమే అన్నారు. విషయం విషయాంతరములోకి దూCకుతూవుంది. అసలు వ్యాసం

“సత్రాజిత్తు" యోగ్యతనుగూర్చి ఆరంభించాను. ఇతండు పెద్ద తప్పిదాన్ని చేశాcడు మొట్టమొదట; ఆ తప్పిదంయొక్క స్వరూపం అక్షరాస్యులందఱూ యెఱిఁగిందే, అయినా వివరిస్తాను. సూర్యోపాస్తి ద్వారా తాను- “శ్యమంతకమణిని" సంపాదించుకుంటే, అది కృష్ణమూర్తి అపహరించినట్లు అభిప్రాయపడి ఆ హరిమీద “నీలాపనింద” ఆరోపించాడు. పిమ్మట దాని తత్త్వాన్నికృష్ణమూర్తి తెల్పడం జరిగింది. ఆలా యథార్థం తెలిసినా మటౌకండే అయితే యింకా యేవో శషభిషలు కల్పించి వంకర త్రోవలు తొక్కేవాండేమోకాని సత్రాజిత్తులేశమూ అట్టి మార్గంలోకి దిగక పశ్చాత్తాపాన్ని పొంది యీ విధంగా పరితపించాcడు పాపం?

మ. మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాపవాదంబు బూ
న్చితి నీ దేహము. ... ... (తరువాయి భాగవతంలో చూ.)

క. పాపాత్ముల పాపములన్
బాపంగాC జాలునట్టి పరమాత్మునిపై
పాపము గలదని పలికిన
పాపాత్ముని పాపమునకుఁ బారముగలదే.

యింకా యీ విషయం భాగవతంలోకన్న స్కాందంలో విస్తరించివుంది. సత్రాజిత్తు పశ్చాత్తపించి కూCతురు సత్యభామను మాణిక్యంతో సహా శ్రీహరికి కానుకగా సమర్పించాడు. కాని శ్రీకృష్ణుడు శ్యమంతకాన్ని మళ్లా యిచ్చేశాcడు. యిటీవల “శతధన్వుండు" కాcబోలును ఆ యీ మణికోసం సత్రాజిత్తును వధించడం జరిగింది. ఆ సమయానికి శ్రీకృష్ణ భగవానుcడు ద్వారకలో පීඨා. సత్యభామ తన తండ్రికి జరిగిన ఫరోరాన్ని స్వయంగా హస్తినాపురంలోనున్న కృష్ణునకు తెల్పినట్టున్నూ పిమ్మట కృష్ణబలరాములు కల్పించు కున్నట్లున్నూ శతధన్వుండు పాటిపోయినట్లున్నూ వెంబడించి పట్టుకోCబోయేటప్పటికి యీ ੱਨ੦ గమనాయాసంచేత శతధన్వుండు మరణించినట్టున్నూ స్కాందంలోవుంది.

“శ్యమంతకాన్ని అక్రూరునివద్ద దాcచి శతధన్వుఁడు పాట్రిపోవడంచేత శతధన్వుని వద్ద మాణిక్యం దొరకలేదు. బలరాముడు తనకు తెలియకుండా దాన్ని తమ్ముఁడు అపహరించినట్టనుమానపడి కృష్ణుణ్ణి ద్వేషించడం వగైరా స్కాందంలోవుంది. మనం ముఖ్యంగా ఆ యీయితిహాసంవల్ల నేర్చుకోతగ్గనీతి పశ్చాత్తాపం. పొరపాటు యెంతవానికీ వస్తుంది. దాన్ని పురస్కరించుకొని యెవరిమీందేనా దోషాన్ని ఆపాదించడం జరిగితే దాని తత్త్వం తెలిసే వఱకే కాని తెలిశాక దాని సమర్ధనానికి ప్రయత్నించడంకంటె ప్రాజ్ఞలకు పశ్చాత్తాపాన్ని సూచించడం ఉత్తమ ధర్మం. దానివల్ల ఆ పాపం నశిస్తుంది. ఆత్మకు శాంతి కలుగుతుంది. ఉత్తముని హృదయం బహు కోమలంగా వుంటుంది. అట్టి హృదయం గల మహనీయుండు నిజమైన విషయంకూడా యితరుణ్ణి బాధించేదిగా తోస్తే వుదహరించడానికి జంకుతాcడు. అట్టి స్థితిలో సందిగ్గాంశాన్ని గుఱించి చెప్పనక్కఱలేదు. వున్న దోషాన్నేనా ఉత్తములు చెప్పకోడానికి జంకుతారు. దానిక్కారణం ఆలా చెప్పకోవడం ఆ దోషం అసలు చేసిన వ్యక్తిని వదిలి చెప్పకొనేవారికి సంక్రమిస్తుందని అభియుక్తులు చెప్పఁగా వినడం, మన ధర్మాలుచాలా “అసిధారావ్రతం" మాదిరిగా వుంటాయి. అతిథి పూజ ప్రతి గృహస్టుకూ తనకు వున్నంతలో అవశ్యాచరణీయంగా ధర్మశాస్రాలు చెపుతాయి. అసలు గృహస్టు యింట్లో వండే వంట ఆత్మార్థంగా చేయనే కూడదన్నారు.

“యతీచ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినౌ" అని వుంది అతిథి ప్రకరణంలో, యితర ఖండవాసులు దీన్ని చూచి యీ శాస్త్రకర్తకు మతి లేదని సిద్ధాంతీకరిస్తారు. యింకోవిశేషం, పగలు వచ్చిన అతిథిని అవకాశం లేకపోతే యింకోచోటికి వెళ్లవలసిందని చెప్పవచ్చును గాని రాత్రి తీరా భోజనంవేళకు వచ్చిన అతిథినో? ఆలా వెళ్లమనడానికి వల్లకాదన్నారు. అతనిపేరు "సూర్యోధుండు". అతణ్ణిలేదు పోవలసిందని ప్రత్యాఖ్యానంచేసే పక్షంలో అతఁడు నిరాశుండై వెడుతూ ఆ యీగృహస్టు ఇంతకు లోCగడ చేసుకున్న యావత్తు సుకృతాన్నీ (అణా పైసలతోసహా) తీసుకుపోతాండట. ఆ యీ సూర్యోధుణ్ణి గూర్చి యింత గౌరవించడానిక్కారణం యేదో వూరుగాని వూరునుంచి వచ్చి ఎవరో ఫలానా వారింటికెడితే అన్నం దొరుకుతుందనిచెప్పిన మాటమీఁద వారింటికెడితే వారు లేదుపొమ్మంటే ఆ చీకటిలో లేదా వెన్నెలే అనుకుందాం, ఆ అతిథి యొక్కడికి వెళ్లంగలుగుతాండు పాపం అందుచేత యింత నిక్కచ్చిగా శాసించాండు ధర్మ శాస్త్రకర్త. మనదేశం యీ అతిథి పూజలకు పెట్టుకుంది పేరు. యిప్పటికీ యెందటో వున్నారు. అజ్ఞాడ ఆదిభోట్ల అన్నయ్యగారినే (పేరు బాగా జ్ఞప్తికి లేదు) కాంబోలును యెంతో గొప్పగా చెప్పకుంటారు, డొక్కాసీతమ్మగారిని సరేసరి, యెన్నో దానాలున్నా "నాన్నోదక సమందానమ్”

సరే యిది విషయాంతరం. యీలాటి సుకృతాత్ములను పేర్కోవడంవల్లకూడా పుణ్యంవస్తుందని చెప్పినట్లే, నిజమైన పాపాత్ముల పాపాలనుగూర్చి ప్రసంగించుకోవడం కూడా పాపాన్ని సంపాదిస్తుందని మన పెద్దలు వుపేక్షిస్తారు.

“కథా@_పిఖలు పాపానామల మత్రేయసే”

అట్టి స్థితిలో యేవ్యక్తిమీంద నేనా వృథాగా "అపాండవం" కల్పించి దాన్ని వ్యాప్తిలోకి తేవడం మన పెద్దలే కాదు ఎవరిపెద్దలూ అంగీకరించరు. ప్రస్తుతం సత్రాజిత్తు శ్రీకృష్ణ భగవానుడ్డింగూర్చి అపోహపడడానికి కొంత అవకాశంవుంది. శ్రీకృష్ణుండు అతని దృష్టికి (చుట్టమవడంచేత) మనుష్య మాత్రుండుగానే తోcచివుంటాండు. కృపుని జీవితకాలంలో ఆయన్ని భగవదవతారంగా గుర్తించినవారు భీష్మండు, విదురుండు, అక్రూరుండు మొదలైన కొందఱుమాత్రమే. శిశుపాలుండు, దుర్యోధనుండు, లోనైనవాళ్లు ఆమరణాంతమూ యథార్థాన్ని గుర్తించనే లేదు. ఆ యీ సందర్భం యీ పద్యం తెల్పుతుంది.

మ. భగవంతు డితండంచు స్పష్టపడియెన్ బాహాబల ప్రొఢిచే
నగధారిత్వముచే విశిష్టముని మాన్యత్వమ్ముచే విశ్వరూ
పగతిన్ జూపుటచే ననేకగతులన్ బ్రహ్మాదులర్చించు లో
కగురున్ జిష్ణుని విష్ణునక్కటకటా? గైకోండు వీcడంధుండై

యీ వాక్యం భీష్మునిది. కొన్ని మానవచర్యలు చూచి సామాన్యులు మానవుండే యని భ్రమించుట కవకాశం లేకపోలేదు, ఆ సందర్భాలు ఋషులు చర్చించి తత్వాన్ని అక్కడక్కడ పురాణాలలో నిరూపించి వున్నారు. సత్రాజిత్తు శిశుపాలాదులంబలె ద్వేషికాకున్ననూ తాను కష్టించి ఆర్జించుకొన్న మాణిక్యాన్ని అతఁడు అపహరించాడనే అపోహవల్ల మొట్టమొదట కొంత అవ్యక్తప్రసంగం చేస్తే చేశాండుగాక. తుదకు యథార్థం గోచరించిన ఉత్తర క్షణమందే ఆ దోషనివృత్తిని చేసుకుని పరిశుద్దుండవడంచేత సత్రాజిత్తు యింతగా శ్లాఘ్యండైనాఁడు. లోకంలో యిట్టి నిషధయోగ్యుల సంఖ్య చాలా తక్కువగా వుంటుంది. పూర్వంమాట చెప్పలేంగాని యీ కాలంలో అబద్ధాలాడడానికి అవకాశాలు చాలా యేర్పడ్డాయి. ఆఖరికి అబద్ధమేదో సుబద్ధమేదో? నిర్ణయించడానికి అవకాశమే లేకుండా పోయింది. ఆలాటి చిత్రవిచిత్రమైన రూల్సు బోలెడు ఆవిర్భవించాయి. వీట్లనిగూర్చి మటౌకప్పడు చూచుకుందాం.

సత్రాజిత్తు వంటి సత్పురుషులు యీ కాలంలో తక్కువగా వుంటారని మాత్రం తెలుసుకుందాం. ముఖ్యంగా పిడివాదాలు వాదించే కవులూ, పండితులూ ఆ యీ సత్రాజిత్తు మార్గం తెలుసుకుంటే "పాండిత్య వాదాలు" విస్తరించి పెరగవు. మొదట దేనినేనా తప్పంటా మనుకోండి, అలా అనడం తెలియకపోవడంచేత యెంతటివాఁడికీ అనివార్యమే. తరువాత యే భారతమో! యే రామాయణమో అది తప్ప కాదని బోధిస్తుంది. అంతటితో “ఆ వాదం" వదలుకొని ఉన్న యథార్థాన్ని ప్రకటిస్తే దానితో అది ఆంగిపోతుంది. అప్పడు ఆ పండితులు సత్రాజిత్తువంటి వారవుతారు. తమ తప్పను వొప్పకున్నంతల్లో వచ్చే అగౌరవం లేశమూ వుండదు. ఆయావిషయంలో మనకన్నా పాశ్చాత్యులు శాఘ్యులేమో అని నేననుకుంటాను. ఆ దేశ చరిత్రలు బాగా తెలిసినవారుగాని నా అభిప్రాయాన్ని నిర్ణయించలేరు. ఉత్తములు ప్రతి ఖండంలోనూ వుంటారు.

తేభ్యో మహద్భ్యోనమః

★ ★ ★