ఏమనెనే కోమలీ - తెలుపవే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
ఏమనెనే కోమలీ - తెలుపవే నీతో
ఏమనెనే కోమలీ- తెలుపవే నీతో ॥నేమనెనే॥

చరణ:
అంగజు బారికి - నిలువ దరమటే
మంగళవార్తలు - మరియేమి నీతో ॥నేమనెనే॥

మోహ పయోధిలో - మునిగితినిక నే
యూహలు సేయుదు - నొకసారి నీతో ॥నేమనెనే॥

దాసు శ్రీరామ - కవి గీతసుధా
దాసుడైన హరి - దయచేసి నీతో ॥నేమనెనే॥