ఏమని తెల్పుదునే - కోమలి
Appearance
పల్లవి:
ఏమని తెల్పుదునే - కోమలి నాభాగ్య
మేమని తెల్పుదునే - నా ముద్దుసామికి
నామీద ప్రేమ ॥నేమని తెల్పుదునే॥
చరణం1:
చెక్కిలి ముద్దాడెనే - చక్కని నాసామి
చెక్కిలి ముద్దాడెనే
నిక్కముగ నిన్నరేయి - ప్రక్కనే పవ్వళించి
చక్కని కెమ్మోవి నొక్కెనే ॥ఏమని తెల్పుదునే॥
చరణం2:
బాళిచే నన్నేలెనే - కేళిలో నాసామి
బాళిచే నన్నేలెనే
వేళగదే రారమ్మని - విలువగల సొమ్ములిచ్చి
చాలగా లాలించెనే - సోలెనే బాల నే ॥నేమని తెల్పుదునే॥
చరణం3:
నాసాటి పేరనెనే - వేణుగోపాలుడు
నాసాటి పేరనెనే
ఆసదీర్చి రామ - దాసకవి చిత్త
వాసుడాయె పూసెనే గంధము - చేసెనే బాస నే ॥నేమని తెల్పుదునే॥