ఉపనిషత్సుధ/కఠోపనిషత్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కఠోపనిషత్( మూల శ్లోకములు ) కఠోపనిషత్( తెలుగు పద్యములు ) కఠోపనిషత్(తెలుగు తాత్పర్యము)

ఓం
పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే

కం.
పూర్ణము బ్రహ్మము జగ మిది
పూర్ణమ; యాపూర్ణునుండి పూర్ణము వెడలెన్
పూర్ణం బగు నీజగతికిఁ
బూర్ణత్వము గూర్చి యింకఁ బూర్ణమె మిగులున్

ఆ బ్రహ్మమంతట వ్యాపించినది. నామరూపసహితమైన యీ జగమును అంతట వ్యాపించినదె. ఆ పూర్ణమైన బ్రహ్మమునుండి పూర్ణమైనజగము బయలుదేరుచున్నది. జగమునకు పూర్ణత్వమును గలిగించి యాపూర్ణమైన బ్రహ్మమె మిగిలినది.