Jump to content

ఎందరో వికీమీడియన్లు/ఇపుడీ పుస్తక మెందుకంటే

వికీసోర్స్ నుండి

ఇపుడీ పుస్తకమెందుకంటే

తెవికీకి జన్మనిచ్చి, పెంచి, పోషించి, విధానాలు మార్గదర్శకత్వాలతో నడక, నడత నేర్పి, వ్యాసాలతో బలమిచ్చి, హంగూ ఆర్భాటాలతో సౌష్ఠవమైన రూపునిచ్చిన తెవికీయులు ఎందరో. తమ కృషితో వీళ్ళు తెలుగు వికీపీడియాను గణనీయంగా అభివృద్ధి చేసారు. ఏ అంశం కోసమైనా తెలుగులో గూగుల్లో వెతకండి. అది చూపే ఫలితాల్లో తెలుగు వికీపీడియా ముందుంటుంది. అందులో సాంకేతికపరమైన మాయ ఏమీ లేదు, మంత్రమూ లేదు - కేవలం వికీపీడియన్ల కఠోరమైన కృషి తప్ప. అయితే, వికీలో అందరూ ఎల్లప్పుడూ పనిచేయరు. కొన్నేళ్ళు పనిచేసి మానేస్తారు. కొత్త నీరు వస్తూంటుంది, పాత నీరు పోతుంటుంది . కొందరు మళ్ళీ వస్తారు పనిచేస్తారు. ప్రతి ఒక్కరూ చేసిన పనుల్ని వికీ గుర్తుంచుకుంటుంది. అవన్నీ వికీలో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి. వికీమీడియా ప్రాజెక్టులు వాళ్ల కృషిని ప్రతిఫలిస్తూ దేదీప్యంగా వెలుగుతూ ఉంటాయి, ఉన్నాయి. అలా వికీలకు వెలుగులద్దిన కొందరు వికీసూర్యులకు మా దివిటీ ఇది.