ఉదయనోదయము/వనమాలివిలాసము-ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వనమాలివిలాసము


ప్రథమాశ్వాసము

వ. ఇట్లు సకలజగన్మోహనమదురిమానరూపంబునకుం బెట్టని తొడవు వడువునం గడునలరు నెలజవ్వనంబు క్రొత్త చిగురొత్తఁ జిత్తభవునకుం బ్రభవంబున నుల్లసిల్ల [నిజతనూజకు యౌవనోద][1]యం బగుట విచారించి తగిన వరు వరింపనేరక భీష్మకమహానాయకు డాగమి వసంతాగమనంబునం జతురంత దిగంతర ధరాకాంతకుమారవర్గంబున స్వయంవరము సాటింపంగలవాఁడయి ని[జనగరంబునం][2] గల్యాణమంటపంబునుం దమంగంబులు[3] నాయితంబు సేయ నియోగించినం దదధికారు లధికారంభంబుల జిగి మిగులు మగధ వధూతిలకల నునుందొడల బిగి నగు పగడంపు [డంబు మిగులు బంగరు టనఁటి కంబంబు][4]ల నిగిడించు వారును నంధ్ర పురంధ్రీమణుల నిబ్బరంపు గుబ్బల బిబ్బోకంబు జుబ్బన జూరగాఁగొని గబ్బితనంబు నుబ్బి నిబ్బరంపు బసిమి మెఱయఁ బసిండి కుండలు నిలుపువారు[నుం గర్ణాట కుటిలాలకల][5] చిఱునెరుల మేలుతో మేలంబాడు నీలాలశోభనంబులు (?) నిర్మించు వారునునై పురంబు సంభ్రమమయంబును సంతోషమయంబును నై యుండునని చెప్పి వెండియుం బుండరీకాక్షునకుఁ జెవుల పం[డువుగ నొక్కశుభవర్తమానం][6]బు విన్నవించు తలంపున మొగంబున కడ్డంబుగాఁ గరపుటం బిడి కర్ణసమీపంబు ప్రాపించిన. 1

సీ. తొడిమప ట్టొకయింత మడఁచి పట్టిన తమ్మి
గతి మొగ మడ్డముగా నొనర్చి
క్షితి[కామ్రశాఖి వంగి ఫలాళి][7] నందించు
నట్లుగా నూర్థ్వకాయంబు వంచిపుడమికిం గెందమ్మి పూజ సేసినభంగి

లీలమై నొకకేల నేల నూఁది
తనివిగా వార్తామృతముఁ గ్రోలఁ బెట్టిన
పుడిసిలి క్రియఁ గర్ణపుటము నిచ్చి

తే. శంకతో స[న్నిధిని సఖీజనముఁ][8] బతియుఁ
జూచి యొండొరు మొగములు సూచికొనఁగ
నభినవంబైన భావోదయంబు సెప్పు

నాదరంబున సిరివరుం డాలకించె.

2తే. అవ్విధంబున[9] నవధానమై మురారి
చిత్తగించుట యెఱిఁగి [యోజించి కదియ
వచ్చి][10] తన్వంగి[11] తానేక భంగి భణితి

విస్తరంబుగ నిట్లని విన్నవించె.

3ఉ. కుండినపట్టణంబునను ఘో యనఁగానొక వార్త చెవులకుం(?)
బండువు సేయ వింటిమి తపస్విని రుక్మిణి వాసుదేవు [నిం
బెండిలియాడఁగా][12] నవనిఁ బ్రేమభరంబున పుష్పబాణుఁ డొ

క్కండు నెఱుంగఁ గంకణము గట్టిన దంచు వచింప నెల్లెడన్.

4క. విని కర్ణోత్సవమును
గని నయనోత్సవము సేయఁగా భీష్మకు కొ
ల్వున రా[జు లెల్ల విడి][13]యుచు

మునుకొని పురిఁ గొన్ని దివసములు నిలువంగన్.

5మ. బహుదేశంబులనుండి వచ్చు మగధుల్ పారప్రసంగంబులన్
మహనీయంబుగఁ జెప్పు నీదు యశమున్ మాధుర్యమున్ ధైర్యమున్
మహి[మంబుం జె][14]వి దేలఁ బెట్టి[15] వినుచుం దాదాత్మ్యముం బొందుఁ బ్ర

త్యహమున్ రుక్మిణి భీష్మకాంకమున నెయ్యంబార నాసీనయై.

6తే. పుండరీకాక్షు లోచనాంభోరుహములఁ

దోఁచె రాగంబ జాగర దోషమునను
సతత[సంఫుల్ల][16]హల్లకచ్ఛదగుళుచ్ఛ
గర్భదళకాంతి విభవ సంక్రాంతిఁబోలె. 8

క. జలజాక్షుని [నేత్రంబులు][17]
గళదశ్రువిలోలపక్ష్మకములై పొలిచెం
గలకంఠి కడకు శీఘ్రమ
యెలమిం బోవంగ రెక్క లిడుకొనెడు[18] క్రియన్. 9

క. పీతాంబరునికి మాటికి
వాతెర వణఁకంగజొచ్చె వనజాతములం
జేతోనిలయస్థితి చెలి
కే తెమ్మ[ని][19] సన్నచేసి యెఱిఁగించు గతిన్. 10

తే. పరపుపై బోరగిల రేలు పవ్వళించి
కరసరోజంబు లల్లార్చుఁ గైటభారి
వెల్లి గొనివచ్చు విరహాబ్థి వెడల నీఁడ
నొయ్య[20] నభ్యాస మొనరింపు చున్నయిట్లు. 11

మ. వళదభ్యంతరవృత్తి వారిజముఖీవక్షోజసంఘట్టనం
బలె వక్షఃఫలకంబు మాటికిం జలింపం[21] జొచ్చె దైత్యారికిన్
గళదశ్రుప్రసరంబు తచ్ఛ్రవణసాంగత్యంబు పాటించి శ
య్యలపైఁ దన్మహిళాగుణేక్షణము [డా][22]యంబోవు చందంబునన్. 12

తే. ఆ కులాలక మాకంపితాధరంబు
నిస్సరద్బాష్ప[నిష్పంద][23]నేత్రపద్మ
మగుచు సంకల్పసురతకృత్యముల జరగె
యదు నృపాలున కయ్యిందువదనతోడ. 24

ఉ. అంత గభస్తిమంతుఁ డపరాంబుధి నీరములోనఁ గ్రుంకి దై
త్యాంత[కు మేన నయ్యెడ][24] మహాగరిమం గయికొన్న[25] తాప మం
తంత కసహ్యమై నిగుడ నంబరవీథుల నిల్వనోడి తా
పాంతకృదాప్లవార్థము రయంబున నీరము చొచ్చు కైవడిన్. 31

తే. మోహసందీపనార్థమై మురవిరోధి
యెడమఁ గుడియును నందంద యేసి యలఁత
నొంది యెడలించు మరుని నిట్టూర్పు లొక్కొ
యనఁగ నల్లన వీచె మందానిలములు. 38

తే. [సరిద][26]ధిప[27]దత్తమౌక్తికాంజలి కరణము
లోలిఁ జేయించె యదుభర్త కుబుసుపోక
అబ్ధివీచి నటీకోటి యాటచూపు
నటు వలునాఁగ విధుకిరణములు వొలిచె. 39

మ. కలకంఠీకలకంఠముల్ కలకుహూకారధ్వనుల్ నీనులం
బలుమాఱుం జిలికింపఁగా వనలతాప్రాంతంబులం డాయుచున్
లలి మాకంద[మృణాల][28]నాళములు కేలంబట్టుచు న్వచ్చి తొం
గలి పూమైమరు వూడ్చి చొచ్చె హరి రాకాకౌముదవహ్నులన్. 47

ఉ. ఆతఱి మింటనుండి డిగి యంబురుహాసనసూతి నారదుం
డాతతపాండురాంగరుచి(రాంశుసు)[29]ధారసధార దేవకీ
జాత తనూమనోభవకృశానువు నార్పఁగ వచ్చె ఖేచర
వ్రాతము మోడ్పుఁజేతులు శిరంబులఁజేర్చుచుఁ ద్రోవ యీయగన్.

శా. రామారామవసంతసంతత[యశోరా[30]]జద్దిశాభోగ[31]భో
గామర్త్యవ్రజరాజరాజధరరక్షాధారధారాపురీ
స్వామి స్వర్తృశమాన మానవసమాజస్వీక్రియాదక్ష! ద
క్షామిత్రస్మృతిలోల! (లోలన)[32]యనాత్మాంభోజపుష్పంధయా! 49

క. కరుణామకరందాలం
కరణాంతఃకరణకమలకైరవమిత్రా
భరణస్మరణపరాయణ
హరివైభవగణ్య కొండు రక్కవరేణ్యాయా. 50

సుగంధి. ఎల్లమాంబికా కుమార హేమశైలధీర సం
ఫుల్ల వైభవత్కుబేర మానహార విద్వదా
పల్లతావలీకుఠార పల్లవాధరా మనో
హల్లకాస్త్రరూప కొండు రక్కదండనాయకా. 51

గద్యము

ఇది శ్రీమదింద్రేశ్వరవరప్రసాదలబ్ధకవితాసార నారనామాత్య
కుమార సూరిజనవిధేయ సూరయ నామధేయ
ప్రణీతంబైన వనమాలివిలాసం బను
మహాకావ్యంబునందు
ప్రథమాశ్వాసము 1. ప్రా.పూరణము
 2. ప్రా.పూరణము
 3. ప్రా.సవ-దమకంబులు సా.స.
 4. ప్రా.పూరణము
 5. ప్రా.పూరణము
 6. ప్రా.పూరణము
 7. ప్రా.పూరణము
 8. ప్రా పూరణము
 9. ఇవ్విధంబున
 10. ప్రా పూరణము
 11. మద్వంగి
 12. ప్రా పూరణము
 13. ప్రా పూరణము
 14. ప్రా పూరణము
 15. దెలంబెట్టి
 16. ప్రా.పూరణము
 17. ప్రా.పూరణము
 18. ప్రా.సవ.—రెక్కలిడుకొని క్రియన్—సా.ప.
 19. ప్రా.పూరణము
 20. ప్రా.సవ.—నెయ్యఁ—సా.ప.
 21. ప్రా.సవ.—జెలిపం—సా.ప.
 22. ప్రా.పూరణము
 23. ప్రా.పూరణము
 24. ప్రా.పూర
 25. మహాగరిమగైకొన్న—సా.ప.
 26. ప్రా.పూర
 27. (ధత)—సా.ప.
 28. ప్రా.పూర
 29. ప్రా.పూర
 30. ప్రా.పూర
 31. బుద్ధిశాభోగ—సా.ప.
 32. ప్రా.పూర